Justice Dilip B. Bosale
-
‘పాలమూరు’పై ఒప్పందాలు వద్దు: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం (పీఆర్ఎల్ఐఎస్) పనులకు సంబంధించి ఎలాంటి ఒప్పం దాలు చేసుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు సోమవారం మౌఖికంగా స్పష్టం చేసింది. అయితే పిటిషనర్ తరఫు న్యాయవాది సంబంధం లేని వివరాలతో కోర్టును గందరగోళానికి గురి చేస్తున్నారని, గడువిస్తే పూర్తి వివరాలు కోర్టు ముందుంచుతామని రాష్ట్ర అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) జె.రామచంద్రరావు తెలిపారు. ఇందుకు అంగీకరించిన హైకోర్టు తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావులతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. -
‘పెద్దలు’న్నా జైల్లో పెట్టాల్సిందే: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: మహబూబ్‌నగర్ జిల్లాలో ఇసుక మాఫియా వెనకున్న వాళ్లు ఎంత పెద్ద వారైనా ఉపేక్షించవద్దని, వారిని జైలుకు పంపాల్సిందేనని పోలీసులకు హైకోర్టు స్పష్టం చేసింది. దీనికి సంబంధించి ఇప్పటి వరకు ఒక్కరినీ అరెస్ట్ చేయకపోవడాన్ని ప్రశ్నించింది. పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి అందుకు సంబంధించిన వివరాలను తమ ముందుంచాలని ఎస్పీ పి.విశ్వప్రసాద్‌ను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 14కు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. తమ భూముల నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తుండటాన్ని ప్రశ్నిస్తున్న రైతులను ఇసుక మాఫియా హతమారుస్తున్నా ప్రభుత్వం స్పందించట్లేదంటూ స్వచ్ఛంద సంస్థ వాచ్ వాయిస్ ఆఫ్ పీపుల్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసింది. దీనిపై సోమవారం జరిగిన విచారణ సందర్భంగా ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది అండపల్లి సంజీవ్‌కుమార్ వాదనలు వినిపించారు. ధర్మాసనం గత వారం ఇచ్చిన ఆదేశాల మేరకు పిటిషనర్ చెప్పిన ఆధారాలను బట్టి ఆ తరువాత పలువురు రైతులు, అధికారులు సహా 44 మంది వాంగ్మూలాలను నమోదు చేశామన్నారు. వీటన్నింటిపై జిల్లా ఎస్పీ అదనపు అఫిడవిట్ దాఖలు చేశారని దానిని ధర్మాసనం ముందుంచారు. వాంగ్మూ లం ఆధారంగా వివిధ పోలీస్స్టేషన్ల పరిధిలో 12 కేసులు నమోదు చేశామని ఎస్పీ తన అఫిడవిట్లో పేర్కొన్నారు. కల్వకుర్తి ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి, మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మెహన్‌రెడ్డి, గద్వాల్‌కు చెందిన కృష్ణమోహన్‌రెడ్డి, ఆలంపూర్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్, జె.అరుణ్, వారి అనుచరులు అక్రమంగా ఇసుక తవ్వకాలు, రవాణా చేస్తున్నారని ఆరోపించిన పిటిషనర్... అందుకు ఒక్క ఆధారం కూడా చూపలేకపోయారని పేర్కొన్నారు. -
ప్రత్యూష లాంటి వారి సంక్షేమానికి చర్యలు తీసుకోవాలి
సాక్షి, హైదరాబాద్: ప్రత్యూషలాగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారి సంక్షేమం కోసం తగిన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ విషయంలో ఇప్పటికే రూపొందించిన పథకాలు, ప్రతిపాదనల వివరాలను తమ ముందుంచాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలను ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే నెల 9కి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రత్యూషను ఆమె సవతి తల్లి తీవ్రంగా హింసించినట్లు పత్రికల్లో వచ్చిన కథనాలపై సుమోటోగా హైకోర్టు విచారణ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ వ్యాజ్యాన్ని పలుమార్లు విచారించిన ధర్మాసనం గురువారం మరోసారి విచారించింది. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది(ఏఎస్జీ) ఎస్.శరత్‌కుమార్ వాదనలు విని పించారు. ప్రత్యూష సంరక్షణ కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యలను తెలియజేశారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ... ప్రత్యూష గురించి కోర్టు పట్టించుకుంది కాబట్టి, ఆమె ప్రస్తుతం సురక్షిత స్థితిలో ఉన్నట్లు తెలిపింది. ప్రతి ఒక్కరి విషయంలో న్యాయస్థానాలు జోక్యం చేసుకోవడం సాధ్యం కాదు కాబట్టి అలాంటి వారి సంరక్షణ కోసం తగిన చర్యలు చేపట్టాలని సూచిం చింది. ప్రత్యూషలాగే ఏపీలో ఓ బాలిక ఉదంతం గురించి ఆ రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ (ఏజీ) తమ దృష్టికి తీసుకొచ్చారని పేర్కొంది. ప్రస్తుతం ఆ బాలిక పరిస్థితి ఏమిటో చెప్పాలని ఏపీ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాదికి ధర్మాసనం స్పష్టం చేస్తూ విచారణను వాయిదా వేసింది. -
ఏపీ హైకోర్టుకు నిధులపై మూణ్నెల్లలో నిర్ణయం తీసుకోండి
* కేంద్రానికి హైకోర్టు ఆదేశం * రాష్ట్ర ప్రభుత్వ ‘సవరణ’ పిటిషన్‌పై విచారణ * కేంద్రానికి, ఏపీ సీఎస్ తదితరులకు నోటీసులు సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు శాశ్వత హైకోర్టు ఏర్పాటుకు అవసరమైన నిధుల కేటాయింపు విషయంలో మూడు నెలల్లోపు తగిన నిర్ణయం తీసుకోవాల్సిందిగా ఉమ్మడి హైకోర్టు శుక్రవారం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కేంద్రం నిధులను కేటాయించాక వాటిని శాశ్వత హైకోర్టు ఏర్పాటుకు ఖర్చు చేయాలని ఏపీ ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ఏపీకి ప్రత్యేక హైకోర్టు ఏర్పాటుపై గత మే 1న ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలంటూ తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌పై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతివాదులైన కేంద్ర న్యాయ శాఖ కార్యదర్శి, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పలువురు న్యాయవాదులకు నోటీసులు జారీ చేసింది. తమ వ్యాజ్యాలను విచారణకు స్వీకరించి ప్రతివాదులందరికీ నోటీసులివ్వాలన్న అడ్వకేట్ జనరల్ కె.రామకష్ణారెడ్డి వాదన మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. దీనిపై ఏపీ ఏజీ పి.వేణుగోపాల్ వ్యక్తం చేసిన అభ్యంతరాలను తోసిపుచ్చింది. తదుపరి విచారణను ఆగస్టు 14కు వాయిదా వేసింది. తెలంగాణ ప్రభుత్వ వాదన ఇదీ... ‘‘ఏపీ హైకోర్టు ఆ రాష్ట్ర భూభాగంలోనే ఉండాలని మే 1 నాటి తీర్పులో అప్పటి ధర్మాసనం చెప్పింది. ఏపీ హైకోర్టును తెలంగాణలో ఎక్కడా ఏర్పాటు చేసేందుకు చట్టం అనుమతించడం లేదని, అది శాశ్వత ప్రతిపాదకన ఏర్పడాలే తప్ప తాత్కాలికంగా కాదని కూడా పేర్కొంది. కానీ ఇలా చెప్పడం రాజ్యాంగంలోని 214, 366(14) అధికరణలకు విరుద్ధం. ఎందుకంటే హైకోర్టును ఏర్పాటు చేయాల్సిన ప్రదేశాన్ని విభజన చట్టంలోని సెక్షన్ 31(2) ప్రకారం రాష్ట్రపతి నోటిఫై చేస్తారు. ధర్మాసనం తీర్పు ఇందుకు విరుద్ధంగా ఉంది గనుక దాన్ని సవరించండి’’ అని తెలంగాణ ప్రభుత్వం అనుబంధ పిటిషన్లో కోరింది. హైకోర్టు విభజనపై దాఖలైన వ్యాజ్యాల్లో తీర్పును వాయిదా వేశాక అప్పటి ధర్మాసనం తనంతతానుగా కొన్ని ప్రశ్నలను లేవనెత్తిందని గుర్తు చేసింది. ‘‘తీర్పు వెలువడ్డాకే ఈ ప్రశ్నల గురించి తెలిసింది. దాంతో వాటికి సమాధానం చెప్పే అవకాశం లేకుండా పోయింది’’ అని పేర్కొంది.