రాజీనామా లేఖలను చూపిస్తున్న అనితారెడ్డి, తీగల కృష్ణారెడ్డి
మీర్‌పేట, సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా చైర్‌పర్సన్ తీగల అనితారెడ్డి, మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి బీఆర్‌ఎస్‌కు గుడ్‌బై చెప్పా రు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. సోమవారం గాంధీ భవ న్‌లో కాంగ్రెస్ వ్యవహా రాల రాష్ట్ర ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ సమక్షంలో ఆ పార్టీలో చేరనున్నట్టు అనితారెడ్డి, తీగల కృష్ణారెడ్డి ప్రకటించారు. మీర్‌పేటలోని టీకేఆర్ కళాశాలలో ఆదివారం మీడియాతో జెడ్పీ చైర్‌పర్సన్ అనితారెడ్డి మాట్లాడారు. స్థానిక సంస్థలను బలోపేతం చేయడంలో బీఆర్‌ఎస్ పూర్తిగా విఫలమైందనీ, ఫలితంగానే ఇటీవల ఎన్నికల్లో పార్టీ ఓటమిపాలైందన్నారు.
స్థానిక సంస్థల పరిస్థితిని సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా నిధులు సమకూర్చడంతో పాటు అధికారాలు ఇస్తామని హామీ ఇచ్చారని ఆమె తెలిపారు.సహకరించినా ప్రాధాన్యత ఇవ్వలేదు: మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. నగర మేయర్‌గా, ఎమ్మెల్యేగా, హుడా చైర్మన్‌గా దశాబ్దాల పా టు సేవ చేశానన్నారు. తన ఓటమి తరువాత కాంగ్రెస్‌లో గెలిచిన వారికి బీఆర్ ఎస్‌లో మంత్రి పదవి ఇచ్చారని, అయినా పార్టీకి సహకరించినా ప్రాధాన్యత ఇవ్వలేదన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి, తాను గతంలో కలిసి పనిచేశామని.. ఆయన పిలుపు మేరకే కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్టు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment