teegala krishna reddy
-
కారు దిగిన రంగారెడ్డి జెడ్పీ చైర్పర్సన్
మీర్‌పేట, సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి బీఆర్ఎస్కు గుడ్‌బై చెప్పా రు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. సోమవారం గాంధీ భవ న్లో కాంగ్రెస్ వ్యవహా రాల రాష్ట్ర ఇన్చార్జి దీపాదాస్ మున్షీ సమక్షంలో ఆ పార్టీలో చేరనున్నట్టు అనితారెడ్డి, తీగల కృష్ణారెడ్డి ప్రకటించారు. మీర్‌పేటలోని టీకేఆర్ కళాశాలలో ఆదివారం మీడియాతో జెడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి మాట్లాడారు. స్థానిక సంస్థలను బలోపేతం చేయడంలో బీఆర్ఎస్ పూర్తిగా విఫలమైందనీ, ఫలితంగానే ఇటీవల ఎన్నికల్లో పార్టీ ఓటమిపాలైందన్నారు. స్థానిక సంస్థల పరిస్థితిని సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా నిధులు సమకూర్చడంతో పాటు అధికారాలు ఇస్తామని హామీ ఇచ్చారని ఆమె తెలిపారు.సహకరించినా ప్రాధాన్యత ఇవ్వలేదు: మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. నగర మేయర్‌గా, ఎమ్మెల్యేగా, హుడా చైర్మన్‌గా దశాబ్దాల పా టు సేవ చేశానన్నారు. తన ఓటమి తరువాత కాంగ్రెస్‌లో గెలిచిన వారికి బీఆర్ ఎస్‌లో మంత్రి పదవి ఇచ్చారని, అయినా పార్టీకి సహకరించినా ప్రాధాన్యత ఇవ్వలేదన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి, తాను గతంలో కలిసి పనిచేశామని.. ఆయన పిలుపు మేరకే కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్టు తెలిపారు. -
సబితతో సవాలే.. ‘ఢీ’ కొట్టగలరా?
రంగారెడ్డి: మహేశ్వరంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి‘హస్త’వ్యస్తంగా తయారైంది. క్షేత్రస్థాయిలో పార్టీకి బలమైన కేడర్ ఉన్నప్పటికీ.. ఇక్కడి నేతల ‘చేతులు’ మాత్రం కలవడం లేదు. ఎవరికి వారే ప్రత్యేక ఎ‘జెండా’తో ముందుకు సాగడంపై పార్టీ కార్యకర్తల్లో అయోమయం నెలకొంది. ఒకవైపు కొత్తగా వలసలు.. ఏళ్లుగా నియోజకవర్గాన్ని నమ్ము కుని పని చేస్తున్న లీడర్లకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుండగా.. మరోవైపు నేతల మధ్య నెలకొన్న అంతర్గత విభేదాలతో గందరగోళం నెలకొంది. సంక్షోభ సమయంలో పార్టీకి పెద్ద దిక్కుగా.. కార్యకర్తలకు అండగా నిలబడి.. ఎప్పటికప్పుడు కార్యక్రమాలు నిర్వహిస్తూ.. ఆర్థికంగా ఖర్చులు భరిస్తూ పార్టీని బలోపేతం చేస్తే.. తీరా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత తమను కాదని, కొత్త నేతలకు టికెట్ కట్టబెడితే తమ రాజకీయ భవితవ్యం ఏమిటనే భావన ఆ పార్టీ నేతలను వేధిస్తోంది. తమదైన ముద్ర వేసేందుకు.. డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి వచ్చే ఎన్ని కల్లో ఈ నియోజకవర్గం నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావిస్తున్నారు. ఆయన మీర్పేట్, జిల్లెలగూడ, చంపాపేట్‌లో తరచూ పర్యటిస్తున్నారు. ఆయా కేంద్రాలుగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఆర్కేపురం నుంచి కార్పొరేటర్‌గా పని చేసిన అనుభవం ఉన్న పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి దేప భాస్కర్‌రెడ్డి నిత్యం ప్రజల మధ్యే ఉంటున్నారు. పార్టీ నుంచి ఈసారి ఎమ్మెల్యే టికెట్ తనకే లభిస్తుందని చెబుతున్నారు. ఈయనకు జీహెచ్ఎంసీ పరిధిలోని ఆర్కేపురం, సరూర్‌నగర్ డివిజన్లతో పాటు మహేశ్వరం మండలంపై కొంత పట్టుంది. రాజకీయంగా మంత్రి సబితతో విభేదించి ఏడాది క్రితం బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్‌లో చేరిన బడంగ్పేట్ మేయర్ చిగురింత పారిజాత నర్సింహారెడ్డి దంపతులు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నారు. బడంగ్పేట్, బాలాపూర్, జల్పల్లి కేంద్రంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ తరఫున పోటీచేసి ఓటమిపాలైన కొత్త మనోహర్‌రెడ్డి సైతం ఇటీవల ఆ పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. ఆయన పదేళ్లుగా కేఎంఆర్ ట్రస్ట్ పేరుతో పుస్తెమెట్టెలు, నూతన వస్త్రాల పంపిణీ, పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ పేరుతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వర్గంగా గుర్తింపు పొందిన ఆయన కూడా ఈసారి టికెట్ తనకే వస్తుందని చెబుతున్నారు. గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఎల్మటి అమరేందర్‌రెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు ఏనుగు జంగారెడ్డి సైతం పోటీకి సై అంటున్నారు. ఊగిసలాటలో తీగల గతంలో హైదరాబాద్ మేయర్‌గా, మహేశ్వరం ఎమ్మెల్యేగా పని చేసిన బీఆర్ఎస్ నేత తీగల కృష్ణారెడ్డి తన రాజకీయ భవితవ్యంపై ఎటూ తేల్చుకోలేకపోతున్నారు.అధికార బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఇప్పటికే కేడర్‌కు సంకేతాలు ఇచ్చినప్పటికీ.. ఆయన నిర్ణయాన్ని ఇటు హస్తం పార్టీ స్థానిక నేతలే కాదు.. స్వయంగా కుటుంబ సభ్యులు సైతం వ్యతిరేకిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఆయన కోడలు, జెడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి కూడా అధికార బీఆర్ఎస్ పార్టీని వీడి ఆయనతో కలిసి వెళ్లేందుకు సుముఖంగా లేనట్లు సమాచారం. సబితతో సవాలే.. నియోజకవర్గాల పునర్వీభజనలో భాగంగా 2009లో మహేశ్వరం నియోజకవర్గం ఏర్పాటైంది. తొలిసారిగా జరిగిన ఎన్నికల్లో పటోళ్ల సబితారెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి విజయం సాఽధించారు. 2009లో మొత్తం 2,86,974 ఓట్లు ఉండగా, 1,74,911 పోలయ్యాయి. టీడీపీ నుంచి పోటీ చేసిన తీగల కృష్ణారెడ్డికి 57,244 పోలవగా, సబిత 65,077 ఓట్లతో విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో 4,03,719 ఓట్లకు, 2,17, 299 పోలయ్యాయి. టీఆర్ఎస్ అభ్యర్థి కొత్త మనోహర్‌రెడ్డికి 42,517 ఓట్లు పోలవగా, కాంగ్రెస్ అభ్యర్థి మల్రెడ్డి రంగారెడ్డికి 62,521 పోలయ్యాయి. టీడీపీ అభ్యర్థి తీగల కృష్ణారెడ్డి 93,305 ఓట్లతో విజయం సాధించారు. 2018లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అందెల శ్రీరాములు 39,445 ఓట్లు (16.84 శాతం) సాధించగా, బీఆర్ఎస్ అభ్యర్థి తీగల కృష్ణారెడ్డి 86,254 ఓట్లు (36.82 శాతం) సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి సబితారెడ్డి 95,481 ఓట్లతో(40.76 శాతం) విజయం సాధించారు. అనంతరం చోటు చేసుకున్న రాజకీయ సమీకరణాల్లో భాగంగా ఆమె కాంగ్రెస్‌ను వీడి.. అధికార బీఆర్ఎస్లో చేరారు. ప్రస్తుతం జిల్లా నుంచి రాష్ట్ర కేబినేట్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రభుత్వం నుంచి నియోజకవర్గానికి భారీగా నిధులు తెప్పించి, అభివృద్ధి, సంక్షేమ పథకాల్లో ముందున్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్న ఆమెను వచ్చే ఎన్నికల్లో ‘ఢీ’ కొట్టడం కాంగ్రెస్‌కు అంత సులువు కాదనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. -
బీఆర్ఎస్కు షాక్.. కాంగ్రెస్‌లోకి మాజీ ఎమ్మెల్యే!
