Live Updates
18:20PM
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించిన తర్వాత కొల్లాపూర్ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగం
►ప్రాజెక్టులన్నీ పూర్తయితే దేశానికి తెలంగాణనే అన్నం పెడుతుంది
►ఈ జిల్లాలో పుట్టిన కొంతమంది నేతలే ప్రాజెక్టులకు అడ్డం పడ్డారు.
►తెలంగాణ సాగునీటి వాటా తేల్చాలని చెబితే ప్రధాని మోదీ స్పందించలేదు
►కృష్ణా ట్రైబ్యునల్‌కు లేఖ రాయడానికి పదేళ్లు చాలవా
►ఆనాడు చేయని దద్దమ్మ నాయకులే ఇప్పుడు అడ్డుపడుతున్నారు
►పాలమూరు ముఖచిత్రం పూర్తిగా మారిపోతోంది
►బీజేపీకి పౌరుషం ఉంటే కష్టాల్లో ఉన్న మన వాటాను తేల్చాలి
►వాటా ప్రకారం రావాల్సిన నీటినే అడుగుతున్నాంబీజేపీ నేతలను ప్రజలంతా ప్రశ్నించాలి
►పాలమూరును దత్తత తీసుకున్న చంద్రబాబు ఏం చేశాడు?
►ఉమ్మడి పాలమూరులో 20 లక్షల ఎకరాలకు సాగునీరు
►అదే లక్ష్యంతో మా ప్రభుత్వం పని చేస్తోంది
►కొల్లాపూర్ అభివృద్ధికి రూ. 25 కోట్ల నిధులు
16:51PM
► డెలివరి సిస్టర్న్ వద్ద సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు, గంగాహారతి
16:29PM
►పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రారంభం. నార్లాపూర్ తొలి పంపు స్విచ్ ఆన్ చేసిన సీఎం కేసీఆర్. భూగర్భంలో పంపుహౌజ్ ఏర్పాటు. శ్రీశైలం బ్యాక్ వాటర్ ఆధారంగా కృష్ణా నది నుంచి కోతిగుండు ద్వారా నీరు తీసుకొచ్చేలా ప్రాజక్టు నిర్మాణం.
►శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి రోజు 2 టీఎంసీల నీరు లిఫ్ట్ చేసే విధంగా ప్రాజెక్టు రూపకల్పన చేశారు. కాళేశ్వరం రికార్డును బ్రేక్ చేసేలా 145 మెగావాట్ల కెపాసిటీ కలిగిన 9 బాహుబలి మోటార్లను ఏర్పాటు చేశారు. 915 కిలోమీటర్ల ప్రాథమిక కాల్వను నిర్మించారు. రోజుకు 3,200 క్యూసెక్కులు ఎత్తిపోయగల కెపాసిటీ ఉన్న ఈ పంపు ద్వారా రెండు టీఎంసీల నీటిని అంజనగిరి (నార్లాపూర్) జలాశయానికి తరలించి నిల్వ చేస్తారు.
►ఈ ప్రాజెక్టు కోసం దాదాపు రూ.35 వేల కోట్లు ప్రభుత్వం ఇప్పటివరకూ ఖర్చు చేసింది.
►ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి, వికారాబాద్, నల్గొండ జిల్లాలో 12 లక్షల 30 వేల ఎకరాలకు సాగునీరుతో పాటు 1200 గ్రామాలకు తాగునీరందించడమే ఈ ప్రాజెక్టు లక్ష్యం. పరిశ్రమలకు 0.33 టీఎంసీల నీటిని వినియోగిస్తారు.
16:21PM
► పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పైలాన్ ఆవిష్కరించిన సీఎం కేసీఆర్
16:16PM
► నార్లాపూర్‌కు చేరుకున్న సీఎం కేసీఆర్
15:54PM September 16
► మరికాసేపట్లో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పైలాన్ ఆవిష్కరించనున్న సీఎం కేసీఆర్
► పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కాసేపట్లో నార్లాపూర్‌కు చేరుకోనున్నారు.
ఉమ్మడి జిల్లావాసుల చిరకాల స్వప్నమైన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని ఎత్తిపోసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. శ్రీశైలం జలాశయం నుంచి అప్రోచ్ కాల్వ ద్వారా నార్లాపూర్ ఇన్‌టేక్ వెల్‌కు చేరుకునే కృష్ణా జలాలను.. స్విచ్ నొక్కడం ద్వారా 104 మీటర్లు పైకి ఎత్తి సమీపంలోని నార్లాపూర్ రిజర్వాయర్‌లోకి పోసే ప్రక్రియకు శ్రీకారం చుట్టనున్నారు. ఆ వెంటనే నార్లాపూర్ రిజర్వాయర్ వద్దకు చేరుకుని అక్కడికి చేరుకున్న కృష్ణా జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.
► నాగర్‌కర్నూల్ నుంచి నార్లాపూర్ పంప్ హౌస్‌కు బయలుదేరిన సీఎం
14:55PM September 16
► కాసేపట్లో నాగర్‌కర్నూల్ చేరుకోకున్న సీఎం కేసీఆర్
12:34PM September 16
►ప్రగతిభవన్ నుంచి నాగర్‌కర్నూల్ జిల్లాకు బయలుదేరిన సీఎం కేసీఆర్
►పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించనున్న కేసీఆర్
►భారీ కాన్వాయ్‌తో ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి బయల్దేరిన కేసీఆర్
►నార్లాపూర్‌లో తొలి పంపు స్విచ్ ఆన్ చేయనున్న సీఎం కేసీఆర్
►పాలమూరు-రంగారెడ్డి పైలాన్ ఆవిష్కరించనున్న కేసీఆర్
►డెలివరి సిస్టర్న్ వద్ద సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు, గంగాహారతి
►కలశాల్లో కృష్ణా జలాలు గ్రామాలకు చేరవేసేలా ఏర్పాట్లు
►అనంతరం కొల్లాపూర్ బహిరంగసభలో ప్రసంగించనున్న కేసీఆర్
► శ్రీశైలం జలాశయం వెనుక జలాల నుంచి అప్రోచ్ కెనాల్ ద్వారా హెడ్ రెగ్యులేటరీ, ఇంటెక్ వెల్, సొరంగ మార్గాల ద్వారా సజ్జపూల్‌లోకి చేరిన కృష్ణా జలాలు…..మొదటి పంపు నుంచి డెలివరీ మెయిన్స్ ను దాటుకొని నార్లాపూర్ జలాశయానికి విజయవంతంగా చేరాయి.
► 2015 జూన్‌లో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టగా మొదటి పంపు ప్రారంభానికి ఎనిమిదేళ్లు పట్టింది. ఎట్టకేలకు నార్లపూర్‌లోని పంపుహౌజ్‌లోని మొదటి పంపును రన్ చేసి అంజనగిరి జలాశయంలోకి నీటిని ఎత్తిపోయనున్నారు. ప్రతి రోజు 0.25 టీఎంసీల చొప్పున మొత్తం 2 టీఎంసీ నీటిని ఎత్తిపోస్తారు.
► శ్రీశైలం జలాశయం నుంచి రోజుకు 1.5 టీఎంసీల చొప్పున 60 రోజుల్లో 90 టీఎంసీల కృష్ణా జలాలను తరలించి దక్షిణ తెలంగాణలోని నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, నారాయణ్‌పేట, రంగారెడ్డి, వికారాబాద్, నల్లగొండ జిల్లాల్లోని 12.30 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీటితో పాటు 1,200 గ్రామాలకు తాగునీటిని అందించడానికి ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ప్రతిపాదించింది.
‘పాలమూరు–రంగారెడ్డి’ విశిష్టతలెన్నో..
► ఆయకట్టు:12.30 లక్షల ఎకరాలు
► జల వనరు: శ్రీశైలం జలాశయం
► ప్రతిరోజూ లిఫ్ట్ చేసే జలాలు: 1.50 టీఎంసీలు
► లిఫ్టుల స్టేజ్‌లు: 5
► రిజర్వాయర్ల సంఖ్య: 6
► నీటినిల్వ సామర్థ్యం: 67.52 టీఎంసీలు
► పంపుల గరిష్ట సామర్థ్యం: 145 మెగావాట్లు
► నీటిని లిఫ్ట్ చేసే గరిష్ట ఎత్తు: 672 మీటర్లు
► సొరంగ మార్గం పొడవు: 61.57 కిలోమీటర్లు
► ప్రధాన కాలువల పొడవు: 915.47 కిలోమీటర్లు
► తాగునీటికి వినియోగం: 7.15 టీఎంసీలు
► పరిశ్రమలకు కేటాయింపులు : 3 టీఎంసీలు
► సాగునీటికి కేటాయింపులు : 79.00 టీఎంసీలు
►నాలుగు పంప్‌హౌసుల్లో 145 మెగావాట్ల భారీ సామర్థ్యం కలిగిన మొత్తం 34 పంపులను ఏర్పాటు చేయడం ప్రపంచంలో ఇదే ప్రథమం. ఇందులో 3 పంపులను అత్యవసర సమయాల్లో స్టాండ్‌బైగా వినియోగించనున్నారు.
► మోటార్లను దేశీయ దిగ్గజ కంపెనీ, కేంద్ర ప్రభుత్వ సంస్థ బీహెచ్‌ఈఎల్ తయారు చేయడం విశేషం
►ఏదుల పంప్‌హౌస్ వద్ద ఆసియాలోనే అతిపెద్దదైన సర్జ్ పూల్
►అత్యధిక సామర్థ్యం గల పంపుల వినియోగంలో కాళేశ్వరం రికార్డు బద్ధలు.
►145 మెగావాట్ల సామర్థ్యం గల మహా బాహుబలి మోటార్ల వినియోగం
Comments
Please login to add a commentAdd a comment