cricket tournment
-
Sakshi Premier League 2022: విజేతలు ఎంఎల్ఆర్ఐటి, గౌతమ్ కాలేజి
-
వేద పండితులకు క్రికెట్ టోర్నమెంట్.. కామెంటరీ ఏ భాషలో అంటే!
మహర్షి మహేశ్ యోగి జయంతిని పురస్కరించుకుని మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధాని భోపాల్‌లో వేద పండితులకు క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. టోర్నమెంట్లో పాల్గొనేందుకు ఆటగాళ్లకు ధోతీ కుర్తా డ్రెస్ కోడ్‌గా నిర్ణయించారు. సాధారణంగా క్రికెట్ కామెంటరీ ఇంగ్లీష్, హిందీ,తెలుగు భాషలో వింటూ ఉంటాం. కానీ ఈ టోర్నమెంట్లో సంస్కృత భాషలో కామెంటరీ చెప్పడం విశేషం. నాలుగు రోజుల పాటు ఈ టోర్నీ జరగనుంది. కాగా వైదిక కుటుంబాలలో క్రీడాస్ఫూర్తి, ప్రాచీన భాషని ప్రోత్సహించడమే ఈ టోర్నమెంట్ లక్ష్యమని నిర్వాహకులు చెబుతున్నారు. విజేతలకు నగదు బహుమతులు, వేద పుస్తకాలు, 100 సంవత్సరాల పంచాంగాన్ని బహుకరించారు. కాగా, సంస్కృత బచావో మంచ్ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ తివారీ మాట్లాడుతూ టోర్నమెంట్లో పాల్గొనే క్రీడాకారులు వేదాల ప్రకారం కర్మలు చేసే వారని పేర్కొన్నారు. ఇక ఈ టోర్నమెంట్‌కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. చదవండి: టీమిండియాకు మరో బిగ్ షాక్.. -
పంచె కట్టి.. బ్యాట్ పట్టి
సాక్షి, ఆదిలాబాద్: రైతులంటే నాగలి చేతపట్టి దుక్కి దున్నడమే కాదు.. బ్యాట్ పట్టి క్రికెట్ కూడా ఆడగలమని నిరూపించారు ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రానికి చెందిన రైతులు. బోథ్‌లోని లాల్‌పిచ్ మైదానంలో నిర్వహిస్తున్న క్రికెట్ పోటీల్లో మండల కేంద్రానికి చెందిన రైతులంతా కలిసి జట్టుగా ఏర్పడి పోటీల్లో తలపడేందుకు సిద్ధమయ్యారు. ఆదివారం ఎస్ఎస్ టీంతో తలపడ్డారు. ఆసక్తిగా సాగిన ఈ మ్యాచ్ ఏడు పరుగుల తేడాతో రైతుల జట్టు ఓడిపోయింది. కానీ ఆ రైతులు మాత్రం తమ ఆటతీరుతో అందరినీ ఆకట్టుకున్నారు. యువకులు షూస్, యూనిఫాంతో టోర్నీ ఆడగా.. రైతులు పంచెకట్టు, కాళ్లకు చెప్పులు లేకుండా మ్యాచ్ ఆడారు. -
రాజస్తాన్ క్రికెట్లో 'తాలిబన్' జట్టు కలకలం
జైపూర్: తాలిబన్.. ఇప్పుడు ఈ పేరు అఫ్గన్‌లో హడలెత్తిస్తుంది. అఫ్గనిస్తాన్‌లో దాదాపు రెండు దశాబ్దాల తర్వాత తాలిబన్ల అరాచక పాలన మొదలవడంతో అక్కడి ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. తాలిబన్ పాలన మొదలయినప్పటి నుంచి అఫ్గన్‌లో రోజుకో వార్త వెలుగుచూసింది. అలాంటి తాలిబన్ పదం రాజస్తాన్ క్రికెట్లో కలకలం రేపింది. విషయంలోకి వెళితే రాజస్తాన్‌లోని జైసల్మేర్ జిల్లాలోని బినియానా గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. చదవండి: ఇంగ్లండ్ గడ్డపై తొలి టెస్టు సిరీస్ విజయానికి 50 ఏళ్లు ఈ టోర్నమెంట్లో ఒక ఊరు 'తాలిబన్' పేరుతో పాల్గొంది. పోఖ్రాన్‌కు 36 కిమీ దూరంలో ఉన్న ఆ ఊరిలో ముస్లింలు ఎక్కువగా ఉన్నారు. కాగా టోర్నమెంట్లో ఒక జట్టు తాలిబన్ పేరు పెట్టుకోవడంపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో అప్రమత్తమైన టోర్నీ నిర్వాహకులు తాలిబన్ జట్టును టోర్నీ నుంచి తొలగించి క్షమాపణలు చెప్పుకున్నారు. '' తొలుత తాలిబన్ పేరుతో జట్టు ఉన్నట్లు తాము గుర్తించలేకపోయామని.. మ్యాచ్‌లో భాగంగా స్కోర్‌ను ఎంటర్ చేసే క్రమంలో గమనించాం. వెంటనే సదరు జట్టును టోర్నీ నుంచి తొలగించామని.. దేశానికి క్షమాపణలు చెబుతూ.. లీగ్ తరపున ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకుంటామని'' నిర్వాహకులు పేర్కొన్నారు. కాగా నిషేధం విధించిన తాలిబన్ జట్టు టోర్నమెంట్లో తొలి మ్యాచ్ ఆడడం విశేషం. చదవండి: Mark Boucher: 'నా ప్రవర్తనకు సిగ్గుపడుతున్నా.. క్షమించండి' -
వైరల్: మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌కు 5 లీటర్ల పెట్రోల్!
భోపాల్: పెట్రోధరలు రోజురోజుకు భగ్గుమంటున్నాయి. కొన్నిరాష్టాల్లో పెట్రోధరలు ఇప్పటికే సెంచరీ దాటేయగా, మరికొన్ని చోట్ల సెంచరీకి చేరువలో ఉన్నాయి. డీజీల్ కూడా అదే బాటలో పయనిస్తోంది. దీనిపై అన్ని వర్గాల ప్రజలు తమదైన శైలీలో వ్యంగ్యంగా నిరసనలు తెలియజేస్తున్నారు. కాగా, ఇటీవల భోపాల్‌లో జరిగిన క్రికెట్ టోర్నమెంట్.. పెట్రోల్ ధరల సమస్యను ప్రత్యేకమైన రీతిలో హైలైట్ చేసింది. ఫైనల్ మ్యాచ్‌లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు విన్నర్‌కు 5 లీటర్ల పెట్రో క్యాన్‌ను నిర్వాహకులు బహుమతిగా అందించారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు. కాగా, సలావుద్దీన్ అబ్బసీ ఈ పెట్రో అవార్డును గెలుచుకున్నాడు. ఈ టోర్నమెంట్ భోపాల్ కాంగ్రెస్ నాయకుడు మనోజ్‌శుక్లా ఆధ్వర్యంలో జరిగింది. అయితే, ఒక వ్యక్తి పెట్రోల్ బంక్ ముందు నిలబడి పెట్రోల్ రేటు సెంచరి కొట్టేసిందోచ్ అంటూ తన నిరసనను బ్యాట్ పైకెత్తి మరీ చూపించాడు.. కాగా, కరూర్ జిల్లాలో ఒక పెట్రోల్ బంక్ యజమాని తిరుక్కురుల్ పద్యాలను తప్పులు లేకుండా చదివిన విద్యార్థులకు 1 లీటర్ పెట్రోల్‌ను బహుమతిగా ఇచ్చిన సంగతి తెలిసిందే. చదవండి: పెట్రో బేజారు..సైకిల్ షి‘కారు’ -
వావ్: మంత్రి బ్యాటింగ్.. మాజీ కెప్టెన్ బౌలింగ్
సిద్దిపేట: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ అజహరుద్దీన్ బౌలింగ్ వేయగా.. మంత్రి హరీశ్ రావు బ్యాటింగ్ చేశారు. వీరిద్దరి కలయికతో టోర్నమెంట్ అందరినీ ఆకట్టుకుంది. సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా నిర్వహించిన సంబరాల్లో ఆయన మేనల్లుడు, మంత్రి హరీశ్‌రావు ఉత్సాహంగా పాల్గొన్నారు. సిద్దిపేటలోని క్రీడా మైదానంలో సీఎం కేసీఆర్ క్రికెట్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ జరిగింది. పది రోజులుగా జరుగుతున్న మ్యాచ్‌లు బుధవారం ఫైనల్‌కు చేరాయి. ఈ సందర్భంగా జరిగిన డై అండ్ నైట్ మ్యాచ్‌లో మంత్రి హరీశ్ రావు బ్యాటింగ్ చేశారు. అయితే భారత మాజీ క్రికెటర్ అజహరుద్దీన్ బంతులు వేయగా మంత్రి బ్యాటింగ్ చేసి సందడి చేశారు. అయితే మ్యాచ్ విరామ సమయంలో మంత్రి, మాజీ కెప్టెన్ అజహరుద్దీన్ కొద్దిసేపు క్రికెట్ ఆడారు. దీంతో పెద్దసంఖ్యలో ఉన్న అభిమానులు, టీఆర్ఎస్ కార్యకర్తలు కేకలు వేశారు. ఈ టోర్నీలో ఎంసీసీ యూత్, ఇండియన్ టీం-05 జట్లు తలపడ్డాయి. చివరకు ఎంసీసీ యూత్ విజయం సాధించి ట్రోఫీ కైవసం చేసుకుంది. -
క్రికెట్ మ్యాచ్: అలరించిన హరీశ్
సాక్షి, సిద్దిపేట: రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు సారథ్యంలో జిల్లా క్రికెట్ జట్టు మరోసారి స్థానిక మినీ స్టేడియంలో క్రికెట్ క్రీడాభిమానులను అలరిస్తుంది. ఇటీవల హైదరాబాద్ మెడికవర్ డాక్టర్స్ జట్టుతో తలపడి విజయం సాధించిన సిద్దిపేట జట్టు శనివారం రాత్రి హైదరాబాద్ యశోదా హాస్పటల్ జట్టుతో పోటీ పడింది. టాస్ గెలిచిన యశోదా హాస్పటల్ జట్టు కెప్టెన్ కార్తీక్ బ్యాటింగ్‌ను ఎంచుకోగా సిద్దిపేట బౌలింగ్ చేసింది. ఈ పోటీలో సిద్దిపేట జట్టు తరఫున ఎన్ఐఎస్ఏ డైరెక్టర్ సీవీ ఆనంద్, ప్రభుత్వ సలహాదారు ఏకే ఖాన్, సిద్దిపేట సీపీ జోయల్ డేవివీస్ తదితర ప్రముఖులు క్రీడలో పాల్గొనడంతో క్రీడాభిమానులు పెద్ద సంఖ్యలో ఆటను వీక్షించారు. మొదటి ఓవర్‌ను సీవీ ఆనంద్ వేసి కెప్టెన్ కార్తీక్ వికెట్ సాధించడంతో జిల్లా జట్టులో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. 12 ఓవర్లు పూర్తయ్యే సరికి యశోదా హాస్పటల్ జట్టు 58 పరుగులు సాధించి 4 వికెట్లను కోల్పోయింది. -
వారియర్స్ ఎలెవెన్ గెలుపు
అనంతపురం సప్తగిరి సర్కిల్: ఆంధ్ర టి20 క్రికెట్ లీగ్ టోర్నమెంట్లో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌ల్లో చాంపియన్స్ ఎలెవన్‌పై వారియర్స్ ఎలెవన్ ఆరు వికెట్ల తేడాతో... లెజెండ్స్ ఎలెవన్‌పై కింగ్స్ ఎలెవన్ మూడు పరుగుల తేడాతో విజయం సాధించాయి. వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చాంపియన్స్ జట్టు తొలుత 20 ఓవర్లలో 5 వికెట్లకు 155 పరుగులు చేసింది. అశ్విన్ హెబ్బర్ (57 నాటౌట్), వంశీ కృష్ణ (28), రికీ భుయ్ (24) రాణించగా... తేజస్వి 15 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. అనంతరం వారియర్స్ జట్టు 17.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసి నెగ్గింది. ఎం.శ్రీరామ్ (60 బంతుల్లో 75 నాటౌట్; 10 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ప్రశాంత్ కుమార్ (33) ఆకట్టుకున్నాడు. ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) సీఈఓ ఎం.వి.శివారెడ్డి నుంచి శ్రీరామ్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ పురస్కారం అందుకున్నాడు. సంక్షిప్త స్కోరు: కింగ్స్ ఎలెవన్: 128/8 (20 ఓవర్లలో) (సీఆర్ జ్ఞానేశ్వర్ 47, ధీరజ్ 28, ఆశిష్ రెడ్డి 3/20, జి.మనీశ్ 2/22); లెజెండ్స్ ఎలెవన్: 125 ఆలౌట్ (20 ఓవర్లలో) (జోగేశ్ 43, కార్తీక్ 26, నరేన్ రెడ్డి 4/15, ఆశిష్ 2/27). -
నాట్స్ క్రికెట్ టోర్నీకి అనూహ్య స్పందన
సెయింట్ లూయిస్ : అమెరికాలో తెలుగువారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) తాజాగా సెయింట్ లూయిస్‌లో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించింది.సెయింట్ లూయిస్ పరిసర ప్రాంతాల్లోని తెలుగు క్రీడాకారులు ఎంతో ఉత్సాహంగా ఈ టోర్నమెంట్లో పాల్గొని తమ సత్తా చాటేందుకు ప్రయత్నించారు. ఈ మెగా క్రికెట్ టోర్నీలో 15 జట్లు పాల్గొన్నాయి. ఫైనల్లో వల్కన్స్ టీమ్, బ్లూ పాంతర్స్ టీమ్‌లు తలపడ్డాయి. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన ఈ టోర్నీలో వల్కన్స్ టీమ్ విజేతగా నిలవగా, బ్లూ పాంతర్స్ రన్నరప్‌గా నిలిచింది. వల్కన్స్ టీమ్‌కు చెందిన విశాల్‌కు మ్యాన్ ఆఫ ది మ్యాచ్ అవార్డు దక్కింది. బ్లూ పాంతర్స్‌కు చెందిన వెంకటేష్ ఉత్తమ బ్యాట్మెన్గా, వల్కన్స్ టీమ్‌కు చెందిన మహేశ్ బెస్ట్ బౌలర్‌గా ఎంపికయ్యారు. ఈ టోర్నమెంట్ సెయింట్ లూయిస్ చాప్టర్ నాట్స్ సమన్వయకర్త నాగ శ్రీనివాస శిష్ట్ల, నాట్స్ నేషనల్ కో ఆర్డినేటర్ రమేశ్ బెల్లం ఆధ్వర్యంలో దిగ్విజయంగా జరిగింది. కాగా.. ఈ మెగా టోర్నీకి శ్రీధర్ పాటిబండ్ల, ప్రీతమ్ తమవంతు సహాయ సహకారాలు అందించారు. వ్యాపారవేత్త విజయ్ బుడ్డి, టీఏఎస్ ప్రెసిడెంట్ సురేంద్ర బాచిన, అప్పల నాయుడు, శిష్ట్ల నాగశ్రీనివాస్, రమేశ్ బెల్లం విజేతలకు, అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఆటగాళ్లకు బహుమతులు అందించారు. టోర్నమెంటుకు నాట్స్ జాతీయ నాయకత్వం నుంచి మద్దతు అందించిన నాట్స్ అధ్యక్షుడు శ్రీనివాస్ మంచికలపూడికి ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. -
ధోతి క్రికెట్.. సంస్కృతంలో కామెంట్రీ!
వారణాసి : ఈ తరం పిల్లలు ధోతులు కట్టుకోమంటే.. ధోతులా.. మేమా? అంటూ జారుకుంటారు. జీన్స్, టీషర్ట్స్కు ఇచ్చే ప్రాధాన్యతను మన ఆచారాలు, సంప్రదాయా దుస్తులకు ఏ మాత్రం ఇవ్వరు. కానీ మన ఆచారాలను, సంప్రదాయాలను పాటించే పాఠశాలు, పిల్లలు మన దేశంలో ఇంకా ఉన్నారు. వారు ధోతులు, కుర్తాలు ధరించడమే కాదు.. క్రికెట్‌ను కూడా వాటితోనే ఆడుతున్నారు. పైగా ఏలాంటి ఇబ్బంది లేకుండా మైదానంలో ఇరగదీస్తున్నారు. ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే ఈ మ్యాచ్‌లకు సంస్కృతంలోనే కామెంట్రీ చెప్పడం. ప్రస్తుతం ఈ క్రికెట్ టోర్నీ.. ఈ పాఠశాలలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. క్రికెట్ అంటే పడి చచ్చే మనదేశంలో ధోతులతో క్రికెట్.. సంస్కృతం కామెంట్రీ అనగానే జనాలు విపరీతమైన ఆసక్తి కనబరుస్తున్నారు. అయ్యో.. ఎక్కడా ఈ టోర్నీ అంటూ ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం ఈ టోర్నీ ‘సంస్కృతం క్రికెట్ లీగ్’గా ప్రాచూర్యం పొందింది. ఇంతకీ ఈ టోర్నీ సంగతేంటంటే.. వారణాసీలోని సంపూర్ణానంద సంస్కృత విద్యాలయాల 75వ వ్యవస్థాపక దినోత్వవం సందర్భంగా క్రికెట్ టోర్నీని నిర్వహిస్తున్నారు. ఈ టోర్నీలో వారణాసీ వ్యాప్తంగా ఉన్న సంస్కృత పాఠశాలలు పాల్గొంటున్నాయి. ఈ టోర్నీలో పాల్గొనే ఆయా పాఠశాల విద్యార్థులు ధోతి, కుర్తాతో పాటు మూడు నామాలు పెట్టుకొని బరిలోకి దిగుతున్నారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ చేస్తున్నారు. అంపైర్లు కూడా కుర్తా, ధోతిలోనే ఆడిస్తున్నారు. ఈ టోర్నీకి సంస్కృతంలో కామెంట్రీ కూడా చెబుతున్నారు. ఈ ధోతి క్రికెట్‌ను చూసేందుకు చుట్టు పక్కల ప్రజలు ఎగబడుతున్నారు. విద్యార్థుల్లో ప్రతిభను ప్రోత్సహించేందుకు ఈ క్రికెట్ టోర్నీ నిర్వహిస్తున్నట్లు పాఠశాల టీచర్ గణేశ్ దత్ శాస్త్రి మీడియాకు తెలిపారు. ‘ఈ టోర్నీ 10 ఓవర్ల ఫార్మాట్. వారణాసిలో అన్నీ సంస్కృత పాఠశాలలు ఈ టోర్నీలో పాల్గొంటున్నాయి. మొత్తం 5 జట్లు పోటీ పడుతున్నాయి. విద్యార్థులందరూ.. ధోతి,కుర్తాలను ధరిస్తారు. ఈ టోర్నీ మరో ప్రత్యేకత ఏంటంటే.. నారాయణ మిశ్రా, వికాస్ దీక్షిత్ అనే ఇద్దరు టీచర్లు సంస్కృతం కామెంట్రీ చెప్తారు. సంస్కృతం క్రికెట్ లీగ్‌గా ఈ టోర్నీ ప్రాచుర్యం పొందడం చాలా గర్వంగా ఉంది’ అని గణేశ్ దత్ సంతోషం వ్యక్తం చేశారు. -
10 నుంచి 22వరకు బీపీపీఎల్
సాక్షి, హైదరాబాద్: ఫిబ్రవరి 10 నుంచి 22 వరకు ఐపీఎల్ తరహాలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో భువనగిరి పార్లమెంట్ ప్రీమియర్ లీగ్ (బీపీపీఎల్) 20–20 క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నట్లు టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి తెలిపారు. శుక్రవారం గాంధీభవన్‌లో బీపీపీఎల్ పోస్టర్‌ను ఆవి ష్కరించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభ గల క్రికెటర్ల నైపుణ్యాన్ని వెలికితీయడం కోసం బీపీపీఎల్ నిర్వహిస్తున్నామని చెప్పారు. భువనగిరి పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాలకు చెందిన మునుగోడు సూపర్ కింగ్స్, జనగామ చాలెంజర్స్, ఆలేరు సన్‌రైజర్స్, భువనగిరి లయన్స్, యాదగిరిగుట్ట రాయల్స్, నకిరేకల్ వారియర్స్, ఇబ్రహీంపట్నం రైడర్స్ అనే ఎనిమిది టీమ్‌లతో ఈ పోటీలు నిర్వహించనున్నట్లు చెప్పారు. మాజీ క్రికెటర్ అజారుద్దీన్ పర్యవేక్షణలో ఈ పోటీలు జరుగుతాయని, లీగ్ విజేతకు రూ. 1.50 లక్షలు, రన్నరప్‌కు రూ.లక్ష, మూడు, నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లకు రూ. 50 వేల బహుమతిని అందిస్తామని తెలిపారు. -
ముగిసిన సింగపూర్ తెలంగాణ క్రికెట్ టోర్నీ
సింగపూర్ : సింగపూర్ 53వ నేషనల్ డే సందర్భంగా అక్కడి తెలుగు వారందరికోసం పెద్ది శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో సింగపూర్ తెలంగాణ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ టోర్నమెంట్ లో మొత్తం 12 జట్లు పాల్గొనగా కొడిమ్యాల్ వెల్ విషర్స్, జానియక్ సిక్సర్స్ జట్లు ఫైనల్స్ కి చేరుకున్నాయి. ఫైనల్లో కొడిమ్యాల్ వెల్ విషర్స్ జట్టు గెలిచి టోర్నమెంట్ విజేతగా నిలిచి ట్రోఫీని కైవసం చేసుకుంది. ఫైనల్లో విజేతలకు, రన్నర్‌గా నిలిచిన జట్టుకు పెద్ది శేఖర్ రెడ్డి బహుమతులు అందజేశారు. అలాగే సెమీ ఫైనల్ వరకు చేరుకున్న జట్టు సభ్యులందరికీ మెమొంటోలు అందజేశారు. అనంతరం పెద్ది శేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఈ క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొన్న వారికి, ఈ టోర్నమెంట్ విజయవంతం చేయడంలో సహకరించిన తెలుగు వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. ముందు ముందు సింగపూర్‌లో నివసిస్తున్న తెలుగు వారందరి కొరకు మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. అలాగే ఈ టోర్నమెంట్‌కి స్పాన్సర్ చేసిన ముద్దం బ్రదర్స్, కుమార్(ప్రొపేనెక్స్), వంశి(జానిక్), తీపి రవిందర్ రెడ్డి, మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. -
జూన్ 3 నుంచి వైఎస్సార్ గ్రామీణ క్రికెట్ టోర్నీ
తిరుపతి రూరల్: చంద్రగిరి నియోజకవర్గంలోని యువతను ప్రోత్సహించేందుకు రాజకీయాలకు అతీతంగా జూన్ 3వ తేదీ నుంచి వైఎస్సార్ గ్రామీణ క్రికెట్ టోర్నమెంట్–2018 నిర్వహించ నున్నట్లు చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తెలిపారు. తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంటలోని వైఎస్సార్ క్రీడా మైదానంలోని పది మైదానాల్లో ఈ టోర్నమెంట్ జరుగుతుందన్నారు. టోర్నమెంట్లో పాల్గొనే వారు ఈ నెల 30వ తేదీ లోపు పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు. తుమ్మలగుంటలోని వైఎస్సార్ క్రీడా మైదానంలో టోర్నమెంట్ ఏర్పాట్లపై శుక్రవారం క్రీడా ప్రముఖులు, ముఖ్య నేతలతో ఎమ్మెల్యే సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నియోజకవర్గంలోని యువతలో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాలను వెలికి తీసేందుకే ఏటా వేలాది మందితో ఈ టోర్నమెంట్‌ను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. చంద్రగిరి నియోజకవర్గానికి చెందిన వారై, కనీసం 15 ఏళ్లు నిండిన వారు మాత్రమే ఈ టోర్నమెంట్లో పాల్గొనేం దుకు అర్హులని, ఎటువంటి ప్రవేశ రుసుం ఉండదని తెలిపారు. ఏ పంచాయతీ క్రీడాకారులు ఆ పంచాయతీ తరుఫునే ఆడాల్సి ఉంటుందని, పాల్గొనే ప్రతి ఒక్కరూ చిరునామా, వయస్సు ధ్రువీకరణ పత్రాలను తప్పని సరిగా తీసుకురావాల్సి ఉంటుందని, ఒక పంచాయతీకి సం బంధించి ఎన్ని జట్లు అయినా పాల్గొన వచ్చని పేర్కొన్నారు. హార్డ్ టెన్నిస్ బాల్‌తో నిర్వహించే ఈ పోటీలు నాకౌట్ పద్ధతిలో జరుగుతాయని పేర్కొన్నారు. జూన్ 3వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఈ టోర్నీ 16 రోజుల పాటు జరుగుతుందని, క్రీడాకారులకు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజన వసతి కల్పించనున్నట్లు తెలిపారు. ప్రతి మ్యాచ్‌కు బెస్ట్ బ్యాట్స్‌మెన్, బెస్ట్ బౌలర్, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ మెడల్స్, ట్రోఫీలను బహుకరించనున్నట్లు పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు, పేర్ల నమోదుకు 98490 98747, 91009 26485, 93936 20318 నంబర్లను సంప్రదిం చవచ్చని కోరారు. విజేతలకు భారీ బహుమతులు టోర్నమెంట్లో విజేతలకు గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ బహుమతులను ఇవ్వనున్నారు. విజేతకు రూ.2 లక్షల నగదుతో పాటు భారీ ట్రోíఫీ, రన్నర్స్‌కు రూ.లక్ష నగదు,ట్రోఫీ, మూడో బహుమతి రూ.50 వేలు, నాలుగో బహుమతి రూ.25 వేలు, ట్రోఫీ బహూకరించనున్నారు. పాల్గొనే ప్రతి జట్టుకు బ్యాట్,బాల్, ప్రతి క్రీడాకారుడికి సర్టిఫికెట్, పార్టిసిపెంట్ మెడల్‌ను అందించనున్నట్టు టోర్నమెంట్ కార్యనిర్వాహక కార్యదర్శి అవిలాల లోకనాథరెడ్డి పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ ఈ అవకాశాన్ని నియోజకవర్గంలోని యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గ్రామీణ క్రీడా ప్రతిభను చాటాలని పేర్కొన్నారు. -
క్రికెట్ టోర్నమెంట్ విన్నర్ కాశీనగర్ జట్టు
పర్లాకిమిడి : గజపతి జిల్లాలోని కాశీనగర్ సమితి అల్లాడ గ్రామపంచాయతీలో నవీన్ సాము స్మారక క్రికెట్ టోర్నమెంట్‌ను మాజీఎమ్మెల్యే, బీజేడీ నాయకుడు కోడూరు నారాయణరావు మంగళవారం ప్రారంభిం చారు. ఈ టోర్నమెంట్లో కాశీనగర్, ఖండవ, అల్లాడ, గుణుపురం టీమ్‌లు పాల్గొన్నాయి. టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్‌లో కాశీనగర్ టీమ్ విన్నర్‌గా, గుణుపురం జట్టు రన్నర్‌గా నిలిచింది. విజేతలకు కాశీనగర్ సమితి చైర్మన్ సీహెచ్ సింహాద్రి, కె.నారాయణరావులు షీల్డులు, బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ శొబొరొ, సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
పోలీస్ అనగానే ‘ఘర్షణ’ గుర్తుకొస్తుంది
అంబర్‌పేట: పోలీస్ అనగానే తనకు ‘ఘర్షణ’ సినిమాలో డీసీపీ రాంచందర్ పాత్ర గుర్తుకు వస్తుందని సినీనటుడు వెంకటేష్ అన్నారు. నగర పోలీస్ విభాగం కమ్యూనిటీ పోలీస్‌లో భాగంగా మొహల్లా క్రికెట్ లీగ్–2019 పేరిట చేపట్టిన ఈస్ట్‌జోన్, నార్త్ జోన్ క్రికెట్ టోర్నమెంట్‌ను మంగళవారం అంబర్‌పేట పోలీస్ శిక్షణ కేంద్రం మైదానంలో నగర అడిషనల్ కమిషనర్ (లా అండ్ ఆర్డర్) డి.ఎస్ చౌహాన్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టోర్నమెంట్ విజేత టీమ్‌కు తన వంతుగా రూ.లక్ష బహుమతి అందిస్తానని ప్రకటించారు. కార్యక్రమంలో ఈస్ట్‌జోన్ డీసీపీ రమేష్, ఈస్ట్‌జోన్ అడిషనల్ డీసీపీ గోవింద్‌రెడ్డి, నార్త్‌జోన్ అడిషనల్ డీసీపీ శ్రీనివాస్, సుల్తాన్‌బజార్ ఏసీపీ చేతన, కాచిగూడ ఏసీపీ నర్సయ్య, ఇన్స్పెక్టర్లు ఏపీ ఆనంద్‌కుమార్, పీజీ రెడ్డి, యాదగిరి రెడ్డి, ఎస్ఐలు పాల్గొన్నారు. కళాకారిణి సాయిప్రియ నృత్యం అలరించింది. -
బౌలింగ్ చేస్తూ కుప్పకూలిపోయాడు
-
బౌలింగ్ చేస్తూ కుప్పకూలాడు!
సాక్షి, బంజారాహిల్స్: అప్పటివరకు ఉత్సాహంగా బౌలింగ్ చేసిన ఓ యువకుడు అంతలోనే మైదానంలో కుప్పకూలిపోయాడు. బౌలింగ్ చేస్తూ ప్రాణాలు విడిచాడు. ఈ విషాద ఘటన బంజారాహిల్స్‌లో జరుగుతున్న ఓ క్రికెట్ టోర్నమెంట్లో చోటుచేసుకుంది. క్రికెట్ టోర్నమెంటులో పాల్గొన్న లాయిడ్ ఆంథోనీ అనే 23 ఏళ్ల యువకుడు బౌలింగ్ చేస్తూ.. మైదానంలోనే ప్రాణాలు విడిచాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
జమ్ము కశ్మీర్లో ధోనికి చేదు అనుభవం
-
ధోనికి చేదు అనుభవం, రెచ్చిపోయిన కశ్మీర్ యువత
జమ్ము కశ్మీర్లో ఏర్పాటువాదులు రెచ్చిపోయారు. భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని పర్యటనలో వ్యతిరేక నినాదాలతో గొంతు చించుకున్నారు. వివరాల్లోకి వెళ్తే జమ్ము కశ్మీర్ పర్యటనకు వెళ్లిన ధోనికి చేదు అనుభవం ఎదురైంది. స్థానిక యువతను ప్రోత్సహిస్తూ భారత సైన్యం ప్రత్యేక క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేసింది. ధోని ఒక ఆర్మీ అధికారిగా టోర్నమెంట్‌ను సందర్శించడానికి ధోని వెళ్లారు. అంతే కాకుండా అక్కడి క్రికెటర్లతో చాలాసేపు చర్చించారు. భవిష్యత్తులో రాష్ట్రం నుంచి భారత్ తరపున ఆడాలంటూ ప్రోత్సహించారు. అయితే ఈపర్యటనలో అనుకోని విధంగా ధోనికి చేదు అనుభవం ఎదురైంది. ధోని వచ్చే సమయంలో కొంత మంది వేర్పాటువాద యువకులు రెచ్చిపోయారు. పాకిస్తాన్ ఆటగాడు ఆఫ్రిదికి అనుకూలంగా 'భూమ్ భూమ్ ఆఫ్రిది' అంటూ నినాదాలు అందుకున్నారు. దీనిపై స్పందించిన అధికారులు వారిని అడ్డుకొన్నారు. అయితే ఈ వివాదంలో ఎవరికీ ఏమీ కాలేదు. ఇప్పుడు ఈవీడియో వైరల్ అయింది. ఇప్పటికే రెండు దేశాల మధ్య చాలా కాలంగా ద్వైపాక్షిక మ్యాచ్‌లు జరగడంలేదు. ఐసీసీ నిర్వహించే టోర్నమెంట్లలో తప్ప ప్రత్యేకంగా సిరీస్‌లు ఆడింది లేదు. అయినా రెండు దేశాల ఆటగాళ్ల మధ్య మంచి స్నేహపూర్వక వాతావరణం ఉంటుంది. పలు సందర్భాల్లో ఈ విషయం వెల్లడైంది. -
క్రికెట్ టోర్నీలో సత్తాచాటిన కొడిమ్యాల వెల్ విషర్స్
సాక్షి, సింగపూర్ : తెలంగాణ కల్చరల్ సొసైటి సింగపూర్ (టీసీఎస్ఎస్) ఆధ్వర్యంలో సింగపూర్‌లోని వుడ్ లాండ్స్ గ్రౌండ్లో క్రికెట్ టోర్నమెంట్ 2017 జరిగింది. ఈ టోర్నీలో కొడిమ్యాల వెల్ విషర్స్ జట్టు అన్ని విభాగాల్లో ఉత్తమ ప్రతిభకనభరిచి విజేతగా నిలిచింది. ఈ ఏడాది క్రికెట్ టోర్నీలో మొత్తం 12 జట్లు పాల్గొన్నాయి. లీగ్స్‌లో గ్రూప్ “ఏ” లో తెలుగు రైడర్స్, స్వేచ్ఛా టీం, స్కై టీం, గ్రూప్ “బి” లో భాగ్యనగర్ రైడర్స్, 11 స్టార్స్, ఇండియన్ రోలర్స్, గ్రూప్ ‘సి’ లో ముత్యంపేట్ కింగ్స్, జగిత్యాల్ టైగర్స్, తెలంగాణ లెజెండ్స్, గ్రూప్ ‘డి’ లో కొడిమ్యాల వెల్ విషర్స్, క్రిక్ బుల్స్, రాయల్ స్టార్స్ తలపడ్డాయి. లీగ్స్ అనంతరం స్వేచ్ఛా టీం , కొడిమ్యాల వెల్ విషర్స్, జగిత్యాల్ టైగర్స్, ఇండియన్ రోలర్స్ సెమీఫైనల్‌కు చేరుకున్నాయి. జగిత్యాల్ టైగర్స్, కొడిమ్యాల వెల్ విషర్స్ మధ్య జరిగిన ఫైనల్ పోరులో కొడిమ్యాల వెల్ విషర్స్ విజేతగా నిలిచింది. టోర్నమెంట్ బెస్ట్ బౌలర్, బెస్ట్ బ్యాట్స్ మెన్ కూడా కొడిమ్యాల వెల్ విషర్స్ టీం చెందిన ఆటగాళ్లు గెలుచుకున్నారు. ఈ టోర్నమెంట్‌కు సమన్వయకర్తలుగా ప్రాంతీయ కార్యదర్శి అలసాని క్రిష్ణా రెడ్డి, చిల్క సురేశ్, ఆర్సిరెడ్డి, చెట్టిపల్లి మహేశ్, దామోదర్ గోపగోని, జుట్టు ఉమేందర్, బైరి రవి, పిల్లి రంజిత్‌లు వ్యవహరించారు. సొసైటి సభ్యలు మాట్లాడుతూ.. సింగపూర్‌లో తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ముందు తరాలకు అందించడానికి వివిధ పండుగలను జరుపుకోవడమే కాకుండా క్రీడాస్పూర్తిని పెంపొందించడానికి క్రికెట్, బ్యాడ్మింటన్వంటి ఆటల పోటీలు ప్రతీ సంవత్సరం నిర్వహిస్తున్నామన్నారు. ఈ టోర్నమెంట్లో పాల్గొన్న అన్ని జట్ల క్రీడాస్పూర్తికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ పోటీలను సొసైటి ఉపాధ్యక్షులు పెద్ది చంద్ర శేఖర్ రెడ్డి, బూర్ల శ్రీనివాస్, నీలం మహేందర్, ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ కుమార్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు గార్లపాటి లక్ష్మా రెడ్డి, పెరుకు శివరామ్ ప్రసాద్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా టోర్నమెంట్ విజయవంతం కావడానికి తోడ్పాటు అందించిన ప్రతి ఒక్కరికి, ప్రత్యేకంగా చిట్ల విక్రమ్, గొనె నరేందర్, గండ్ర సునీల్ కుమార్, దీరజ్ గౌడ్ కు సొసైటి కార్యవర్గ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. -
అదరగొడుతున్న సినీ తారలు.. నీరసించిన నేతలు
హైదరాబాద్ : నగర కార్పొరేటర్లు-సినీ స్టార్స్ మధ్య జరుగుతున్న క్రికెట్ టోర్నమెంట్ ఎల్బీస్టేడియంలో ఆదివారం కోలాహలంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రులు తలసాని శ్రీనివాస్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి, టీఆర్ఎస్ గ్రేటర్ అధ్యక్షుడు మైనంపాటి హాజరయ్యారు. సినీస్టార్స్ శ్రీకాంత్, తరుణ్, సంజనతో పాటు పలువురు సినీతారలు ప్రముఖులు రావడంతో.. టోర్నమెంట్లో సందడి నెలకొంది. ముందుగా మహిళ మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన మహిళ కార్పొరేటర్స్టీం ఫీల్డింగ్ ఎంచుకోగా.. సినీ తార సంజన జట్టు బ్యాటింగ్ చేస్తోంది. సంజన జట్టు భారీ స్కోరు దిశగా పయనిస్తుండటంతో.. కార్పొరేటర్ల జట్టు నీరసించింది. విద్యుత్ ఆదా చేయడానికి ఎల్ఈడీ లైట్ల వాడకం పెంచాలని సినీస్టార్స్ చేస్తున్న ప్రచారం ఆకట్టుకుంటోంది. -
సూపర్ సిక్స్ క్రికెట్ విజేత కైకలూరు 'ఏ' జట్టు
కైకలూరు : సూపర్ సిక్స్ ఫార్మాట్‌తో ఉత్సంఠభరితంగా జరిగిన క్రికెట్ పోటీల్లో కైకలూరు 'ఏ' జట్టు విజేతగా నిలిచింది. సంక్రాంతి పండగ సందర్భంగా స్థానిక వైవీ ఎన్నార్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఈనెల 11న ప్రారంభమైన పోటీలు సోమవారం ముగిశాయి. టోర్నమెంట్లో మొత్తం 28 జట్లు పాల్గొన్నాయి. కేవలం ఆరు ఓవర్లు, ఆరుగురు ఆటగాళ్లతో సూపర్ సిక్స్ పోటీలు జరిగాయి. ఫైనల్ మ్యాచ్‌లో కైకలూరుకు చెందిన రాము సిక్సర్స్, కైకలూరు 'ఏ' జట్టు మధ్య పోటీ జరిగింది. టాస్ గెలిచిన రాము జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుని ఆరు ఓవర్లలో 58 పరుగులు సాధించింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన కైకలూరు 'ఏ' జట్టు 3 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించి విజయం సాధించింది. ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌గా దిగిన కానిస్టేబుల్ రజనీ 11 బంతుల్లో 30 పరుగులు సాధించాడు. మరో బ్యాట్స్‌మెన్ సతీష్ 9 బంతుల్లో 29 పరుగులు సాధించి జట్టుకు విజయం అందించారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌తో పాటు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ కానిస్టేబుల్ రజనీకి దక్కింది. మొదటి బహుమతి రూ.15,000ను వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్), రెండో బహుమతి రూ.12.000ను జనసేనకు చెందిన బాబీ, వదర్లపాడు చందులు సమకూర్చారు. యూత్ నాయకుడు కేవీఎన్‌ఎం నాయుడు విజేతలకు బహుమతులు అందించారు. అంపైర్లుగా అజ్మల్, రాంబాబు వ్యవహరించారు. నిర్వాహకులు ప్రసాద్, నిమ్మలసాయి, కిరణ్ పాల్గొన్నారు. -
పూర్తి ఆధిక్యంలో ముంబయి జట్టు
గుంటూరు స్పోర్ట్స్ : పేరేచర్లలోని ఏసీఏ, నరేంద్రనాథ్ క్రికెట్ గ్రౌండ్స్‌లో జరుగుతున్న డి.వి.సుబ్బారావు మెమోరియల్ టోర్నమెంట్‌లోని మ్యాచ్‌లు హోరాహోరీగా సాగుతునాయి. శుక్రవారం అట ముగిసే సమయానికి ముంబయి జట్టు 248 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. శనివారం తొలి ఇన్నింగ్ ప్రారంభించిన కర్నాటక జట్టు 32 ఓవర్లలో కేవలం 52 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. అనంతరం రెండో ఇన్నింగ్ ప్రారంభించిన ముంబయి జట్టు రెండో రోజు అట ముగిసే సమయానికి 58 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. -
హైదరాబాద్, ఛత్తీస్‌గఢ్ మ్యాచ్ డ్రా
కల్నల్ సీకే నాయుడు ట్రోఫీ రాయ్‌పూర్: కల్నల్ సీకే నాయుడు ట్రోఫీ అండర్-23 క్రికెట్ టోర్నమెంట్లో హైదరాబాడ్, ఛత్తీస్‌గఢ్ జట్ల మధ్య జరిగిన నాలుగు రోజుల లీగ్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్‌లో హిమాలయ్ అగర్వాల్ సెంచరీ సాధించగా, రెండో ఇన్నింగ్స్‌లో ఎ. అకాశ్ 4 పరుగుల తేడాతో సెంచరీని చేజార్చుకున్నాడు. గురువారం 245/6 ఓవర్‌నైట్ స్కోరుతో చివరి రోజు ఆట కొనసాగించిన హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్‌లో 78.3 ఓవర్లలో 294 పరుగుల వద్ద ఆలౌటైంది. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్ హిమాలయ్ అగర్వాల్ (182 బంతుల్లో 114, 16 ఫోర్లు) శతకం సాధించాడు. మిగతా బ్యాట్స్‌మెన్ రాణించలేకపోయారు. ఛత్తీస్‌గఢ్ బౌలర్లలో షానవాజ్ 5, అహ్మద్ 2 వికెట్లు పడగొట్టారు. దీంతో ఛత్తీస్‌గఢ్‌కు 316 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. తర్వాత ఫాలోఆన్ ఆడిన హైదరాబాద్ మ్యాచ్ ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 63 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. ఆకాశ్ (193 బంతుల్లో 96, 16 ఫోర్లు) రాణించాడు. వంశీవర్ధన్ 41, కె.సుమంత్ 25 పరుగులు చేశారు. ఛత్తీస్‌గఢ్ బౌలర్ వి.కె.రాజ్‌పుత్‌కు 2 వికెట్లు దక్కాయి. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో ఛత్తీస్‌గఢ్ 3 పాయింట్లు పొందగా, హైదరాబాద్‌కు ఒక పాయింట్ దక్కింది. -
విజేత ఢిల్లీ పబ్లిక్ స్కూల్
సాక్షి, హైదరాబాద్: మల్క కొమరయ్య (ఎం.కె.) అంతర పాఠశాలల క్రికెట్ టోర్నమెంట్లో అండర్-15, 17 విభాగాల్లో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ (డీపీఎస్) విజేతగా నిలిచింది. అండర్-17 విభాగంలో శనివారం జరిగిన ఫైనల్లో డీపీఎస్ (నాచారం) జట్టు 17 పరుగుల తేడాతో సెయింట్ పీటర్స్ (బోయిన్పల్లి) జట్టుపై గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన డీపీఎస్... నిర్ణీత 15 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. యశస్వి (47 బంతుల్లో 69; 10 ఫోర్లు, 2 సిక్సర్లు), భావిన్ (4 బంతుల్లో 24; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) దూకుడుగా ఆడి డీపీఎస్‌కు భారీ స్కోరునందించారు. అనంతరం సెయింట్ పీటర్స్ 15 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 106 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆ జట్టులో శ్రీజిత్ (22 బంతుల్లో 33) ఒక్కడే రాణించాడు. అండర్-15 ఫైనల్లోనూ డీపీఎస్ (నాచారం) జట్టు సెయింట్ పీటర్స్ (బోయిన్పల్లి) జట్టుపైనే ఆరు పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన డీపీఎస్... భావిన్ (24 బంతుల్లో 34) రాణించడంతో 12 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 82 పరుగులు చేసింది. లక్ష్యఛేదనలో సెయింట్ పీటర్స్ 7 వికెట్లు కోల్పోయి 76 పరుగులు మాత్రమే చేయగలిగింది. వికాస్ (26 బంతుల్లో 26) ఒక్కడే పోరాడాడు. డీపీఎస్ బౌలర్లు అమృత్ (2/17), అన్విత్ (2/21) రెండేసి వికెట్లు పడగొట్టారు. భవాన్స్ గెలుపు ఇదే టోర్నీ అండర్-13 విభాగంలో భవాన్స్ (సైనిక్‌పురి) జట్టు విజేతగా నిలిచింది. డీపీఎస్ (నాచారం)తో జరిగిన ఫైనల్లో భవాన్స్ 10 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన డీపీఎస్... అమృత్ (36 బంతుల్లో 51), రిషి (18 బంతుల్లో 23) రాణించడంతో 12 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 100 పరుగులు చేసింది. అనంతరం భవాన్స్.. వికెట్లేమీ కోల్పోకుండానే 101 పరుగులు చేసి గెలిచింది. అశ్మిత్ (31 బంతుల్లో 51) అర్ధసెంచరీతో భవాన్స్‌కు విజయాన్నందించాడు.