Cricket tournament
-
న్యూ జెర్సీలో దిగ్విజయంగా నాట్స్ క్రికెట్ టోర్నమెంట్
న్యూ జెర్సీ: అమెరికాలో తెలుగువారిలో క్రీడా స్ఫూర్తిని పెంచేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా న్యూ జెర్సీలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించింది. న్యూ జెర్సీలో దాదాపు 200 మంది తెలుగు క్రికెట్ ప్లేయర్లు ఈ టోర్నమెంట్లో పాల్గొన్నారు. రెండు రోజుల పాటు జరిగిన ఈ టోర్నీలో ఫైనల్ మ్యాచ్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. చివరకు ఈ టోర్నీలో ఎడిసన్ కింగ్స్ విజేతగా నిలిచింది. రామ్ కోట ఎడిసన్ కింగ్స్ కెప్టెన్‌గా టీంను గెలిపించడంలో కీలకపాత్ర పోషించారు. ఎఫ్ 5 జట్టు రన్నరప్‌గా నిలిచింది. ఈ టీంకు కెప్టెన్‌గా తులసి తోట వ్యవహరించారు.ఈ టోర్నమెంట్ విజయవంతం చేసేందుకు నాట్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గత వారం రోజులుగా విశేష కృషి చేశారు. నాట్స్ న్యూ జెర్సీ విభాగం క్రీడా సమన్వయకర్త రమేశ్ నెల్లూరి చేసిన కృషి మరువలేనిదని నాట్స్ నాయకత్వం ప్రత్యేకంగా అభినందించింది. తెలుగువారిని కలిపే ఏ కార్యక్రమంలోనైనా నాట్స్ ముందుంటుందని నాట్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీహరి మందాడి అన్నారు. ఈ టోర్నమెంట్లో పాల్గొన్న క్రికెటర్లను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. నాట్స్ నాయకులు సురేంద్ర పోలేపల్లి, ప్రశాంత్ కుచ్చు, వెంకటేష్ కోడూరి, కిరణ్ మందాడి, ప్రసాద్ టేకి, క్రాంతి యడ్లపూడి, హరీష్ కొమ్మాలపాటి, రాకేష్ వేలూరి, ధర్మేంద్ర ముమ్మిడి తదితరులు ఈ టోర్నీ విజయవంతం కావడంలో కీలక పాత్ర పోషించారు.ఈ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమానికి నాట్స్ జాతీయ నాయకులు గంగాధర దేసు, బిందు యలమంచిలి, టిపి రావు, శ్రీహరి మందాడి, శ్రీనివాస్ భీమినేని, శ్రీనివాస్ మెంట, మోహన్ కుమార్ వెనిగళ్ల, శ్రీనివాస్ కొల్లా, రవి తుబాటి, శంకర్ జెర్రిపోతుల, వెంకట్ గోనుగుంట్ల, కృష్ణ గోపాల్ నెక్కంటి, బ్రహ్మానందం పుసులూరి, రమేష్ నూతలపాటి, చంద్రశేఖర్ కొణిదెల, వంశీ వెనిగళ్ల, సూర్య గుత్తికొండ, సురేష్ బొల్లు, రాజేష్ బేతపూడి, శ్రీధర్ దోనేపూడి, హరీష్ కొమ్మాలపాటి, బినీత్ పెరుమాళ్ల తదితరులు విచ్చేసి క్రికెటర్ల క్రీడా స్ఫూర్తిని అభినందించారు. నాట్స్ బోర్డు డైరెక్టర్స్ టీపీ రావు, బిందు యలమంచిలి, మాజీ అధ్యక్షుడు గంగాదర్ దేసు, వైస్ ప్రెసిడెంట్ (ఆపరేషన్స్) శ్రీనివాస్ భీమినేని నాట్స్ చేస్తున్న భాష, సేవా కార్యక్రమాలు, మెంబెర్షిప్ డ్రైవ్ గురించి అందరికీ తెలియజేశారు. న్యూజెర్సీ నాట్స్ క్రికెట్ టోర్నమెంట్ విజయంలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికి నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. -
చికాగోలో దిగ్విజయంగా నాట్స్ క్రికెట్ టోర్నమెంట్
చికాగో: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) చికాగోలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించింది. ఈ టోర్నమెంట్లో దాదాపు 150 మందికి పైగా క్రికెటర్లు తమ ప్రతిభను చాటేందుకు పోటీపడ్డారు. ఇక ఈ టోర్నీలో ఎస్ఆర్కె జట్టు చాంపియన్‌గా నిలిచింది. టోర్నమెంట్ ఆసాంతం అద్భుతంగా ఆడిన ఆటగాళ్లను, రన్నరప్‌గా నిలిచిన లయన్స్ టీంను నాట్స్ అధ్యక్షులు మదన్ పాములపాటి అభినందించారు.అదే విధంగా.. నాట్స్ చికాగో విభాగం ఈ క్రికెట్ టోర్నమెంట్‌ను చక్కగా నిర్వహించినందుకు నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేనికి, ఇందులో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. నాట్స్ కార్యవర్గ సభ్యుడు శ్రీహరీష్ జమ్ముల, చికాగో చాప్టర్ సమన్వయకర్త వీర తక్కెళ్లపాటి లు చక్కటి ప్రణాళిక, సమన్వయంతో ఈ టోర్నమెంట్ నిర్వహించారని స్థానిక తెలుగు వారి నుంచి ప్రశంసలు లభించాయి.కాగా ఈ టోర్నమెంట్ నిర్వహణలో చికాగో చాప్టర్ టీమ్ నుంచి నరేంద్ర కడియాల, అంజయ్య వేలూరు, చెన్నయ్య కంబాల, నవీన్ జరుగుల, సింధు కంఠంనేని, గ్రహిత బొమ్మిరెడ్డి, ప్రియాంక పొన్నూరు తదితరులు కీలక పాత్ర పోషించినందుకు నాట్స్ నాయకత్వం వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. నాట్స్ బోర్డ్ డైరెక్టర్ శ్రీనివాస్ పిడికిటి, నాట్స్ కార్యవర్గ సభ్యులు ఆర్కే బాలినేని, ఇమ్మాన్యుయేల్ నీల, నాట్స్ మాజీ కార్యవర్గ సభ్యుడు కృష్ణ నిమ్మగడ్డ, నాట్స్ మాజీ బోర్డ్ డైరెక్టర్లు మూర్తి కొప్పాక, శ్రీనివాస్ అరసాడ, శ్రీనివాస్ బొప్పన లు ఈ టోర్నమెంట్ విజయానికి తమ వంతు సహకారం అందించారు.సతీష్ త్రిపురనేని, పాండు చెంగలశెట్టి, అరవింద్ కోగంటి, సంతోష్ పిండి, సునీల్ ఆకులూరి, సునీల్ ఆరుమిల్లి, అరుల్ బాబు, వినోద్ బాలగురు, గోపి ఉలవ, శ్రీనివాస్ పిల్ల, సుమంత్ పోపూరి, సాయి, హరి, నాగ తదితర వాలంటీర్లు ఈ టోర్నమెంట్ విజయానికి కృషి చేసినందుకు నాట్స్ వారిని ప్రత్యేకంగా అభినందించింది. ఈ టోర్నమెంట్లో విజేతలకు నాట్స్ అధ్యక్షులు మదన్ పాములపాటి, నాట్స్ మాజీ బోర్డ్ డైరెక్టర్ శ్రీనివాస్ అరసాడ టోర్నమెంట్ విజేతలకు, రన్నర్లకు ట్రోఫీలను అందజేశారు. -
HR ప్లేయర్లు.. క్రికెట్లో దుమ్ము రేపారు! విజేతగా విరాట్ ఛాలెంజర్స్
నిత్యం కంప్యూటర్లు, నెట్వర్కింగ్ అంటూ రిక్రూట్మెంట్ చుట్టూ తిరిగే HR(హెచ్ఆర్) ఉద్యోగులు ఇప్పుడు క్రికెట్ మైదానంలో దుమ్ములేపారు. హైదరాబాద్‌లోని మాదాపూర్ వేదికగా జరిగిన రిక్రూట్మెంట్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా జరిగింది. రిక్రూటర్లు లాప్‌టాప్‌లు పక్కనబెట్టి.. క్రికెట్ బ్యాట్లు పట్టుకుని మురిపించారు. తామూ సిక్సర్లు కొట్టగలమని నిరూపించారు. ఏప్రిల్ 6న ప్రారంభమైన ఈ టోర్నమెంట్లో పాల్గొన్న జట్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. మొత్తం 22 నాకౌట్ మ్యాచ్‌లు జరిగాయి. ఎమోనిక్స్, విరాట్ ఛాలెంజర్స్ మధ్య ఫైనల్ మ్యాచ్‌తో ఈ టోర్నీకి ఎండ్‌కార్డ్ పడింది. ఉత్కంఠగా సాగిన ఫైనల్లో విరాట్ ఛాలెంజర్స్ విజేతగా నిలిచింది. దీంతో సీజన్ 1 టైటిల్‌ను ఛాలెంజర్స్ జట్టు కైవసం చేసుకుంది. ఒక్కో టీంలో 8 మంది ప్లేయర్ల చొప్పున ఆడారు. ఇందులో మహిళలు కూడా ఉండడం విశేషం. అవార్డులు ఎవరికి అంటే? అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఆటగాళ్లకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్(అన్ని మ్యాచ్‌లకు), బెస్ట్ బ్యాట్స్‌మన్, బెస్ట్ బౌలర్, బెస్ట్ ఫీల్డర్ ప్రతిష్టాత్మకమైన మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డలను అందజేశారు. CRI రైడర్స్ ఆటగాడు రోహిత్ బెస్ట్ బ్యాటర్ అవార్డును అందుకోగా.. విరాట్ ఛాలెంజర్స్ ఆటగాడు వెంకట్ ఉత్తమ బౌలర్‌గా నిలిచాడు. అదే విధంగా టోర్నీ ఆసాంతం అద్బుతమైన ప్రదర్శన కనబరిచిన విరాట్ ఛాలెంజర్ ప్లేయర్.. మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్, నవీన్ బెస్ట్ ఫీల్డర్ అవార్డులను సొంతం చేసుకున్నాడు. ఫ్రైజ్ మనీ ఎంతంటే? విజేతగా నిలిచిన విరాట్ ఛాలెంజర్స్‌కు విన్నర్ కప్‌తో పాటు, రూ.50,000 నగదు బహుమతిని అందజేశారు. రన్నరప్‌గా నిలిచిన ఎమోనిక్స్ జట్టుకు రూ.30,000 నగదు బహుమతి లభించింది. ఇక రిక్రూటర్ ప్రీమియర్ లీగ్ ప్రారంభ ఎడిషన్‌లో విజయం సాధించడం పట్ల థ్రిల్‌గా ఉన్నామని టోర్నీ నిర్వాహకుడు రోహిత్ అన్నారు. "పాల్గొన్న అన్ని జట్లు ప్రదర్శించిన ఉత్సాహం, క్రీడాస్ఫూర్తి నిజంగా అభినందనీయం. ఛాంపియన్లుగా అవతరించినందుకు విరాట్ ఛాలెంజర్స్‌కు, అత్యుత్తమ ప్రదర్శన చేసిన అన్ని జట్లకు మా హృదయపూర్వక అభినందనలు. ఈ టోర్నమెంట్ నియామక పరిశ్రమలోని నిపుణుల మధ్య ఐక్యత, స్నేహ భావాన్ని పెంపొందించడానికి దోహదపడిందని "రోహిత్ పేర్కొన్నాడు.ఈ టోర్నమెంట్‌ను లింక్డ్ ఇన్, కన్రెప్, డిలిజెంట్తో పాటు స్టాఫింగ్ రివార్డ్స్ సంస్థలు స్పాన్సర్ చేశాయి. -
Ranji Trophy 2024: ముంబై 224 ఆలౌట్
ముంబై: విదర్భ జట్టుతో ఆదివారం మొదలైన రంజీ ట్రోఫీ క్రికెట్ టోర్నీ ఫైనల్లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 64.3 ఓవర్లలో 224 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్లు పృథ్వీ షా (46; 5 ఫోర్లు), భూపేన్ లాల్వాని (37; 4 ఫోర్లు) తొలి వికెట్‌కు 81 పరుగులు జోడించారు. భూపేన్ అవుటయ్యాక ముంబై పతనం మొదలైంది. ముంబై 111/6తో ఇబ్బందుల్లో పడిన దశలో శార్దుల్ ఠాకూర్ (69 బంతుల్లో 75; 8 ఫోర్లు, 3 సిక్స్‌లు) విదర్భ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. 37 బంతుల్లోనే అర్ధ సెంచరీ చేసిన శార్దుల్ చివరి వికెట్‌గా వెనుదిరిగాడు. విదర్భ బౌలర్లలో హర్‡్ష దూబే, యశ్ ఠాకూర్ 3 వికెట్ల చొప్పున తీయగా... ఉమేశ్ యాదవ్ 2 వికెట్లు పడగొట్టాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన విదర్భ ఆట ముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 31 పరుగులు చేసింది. -
జీజేఆర్ క్రికెట్ టోర్నీ విజేత ‘హైకోర్టు’ జట్టు
సాక్షి,హైదరాబాద్: హైదరాబాద్ మెట్రోపాలిటన్ క్రిమినల్ కోర్టు న్యాయవాదుల క్రికెట్ అసోసియే షన్ ఆధ్వర్యంలో జరిగిన జీజేఆర్ టోర్నమెంట్ పోటీల్లో హైకోర్టు న్యాయవాదుల జట్టు విజేతగా నిలిచింది. ఫైనల్ విజేతగా నిలిచిన జట్టుకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూరేపల్లి నందా శనివారం కప్‌ను అందజేశారు. బోడుప్పల్‌లోని సాగర్ క్రికెట్ గ్రౌండ్, ఆరంఘర్లోని విజయానంద్ క్రికెట్ గ్రౌండ్లో జరిగిన పోటీల్లో నగరంలోని 13 కోర్టుల న్యాయవాదులు పాల్గొన్నారు. సెమీ ఫైనల్లో సిటీ సివిల్ కోర్టు న్యాయవాదుల జట్టు (78)పై హైకోర్టు టీమ్(79) విజయం సాధించింది. అనంతరం జరిగిన ఫైనల్లో హైకోర్టు జట్టు... హైదరాబాద్ మెట్రోపాలిటన్ క్రిమినల్ కోర్టు టీమ్‌పై గెలుపొందింది. మ్యాన్ ఆఫ్‌ది ఫైనల్లో బెస్ట్ బ్యాట్స్‌మన్‌గా వి.మనోహర్, బెస్ట్ బౌలర్‌గా సాయిచందర్ నిలిచారు. ఈ కప్ అందజేత కార్య క్రమంలో బార్ కౌన్సిల్ వైస్ చైర్మన్ కె.సునీల్‌గౌడ్, కౌన్సిల్ సభ్యుడు జితేందర్‌రెడ్డి, కటకం శారద, శ్రీనివాస్, సత్యనారాయణ పాల్గొన్నారు. -
చిత్తూరు, అనంత జట్ల జయకేతనం
కడప: ఏసీఏ అండర్–23 అంతర్ జిల్లాల మల్టీడేస్ క్రికెట్ టోర్నమెంట్లో చిత్తూరు, అనంతపురం జట్లు జయకేతనం ఎగురవేశాయి. కడప నగరంలోని కేఓఆర్ఎం మైదానంలో 41 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో సోమవారం బరిలోకి దిగిన చిత్తూరు జట్టు 11.5 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 72 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. జట్టులోని శశాంక్ శ్రీవాత్సవ్ 29 పరుగులు చేశాడు. కర్నూలు బౌలర్ సాత్విక్ 2 వికెట్లు తీశాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన కర్నూలు జట్టు 54.4 ఓవర్లలో 220 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. జట్టులోని సాయిసూర్యతేజారెడ్డి 140 పరుగులు చేశాడు. చిత్తూరు బౌలర్లు ఆశిష్‌రెడ్డి 4, మల్లేశన్ 3 వికెట్లు తీశారు. కాగా చిత్తూరు జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 550 పరుగులు చేయగా, కర్నూలు జట్టు 226 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. దీంతో చిత్తూరు జట్టు 176 పరుగుల ఆధిక్యంతో విజయం సాధించింది. ‘అనంత’ విజయం కేఎస్ఆర్ఎం మైదానంలో 282 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో బరిలోకి దిగిన అనంతపురం జట్టు 64.3 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 318 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. జట్టులోని దత్తారెడ్డి 87 పరుగులు చేశాడు. కడప బౌలర్లు అస్లాం 3, విజయ భువనేంద్ర 2, ఆదిల్ హుస్సేన్ 2, సాయికుమార్‌రెడ్డి 2 వికెట్లు తీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన కడప జట్టు 38.4 ఓవర్లలో 172 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. జట్టులోని శివకేశవరాయల్ 24 పరుగులు చేశాడు. అనంతపురం బౌలర్లు లోహిత్సాయికిశోర్ 6 వికెట్లు, మల్లికార్జున 3 వికెట్లు తీశారు. కాగా తొలి ఇన్నింగ్స్‌లో అనంత జట్టు 207 పరుగులు చేయగా, కడప 171 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. దీంతో అనంతపురం జట్టు 182 పరుగుల ఆధిక్యంతో విజయం సాధించింది. -
ఆస్ట్రేలియాలో ఘనంగా ప్రారంభమైన కేసీఆర్ కప్ క్రికెట్ టోర్నీ
బీఆర్ఎస్ ఆస్ట్రేలియా శాఖ అధ్వర్యంలో జరుగుతున్న కేసీఆర్ కప్ క్రికెట్ టోర్నమెంట్ నేడు మెల్బోర్న్లోని పవిలియన్‌లో అట్టహాసంగా ప్రారంభమైంది. ఆస్ట్రేలియాలో స్థిరపడిన భారతీయులతో 3 వారాల పాటు ఈ టోర్నమెంట్ సాగనుందని బీఆర్ఎస్ ఆస్ట్రేలియా శాఖ అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి తెలిపారు . సెప్టెంబర్ 16, 17 తేదీల్లో గ్రాండ్ ఫైనల్స్‌ను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని, భారత దేశానికి చెందిన అన్ని రాష్ట్రాల ఎన్నారైలు, వివిధ సంఘాల నాయకులు, ప్రజలు ఇందులో పాల్గొంటారని నాగేందర్ రెడ్డి పేర్కొన్నారు. టీఆర్ఎస్.. బీఆర్ఎస్గా మారడానికి గల ముఖ్య ఉద్దేశాన్ని అందరికీ తెలియజేయాలని, అందుకు క్రికెట్ టోర్నీనే సరైన వేదిక అని నాగేందర్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ది, సంక్షేమంపై విక్టోరియా స్టేట్ కన్వీనర్ సాయిరాం ఉప్పు చేసిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అందరిని ఆకట్టుకుంది. ఈ ప్రారంభోత్సవ వేడుకలో బీఆర్ఎస్ ముఖ్య నాయకులు సాయి రామ్ ఉప్పు, విశ్వామిత్ర మంత్రి ప్రగడ, వినయ్ సన్నీ గౌడ్, బాలరాజు కుమ్మరి, వంగపల్లి సురేందర్ రెడ్డి, హర్ష రెడ్డి, గండ్ర ప్రశాంత్ రావు, విజయ్ నడదూర్, శివ హైదరాబాద్, హరి పల్ల, కరుణాకర్ నందవరం మరియు వివిధ సంఘాల నాయకులు, ప్రవాస భారతీయులు పాల్గొన్నారు. -
యువత ఐక్యతకే క్రీడా పోటీలు
తాండూరు టౌన్: యువతలో సమైక్యతా భావాలను పెంపొందించేందుకే క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామని ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. పీఎంఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ క్రీడా పోటీలకు, ఎన్నికలకు ఎలాంటిసంబంధం లేదని తెలిపారు. తాండూరు నియోజకవర్గంలో నిర్వహించిన క్రికెట్ టోర్నీ ముగింపు సందర్భంగా బుధవారం పట్టణంలో సుమారు 6వేల మందితో పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఆయన తనయుడు రినీష్‌రెడ్డితో కలిసి విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. పట్నం ఫ్యామిలీకి క్రీడా పోటీలు నిర్వహించడం కొత్తేమీ కాదన్నారు. పీఎమ్మార్ ట్రస్టు తరఫున తన తనయుడు రినీష్‌రెడ్డి నేతృత్వంలో సామాజిక కార్యక్రమాలను మరింత విస్తరిస్తామని ప్రకటించారు. జాబ్ మేళాలు నిర్వహించి యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామని తెలిపారు. వచ్చే సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో సామూహిక వివాహాలు జరిపించనున్నట్లు చెప్పారు. యువత సన్మార్గంలో నడవాలి అనంతరం ఎమ్మెల్సీ తనయుడు రినీష్‌రెడ్డి మాట్లాడుతూ యువత దేశానికి వెన్నెముక అని, యువత తలుచుకుంటే సాధించనిదంటూ ఏదీ లేదని తెలిపారు. అలాంటి యువతను ప్రోత్సహించడంలో భాగంగానే పీఎంఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో క్రీడా పోటీలు నిర్వహించామన్నారు. తాను తక్కువ మాట్లాడుతూ.. ఎక్కువ పని చేసి చూపిస్తానన్నారు. యువత మత్తుకు బానిసలు కాకూడదని, తాండూరులో కొందరి వల్ల యువత పెడదోవ పడుతోందని తెలిపారు. యాగాలు, పూజలు జరిపించినంత మాత్రాన చేసిన తప్పులను దేవుడు క్షమించడని వ్యాఖ్యానించారు. భవిష్యత్‌లో యువతకు అండగా నిలుస్తూ సామాజిక సేవా కార్యక్రమాలను ఉధృతం చేస్తామని స్పష్టంచేశారు. అనంతరం నియోజకవర్గ స్థాయి టోర్నీ విజేతలకు రూ.2 లక్షలు, రన్నరప్స్‌కు రూ.లక్ష అందజేశారు. పట్టణం, మండల స్థాయి విజేతలకు వరుసగా రూ.50 వేలు, రూ.25 వేలతో పాటు ట్రోఫీలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ము న్సిపల్ చైర్పర్సన్ స్వప్న, బీఆర్ఎస్ నాయకులు కరణం పురుషోత్తంరావు, లక్ష్మారెడ్డి, డాక్టర్ సంపత్ కుమార్, అబ్దుల్ రవూఫ్, నర్సింహులు, రజాక్, రవిగౌడ్, పరిమళ, శోభారాణి, నీరజా బాల్‌రెడ్డి, నారాయణరెడ్డి, సిద్రాల శ్రీనివాస్,అజయ్‌ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
అమెరికాలో తెలుగు అమ్మాయిల ఆట.. విజేత నాష్విల్లే రైజర్స్
అంతర్జాతీయ మహిళా దినోత్సవం- 2023 వేడుకల్లో భాగంగా టేనస్సీ రాష్ట్రంలోని నాష్విల్లే నగరంలో జరిగిన అమెరికా తెలుగు సంఘం (ఆటా) తొలిసారి మహిళల షార్ట్ క్రికెట్ టోర్నీని ఏప్రిల్ 8, 9 తేదీల్లో విజయవంతంగా నిర్వహించింది. 9 జట్ల మధ్య పోరు ఈ కార్యక్రమంలో 9 మహిళా జట్లు పాల్గొనగా.. సుమారు 300 మంది ప్రేక్షకులు వారి ఆటను తిలకించారు. ఈ పోటీలను ఆటా రీజినల్ కో-ఆర్డినేటర్లు క్రిష్ నూకల, సాయిరామ్ రాచకొండతో సహా ఆటా నాష్విల్ టీమ్ సభ్యులు భరద్వాజ్ సామల, సాయి వర్ధన్ రెడ్డి బోడా, అనూష వంగాల, ఆనంద్ రామ్‌కుమార్, దిగ్విజయ్ వంగల, ప్రశాంతి రాచకొండ, వంశీ కొరిపెల్లి, రాకేష్ బెక్కం, వాలంటీర్లు నిర్వహించారు. రామకృష్ణారెడ్డి ఆల (ఆటా కార్యదర్శి) , కిషోర్‌రెడ్డి గూడూరు (బీఓటీ సభ్యుడు), సుశీల్ చందా (విద్యాకమిటీ చైర్) , నరేందర్‌రెడ్డి నూకల ( ప్రాంతీయ సలహాదారుడు) నాయకత్వంలో ఈ కార్యక్రమం జరిగింది. విజేత ఎవరంటే ఆటా మహిళల షార్ట్ క్రికెట్ టోర్నమెంట్ విజేతగా నాష్విల్లే రైజర్స్ నిలిచింది. పవర్ గర్ల్స్ రన్నరప్, TNMM రెండో రన్నరప్గాన నిలిచాయి. విజేతలకు ఆటా ట్రోఫీలను అందించింది. అదనంగా, మహిళల అభిరుచి, క్రీడ పట్ల నిబద్ధతను ప్రోత్సహించడానికి ప్రతి జట్టు సభ్యురాలికి పార్టిసిపెంట్ మెడల్స్ అందజేశారు. ఆటా నాష్విల్ బృందం ఆటా ఎగ్జిక్యూటివ్ టీమ్, బోర్డ్ ఆఫ్ ట్రస్టీలకు సమాజానికి సేవ చేయడానికి ఈ అద్భుతమైన అవకాశాన్ని అందించినందుకు వారికి కృతజ్ఞతలు తెలియచేశారు. ఈ కార్యక్రమానికి స్పాన్సర్లుగా వ్యవహరించిన ఇండియా బజార్, చాయ్ సమోసా రెస్టారెంట్‌కు ఆటా సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. చదవండి: మా ఓటమికి ప్రధాన కారణం అదే.. వాళ్ల వల్లే ఇదంతా: డుప్లెసిస్ -
ఫ్యాంటసీ స్పోర్ట్స్ ఆదాయం 35 శాతం అప్
న్యూఢిల్లీ: ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2023 క్రికెట్ టోర్నమెంటు సీజన్లో ఫ్యాంటసీ స్పోర్ట్స్ విభాగం ఆదాయం రూ. 2,900–3,100 కోట్లకు చేరనుంది. గతేడాది సీజన్‌తో పోలిస్తే 30–35 శాతం పెరగనుంది. మార్కెట్ రీసెర్చ్ సంస్థ రెడ్‌సీర్ స్ట్రాటెజీ కన్సల్టెంట్స్ ఈ విషయాలు వెల్లడించింది. గేమింగ్ ప్లాట్‌ఫామ్‌లపై 6.5–7 కోట్ల మంది యూజర్లు లావాదేవీలు జరపవచ్చని అంచనా వేసింది. గత 4–5 ఏళ్లుగా ఫ్యాంటసీ స్పోర్ట్స్ యూజర్ల సంఖ్య ఏటా 20% మేర పెరుగుతుండగా, ఈ ఏడాది 20–30% స్థాయిలో పెరగవచ్చని సంస్థ పార్ట్నర్ ఉజ్వల్ చౌదరి తెలిపారు. ప్రతి యూజరుపై ఆదాయం గత ఐపీఎల్ సీజన్లో రూ. 410గా ఉండగా ఈ సీజన్లో రూ. 440కి చేరవచ్చని పేర్కొన్నారు. మార్కెటింగ్‌పై గణనీయంగా ఖర్చు చేస్తుండటంతో ఫ్యాంటసీ స్పోర్ట్స్ ప్లాట్‌ఫామ్‌లపై అవగాహన పెరుగుతోందని చౌదరి చెప్పారు. ‘నిబంధనలు, జీఎస్టీపై స్పష్టత వచ్చింది. గూగుల్ కూడా తమ ప్లేస్టోర్‌లో ప్రయోగాత్మకంగా కొన్ని ఫ్యాంటసీ ప్లాట్‌ఫామ్‌లను అనుమతిస్తుండటం మరో సానుకూలాంశం. ఇవన్నీ కూడా భారత్‌లో ఈ స్పోర్ట్స్‌కు అనుకూలమైన పరిణామాలే‘ అని పేర్కొన్నారు. పైలట్ ప్రోగ్రాం కింద డ్రీమ్11, మై11సర్కిల్, ఎంపీఎల్ రమ్మీ, ఫ్యాంటసీ క్రికెట్ లాంటి కొన్ని ప్లాట్‌ఫామ్‌లను గూగుల్ తమ ప్లేస్టోర్‌లో అనుమతించింది. మార్చి 31తో ప్రారంభమైన ఐపీఎల్ 2023 క్రికెట్ టోర్నీ.. మే నెలాఖరు వరకు కొనసాగనుంది. రెడ్‌సీర్ గణాంకాల ప్రకారం.. ఏడాది మొత్తం మీద ఫ్యాంటసీ గేమింగ్ ప్లాట్‌ఫామ్‌లకు వచ్చే ఆదాయంలో ఐపీఎల్ సీజన్ వాటా 35–40% ఉంటుంది. -
Sakshi Premier League: ఫైనల్లో ఎన్ఆర్ఐ, సాయి గణపతి కాలేజీలు
చేబ్రోలు: సాక్షి ప్రీమియర్ లీగ్ (ఎస్పీఎల్) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి జూనియర్, సీనియర్ స్థాయి పురుషుల క్రికెట్ టోర్నమెంట్ తుది దశకు చేరుకుంది. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీలో ఈ టోర్నీ జరుగుతోంది.జూనియర్ విభాగంలో సాయి గణపతి పాలిటెక్నిక్ కాలేజి (విశాఖపట్నం), ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజి (విజయవాడ) జట్లు ఫైనల్లోకి దూసుకెళ్లాయి. ఏపీ ఐఐఐటీ జట్టుతో జరిగిన తొలి మ్యాచ్‌లో సాయి గణపతి పాలిటెక్నిక్ కాలేజి తొమ్మిది వికెట్ల తేడాతో నెగ్గింది. మొదట ఏపీ ఐఐఐటీ నిరీ్ణత 10 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 66 పరుగులు చేసింది. ఎ.రాంబాబు (37; 4 ఫోర్లు, 1 సిక్స్) అజేయంగా నిలిచాడు. సాయి గణపతి బౌలర్లలో బి.కుమార్ మూడు వికెట్లు తీశాడు. అనంతరం సాయి గణపతి కాలేజి 8.2 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి 69 పరుగులు చేసి గెలిచింది. జి.బౌరి (44 నాటౌట్; 4 ఫోర్లు), మధు (18 నాటౌట్; 2 ఫోర్లు) ఆకట్టుకున్నారు. ఏపీ ఐఐఐటీ (ఇడుపులపాయ)తో జరిగిన మరో మ్యాచ్‌లో ఎన్ఆర్ఐ కాలేజి 30 పరుగుల తేడాతో నెగ్గింది. ముందుగా ఎన్ఆర్ఐ కాలేజి నిర్ణీత 10 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 98 పరుగులు చేసింది. ఎస్కే జాఫర్ (46 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్), ఇక్తాన్ సింగ్ (30; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) దూకుడుగా ఆడారు. 99 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఏపీ ఐఐఐటీ 5 వికెట్ల నష్టానికి 68 పరుగులు మాత్రమే చేసి ఓడిపోయింది. ఎన్ఆర్ఐ కాలేజి బౌలర్ బి.తరుణ్ నాలుగు వికెట్లు తీశాడు. ఏపీ ఐఐఐటీ జట్టు ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయి ఫైనల్ రేసు నుంచి నిష్క్రమించింది. సీనియర్ విభాగంలో ఎంవీజీఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ (విజయనగరం)పై సర్ సీఆర్ రెడ్డి కాలేజి ఆఫ్ ఇంజినీరింగ్ (ఏలూరు) పరుగు తేడాతో గెలిచింది. తొలుత సర్ సీఆర్ రెడ్డి కాలేజి నిరీ్ణత 10 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 79 పరుగులు చేసింది. వి.గగన్ కుమార్ (37; 5 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. ఎంవీజీఆర్ కాలేజి బౌలర్లు కల్యాణ్ మూడు వికెట్లు, సురేష్ రెండు వికెట్లు తీశారు. అనంతరం ఎంవీజీఆర్ కాలేజి నిర్ణీత 10 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 78 పరుగులు చేసి ఒక పరుగు తేడాతో విజయాన్ని చేజార్చుకుంది. నేడు సీనియర్ విభాగం ఫైనల్లో సీకామ్ డిగ్రీ కాలేజీతో సర్ సీఆర్ రెడ్డి కాలేజి ఆఫ్ ఇంజినీరింగ్ జట్టు; జూనియర్ విభాగం ఫైనల్లో ఎన్ఆర్ఐ కాలేజితో సాయి గణపతి పాలిటెక్నిక్ కాలేజి తలపడతాయి. -
కేసీఆర్ కారణజన్ముడు
సాక్షి, సిద్దిపేట: కే.. అంటే కారణజన్ముడు.. సీ.. అంటే చిరస్మరణీయుడు.. ఆర్.. అంటే మన తలరాతలను మార్చిన మహనీయుడు కేసీఆర్ అని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అభివర్ణించారు. సీఎం కేసీఆర్ పుట్టిన రోజు శుక్రవారం. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి సిద్దిపేట జయశంకర్ క్రికెట్ స్టేడియంలో కేసీఆర్ క్రికెట్ టోర్నమెంట్ సీజన్–3ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ‘దసరా’సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. కార్యక్రమంలో హీరో నాని మాట్లాడుతూ 373 టీమ్‌లతో ప్రపంచంలో ఎక్కడ కూడా క్రికెట్ టోర్నమెంట్ జరగలేదన్నారు. ఇంత పెద్ద టోర్నమెంట్‌ను నిర్వహిస్తున్న మంత్రి హరీశ్‌ను అభినందించారు. క్రికెటర్ అంబటి రాయుడు మాట్లాడుతూ తాను కేసీఆర్ అభిమానినన్నారు. -
Sakshi Media Group: ధనాధన్ టోర్నీకి దండోరా
బ్యాట్ పట్టుకొని బంతిని బౌండరీ దాటించాలని ఉందా? బుల్లెట్ వేగంతో బంతులు వేస్తూ వికెట్లను గిరాటేయాలని ఉందా? మెరుపు వేగంతో కదులుతూ బ్యాటర్లను రనౌట్ చేయాలని ఉందా? క్రికెట్ ఆడేద్దామని... మనలోని ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పాలని మనసులో బలమైన కోరిక ఉంటే సరిపోదు.. దానికి వేదిక కూడా కావాలిగా! ఇలాంటి ఔత్సాహిక క్రికెటర్లు తమ కలలు నెరవేర్చుకునేందుకు మళ్లీ సమయం వచ్చేసింది. మరో ఆలోచన లేకుండా ముందుగా మీ జట్టును తయారు చేసుకొని ఎంట్రీలు పంపించండి.. ఆ తర్వాత సమరానికి ‘సై’ అనండి...ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని ఔత్సాహిక క్రికెటర్లకు సువర్ణావకాశాలు కల్పించాలనే సదుద్దేశంతో సాక్షి మీడియా గ్రూప్ ఆధ్వర్యంలో 2023 జనవరి మూడో వారంలో సాక్షి ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నీ నాలుగో సీజన్ మొదలుకానుంది. మూడో సీజన్లో తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తం 627 జట్లు బరిలోకి దిగాయి. ఆంధ్రప్రదేశ్ సీనియర్ విభాగంలో సీకామ్ డిగ్రీ కాలేజీ (తిరుపతి)... జూనియర్ విభాగంలో సీఆర్ రెడ్డి పాలిటెక్నిక్ కాలేజీ (ఏలూరు) చాంపియన్స్‌గా నిలిచాయి. తెలంగాణ సీనియర్ విభాగంలో ఎంఎల్ఆర్ఐటీ (దుండిగల్), జూనియర్ విభాగంలో గౌతమ్ జూనియర్ కాలేజీ (ఈసీఐఎల్) జట్లు టైటిల్స్ సాధించాయి. టోర్నీ ఫార్మాట్... ముందుగా జిల్లా, ప్రాంతీయ, రాష్ట్ర స్థాయిలో నాకౌట్ పద్ధతిలో మ్యాచ్‌లు జరుగుతాయి. ఈ మ్యాచ్‌లను 10 ఓవర్లపాటు నిర్వహిస్తారు. జిల్లా స్థాయిలో విజేతగా నిలిచిన జట్లు ప్రాంతీయ స్థాయి టోర్నీకి అర్హత సాధిస్తాయి. ఈ మ్యాచ్‌లను 20 ఓవర్లపాటు నిర్వహిస్తారు. ప్రాంతీయ స్థాయి టోర్నీ విజేతలు రాష్ట్ర స్థాయిలో రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో టైటిల్ కోసం తలపడతాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉమ్మడి జిల్లాలే ప్రాతిపాదికగా ఎంట్రీలు స్వీకరిస్తారు. ఎంట్రీ ఫీజు... ఈ టోర్నీలో పాల్గొనాలనుకునే జట్లు రూ. 1,500 ఎంట్రీ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తాన్ని ఆన్‌లైన్‌లోనూ, ఆఫ్‌లైన్ పద్ధతిలోనూ చెల్లించవచ్చు. వివరాలకు సాక్షి జిల్లా యూనిట్ కార్యాలయంలో సంప్రదించాలి. https://www.arenaone.in/registration వెబ్సైట్లోనూ వివరాలు లభిస్తాయి. ఎంట్రీలను జనవరి 6వ తేదీలోపు పంపించాలి. ఏ ఏ విభాగాల్లో... సాక్షి ప్రీమియర్ లీగ్‌ను రెండు కేటగిరీల్లో నిర్వహిస్తారు. అండర్–19 జూనియర్ స్థాయిలో (1–1– 2003 తర్వాత జన్మించి ఉండాలి)... అండర్–25 సీనియర్ స్థాయిలో (1–1–1997 తర్వాత జన్మించి ఉండాలి) వేర్వేరుగా నిర్వహిస్తారు. జూనియర్ స్థాయిలో ఆడేందుకు జూనియర్ కాలేజీ జట్లకు, సీబీఎస్ఈ స్కూల్ జట్లకు (ప్లస్ 11,12 ), ఐటీఐ, పాలిటెక్నిక్ జట్లకు అర్హత ఉంది. సీనియర్ స్థాయిలో ఆడేందుకు డిగ్రీ, పీజీ, మెడిసిన్, ఇంజనీరింగ్, ఫార్మా కాలేజీ జట్లకు అవకాశం కల్పిస్తారు. ఎన్ని జట్లకు అవకాశం... ఒక్కో కాలేజీ నుంచి గరిష్టంగా రెండు జట్లను పంపించే వెసులుబాటు ఉంది. రెండు జట్లు కూడా వేర్వేరుగా ఎంట్రీ ఫీజు చెల్లించాలి. ఒక జట్టులో ఆడే ఆటగాడు మరో జట్టుకు ఆడకూడదు. మ్యాచ్‌లు ఆడే సమయంలో ఆటగాళ్లు వయసు ధ్రువీకరణ పత్రాలను చూపించాల్సి ఉంటుంది. మ్యాచ్ సమయంలో ఇరు జట్ల ఆటగాళ్లు తమ కళాశాల గుర్తింపు కార్డు (ఒరిజినల్) చూపించాలి. మ్యాచ్ జరిగే సమయంలో బ్యాటర్స్, వికెట్ కీపర్ తప్పనిసరిగా హెల్మెట్లు, లెగ్ ప్యాడ్లు, అండర్ గార్డ్స్, హ్యాండ్‌గ్లౌవ్స్, వైట్ డ్రెస్, వైట్ షూస్ ధరించాలి. ఇతర వివరాలకు నిర్వాహకులను సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు (తెలంగాణ రీజియన్) 9505514424, 9666013544 (ఆంధ్రప్రదేశ్ రీజియన్) 9912671555, 7075709205, 9666697219 నోట్: అన్ని విషయాల్లో నిర్వాహకులదే తుది నిర్ణయం. -
మెరిసిన నితిన్, అశ్వద్
సాక్షి, హైదరాబాద్: కూచ్ బెహర్ ట్రోఫీ అండర్–19 క్రికెట్ టోర్నీలో భాగంగా సిక్కిం జట్టుతో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ ఇన్నింగ్స్ 355 పరుగుల భారీ ఆధిక్యంతో ఘనవిజయం సాధించింది. ఆల్‌రౌండర్ నితిన్ సాయి యాదవ్ (34 పరుగులు; 11 వికెట్లు) హైదరాబాద్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఓవర్‌నైట్ స్కోరు 462/6తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన హైదరాబాద్ 106 ఓవర్లలో 9 వికెట్లకు 541 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన సిక్కిం 72 పరుగులకే ఆలౌటైంది. నితిన్ సాయి యాదవ్ (3/23), అశ్వద్ రాజీవ్ (4/15) సిక్కిం జట్టును దెబ్బ తీశారు. ఫాలోఆన్ ఆడిన సిక్కిం రెండో ఇన్నింగ్స్‌లో నితిన్ సాయి యాదవ్ (8/34) స్పిన్ మ్యాజిక్కు 114 పరుగులకే ఆలౌటైంది. -
Blind T20 World Cup 2022: భారత జట్టు కెప్టెన్‌గా అజయ్
స్వదేశంలో ఈ ఏడాది డిసెంబర్ 6 నుంచి 17 వరకు జరిగే అంధుల టి20 ప్రపంచకప్ క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొనే భారత జట్టును శుక్రవారం ప్రకటించారు. 17 మంది సభ్యులుగల టీమిండియాకు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అజయ్ కుమార్ రెడ్డి కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. ఆంధ్రప్రదేశ్‌కే చెందిన వెంకటేశ్వర రావును వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేశారు. ఈ మెగా ఈవెంట్‌కు భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నాడు. గతంలో భారత జట్టు రెండుసార్లు (2012, 2017) ప్రపంచకప్ టైటిల్‌ను సాధించింది. భారత జట్టు: అజయ్ కుమార్ రెడ్డి (కెప్టెన్), వెంకటేశ్వర రావు (వైస్ కెప్టెన్), దుర్గా రావు, ఎ.రవి (ఆంధ్రప్రదేశ్), లలిత్ మీనా (రాజస్తాన్), ప్రవీణ్, దీపక్ (హరియాణా), సుజీత్ (జార్ఖండ్), నీలేశ్ యాదవ్, , ఇర్ఫాన్ (ఢిల్లీ), సోనూ (మధ్యప్రదేశ్), సొవేందు (బెంగాల్), నకులా (ఒడిశా), లోకేశ, సునీల్, ప్రకాశ్ (కర్ణాటక), దినగర్ (పాండిచ్చేరి). -
మ్యాచ్ ఫిక్సింగ్ పాల్పడిన వ్యక్తితో ఫోటో అవసరమా.. యువీకి చురకలు
టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ప్రస్తుతం అమెరికాలో బిజీబిజీగా గడుపుతున్నాడు. వర్జీనియా వేదికగా జరగనున్న యునిటీ క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా పాల్గొనే యువ క్రికెటర్లకు యువీ తన సలహాలు అందించనున్నాడు. ఇదే టోర్నీకి పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ ఆసిఫ్ కూడా వచ్చాడు. చాలాకాలం తర్వాత ఈ ఇద్దరు ఎదురుపడడంతో ఒకరినొకరు పలకరించుకొని ఫోటోకు ఫోజిచ్చారు. కాగా ఈ ఫోటోను మహ్మద్ ఆసిఫ్ తన ట్విటర్లో షేర్ చేస్తూ.. ''స్నేహానికి ఎలాంటి హద్దులు ఉండవు'' అంటూ క్యాప్షన్ జత చేశాడు. ఆసిఫ్ షేర్ చేసిన ఫోటో కొన్ని గంటల్లోనే వైరల్‌గా మారింది. అయితే యువరాజ్ ఆసిఫ్‌తో ఫోటో దిగడంపై క్రికెట్ ఫ్యాన్స్ రెండుగా చీలిపోయారు. చిరకాల ప్రత్యర్థులుగా కనిపించే రెండు దేశాల నుంచి ఇద్దరు క్రికెటర్లు ఒకేచోట కలిసి ఫోటో దిగడం ఆనందంగా అనిపించిదని కొందరు కామెంట్స్ చేయగా.. మరికొందరు మాత్రం మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డ ఒక ఆటగాడితో ఎలా ఫోటో దిగుతావు అంటూ మరికొందరు యువరాజ్‌ను తప్పుబట్టారు. అయితే యువరాజ్ తనంతట తానుగా ఈ ఫోటోను ట్విటర్లో షేర్ చేయలేదని.. పాక్ క్రికెటర్ ఆసిఫ్ మాత్రమే షేర్ చేసుకున్నాడని.. ఇందులో యువరాజ్ తప్పేమి లేదని పేర్కొన్నారు. కాగా మ్యాచ్ ఫిక్సింగ్ ఉదంతం పక్కనబెడితే మహ్మద్ ఆసిఫ్ స్వతహాగా సూపర్ బౌలర్. ఫాస్ట్ బౌలింగ్‌కు పెట్టింది పేరైన ఆసిఫ్ మంచి లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేస్తూ వికెట్లు పడగొట్టేవాడు. పాకిస్తాన్ తరపున 72 మ్యాచ్‌లాడిన ఆసిఫ్ 168 వికెట్లు తీశాడు. అయితే 2005లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన మహ్మద్ ఆసిఫ్ ఆది నుంచి వివాదాలే చుట్టుముట్టాయి. నిషేధిత డ్రగ్స్ వాడి ఒకసారి సస్పెండ్ అయిన ఆసిఫ్.. 2010లో ఇంగ్లండ్‌తో లార్డ్స్ వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్‌లో స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు వార్తలు వచ్చాయి. అందుకు అనుగుణంగా ప్రీ ప్లాన్‌గా ఫ్రంట్ ఫుట్ నోబాల్స్ వేశాడు. ఫిక్సింగ్ ఆరోపణలు నిజమని తేలడంతో మహ్మద్ ఆసిఫ్‌పై ఐసీసీ ఏడేళ్ల నిషేధం విధించింది. ఆసిఫ్‌తో పాటు సల్మాన్ భట్, మహ్మద్ ఆమిర్‌లపై కూడా ఐసీసీ చర్యలు తీసుకుంది. అయితే 2015లో ఐసీసీ ఆసిఫ్‌పై విధించిన నిషేధాన్ని వెనక్కి తీసుకొని అన్ని ఫార్మాట్లలో ఆడొచ్చంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఆసిఫ్ కొద్దిరోజులకే ఆటకు రిటైర్మెంట్ ప్రకటించాడు. చదవండి: Chris Lynn: ఆ బ్యాటర్ పని అయిపోందన్నారు.. సెంచరీతో నోరు మూయించాడు Friendship have no limits. #YuvrajSingh #ICC #USA #dc #unitycup2022 pic.twitter.com/VJ0u5U7z3Z — Muhammad Asif (@MuhammadAsif_26) May 30, 2022 -
రంజీ ట్రోఫీ నాకౌట్ దశ మ్యాచ్‌లు జరిగేది అక్కడే!
Ranji Trophy 2022- ముంబై: దేశవాళీ క్రికెట్ టోర్నమెంట్ రంజీ ట్రోఫీ నాకౌట్ దశ మ్యాచ్‌ల షెడ్యూల్‌ను, వేదికను ప్రకటించారు. జూన్ 4 నుంచి 24 వరకు జరిగే రంజీ నాకౌట్ మ్యాచ్‌లకు బెంగళూరు ఆతిథ్యమివ్వనుంది. జూన్ 4 నుంచి 8 వరకు జరిగే క్వార్టర్ ఫైనల్స్‌లో బెంగాల్‌తో జార్ఖండ్... ముంబైతో ఉత్తరాఖండ్... కర్ణాటకతో ఉత్తరప్రదేశ్... పంజాబ్‌తో మధ్యప్రదేశ్ తలపడతాయి. అనంతరం జూన్ 12 నుంచి 16 వరకు రెండు సెమీఫైనల్స్‌ను నిర్వహిస్తారు. జూన్ 20 నుంచి 24 వరకు ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఐపీఎల్ టోర్నీ ప్రారంభానికి ముందే రంజీ ట్రోఫీ లీగ్ దశ ముగిసిన విషయం తెలిసిందే. చదవండి👉🏾 IPL 2022: కోల్‌కతా... అదే కథ -
Sakshi Premier League 2022: విజేతలు ఎంఎల్ఆర్ఐటి, గౌతమ్ కాలేజి
సాక్షి, హైదరాబాద్: ‘సాక్షి’ మీడియా గ్రూప్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘సాక్షి ప్రీమియర్ లీగ్’ తెలంగాణ రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నీ గురువారం ఘనంగా ముగిసింది. సీనియర్, జూనియర్ విభాగాల్లో జరిగిన పోటీల్లో మొత్తం 649 జట్లు పాల్గొన్నాయి. దుండిగల్‌లోని మర్రి లక్ష్మణ్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వేదికగా ఫైనల్ మ్యాచ్‌లు నిర్వహించారు. సీనియర్ విభాగంలో ఎంఎల్ఆర్ఐటి (దుండిగల్), జూనియర్ విభాగంలో గౌతమ్ జూనియర్ కళాశాల (ఈసీఐఎల్) విజేతలుగా నిలిచాయి. సీనియర్ ఫైనల్లో ఎంఎల్ఆర్ఐటి 35 పరుగుల తేడాతో వాగ్దేవి డిగ్రీ కళాశాల (మంచిర్యాల)పై విజయం సాధించింది. ఎంఎల్ఆర్ఐటి ముందుగా 10 ఓవర్లలో 9 వికెట్లకు 100 పరుగులు చేయగా, వాగ్దేవి 10 ఓవర్లలో 5 వికెట్లకు 65 పరుగులు మాత్రమే చేయగలిగింది. జూనియర్ ఫైనల్లో గౌతమ్ కాలేజి 32 పరుగులతో కేఎల్ఎన్ జూనియర్ కాలేజిని ఓడించింది. గౌతమ్ 10 ఓవర్లలో 5 వికెట్లకు 81 పరుగులు చేయగా, కేఎల్ఎన్ 9.2 ఓవర్లలో 49 పరుగులకే ఆలౌటైంది. డి.మనీశ్ ఒక పరుగే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టడం విశేషం. ముగింపు కార్యక్రమానికి ఎంఎల్ఆర్ఐటి కళాశాల చైర్మన్ మర్రి లక్ష్మణ్‌రెడ్డి, సెక్రటరీ మర్రి రాజశేఖర్‌రెడ్డి, అవినాశ్ విద్యాసంస్థల చైర్మన్ అవినాశ్, సాక్షి మార్కెటింగ్, అడ్వర్టయిజ్మెంట్ సీజీఎం కమల్ కిశోర్ రెడ్డి, సాక్షి అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఉగ్రగిరి రావు, ఈవెంట్ కో–ఆర్డినేటర్లు వేణు, సుమన్, కళాశాల స్పోర్ట్స్ డైరెక్టర్ పార్థసారధి పాల్గొన్నారు. -
చూసి చూసి బోర్ కొడుతుంది.. అయినా మళ్లీ ఒకసారి
క్రికెట్లో ఎన్నిసార్లు విన్నా బోర్ కొట్టని విషయాలు కొన్ని ఉంటాయి. వాటిలో స్టన్నింగ్ క్యాచ్‌లు అనే పదం తరచుగా వింటాం. ఈసారి కూడా ఒక స్టన్నింగ్ క్యాచ్ గురించి ప్రస్తావించుకుందాం. ఫీల్డర్ క్యాచ్ పట్టిన విధానం చూసి ఫిదా కావాల్సిందే. యూరోపియన్ క్రికెట్ లీగ్ 2022లో ఇది చోటుచేసుకుంది. లీగ్‌లో భాగంగా వాన్హోమ్, డ్రూక్స్ క్రికెట్ క్లబ్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో వాలోహోమ్ 9 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. చదవండి: కష్టపడింది నేనైతే.. క్రెడిట్ మరొకరికా..? అజింక్య రహానే సంచలన వ్యాఖ్యలు వాలోహోమ్ కెప్టెన్ హమీద్ షా తొలుత బ్యాటింగ్‌లో మెరిశాడు. ఆ తర్వాత ఫీల్ఢింగ్లోనూ స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. ఇన్నింగ్స్ 8వ ఓవర్లో కమ్రాన్ అహ్మద్‌జై స్ట్రెయిట్ షాట్ ఆడాడు. అతను కొట్టిన స్రెయిట్ షాట్ కచ్చితంగా సిక్స్ అని భావిస్తాం. కానీ ఇక్కడే ఊహించని ఘటన చోటుచేసుకుంది. లాంగాన్ నుంచి పరిగెత్తుకు వచ్చిన హమీద్ షా గాల్లోకి ఎగురుతూ ఒంటిచేత్తో స్టన్నింగ్ క్యాచ్ తీసుకున్నాడు. అతని బ్యాలెన్సింగ్ విధానానికి వారెవ్వా అనుకుండా మాత్రం ఉండలేం. కచ్చితంగా హమీద్ షా పట్టిన క్యాచ్.. క్యాచ్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలవడం ఖాయం. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. "You will not see a better grab than that" Svanholm Cricket Club legend Hamid Shah with the Catch of the Millennium!!@BET2BALL European Cricket League presented by Kiba Inu@KibaInuWorld #ECL22 pic.twitter.com/dlayx5yoq4 — European Cricket (@EuropeanCricket) February 9, 2022 -
ఓటమి కొనితెచ్చుకోవడమంటే ఇదే..
సులభంగా గెలవాల్సిన మ్యాచ్‌లను చేజేతులా ఓడిపోవడం అప్పుడప్పుడు చూస్తుంటాం. అది అంతర్జాతీయ మ్యాచ్ లేక ఇంకోటి ఏదైనా కావొచ్చు.. కచ్చితంగా గెలుస్తాం అన్న దశలో ఓటమి పాలయితే ఆ బాధ ఎలా ఉంటుందో ప్రత్యేక్యంగా చెప్పనవసరం లేదు. అచ్చం అలాంటి తరహాలోనే ఒక జట్టు ఈజీగా గెలవాల్సింది పోయి చేజేతులా ఓటమిని కొనితెచ్చుకుంది. విషయంలోకి వెళితే.. లోకల్ క్రికెట్ టోర్నమెంట్లో ఒక జట్టు గెలవాలంటే ఆఖరి బంతికి ఐదు పరుగులు కావాలి. ఫోర్ కొడితే టై.. సిక్స్ కొడితే విజయం అన్నట్లుగా ఆ జట్టు పరిస్థితి ఉంది. ఇంత ఒత్తిడిలో ఆ జట్టు బ్యాట్స్‌మన్ ఎలాగైనా సిక్స్ కొట్టాలని భారీ షాట్‌కు ప్రయత్నించాడు. కానీ షాట్ మిస్జడ్జ్ అయి పుల్ షాట్ ఆడాడు. బంతి ఫీల్డర్ వద్దకు చేరడంతో రెండు పరుగులు మాత్రమే వచ్చాయి. దీంతో సదరు జట్టు ఓటమి పాలయింది అని అంతా భావించారు. చదవండి: Rohit Sharma: 'ఆరంభానికి ముందు ఈ నిరీక్షణ తట్టుకోలేకపోతున్నా' కానీ మనం ఒకటి తలిస్తే.. దైవం ఇంకోటి తలిచిందన్న తరహాలో బంతి పట్టిన ఫీల్డర్.. బ్యాట్స్‌మన్‌ను రనౌట్ చేద్దామనే ఉద్దేశంతో పరిగెత్తుకొచ్చి బెయిల్స్‌ను పడగొట్టాడు. అయితే అప్పటికే బ్యాట్స్‌మన్ సురక్షితంగా క్రీజులోకి చేరుకున్నాడు. ఇక్కడితో ఊరుకున్న అయిపోయేది. కానీ మళ్లీ ఏం అనిపించిందో.. నాన్‌స్ట్రైక్ ఎండ్‌వైపు రనౌట్ అవకాశం ఉందని బంతిని అటువైపు విసిరాడు. ఈసారి త్రో మిస్ అయిన బంతి బౌండరీ దిశగా పరుగులు పెట్టింది. బౌండరీ వెళ్తున్న బంతిని ఒక ఫీల్డర్ ఆపి త్రో విసిరాడు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆ గ్యాప్‌లోనే ప్రత్యర్థి బ్యాట్స్‌మన్ మిగతా మూడు పరుగులు కూడా కొట్టేసి జట్టును గెలిపించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన క్రికెట్ ఫ్యాన్స్ నవ్వాపుకోలేకపోయారు.'' ఓటమి కొని తెచ్చుకోవడం అంటే ఇదే.. దరిద్రం నెత్తిమీద ఉంటే విజయం ఎలా వస్తుంది.. ఈజీగా గెలవాల్సిన మ్యాచ్‌ను చేజేతులా పోగొట్టుకున్నారు'' అంటూ కామెంట్స్ చేశారు. చదవండి: సిక్స్ కొడితే ఫైనల్‌కు.. బౌలర్‌కు హ్యాట్రిక్; ఆఖరి బంతికి ట్విస్ట్ How to score 5 runs off the last ball to win without hitting a boundary… @ThatsSoVillage pic.twitter.com/0nIyl5xbxi — The ACC (@TheACCnz) February 1, 2022 -
రవి కుమార్ ‘స్వింగ్’.. సెమీస్‌లో యువ భారత్
కూలిడ్జ్ (అంటిగ్వా): అండర్–19 ప్రపంచకప్ క్రికెట్ టోర్నమెంట్లో యువ భారత్ జట్టు సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. డిఫెండింగ్ చాంపియన్ బంగ్లాదేశ్‌తో శనివారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో భారత జట్టు ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. ఈ గెలుపుతో 2020 అండర్–19 ప్రపంచకప్ ఫైనల్లో బంగ్లాదేశ్ చేతిలో ఎదురైన పరాజయానికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 37.1 ఓవర్లలో 111 పరుగులకే ఆలౌటైంది. ఎడంచేతి వాటం పేస్ బౌలర్ రవి కుమార్ (3/14) స్వింగ్ బౌలింగ్‌తో బంగ్లాదేశ్‌ను హడ లెత్తించాడు. స్పిన్నర్ విక్కీ (2/25) కూడా రాణించాడు. 112 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 30.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 117 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్ అంగ్కృష్ (44; 7 ఫోర్లు), ఆంధ్ర క్రికెటర్ షేక్ రషీద్ (26; 3 ఫోర్లు) రెండో వికెట్‌కు 70 పరుగులు జోడించారు. కెప్టెన్ యశ్ ధుల్ (20 నాటౌట్; 4 ఫోర్లు), కౌశల్ (11 నాటౌట్; 1 సిక్స్) రాణించారు. రవి కుమార్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఫిబ్రవరి 1న తొలి సెమీఫైనల్లో ఇంగ్లండ్‌తో అఫ్గానిస్తాన్; ఫిబ్రవరి 2న రెండో సెమీఫైనల్లో ఆస్ట్రేలియాతో భారత్ ఆడ తాయి. ఫైనల్ ఫిబ్రవరి 5న జరుగుతుంది. -
21 బంతుల్లోనే సెంచరీ.. టీమిండియా బతికిపోయింది
South Africa Batsman Martin Coetzee Century In 21 Balls.. డిసెంబర్ 26 నుంచి టీమిండియా, దక్షిణాఫ్రికా మధ్య సిరీస్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ సిరీస్ ఆరంభానికి ముందు దక్షిణాఫ్రికా క్రికెటర్ మార్టిన్ కోయెట్జ్ విధ్వంసం సృష్టించాడు. కేవలం 21 బంతుల్లోనే సెంచరీ బాదిన కోయెట్జ్ ఓవరాల్‌గా 120 బంతుల్లో 13 ఫోర్లు.. 8 సిక్సర్ల సాయంతో 157 పరుగులు చేశాడు. అయితే కోయెట్జ్ ఈ ఇన్నింగ్స్ దక్షిణాఫ్రికా తరపున ఆడాడనుకుంటే పొరపాటే. అసలు మార్టిన్ కోయెట్జ్ ఇంతవరకు దక్షిణాఫ్రికా తరపున ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ ఆడలేదు. కేవలం ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు మాత్రమే ఆడిన కోయెట్జ్ ప్రస్తుతం ప్రైవేట్ లీగ్‌ల్లో బిజీగా గడుపుతున్నాడు. దీంతో కోయెట్జ్ దక్షిణాఫ్రికా జట్టులో లేకపోవడంతో టీమిండియా బతికిపోయిందంటూ కొందరు అభిమానులు కామెంట్స్ చేయడం వైరల్‌గా మారింది. చదవండి: India Tour Of South Africa: దక్షిణాఫ్రికాకు ఎదురుదెబ్బ.. టెస్ట్‌లకు స్టార్ ప్లేయర్ దూరం ఇక మార్టిన్ కోయెట్జ్ ఇన్నింగ్స్ విషయానికి వస్తే... హాంకాంగ్ ఆల్ స్టార్స్ 50 ఓవర్ల సిరీస్‌లో ఈ తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. కోవ్‌లూన్ లయన్స్, హాంకాంగ్ ఐలాండ్స్ మధ్య జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన కోవ్‌లూన్ లయన్స్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 299 పరుగులు చేసింది. వకాస్ ఖాన్ 122, ఎజాజ్ ఖాన్ 104 సెంచరీలు బాదడంతో ఈ స్కోరు నమోదైంది. అనంఆలతరం 300 పరుగుల లక్ష్యతో బరిలోకి దిగిన హాంకాంగ్ ఐలాండర్స్ మార్టిన్ కోయెట్జ్ విధ్వంసంతో 44 ఓవర్లలోనే చేధించింది. మార్టిన్ కోయెట్జ్కు జతగా.. కెప్టెన్ బాబార్ హయత్ 67 బంతుల్లోనే 81 పరుగులు చేశాడు. చదవండి: Shane Warne Test Batsmen List: 'కెప్టెన్సీ పోతే పోయింది.. నా టాప్-5లో నువ్వు ఒకడివి' -
క్రికెట్ జట్టు వాహనంలో చోరీ.. లబోదిబోమంటున్న ఆసీస్ క్రికెటర్
Queensland Cricketer Jimmy peirson Cricket Kit Stolen: క్రికెట్ జట్టుపై దొంగలు దాడి చేసి, అందులోని క్రికెట్ సామాగ్రిని దోచుకెళ్లిన ఘటన ఆస్ట్రేలియాలోని అడిలైడ్ నగరంలో చోటుచేసుకుంది. షెఫీల్డ్ షీల్డ్ టోర్నీలో భాగంగా టాస్మానియాతో మ్యాచ్‌కు ముందు క్వీన్స్‌ల్యాండ్ జట్టు వాహనంపై దొంగలు దాడి చేసి క్రికెట్ కిట్లతో పాటు ఇతర సామాగ్రిని అపహరించారు. క్వీన్స్‌ల్యాండ్ జట్టు బస చేసే హోటల్ పార్కింగ్‌లో ఉన్న వాహనం అద్దాలను పగలగొట్టి లోపలికి ప్రవేశించిన దొంగలు.. ఆ జట్టు వికెట్ కీపర్ జిమ్మీ పియర్సన్కు చెందిన రెండు బ్యాట్లతో పాటు ఇతర క్రికెట్ సామాగ్రిని దొంగిలించారు. View this post on Instagram A post shared by Jimmy Peirson (@jimmypeirson) ఈ విషయాన్ని పియర్సన్ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తూ.. తన సరికొత్త గ్యారీ నికెల్స్ స్టిక్కర్ బ్యాట్లు చోరీ అయ్యాయని, ఎవరికైనా దొరికితే తనకు తెలియజేయాలంటూ రాసుకొచ్చాడు. ఈ విషయమై కేసు నమోదు చేసిన దక్షిణ ఆస్ట్రేలియా పోలీసులు.. హోటల్లోని సీసీ కెమెరాల ద్వారా మిస్టరీని ఛేదించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదిలా ఉంటే, క్వీన్స్‌ల్యాండ్-టాస్మానియా జట్ల మధ్య మ్యాచ్ సెప్టెంబర్ 30న బ్రిస్బేన్‌లో జరగాల్సి ఉండింది. అయితే, బ్రిస్బేన్ నగరంలో కొత్తగా కరోనా కేసులు నమోదు కావడంతో మ్యాచ్ వాయిదా పడింది. చదవండి: విజయానందంలో ఆ ఢిల్లీ ఆటగాడు ఏం చేశాడో చూడండి..! -
ఐపీఎల్... ప్రేక్షకుల్లేకుండానే!
న్యూఢిల్లీ: ఈ సీజన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టి20 క్రికెట్ టోర్నమెంట్ ఏమాత్రం ఆలస్యం కాకుండా అలరించేందుకు త్వరలోనే మన ముందుకొస్తోంది. కానీ ప్రేక్షకులకు మాత్రం గత సీజన్‌లాగే ఎంట్రీ లేదు. అయితే అది యూఏఈలో జరిగింది కాబట్టి ఇబ్బంది లేదు. కానీ స్వదేశంలో జరిగే పోటీలను ప్రత్యక్షంగా వెళ్లి చూడలేకపోవడం మాత్రం భారత క్రికెట్ ప్రేమికులకు కాస్త నిరాశ కలిగించే అంశం. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఐపీఎల్ పాలక మండలి మే 6 దాకా ప్రేక్షకులు లేకుండా మ్యాచ్‌లు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. తదుపరి దశ మ్యాచ్‌లకు ప్రేక్షకులకు అనుమతించే విషయం అప్పటి పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటారు. ► మొత్తం ఆరు వేదికల్లో (చెన్నై, ముంబై, అహ్మదాబాద్, ఢిల్లీ, బెంగళూరు, కోల్‌కతా) ఏప్రిల్ 9 నుంచి మే 30 వరకు ఐపీఎల్–2021 మ్యాచ్‌లు జరుగుతాయి. కానీ 8 ఫ్రాంచైజీల్లో ఏ ఒక్క జట్టుకు సొంత వేదికలో మ్యాచ్‌లు ఉండవు. అన్ని జట్లూ తటస్థ వేదికలపై మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది. ► ఏప్రిల్ 9న చెన్నైలో జరిగే తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్, రోహిత్ శర్మ కెప్టెన్సీలోని ముంబై ఇండియన్స్‌తో విరాట్ కోహ్లి నాయకత్వంలోని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు తలపడుతుంది. ► బెంగాల్లో ఎనిమిది దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఆరంభ దశ మ్యాచ్‌లను కోల్‌కతాకు కేటాయించలేదు. ఎన్నికల కౌంటింగ్ మే 2న ముగిశాక కోల్‌కతాలో మే 9 నుంచి ఐపీఎల్ మ్యాచ్‌లను నిర్వహిస్తారు. ► ప్రతీ జట్టు నాలుగు వేదికల్లో తలపడుతుంది. మొత్తం 56 లీగ్ దశ మ్యాచ్‌ల్లో చెన్నై, ముంబై, కోల్‌కతా, బెంగళూరు నగరాల్లో పదేసి మ్యాచ్‌లు జరుగుతాయి. అహ్మదాబాద్, ఢిల్లీ వేదికలపై ఎనిమిది చొప్పున లీగ్ పోటీలు నిర్వహిస్తారు. అహ్మదాబాద్‌లో మే 25న క్వాలిఫయర్–1, మే 26న ఎలిమినేటర్, మే 28న క్వాలిఫయర్–2, మే 30న ఫైనల్ జరుగుతాయి. ► ఈ సీజన్లో 11 రోజులు రెండు మ్యాచ్‌ల చొప్పున జరుగుతాయి. తొలి మ్యాచ్ మధ్యాహ్నం 3.30 గంటలకు మొదలైతే, రెండో మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు ప్రారంభం అవుతుంది. -
‘వైఎస్సార్ కప్’ మెగా క్రికెట్ సంరంభం
దొండపర్తి (విశాఖ దక్షిణ): ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ‘వైఎస్సార్ కప్’ పేరిట నిర్వహిస్తున్న మెగా క్రికెట్ టోర్నమెంట్ సోమవారం సాయంత్రం ప్రారంభమైంది. ప్రగతి భారత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పోర్టు స్టేడియంలో ఎంపీ వి.విజయసాయిరెడ్డి టార్చ్ వెలిగించి టోర్నీని ప్రారంభించారు. ఈ నెల 22నుంచి జనవరి 9వ తేదీ వరకు నిర్వహించే టోర్నమెంట్లో విశాఖ నగర పరిధిలోని 98 వార్డుల నుంచి 422 క్రికెట్ జట్లు తలపడుతున్నాయి. విజేతలకు రూ.50 లక్షలు విలువ చేసే బహుమతులను అందజేయనున్నారు. ప్రారంభ కార్యక్రమానికి అన్ని జట్ల నుంచి 6,500 మంది ఆటగాళ్లు హాజరవడంతో మైదాన ప్రాంగణం కోలాహలంగా మారింది. ఎన్సీసీ క్యాడెట్స్ మార్చ్ఫాస్ట్, ఏయూ విద్యార్థినుల నృత్య ప్రదర్శన అలరించాయి. మార్చ్ఫాస్ట్లో పాల్గొన్న క్రీడాకారులు విశాఖ అంటే సీఎంకు అమితమైన ప్రేమ ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. విశాఖ అంటే సీఎం వైఎస్ జగన్‌కు అమితమైన ప్రేమ అన్నారు. సామాజిక శాస్త్రవేత్తగా, ఆర్థిక నిపుణుడిగా సీఎంను అభివర్ణించారు. చిత్తశుద్ధి, స్థిరచిత్తంతో ఓ వైపు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూనే.. మరోవైపు రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా, అమరావతిని శాసన రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా చేయాలని సంకల్పించారన్నారు. జిల్లా ఇన్చార్జి మంత్రి కె.కన్నబాబు మాట్లాడుతూ.. పరిపాలనా రాజధాని విశాఖను అన్ని రంగాలతోపాటు క్రీడా రంగంలోనూ అభివృద్ధి పథంలో నడిపించేందుకు సీఎం వైఎస్ జగన్ ప్రణాళికలు రూపొందించారని చెప్పారు. పర్యాటక, క్రీడల శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. యువత విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించేలా మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, పలువురు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు. -
స్టార్స్ అంతా డిసెంబర్లోనే పుడతారు..
స్టార్స్ అంతా డిసెంబర్ నెలలోనే పుడతారని సినీ నటి, ఆర్ఎక్స్ 100 ఫేం పాయల్ రాజ్‌పుత్ చమత్కరించారు. మన డైనమిక్ సీఎం జగన్మోహన్రెడ్డి కూడా డిసెంబర్లోనే పుట్టారని, తానూ ఇదే నెలలో పుట్టానని ఆమె అన్నారు. ‘అందరూ బాగున్నారా.. అందరికీ నమస్కారం’ అంటూ తెలుగులో మాట్లాడి క్రీడాకారులను ఉత్తేజ పరిచారు. కాలేజీ రోజుల్లో క్రికెట్ ఆడేదానినని, తనకు క్రికెట్ అంటే చాలా ఇష్టమని అన్నారు. రాజమహేంద్రవరం రావడం చాలా అనందంగా ఉందని, ఇక్కడ గోదావరి అందాలు చాలా బాగుంటాయని అన్నారు. సాక్షి, సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): క్రీడల్లో గెలుపోటములు సహజం. ఓటమితో కుంగిపోవాల్సిన అవసరం లేదు. ఓటమి గెలుపునకు నాంది అని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి పి.అనిల్‌కుమార్ యాదవ్ అన్నారు. స్థానిక ప్రభుత్వ ఆర్ట్స్ కశాళాల క్రీడా ప్రాంగణంలో రాజమహేంద్రవరం ప్రీమియర్ లీగ్ సీజన్–4 క్రికెట్ పోటీలను ఆదివారం ఆయన ప్రారంభించారు. మంత్రి అనిల్ కుమార్, ఎంపీ మార్గాని భరత్‌రామ్ బ్యాటింగ్, బౌలింగ్ చేసి క్రీడాకారులను ఉత్తేజపరిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలపై ప్రత్యేక అభిరుచి ఉన్న ముఖ్యమంత్రి మనకు ఉండడం అదృష్టం అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి క్రీడాకారులకు అనేక ప్రోత్సాహకాలు ఇస్తున్నారన్నారు. క్రీడాకారుల కోసం ఆయన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారని అన్నారు. మానసిక ఒత్తిళ్లను అధిగమించి మానసిక ఉల్లాసం పొందేందుకు క్రీడలను, వ్యాయామాలను ప్రోత్సహించాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. ఎంపీ మార్గాని భరత్ రామ్ పర్యవేక్షణలో అజ్జరపు వాసు, కుంచే శేఖర్ ఆధ్వర్యంలో ఈ టోర్నీ నిర్వహించడం అభినందనీయం అన్నారు. క్రీడలు మానసిక, శరీరక వికాసానికి పునాదులని భరత్ అన్నారు. ఐక్యతను పెంపొందించేందుకు క్రీడలు ఎంతో దోహదపడతాయన్నారు. స్వామి వివేకానంద సూక్తులను అనుసరించి క్రీడాకారులు రాణించి సత్తాను చాటుతూ దేశవ్యాప్తంగా ప్రతిభను చాటుకోవాలన్నారు. ఎక్కవ రకాల క్రీడలను ప్రోత్సహించి ఆయా క్రీడలపై ఆసక్తి గల క్రీడాకారులకు తగిన వేదికల అభివృద్ధికి ప్రభుత్వ, ప్రైవేటు కార్పొరేట్ సంస్థలు భాగస్వాములు కావాలన్నారు. 7 రాష్ట్రాల క్రీడాకారులు ఈ సీజన్–4లో 24 బృందాలుగా పొల్గొనడం అభినందనీయం అన్నారు. రాజమహేంద్రవరం నగరాన్ని స్పోర్ట్స్ హబ్‌గా తయారు చేస్తానని ఎంపీ భరత్ అన్నారు. ఆర్ట్స్ కళాశాలలో క్రికెట్ స్టేడియం నిర్మాణానికి సుమారు రూ.25 కోట్ల వ్యయం అవుతుందని దీనిలో 50 శాతం సీఎస్ఆర్ కింద ఓఎన్జీసీ సమకూర్చాలని సభకు హాజరైన ఆ సంస్థ కార్యనిర్వాహక సంచాలకుడు ఆదేశ్ కుమార్‌ని ఎంపీ కోరారు. మరో విశిష్ట అతిథి పోలవరం ఎమ్మెల్యే తలారి వెంకటరావు మాట్లాడుతూ ఈ క్రికెట్ మ్యాచ్‌లు విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, చందన నాగేశ్వర్, గుబ్బల రాంబాబు, గుర్రం గౌతమ్ పాల్గొన్నారు. బౌలింగ్ చేస్తున్న ఎంపీ మార్గాని భరత్‌రామ్ -
ప్రతిభ మీది... వేదిక మాది...
మీలో ప్రతిభ ఉందా...? మేము వెలుగులోకి తెస్తాం... మీలో ఉత్సాహం ఉందా? మేము అవకాశాలు కల్పిస్తాం... తెలుగు రాష్ట్రాల్లో ఔత్సాహిక క్రికెటర్లు సత్తా చాటుకోవడానికి సాక్షి మీడియా గ్రూప్ ఆధ్వర్యంలో సాక్షి ప్రీమియర్ లీగ్ (ఎస్పీఎల్) రెండో సీజన్‌కు రంగం సిద్ధమైంది. 2021 జనవరి మూడో వారంలో సాక్షి ప్రీమియర్ లీగ్ (ఎస్పీఎల్) క్రికెట్ టోర్నమెంట్ రెండో సీజన్ మొదలుకానుంది. గత ఏడాది రెండు రాష్ట్రాల నుంచి మొత్తం 891 జట్లు బరిలోకి దిగాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి సీనియర్ విభాగంలో ఎమరాల్డ్ డిగ్రీ కాలేజీ (తిరుపతి) విజేతగా... డాక్టర్ లంకపల్లి బుల్లయ్య కాలేజీ (విశాఖపట్నం) రన్నరప్‌గా నిలిచాయి. జూనియర్ విభాగంలో శివారెడ్డి ఐటీసీ (కడప) చాంపియన్‌గా... శాతవాహన జూనియర్ కాలేజీ (హరిపురం, శ్రీకాకుళం) రన్నరప్‌గా నిలిచాయి. తెలంగాణ నుంచి సీనియర్ విభాగంలో సర్దార్ పటేల్ డిగ్రీ కాలేజీ (సికింద్రాబాద్) విజేతగా... ఆదర్శ డిగ్రీ కాలేజీ (మహబూబ్‌నగర్) రన్నరప్‌గా నిలిచాయి. జూనియర్ విభాగంలో భవాన్స్ శ్రీ అరబిందో కాలేజీ చాంపియన్‌గా... ఎస్ఆర్ఆర్ కాలేజీ (మంచిర్యాల) రన్నరప్‌గా నిలిచాయి. టోర్నీ ఫార్మాట్... ► ముందుగా జిల్లా స్థాయిలో నాకౌట్ పద్ధతిలో మ్యాచ్‌లు జరుగుతాయి. ఈ మ్యాచ్‌లను 10 ఓవర్లచొప్పున నిర్వహిస్తారు. జిల్లా స్థాయి విజేత జట్లు ప్రాంతీయస్థాయి టోర్నీకి, ప్రాంతీయ స్థాయి టోర్నీ విజేత జట్లు రాష్ట్ర స్థాయి టోర్నీకి అర్హత సాధిస్తాయి. రాష్ట్రస్థాయి మ్యాచ్‌లను 20 ఓవర్ల చొప్పున నిర్వహిస్తారు. తెలంగాణలో ఉమ్మడి జిల్లాలే ప్రాతిపాదికగా ఎంట్రీలు స్వీకరిస్తారు. ఎంట్రీ ఫీజు... ► ఈ టోర్నీలో పాల్గొనాలనుకునే జట్లు రూ. 1,500 ఎంట్రీ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఎంట్రీ ఫీజును ఆన్లైన్లోనే చెల్లించాలి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కోసం.... www.arenaone.in వెబ్సైట్లో లాగిన్ కావాలి. ఎంట్రీలను వచ్చే ఏడాది జనవరి 5వ తేదీలోగా పంపించాలి. ఏ ఏ విభాగాల్లో... ► సాక్షి ప్రీమియర్ లీగ్‌ను రెండు కేటగిరీల్లో నిర్వహిస్తారు. అండర్–18 జూనియర్ స్థాయిలో (1–12–2002 తర్వాత జన్మించి ఉండాలి) ... అండర్–24 సీనియర్ స్థాయిలో (1–12–1996 తర్వాత జన్మించి ఉండాలి) వేర్వేరుగా నిర్వహిస్తారు. ఒక్కో కాలేజీ నుంచి గరిష్టంగా మూడు జట్లను పంపించే వెసులుబాటు ఉంది. మూడు జట్లు కూడా వేర్వేరుగా ఎంట్రీ ఫీజు చెల్లించాలి. అమ్మాయిల కోసం కూడా... ఈసారి సాక్షి ప్రీమియర్ లీగ్ టోర్నీలో మహిళా విభాగం మ్యాచ్‌లను కూడా నిర్వహించనున్నారు. మహిళా టోర్నీలో పాల్గొనేందుకు కనీస వయస్సు 12 ఏళ్లు. 1–12–2008 తర్వాత జన్మించిన అమ్మాయిలే అర్హులు. ఈ టోర్నీలో స్కూల్, కాలేజీ జట్లు పాల్గొనవచ్చు. మ్యాచ్‌లు రీజినల్ స్థాయిలో ప్రారంభమవుతాయి. రీజినల్ స్థాయి విజేత జట్లు రాష్ట్ర స్థాయి ఫైనల్స్ టోర్నీలో పాల్గొంటాయి. ఈ టోర్నీలో పాల్గొనేందుకు ఆసక్తి ఉన్న జట్లు ఆన్లైన్లో ఉచితంగా ఎంట్రీలు పంపించవచ్చు. ఇతర వివరాలకు 99120 35299, 95055 14424, 96660 13544 ఫోన్ నంబర్లలో సంప్రదించాలి. తెలంగాణలోని ఉమ్మడి జిల్లాలను మూడు జోన్లుగా విభజించారు జోన్–1లో హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాలు ఉన్నాయి. జోన్–2లో వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాలు ఉన్నాయి. జోన్–3లో నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలు ఉన్నాయి. ముఖ్యమైన విషయం.. మ్యాచ్ సమయంలో ఆటగాళ్లు తమ కళాశాల గుర్తింపు కార్డు (ఒరిజినల్), వయసు ధ్రువీకరణకు సంబంధించి పదో తరగతి మార్కుల మెమో (ఒరిజినల్)ను నిర్వాహకులకు తప్పనిసరిగా చూపించాలి. మ్యాచ్ జరిగే సమయంలో బ్యాట్స్‌మెన్, వికెట్ కీపర్ తప్పనిసరిగా హెల్మెట్లు, లెగ్ ప్యాడ్లు, అండర్ గార్డ్స్, హ్యాండ్‌గ్లౌవ్స్, వైట్ డ్రెస్, వైట్ షూస్ ధరించాలి. గమనిక: అన్ని విషయాల్లో నిర్వాహకులదే తుది నిర్ణయం. -
చాంపియన్ ట్రయల్ బ్లేజర్స్
షార్జా: మహిళల టి20 చాలెంజ్ క్రికెట్ టోర్నమెంట్లో కొత్త చాంపియన్ అవతరించింది. ఇప్పటికే రెండుసార్లు టైటిల్‌ను గెలుచుకున్న డిఫెండింగ్ చాంపియన్ సూపర్ నోవాస్‌ను ఓడించి ట్రయల్ బ్లేజర్స్ విజేతగా నిలిచింది. సోమవారం జరిగిన ఫైనల్లో స్మృతి మంధాన సారథ్యంలోని బ్లేజర్స్ 16 పరుగులతో హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీలోని సూపర్ నోవాస్‌పై విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ట్రయల్ బ్లేజర్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 118 పరుగులు చేసింది. స్మృతి మంధాన (49 బంతుల్లో 68; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో జట్టు ఆమాత్రం స్కోరు సాధించగలిగింది. నోవాస్ బౌలర్ రాధా యాదవ్ మహిళల టి20 చాలెంజ్ టోర్నీలో 5 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా రికార్డు సృష్టించింది. అనంతరం సల్మా ఖాతూన్ (3/18), దీప్తి శర్మ (2/9)ల ధాటికి సూపర్ నోవాస్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 102 పరుగులే చేసి ఓటమి పాలైంది. కెప్టెన్ హర్మ¯న్‌ప్రీత్ కౌర్ (36 బంతుల్లో 30; 2 ఫోర్లు), శశికళ సిరివర్ధనే (18 బంతుల్లో 19; 1 ఫోర్) రాణించారు. విజేతగా నిలిచిన ట్రయల్ బ్లేజర్స్ జట్టుకు ట్రోఫీతోపాటు రూ. 25 లక్షలు ప్రైజ్‌మనీగా లభించాయి. కెప్టెన్ మెరుపులు... టైటిల్‌పై గురిపెట్టిన స్మృతి దూకుడే మంత్రంగా చెలరేగింది. అనుజా బౌలింగ్‌లో వరుసగా 4, 4, 6తో తన ఉద్దేశాన్ని చాటింది. డాటిన్ (32 బంతుల్లో 20; 1 ఫోర్) రాణించడంతో పవర్‌ప్లేలో జట్టు 45 పరుగులు సాధించింది. తర్వాత నోవాస్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో పరుగుల వేగం తగ్గింది. డాటిన్‌ను అవుట్ చేసిన పూనమ్ యాదవ్ ఓవర్లోనే వరుసగా 4, 6తో స్మృతి జోరు పెంచింది. ఈ క్రమంలో 38 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేసుకుది. జట్టు స్కోరు 101 వద్ద స్మృతి రెండో వికెట్‌గా వెనుదిరిగింది. రాధ మాయాజాలం... డెత్ ఓవర్లలో రాధ కొట్టిన దెబ్బకి బ్లేజర్స్ ఇన్నింగ్స్ కకావిలకమైంది. 18వ ఓవర్లో బంతినందుకున్న ఆమె... దీప్తి శర్మ (9), రిచా ఘోష్ (10)లను డగౌట్ చేర్చి భారీ స్కోరుకు కళ్లెం వేసింది. ఇక చివరి ఓవర్లోనైతే ఏకంగా 3 వికెట్లతో విజృంభించింది. తొలి బంతికి ఎకెల్‌స్టోన్ (1), నాలుగో బంతికి హర్లీన్ (4), ఐదో బంతికి జులన్ గోస్వామి (1) వికెట్లను పడగొట్టి కేవలం ఒక పరుగు మాత్రమే ఇచ్చింది. చివరి బంతికి చాంథమ్ (0) రనౌట్‌గా వెనుదిరగడంతో ఆ వికెట్ ఆమె ఖాతాలో చేరలేదు. ఈ దెబ్బకి చివరి ఐదు ఓవర్లలో నోవాస్ కేవలం 17 పరుగులే చేయగలిగింది. అతి జాగ్రత్తతో... ఆరంభంలోనే నోవాస్‌కు షాక్ తగిలింది. మంచి ఫామ్‌లో ఉన్న చమరి ఆటపట్టు (6) వికెట్‌ను రివ్యూ కోరి బ్లేజర్స్ దక్కించుకుంది. దీంతో అతి జాగ్రత్తకు పోయిన నోవాస్ పవర్‌ప్లేలో 28 పరుగులే చేసింది. తానియా (14), జెమీమా (13) విఫలమయ్యారు. ఈ దశలో కెప్టెన్ హర్మన్ ఇన్నింగ్స్ చక్కదిద్దే పనిలో పడింది. శశికళ (19)తో కలిసి నాలుగో వికెట్‌కు 37 పరుగులు జోడించి మ్యాచ్‌పై ఆశలు రేపింది. విజయానికి 12 బంతుల్లో28 పరుగులు చేయాల్సి ఉండగా... రెండు పరుగుల వ్యవధిలో అనుజా, హర్మన్, పూజలను పెవిలియన్ చేర్చి సల్మా ఖాతూన్ నోవాస్ నుంచి టైటిల్‌ను లాగేసుకుంది. -
గెలిస్తేనే ఫైనల్లోకి...
షార్జా: అదిరే ఆరంభం... ఆపై నిరాశజనక ప్రదర్శన... తొలి రెండు మ్యాచ్‌ల్లో మహిళల టి20 చాలెంజ్ క్రికెట్ టోర్నీ సాగిన తీరిది. కరోనా విరామం తర్వాత భారత మహిళలు తలపడుతోన్న ఈ టోర్నీలో ఊహకందని ప్రదర్శనలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో తొలి మ్యాచ్‌లో ఓటమి పాలైన డిఫెండింగ్ చాంపియన్ సూపర్ నోవాస్... అద్భుతమైన ఫామ్‌లో ఉన్న ట్రయల్ బ్లేజర్స్‌ను నేడు ఎదుర్కోనుంది. ఈ మ్యాచ్‌లో గెలుపొంది దర్జాగా ఫైనల్‌కు చేరేందుకు స్మృతి మంధాన సారథ్యంలోని బ్లేజర్స్ పక్కాగా సిద్ధమైంది. లీగ్‌లో నిలవాలంటే గెలవడం తప్ప సూపర్ నోవాస్‌కు మరో దారి లేదు. ఈ మ్యాచ్‌లో గెలుపొందితే నెట్ రన్‌రేట్ సహాయంతో వెలాసిటీ (–1.869) జట్టును వెనక్కి నెట్టి సూపర్ నోవాస్ (–0.204) ఫైనల్‌కు చేరే అవకాశముంది. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ బృందం పట్టుదలగా ఉంది. చమరి ఆటపట్టు, జెమీమా రోడ్రిగ్స్ సహాయంతో భారీ లక్ష్యాన్ని ప్రత్యర్థికి నిర్దేశించాలని యోచిస్తుంది. మరోవైపు ట్రయల్ బ్లేజర్స్ భారీ విజయంలో కీలక పాత్ర పోషించిన లెఫ్టార్మ్ స్పిన్నర్ సోఫీ ఎకెల్‌స్టోన్ ఈ మ్యాచ్‌లో కీలకం కానుంది. స్పిన్‌కు అనుకూలించే పిచ్‌పై సోఫీతో పాటు రాజేశ్వరీ గైక్వాడ్‌ను తట్టుకొని నిలిస్తే సూపర్ నోవాస్ విజయం కష్టమేమీ కాదు. ఇరు జట్లలోనూ నాణ్యమైన స్పిన్నర్లు ఉండటంతో ఈ మ్యాచ్ రసవత్తరంగా జరుగనుంది. బ్యాటర్లు సత్తా చాటిన జట్టునే విజయం వరించడం ఖాయం. -
కింగ్స్ ఎలెవన్ నాలుగో విజయం
అనంతపురం సప్తగిరి సర్కిల్: ఆంధ్ర టి20 లీగ్ క్రికెట్ టోర్నమెంట్లో కింగ్స్ ఎలెవన్ జట్టు నాలుగో విజయం నమోదు చేసింది. చార్జర్స్ ఎలెవన్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో కింగ్స్ జట్టు మూడు పరుగుల తేడాతో నెగ్గింది. 158 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చార్జర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 154 పరుగులు చేసి ఓడిపోయింది. కింగ్స్ జట్టు బౌలర్ ‘మ్యాన్ ఆఫ్ ద మాŠయ్చ్’ పి.తపస్వీ 13 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టి తమ జట్టు విజయంలో ముఖ్యపాత్ర పోషించాడు. చార్జర్స్ జట్టులో రషీద్ (41 బంతుల్లో 61; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), సుమంత్ (39) మెరిసినా కీలకదశలో అవుటవ్వడంతో ఆ జట్టుకు ఓటమి తప్పలేదు. అంతకుముందు కింగ్స్ ఎలెవన్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 157 పరుగులు చేసింది. కెప్టెన్ సీఆర్ జ్ఞానేశ్వర్ (52; 6 ఫోర్లు, సిక్స్), నరేన్ రెడ్డి (44; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరిశారు. మరో మ్యాచ్‌లో చాంపియన్స్ జట్టు ఏడు వికెట్ల తేడాతో టైటాన్స్‌ను ఓడించింది. తొలుత టైటాన్స్ జట్టు 8 వికెట్లకు 151 పరుగులు చేయగా... చాంపియన్స్ జట్టు 19 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేసి గెలిచింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ రికీ భుయ్ (42 బంతుల్లో 62; 4 ఫోర్లు, 6 సిక్స్‌లు) కళ్లు చెదిరే ఇన్నింగ్స్ ఆడాడు. గిరినాథ్ (33), అశ్విన్ హెబర్ (36) కూడా రాణించడంతో చాంపియన్స్ జట్టు ఓవర్ మిగిలి ఉండగానే లక్ష్యాన్ని అధిగమించింది. క్వార్టర్స్‌లో దివిజ్ జంట నూర్–సుల్తాన్ (కజకిస్తాన్): అస్తానా ఓపెన్ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నమెంట్లో దివిజ్ శరణ్ (భారత్)–ల్యూక్ బామ్‌బ్రిడ్జ్ (బ్రిటన్) జంట క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. బుధవారం జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో దివిజ్–బామ్‌బ్రిడ్జ్ ద్వయం 7–5, 4–6, 10–6తో ఏరియల్ బెహర్ (ఉరుగ్వే)–గొంజాలో ఎస్కోబార్ (ఈక్వెడార్) జోడీని ఓడించింది. -
శ్రీలంకలో ఆసియా కప్!
కొలంబో: పరిస్థితులు మెరుగుపడి క్రికెట్‌కు అవకాశం ఏర్పడితే ఈ ఏడాది ఆసియా కప్ క్రికెట్ టోర్నీ శ్రీలంకలో జరగనుంది. షెడ్యూల్ ప్రకారం ఈ టోర్నీ సెప్టెంబరులో నిర్వహించాల్సి ఉంది. వాస్తవానికి ఈసారి ఆసియా కప్ నిర్వహణ హక్కులు పాకిస్తాన్‌కు ఉన్నాయి. అయితే భారత్ కూడా ఈ టోర్నీలో పాల్గొంటుంది కాబట్టి పాక్‌లో జరగడం దాదాపుగా అసాధ్యంగా మారింది. దాంతో నిర్వహణా హక్కులు ఈసారి శ్రీలంకకు ఇచ్చి 2022 ఆసియా కప్‌ను తమకు ఇవ్వాలని పాకిస్తాన్ బోర్డు (పీసీబీ) కోరింది. దీనికి శ్రీలంక బోర్డు అంగీకరించింది. పైగా ఇతర ఆసియా దేశాలతో పోలిస్తే ప్రస్తుతం శ్రీలంకలో మాత్రం కరోనా విజృంభణ తక్కువగా ఉంది. అయినా సరే టోర్నీ నిర్వహణ అంత సులువు కాదు. తాజాగా భారత జట్టు శ్రీలంక పర్యటన రద్దు చేసుకోవడం కూడా అందుకు ఉదాహరణ. కనీసం ఆరు దేశాల జట్లు పాల్గొనే ఆసియా కప్ కోసం ఆరోగ్య సంబంధిత ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. పైగా అప్పటికి అంతర్జాతీయ ప్రయాణాల పరిస్థితిని కూడా చూడాల్సి ఉంటుంది. అయితే 2010లో చివరిసారిగా ఆసియా కప్‌కు ఆతిథ్యం ఇచ్చిన శ్రీలంక ఏమాత్రం అవకాశం లభించినా సిద్ధమంటోంది. -
ఇంగ్లండ్‌లోనూ క్రికెట్ టోర్నీలు రద్దు
లండన్: కరోనా ప్రభావం ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) కీలక నిర్ణయం తీసుకునేలా చేసింది. మే 28 వరకు ఎలాంటి ప్రొఫెషనల్ క్రికెట్‌ను తాము నిర్వహించడం లేదని ఈసీబీ ప్రకటించింది. తాజా సీజన్‌ను ఆలస్యంగా ప్రారంభిస్తున్నట్లు ఈసీబీ వెల్లడించింది. శ్రీలంకలో కూడా: శ్రీలంకలోనూ అన్ని రకాల దేశవాళీ క్రికెట్‌ను రద్దు చేస్తున్నట్లు లంక బోర్డు ప్రకటించింది. గత మంగళవారం శ్రీలంకలో ప్రతిష్టాత్మక వార్షిక స్కూల్ క్రికెట్ మ్యాచ్ జరిగింది. దీనికి భారీ సంఖ్యలో ప్రేక్షకులు హాజరయ్యారు. వీరిలో ఒకరికి కరోనా ఉన్నట్లు బయటపడింది. దాంతో అందరిలో ఆందోళన నెలకొంది. నిజానికి ఈ మ్యాచ్‌ను ఆపేయాలని స్వయంగా దేశాధ్యక్షుడు గొటబాయ ఆదేశించినా నిర్వాహకులు దీనిని పట్టించుకోలేదు. తాజా ఘటన కారణంగా ఇప్పుడు దేశవ్యాప్తంగా క్రికెట్ పూర్తిగా రద్దయింది. -
హైదరాబాద్‌కు తొలి విజయం
సాక్షి, హైదరాబాద్: కల్నల్ సీకే నాయుడు అండర్–23 క్రికెట్ టోర్నమెంట్లో హైదరాబాద్ గెలుపు రుచి చూసింది. స్థానిక జింఖానా మైదానంలో రాజస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 41 పరుగుల తేడాతో ఘనవిజయాన్ని సాధించింది. టోర్నీలో భాగంగా ఎలైట్ గ్రూప్ ‘ఎ’లో ఆరు మ్యాచ్‌లాడిన హైదరాబాద్ 4 మ్యాచ్‌ల్లో ఓటమి పాలై మరో మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. ఈ మ్యాచ్ విజయంతో పాయింట్ల పట్టికలో హైదరాబాద్ (7 పాయింట్లు) ఆరో స్థానానికి చేరింది. 179 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించేందుకు ఓవర్‌నైట్ స్కోరు 35/3తో ఆటకు చివరిరోజైన శుక్రవారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన రాజస్తాన్ 36 ఓవర్లలో 137 పరుగులకు ఆలౌటైంది. ఏబీ కూక్నా (45 బంతుల్లో 35; 4 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్. హైదరాబాద్ బౌలర్లలో కృష్ణ చరిత్ 3 వికెట్లు పడగొట్టగా... రక్షణ్, ప్రణీత్ రాజ్, అజయ్‌దేవ్ గౌడ్ చెరో 2 వికెట్లు దక్కించుకున్నారు. రతన్ తేజ ఒక వికెట్ తీశాడు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో హైదరాబాద్ 241 పరుగులు చేయగా... రాజస్తాన్ 237కు ఆలౌటైంది. హైదరాబాద్ రెండో ఇన్నింగ్స్‌లో 174 పరుగులు చేసింది. ఒంగోల్ వేదికగా ఫిబ్రవరి 6 నుంచి జరిగే తమ తదుపరి లీగ్ మ్యాచ్‌లో ఆంధ్ర జట్టుతో హైదరాబాద్ ఆడుతుంది. -
చికాగోలో విజయవంతంగా నాట్స్ క్రికెట్ టోర్నమెంట్
చికాగో: అమెరికాలో తెలుగువారిని ఒక్కటి చేసేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగానే చికాగోలో నాట్స్ నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ కు విశేష స్పందన లభించింది. 15 జట్లు, 22 మ్యాచ్‌లతో ఈ టోర్నమెంట్ విజయవంతంగా ముగిసింది. ఈ టోర్నీలో పాల్గొన్న క్రికెటర్లు తమ ప్రతిభను చూపించారు. రేజింగ్ బుల్స్ టీం ఈ చికాగో క్రికెట్ టోర్నమెంట్ కప్ 2019 ను కైవసం చేసుకుంది. చికాగో నాట్స్ సభ్యులు మహేశ్ కాకర్ల, మూర్తి కొప్పాక, శ్రీనివాస పిడికిటి, రాజేశ్ వీదులమూడి, కృష్ణ నిమ్మగడ్డ, శ్రీనివాస బొప్పన, శ్రీథర్ ముమ్మనగండి, కృష్ణ నున్న, ఆర్కే బాలినేని, హారీశ్ జమ్ముల, కార్తీక్ మోదుకూరి, శ్రీనివాస్ పిల్ల తదితరులు ఈ టోర్నమెంట్ విజయవంతానికి సమర్థమైన నాయకత్వాన్ని అందించారు. యజ్ఞేష్, అరుల్ బాబు, సందీప్ వెల్లంపల్లి, అరవింద్ కోగంటి, కృష్ణ నిమ్మగడ్డ, సంతోష్ పిండి, వినోద్ బాలగురు చక్కటి ప్రణాళికతో ఈ టోర్నమెంట్ విజయంలో కీలక పాత్ర పోషించారు. ప్రశాంత్ నున్న, వెంకట్ దాములూరి, గోపాల్ శీలం, మురళీ కోగంటి, శ్రీకాంత్ బొజ్జా, వేణు కృష్ణార్ధుల, చెన్నయ్య కంబాల, పాండు చెంగలశెట్టి, మనోహార్ పాములపాటి, నవాజ్ తదితరులు చక్కగా టోర్నమెంట్ నిర్వహణకు కృషి చేశారు. బావర్చి, హైదరాబాద్ హౌస్ భోజన ఏర్పాట్లు చేసింది. శ్రీని అర్షద్, స్మార్ట్ డెక్, రవి శ్రీకాకుళం, విండ్ సిటీ వాసు అడ్డగడ్డ కార్పొరేట్ స్పాన్సర్లుగా వ్యవహారించారు. -
అండర్–19 ముక్కోణపు క్రికెట్ టోర్నీ విజేత భారత్
హోవ్ (ఇంగ్లండ్): బ్యాట్స్‌మెన్ బాధ్యతాయుతంగా ఆడటంతో... ఇంగ్లండ్‌లో జరిగిన అండర్–19 ముక్కోణపు క్రికెట్ టోర్నమెంట్లో భారత జట్టు విజేతగా నిలిచింది. హోవ్ నగరంలో ఆదివారం జరిగిన ఫైనల్లో యువ భారత్ ఆరు వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించింది. తొలుత బంగ్లాదేశ్ సరిగ్గా 50 ఓవర్లలో 261 పరుగులకు ఆలౌటైంది. హసన్ జాయ్ (109; 9 ఫోర్లు, సిక్స్) సెంచరీ చేశాడు. భారత బౌలర్లలో కార్తీక్ త్యాగి, సుశాంత్ మిశ్రా రెండేసి వికెట్లు తీశారు. అనంతరం భారత్ 48.4 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 264 పరుగులు చేసి గెలిచింది. యశస్వి జైస్వాల్ (50), దివ్యాంశ్ సక్సేనా (55), కెప్టెన్ ప్రియమ్ గార్గ్ (73), ధ్రువ్ జురెల్ (59 నాటౌట్) అర్ధ సెంచరీలు చేశారు. హైదరాబాద్ క్రికెటర్ ఠాకూర్ తిలక్ వర్మ (10 బంతుల్లో 16 నాటౌట్; 3 ఫోర్లు) రాణించాడు. ధ్రువ్‌తో కలిసి తిలక్ వర్మ అజేయ ఐదో వికెట్‌కు 29 పరుగులు జోడించాడు. -
టీపీఎల్ 2018 చాంపియన్స్‌గా కూల్ క్రూజర్స్
లండన్ : తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్(తాల్) ఆధ్వర్యంలో తాల్ ప్రీమియర్ లీగ్(టీపీఎల్) క్రికెట్ టోర్నమెంట్‌ను మిడిల్సెక్స్లో నిర్వహించారు. క్రాన్ ఫోర్డ్‌లోని ఇంపీరియల్ కాలేజ్ లండన్‌లో హెస్టన్ మైదానంలో జరిగిన ఈ టోర్నీలో విజేతలకు స్థానిక ఎంపీ సీమా మల్హోత్రా అవార్డులను ప్రదానం చేశారు. కూల్ క్రూజర్స్, మార్చ్ సైడ్ కింగ్స్ జట్లు ఫైనల్ వరకు చేరుకోగా, బ్లూ క్యాప్స్, యూనైటెడ్ టైటాన్స్ జట్లు మూడో స్థానం కోసం పోటీపడ్డాయి. కూల్ క్రూజర్స్ టీపీఎల్ 2018 చాంపియన్స్‌గా నిలవగా, మార్చ్ సైడ్ కింగ్స్ రెండో స్థానం, యునైటెడ్ టైటాన్స్ మూడోస్థానంలో నిలిచాయి. టీపీఎల్‌లో పవన్ కుమార్ సీహెచ్ ఆల్‌రౌండర్‌గా రాణించి మ్యాన్ ఆఫ్ ది సిరీస్, బెస్ట్ బౌలర్, బెస్ట్ బ్యాట్స్‌మెన్‌గా నిలిచారు. టోర్నమెంట్ విజయవంతంగా నిర్వహించడంలో సహకరించిన టీపీఎల్ కమిటీ సభ్యులు సునీల్ నాగండ్ల, వంశీ రక్నర్, శ్యామ్ భీమ్‌రెడ్డి, శ్రీధర్ సోమిశెట్టి, వంశి పొన్నంలకు తాల్ స్పోర్ట్స్ ట్రస్టీ మురళీ తాడిపర్తి కృతజ్ఞతలు తెలిపారు. టీపీఎల్ సలహాదారులు రవిసుబ్బా, సంజయ్ భిరాజు, శరత్ జెట్టి, వాలంటీర్ల చేసిన కృషిని టీఏఎల్ ఛైర్మన్ శ్రీధర్ మేడిచెట్టి అభినందించారు. -
ఇబ్రహీంపట్నంలో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన లక్ష్మణ్
-
ఏప్రిల్ 7, 8న కేసీసీ క్రికెట్ టోర్నీ
కేపీఎల్, సీసీఎల్ తరహాలో సాండల్‌వుడ్ హీరోలతో కొత్తగా కేసీసీ టోర్నీ నిర్వహించటానికి రంగం సిద్దమైంది. కర్ణాటక చలనచిత్ర కప్ పేరుతో నిర్వహించే ఈ పోటీలకు జట్టును ఎంపిక చేశారు. శుక్రవారం సాయంత్రం బెంగళూరు ప్యాలెస్ మైదానంలో ఆరు జట్లను ఎంపిక చేశారు. మాజీ క్రికెటర్ అనిల్‌కుంబ్లే జట్టు ఎంపికకు సంబంధించి నియమ, నిబంధనలను వివరించారు. ఈ పోటీలు ఏప్రిల్ 7, 8 రెండు రోజుల పాటు 10 ఓవర్లతో ఆదిత్య గోబ్లల్ మైదానంలో జరుగునుంది. ఇందులో పాత్రికేయులు, సినిమా డైరక్టర్లు, నిర్మాతలు, నటులకు అవకాశం కల్పించారు. ఈ కార్యక్రమంలో శివరాజ్‌కుమార్, పునీత్ రాజ్‌కుమార్, సుధీప్, రవిచంద్రన్, వినయ్‌కుమార్, అశోక్ఖేణిలు పాల్గొన్నారు. -
ఉత్సాహంగా పీపీఎల్ టోర్నీ
ఖమ్మం స్పోర్ట్స్: పువ్వాడ ప్రీమియర్ లీగ్ టీ–20 క్రికెట్ పోటీలు సర్దార్ పటేల్ స్టేడియంలో ఉత్సాహభరితంగా సాగుతున్నాయి. జిల్లా స్థాయి పోటీల్లో ఖమ్మంకు చెందిన క్రికెటర్లు అధికంగా పాల్గొనడంతో మ్యాచ్‌లను తిలకించేందుకు అభిమానులు భారీగా తరలివస్తున్నారు. తమకు నచ్చిన బ్యాట్స్‌మెన్, బౌలర్లు సిక్స్‌లు, ఫోర్లు కొట్టినప్పుడు, ఫీల్డర్లు క్యాచ్‌లు పట్టినప్పుడు కేరింతలు కొడుతూ క్రీడాస్ఫూర్తిని నింపుతున్నారు. ఖమ్మంలో మొదటిసారిగా ప్లడ్‌లైట్ల వెలుగులో మ్యాచ్‌లు జరుగుతుండడంతో అభిమానులు అధిక సంఖ్యలో తరలివచ్చి తిలకిస్తున్నారు. శుక్రవారం జరిగిన తొలిమ్యాచ్‌లో చాయిస్ స్పోర్ట్స్–రవిస్వీట్స్ జట్లు తలపడగా టాస్ గెలచిన రవిస్వీట్స్ బ్యాటింగ్‌ను ఎంచుకుంది. కేవలం 10.3 ఓవర్లు ఆడి 75 పరుగులకే ఆలౌటయింది. తాతాబాబు, 9 బంతు లు ఆడి మూడు సిక్సర్లు, ఒక ఫోరుతో 26 పరుగులు చేయగా మిగిలిన బ్యాట్స్మెన్లు ఎవరూ రాణించలేకపోయారు. చాయిస్ స్పోర్ట్స్ బౌలర్లలో జిత్తు 1.3 ఓవర్లలో 5 పరుగులకు 4 వికెట్లు తీయగా, వంశీ 2, యాసిన్ 2, లలిత్ 1 వికెట్ తీసుకున్నారు. స్వల్ప స్కోరును సాధించేందుకు బరిలోకి దిగిన చాయిస్ స్పోర్ట్స్ 8.4 ఓవర్లలోనే రెండు వికెట్ల నష్టానికి లక్ష్యాన్ని అధిగమించింది. బ్యాట్స్మెన్లు యాసిన్ మూడు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 23, కిషోర్ 3 ఫోర్లు, 1 సిక్సర్‌తో 23, షేక్ మహ్మద్ 18 పరుగులు చేశారు. రవిస్వీట్స్ బౌలర్లు కిరణ్, తాతాబాబులు ఒక్కో వికెట్ తీసుకున్నారు. గురువారం రాత్రి జరిగిన లీగ్ మ్యాచ్‌లో అరవిందా కాటన్స్– వీవీసీ మోటర్స్ జట్లు తలపడగా అరవిందా కాటన్స్ పరిమిత 20 ఓవర్లు ఆడి పది వికెట్లు కోల్పోయి 111 పరుగులు చేసింది. జట్టులో రాకేష్ మూడు బౌండరీలతో 31 పరుగులు చేయగా, అఖిల్, ప్రసన్నలు 10 పరుగుల చేశారు. వీవీసీ మోటర్స్ బౌలర్లలో శ్రావణ్‌కుమార్ 3, రాజేంద్ర 2, జ్యోతిసాయి 2, రాజ్‌కుమార్ 2, నిషాంత్ ఒక వికెట్ తీసుకున్నారు. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన వీవీసీ మోటర్స్ 15.1 ఓవర్లలో 114 పరుగులు చేసి విజయం సాధించింది. బ్యాట్స్మెన్లు శశికాంత్ 31, శ్రావణ్‌కుమార్ 24, రాజేందర్ 16 పరుగులు చేశారు. దీంతో వీవీసీ మోటర్స్ జట్టు విజయం సాధించిం -
క్రికెట్ సంక్రాంతి
రావినూతల(మేదరమెట్ల): రావినూతల స్పోర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం నుంచి ఈ నెల 16వ తేదీ వరకు నిర్వహించనున్న 27వ అంతర్ రాష్ట్ర క్రికెట్ పోటీలకు ఏర్పాట్లు సిద్ధం చేశారు. కొరిశపాడు మండలం రావినూతల గ్రామానికి చెందిన యువకులు అసోసియేషన్ ఏర్పాటు చేసి గత 27 ఏళ్లుగా క్రమం తప్పకుండా క్రికెట్ టోర్నీలు నిర్వహిస్తుండటం విశేషం. ఏటా సంక్రాంతి పండుగకు ముందు నిర్వహిస్తున్న ఈ టోర్నీకి విశేష ఆదరణ లభిస్తోంది. తొలుత మండల, జిల్లా స్థాయికే పరిమితమైన పోటీలను గత 18 ఏళ్లుగా అంతర్ రాష్ట్ర స్థాయిలో నిర్వహిస్తున్నారు. రావినూతల స్పోర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్‌కు పలువురు రాజకీయ నాయకులు, గ్రామస్తులు సహాయ సహకారాలు అందించడంతో క్రికెట్ పోటీలు ఏటా నిరాటంకంగా కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ ప్రమాణాలు రావినూతల స్టేడియంలో 2004 నుంచి అంతర్జాతీయ ప్రమాణాలు ఉండేలా చర్యలు చేపట్టారు. టర్ఫ్ పిచ్‌పై పోటీలు నిర్వహించడమే కాకుండా పక్కనే మరో పిచ్‌ను అదే ప్రమాణాలతో ఏర్పాటు చేశారు. కొన్నేళ్లుగా రెండు పిచ్‌లపై మ్యాచ్‌లు నిర్వహిస్తున్నారు. జట్లను నాలుగు గ్రూపులుగా విభజించి నాకౌట్ కమ్ లీగ్ పద్ధతిలో టీ–20 ఫార్మాట్లో నిర్వహిస్తున్నారు. బీసీసీఐ జాతీయ సెలక్షన్ కమిటీ ప్రస్తుత చైర్మన్ ఎంఎస్కే ప్రసాద్, వేణుగోపాలరావు, రంజీ, ఐపీఎల్ క్రీడాకారులు ఎందరో రావినూతల స్టేడియంలో ఆడారు. పోటీలు జరిగే రోజుల్లో తమ సొంత గ్రామంలోనే ఉన్నట్టుంటుందని ఇతర రాష్ట్రాల క్రీడాకారులు పేర్కొనడం గమనార్హం. నేడు టోర్నీ ప్రారంభం రావినూతలలో సంక్రాంతి కప్–2018ను మంగళవారం ఉదయం 9 గంటలకు బాపట్ల ఎంపీ శ్రీరామ్ మాల్యాద్రి, అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, ప్రముఖ సినీనటుడు యర్రా గిరిబాబు ప్రారంభించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. వితలకు ప్రథమ బహుమతిగా కీర్తిశేషులు కారుసాల తాతారావు స్మారక కప్, రూ.75 వేల నగదు, ద్వితీయ బహుమతిగా క్రీ.శే. యర్రా శ్రీదేవి, ముప్పవరపు రఘురామ్ స్మారక కప్, రూ.50 వేల నగదు, తృతీయ బహుమతిగా ఎలైన్ డైరీ కప్, రూ.25 వేల నగదు, చతుర్థ బహుమతిగా చప్పిడి హనుమంతరావు స్మారక కప్, రూ.10 వేల నగదు అందజేస్తామని అసోసియేషన్ సభ్యులు పేర్కొన్నారు. మ్యాన్ ఆఫ్ ద టోర్నీ కారుసాల బాపయ్య జ్ఞాపకార్థం, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, బెస్ట్ బౌలర్, బెస్ట్ బ్యాట్స్‌మన్, బెస్ట్ ఫీల్డర్ అవార్డులు రామినేని ప్రసాద్, దామా రమేష్ స్మారకార్థం బహుకరించనున్నట్లు సభ్యులు తెలిపారు. తొలిరోజు మ్యాచ్‌లు మొదటి మ్యాచ్ ఉదయం 9.30 గంటలకు అరుణ ఇన్ఫ్రా, ఒంగోలు– సీడీసీఏ లెవెన్, తిరుపతి జట్ల మధ్య, రెండో మ్యాచ్ మధ్యాహ్నం ఒంటి గంటకు ఆర్మీ సర్వీసెస్ కాప్స్, బెంగలూరు– సౌత్‌సెంట్రల్ రైల్యేస్ విజయవాడ జట్ల మధ్య జరుగనున్నాయి. -
చాంపియన్స్ హెచ్‌సీఏ ఎలెవన్
∙ మొయినుద్దౌలా గోల్డ్‌కప్ కైవసం ∙ ఫైనల్లో 7 వికెట్లతో ఓడిన ఎయిరిండియా హైదరాబాద్: ఆలిండియా మొయినుద్దౌలా గోల్డ్ కప్ క్రికెట్ టోర్నమెంట్లో హెచ్‌సీఏ ఎలెవన్ జట్టు సత్తాచాటింది. ఈ టోర్నీలో చాంపియన్‌గా నిలిచి టైటిల్‌ను కైవసం చేసుకుంది. గురువారం ఎయిరిండియాతో జరిగిన ఫైనల్లో హెచ్‌సీఏ ఎలెవన్ జట్టు 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఎయిరిండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 267 పరుగులు చేసింది. నమన్ ఓజా (62), మన్విందర్ బిస్లా (56) అర్ధసెంచరీలు చేశారు. అనంతరం హెచ్‌సీఏ ఎలెవన్ 47.1 ఓవర్లలో 3 వికెట్లకు 273 పరుగులు చేసి గెలిచింది. తన్మయ్ అగర్వాల్ (84), బి. సందీప్ (71), కె. సుమంత్ (60 నాటౌట్) అర్ధసెంచరీలతో ఆకట్టుకున్నారు. విజేతగా నిలిచిన హెచ్‌సీఏ ఎలెవన్ జట్టుకు రూ. 5లక్షలు, రన్నరప్‌గా నిలిచిన ఎయిరిండియాకు రూ. 3లక్షల ప్రైజ్‌మనీ లభించింది. -
ఉద్యోగుల క్రికెట్ విజేత ‘పోలీస్’
ఉద్యోగుల క్రికెట్ విజేత ‘పోలీస్’ - మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా పోలీస్ జట్టు విష్ణువర్ధన్‌రెడ్డి - మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌గా గుంతకల్లు రైల్వే జట్టు శ్రీకాంత్‌రెడ్డి అనంతపురం సప్తగిరి సర్కిల్ : చంద్రా స్పోర్ట్స్, మండల క్రికెట్ అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్న జిల్లా స్థాయి ఉద్యోగుల క్రికెట్ టోర్నీ విజేతగా పోలీస్ జట్టు నిలిచింది. స్థానిక అనంత క్రీడా గ్రామంలోని అనంతపురం క్రీడా మైదానంలో ఆదివారం పోలీస్, ఆర్డీటీ జట్లు ఫైనల్స్ ఆడాయి. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఆర్డీటీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. జట్టులో నరసింహులు 34, మాంచో ఫెర్రర్ 20 పరుగులు చేశారు. పోలీస్ జట్టు బౌలర్ విష్ణువర్దన్ రెడ్డి 4 వికెట్లు పడగొట్టి బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేశారు. మరో బౌలర్ చంద్రమౌళి 2 వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన పోలీస్ జట్టు 18.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 126 పరుగులు చేసి విజయం సాధించింది. జట్టులో నరేష్ 37, రూరల్ ఎస్ఐ నాగేంద్ర ప్రసాద్ 21, జగన్మోహన్ 29 పరుగులు చేశారు. పోలీస్‌జట్టు బౌలర్ విష్ణువర్ధన్‌రెడ్డికి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు ఇచ్చారు. పోలీస్ జట్టుకు ట్రాఫిక్ ఎస్ఐ బాబు కెప్టెన్‌గా వ్యవహరించారు. ఎస్ఐలు హమీద్, రాజు, తేజప్రసాద్ తమ ఆటతో క్రీడాకారులను అలరించారు. గుంతకల్లు రైల్వే జట్టు క్రీడాకారుడు శ్రీకాంత్‌రెడ్డిని ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’గా ఎంపిక చేశారు. భారతజట్టుకు ఆడాలి : ఎస్పీ జిల్లా నుంచి ఇండియన్ క్రికెట్ జట్టుకు ఆడాలని ఎస్పీ రాజశేఖర్‌బాబు ఆశాభావం వ్యక్తం చేశారు. ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ ఉద్యోగుల క్రికెట్ టోర్నీ బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆయన, ఆర్డీటీ ప్రోగ్రాం డైరెక్టర్ మాంచో ఫెర్రర్, కోగటం విజయభాస్కర్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో ఆర్డీటీ చొరవతో క్రీడాభివృద్ధి జరుగుతోందని, క్రీడల ద్వారా గుర్తింపు లభిస్తోందని అన్నారు. జిల్లా నుంచి భారత క్రికెట్ జట్టుకు మరో మూడేళ్లలో జిల్లా క్రీడాకారులు ప్రాతినిధ్యం వహించగలుగుతారన్నారు. మాంచో ఫెర్రర్ మాట్లాడుతూ జిల్లాస్థాయి ఉద్యోగుల టోర్నీకి జిల్లా నుంచి 23 జట్లు పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. జిల్లాలో క్రీడాకారులకు కొదువ లేదన్నారు. ఉద్యోగుల టోర్నీల్లోనూ జిల్లా క్రీడాకారులు రాణిస్తున్నారన్నారు. అనంతరం విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ టీవీ చంద్రమోహన్ రెడ్డి, కార్యదర్శి అలీ, ఆర్గనైజర్లు శ్రీవాస్‌రెడ్డి, మధు, కోచ్ రవికాంత్ తదితరులు పాల్గొన్నారు. ........................................................... -
టోర్ని విజేత విజయవాడ
► ముగిసిన అంతర్ రాష్ట్రాల వెటరన్ క్రికెట్ టోర్నీ ► రన్నరప్‌గా హైదరాబాద్ ► ట్రోఫీలు బహుకరించిన జిల్లా క్రికెట్ సంఘం ప్రతినిధులు కడప స్పోర్ట్స్ : కడప నగరంలోని కేఎస్ఆర్ఎం, కేఓఆర్ఎం క్రీడామైదానంలో గత మూడు రోజులుగా నిర్వహించిన ఎం. చంద్రశేఖరరెడ్డి స్మారక అంతర్ రాష్ట్రాల వెటరన్ క్రికెట్ టోర్నమెంట్ విజేతగా విజయవాడ జట్టు నిలిచింది. ఆదివారం ఉదయం నిర్వహించిన ఫైనల్ మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టుపై విజయవాడ జట్టు విజయం సాధించి ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా విజేతలకు బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు, జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం.వెంకటశివారెడ్డి ట్రోఫీలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెటరన్ క్రికెటర్లు మంచి ఆటతీరుతో అలరించారన్నారు. వయసుతో సంబంధం లేకుండా యువ క్రికెటర్ల మాదిరిగా చక్కగా పోటీపడ్డారన్నారు.జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి రామ్మూర్తి మాట్లాడుతూ జిల్లాలకు వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసి ఆడటం సంతోషంగా ఉందన్నారు. గౌరవ అతిథిగా విచ్చేసిన జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ కార్యదర్శి ఎస్. జిలానీబాషా మాట్లాడుతూ క్రీడాకారుల మధ్య స్నేహపూర్వక వాతావరణాన్ని ఏర్పరచే ఇటువంటి టోర్నమెంట్లు మరిన్ని నిర్వహించాలన్నారు. అనంతరం వివిధ విభాగాల్లో రాణించిన క్రీడాకారులకు జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమంలో వీకే హోండా అధినేత కరుణాకర్‌రెడ్డి, జిల్లా క్రికెట్ అసోసియేషన్ కోశాధికారి వై. శివప్రసాద్, సంయుక్త కార్యదర్శులు సంజయ్‌కుమార్‌రెడ్డి, ఎ.నాగసుబ్బారెడ్డి, సభ్యులు భరత్‌రెడ్డి, మునికుమార్‌రెడ్డి, రెడ్డిప్రసాద్, శేఖర్, ఖాజామైనుద్దీన్ పాల్గొన్నారు. హైదరాబాద్‌పై విజయవాడ విజయకేతనం వెటరన్ క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్మ్యాచ్లో విజయవాడ, హైదరాబాద్ జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచిన హైదరాబాద్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన విజయవాడ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. జట్టులోని బాపిరాజు 62 పరుగులు, పి.శ్రీనివాస్ 25 పరుగులు, జనార్దన్ 23 పరుగులు చేశారు. హైదరాబాద్ బౌలర్లు నదీమ్ 2 వికెట్లు తీశాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. -
