
తీగల ఇంటి ముందు టీడీపీ ఆందోళన
మహేశ్వరం: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ఇంటి ముందు టీడీపీ వర్గీయులు ఆందోళనకు దిగారు. నియోజకవర్గ ఇన్‌చార్జ్ వీరేందర్‌గౌడ్ ఆధ్వర్యంలో నేతలు, కార్యకర్తలు శుక్రవారం ఉదయం మీర్‌పేట్‌లోని ఆయన నివాసం వద్దకు వెళ్లి ఆందోళన చేపట్టారు. టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీచేసి టీఆర్‌ఎస్‌లోకి వెళ్లినందున తీగల తన పదవికి రాజీనామా చేయాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు.