
సీఎం కేసీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకొని కేక్ కట్ చేస్తున్న మంత్రి హరీశ్ రావు, హీరో నాని, క్రికెటర్ అంబటి రాయుడు
సాక్షి, సిద్దిపేట: కే.. అంటే కారణజన్ముడు.. సీ.. అంటే చిరస్మరణీయుడు.. ఆర్.. అంటే మన తలరాతలను మార్చిన మహనీయుడు కేసీఆర్ అని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అభివర్ణించారు. సీఎం కేసీఆర్ పుట్టిన రోజు శుక్రవారం. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి సిద్దిపేట జయశంకర్ క్రికెట్ స్టేడియంలో కేసీఆర్ క్రికెట్ టోర్నమెంట్ సీజన్–3ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ‘దసరా’సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. కార్యక్రమంలో హీరో నాని మాట్లాడుతూ 373 టీమ్‌లతో ప్రపంచంలో ఎక్కడ కూడా క్రికెట్ టోర్నమెంట్ జరగలేదన్నారు. ఇంత పెద్ద టోర్నమెంట్‌ను నిర్వహిస్తున్న మంత్రి హరీశ్‌ను అభినందించారు. క్రికెటర్ అంబటి రాయుడు మాట్లాడుతూ తాను కేసీఆర్ అభిమానినన్నారు.
Comments
Please login to add a commentAdd a comment