తిరుపతిలో సాక్షి ‘ఎరీనా వన్’ యూత్ ఫెస్ట్ ప్రారంభం
► ఐదు జిల్లాల క్రికెట్ జట్లు హాజరు ► ఫిబ్రవరి 3 వరకూ నిర్వహణ తిరుపతి : క్రీడాకారులను ప్రోత్సహించే లక్ష్యంతో ఏడాదికోసారి ‘సాక్షి’నిర్వహించే ‘ఎరీనా వన్’ యూత్ ఫెస్ట్ సోమవారం తిరుపతిలో ప్రారంభమైంది. తిరుపతి శివారులోని తుమ్మలగుంట క్రీడా మైదానంలో ఉదయం 9.30 గంటలకు రీజినల్ స్థాయి క్రికెట్ పోటీలు ప్రారంభం అయ్యాయి. చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఏపీఎస్పీడీసీఎల్ చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ హెచ్ దొర, సీకాం విద్యాసంస్థల డైరెక్టర్ సురేంద్రనాథ్‌రెడ్డిలు పోటీలను ప్రారంభించారు. చిత్తూరు, కర్నూలు, అనంతపురం, వైఎస్సార్, నెల్లూరు జిల్లాల నుంచి 25 జట్లు పోటీలకు హాజరయ్యాయి. ఫిబ్రవరి 3వ తేదీ వరకూ పోటీలు కొనసాగుతాయని నిర్వాహకులు తెలిపారు. జూనియర్స్, సీనియర్స్ విభాగాల్లో పోటీలు కొనసాగుతాయని వివరించారు. ఇక్కడ జరిగే రీజినల్ స్థాయి పోటీల్లో ఎంపికైన జట్లను విజయవాడలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు పంపడం జరుగుతుందని వివరించారు. మొదటి రోజైన సోమవారం జూనియర్స్ విభాగంలో శ్రీచైతన్య జూనియర్ కాలేజ్ వర్సెస్ ఎస్వీ జూనియర్ కాలేజీ, ఎస్వీ ఐఐటీ కాలేజీ వర్సెస్ జగన్ జూనియర్ కాలేజ్ (నెల్లూరు) జట్ల మధ్య పోటీలు జరుగుతున్నాయి. అదేవిధంగా సీనియర్స్ విభాగంలో అకార్డ్ బిజినెస్ స్కూల్ వర్సెస్ సిద్ధార్థ ఎడ్యుకేషన్ అకాడమీల మధ్య, గాయిత్రీ డిగ్రీ అండ్ పీజీ కాలేజీ వర్సెస్ ఏఎస్ఆర్ డిగ్రీ కాలేజీ మధ్య పోటీలు జరుగుతున్నాయి. -
ఆలిండియా ఎఫ్‌సీఐ టోర్నీకి సౌత్‌జోన్ జట్టు
హైదరాబాద్: భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) అఖిల భారత ఇంటర్ జోనల్ క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొనే సౌత్‌జోన్ జట్టును ప్రకటించారు. ఈనెల 4 నుంచి సికింద్రాబాద్‌లోని జింఖానా మైదానంలో సౌత్‌జోన్‌లోని వివిధ రీజియన్ల నుంచి 29 మంది ప్రాబబుల్స్‌కు సెలెక్షన్ ట్రయల్స్ నిర్వహించారు. హైదరాబాద్ రీజినల్ స్పోర్ట్స్ ప్రమోషన్ కమిటీ (ఆర్‌ఎస్‌పీసీ) అధ్యక్షుడు, జనరల్ మేనేజర్ ఎ.రాజగోపాల్, ఆర్‌ఎస్‌పీసీ సెక్రటరీ, పీఆర్ డీజీఎం విక్టర్ అమల్‌రాజ్ ఈ ట్రయల్స్‌ను పర్యవేక్షించారు. ట్రయల్స్‌లో కనబరిచిన ప్రదర్శన ఆధారంగా ఆలిండియా ఎఫ్‌సీఐ టోర్నీలో పాల్గొనే 16 మంది సభ్యులతో కూడిన సౌత్‌జోన్ జట్టును ప్రకటించారు. ఈ జట్టుకు డీఎస్ శ్రీధర్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. ఆలిండియా ఎఫ్‌సీఐ టోర్నీ చండీగఢ్‌లో ఈనెల 16 నుంచి 20 వరకు జరుగుతుంది. సౌత్‌జోన్ ఎఫ్‌సీఐ జట్టు: డి.ఎస్. శ్రీధర్ (కెప్టెన్), సుమిత్ అహ్లావత్, వై. అముల్ పాల్, కె.శ్రీకాంత్, ఎ.సెంథిల్ కుమారన్, జి.శ్రీకాంత్, ప్రవీణ్ సోనీ, ఎస్.గంగాధరన్, నవీన్ నైన్, జి.బాలకుమార్, ప్రమోద్ కుమార్, ఎస్.యోగేశ్, ఎం.ఎ.రషీద్, జె.ఆర్.శ్రీనివాస్, వెంకటేశ్ సాగర్, హెచ్.చంద్ర శేఖర్. -
భారత్‌కు రెండో గెలుపు
బ్యాంకాక్: ఆసియా కప్ మహిళల టి20 క్రికెట్ టోర్నమెంట్లో భారత జట్టు వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. థాయ్‌లాండ్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో టీమిండియా తొమ్మిది వికెట్ల తేడాతో గెలిచింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న థాయ్‌లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 69 పరుగులు చేసింది. భారత బౌలర్లలో మానసి జోషి రెండు వికెట్లు, శిఖా పాండే ఒక వికెట్ తీశారు. 70 పరుగుల విజయలక్ష్యాన్ని భారత్ 11.1 ఓవర్లలో వికెట్ నష్టపోరుు అందుకుంది. వేద కృష్ణమూర్తి (26 బంతుల్లో 35; 4 ఫోర్లు, ఒక సిక్సర్) టాప్ స్కోరర్‌గా నిలిచింది. ఆంధ్ర క్రికెటర్ సబ్బినేని మేఘన (30 బంతుల్లో 29 నాటౌట్; 3 ఫోర్లు), సుష్మా వర్మ (3 నాటౌట్) అజేయంగా నిలిచారు. మంగళవారం జరిగే మూడో లీగ్ మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో భారత్ తలపడుతుంది. -
నవంబర్‌లో అంతర్ జిల్లా క్రికెట్ టోర్నీ
వరంగల్ స్పోర్ట్స్ : జిల్లాకు చెందిన సీనియర్ క్రీడాకారుడు ఫారూఖ్ స్మారకార్థం నవంబర్‌లో అంతర్ జిల్లా సీనియర్స్ క్రికెట్ టోర్నమెంటును నిర్వహించనున్నట్లు క్రికెట్ అసోసియేష¯ŒS జిల్లా కార్యదర్శి చాగంటి శ్రీని వాస్ తెలిపారు. హన్మకొండ అలంకార్ సమీపంలోని అసోసియేష¯ŒS జిల్లా కార్యాలయంలో ఆదివారం అసోసియేష¯ŒS సర్వసభ్య సమావేశంలో పలు తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించినట్లు ఆయన తెలిపారు. ప్రతిభ ఉండి పేదరికంతో ఆడలేని క్రీడాకారులను గుర్తించి వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని, జిల్లా, నగరస్థాయిలో జూనియర్స్, సీనియర్స్ విభాగాల్లో ప్రతి నెలా టోర్నమెంటులు నిర్వహించాలని తీర్మానించారు. అంతేకాకుండా అసోసియేష¯ŒS న్యాయ సలహాదారులుగా సీహెచ్. చిదంబర్నాధ్, పి.సత్యప్రకాష్లను నియమించినట్లు శ్రీనివాస్ తెలిపారు. ప్రతి నెల కార్యవర్గ సమావేశంలో ఖర్చులను ప్రవేశపెట్టాలని తీర్మానించారు. సమావేశంలో అసోసియేష¯ŒS జిల్లా అధ్యక్షుడు గుజ్జారి ప్రతాప్, మార్నేని ఉదయభానురావు, మంచాల స్వామిచరణ్, ఖాజా జమీర్ అహ్మద్ పాల్గొన్నారు. -
సెమీ ఫైనల్లో మెదక్ జట్టు
అండర్ 19 అంతర్ జిల్లా క్రికెట్ టోర్నీ మహబూబ్‌నగర్‌లో సెమీ ఫైనల్స్ సంగారెడ్డి టౌన్: అండర్ 19 అంతర్ జిల్లాల క్రికెట్ టోర్నీలో భాగంగా గురువారం స్థానిక అంబేద్కర్ మైదానంలో జరిగిన మెదక్, నల్లగొండ మ్యాచ్‌లో మెదక్ ఘన విజయం సాధించి సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది. మొదట బ్యాటింగ్ చేసిన నల్లగొండ 118 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్ చేసిన మెదక్ జట్లు 8 వికెట్లకు 120 పరుగు చేసి ఘన విజయం సాధించింది. పోలీస్ పరేడ్ మైదానంలో జరిగిన మరో మ్యాచ్‌లో వరంగల్, ఖమ్మం జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో వరంగల్ 259 పరుగులతో భారీ తేడాతో గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 336 పరుగులు చేసింది. వరంగల్ జట్టులో రఘు సెంచరీ చేయడం విశేషం. అనంతరం బ్యాటింగ్ చేసిన ఖమ్మం 77 పరుగులకు అలౌట్ అయింది. వరంగల్ జట్టు ఇంతకు ముందే సెమీ ఫైనల్లో అడుగిడిన విషయం విదితమే. మెదక్, వరంగల్ జట్లు ఈ నెల 10 మహబూబ్‌నగర్ జిల్లాలో జరిగే సెమీ ఫైనల్స్‌లో తలపడనున్నాయి. -
అమరుల త్యాగాలను మరవొద్దు: ఈటల
కరీంనగర్ : దేశం కోసం, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమర వీరులను ఎన్నటికీ మరువరాదని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. శనివారం కరీంనగర్ జిల్లా పెద్దపల్లిలో అమరవీరుల స్మారక జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ... గాంధీజీ చూపిన మార్గంలో శాంతియుతంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని చెప్పారు. ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి, కరీంనగర్ మేయర్ రవీందర్‌సింగ్, జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు శంకర్‌రెడ్డి, పెద్దపల్లి నగర ఛైర్మన్ రాజయ్య తదితరులు పాల్గొన్నారు. -
కృష్ణ అజేయ సెంచరీ
సాక్షి, హైదరాబాద్: అంతర్ జిల్లా అండర్-14 క్రికెట్ టోర్నీలో వరంగల్ 170 పరుగుల తేడాతో నల్లగొండపై నెగ్గింది. శనివారం జరి గిన ఈ మ్యాచ్‌లో కృష్ణ (138 నాటౌట్, 18 ఫోర్లు, 3 సిక్సర్లు) అజేయ శతకం సాధించాడు. దీంతో ముందుగా బ్యాటింగ్ చేసిన వరంగల్ జట్టు నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 347 పరుగులు చేసింది. తేజ (77 నాటౌట్) రాణించాడు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన నల్లగొండ జట్టు 177 పరుగులు చేసి ఆలౌటైంది. ఇతర మ్యాచ్‌ల స్కోర్లు ఆదిలాబాద్: 214/9 (ప్రణీత్‌సింగ్ 46, హిమతేజ 45; సిద్ధు 3/27, మునీశ్ 3/35), నిజామాబాద్: 200 (రిషబ్ అగర్వాల్ 54, హర్షవర్ధన్ 52; సుచిత్ కుమార్ 4/18) కరీంనగర్: 226, ఖమ్మం: 104 ఎ-ఇన్స్టిట్యూషన్ వన్డే మ్యాచ్ స్కోర్లు ఈసీఐఎల్: 177 (రోహిత్ 41, సురేశ్ 39; హనుమంతు 4/18), ఎఫ్ఎంసీ: 175 (రజనీకాంత్ 50, శేఖర్ 5/42). -
హైదరాబాద్ సంచలన విజయం
ఆశిష్ సెంచరీ, రాణించిన హసన్ బుచ్చిబాబు క్రికెట్ టోర్నీ చెన్నై: అఖిల భారత బుచ్చిబాబు ఇన్విటేషన్ క్రికెట్ టోర్నమెంట్లో హైదరాబాద్ వరుసగా రెండో విజయాన్ని సొంతం చేసుకుంది. జట్టు బ్యాట్స్‌మెన్ సమష్టిగా రాణించడంతో ముంబై నిర్ధేశించిన భారీ లక్ష్యాన్ని 9 ఓవర్ల ముందే ఛేదించింది. 403 పరుగుల విజయలక్ష్యంతో మంగళవారం రెండో రోజు బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ 91 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 404 పరుగులు చేసింది. ఆల్‌రౌండర్ ఆశిష్ రెడ్డి (134 బంతుల్లో 105 నాటౌట్; 11 ఫోర్లు, 4 సిక్సర్లు) సెంచరీతో చెలరేగాడు. లోయర్ ఆర్డర్లో స్పిన్నర్ మెహదీ హసన్ (92 బంతుల్లో 74 నాటౌట్; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) అనూహ్య బ్యాటింగ్ ప్రదర్శనతో ఆశిష్‌కు అండగా నిలిచాడు. ఒక దశలో 241/7 స్కోరుతో జట్టు ఓటమి దిశగా పయనించింది. అయితే ఆశిష్, హసన్ ఎనిమిదో వికెట్‌కు 29.2 ఓవర్లలో అభేద్యంగా 163 పరుగులు జోడించి హైదరాబాద్ విజయాన్ని ఖాయం చేశారు. తన్మయ్ అగర్వాల్ (66 బంతుల్లో 62; 13 ఫోర్లు) వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఆకట్టుకోగా... కెప్టెన్ అక్షత్ రెడ్డి (55 బంతుల్లో 41; 7 ఫోర్లు), ఆకాశ్ భండారి (68 బంతుల్లో 36; 6 ఫోర్లు), కొల్లా సుమంత్ (57 బంతుల్లో 32; 3 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించారు. సందీప్ రాజన్ (22), హబీబ్ అహ్మద్ (10), వంశీవర్ధన్ రెడ్డి (0) విఫలమయ్యారు. ముంబై బౌలర్లలో హెచ్ఎస్ బద్ధన్ 5 వికెట్లు పడగొట్టాడు. గురువారం మొదలయ్యే తమ తదుపరి మ్యాచ్‌లో హైదరాబాద్, గుజరాత్‌తో తలపడుతుంది. -
23నుంచి విశాఖలో దేవ్‌ధర్ ట్రోఫీ
విశాఖపట్నం,న్యూస్‌లైన్: దేవ్‌ధర్ ట్రోఫీ క్రికెట్ టోర్నీకి విశాఖ వేదిక కాబోతోంది. విశాఖలోని వైఎస్సార్ స్టేడియంలో ఈనెల 23 నుంచి ఈ పరిమిత ఓవర్ల అంతర జోనల్ నాకౌట్ టోర్నీ ప్రారంభం కానుంది. ట్రోఫీలో పాల్గొనేందుకు గురువారం ఈస్ట్‌జోన్ జట్టు విశాఖ చేరుకోగా మిగిలిన జట్లు రానున్న రెండు రోజుల్లో రాబోతున్నాయి. ఫ్లడ్‌లైట్ల వెలుతురులో డే నైట్‌గా సాగే ఈ టోర్నీలో దేశంలోని ఐదు జోన్ల జట్లు తలపడనున్నాయి. 21న సెంట్రల్‌జోన్, సౌత్‌జోన్ జట్లు, 22న నార్త్‌జోన్ జట్టు, 23న వెస్ట్‌జోన్ జట్టు విశాఖ చేరుకోనున్నాయి. 23న జరిగే తొలి మ్యాచ్‌లో సెంట్రల్ జోన్ జట్టుతో ఈస్ట్ జోన్ జట్టు తలపడనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టు 25వ తేదీన వెస్ట్‌జోన్‌తో తలపడనుంది. 24న సౌత్‌జోన్‌తో నార్త్‌జోన్ తలపడనుంది. 26న విశ్రాంతి దినంగా ప్రకటించగా ఫైనల్ పోరు 27న జరగనుంది. మ్యాచ్‌లు మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభం కానున్నాయి. 22న ఉదయం తొమ్మిది గంటలకు ఈస్ట్‌జోన్, సెంట్రల్ జోన్ జట్లు వైఎస్ఆర్ స్టేడియం బి గ్రౌండ్లో ప్రాక్టీస్ చేయనుండగా మధ్యాహ్నం రెండు గంటలనుంచి నార్జోన్, సౌత్‌జోన్ జట్లు ప్రాక్టీస్ చేయనున్నాయి. హర్భజన్, పుజారా సారథులు దేవ్‌ధర్ ట్రోఫీలో తలపడే నార్త్‌జోన్ జట్టుకు హర్బజన్ నాయకత్వం వహించనుండగా టెస్ట్ క్రికెట్లో రాణించిన చటేశ్వర్ పుజారా వెస్ట్‌జోన్‌కు సారథిగా వ్యవహరించనున్నాడు. సెంట్రల్ జోన్లో శలభ్ శ్రీవాస్తవ, ఉమేష్, ఉర్వేష్ జట్టులో స్థానం సాధించారు. ఈస్ట్‌జోన్‌కు వర్ధమాన్ సాహా కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. జట్టులో అబూ నెచిమ్, ప్రీతమ్ దాస్, బసంత్, ఇషాంక్ జగ్గీ, మహ్మద్ షమీ, షాబాజ్ నదీమ్ ఆడనున్నారు.