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేల రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలన్నీ వ్యూహాలకు పదును పెట్టాయి. పోటాపోటీగా విమర్శలు, ప్రతి విమర్శలతో దాడికి దిగుతున్నాయి. మరోవైపు పలు పార్టీల్లోని అసంతృప్తి వాదులు మెల్లమెల్లగా బయటకు వస్తున్నారు. ఎన్నికల్లో టికెట్ దక్కదని భావిస్తున్న నేతలు ఇప్పటి నుంచే పార్టీలు జంప్ అవుతున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే పార్టీ అధిష్టానంపై అసంతృప్తితో రగులుతున్న మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి పార్టీ మారబోతున్నారు. ఆయన కోడలు, రంగారెడ్డి జడ్పీ చైర్ పర్సన్ అనితారెడ్డితో కలిసి కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు మంగళవారం ఏఐసీసీ ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిలతో తీగల కృష్ణారెడ్డి, అనితా రెడ్డిలు రహస్యంగా సమావేశమైనట్టు తెలుస్తోంది. ఈ మేరకు వీరిద్దరూ త్వరలోనే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవాలని నిర్ణయించుకున్నట్టు మంగళవారం వార్తలు వెలువడ్డాయి. చదవండి: మా నాన్న మంచోడు కాదు.. ముత్తిరెడ్డికి కూతురు షాక్ మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, ఆయన కోడలు అనితారెడ్డి టీడీపీ నుంచి ప్రస్థానం తెలుగుదేశం పార్టీతో తన రాజకీయ ప్రయాణం ప్రారంభించిన తీగల కృష్ణారెడ్డి.. హైదరాబాద్ మేయర్‌గా పనిచేశారు. అనంతరం హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (హుడా) ఛైర్మన్‌గా పనిచేశారు. 2009లో మహేశ్వరం నియోజకవర్గం ఏర్పడినప్పుడు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి సబితా ఇంద్రారెడ్డి చేతిలో ఓటమి చెందారు. 2014లో టీడీపీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. అనంతరం టీఆర్ఎస్లో (ఇప్పటి బీఆర్ఎస్) చేరారు. 2018లో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగిన సబితా ఇంద్రారెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు. అనంతరం సబితా ఇంద్రారెడ్డి బీఆర్ఎస్లో చేరి మంత్రి అయ్యారు. అయితే సబితా ఇంద్రారెడ్డి, తీగల కృష్ణారెడ్డి మహేశ్వరం నియోజకవర్గం నుంచే ఉండటంతో వీరి మధ్య ఆధిపత్య పోరు నెలకొంది. ఈ క్రమంలో పార్టీ తనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని గత కొంతకాలంగా తీగల కృష్ణారెడ్డి అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తనకు మహేశ్వరం టికెట్ ఇవ్వకుంటే కారు దిగడం ఖాయమని ఎప్పుడో హెచ్చరించినా బీఆర్ఎస్ నుంచి ఎలాంటి హామీ దక్కకపోవడం, సిట్టింగ్‌లకే టికెట్ ఇస్తామని కేసీఆర్ చెప్పడంతో పార్టీకి వ్యతిరేకంగా అసమ్మతి గళం వినిపిస్తూ వస్తున్నారు. దీంతో అప్పట్లోనే ఆయన పార్టీ మారబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఇక ఇటీవల మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు కాంగ్రెస్ గూటికి చేరిపోవడంతో.. అదే దారిలో వెళ్లేందుకు తీగల నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. -
‘కేసీఆర్ సమకాలీకుడ్ని.. నాకే టికెట్ ఇవ్వరా?’
సాక్షి, రంగారెడ్డి: ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ.. రాజకీయ అసంతృప్తులు ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు. తాజాగా.. మహేశ్వరం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, హైదరాబాద్ మాజీ మేయర్, బీఆర్ఎస్ లీడర్ తీగల కృష్ణారెడ్డి పార్టీ అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. వచ్చే ఎన్నికల్లో తనకు మహేశ్వరం టికెట్ ఇవ్వకుంటే గనుక బీఆర్ఎస్ను వీడడం ఖాయమని స్పష్టంచేశారాయన. మా కోడలు అనితారెడ్డి రంగారెడ్డి జడ్పీ ఛైర్‌పర్సన్‌గా ఉంది. అందుకే ఒకే ఇంట్లో రెండు పదవులు కుదరవన్నట్లు మాట్లాడుతున్నారు. తిరిగి మేం కూడా విమర్శిస్తే బాగుండదు. కాంగ్రెస్ నుంచి గెలిచిన సబితారెడ్డిని పార్టీలోకి తీసుకొని సీఎం కేసీఆర్ తప్పుచేశారు. నేను కేసీఆర్‌తో సమానంగా రాజకీయాల్లో ఉన్నా. .. ఉద్యమంలో పనిచేసిన సీనియర్ నాయకులు చాలామంది పార్టీని వీడుతున్నారు. వారందర్నీ పిలిపించి మాట్లాడాలి. లేకుంటే మేం కూడా మా దారి మేం చూసుకుంటాం అని టీకేఆర్ స్పష్టం చేశారు. అలాగే.. కాంగ్రెస్‌గానీ, మరేయితర పార్టీ నుంచిగానీ ఆహ్వానం అందిందా? అనే ప్రశ్నకు.. ఎవరూ సంప్రదించలేదని తెలిపారాయన. ఇదీ చదవండి: బీఆర్ఎస్కి కొత్త గుబులు -
బీఆర్ఎస్లో తారాస్థాయికి విభేదాలు .. రాజకీయం.. రసకందాయం
‘ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవు’ అనే నానుడి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా రాజకీయాలకు అతికినట్టు సరిపోతుంది. కొత్త, పాతల మధ్య కుదిరిన సయోధ్య చెదరడంతో భవిష్యత్తు రాజకీయం రసకందాయంగా మారనుంది. రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ జిల్లాల్లోని కీలక నాయకుల అంతర్గత కుమ్ములాటలు, ధిక్కార స్వరాలు క్రమక్రమంగా రాజకీయాన్ని వేడెక్కిస్తున్నాయి. నాయకుల వైఖరి అధిష్టానానికి తలనొప్పిగా మారుతోంది. సాక్షి, రంగారెడ్డి: జిల్లా రాజకీయాలను శాసించే మహేశ్వరం, తాండూరు, మేడ్చల్ నియోజకవర్గాల్లో పార్టీ వ్యవహారాలు రోజురోజుకూ ముదిరి పాకాన పడుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అసంతృప్తి మరింత పెరిగేలా పరిణామాలు కనిపిస్తున్నాయి. మహేశ్వరంలో విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి, తీగల కృష్ణారెడ్డి, తాండూరులో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ పట్నంమహేందర్రెడ్డి, మేడ్చల్‌లో కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి మధ్య చాలాకాలంగా విభేదాలు నివురుగప్పిన నిప్పులా ఉన్నాయి. అవి మెల్లమెల్లగా రాజుకుంటూ ఆసక్తికరంగా మారుతున్నాయి. పార్టీ ఒకటే అయినా వైరివర్గం ఆధిపత్యం మింగుడుపడక అధిష్టానంతో తాడోపేడో తేల్చుకోవాలనే భావనలో అసంతృప్త నేతలు ఉన్నారు. తమ కుటుంబ సభ్యులు జిల్లా పరిషత్ పీఠాలపై కూర్చున్నా సరే ప్రత్యర్థుల పెత్తనాన్ని ఒప్పుకొనేది లేదని తెగేసి చెబుతూ తిరుగుబాటుకు సిద్ధపడుతుండడం గమనార్హం. పైలెట్‌తో పట్నం ఢీ గత ఎన్నికల్లో తాండూరు నుంచి పోటీ చేసిన మాజీ మంత్రి మహేందర్‌రెడ్డి సమీప కాంగ్రెస్ ప్రత్యర్థి పైలెట్ రోహిత్‌రెడ్డి చేతిలో అనూహ్య ఓటమిని చవిచూశారు. తర్వాత తన సోదరుడి రాజీనామాతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ పదవిని దక్కించుకోవడంతో సంతృప్తి పడ్డారు. అనంతరం జెడ్పీ ఎన్నికలు రావడంతో సారథిగా సతీమణి సునీతను గెలిపించుకోవడం ద్వారా వికారాబాద్ జిల్లాలో తన రాజకీయ పలుకుబడి తగ్గలేదని నిరూపించుకున్నారు. అయితే, తనను ఓడించిన పైలెట్‌ను అధిష్టానం అక్కున చేర్చుకోవడంతో డీలా పడ్డారు. ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు రెండువర్గాలు విడిపోవడంతో గులాబీ శిబిరంలో లుకలుకలు మొదలయ్యాయి. వీరి ఆధిపత్యపోరులో శ్రేణులు కూడా చీలిపోవడం.. ప్రొటోకాల్ సమస్యలతో తాండూరు రాజకీయ రంజుగా మారింది. ఎమ్మెల్యేలకు ఎర కేసుతో ప్రగతిభవన్‌కు దగ్గరయిన పైలెట్ మెడకు ఈడీ కేసు బిగుసుకుంటుందని.. తద్వారా వచ్చే ఎన్నికల్లో టికెట్ ఖాయమనే ధీమాలో పట్నం వర్గీయులు ఉన్నారు. రోహిత్ మాత్రం తన కెరీర్‌ను ఫణంగా పెట్టి బీజేపీపై కేసీఆర్‌కు పోరాటాస్త్రం అందించానని, ఈ సారి గులాబీ బీఫారం తనదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న రాజకీయ సమీకరణలకు అనుగుణంగా అడుగువేయాలని భావిస్తున్న పట్నం అవసరమైతే కండువా మార్చయినా జిల్లా రాజకీయాలపై మళ్లీ పట్టు సాధించాలనే కృతనిశ్చయంతో ఉన్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. సబిత వర్సెస్ తీగల మహేశ్వరంలో మంత్రి సబిత, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డికి పొసగడం లేదు. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన తీగలపై సబిత విజయం సాధించారు. అనంతరం జరిగిన పరిణామాలతో ఆమె కాంగ్రెస్‌ను వీడి గులాబీ గూటికి చేరి కేబినెట్లో బెర్త్ దక్కించుకున్నారు. అప్పటి నుంచి కినుక వహించిన కృష్ణారెడ్డి పలుమార్లు మంత్రి వ్యవహారశైలిని తప్పుబడుతూ వస్తున్నారు. అసంతృప్తిని చల్లార్చేందుకు అధిష్టానం.. ఆయన కోడలు అనితారెడ్డిని జెడ్పీ చైర్‌పర్సన్‌గా నియమించింది. దీంతో కొన్నాళ్లు గుంభనంగా వ్యవహరించిన కృష్ణారెడ్డి తిరిగి మంత్రిపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. అభివృద్ధి జరగడంలేదని,తన వర్గీయులను అణిచివేస్తున్నారని పెదవి విరుస్తున్నారు. ఎన్నికలకు గడువు సమీపిస్తుండడంతో ఆయన రాజకీయ భవిష్యత్తుపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశముందనే ప్రచారం జరుగుతోంది. సిట్టింగ్‌ను కాదని తనకు టికెట్ ఇచ్చే అవకాశం మృగ్యమనే ప్రచారం నేపథ్యంలో పక్కపారీ్టలవైపు చూస్తున్నారు. మేడ్చల్‌లోనూ సేమ్ సీన్ 2018 ఎన్నికల్లో టికెట్ నిరాకరించడంతో మిన్నకుండిన మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి ఈసారి మాత్రం అధిష్టానంతో చావోరేవో తేల్చుకునేదిశగా అడుగులేస్తున్నారు. మేడ్చల్ ఎమ్మెల్యేగా గెలిచిన చామకూర మల్లారెడ్డి అనూహ్యంగా మంత్రివర్గంలో చోటు సంపాదించారు. ఈ పరిణామం మింగుడుపడని మలిపెద్ది.. తన అనుచరవర్గాన్ని కాపాడుకుంటూ వచ్చారు. ఈ క్రమంలోనే ఆయనను సంతృప్తి పరిచేందుకు కుమారుడు శరత్‌చంద్రారెడ్డికి మేడ్చల్ జెడ్పీ పీఠాన్ని అప్పగించారు. దీంతో కొన్నాళ్లపాటు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. అయితే, సుధీర్‌రెడ్డి వర్గాన్ని టార్గెట్ చేసిన మల్లారెడ్డి.. నెమ్మదిగా అన్ని మండలాల్లో తన ప్రాబల్యాన్ని పెంచుకున్నారు. ఈ పరిణామాలను జీర్ణించుకోని సుధీర్.. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా బరిలో దిగి సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నారు. కుటుంబీకులపై జరిగిన ఐటీ దాడులతో మంత్రి ప్రతిష్ట మసకబారిందని.. ఈసారి తనకు టికెట్ ఖాయమనే భావనలో ఉన్నారు. అధిష్టానం నుంచి రిక్తహస్తం ఎదురైతే ప్రత్యర్థి పార్టీ కండువా కప్పుకొనేందుకు కూడా వెనుకాడరనే ప్రచారం జరుగుతోంది. -
సబిత కబ్జాలను ప్రోత్సహిస్తున్నారు
మీర్‌పేట (హైదరాబాద్)/షాద్‌నగర్: అభివృద్ధి పేరిట మంత్రి సబితారెడ్డి కబ్జాలను ప్రోత్సహిస్తున్నారని, మీర్‌పేట ప్రాంతంలోని చెరువులను నాశనం చేస్తున్నారని టీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ఆరోపించారు. మంత్రాల చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో షాపింగ్ కాంప్లెక్స్ ఎలా నిర్మిస్తారని ప్రశ్నించారు. జిల్లెలగూడ ప్రభుత్వ పాఠశాలలో మంత్రి అనుచరులు షెడ్లు ఎలా నిర్మిస్తారని నిలదీశారు. మంత్రి సబితారెడ్డి వ్యవహారం వల్లే సరూర్‌నగర్, ఆర్కేపురం, తుక్కుగూడ, కందుకూరులో టీఆర్ఎస్ బలహీనపడటంతో పాటు చాలామంది పార్టీని వీడుతున్నారని తెలిపారు. మంత్రి సబితారెడ్డి తమ పార్టీ నుంచి గెలవలేదని, ఆమె తమ ఎమ్మెల్యే కాదంటూ వ్యాఖ్యానించారు. రంగారెడ్డి జిల్లా మీర్‌పేట కార్పొరేషన్ పరిధి మంత్రాల చెరువులోని డీసీఎం అడ్డా వద్ద షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ చెరువుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా మీడియాతో తీగల మాట్లాడారు. పార్టీ మారను: అభివృద్ధి పేరిట కబ్జాలను ప్రోత్సహిస్తున్న మంత్రి చర్యలను ఖండిస్తున్నానని తీగల పేర్కొన్నారు. షాపింగ్ కాంప్లెక్స్ వల్ల ప్రజలకు ఏం ప్రయోజన చేకూరుతుందో చెప్పాలన్నారు. ముందుగా చెరువుకు సంబంధించిన ట్రంక్‌లైన్ పనులు పూర్తి చేయాలని, ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు. చెరువులు కబ్జాకు గురైతే చూస్తూ ఊరుకోనని హెచ్చరించారు. తాను రాజకీయం చేడయం లేదని, పార్టీ మారే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. మీర్‌పేట ప్రాంతంలో జరుగుతున్న పరిణామాలన్నింటినీ సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళతానని చెప్పారు. కృష్ణన్నను తప్పుదోవ పట్టించారు: మంత్రి సబిత తీగల కృష్ణారెడ్డిని ఎవరో తప్పుదోవ పట్టించారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. తన నియోజకవర్గం పరిధిలో భూ కబ్జాలు జరిగి ఉంటే సీఎం కేసీఆర్ చర్యలు తీసుకుంటారని చెప్పారు. షాద్‌నగర్ నియోజకవర్గం నందిగామలో మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడారు. తీగల చేసిన ఆరోపణలను ఖండించారు. ‘కృష్ణన్న నాపై అలా ఎందుకు మాట్లాడారో తెలియదు.. ఎవరో ఆయనను మిస్‌గైడ్ చేసి ఉంటారు’అని వ్యాఖ్యానించారు. చదవండి: (విషం తప్ప.. విషయం లేదు) -
మాస్కు లేకుండా మాజీ ఎమ్మెల్యే తీగల, రూ.1000 ఫైన్
సాక్షి, హైదరాబాద్: మాజీ శాసన సభ్యులు, హైదరాబాద్ మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డికి సరూర్‌నగర్ పోలీసులు చలానా విధించారు. కారులో మాస్క్ లేకుండా వెళుతున్న తీగల కృష్ణారెడ్డికి పోలీసులు 1000 రూపాయల చలానా వేశారు. కర్మన్‌ఘాట్ చౌరస్తా వద్ద సరూర్‌నగర్ పోలీసులు మంగళవారం తనిఖీలు చేపట్టారు. అదేసమయంలో మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి తన కారులో వెళ్తున్నారు. పోలీసులు ఆయన కారును తనిఖీ చేశారు. ఆ సమయంలో తీగల కృష్ణారెడ్డి మాస్క్ ధరించలేదు. మాస్క్ ఎందుకు పెట్టుకోలేదని సరూర్‌నగర్ సబ్ ఇన్స్పెక్టర్ ముకేష్.. మాజీ ఎమ్మెల్యేను ప్రశ్నించాడు. కారులో వెళ్తున్నా మాస్కు ధరించాలా? అంటూ ఆయన ఎస్ఐతో గొడవకు దిగారు. ఈ క్రమంలో సబ్ఇన్స్పెక్టర్ ముకేశ్‌కు తీగల కృష్ణారెడ్డికి మధ్య వాగ్వాదం నెలకొంది. మాకు అంతా సమానులే అంటూ పోలీసులు తీగలకు ఎట్టకేలకు 1000 రూపాయల చలానా విధించారు. -
స్వేచ్ఛలాంటి సినిమాలు అవసరం
‘‘అక్కినేని నాగేశ్వరరావు, ఎన్టీఆర్‌ల కాలంలో సినిమాలు వంద రోజులు ఆడటం మనం చూశాం. ప్రస్తుతం ఆ రోజులు లేవు. ఎన్నో మార్పులు వచ్చాయి. అయినా కొత్త తరహా సినిమాలు వస్తున్నాయి.. కొత్త హీరోలు వస్తున్నారు’’ అని మాజీ మంత్రి తీగల కృష్ణారెడ్డి అన్నారు. గాయని మంగ్లీ లీడ్ రోల్లో కెపీఎన్ చౌహాన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘స్వేచ్ఛ’. రాజు నాయక్ నిర్మించిన ఈ సినిమా ఈ శుక్రవారం విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో తీగల కృష్ణారెడ్డి మాట్లాడుతూ– ‘‘స్త్రీ జాతికి జరుగుతున్న అన్యాయంపై సందేశాత్మకంగా నిర్మించిన ‘స్వేచ్ఛ’లాంటి చిత్రాల అవసరం నేటి సమాజానికి ఎంతైనా ఉంది’’ అన్నారు. ‘‘ఆడపిల్లలను రక్షించండి.. చెట్లను సంరక్షించండి అనే సందేశంతో ‘స్వేచ్ఛ’ తీశారు. ఇందులో మంచి పాత్ర చేశాను’’ అన్నారు నటుడు చమ్మక్ చంద్ర. ‘‘ఇది బంజారాలకు సంబంధించిన సినిమా కాదు.. ప్రజలకు సంబంధించిన చిత్రం’’ అన్నారు మంగ్లీ. ‘‘ఇలాంటి సినిమాలకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ లాంటి వారు సహకారం అందించాలి’’ అన్నారు దర్శకుడు, హీరో కేపీఎన్ చౌహాన్. ‘‘మా సినిమా మంచి విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉంది’’ అన్నారు రాజు నాయక్. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు భోలే , సరస్వతీ డెవలపర్స్ రాజు నాయక్, సతీష్ నాయుడు, తారకేష్, బాలనటుడు చక్రి తదితరులు పాల్గొన్నారు. -
పంతం నెగ్గించుకున్న తీగల కృష్ణారెడ్డి
టీఆర్ఎస్ పార్టీలో జెడ్పీ చైర్పర్సన్ అభ్యర్థిపై సందిగ్ధత వీడింది. మొన్నటి వరకు జెడ్పీ పీఠం కోసం పోటీపడిన ముగ్గురు నేతల కుటుంబ సభ్యుల్లో ఒకరికి పార్టీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. చైర్మన్ గిరిపై మొదటి నుంచి ఆశలు పెట్టుకున్న మహేశ్వరం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కోడలు డాక్టర్ అనితారెడ్డి పేరును దాదాపుగా ఖరారు చేసింది. దీంతో కొన్ని రోజులుగా సాగుతున్న సస్పెన్స్‌కు తెరపడినట్లయింది. జెడ్పీ చైర్పర్సన్ పదవిని అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. పంచాయతీరాజ్ కొత్త చట్టం సంస్కరణల నేపథ్యంలో చైర్పర్సన్ కీలకంగా మారనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఈ పదవికి తీవ్ర పోటీ ఏర్పడింది. సాక్షి, రంగారెడ్డి జిల్లా: అధికార పార్టీ తరఫున ముగ్గురు నేతలు తమ కుటుంబ సభ్యులకు అవకాశం ఇవ్వాలని సీఎం కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ను కోరారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ కూతురు, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కోడలు అనితారెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి కోడలు పదవిని ఆశించారు. తన కూతురు పోటీ విషయంలో ప్రకాశ్‌గౌడ్ చివరి నిమిషంలో తన నిర్ణయాన్ని మార్చుకున్నారని సమాచారం. దీంతో తమకు వద్దని అధిష్టానానికి చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి కోడలు మంచాల నుంచి బరిలోకి దిగాలనుకున్నారు. తొలిదశ ఎన్నికల జాబితాలో ఉన్న ఆ మండలంలో అప్పటికే నామినేషన్ల దాఖలు గడువు ముగియడంతో అవకాశం చేజారింది. దీంతో అనితారెడ్డికి లైన్ క్లియర్ అయ్యింది. అంతేగాక అనితారెడ్డి మామ కృష్ణారెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైన విషయం తెలిసిందే. అంతకుముందు అనితారెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీ అభ్యర్థిగా, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆర్కేపురం డివిజన్ నుంచి కార్పొరేటర్‌గా బరిలోకి దిగి ఓటమి చెందారు. ఈ నేపథ్యంలో తమకు ఎలాగైనా చైర్‌పర్సన్‌గా అవకాశం ఇవ్వాలని పార్టీ అధిష్టానాన్ని మాజీ ఎమ్మెల్యే కృష్ణారెడ్డి పట్టుబట్టినట్లు సమాచారం. ఫలితంగా చైర్పర్సన్ పదవి కోపం అనితారెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. అయితే మొన్నటి వరకు మహేశ్వరం స్థానికుల్లో ఒకరికి లేదంటే.. మొదటి నుంచి పార్టీలో కొనసాగిన వారికే జెడ్పీటీసీ టికెట్ ఇవ్వాలని టీఆర్ఎస్ ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు పార్టీని కోరారు. దీనికితోడు టీఆర్ఎస్లో చేరడం దాదాపు ఖాయమైన స్థానిక ఎమ్మెల్యే పి.సబితాఇంద్రారెడ్డి కూడా తమ వర్గానికి జెడ్పీటీసీ టికెట్ కావాలని ప్రయత్నించినట్లు ప్రచారం జరిగింది. ఈనేపథ్యంలో అనితారెడ్డి గెలుపుకోసం స్థానిక నాయకులు, సబితమ్మ వర్గం ఏ స్థాయిలో కృషిచేస్తారన్నది ఆసక్తిగా మారింది. కాంగ్రెస్ నుంచి రేసులో ఇద్దరు.. జెడ్పీ చైరపర్సన్ పదవి కోసం కాంగ్రెస్ పార్టీ తరఫున ఇద్దరు అభ్యర్థులు రేసులో ఉన్నారు. ఇబ్రహీంపట్నం మాజీ ఎంపీపీ మర్రి నిరంజన్‌రెడ్డి సతీమణి నిత్యారెడ్డి ఒకరుకాగా.. తుక్కుగూడ మాజీ సర్పంచ్ కొమిరెడ్డి నర్సింహారెడ్డి కోడలు శాలినీరెడ్డి మరొకరు. మంచాలలో నిత్యారెడ్డి పోటీచేస్తుండగా.. శాలినీరెడ్డి మహేశ్వరం నుంచి బరిలో నిలిచారు. అయితే ప్రస్తుతానికి వీరిలో ఒకరిని ఫైనల్ చేసే అవకాశాలు లేనట్లు తెలుస్తోంది. ఇప్పటికిప్పుడే అభ్యర్థి పేరును ప్రకటిస్తే గ్రూపు రాజకీయాలు మొదలయ్యే ప్రమాదం ఉందని పార్టీ నేతలు జాగ్రత్త పడుతున్నారు. ఇప్పటికే నేతలు, కార్యకర్తల వలసలతో కుదేలవుతున్న జిల్లా పార్టీ.. గ్రూపు తగాదాలైతే ఇతర పార్టీలకు మేలు జరుగుతుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో జెడ్పీటీసీ స్థానాలు దక్కితే.. ఆ తర్వాత చైర్పర్సన్ అభ్యర్థి పేరును ఖరారు చేయాలన్న యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. బీజేపీలో అనిశ్చితి.. మరోపక్క బీజేపీ విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఇప్పటి వరకు ఆ పార్టీలో చైర్పర్సన్ పదవిని ఆశిస్తున్నవారు పెద్దగా లేనట్లు తెలుస్తోంది. తొలుత జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో గెలుపుపై ప్రధానంగా దృష్టిసారించింది. తొలి, రెండు దశల్లో ఎన్నికలు జరిగే మండలాల్లో ఆ స్థాయి అభ్యర్థులు లేరని పార్టీలో చర్చజరుగుతోంది. ఇక ఆశలన్నీ మూడో దశ ఎన్నికలు జరుగుతున్న మండలాలపైనే ఉన్నాయి. -
గులా'బీ' ఫారాల పంపిణీ
టీఆర్ఎస్ మరింత దూకుడును ప్రదర్శిస్తోంది. తమ పార్టీ తరఫున శాసనసభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు బీ–ఫారాలు అందజేసింది. ఆదివారం టీఆర్ఎస్ భవన్లో నిర్వహించిన సమావేశంలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా.. జిల్లాలోని ఆయా నియోజకవర్గాల నుంచి బరిలోకి దిగిన అభ్యర్థులు బీ ఫారాలు అందుకున్నారు. కాలె యాదయ్య (చేవెళ్ల), టి.ప్రకాశ్‌గౌడ్ (రాజేంద్రనగర్), తీగల కృష్ణారెడ్డి (మహేశ్వరం), ఎం.రామ్మోహన్ గౌడ్ (ఎల్బీనగర్), అంజయ్య యాదవ్ (షాద్‌నగర్), మంచిరెడ్డి కిషన్‌రెడ్డి (ఇబ్రహీంపట్నం), అరికెపూడి గాంధీ (శేరిలింగంపల్లి), జైపాల్ యాదవ్ (కల్వకుర్తి)లు బీ ఫారం తీసుకున్న వారిలో ఉన్నారు. సాక్షి, రంగారెడ్డి: అసెంబ్లీని రద్దుచేసి రెండు నెలల కిందటే అభ్యర్థులను ప్రకటించిన టీఆర్ఎస్ అధిష్టానం.. చివరకు ఎన్నికల ప్రక్రియలో కీలకమైన బీ– ఫారాల విషయంలోనూ అదే దూకుడును కొనసాగించింది. తొలుత కేసీఆర్ ప్రకటించిన 107 మంది అభ్యర్థుల జాబితాలో.. జిల్లాలోని 8 సెగ్మెంట్ల నుంచి బరిలోకి దిగే అభ్యర్థులకు చోటు దక్కింది. ప్రకటన వెలువడినప్పటి నుంచే అభ్యర్థులంతా క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటిస్తూ ప్రచారం చేస్తున్నారు. తాజాగా బీ– ఫారాల అందజేతతో వీరంతా ప్రచారానికి మరింత పదును పెట్టేందుకు ప్రణాళికలు తయారు చేసుకుంటున్నారు. డెయిలీ సీరియల్.. ఇక ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ నేతృత్వంలో ఏర్పాటయిన మహాకూటమి తర్జనభర్జనలు పడుతోంది. కూటిమిలో భాగస్వాములుగా ఉన్న కాంగ్రెస్, టీజేఎస్, టీడీపీ, సీపీఐల సీట్ల సంఖ్య, పోటీ చేసే స్థానాల సంఖ్య కొలిక్కి రాకపోవడంతో అభ్యర్థుల ఖరారు విషయంలో తీవ్ర ఆలస్యమవుతోంది. అభ్యర్థులను ప్రకటిస్తామని నాలుగు రోజులుగా జరుగుతున్న వ్యవహారం డెయిలీ సీరియల్‌ని తలపిస్తున్నాయి. జిల్లాలోని కొన్ని సెగ్మెంట్లలో ఎవరు పోటీ చేస్తారనే విషయంపై దాదాపు ఖరారైనప్పటికీ.. ఇబ్రహీంపట్నం, రాజేంద్రనగర్, చేవెళ్ల నియోజకవర్గాలపై సస్పెన్స్ కొనసాగుతోంది. చివరకు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే 12న కూడా అభ్యర్థులను ప్రకటిస్తారా లేదా అని సందిగ్ధంగానే ఉంది. బీజేపీ దూకుడు.. టీఆర్ఎస్, కాంగ్రెస్‌లకు ప్రత్యామ్నాయంగా బీజేపీ అధిష్టానం అభ్యర్థుల ఖరారులోనూ కాస్త ముందంజలోనే ఉంది. రెండు విడతలుగా ఐదు సెగ్మెంట్ల అభ్యర్థుల పేర్లను ఖరారు చేసింది. ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపికను పెండింగ్ పెట్టింది. వాస్తవంగా ఆదివారం ఆ పార్టీ ఎన్నికల కమిటీ భేటీ అయితే.. 12న అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తారని ప్రచారం జరిగింది. అనివార్య పరిస్థితులలో ఈ సమావేశం వాయిదా పడింది. ఈ నేపథ్యంలో పేర్ల వెల్లడికి మరో రెండురోజులు పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
మామా.. కోడలా..?
మామా.. కోడలా.. ఎవరు పోటీచేస్తారు? తీగల తప్పుకుంటారా.. అనిత బరిలో దిగుతారా? మహేశ్వరం నియోజకవర్గంలో ప్రస్తుతం ఇదే చర్చ జరుగుతోంది. స్థానిక శాసనసభ్యుడు తీగల కృష్ణారెడ్డికి దీటుగా ఆయన కోడలు అనితారెడ్డి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఆమె నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తుండడంతో కార్యకర్తల్లో గందరగోళం నెలకొంది. ఇప్పటికే మూడు గ్రూపులు, ఆరు వర్గాలుగా చీలిపోయిన పార్టీలో కొత్త పవర్ సెంటర్ ఏర్పడడం ఆందోళన కలిగిస్తోంది. మహేశ్వరం: మహేశ్వరం నియోజకవర్గం నుంచి 2014 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరఫున విజయం సాధించిన తీగల కృష్ణారెడ్డి రాష్ట్రంలో మారిన సమీకరణల నేపథ్యంలో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. అయితే, ఇప్పటికే పార్టీని వెన్నంటి నిలిచిన ముఖ్యనేతలకు ఈ పరిణామం మింగుడు పడలేదు. పార్టీ ఆవిర్భావం నుంచి సేవలందించిన తమను కాదని తీగలకు ప్రాధాన్యం పెరగడాన్ని జీర్ణించుకోలేకపోయారు. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో దిగిన కొత్త మనోహర్‌రెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జిగా వ్యవహరించిన కప్పాటి పాండురంగారెడ్డిలు తీగల చేరికను బాహాటంగానే వ్యతిరేకించారు. ఈ మేరకు వైరివర్గాలుగా మారిన సీనియర్లను సమన్వయపరిచేందుకు అధిష్టానం కప్పాటిని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవితో సంతృప్తిపరిచే ప్రయత్నం చేసింది. గ్రూపులకు ఫుల్స్టాప్ పడిందని హైకమాండ్ భావిస్తున్నాక్షేత్రస్థాయిలో మాత్రం ఎవరికివారుగానే వ్యవహరిస్తున్నారు. వచ్చే ఏడాది జరుగనున్న ఎన్నికల్లో తీగల అభ్యర్థిత్వాన్ని పరిశీలించకపోతే తమకు న్యాయం జరుగుతుందనే భరోసా ఇద్దరిలోనూ ఉంది. ఇదిలావుండగా ఎమ్మెల్యే కృష్ణారెడ్డికి సొంత కోడలు నుంచే తీవ్ర పోటీ ఎదురవుతున్నట్లు అధికార పార్టీలో ప్రచారం జరుగుతోంది. మామ ఆదేశిస్తే వచ్చే ఎన్నికల్లో బరిలో దిగుతానని ఆమె స్పష్టం చేస్తుండడం.. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటుండడం గులాబీ శ్రేణులను అయోమయంలో పడేస్తోంది. వయోభారం దృష్ట్యా మామకు టికెట్ నిరాకరిస్తే తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలనే అంశాన్ని ఆమె అంతర్గతంగా తెరమీదకు తెస్తున్నారు. తమ కుటుంబానికి గాకుండా మరొకరు టికెట్ ఎగురేసుకుపోకుండా ఈ ఎత్తుగడ వేసినట్లు రాజకీయవర్గాల విశ్లేషిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో పోటీచేయాలనే మనసులోని మాటను మామతో అనితారెడ్డి ఇప్పటికే వెల్లడించారని, ఆయన మాత్రం కోడలు సూచనను సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో కూడా తానే పోటీచేస్తానని తెగేసి చెప్పినట్లు పార్టీవర్గాలు చెబుతున్నాయి. సబితను ఢీకొనే శక్తి తనకు ఉందని భావన మరోవైపు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ సారి మహేశ్వరం నుంచి పోటీచేయాలని నిర్ణయించుకున్నారు. గత ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న ఆమె 2019 ఎన్నికల్లో బరిలో దిగడం ఖాయమని స్పష్టం చేస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే నియోజకవర్గంలో ముమ్మరంగా తిరుగుతున్నారు. ఈ పరిణామాన్ని కూడా అనితారెడ్డి ఉపయోగించుకుంట్నుట్లు కనబడుతోంది. సబితను ఢీకొనడం మహిళగా తనకు కలిసివస్తుందనే అంచనా వేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మహిళగా ప్రజల్లోకి వెళితే సానుకూల స్పందన లభిస్తుందని, ఇది విజయతీరాలవైపు తీసుకెళుతుందని ఆమె సన్నిహితుల వద్ద అంటున్నారు. ఆర్ట్ ఫౌండేషన్‌తో ముందుకు.. టికెట్టు విషయం పక్కనపెడితే అనితారెడ్డి తీగల(ఆర్ట్) ఫౌండేషన్ పేరిట అనితారెడ్డి సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉచిత వైద్య శిబిరాలు, శస్త్రచికిత్సలు, మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్ శిక్షణ ఇప్పించి వారి స్వయం ఉపాధి పెంపొందించేందుకు దోహదపడే కార్యక్రమాలు చేపడుతూ ప్రజలకు చేరువవుతున్నారు. పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాల్లో మామ కృష్ణారెడ్డితోపాటు పాల్గొంటూ పార్టీపై పట్టు సాధించే ప్రయత్నం చేస్తున్నారు. మామ, కోడలు మధ్య టికెట్ విషయంతో అంతర్గతంగా పోరు నడుస్తున్న తరుణంలో ఎవరికి టికెట్ వస్తుందోననే పార్టీ శ్రేణులు చర్చింకుంటున్నాయి. ఈ ఇరువురు సాధ్యమైనంత త్వరగా అభ్యర్థిత్వంపై స్పష్టమైన ప్రకటన చేయకపోతే ఇబ్బందులు ఏర్పడతాయని టీఆర్ఎస్ ముఖ్యనేత ఒకరు ‘సాక్షి’తో వ్యాఖ్యానించారు. ఆర్ట్ ఫౌండేషన్‌తో ముందుకు.. టికెట్టు విషయం పక్కనపెడితే అనితారెడ్డి తీగల(ఆర్ట్) ఫౌండేషన్ పేరిట అనితారెడ్డి సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉచిత వైద్య శిబిరాలు, శస్త్రచికిత్సలు, మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్ శిక్షణ ఇప్పించి వారి స్వయం ఉపాధి పెంపొందించేందుకు దోహదపడే కార్యక్రమాలు చేపడుతూ ప్రజలకు చేరువవుతున్నారు. పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాల్లో మామ కృష్ణారెడ్డితోపాటు పాల్గొంటూ పార్టీపై పట్టు సాధించే ప్రయత్నం చేస్తున్నారు. మామ, కోడలు మధ్య టికెట్ విషయంతో అంతర్గతంగా పోరు నడుస్తున్న తరుణంలో ఎవరికి టికెట్ వస్తుందోనని పార్టీ శ్రేణులు చర్చింకుంటున్నాయి. ఈ ఇరువురు సాధ్యమైనంత త్వరగా అభ్యర్థిత్వంపై స్పష్టమైన ప్రకటన చేయకపోతే ఇబ్బందులు ఏర్పడతాయని టీఆర్ఎస్ ముఖ్యనేత ఒకరు ‘సాక్షి’తో వ్యాఖ్యానించారు. -
తీగల ఇంటి ముందు టీడీపీ ఆందోళన
మహేశ్వరం: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ఇంటి ముందు టీడీపీ వర్గీయులు ఆందోళనకు దిగారు. నియోజకవర్గ ఇన్చార్జ్ వీరేందర్‌గౌడ్ ఆధ్వర్యంలో నేతలు, కార్యకర్తలు శుక్రవారం ఉదయం మీర్పేట్లోని ఆయన నివాసం వద్దకు వెళ్లి ఆందోళన చేపట్టారు. టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీచేసి టీఆర్ఎస్లోకి వెళ్లినందున తీగల తన పదవికి రాజీనామా చేయాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. -
విస్తరణలో నో ఛాన్స్!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: మంత్రివర్గ విస్తరణలో మన జిల్లాకు మరో బెర్త్ లభించే ఛాన్స్ కనిపించడంలేదు. ప్రస్తుతం జిల్లా నుంచి తాండూరు ఎమ్మెల్యే పట్నం మహేందర్‌రెడ్డి మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కొత్తగా ఈనెల 16న మంత్రివర్గ విస్తరణ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యేల్లో సరికొత్త ఆశలు చిగురిస్తున్నాయి. జిల్లాలో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు నలుగురున్నారు. ఇటీవల టీడీపీకి చెందిన ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, చేవెళ్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే కాలె యాదయ్య టీఆర్ఎస్లో చేరారు. దీంతో జిల్లాలో అధికారపార్టీ ఎమ్మెల్యేల సంఖ్య ఆరుకు చేరింది. తీగల, కాలె సాంకేతికంగా ఆయా పార్టీల సభ్యులుగానే కొనసాగుతున్నారు. సామాజిక సమీకరణల నేపథ్యంలో జిల్లాలోని ఎమ్మెల్యేలను కొత్తగా కేబినెట్లోకి తీసుకునే అవకాశం లేదు. అంతేకాకుండా మంత్రివర్గాన్ని కూడా 18 మంత్రులకే పరిమితం చేయడం కూడా ఆశావహుల ఆశలపై నీళ్లు చల్లింది. ఉమ్మడి రాష్ట్రంలో జిల్లా నుం చి ప్రతిసారి ఇరువురు మంత్రులుగా వహిం చేవారు. రెవెన్యూ, హోంలాంటి కీలక శాఖ లు కూడా జిల్లాకు దక్కేవి. 14 మంది ఎమ్మెల్యేలతో రాష్ట్రంలోనే రెండో పెద్ద జిల్లాగా ఉన్నప్పటికీ, మంత్రుల సంఖ్యను పరిమితి దాటకూడదనే నిబంధన జిల్లా ఎమ్మెల్యేలకు ప్రతిబంధకంగా మారింది. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు జూన్ 2న ప్ర మాణం స్వీకారం చేసిన రోజునే మహేందర్‌రెడ్డిని కూడా తన కేబినెట్లో చేర్చుకున్నారు. సీనియర్ శాసనసభ్యుడు కావడం, జిల్లా రాజకీయాలను శాసించేస్థాయికి ఎదిగిన మహేందర్‌కు బెర్త్ కట్టబెట్టడం ద్వారా టీడీపీ, కాంగ్రెస్‌లకు కంచుకోటగా ఉన్న రంగారెడ్డి జిల్లాలో పట్టు సాధించాలని కేసీఆర్ భావించారు. ఆయన ఊహించినట్లుగానే తగిన సంఖ్యాబలం లేనప్పటికీ మహేందర్‌రెడ్డి తనదైన శైలిలో వ్యూహాత్మకంగా వ్యవహరించి జిల్లా పరిషత్‌ను కైవసం చేసుకోగలిగారు. ఆ తర్వాత టీడీపీకి చెందిన తీగల కృష్ణారెడ్డి, కాంగ్రెస్‌కు చెందిన ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఎమ్మెల్యే యాదయ్యను కూడా టీఆర్ ఎస్ గూటికి చేర్చారు. హరీశ్వర్ ఆశలు ఆవిరి! సుదీర్ఘకాలం ఎమ్మెల్యేగా పనిచేసిన పరిగి ఎమ్మెల్యే కొప్పుల హరీశ్వర్‌రెడ్డి అనూహ్యంగా ఓడిపోయారు. గతంలో టీడీపీలో కొనసాగిన హరీశ్వర్.. చంద్రబాబుతో విభేదించి కారెక్కారు. ఆయన చేరిక తర్వాత టీఆర్ఎస్లో చేరిన మహేందర్‌రెడ్డి విజయం సాధించి కేసీఆర్ మంత్రివర్గంలో కొలువుదీరారు. ‘ఓడిపోయినందుకు బాధపడాల్సిన పనిలేదని, సీనియర్ నేతగా సముచిత స్థానం కల్పిస్తా.’నని ముఖ్యమంత్రి అప్పట్లో హామీ ఇచ్చారు. పెద్దల సభకు ఎంపిక చేయడం ద్వారా హరీశ్వర్‌కు మంత్రివర్గంలో చోటు ఇస్తారని అంతా ఆశించారు. కేసీఆర్ భరోసాతో మంత్రి కావాలనే చిరకాలవాంఛ నెరవేరుతుందని హరీశ్వర్ భావించారు. అయితే, ఎమ్మెల్సీ పదవిపై ఆశలు సన్నగిల్లడంతో ప్లానింగ్ కమిటీ ఉపాధ్యక్ష పదవి కట్టబెడతారనే ప్రచారం జరిగింది. ఈ పదవిపైనా కేసీఆర్ స్పష్టత ఇవ్వకపోవడంతో ఆయన వర్గీయుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. నామినేటెడ్ పోస్టులపై కన్ను మహేందర్‌రెడ్డితోపాటు ముగ్గురు ఎమ్మెల్యేలు సంజీవరావు (వికారాబాద్), సుధీర్‌రెడ్డి (మేడ్చల్), కనకారెడ్డి(మల్కాజిగిరి) జిల్లా నుంచి టీఆర్ఎస్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత సాంప్రదాయాలు పాటిస్తే మాత్రమే జిల్లాకు రెండో పదవి దక్కే వీలుంది. అయితే ఇప్పటికి కొన్ని జిల్లాలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేకపోవడం.. సామాజిక సమతుల్యత కారణంగా ఒక మంత్రి పదవితోనే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కేబినెట్లో అవకాశం దక్కకున్నా, నామినేటెడ్ పోస్టుల్లో తమకు న్యాయం జరుగుతుందనే నమ్మకాన్ని ఆ పార్టీ ఎమ్మెల్యేలు వ్యక్తపరుస్తున్నారు. ఇటీవల ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌కు సాంస్కృతిక శాఖ చైర్మన్ పదవిని కట్టబెట్టడం, అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన పిడమర్తి రవిని దళిత సంక్షేమ శాఖ చైర్మన్‌గా నియమించడంతో ఆశావహుల్లో కార్పొరేషన్ పదవులపై ఆశలు రెట్టింపయ్యాయి. మరోవైపు మంత్రివర్గ విస్తరణ ప్రక్రియ ముగిస్తే నెలల తరబడి ఎదురుచూస్తున్న తమకు నామినేటెడ్ పోస్టులు లభిస్తాయని దిగువ శ్రేణి నేతలు ఆశిస్తున్నారు. -
ఎమ్మెల్యే ‘తీగల’ వరాల జల్లు
బస్వగూడ తండాపై ఎమ్మెల్యే ‘తీగల’ వరాల జల్లు ఒకవైపు అంతర్జాతీయ విమానాశ్రయం.. మరోవైపు ఫ్యాబ్‌సిటీ, హార్డ్‌వేర్ పార్కు వంటి ప్రతిష్టాత్మక కంపెనీలు.. వీటికి అర కిలో మీటర్ దూరంలోనే ఉంది మహేశ్వరం మండలం మంఖాల్ గ్రామ పంచాయతీకి అనుబంధ గ్రామమైన బస్వగూడ తండా. ప్రపంచపటంలో ప్రత్యేక స్థానం ఉన్న మహేశ్వరం మండలంలోని ఈ ప్రాంతం అభివృద్ధిలో మాత్రం ఆమడదూరంలో ఉంది. ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలోనే బస్వగూడ తండా ఉన్నా ఈ గ్రామానికి కనీసం బస్సు, బడి, రహదారి, స్వచ్ఛమైన తాగునీరు వంటి మౌలిక సదుపాయాలు కొరవడ్డాయి. ఇక్కడ నివసిస్తున్న గిరిజనులు అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో మహేశ్వరం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ‘సాక్షి వీఐపీ రిపోర్టర్’గా తండాకు వచ్చారు. స్థానికుల సమస్యలను తెలుసుకున్నారు. తమ్ముడూ.. చెల్లీ.. తాతా.. అవ్వా.. పెద్దమ్మా అంటూ ప్రతి ఒక్కరినీ పలకరిస్తూ తండా అంతా కలియతిరిగారు. సమస్యలను సావధానంగా విన్నారు. తండాను దత్తతను తీసుకుని గిరిజనులకు అండగా నిలుస్తానని అన్నారు. మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానన్నారు. ఎమ్మెల్యే హామీలు తుక్కుగూడ నుంచి బస్వగూడ తండా వరకు బీటీ రోడ్డు వేయిస్తా ఫలక్‌నుమా డిపో నుంచి రెండు ట్రిప్పులు బస్సు నడిపిస్తా తండాకు కృష్ణా నీరు అందిస్తా తండాలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తా. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఔట్లెట్ ను ఏర్పాటు చేయిస్తా తండాలో ప్రాథమిక పాఠశాల తీసుకొచ్చేందుకు కృషి చేస్తా. ఎమ్మెల్యే:నీ పేరేంటమ్మా..ఇక్కడ ఏం సమస్యలు ఉన్నాయి? మహిళ: నా పేరు బుజ్జి. మా తండాకు బస్సు రాదు. రోడ్డు సరిగ్గా లేదు. పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. బియ్యం తెచ్చుకోవడానికి ఇబ్బందిగా ఉంది ఎమ్మెల్యే: ఇక్కడ రేషన్‌షాపు లేదా? బుజ్జి: లేదు. మంఖాల్‌కు పోయి తెచ్చుకోవాలే ఎమ్మెల్యే: నీ పేరు ఏంటమ్మా.. నీ సమస్య ఏమిటి? వృద్ధురాలు: నా పేరు లక్ష్మమ్మ. రెండు నెలల నుంచి పింఛన్ వస్తలేదు ఎమ్మెల్యే: ఇక్కడ ఎంత మందికి పింఛన్లు రావడంలేదు? మహిళలు: చాలా మందికి రావడంలేదు సార్ ఎమ్మెల్యే: వచ్చే నెల నుంచి అందరికీ రూ.వెయ్యి వస్తాయి ఎమ్మెల్యే: ఏమమ్మా.. ఏం పని చేస్తున్నావ్.. నీ సమస్య? బూరీ: రోజూ కూలికి పోతా సారు... ఎమ్మెల్యే: ఎంత ఇస్తున్నారు, ఉపాధి పనులు నడవడం లేదా? బూరీ : రోజుకి రూ.150 వస్తుంది,ఉపాధి పనులు చేయిస్తలేరు. ఎమ్మెల్యే: ఇంకా తండాలో ఏమేం సమస్యలు ఉన్నాయమ్మా? మయూరి: చిన్న పిల్లలు రోజూ కిలోమీటర్లు నడుచుకుంటూ ప్రైవేట్ స్కూల్‌కి పోతున్నారు. తాగుడుకు బానిసై చిన్న వయస్సులోనే చాలామంది చచ్చిపోయారు. బస్సులు లేక పెద్దలు, పిల్లలు ఇబ్బందిపడుతున్నారు. ఎమ్మెల్యే: ప్రభుత్వ పాఠశాల లేదా? మయూరి: లేదు సారు. అంగన్వాడీ ఉంది. బోరు ఉన్నా ట్యాంక్ లేదు. కరెంట్ ఉన్నప్పుడే అరగంట నీళ్లు వస్తాయి. ఎమ్మెల్యే: ఏం పని చేస్తావమ్మా.. పిల్లలు ఏం చేస్తారు? చాందీ: కూలీ దొరికితే చేస్తా.. లేకపోతే ఇంటి దగ్గరే ఉంటా. ఇద్దరు పిల్లలు చదువుకున్నా డ్యూటీ రాలే. ఇంటి జాగ లేదు. ఎమ్మెల్యే:ఏం బాబు నేనెవరో తెలుసా.. నన్ను గుర్తుపట్టారా .. ఏం చదువుతున్నావు, ఏం కావాలనుకుంటున్నావు? కల్యాణ్: తెలుసు సార్. తుక్కుగూడలో చదువుతున్నా. పోలీస్ కావాలనుకుంటున్నా. ఎమ్మెల్యే: మీ తండాకు మెరుగైన సేవలకు ఏం చేయాలి? భాస్కర్: నేను డీఎడ్ చదివాను. పాఠశాల లేక చాలామంది చదువు మధ్యలోనే ఆపేస్తున్నారు. ఇక్కడే స్కూల్ ఏర్పాటు చేయాలి. ఎమ్మెల్యే: నీకు వికలాంగ పింఛన్ వస్తోందా, ఎంత వస్తోంది? శంకర్: ఇప్పటి వరకు రూ.500 వచ్చింది. ఎమ్మెల్యే: ఏం పంటలు వేసావు. కరెంట్ సక్రమంగా వస్తుందా? రైతు కోఠియా: వరి వేశాను. ఇప్పుడు కూరగాయలు వేద్దామనుకుంటున్నా. కరెంట్ సక్కగా రావడంలేదు. ఇచ్చే ఆరుగంటలు ఒకేసారి ఇవ్వాలి. ఎమ్మెల్యే: ఎయిర్‌పోర్టు దగ్గరే ఉన్నా మీ తండా అభివృద్ధి కాలేదు. ఏం చేస్తే బాగుపడుతుంది? శ్రీనివాస్‌నాయక్: తండాలో ఎక్సైజ్ కేసులు తొలగించి, విద్యా సౌకర్యంతో పాటు అన్ని విధాలా ప్రభుత్వం నుంచి సహకారం అందించాలి. ఎమ్మెల్యే: ఏం చదువుతున్నావు బాబు. నీ సమస్య ఏమిటి? విద్యార్థి: నా పేరు చలపతి. తుక్కుగూడలో ఎనిమిదో తరగతి చదువుతున్నాను. వర్షం పడితే రోడ్డు బురదగా మారి స్కూల్‌కు పోలేకపోతున్నాం. రోడ్డు, బస్సు సమస్య తీర్చాలి. ఎమ్మెల్యే: ఏమమ్మా .. డ్వాక్రా రుణాలు వస్తున్నాయా? సాలీ: ఇస్తలేరు సార్. ఇళ్లు, భూమి ఉన్నోళ్లకు రేషన్ బియ్యం కూడా కట్ చేస్తమంటుండ్రు సార్ .. ఎట్లా బతకాలి. ఎమ్మెల్యే: తప్పుడు ప్రచారం నమ్మొద్దు. అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ బియ్యం ఇప్పించే బాధ్యత నాది. హస్లీ: మా తండాకు బస్సు లేదు సార్. రోజూ పిల్లలు సదువుకోవడానికి రానుపోను 7 కిలోమీటర్లు నడుస్తుండ్రు. ఎమ్మెల్యే: రెండు నెలల్లో ఆర్టీసీ బస్సును వేయిస్తా. విజయ: సార్ నాకు వితంతువు పింఛన్, రేషన్ బియ్యం వస్తలేవు? ఎమ్మెల్యే: వచ్చేనెల నుంచి రూ.1500 పింఛన్ వస్తుంది. బియ్యం ఒక్కొక్కరికి 6 కిలోలకు పెంచాం. లలిత: సార్ నాభర్త ఇటీవల చనిపోయిండు. పిల్లలను చదివించలేకపోతున్నా. ఎలాంటి ఆధారం లేదు. ఎమ్మెల్యే: మీ పిల్లలను ఎస్సీ, ఎస్టీ హాస్టల్లో వేసి చదివిస్తా. అవసరమనుకుంటే ఒకరిని దత్తత తీసుకొని చదవిస్తా. వచ్చే నెల నుంచి రూ.1000 పింఛన్ వచ్చేలా అధికారులతో మాట్లాడతా. ఎమ్మెల్యే: ఎం పెద్దాయనా పింఛన్ వస్తోందా? బాషా: రెండు నెలల నుంచి వస్తలేదు. ఎమ్మెల్యే: పాపా నీ పేరేంటి.. అంగన్వాడీ కేంద్రంలో రోజూ భోజనంతోపాటు గుడ్డు, పాలు ఇస్తున్నారా? జ్యోత్స్నప్రియ: ఇస్తున్నారు సార్. అంగన్వాడీ కార్యకర్త: సార్ పిల్లలకు నాణ్యమైన భోజనం అందిస్తున్నాం. కానీ మాకు కనీస వేతనాలు లేవు. ఎమ్మెల్యే: ప్రభుత్వం కార్మికుల సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తుంది. అంగన్వాడీ కేంద్రంలో ఎంతమంది పిల్లలు వస్తున్నారు? గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందిస్తున్నారా? అంగన్వాడీ సూపర్వైజర్ సరోజ: మొత్తం 21 మంది పిల్లలు ఉన్నారు. రోజు 15 మంది వస్తారు. గర్భిణులు, బాలింతలు, కిశోరబాలికలకు పౌష్టికాహారం అందిస్తున్నాం సార్. ఎమ్మెల్యే: ఏఎన్ఎం గారూ.. తండాలో సూదులు, మందులు ఇస్తున్నారా? ఏఎన్ఎం: ప్రతి శనివారం వచ్చి వ్యాక్సిన్లు, మం దులు ఇస్తున్నాం సార్. ఎమ్మెల్యే: ఏం ఎస్ఐ గారూ.. లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది? ఎస్ఐ నర్సింగ్ రాథోడ్: శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తున్నాం. తండాలో గుడుంబా కేసులు ఎక్కువగా వస్తాయి. ఇటీవల అందరూ సారా తయారీని నిషేధించారు. మదన్మోహన్ (ఎంపీటీసీ): తండావాసులు సారా తయారీని నిషేధించారు. వారిపై పెట్టిన కేసులు ఎత్తివేయాలి. తండాలో డ్రైనేజీ ఔట్లెట్ ఏర్పాటు చేయాలి. ఎమ్మెల్యే: సారా తయారీ నిషేధించడం అభినందనీయం. డ్రైనేజీ ఔట్ లెట్ ఏర్పాటు చేస్తా. రవి నాయక్: తండావాసులకు ఇళ్ల స్థలాలివ్వాలి. స్మశానవాటికకు ప్రభుత్వం నుంచి స్థలం ఇవ్వాలి. ఎమ్మెల్యే: తెలంగాణ ప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ డబుల్ బెడ్రూమ్ కట్టిస్తుంది. ప్రభుత్వ స్థలం ఉంటే స్మశానవాటికకు కేటాయించేందుకు కృషి చేస్తా. సామెల్ రాజ్ (వార్డు సభ్యుడు): తండా అభివృద్ధి కోసం మరిన్ని నిధులు కేటాయించాలి. ఎమ్మెల్యే: తప్పకుండా.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తా. తుక్కుగూడ నుంచి బస్వగూడ వరకు బీటీ నిర్మాణానికి రూ. 26 లక్షలు మంజూరయ్యాయి. టెండర్లు పిలిపించి పనులు ప్రారంభిస్తాం. రోడ్డు పూర్తి కాగానే ఆర్టీసీ బస్సు నడిపిస్తాం. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా చూస్తాం. -
అంతర్జాతీయ స్థాయిలో ఫార్మాసిటీ!
-
ఫార్మాసిటీకి 7వేల ఎకరాలు సిద్ధం: తీగల
ఫార్మాసిటీ కోసం రంగారెడ్డి జిల్లా పరిధిలో 7వేల ఎకరాల భూమి సిద్ధంగా ఉన్నట్లు టీఆర్ఎస్ నాయకుడు తీగల కృష్ణారెడ్డి తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏరియల్ సర్వే ముగిసిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు. మరో ఏడు వేల ఎకరాలకు భూసేకరణ జరుగుతుందని తీగల చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్, ఫార్మా కంపెనీల ప్రతినిధులు కలిసి 4 హెలికాప్టర్లతో ఏరియల్ సర్వే చేశారన్నారు. మొత్తం పది ఫార్మా కంపెనీల ప్రతినిధులు ఈ సర్వేలో పాల్గొన్నట్లు తీగల కృష్ణారెడ్డి చెప్పారు. -
టీఆర్ఎస్ లో చేరిన తీగల, తలసాని
-
టీఆర్ఎస్ లో చేరిన తీగల, తలసాని
హైదరాబాద్: టీడీపీ ఎమ్మెల్యేలు తీగల కృష్ణారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ బుధవారం టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్ కూడా టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. మీర్ పేటలోని టీకేఆర్ కాలేజీ ఆవరణలో బుధవారం సాయంత్రం నిర్వహించిన సభలో టీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ సమక్షంలో వీరు పార్టీలో చేరారు. గులాబీ కండువాలు టీడీపీ నాయకుల మెడలో వేసి కేసీఆర్ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా తలసాని, తీగల మాట్లాడుతూ... టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. మంత్రులు పోచారం శ్రీనివాసరెడ్డి, మహేందర్ రెడ్డి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
స్థాయి పెంచితే నన్నే తిడుతున్నారు
సాక్షి, హైదరాబాద్: ‘ఒడ్డు పొడుగు ఉన్నోడు కదాని ఎంతో ఎత్తుకు తీసుకుపోతే ఇప్పుడు నన్నే విమర్శించేంత ఎత్తుకు ఎదిగాడు’ అని తెలుగుదేశంపార్టీ అధినేత చంద్ర బాబు నాయుడు ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డిపై వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ఒక నాయకుడు పోతే వందమందిని తయారుచేసుకునే సామర్థ్యం టీడీపీ సొంతమన్నారు. మేయర్‌గా తీగలను గెలిపించేందుకు తాను, టీడీపీ కార్యకర్తలు ఎంత కష్టపడ్డామో, మొన్న ఎమ్మెల్యేగా ఎలా గెలిచాడో ఆయనకు తెలియదా? అని బాబు ప్రశ్నించారు. గురువారం తలసాని, తీగల తదితరులు సీఎం కేసీఆర్‌ను కలసి టీఆర్ఎస్లో చేరుతున్నట్టు ప్రకటించిన తరువాత బాబు అందుబాటులో ఉన్న టీ.టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలతో సమావేశమయ్యారు. గ్రేటర్ పార్టీ అధ్యక్షుడిగా కృష్ణయాదవ్‌ను నియమించారు. రాత్రి జూబ్ల్లీహిల్స్లోని తన నివాసంలో హైదరాబాద్ జిల్లా నేతలతో మరోసారి సమావేశమయ్యారు. తెలంగాణ ఉద్యమం తీవ్రస్థాయిలో ఉన్నప్పుడు కేసీఆర్‌ను గట్టిగా తిట్టిన తలసానికి ఇప్పుడు అదే కేసీఆర్ ఎందుకు నచ్చినట్టో అని ఎద్దేవా చేశారు. వీళ్లు టీడీపీలో ఏ స్థాయి నుంచి వచ్చారో, ఇప్పుడెలా ఉన్నారో తెలియదా అని ప్రశ్నించారు. కాగా తమను సీఎం దగ్గరికి వెళతామని తీసుకెళ్లారే తప్ప పార్టీ మారుతామని చెప్పలేదని, అభివృద్ధి పనుల విషయమై సీఎంను కలిశామని సమావేశంలో ప్రకాశ్‌గౌడ్, ధర్మారెడ్డి చంద్రబాబుకు వివరణ ఇచ్చారు. కాగా టీడీపీని ఆంధ్ర పార్టీగా చెపుతున్న కేసీఆర్ ముందు తన కొడుకు తారక రామారావు పేరు మార్చాలని ఎర్రబెల్లి దయాకర్‌రావు సూచించారు. ఎమ్మెల్యేలు మాగంటి గోపినాథ్, జి.సాయన్న, కృష్ణారావు, గాంధీ, ఆర్. కృష్ణయ్య, మాజీ మంత్రులు కె. విజయరామారావు, కృష్ణయాదవ్, ఎంపీలు గరికపాటి మోహన్‌రావు, మల్లారెడ్డి, సింగిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, సారంగపాణి, నల్లెల్ల కిశోర్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. నల్లగొండలో నేడు టీడీపీ బస్సు యాత్ర ఇదిలాఉండగా, తెలంగాణలో టీడీపీ చేపట్టే బస్సుయాత్ర శుక్రవారం ఉదయం నల్లగొండ జిల్లా నుంచి ప్రారంభం కాబోతోంది. పార్టీ టీ.టీడీపీ నేతలు ఎల్. రమణ, ఎర్రబెల్లి దయాకర్ రావు, మోత్కుపల్లి నర్సింహులు, ఇతర ఎమ్మెల్యేలు యాత్రలో పాల్గొననున్నారు. టీ అభివృద్ధిపై కేసీఆర్‌కు లోకేశ్ సవాల్ తెలంగాణ అభివృద్ధిపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు కుమారుడు లోకేశ్ తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ట్విట్టర్ ద్వారా సవాల్ విసిరారు. తెలంగాణను ఎవరు అభివృద్ధి చేశారనే అంశంపై బాబుతో కేసీఆర్ చర్చకు రావాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినడంపై, టీ విద్యుత్ సంక్షోభంపై కేసీఆర్ చర్చకు సిద్ధమేనా అని ప్రశ్నించారు. -
టీఆర్ఎస్ గూటికి తీగల
ఆక ర్ష్.. వికర్ష్! సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ఊహాగానాలకు తెరపడింది. ఊహించినట్లుగానే మహేశ్వరం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి గులాబీ గూటికి చేరారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ కూడా టీఆర్ఎస్ వ్యూహానికి ఆకర్షితులైనప్పటికీ, వెనువెంటనే మనసు మార్చుకోవడం జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. అధికార పార్టీ వలలో చిక్కుకోకుండా టీడీపీ అధిష్టానం బుజ్జగింపులకు దిగినా తీగల మాత్రం మనసు మార్చుకోకుండా షి‘కారు’కే మొగ్గు చూపి షాక్ ఇవ్వగా.. సీఎం కేసీఆర్‌తో భేటీ అన ంతరం ప్రకాశ్‌గౌడ్ యూ టర్న్ తీసుకోవడంతో గులాబీ శిబిరం నివ్వెరపోయింది. గురువారం చోటుచేసుకున్న ఈ అనూహ్య పరిణామాలు జిల్లా రాజకీయవర్గాల్లో కలకలం సృష్టించాయి. రానున్న గ్రేటర్ ఎన్నికల్లో సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్న టీఆర్ఎస్ అధిష్టానం.. శివార్లలో బలంగా ఉన్న ‘దేశం’ను లక్ష్యంగా చేసుకుంది. ఈ క్రమంలోనే ఆ పార్టీ ఎమ్మెల్యేలకు వల విసిరింది. దాదాపు అందరూ ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరుపుతున్న గులాబీ నేతలు.. ప్లీనరీలోపు తమ్ముళ్లను తమవైపు తిప్పుకోవాలని ప్రణాళిక రూపొందించారు. ఇందులో భాగంగానే ఇటీవల తన కుమారులతోసహా తీగల కృష్ణారెడ్డి ముఖ్యమంత్రిని కలిశారు. ఈ భేటీలోనే కారెక్కాలనే ఆకాంక్షను తీగల వ్యక్తం చేశారు. కార్యకర్తల సమావేశం అనంతరం అధికారికంగా గులాబీ కండువా కప్పుకోవాలని భావించారు. అయితే, టీడీపీని వీడాలనే తన నిర్ణయానికి కార్యకర్తలు, ముఖ్యనేతల నుంచి అభ్యంతరం వ్యక్తం కావడంతో మీమాంసలో పడ్డ ఆయన దసరా రోజున టీఆర్ఎస్ గూటికి చేరాలనే ముహూర్తాన్ని వాయిదా వేశారు. టీఆర్ ఎస్‌లో చేరడం ఖాయమైనప్పటికీ, నిర్ణయాన్ని పెండింగ్‌లో పెట్టారనే ప్రచారం నేపథ్యంలో గురువారం గులాబీ జెండా కప్పుకోవడం గమనార్హం. తీగలను నిలువరించేందుకు జిల్లా పార్టీ అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి స్వయంగా బుజ్జగింపులకు దిగినా ఫలితం లేకుండా పోయింది. ఇంటికివెళ్లి మరీ రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన టీడీపీని వీడకూడదని కోరినా... తీగల మాత్రం ఇప్పటికే నిర్ణయం తీసుకున్నానని, మునిగిపోయే నావలో ఉండలేనని తెగేసి చెప్పినట్లు తెలిసింది. పీచేముడ్! తీగలతో కలిసి కేసీఆర్‌ను కలిసి టీఆర్ఎస్లో చేరుతున్నట్లు ప్రకటించిన కొన్ని గంటల్లోనే ప్రకాశ్‌గౌడ్ మనసు మార్చుకున్నారు. అభివృద్ధి పనులకు నిధులు అడిగేందుకే సీఎంను కలిశానని, పార్టీ మారేది లేదని స్పష్టంచేశారు. ఈ పరిణామం టీఆర్ఎస్కు షాక్ ఇచ్చింది. పార్టీలో చేరికను ఖరారు చేసుకున్న అనంతరమే ప్రకాశ్‌కు ఆహ్వానం పలికామని, చివరి నిమిషంలో ఎదురు తిరగడం విస్మయం కలిగించిందని గులాబీ నేతలు వాపోయారు. మరోవైపు ప్రకాశ్‌గౌడ్ యూటర్న్ తీసుకోవడంలో అంతర్యమేమిటో బోధపడడం లేదని తెలుగు తమ్ముళ్లు అంటున్నారు. ఇప్పటికే పలుమార్లు కేసీఆర్‌తో మంతనాలు జరిపిన క్రమంలో ప్రకాశ్ పార్టీని వీడుతారని భావించామని, చేరినట్లే చేసి వెనక్కిరావడం ఆశ్చర్యం కలిగించిందని అన్నారు. ఇదిలావుండగా, తన నియోజకవర్గంలో కృష్ణా పైప్‌లైన్ పనులను పూర్తి చేస్తేనే టీఆర్ఎస్లో చేరుతానని సీఎంకు స్పష్టం చేసినట్లు ప్రకాశ్‌గౌడ్ తన సన్నిహితులకు వివరించారు. నాలుగు నెలల్లో కృష్ణాజలాలను అందిస్తానని, పార్టీలో చేరాలని కేసీఆర్ పేర్కొన్నప్పటికీ, పనులు పూర్తయిన తర్వాతే, అది కూడా కార్యకర్తల అభిప్రాయం మేరకే నడుచుకుంటానని తెలిపానని చెప్పారు. ఇదిలావుండగా, సాయంత్రం టీడీపీ అధినేత చంద్రబాబునాయుడును కలిసిన ప్రకాశ్.. టీడీపీని వీడబోనని స్పష్టం చేసినట్లు సమాచారం. -
టీఆర్ఎస్లోకి నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు!
హైదరాబాద్: తెలంగాణలో టీడీపీకి షాక్ తగలింది. తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలు నలుగురు త్వరలో కారు ఎక్కేందుకు సిద్ధం అవుతున్నారు. సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, మహేశ్వరం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి, ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్ ఈరోజు ఉదయం ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిశారు. ఈ సందర్భంగా పార్టీలో చేరే అంశంపై చర్చించినట్లు సమాచారం. ఈ కార్యక్రమంలో పలువురు తెలంగాణ మంత్రులు పాల్గొన్నారు. కాగా త్వరలోనే టీఆర్ఎస్ లో చేరనున్నట్లు తలసాని శ్రీనివాస్ యాదవ్, తీగల కృష్ణారెడ్డి చెప్పారు. భేటీ అనంతరం రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మాట్లాడుతూ పార్టీ వీడే వార్తలు అవాస్తవం అన్నారు. నియోజకవర్గ ప్రజల అభిప్రాయాల మేరకే నిర్ణయం ఉంటుందని ఆయన తెలిపారు. కేసీఆర్ ను కలిసేందుకే ఇతర ఎమ్మెల్యేలతో వెళ్లినట్లు ప్రకాష్ గౌడ్ తెలిపారు. -
ఆ బాధ తట్టుకోలేకే.. టీడీపీని వీడాం!
-
టీడీపీని వీడింది అందుకే!
-
లోకేష్ నాయకత్వం మమ్మల్ని అవమానించటమే
హైదరాబాద్ : తెలంగాణ ప్రజలకు మేలు చేయాలన్న ఉద్దేశంతోనే కేసీఆర్‌కు మద్దతు తెలుపుతున్నామని సైకిల్ దిగి కారెక్కిన టీడీపీ ఎమ్మెల్యేలు తెలిపారు. బంగారు తెలంగాణ కోసమే టీఆర్ఎస్లో చేరామని మహేశ్వరం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి అన్నారు. తెలంగాణలో టీడీపీ నాయకులే లేనట్లు లోకేష్‌కు బాధ్యతలు అప్పగిస్తామనటం తమని అవమానించడమేనని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణలో కరెంటు కష్టాలకు చంద్రబాబు నాయుడే కారణమని సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సమావేశాల పేరుతో టీఆర్ఎస్పై విమర్శలు చేయాలని తమపై చంద్రబాబు ఒత్తిడి తెస్తున్నారని ఆయన తెలిపారు. ప్రభుత్వంపై విమర్శలు చేసేందుకే బస్సు యాత్రలు చేయమన్నారని తలసాని విమర్శించారు. తెలంగాణ బిడ్డలుగా ప్రభుత్వానికి చేదోడు వాదోడుగా ఉండాలనుకుంటున్నామన్నారు. మరిన్ని విషయాలు బహిరంగ సభలో ప్రజల ముందు ఉంచుతామని ఆయన తెలిపారు. అభివృద్ధి కోసమే టీఆర్ఎస్లో చేరినట్లు రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తెలిపారు. -
టీ టీడీపీ ఎమ్మెల్యేల రహస్య భేటీ
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారని కొన్ని రోజులుగా ప్రచారంలో ఉన్న ఐదుగురు టీడీపీ ఎమ్మెల్యేలు మంగళవారం రాత్రి నగరంలోని ఓ హోటల్లో రహస్యంగా సమావేశం కావడం తీవ్ర చర్చనీయాంశమైంది. నగరానికి చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు తీగల కృష్ణారెడ్డి, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ప్రకాశ్ గౌడ్, మాధవరం క్రిష్ణారావు, అరికెపూడి గాంధీ బంజారాహిల్స్‌లోని ఓ హోటల్లో సమావేశమై మంతనాలు జరిపినట్లు సమాచారం. వీరితో పాటు మరికొంత మంది టీడీపీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నట్లు సమాచారం.దీనిపై మహేశ్వరం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డిని ‘సాక్షి’ వివరణ కోరగా... 10వ తేదీన చేపడుతున్న బస్సు యాత్ర ఏర్పాట్లపైనే చర్చించేందుకే సమావేశమైనట్లు తెలిపారు. పార్టీ మారే అంశం చర్చకు రాలేదన్నారు.