Maheswaram
-
మహేశ్వరం పాలిటిక్స్..
-
5 అంత వీజీ కాదు!
రాష్ట్రంలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో సగటున ఓటర్ల సంఖ్య 2.5లక్షల నుంచి 3 లక్షల వరకు ఉంటుంది. ఆ మేరకు ఓటర్లున్న చోట గెలిచేందుకు అభ్యర్థులు అన్నిరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ రాష్ట్రంలోని ఓ ఐదు నియోజకవర్గాల్లో మాత్రం అభ్యర్థులు అందరికన్నా ఎక్కువగా తంటాలు పడక తప్పని పరిస్థితి. ఎందుకంటే అవి రాష్ట్రంలోనే ఎక్కువ మంది ఓటర్లున్న సెగ్మెంట్లు. వీటిలో ఓటర్ల సంఖ్య 5 లక్షలపైనే. ఇందులోనూ రెండింటిలో అయితే ఆరు లక్షలపైనే ఓటర్లు ఉన్నారు. అంటే రెండు, మూడు సాధారణ నియోజకవర్గాలతో సమానం అన్నమాట. ఇవన్నీ హైదరాబాద్ నగరం, శివారు ప్రాంతాల్లో విస్తరించి ఉన్నవే. వీటిలో శేరిలింగంపల్లి (6.98 లక్షలు), కుత్బుల్లాపూర్ (6.69 లక్షలు), ఎల్బీనగర్ (5.66 లక్షలు), రాజేంద్రనగర్ (5.52 లక్షలు), మహేశ్వరం (5.17 లక్షలు) ఉన్నాయి. ఇవన్నీ నియోజకవర్గాల పునర్విభజనతో 2009లో కొత్తగా ఏర్పడినవే కావడం గమనార్హం. ఎక్కువ మంది ఓటర్లేకాదు.. బస్తీల నుంచి గేటెడ్ కమ్యూనిటీల దాకా, అత్యంత సంపన్నుల నుంచి కూలీపని చేసుకునేవారి దాకా విభిన్న వర్గాలు, కులాలు, వివిధ మతాల ప్రజలు వీటిలో ఉన్నారు. వీరందరినీ ఆకట్టుకుని ఓట్లుగా మలచుకోవడం ఆషామాషీ కాదు. ఖర్చు కూడా ఎక్కువగా పెట్టాల్సిన పరిస్థితి. ఈ నియోజకవర్గాల గురించి ఒక్కసారి తెలుసుకుందామా.. శేరిలింగంపల్లి టాప్ రాష్ట్రంలో ఎక్కువ ఓటర్లున్న నియోజకవర్గం శేరిలింగంపల్లి. ఇక్కడ 6,98,133 మంది ఓటర్లు ఉన్నారు. ఇక్కడ 2009లో కాంగ్రెస్ నుంచి పోటీచేసిన బీసీ నేత భిక్షపతియాదవ్.. టీడీపీ అభ్యర్థి మొవ్వ సత్యనారాయణపై 1,327 ఓట్ల తేడాతో గెలిచారు. 2014లో టీడీపీ, బీజేపీ కూటమి తరఫున కమ్మ సామాజికవర్గ నేత అరికపూడి గాందీ.. బీఆర్ఎస్ అభ్యర్థి శంకర్‌గౌడ్‌పై 75,904 ఓట్ల మెజారిటీతో గెలిచారు. 2018 ఎన్నికల్లో అరికపూడి గాంధీ బీఆర్ఎస్ తరఫున బరిలోకి దిగి.. టీడీపీ అభ్యర్థిపై భవ్య ఆనంద్‌పై 44,194 ఓట్ల తేడాతో విజయం సాధించారు. కుత్బుల్లాపూర్ బీసీ నేతలదే.. ఓటర్ల సంఖ్యలో రెండో స్థానంలో ఉన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో 6,69,361 మంది ఓటర్లు ఉన్నారు. ఇక్కడి జనం తొలి నుంచీ బీసీ నేతలకు మద్దతుగా నిలుస్తున్నారు. 2009లో బీఆర్ఎస్ అభ్యర్థి కేపీ వివేకానందగౌడ్‌పై స్వతంత్ర అభ్యరి్థగా పోటీచేసిన కూన శ్రీశైలంగౌడ్ 23,219 ఓట్లతో గెలిచారు. 2014లో బీఆర్ఎస్ నేత కె.హన్మంతరెడ్డిపై టీడీపీ తరఫున బరిలోకి దిగిన కేపీ వివేకానందగౌడ్ 39,021 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. తర్వాత బీఆర్ఎస్లో చేరిన వివేకానంద.. 2018 ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున పోటీ చేసి, కాంగ్రెస్ అభ్యర్థి కూన శ్రీశైలంగౌడ్‌పై 41,500 ఓట్ల తేడాతో గెలిచారు. ఎల్బీనగర్లో ఖాతా తెరవని బీఆర్ఎస్ ఎక్కువ మంది ఓటర్లున్న నియోజకవర్గాల్లో మూడోదైన ఎల్బీనగర్లో 5,66,866 మంది ఓటర్లు ఉన్నారు. 2009లో టీడీపీ అభ్యర్థి ఎన్వీ కృష్ణప్రసాద్‌పై కాంగ్రెస్ అభ్యర్థి దేవిరెడ్డి సుదీర్‌రెడ్డి 13,142 ఓట్ల మెజారిటీతో గెలిచారు. 2014లో బీఆర్ఎస్ అభ్యర్థి రామ్మోహన్‌గౌడ్‌పై టీడీపీ అభ్యర్థి ఆర్.కృష్ణయ్య 12,525 ఓట్లతో విజయం సాధించారు. 2018లో బీఆర్ఎస్ అభ్యర్థి రామ్మోహన్‌పై కాంగ్రెస్ అభ్యర్థి దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి 17,251 ఓట్లతో గెలిచారు. తర్వాత కొద్దిరోజులకే ఆయన బీఆర్ఎస్లో చేరారు. బీసీలకే రాజేంద్రనగర్ మద్దతు ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉన్న సెగ్మెంట్లలో నాలుగో స్థానంలోని రాజేంద్రనగర్‌లో 5,52,455 మంది ఓటర్లు ఉన్నారు. 2009లో ఏర్పాటైనప్పటి నుంచీ బీసీ నేత ప్రకాశ్‌గౌడ్ వరుసగా గెలుస్తూ వస్తున్నారు. 2009, 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన ప్రకాశ్‌గౌడ్.. కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన జ్ఞానేశ్వర్‌పై విజయం సాధించారు. తర్వాత ఆయన బీఆర్ఎస్లో చేరారు. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన ప్రకాశ్‌గౌడ్.. టీడీపీ అభ్యర్థి గణేశ్‌పై 57,331 ఓట్లతో భారీ మెజారిటీతో గెలిచారు. ఈ ఎన్నికల్లో మూడో స్థానంలో నిలిచిన ఎంఐఎం అభ్యర్థి మీర్జా రహమత్‌కు 46 వేలకుపైగా ఓట్లు రావడం గమనార్హం. ఐదో స్థానంలోని మహేశ్వరంలో.. మహేశ్వరం నియోజకవర్గం ఎక్కువ ఓటర్ల జాబితాలో ఐదో స్థానంలో ఉంది. 2009లో టీడీపీ అభ్యర్థి తీగల కృష్ణారెడ్డిపై కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన పి.సబితా ఇంద్రారెడ్డి 7,833 ఓట్లతో గెలిచారు. ఉమ్మడి ఏపీ చరిత్రలో తొలి మహిళా హోంమంత్రిగా వైఎస్సార్ కేబినెట్లో బాధ్యతలు చేపట్టారు. ఇక 2014లో ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి ఎం.రంగారెడ్డిపై టీడీపీ అభ్యర్థి తీగల కృష్ణారెడ్డి 30,784 ఓట్ల తేడాతో విజయం సాధించారు. తర్వాత బీఆర్ఎస్లో చేరిన కృష్ణారెడ్డి 2018లో ఆ పార్టీ తరఫున బరిలోకి దిగగా.. ఆయనపై కాంగ్రెస్ నుంచి బరిలో ఉన్న సబితా ఇంద్రారెడ్డి 9,227 ఓట్లతో గెలిచారు. తర్వాత ఆమె బీఆర్ఎస్లో చేరి విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. -గౌటే దేవేందర్ -
‘హరితహారం అంటే కాంగ్రెస్ నేతలు జోకులేశారు’
సాక్షి, రంగారెడ్డి: హరితహారం అంటే తొలినాళ్లలో కాంగ్రెస్ నేతలు జోకులేశారని, కానీ, ఇవాళ దానివల్లే తెలంగాణలో 7.7 శాతం పచ్చదనం పెరిగిందన్నారు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు. గత ఏడేళ్లలో హరితహారం కోసం రూ. 10వేల కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారాయన. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం రాష్ట్రవ్యాప్తంగా హరితోత్సవం నిర్వహిస్తోంది ప్రభుత్వం. ఇందులో భాగంగా రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుమ్మలూరులోని అర్బన్ పార్కులో సీఎం కేసీఆర్ (CM KCR) మొక్కలు నాటి.. అక్కడ బహిరంగ సభలో ప్రసంగించారు. తెలంగాణలో 85 శాతం ప్రాజెక్టులు పూర్తయ్యాయి. గ్రామాలన్నీ పచ్చగా ఉన్నాయి. విడిపోతే తెలంగాణ నాశనం అవుతుందని అన్నారు. కానీ, ఇప్పుడు అన్ని రంగాల్లో తెలంగాణ నెంబర్ వన్‌గా ఉంది. గోదావరి నీటిని వందల ఫీట్లువేసినా బోర్లలో నీళ్లు పడేవి కావు. పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టును కాంగ్రెస్ అడ్డుకుంది. కానీ, ఆ ప్రాజెక్ట్ ద్వారా నీళ్లు తెచ్చే బాధ్యత నాది. అలాగే గోదావరి నీటిని గండిపేట, హిమాయత్ సాగర్‌కు లింక్ చేస్తాం. చెవేళ్ల ప్రాంతానికి త్వరలోనే నీళ్లు అందిస్తాం. మహేశ్వరం నియోజకవర్గానిక మెడికల్ కాలేజీ మంజూరు చేస్తామని తుమ్మలూరు బహిరంగ సభ వేదికగా సీఎం కేసీఆర్ ప్రకటించారు. అలాగే శంషాబాద్ నుంచి మహేశ్వరం వరకు మెట్రో మార్గం పొడిగించేందుకు చర్యలు సైతం తీసుకుంటామన్నారాయన. ఇదీ చదవండి: మాజీ ఎంపీల భేటీ.. రోజంతా హడావిడి! -
రాచకొండ పోలీసు కమిషనరేట్ మరింత బలోపేతం!
సాక్షి,హైదరాబాద్: పట్టణీకరణ, కొత్త ప్రాంతాల ఏర్పాటుతో రాచకొండ పోలీసు కమిషనరేట్ శరవేగంగా విస్తరిస్తోంది. ప్రస్తుతం 5,116 చదరపు కిలో మీటర్ల మేర విస్తరించిన రాచకొండలో 44 లక్షల మంది జనాభా నివాసం ఉంటోంది. ఏటేటా జనాభా, ట్రాఫిక్ రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో కొత్త ఠాణాలు, ట్రాఫిక్ పోలీసు స్టేషన్లు, పోలీసుల సంఖ్యను పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో రాచకొండకు కొత్తగా 763 పోలీసు పోస్టులకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదముద్ర వేసింది. ప్రస్తుతం రాచకొండలో ఎల్బీనగర్, మల్కాజ్గిరి, భువనగిరి జోన్లు, ఒక్కో ట్రాఫిక్, ఎస్ఓటీ జోన్లతో కార్యాకలాపాలు సాగిస్తుంది. తాజా నిర్ణయంతో అదనంగా ఒక శాంతి భద్రతల జోన్, రెండు ట్రాఫిక్ జోన్లు, రెండు స్పెషల్ ఆపరేషన్ టీం (ఎస్ఓటీ) జోన్లను ఏర్పాటు చేయనున్నట్లు రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ తెలిపారు. కొత్తగా మహేశ్వరం జోన్: ఎల్బీనగర్ జోన్ నుంచి ఇబ్రహీంపట్నం డివిజన్‌ను వేరు చేసి కొత్తగా రానున్న మహేశ్వరం డివిజన్‌తో కలిపి కొత్తగా మహేశ్వరం జోన్‌ను ఏర్పాటు చేయనున్నారు. పోస్టులు: డీసీపీ–1; అదనపు డీసీపీ–1, పీసీ–2, జేఏ–1 ► ఇబ్రహీంపట్నం డివిజన్ నుంచి మహేశ్వరం, కందుకూరు పోలీసు స్టేషన్లు, వనస్థలిపురం డివిజన్ నుంచి పహాడీషరీఫ్, బాలాపూర్ ఠాణాలను వేరు చేసి కొత్తగా మహేశ్వరం డివిజన్‌ను ఏర్పాటు చేయనున్నారు. పోస్టులు: ఏసీపీ–1; పీసీ–2 ► ఇప్పటికే ఉన్న ఎల్బీనగర్, మల్కాజ్గిరి, భువనగిరి జోన్లతో పాటు కొత్తగా రానున్న మహేశ్వరం జోన్‌కు ఒక్కో అదనపు డీసీపీలను నియమించనున్నారు. ఐదు కొత్త ఠాణాలు.. ప్రస్తుతం 43 శాంతి భద్రతలు, రెండు మహిళా పోలీసు స్టేషన్లు ఉండగా.. కొత్తగా మరో ఠాణాలను ఏర్పాటు చేయనున్నారు. చర్లపల్లి, నాగోల్, హైదరాబాద్ గ్రీన్ ఫార్మా సిటీ, పోచారం ఐటీ కారిడార్ స్టేషన్లుతో పాటు ఉప్పల్‌లో మహిళా ఠాణా రానుంది. అలాగే ప్రస్తుతం ఉన్న కీసర, అబ్దుల్లాపూర్‌మెట్, బాలాపూర్ ఠాణాలను నవీకరించనున్నారు. యాదాద్రిలో భక్తుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో కేవలం గట్టు కోసమే ప్రత్యేకంగా ఏసీపీ ర్యాంకు అధికారిని మంజూరు చేశారు. యాదాద్రి టెంపుల్ పీఎస్, రాయగిరి పీఎస్‌లు ఆయన పరిధిలో ఉంటాయి. రెండు ఎస్ఓటీ జోన్లు.. ప్రస్తుతం రాచకొండలో ఒకటే ఎస్ఓటీ జోన్ ఉంది. కొత్తగా ఎల్బీనగర్–మహేశ్వరం, మల్కాజ్గిరి–భువనగిరి ఎస్ఓటీ జోన్లు రానున్నాయి. పోస్టులు: డీసీపీ–2, అదనపు డీసీపీ–1, ఏసీపీ–1, ఇన్స్పెక్టర్లు–2 ► స్పెషల్ బ్రాంచ్ (ఎస్బీ) విభాగాన్ని కూడా బలోపేతం చేయనున్నారు. ఎస్బీకి కొత్తగా డీసీపీ ర్యాంకు అధికారి రానున్నారు. అదనంగా ఒక డీసీపీ, ఇద్దరు ఇన్స్పెక్టర్లు, 3 ఎస్ఐలు, ఐదుగురు ఏఎస్ఐలు, 5 మంది హెడ్ కానిస్టేబుళ్లు, 16 మంది కానిస్టేబుళ్ల పోస్టులను భర్తీ చేయనున్నారు. నాలుగు కంట్రోల్ రూమ్‌లు.. రాచకొండలో కొత్తగా నాలుగు జోనల్ కంట్రోల్ రూమ్‌లు రానున్నాయి. ఒక్కో కంట్రోల్ రూమ్‌కు ఒక ఏఎస్ఐ, ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు, ఇద్దరు కానిస్టేబుళ్లుంటారు. వీటితో పాటు ఆర్మ్డ్ రిజర్వ్ (ఏఆర్)లో 70 మంది, ఐటీ, క్లూస్, సీసీఎస్ వంటి ఇతరత్రా విభాగాలలో 75 మంది, ఐడీ స్టాఫ్‌లో 13 అదనపు పోస్టులను భర్తీ చేయనున్నారు. ట్రాఫిక్‌లో రెండు జోన్లు, జాయింట్ సీపీ.. ఏటేటా వాహనాల సంఖ్య, రద్దీ పెరగడంతో ట్రాఫిక్ నియంత్రణ ఇబ్బందిగా మారింది. దీంతో ఈ విభాగాన్ని కూడా విస్తరించనున్నారు. కొత్తగా రాచకొండ ట్రాఫిక్‌కు జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీసు (సీపీ)ను పోస్టును భర్తీ చేయనున్నారు. కొత్తగా రానున్న రెండు ట్రాఫిక్ జోన్ల మధ్య సమన్వయం, విధుల కేటాయింపు, ట్రాఫిక్ నియంత్రణ అంశాలను జాయింట్ సీపీ పర్యవేక్షిస్తారు. ఆయనతో పాటు రెండు పీసీలు, ఒక జేఏ పోస్టులు కూడా మంజూరయ్యాయి. కొత్తగా రెండు ట్రాఫిక్ జోన్లు: ► ప్రస్తుతం రాచకొండ మొత్తానికీ ఒకటే ట్రాఫిక్ జోన్ ఉంది. కొత్తగా ఎల్బీనగర్–మహేశ్వరం, మల్కాజ్గిరి–భువనగిరి రెండు జోన్లను ఏర్పాటు చేయనున్నారు. పోస్టులు: డీసీపీ–1, అదరపు డీసీపీ–1, పీసీలు–2 ► కొత్తగా మహేశ్వరం ట్రాఫిక్ డివిజన్‌ను కూడా రానుంది. ఇబ్రహీంపట్నం, మహేశ్వరం ట్రాఫిక్ ఠాణాలను కలిపి ఈ డివిజన్ ఉంటుంది. పోస్టులు: ఏసీపీ–1, పీసీ–1 ► ప్రస్తుతం ఎనిమిది ట్రాఫిక్ పోలీసు స్టేషన్లు ఉండగా.. అదనంగా మరో నాలుగు ఠాణాలు రానున్నాయి. కొత్తగా ఘట్కేసర్, జవహర్‌నగర్, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం ట్రాఫిక్ స్టేషన్లను ఏర్పాటు, యాదాద్రి ట్రాఫిక్ పీఎస్‌లను నవీకరించనున్నారు. (క్లిక్: సంచలనాల సమాహారం.. ‘ఫామ్‌హౌస్–ఈడీ’ కేసుల వరకు ఎన్నెన్నో..) -
ఆగ్రహం: మంత్రి సబితకు నిరసన సెగ
సాక్షి, హైదరాబాద్: భారీ వర్షాలు, వరదలతో నగర వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు ప్రాంతాల్లో వరద నీరు ఇంట్లోకి చేరడంతో నానా అవస్థలు పడుతున్నారు. వరద బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వ యంత్రాంగం రంగంలోకి దిగినప్పటికీ.. ఇంకా పలు ప్రాంతాల్లో ప్రభుత్వ సాయం అందడంలేదు. దీంతో స్థానిక అధికారులపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వరద ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్న ప్రజా ప్రతినిధులపై సైతం మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే వరద ప్రభావిత ప్రాంతాలో బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన రాష్ట్ర మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డికి నిరసన సెగ ఎదురైంది. (హయత్ నగర్ కార్పోరేటర్‌పై దాడి) రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట్ పరిధిలోని మిధిలాపూర్ కాలనీలో వరద బాధితుల వద్దకు వెళ్లిన మంత్రిని స్థానికులు అడ్డుకున్నారు. గత వారం రోజులుగా వర్షాలు, వరదలు వస్తున్నా తమను ఎవరూ పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి కాన్వాయ్‌కు అడ్డుగా రోడ్డుపై భైఠాయించి కాసేపు నిలువరించారు. అక్కడకు పోలీసులు భారీగా చేరుకోవడంతో కాసేపు ఉద్రిక్తంగా మారింది. దీంతో వాహనం దిగి స్థానికుల వద్దకు వచ్చిన సబిత.. వారితో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వీలైనంత త్వరగా నిత్యవసర వస్తువులతో పాటు ప్రభుత్వ సాయం అందేలా చూస్తానని భరోసా ఇచ్చారు. మంత్రి హామీతో స్థానికులు శాంతించారు. -
రంగంలోకి రేవంత్.. వెనక్కి తగ్గిన సబిత
సాక్షి, హైదరాబాద్: పార్టీ మారే విషయంలో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెనక్కి తగ్గినట్ల తెలుస్తోంది. ఆమె పార్టీని వీడకుండా కాంగ్రెస్ సీనియర్ నేతలు చేసిన ప్రయత్నలు ఫలించాయి. ఈరోజు సాయంత్రం ఢిల్లీలో కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీతో సబిత సమావేశం కానున్నారు. కాగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో సబిత ఇటీవల భేటీ అయినట్లు వార్తలొచ్చిన విషయం తెలిసిందే. ఆమె కాంగ్రెస్‌కు రాజీనామా చేసి, ఆయన తనయుడు కార్తిక్ రెడ్డితో పాటు టీఆర్ఎస్లో చేరుతారని వార్తలు వినిపించాయి. దీంతో వెంటకే తేరుకున్న కాంగ్రెస్ అధిష్టానం ఆమెను బుజ్జగించే ప్రయత్నం చేసింది. అదే రోజు రాత్రి పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి, సీనియర్ నేత జానారెడ్డి సబిత ఇంటికెళ్లి పార్టీలోనే కొనసాగాలని, తగిన ప్రాధాన్యం కల్పిస్తామని హామీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఎంతకీ ఆమె ససేమీరా అనడంతో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని రంగంలోకి దించింది కాంగ్రెస్ హైకమాండ్. పార్టీ అధిష్టానంపై అసంతృప్తిగా ఉన్న సబితకు పార్టీ మారకుండా నచ్చచెప్పిన రేవంత్ నేడు ఢిల్లీలో రాహుల్ గాంధీతో సమావేశం ఏర్పాటు చేశారు. అయితే ఆమె తనయుడు కార్తిక్ రెడ్డికి ఎంపీ టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. -
గేదెల దొంగతనం కేసు: ఏసీబీ వలలో చిక్కిన ఎస్సై
సాక్షి, మహేశ్వరం: రూ. 80 వేల లంచం తీసుకుంటుండగా మహేశ్వరం ఎస్ఐ జి. నర్సింహులును ఏసీబీ అధికారులు వలపన్ని రెడ్ హ్యండెడ్‌గా పట్టుకున్నారు. గేదెల దొంగతనం కేసులో నిందితులపై కేసులు, సేక్షన్లను తగ్గించి చిన్న కేసులు పెట్టించి సురక్షితంగా బయటపడేవిధంగా చేస్తానని చెప్తూ.. నిందితుడి నుంచి లంచం తీసుకుంటుండగా.. నర్సింహులును ఏసీబీ క్యాచ్‌చేసింది. ఈ సంఘటన మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో గురువారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ తెలిపిన కథనం ప్రకారం.. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని గతవారం రోజుల కిత్రం కల్వకోల్, నాగిరెడ్డిపల్లి, గొల్లూరు గ్రామాల్లో పొలం వద్ద పశువుల పాకలో కట్టేసిన గేదెలను దొంగలు అపహరించుకుపోయారు. గేదెలు పోయిన రైతులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. విచారణ చేపట్టి ఈ దొంగతనం కేసును ఛేదించారు. అమీర్‌పేట్ గ్రామానికి చెందిన రాజు పొలం వద్ద కట్టేసిన గేదెలను దొంగిలించాడని గుర్తించి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి విచారించారు. దొంగిలించిన గేదెలను మొయినాబాద్‌కు చెందిన సయ్యద్ నజీర్, ఖలీద్‌కు సర్ధార్‌నగర్ సంతలో విక్రయించానని అతను పోలీసులకు చెప్పాడు. పోలీసులు నజీర్, ఖలీద్‌లను పట్టుకొని విచారించడంతో.. కొనుగోలు చేసిన గేదెలను సంగారెడ్డికి చెందిన గేదెల వ్యాపారి హర్షద్‌కు విక్రయించామని వారు తెలిపారు. ఈ దశలో ఎస్ఐ నర్సింహులు కేసును తన చేతిలోకి తీసుకొని గేదెల దొంగతనం చేసిన రాజు, కొనుగోలు చేసిన సయ్యద్ నజీర్, ఖలీద్, హర్షద్‌లను పోలీసులకు స్టేషన్‌కు తీసుకొచ్చి బెదింపులకు దిగాడు. ముగ్గురిపైన కేసులు, సేక్షన్‌న్లు నమోదుచేసి ఇబ్బందులకు గురి చేస్తానని బెదిరించాడు. అడిగినవన్నీ డబ్బులు ఇవ్వకపోతే ఇబ్బందులు తప్పవని, బెయిల్ రాకుండా చేస్తానని హెచ్చరించాడు. దీంతో భయపడిపోయిన గేదెల వ్యాపారి సయ్యద్ నజీర్.. ఎస్సై లక్ష రూపాయలు డిమాండ్ చేస్తే రూ. 60 వేలు ఇచ్చాడు. చోరీ కేసులో ఉన్న మరో గేదెల వ్యాపారి హర్షద్‌ను రూ. 1.10 లక్షలు ఇస్తే నామమాత్రం కేసులు పెట్టి వదిలేస్తానని, ఇవ్వకపోతే పెద్దకేసులు పెట్టి జైలుకు పంపుతానని బెదిరించడంతో అంత డబ్బులు తాను ఇవ్వలేను రూ. 80 వేల రూపాయాలు ఇస్తానని.. తనను తప్పించండి సార్ అని బతిమాలాడుకున్నాడు. గురువారం పోలీస్ స్టేషన్ వచ్చి నేరుగా మీకే డబ్బులు ఇస్తానని ఎస్ఐకి చెప్పాడు. తనను ఇబ్బందులకు గురిచేస్తున్న లంచగొండి ఎస్ఐ నర్సింహులును ఏసీబీ అధికారులకు పట్టించి తగిన బుద్ధి చెప్పాలని హర్షద్ నిర్ణయించుకున్నాడు. గురువారం ఉదయం నాంపల్లిలో ఉన్న ఏసీబీ అధికారులను హర్షద్ ఆశ్రయించడంతో ఏసీబీ అధికారులు ముందుగానే ప్రణాళిక వేసుకొని హర్షద్ చేతికి కెమికల్ రుద్దిన రెండు వేలనోట్లతో కూడిన రూ. 80 వేలు ఇచ్చి ఎస్ఐ నర్సింహులు వద్దకు పంపారు. ఎస్ఐ నర్సింహులు హర్షద్ వద్ద నుండి రూ. 80 వేల లంచం తీసుకుంటుండగా పోలీస్‌స్టేషన్‌లో ఏసీబీ అధికారులు రెడ్‌హ్యండెడ్‌గా ఎస్ఐ నర్సింహులు , డబ్బులను పట్టుకున్నారు. -
ఔటర్‌పై కారు బోల్తా: ఇద్దరు మృతి
మహేశ్వరం: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుగూడ ఔటర్ రింగ్ ఎగ్జిట్ 14 రోడ్డుపై కారు బోల్తాపడి ఇద్దరు మృతి చెందారు. శంషాబాద్ నుండి పెద్ద అంబర్పేట్ వెళ్తున్న ఏపీ 16బీబీ 3888 నంబరు గల కారుఅదుపు తప్పి బోల్తా కొట్టింది. ఈ సంఘటనలో అరుణ్ కుమార్, సాయి మృతిచెందగా మరో ఇద్దరు గాయపడ్డారు. అతి వేగంతోనే ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. మృతులు విజయవాడకు చెందిన వారుగా తెలుస్తోంది. ప్రమాదంలో కారు నుజునుజ్జు అయింది. -
విద్యాభివృద్ధికి కృషి
మహేశ్వరం: విద్యాభివృద్దికి తమ వంతు కృషి చేస్తానని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత, ప్రాథమిక పాఠశాలలో ఎంపీ నిధులు రూ.2.50 లక్షల నిధులతో మినరల్ వాటర్ ఫిల్టర్లను ఆయన స్థానిక ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం విద్యాభివృద్ధికి కృషి చేస్తుందన్నారు. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అందించేందుకు సీఎం కేసీఆర్ పని చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించేందుకు ఎంపీ నిధులను వెచ్చించి పలు అభివృద్ది కార్యక్రమాలు చేపడతానని విశ్వేశ్వర్‌రెడ్డి చెప్పారు. నేడు ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో ఉచితంగా మధ్యాహ్న భోజనం, రోజూ గుడ్డు, ఉచితంగా ఆరోగ్య పరీక్షలు, పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు స్కాలర్షిప్లు, ఉచితంగా రెండు జతల యూనిఫామ్స్, పుస్తకాలు, నోట్ బుక్స్ అందిస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి వాటి బలోపేతానికి కృషి చేయాలని కోరారు. అంతకు ముందు ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి శారద ఒకేషనల్ కాలేజీలో స్పోకేన్ ఇంగ్లీష్ క్లాసులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు నేనావత్ ఈశ్వర్ నాయక్, వైస్ ఎంపీపీ మునగపాటి స్వప్ననవీన్, సర్పంచ్ ఆనందం, ఉప సర్పంచ్ రాములు, పలువురు నాయకులు పాల్గొన్నారు. -
ఔటర్ లో రోడ్డు ప్రమాదం: ఒకరి మృతి
మహేశ్వరం: ఔటర్ రింగు రోడ్డుపై ఆదివారం అర్ధరాత్రి జరిగిన ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిరాల వద్ద ఈ ఘటన జరిగింది. ఆగి ఉన్న డీసీఎం వాహనాన్ని వెనుక నుంచి అతి వేగంగా వచ్చిన లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో క్లీనర్ అఫ్రోజ్ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. లారీ, డీసీఎంల డ్రైవర్లకు తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. -
ఏసీబీకి చిక్కిన జూనియర్ లైన్‌మన్
మహేశ్వరం (రంగారెడ్డి జిల్లా) : ఓ వ్యక్తి నుంచి రూ.6 వేలు లంచం తీసుకుంటూ జూనియర్ లైన్‌మన్ లింగరాజు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. మహేశ్వరం మండలం తుక్కుగూడ ఏఈ కార్యాలయంలో మంగళవారం ఓ వ్యక్తి వద్ద నుంచి డబ్బులు తీసుకుంటూ పట్టుబడ్డాడు. ఏసీబీ అధికారులు డబ్బులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
అదుపు తప్పిన బస్సు: 10 మందికి గాయాలు
రంగారెడ్డి: ఆర్టీసీ బస్సు ప్రమాదాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. తాజాగా గురువారం రాత్రి రంగారెడ్డి జిల్లా మహేశ్వరం వద్ద బస్సు అదుపుతప్పి గుంతలోకి దూసుకెళ్లింది. కల్వకుర్తి నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ఘటన జరిగింది. అటుగా వస్తున్న బైకును తప్పించబోయి బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో దాదాపు 10 మంది దాకా గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
తీగల ఇంటి ముందు టీడీపీ ఆందోళన
మహేశ్వరం: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ఇంటి ముందు టీడీపీ వర్గీయులు ఆందోళనకు దిగారు. నియోజకవర్గ ఇన్చార్జ్ వీరేందర్‌గౌడ్ ఆధ్వర్యంలో నేతలు, కార్యకర్తలు శుక్రవారం ఉదయం మీర్పేట్లోని ఆయన నివాసం వద్దకు వెళ్లి ఆందోళన చేపట్టారు. టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీచేసి టీఆర్ఎస్లోకి వెళ్లినందున తీగల తన పదవికి రాజీనామా చేయాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. -
ప్రైవేటు బస్సు, ట్యాంకర్ ఢీ.. ఆరుగురు మృతి
మహేశ్వరం: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల రావిరాల వద్ద ఘోరరోడ్డు ప్రమాదం ఆదివారం జరిగింది. ఓ ప్రైవేటు బస్సు, ఆయిల్ ట్యాంకర్ ఢీకొన్నాయి. ఆదివారం జరిగిన ఈ ఘటనలో ఆరుగురు మృతిచెందారు. ఘటన ఎలా జరిగింది, మృతుల పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు. -
కంపెనీలు స్థాపించకుంటే భూములు వెనక్కి
మహేశ్వరం: టీఎస్ఐఐసీ ద్వారా పొందిన భూముల్లో కంపెనీలు స్థాపించకుంటే ఆ స్థలాలను వెనక్కి తీసుకుంటామని జాయింట్ కలెక్టర్ చంపాలాల్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన మండల పరిధిలోని రావిర్యాల, కొంగరఖుర్దు, రాజీవ్ జేమ్స్‌పార్కు, గంగారం, నాగారం గ్రామాల్లోని ప్రభుత్వ భూములను పరిశిలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీఎస్ఐఐసీ ద్వారా తీసుకున్న భూముల్లో కంపెనీలు స్థాపించకుంటే ఆ భూములను వెనక్కి తీసుకొని ఇతర పరిశ్రమలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. రావిర్యాల రెవెన్యూ పరిధిలోని రాజీవ్ జేమ్స్‌పార్కులో ఖాళీగా ఉన్న భూములను పరిశీలించి కంపెనీలు ఎందుకు స్థాపించడం లేదంటూ జేమ్స్‌పార్కు అధికారులను ప్రశ్నించారు. అయితే ప్రస్తుతం డైమండ్ కంపెనీలు తీవ్ర నష్టాల్లో ఉన్నాయని, అందుకే కొత్త కంపెనీలే స్థాపించడానికి ఎవరూ ముందుకు రావడం లేదన్నారు. మహేశ్వరంలో మరిన్ని పరిశ్రమలు రానున్న రోజుల్లో మహేశ్వరం, రావిర్యాల, శ్రీనగర్, గంగారం, నాగారం గ్రామాల్లో భారీ పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయని జేసీ పేర్కొన్నారు. ఇటీవల గంగారం గ్రామం సర్వే నెంబరు 181లో సుమారు 100 ఎకరాల ప్రభుత్వ భూమిని ఇండియన్ ఆయిల్ కంపెనీ ప్రతినిధులు పరిశీలించినట్లు చెప్పారు. రావిర్యాల, కొంగర ఖుర్దు , నాగారం గ్రామాల్లో కంపెనీలు స్థాపించడానికి పలు ఐటీ, సాప్ట్వేర్ కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయన్నారు. కొంగరఖుర్దు సర్వే నెం-289లో సుమారు 55 ఎకరాలు, గంగారం సర్వే నెంబరు 181లో సుమారు 120 ఎకరాలు, నాగారంలో సర్వే నెంబరు 181లో 45 ఎకరాల ప్రభుత్వ భూమిని జేసీ పరిశీలించారు. చెరువుల ఆక్రమణకు పాల్పడితే ఎంతటివారైనా ఉపేక్షించేది లేదన్నారు. జేసీ వెంట తహసీల్దార్ కె. గోపీరామ్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ మహ్మద్ రఫీ తదితరులున్నారు. -
మహేశ్వరంలో కాంగ్రెస్ అభ్యర్థిగానే మల్రెడ్డి
తెలంగాణ ప్రాంతంలో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. అయినా.. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో మాత్రం మల్రెడ్డి రంగారెడ్డి తన నామినేషన్‌ను ఉపసంహరించుకోలేదు. పొత్తులో భాగంగా సీపీఐకి ఈ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ కేటాయించింది. అయితే, మాజీ హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి పట్టుబట్టి మరీ మల్‌రెడ్డితో నామినేషన్ దాఖలు చేయించారు. టీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య తదితరులు ఆయనకు షరతులతో కూడిన బీఫారం ఇచ్చి, అధికారిక కాంగ్రెస్ అభ్యర్థిగా చేసేశారు. తర్వాత సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణతో చర్చలు జరిపిన తర్వాత మల్‌రెడ్డిని నామినేషన్ ఉపసంహరించుకోవాలని కోరినా, ఆయన నిరాకరించారు. బీఫారం చేతిలో ఉండటంతో ఆయన ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థిగానే పోటీలో ఉన్నట్లయింది. సీపీఐ అభ్యర్థి ఇప్పుడు ఇతర పార్టీల అభ్యర్థులతో పాటు కాంగ్రెస్ అభ్యర్థి మల్రెడ్డి రంగారెడ్డితో కూడా పోటీ పడాల్సి వస్తోంది. -
మహేశ్వరంలో విజయం నాదే
మహేశ్వరం,న్యూస్ లైన్: మాజీ హోంమంత్రి సబితాఇంద్రారెడ్డితో పాటు ఎవరు ఈ నియోజకవర్గం నుండి పోటీ చేసిన తన చేతిలో చిత్తుగా ఓడిపోవడం ఖాయమని నగర మాజీ మేయర్, టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి తీగల కృష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో టీడీపీ అభ్యర్థిగా మొదటి సెట్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా శివగంగ ఆలయం ఆవరణంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... టీడీపీ ప్రభంజనాన్ని అపడం ఎవరి తరం కాదని అన్నారు. గత ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో సబితాఇంద్రారెడ్డిపై ఓటమి చెందానని, ఈ సారి పోటీలో ఎవరు దిగినా 25 వేల మెజార్టీతో గెలుపొందుతానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మహేశ్వరం నియోజకవర్గంలో టీడీపీ క్యాడర్ బలంగా ఉందని, ఈ సీటును బీజేపీకి ఇచ్చే ప్రసక్తే లేదని అన్నారు. మహేశ్వరం సీటు పొత్తులో భాంగంగా బీజేపీకి ఇస్తారని వస్తున్న వదంతులు నమ్మెద్దని కార్యకర్తలకు సూచించారు. కాంగ్రెస్ పార్టీ అవినీతిలో కూరుకుపోయిందని అన్నారు. సబితా ఇంద్రారెడ్డి, జైపాల్‌రెడ్డిలు ఈసారి ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోవడం ఖాయమని పేర్కొన్నారు. ఈ నెల 9న భారీ ర్యాలీగా వచ్చి అధికారికంగా నామినేషన్ వేస్తామని తెలిపారు. తీగల వెంట టీడీపీ సీనియర్ నాయకులు కూన యాదయ్య, లక్ష్మి నర్సింహ్మరెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడ్మ మోహన్‌రెడ్డి, జెడ్పీటీసీ అభ్యర్థి అంగోత్ కృష్ణా నాయక్, కందుకూరు, సరూర్‌నగర్ మండలాల పార్టీ అధ్యక్షుడు పొట్టి ఆనంద్, అమర్నాధ్రెడ్డి, పార్టీ నాయకులు బి.వెంకట్‌రెడ్డి, అంజయ్యగౌడ్, ఎర్ర సత్తయ్య, జంగయ్య, పబ్బ బాల్‌రాజ్, మహేశ్వరం, కందుకూరు, సరూర్‌నగర్, సరూర్‌నగర్ డివిజన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
'మహేశ్వరం నుంచే... ఆందోళన వద్దు'
-
'మహేశ్వరం నుంచే... ఆందోళన వద్దు'
హైదరాబాద్ : కార్యకర్తల అభీష్టం మేరకు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నుంచే పోటీ చేస్తానని మాజీమంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఈ విషయంలో కార్యకర్తలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆమె అన్నారు. పొత్తుల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ మహేశ్వరం సీటును సీపీఐకి కేటాయించటంపై కార్యకర్తలు గురువారం సబితా ఇంద్రారెడ్డి నివాసం వద్ద ఆందోళనకు దిగారు. మహేశ్వరం నుంచే పోటీ చేసే విషయంలో అధిష్టానంతో మాట్లాడతానని సబితా ఈ సందర్భంగా కార్యకర్తలకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. ఇంతలో ఓ కార్యకర్త వంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకునేందుకు యత్నించగా, ఆ ప్రయత్నాన్ని సహచర కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. -
ఔటర్‌పై మృత్యుఘోష!
మహేశ్వరం, న్యూస్‌లైన్: తెలతెల్లవారుతోంది.. తీవ్రంగా మంచు కురుస్తోంది. మహారాష్ట్ర నుంచి తిరుపతి వెళ్తున్న ఓ వాహనం ఔటర్‌పైకి దూసుకొచ్చింది. అందులో మొత్తం తొమ్మిది మంది ఉన్నారు. వీరంతా బంధువులు. గురువారమే బాంద్రా జిల్లా తిరోడా తాలుకా భూత్నాథ్ నుంచి బయల్దేరిన వీరు శుక్రవారం తెల్లవారు జామున ఔటర్‌పైకి చేరుకున్నారు. ముంబై జాతీయ రహదారిలో వచ్చిన వీరి వాహనం పటాన్చెరు వద్ద ఔటర్ రింగు రోడ్డు ఎక్కింది. శంషాబాద్‌లో ఔటర్ దిగి బెంగళూరు హైవే మీదుగా వెళ్లాల్సి ఉంది. కానీ పొరపాటున ఔటర్‌రింగ్ రోడ్డు మీదుగా అలాగే ముందుకు దాదాపు 15కిలోమీటర్లు వచ్చేశారు. తుక్కుగూడ దగ్గర ఔటర్ దిగే వీలున్నా వీరు చూసుకోలేదు. ఈ క్రమంలోనే వేగంగా వెళ్తున్న వీరి వాహనం తుక్కుగూడ - రావిర్యాల మధ్యలో ఆగిఉన్న లారీని వెనుకనుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్కార్పియోలో ఉన్న విద్యా యోగేందర్ కట్రే(30), భరత్ బగులై(58), పైరన్బాయి పట్లే(60), వచ్చాల్లా బాయి సురుగురే(55), దీనూ బాయి(60) అక్కడికక్కడే దుర్మరణం చెందారు. గాయపడిన వారిలో యోగేందర్, ప్రభాబాయి, సుఖ్‌దేవ్‌తోపాటు డ్రైవర్ మనోజ్ ఉన్నారు. వీరిలో యోగేందర్, విద్యా యోగేందర్ కట్రేలు దంపతులు. యోగేందర్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ నేత, ఏపీఎంసీ చైర్మన్‌గా ఉన్నారు. ఈ ప్రమాదంలో వాహనం ముందుభాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. క్షతగాత్రులను సాగర్ రింగు రోడ్డులోని మెడికేర్ ఆస్పత్రికి తరలించారు. ప్రమాద విషయం తెలిసి శంషాబాద్ ఏసీపీ భద్రేశ్వర్, పహాడీషరీఫ్ పోలీసులు, తుక్కుగూడ, రావిర్యాల గ్రామస్తులు పెద్ద సంఖ్యలో ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నగరంలోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పొగమంచే ప్రాణాలు తీసిందా? శుక్రవారం తెల్లవారుజామున తీవ్రంగా పొగమంచు ఉంది. రోడ్డుపై మంచు కమ్ముకోవడంతో ప్రమాదం జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నా రు. టయోటా ఏరియా వాహనం డ్రైవర్ నిద్ర మత్తులో ఉండడంతో కూడా ప్రమాదం జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. అదే విధంగా ఔటర్ రింగ్ రోడ్డుపై సరైన సూచిక బోర్టులు లేవు. దీంతోనే తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. రోడ్డు ఎక్కాల్సిన, దిగాల్సిన చోట బోర్డులు ఏర్పాటు చేయలేదు. దీంతో వాహనదారులు గందరగోళానికి గురవుతున్నారు.