
పాలమూరుకు మరో 12, 432 కోట్లు!
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు అంచనా వ్యయం భారీగా పెరిగింది.
- పాత అంచనా రూ. 35,200 కోట్లు
- తాజా అంచనా రూ. 47,632 కోట్లు
- ఆయకట్టు పెంపు, కొత్త రిజర్వాయర్, తాజా ధరల వర్తింపే కారణం
- ఉద్ధండాపూర్ నిర్వాసితులకు మెరుగైన పరిహారమివ్వాలని నిర్ణయం
- డిస్ట్రిబ్యూటరీల సర్వే ముగిస్తే వ్యయ అంచనా మరింతగా పెరిగే అవకాశం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు అంచనా వ్యయం భారీగా పెరిగింది. ప్రాజెక్టు పరిధిలో మార్పులు, కొత్త స్టాండర్డ్ షెడ్యూల్డ్ రేట్ల (ఎస్‌ఎస్‌ఆర్)ను పరిగణనలోకి తీసుకోవడం, ఆయకట్టు విస్తీర్ణం పెంచిన నేపథ్యంలో... ఇంతకు ముందటి అంచనా రూ.35,200 కోట్ల నుంచి ప్రస్తుతం రూ.47,632 కోట్లకు చేరింది.
అంటే ఏకంగా రూ.12,432 కోట్ల మేర అదనపు వ్యయం కానుంది. కొత్తగా పెంచిన ఆయకట్టు పరిధిలో కాలువల (డిస్ట్రిబ్యూటరీల) సర్వే పనులు సైతం ముగిస్తే ఈ అంచనా వ్యయం మరింతగా పెరిగే అవకాశముంది. పెరిగిన అంచనాలపై అన్ని స్థాయిల్లో పరిశీలన పూర్తయ్యాక సవరించిన అంచనాతోసర్కార్ ఉత్తర్వుజారీ చేయనుంది.
పెరిగిన ఆయకట్టుకు తగ్గట్లే..
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని తొలుత రూ.35,200 కోట్ల వ్యయ అంచనాతో చేపట్టారు. దీని ద్వారా శ్రీశైలం నుంచి 60 రోజుల్లో 120 టీఎంసీల వరద జలాలను తీసుకుని మహబూబ్‌నగర్ జిల్లాలోని 7 లక్షల ఎకరాలకు, రంగారెడ్డిలో 2.70 లక్షల ఎకరాలు, నల్లగొండలో 30 వేల ఎకరాలకు కలిపి మొత్తంగా 10 లక్షల ఎకరాలకు సాగునీరివ్వాలని తొలుత సంకల్పించారు. నార్లాపూర్ (8.61 టీఎంసీ), ఏదుల (6.55 టీఎంసీ), వట్టెం (16.58 టీఎంసీ), కరివెన (19.15 టీఎంసీ), ఉద్ధండాపూర్ (15.91 టీఎంసీ), కేపీ లక్ష్మీదేవునిపల్లి(2.80 టీఎంసీ) రిజర్వాయర్లను, 5 లిఫ్టులను ప్రతిపాదించారు.
అయితే ఆ తర్వాత రంగారెడ్డి జిల్లాలో అదనంగా మరో 2.30 లక్షల ఎకరాల ఆయకట్టును చేర్చారు. ఇందులో పరిగి పరిధిలో 6,893 ఎకరాలు, వికారాబాద్‌లో 65,791, చేవెళ్లలో 80,767, మహేశ్వరంలో 10,741, ఇబ్రహీంపట్నంలో 65,808 ఎకరాలకు నీరి చ్చేలా ప్రణాళిక తయారు చేశారు. దీంతో కొత్తగా కాలువలు, టన్నెళ్లు, ఇతర నిర్మాణా లు పెరిగి.. అంచనా వ్యయం పెరిగింది. దీనికితోడు కొత్తగా పరిగి, వికారాబాద్, తాండూరు నియోజకవర్గాల్లో సుమారు 1.5 లక్షల ఎకరాలకు నీరిచ్చేందుకు ఉద్ధండాపూర్, కేపీ లక్ష్మీదేవునిపల్లి రిజర్వాయర్ల మధ్య అం తారం వద్ద 16 టీఎంసీల సామర్థ్యంతో మరో రిజర్వాయర్ నిర్మించాలని తాజాగా నిర్ణయిం చారు. దీనితో అదనంగా రూ.2,600 కోట్ల వ్యయం పెరుగుతోంది. ఉద్ధండాపూర్ రిజ ర్వాయర్ కింద 8 గ్రామాల్లో 1,275 గృహాలు ముంపునకు గురవుతున్నాయి. అక్కడ భూ ములధరలు భారీగా ఉండటంతో ఎక్కువ పరిహారమివ్వాలని ప్రభుత్వం భావిస్తోంది.
ధరల మార్పుతో..
పాలమూరు ప్రాజెక్టు అంచనాలన్నీ 2014- 15 ఎస్‌ఎస్‌ఆర్ రేట్లతో రూపొందిం చారు. ప్రస్తుతం 2015-16 ఎస్‌ఎస్‌ఆర్‌ను పరిగణనలోకి తీసుకుంటూ సిమెంట్, ఉక్కు, లేబర్, ఇతర చార్జీలను లెక్కించారు. ఇలా ఎస్‌ఎస్‌ఆర్ మార్పుతోనే ఏకంగా రూ.3,500 కోట్ల వరకు అంచనా వ్యయం పెరిగింది. పంపింగ్ స్టేషన్ల వద్ద చేయాల్సిన హైడ్రో మెకానికల్, ఎలక్ట్రో మెకానికల్ (ఈఎం అండ్ హెచ్‌ఎం) పనుల విలువ గతంలో రూ.6,258 కోట్లుగా అంచనా వేయగా.. ఇది మరో రూ.వెయ్యి కోట్ల వరకు అదనంగా పెరిగినట్లుగా తెలుస్తోం ది. మరికొన్ని గుర్తించని పనులు సైతం తా జాగా చేరడంతో మొత్తంగా అంచనా వ్యయం రూ.12,432 కోట్ల మేర పెరిగింది.