సాక్షి, రంగారెడ్డి: హరితహారం అంటే తొలినాళ్లలో కాంగ్రెస్ నేతలు జోకులేశారని, కానీ, ఇవాళ దానివల్లే తెలంగాణలో 7.7 శాతం పచ్చదనం పెరిగిందన్నారు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు. గత ఏడేళ్లలో హరితహారం కోసం రూ. 10వేల కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారాయన.
తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం రాష్ట్రవ్యాప్తంగా హరితోత్సవం నిర్వహిస్తోంది ప్రభుత్వం. ఇందులో భాగంగా రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుమ్మలూరులోని అర్బన్ పార్కులో సీఎం కేసీఆర్ (CM KCR) మొక్కలు నాటి.. అక్కడ బహిరంగ సభలో ప్రసంగించారు. తెలంగాణలో 85 శాతం ప్రాజెక్టులు పూర్తయ్యాయి. గ్రామాలన్నీ పచ్చగా ఉన్నాయి. విడిపోతే తెలంగాణ నాశనం అవుతుందని అన్నారు. కానీ, ఇప్పుడు అన్ని రంగాల్లో తెలంగాణ నెంబర్ వన్‌గా ఉంది.
గోదావరి నీటిని వందల ఫీట్లువేసినా బోర్లలో నీళ్లు పడేవి కావు. పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టును కాంగ్రెస్ అడ్డుకుంది. కానీ, ఆ ప్రాజెక్ట్ ద్వారా నీళ్లు తెచ్చే బాధ్యత నాది. అలాగే గోదావరి నీటిని గండిపేట, హిమాయత్ సాగర్‌కు లింక్ చేస్తాం. చెవేళ్ల ప్రాంతానికి త్వరలోనే నీళ్లు అందిస్తాం. మహేశ్వరం నియోజకవర్గానిక మెడికల్ కాలేజీ మంజూరు చేస్తామని తుమ్మలూరు బహిరంగ సభ వేదికగా సీఎం కేసీఆర్ ప్రకటించారు. అలాగే శంషాబాద్ నుంచి మహేశ్వరం వరకు మెట్రో మార్గం పొడిగించేందుకు చర్యలు సైతం తీసుకుంటామన్నారాయన.
ఇదీ చదవండి: మాజీ ఎంపీల భేటీ.. రోజంతా హడావిడి!
Comments
Please login to add a commentAdd a comment