జీజేఆర్‌ క్రికెట్‌ టోర్నీ విజేత ‘హైకోర్టు’ జట్టు | The winner of the GJR cricket tournament is the High Court team | Sakshi
Sakshi News home page

జీజేఆర్‌ క్రికెట్‌ టోర్నీ విజేత ‘హైకోర్టు’ జట్టు

Mar 10 2024 2:06 AM | Updated on Mar 10 2024 2:06 AM

The winner of the GJR cricket tournament is the High Court team - Sakshi

సాక్షి,హైదరాబాద్‌: హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ క్రిమినల్‌ కోర్టు న్యాయవాదుల క్రికెట్‌ అసోసియే షన్‌ ఆధ్వర్యంలో జరిగిన జీజేఆర్‌ టోర్నమెంట్‌ పోటీల్లో హైకోర్టు న్యాయవాదుల జట్టు విజేతగా నిలిచింది. ఫైనల్‌ విజేతగా నిలిచిన జట్టుకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సూరేపల్లి నందా శనివారం కప్‌ను అందజేశారు.

బోడుప్పల్‌లోని సాగర్‌ క్రికెట్‌ గ్రౌండ్, ఆరంఘర్‌లోని విజయానంద్‌ క్రికెట్‌ గ్రౌండ్‌లో జరిగిన పోటీల్లో నగరంలోని 13 కోర్టుల న్యాయవాదులు పాల్గొన్నారు. సెమీ ఫైనల్‌లో సిటీ సివిల్‌ కోర్టు న్యాయవాదుల జట్టు (78)పై హైకోర్టు టీమ్‌(79) విజయం సాధించింది.

అనంతరం జరిగిన ఫైనల్‌లో హైకోర్టు జట్టు... హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ క్రిమినల్‌ కోర్టు టీమ్‌పై గెలుపొందింది. మ్యాన్‌ ఆఫ్‌ది ఫైనల్‌లో బెస్ట్‌ బ్యాట్స్‌మన్‌గా వి.మనోహర్, బెస్ట్‌ బౌలర్‌గా సాయిచందర్‌ నిలిచారు. ఈ కప్‌ అందజేత కార్య క్రమంలో బార్‌ కౌన్సిల్‌ వైస్‌ చైర్మన్‌ కె.సునీల్‌గౌడ్, కౌన్సిల్‌ సభ్యుడు జితేందర్‌రెడ్డి, కటకం శారద, శ్రీనివాస్, సత్యనారాయణ పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement