విజేత టీకేఆర్‌ఈసీ | TKREC won cricket tournment | Sakshi
Sakshi News home page

విజేత టీకేఆర్‌ఈసీ

Published Fri, Feb 7 2014 12:13 AM | Last Updated on Sat, Sep 2 2017 3:24 AM

TKREC won cricket tournment

జింఖానా, న్యూస్‌లైన్: జేఎన్‌టీయూహెచ్ జోన్-ఎ క్రికెట్  టోర్నీ ఫైనల్లో తీగల కృష్ణారెడ్డి ఇంజినీరింగ్ కాలేజి (టీకేఆర్‌ఈసీ) విజేతగా నిలిచింది. గురువారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో టీకేఆర్‌ఈసీ కాలేజి 7 వికెట్ల తేడాతో తీగల కృష్ణారెడ్డి కాలేజి ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజి (టీకేఆర్‌సీఈటీ) జట్టుపై విజయం సాధించింది.
 
 మొదట బరిలోకి దిగిన టీకేఆర్‌సీఈటీ 6 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. నందు (31) మినహా మిగిలిన వారు రాణించలేకపోయారు. టీకేఆర్‌ఈసీ బౌలర్ వ ంశీ 2 వికెట్లు చేజిక్కించుకున్నాడు. తర్వాత బ్యాటింగ్ చేసిన టీకేఆర్‌ఈసీ 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసి గెలిచింది. వంశీ (96) అర్ధ సెంచరీతో రాణించాడు. టీకేఆర్‌సీఈటీ బౌలర్ అనిరుధ్ ఒక వికెట్ తీసుకున్నాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement