‘పాలమూరు’పై ఒప్పందాలు వద్దు: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం (పీఆర్‌ఎల్‌ఐఎస్) పనులకు సంబంధించి ఎలాంటి ఒప్పం దాలు చేసుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు సోమవారం మౌఖికంగా స్పష్టం చేసింది. అయితే పిటిషనర్ తరఫు న్యాయవాది సంబంధం లేని వివరాలతో కోర్టును గందరగోళానికి గురి చేస్తున్నారని, గడువిస్తే పూర్తి వివరాలు కోర్టు ముందుంచుతామని రాష్ట్ర అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) జె.రామచంద్రరావు తెలిపారు. ఇందుకు అంగీకరించిన హైకోర్టు తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావులతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.