సిద్దిపేట: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ అజహరుద్దీన్ బౌలింగ్ వేయగా.. మంత్రి హరీశ్ రావు బ్యాటింగ్ చేశారు. వీరిద్దరి కలయికతో టోర్నమెంట్ అందరినీ ఆకట్టుకుంది. సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా నిర్వహించిన సంబరాల్లో ఆయన మేనల్లుడు, మంత్రి హరీశ్‌రావు ఉత్సాహంగా పాల్గొన్నారు. సిద్దిపేటలోని క్రీడా మైదానంలో సీఎం కేసీఆర్ క్రికెట్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ జరిగింది. పది రోజులుగా జరుగుతున్న మ్యాచ్‌లు బుధవారం ఫైనల్‌కు చేరాయి.
ఈ సందర్భంగా జరిగిన డై అండ్ నైట్ మ్యాచ్‌లో మంత్రి హరీశ్ రావు బ్యాటింగ్ చేశారు. అయితే భారత మాజీ క్రికెటర్ అజహరుద్దీన్ బంతులు వేయగా మంత్రి బ్యాటింగ్ చేసి సందడి చేశారు. అయితే మ్యాచ్ విరామ సమయంలో మంత్రి, మాజీ కెప్టెన్ అజహరుద్దీన్ కొద్దిసేపు క్రికెట్ ఆడారు. దీంతో పెద్దసంఖ్యలో ఉన్న అభిమానులు, టీఆర్‌ఎస్ కార్యకర్తలు కేకలు వేశారు. ఈ టోర్నీలో ఎంసీసీ యూత్, ఇండియన్ టీం-05 జట్లు తలపడ్డాయి. చివరకు ఎంసీసీ యూత్ విజయం సాధించి ట్రోఫీ కైవసం చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment