city civil court
-
HYD: పవన్‌కల్యాణ్‌పై సిటీ సివిల్ కోర్టులో పిటిషన్
సాక్షి,హైదరాబాద్: తిరుపతి లడ్డూపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనుచిత వాఖ్యలు చేశారని హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలైంది. న్యాయవాది ఇమ్మనేని రామారావు సోమవారం(అక్టోబర్ 14)ఈ పిటిషన్ వేశారు. ‘హిందువుల మనోభావాలు దెబ్బతినేలా పవన్ కళ్యాణ్ వాఖ్యలు ఉన్నాయి. శాస్త్రీయమైన ఆధారాలు ఏవీ లేకుండా తిరుపతి లడ్డూలో జంతుమాంసంతో చేసిన నెయ్యి కలిసిందని పవన్ వ్యాఖ్యానించారు. డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ తన హోదా మరచి వివాదస్పద వాఖ్యలు చేశారు. పవన్ వ్యాఖ్యలను సుప్రీంకోర్టు సైతం తప్పుపట్టింది. ఇంటర్నెట్లో పవన్ మాట్లాడిన వీడియోలు డిలీట్ చేయాలి. తిరుపతి లడ్డూ వివాదంలో సమగ్ర దర్యాప్తునకు సుప్రీంకోర్టు ఇప్పటికే స్వతంత్ర సిట్ ఏర్పాటు చేసింది. మరోసారి తిరుపతి ప్రసాదంపై పవన్ కళ్యాణ్ ఇలాంటి వాఖ్యలు చేయకుండా గ్యాగ్ ఆర్డర్ ఇవ్వాలి’అని పిటిషనర్ తన పిటిషన్లో కోర్టును కోరారు.ఈ పిటిషన్‌ను సిటీ సివిల్ కోర్టు మంగళవారం విచారించనుంది.ఇదీ చదవండి: జనం లేని పవన్ పల్లె పండుగ సభ -
జీజేఆర్ క్రికెట్ టోర్నీ విజేత ‘హైకోర్టు’ జట్టు
సాక్షి,హైదరాబాద్: హైదరాబాద్ మెట్రోపాలిటన్ క్రిమినల్ కోర్టు న్యాయవాదుల క్రికెట్ అసోసియే షన్ ఆధ్వర్యంలో జరిగిన జీజేఆర్ టోర్నమెంట్ పోటీల్లో హైకోర్టు న్యాయవాదుల జట్టు విజేతగా నిలిచింది. ఫైనల్ విజేతగా నిలిచిన జట్టుకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూరేపల్లి నందా శనివారం కప్‌ను అందజేశారు. బోడుప్పల్‌లోని సాగర్ క్రికెట్ గ్రౌండ్, ఆరంఘర్లోని విజయానంద్ క్రికెట్ గ్రౌండ్లో జరిగిన పోటీల్లో నగరంలోని 13 కోర్టుల న్యాయవాదులు పాల్గొన్నారు. సెమీ ఫైనల్లో సిటీ సివిల్ కోర్టు న్యాయవాదుల జట్టు (78)పై హైకోర్టు టీమ్(79) విజయం సాధించింది. అనంతరం జరిగిన ఫైనల్లో హైకోర్టు జట్టు... హైదరాబాద్ మెట్రోపాలిటన్ క్రిమినల్ కోర్టు టీమ్‌పై గెలుపొందింది. మ్యాన్ ఆఫ్‌ది ఫైనల్లో బెస్ట్ బ్యాట్స్‌మన్‌గా వి.మనోహర్, బెస్ట్ బౌలర్‌గా సాయిచందర్ నిలిచారు. ఈ కప్ అందజేత కార్య క్రమంలో బార్ కౌన్సిల్ వైస్ చైర్మన్ కె.సునీల్‌గౌడ్, కౌన్సిల్ సభ్యుడు జితేందర్‌రెడ్డి, కటకం శారద, శ్రీనివాస్, సత్యనారాయణ పాల్గొన్నారు. -
Lucknow: జడ్జి ఎదుటే గ్యాంగ్‌స్టర్‌పై కాల్పులు
క్రైమ్: ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో న్యాయస్థానంలోనే గ్యాంగ్ వార్ కలకలం రేగింది. బుధవారం సిటీ సివిల్ కోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో.. లాయర్ దుస్తుల్లో వచ్చిన కొందరు దుండగులు ఓ గ్యాంగ్‌స్టర్‌పై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో సంజీవ్ జీవా అనే గ్యాంగ్‌స్టర్ మరణించగా.. పలువురు పోలీసులకు గాయలైనట్లు సమాచారం. కాల్పులు జరిపింది ముక్తార్ అన్సారి అనుచరులుగా భావిస్తున్నారు పోలీసులు. మొత్తం ఐదు రౌండ్ల కాల్పులు జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఘటనా స్థలంలోనే నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన పోలీస్ సిబ్బందిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దీనికి సంబంధించిన అదనపు సమాచాంర అందాల్సి ఉంది. Disclaimer: ఇందులోని ఫొటోలు, దృశ్యాలు మిమ్మల్ని కలవరపాటుకు గురిచేయొచ్చు #WATCH | Uttar Pradesh: Gangster Sanjeev Jeeva shot outside the Lucknow Civil Court. Further details awaited (Note: Abusive language) pic.twitter.com/rIWyxtLuC4 — ANI UP/Uttarakhand (@ANINewsUP) June 7, 2023 Gangster Sanjeev Jeeva shot dead by unknown assailants outside a Lucknow court. More details are awaited. pic.twitter.com/8xvaTNoQjw — Press Trust of India (@PTI_News) June 7, 2023 -
సమంత ‘యశోద’కు భారీ షాక్.. ఓటీటీ విడుదల ఆపాలంటూ కోర్టు ఆదేశం!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నటించిన లెటెస్ట్ మూవీ ‘యశోద’. శ్రీదేవి మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి హరి, హరీష్ దర్శకత్వం వహించారు. భారీ అంచనాల మధ్య నవంబర్ 11 థియేటర్స్‌లో విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్‌తో డీసెంట్ హిట్‌గా నిలిచింది. ఈ మూవీని థియేటర్స్‌లో మిస్ అయినవాళ్లు ఓటీటీలో చూసేందుకు ఎదురు చూస్తున్నారు. డిసెంబర్ రెండో వారంలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ చిత్రం స్ట్రీమింగ్ కాబోతున్నట్లు వార్తలు వినిపించాయి. కానీ ఈ లోపే యశోద మేకర్స్‌కి ఊహించని దెబ్బ తగిలింది. ఈ సినిమా ఓటీటీ విడుదలను నిలిపివేయాలంటూ సిటీ సివిల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. డిసెంబర్ 19 వరకు ఓటీటీలో స్ట్రీమింగ్ చేయడానికి వీల్లేదని సిటీ సివిల్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కారణామేంటి? యశోద సినిమాలో సరోగసీ ఫెర్టిలిటీ సెంటర్‌కు ‘ఈవా’అని పేరు పెట్టారు. అందులో అన్ని అక్రమాలు జరిగినట్లు చూపించారు. అయితే సినిమాలో తమ ఆస్పత్రి పేరు చూపించడం వల్ల తమ ప్రతిష్ట దెబ్బతిన్నదంటూ ‘ఈవా హాస్పిటల్’ యాజమాన్యం సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ వేసింది. ఈ సినిమా ఓటీటీ విడుదలను అడ్డుకోవాలని కోరింది. దీంతో సిటీ కోర్టు యశోద నిర్మాణ సంస్థకు నోటీసులు జారీ చేసి.. డిసెంబర్ 19 వరకు ఓటీటీలో చిత్ర ప్రదర్శన చేయకూడదని ఆదేశించింది. తదుపరి విచారణను డిసెంబర్ 19కి వాయిదా వేసింది. -
ఎమ్మెల్సీ కవిత కేసులో సిటీ సివిల్ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు
-
Dellhi Liquor Scam: సిటీ సివిల్ కోర్టులో ఎమ్మెల్సీ కవితకు ఊరట..
సాక్షి, హైదరాబాద్: సిటీ సివిల్ కోర్టులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఊరట లభించింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో సిటీ సివిల్ కోర్టు బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కవితపై ఆరోపణలు చేసిన ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. బీజేపీ ఎంపీ పర్వేశ్ వర్మ, మాజీ ఎమ్మెల్యే ముజంధర్ సిర్సాలకు నోటీసులు జారీ అయ్యాయి. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత పేరు వాడొద్దంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కవితపై మీడియా, సోషల్ మీడియా ముందు ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదని ఆదేశించింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 13కు వాయిదా వేసింది. చదవండి: రాజాసింగ్ లాయర్‌కు బెదిరింపులు.. చంపేస్తామంటూ.. -
భూవివాదం కేసు.. కోర్టుకు హీరో రానా గైర్హాజరు
భూవివాదం కేసులో మంగళవారం హైదరాబాద్‌లోని సిటీ సివిల్ కోర్టుకు హాజరుకావాల్సిన హీరో రానా.. అనివార్య కారణాల వల్ల వెళ్లలేకపోయాడు. నేడు కోర్టుకు హాజరు కాలేనని కోర్టులో పిటిషన్ వేశాడు. విచారణ చేపట్టిన కోర్టు.. ఆగస్ట్ 10న కచ్చితంగా హాజరకావాలని ఆదేశించింది. లేని పక్షం లో అడ్వకేట్ కమిషన్ రానా దగ్గరికి వస్తుందని హెచ్చరించింది. తదుపరి విచారణను ఆగస్ట్ 10కి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఫిలింనగర్ లో అలనాటి నటి మాధవి లతకు చెందిన 2200 చదరపు గజాల స్ధలాన్ని హీరో దగ్గుబాటి వెంకటేష్ అతని సోదరుడు నిర్మాత దగ్గుబాటి సురేష్ అక్రమంగా కొనుగోలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ భూమిని నగరానిక చెందిన ఓ వ్యాపారవేత్త 2014లో అగ్రిమెంట్ పద్ధతిలో లీజుకు తీసుకున్నాడు. లీజు అగ్రిమెంట్ 2016, 2018లో కూడా రెన్యువల్ చేశారు. చదవండి: విషాదం.. గుండెపోటుతో ప్రముఖ నటుడు కన్నుమూత అగ్రిమెంట్ గడువు పూర్తి కాకముందే సురేశ్ బాబులో భూమిలోని 1000 గజాలను రానా పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారు. రిజిష్ట్రేషన్ అయిన అనంతరం రానా అందులోని లీజు దారుడిని స్ధలం ఖాళీ చేయాలని ఒత్తిడి చేయడంతో అతడు కోర్టు ఆశ్రయించాడు. ఇంకా లీజు అగ్రిమెంట్ గడుపు పూర్తి కాకుండానే స్ధలం ఖాళీ చేయమడంతో సదరు వ్యాపారవేత్త సిటీ సివిల్ కోర్టులో పిటీషన్ దాఖలు చేశాడు. దీంతో న్యాయస్దానం రానాకు నోటీసులు జారీ చేశారు. దీనిపై నేడు విచారణ ఉండగా రానా కోర్టుకు గైర్హాజరు అయ్యారు. -
రామ్ గోపాల్ వర్మకు షాక్.. 'లడ్కీ' సినిమాపై కోర్టు స్టే..
Civil Court Stay On Ram Gopal Varma Ladki Movie: ప్రముఖ దర్శక, నిర్మాత రామ్‌గోపాల్ వర్మ రూపొందించిన "లడ్కీ (అమ్మాయి)" సినిమాపై కోర్టు స్టే విధించింది. పూజా భలేకర్ ప్రధాన పాత్రలో వర్మ నిర్మించిన ఈ సినిమా విడుదలను నిలిపివేయాలంటూ నిర్మాత కె. శేఖర్ రాజు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో "సాఫ్ట్ వేర్ సుధీర్" సినిమాను నిర్మించిన తాను రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమాను నిర్మించాలని సంకల్పించానని, ఆ మేరకు ఆయనను కలిశానని శేఖర్ రాజు వెల్లడించారు. అయితే తన దగ్గర సినిమా కోసం పలు దఫాలుగా లక్షలాది రూపాయలు తీసుకున్న వర్మ ఎప్పటికప్పుడు దాటవేస్తూ, తప్పించుకుంటూ వస్తున్నారని, శేఖర్ రాజు వివరించారు. తన డబ్బులు తిరిగి ఇవ్వకపోగా, సరిగ్గా సమాధానం కూడా చెప్పడం లేదని, దాంతో తన దగ్గర ఉన్న డాక్యుమెంట్స్‌తో కోర్టును ఆశ్రయించానని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ నెల 14న సిటీ సివిల్ కోర్టు ''లడ్కీ" సినిమాను అన్ని భాషల్లో ప్రదర్శనను నిలుపివేస్తూ, ఆర్డర్స్ జారీ చేసిందని ఆయన పేర్కొన్నారు. అలాగే అన్నిరకాల డిజిటల్, ప్లాట్ ఫామ్స్‌లో సినిమాను అమ్మడానికి కానీ, బదిలీ చేయడానికి కానీ, ప్రదర్శించడానికి వీలులేకుండా తాత్కాలిక నిషేధం విధిస్తూ కోర్టు ఉత్తర్వులు ఇచ్చిందని ఆయన తెలిపారు. కాగా లడ్కీ చిత్రం జులై 15న విడదలై పాజిట్వ్ టాక్‌తో సందడి చేస్తోంది. చదవండి: 👇 పిల్లలు వద్దనుకోవడంపై ఉపాసన క్లారిటీ.. అప్పటి నుంచి సినిమా షూటింగ్‌లు బంద్..! బ్యాడ్ న్యూస్ చెప్పిన నటి వరలక్ష్మి శరత్ కుమార్.. స్టార్ హీరోయిన్ సోదరుడితో ఇలియానా డేటింగ్ !.. ఫొటోలు వైరల్ మళ్లీ పొట్టి దుస్తుల్లో రష్మిక పాట్లు.. వీడియో వైరల్ -
సిటీ సివిల్ కోర్టుకు సినీ నటుడు రానా
సాక్షి, హైదరాబాద్(బంజారాహిల్స్): కోర్టు ధిక్కరణ కేసులో సినీ నటుడు రానా దగ్గుబాటి మంగళవారం సివిల్ కోర్టుకు హాజరయ్యారు. వివరాల్లోకి వెళ్తే... ఫిలింనగర్ కో–ఆపరేటివ్ సొసైటీలో ప్లాట్ నెం. 2 సినీ నటి మాధవి (మాతృదేవోభవ హీరోయిన్)కు సొసైటీ కేటాయించింది. అయితే ఆమె 2200 గజాల ప్లాట్‌ను సినీ నిర్మాత సురేష్ దగ్గుబాటి, వెంకటేశ్‌కు విక్రయించి వెళ్లిపోయింది. సదరు స్థలంలో వెయ్యి గజాలు నిర్మాత సురేష్ దగ్గుబాటి పేరు మీద, 1200 గజాలు హీరో వెంకటేష్ పేరున ఉన్నాయి. 2014లో ఈ స్థలంలోని రెండు ప్లాట్లను ఎమ్మెల్యే కాలనీకి చెందిన నందకుమార్ అనే వ్యాపారికి లీజు అగ్రిమెంట్ చేశారు. నెలకు రూ. 2 లక్షలు చెల్లించే విధంగా ఈ రెండు ప్లాట్లను లీజు అగ్రిమెంట్‌చేయగా 2014లో ఒకసారి, 2016లో మరోసారి లీజు రెన్యూవల్ జరిగింది. 2017లో ఈ ప్లాట్‌ను విక్రయించేందుకు సిద్ధమై లీజు అగ్రిమెంట్లో ఉన్న నందకుమార్‌ను సంప్రదించారు. గజం రూ.1.80 లక్షలు చొప్పున నందకుమార్ ఈ ప్లాట్ మొత్తానికి రూ. 6 కోట్లు చెల్లించి అగ్రిమెంట్ ఆఫ్‌సేల్ చేసుకున్నాడు. అయితే ఈ ప్లాట్‌కు డిమాండ్ ఎక్కువగా ఉండటంతో వేరే వ్యాపారి వచ్చి ఎక్కువ డబ్బులు ఇస్తానని చెప్పడంతో నందకుమార్ అగ్రిమెంట్‌ను పక్కన పెట్టి మరో వ్యక్తికి సేల్ ఆఫ్ అగ్రిమెంట్ చేశారు. 2017లో ఈ ఒప్పందం ఉల్లంఘించగా నందకుమార్ కోర్టును ఆశ్రయించాడు. ఒకరికి తెలియకుండా మరొకరికి దగ్గుపాటి సురేష్ ఈ సేల్ అగ్రిమెంట్‌చేసినట్లుగా కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఇదిలా ఉండగానే దగ్గుపాటి సురేష్ ఈ ప్లాట్లోని వెయ్యి గజాలను తన కుమారుడు రానా దగ్గుబాటి పేరున రిజిస్ట్రేషన్ చేశాడు. ఈ మొత్తం వ్యవహారంలో నిబంధనలు ఉల్లంఘించినట్లు బాధితులు కోర్టును ఆశ్రయించడంతో రానా దగ్గుబాటికి కోర్టు ధిక్కరణ కింద నోటీసులు జారీ చేయగా మంగళవారం ఆయన కోర్టుకు హాజరయ్యారు. ఇంకోవైపు ఏ సొసైటీలోనైనా ఒక వ్యక్తికి ఒకే ప్లాట్ ఉండాలని బైలాస్ నిర్ధేశిస్తున్నాయి. ఫిలింనగర్ కో–ఆపరేటివ్ సొసైటీలో నిర్మాత సురేష్ దగ్గుబాటికి ఇప్పటికే ఓ ప్లాట్ ఉండటంతో ప్రస్తుతం వివాదంలో ఉన్న ప్లాట్ నెంబర్ 2లో కూడా ఆయనకు మరో ప్లాట్ ఉంది. దీంతో బైలాస్కు విరుద్ధంగా ఉంటుందన్న ఉద్దేశంతో అడ్డదారుల్లో తన కుమారుడు రానా పేరు మీద వెయ్యి గజాల ప్లాట్‌ను రిజిస్ట్రేషన్ చేశాడని బాధితుడు నందకుమార్ ఆరోపించారు. -
కేటీఆర్‌పై నిరాధార వ్యాఖ్యలు చేయొద్దు
సాక్షి, హైదరాబాద్: మంత్రి కేటీ రామారావుపై నిరాధార వ్యాఖ్యలు చేయొద్దని సిటీ సివిల్ కోర్టు బండి సంజయ్ సహా పలువురికి స్పష్టం చేసింది. ఈ మేరకు కేటీఆర్ వేసిన దావాలో మధ్యంతర ఉత్వర్వులు ఇచ్చింది. సామాజిక మాధ్యమం ట్విట్టర్లో మే 11న తనపై నిరా ధార ఆరోపణలు చేశారంటూ బండి సంజ య్‌పై మంత్రి కేటీఆర్ పరువు నష్టం దావా వేశారు. దీనిపై విచారణ జరిపిన సిటి సివిల్ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ ఉత్వర్వులు ఇచ్చింది. -
'శేఖర్' సినిమా వివాదం.. జీవితా రాజశేఖర్ గెలుపు?
యాంగ్రీ స్టార్ రాజశేఖర్ హీరోగా నటించిన తాజా చిత్రం శేఖర్. ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఫైనాన్షియర్ పరంధామరెడ్డి వేసిన కేసు కారణంగా ప్రదర్శన నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ‘శేఖర్’ చిత్రాన్ని నిలిపివేయాలని కోరుతూ ఆయన సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించాడు. అయితే తాజాగా ఈ మూవీ నిలిపివేతపై కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని తెలుస్తోంది. ఈ కేసులో జీవితా రాజశేఖర్, శేఖర్ చిత్ర బృందానికి అనుకూలంగా కోర్టులో న్యాయమూర్తి మాట్లాడినట్లు సమాచారం. తాజాగా జరిగిన ఈ కేసు విచారణలో శేఖర్ మూవీ ప్రదర్శనను నిలిపివేయాలని తామెప్పుడూ చెప్పలేదని న్యాయస్థానం వ్యాఖ్యానించినట్లు తెలిసింది. చదవండి: ప్రేమపై నోరు విప్పిన సాయి పల్లవి, ఏమన్నదంటే.. కొంతమంది ఉద్దేశపూర్వకంగా సినిమా ప్రదర్శనకు ఆటంకం కలిగించినట్లు సమాచారం. అయితే, కోర్టు సినిమా ప్రదర్శనకు ఎటువంటి అభ్యంతరం తెలుపలేదని తాజాగా జీవిత రాజశేఖర్, నిర్మాత తరపు న్యాయవాదులు తెలిపారు. శేఖర్ సినిమాను నిరభ్యంతరంగా ప్రదర్శించవచ్చని కోర్టు చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు. ఇక ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను జీవితా రాజశేఖర్, నిర్మాత బీరం సుధాకర్ రెడ్డి తరపు న్యాయవాదులు మంగళవారం(మే 24న) విలేకరుల సమావేశంలో వెల్లడించనున్నారు. అయితే తాజాగా దీనిపై రాజశేఖర్ కూడా ట్వీట్ చేశాడు. ఆసత్య ప్రచారం వల్ల తమ సినిమాను నిలిపివేశారని, శేఖర్ మూవీపై కోర్టు స్టే ఇచ్చిందంటూ వచ్చిన వార్తల్లో నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. కాగా ఈ సినిమాకు ఆయన సతీమణి జీవిత రాజశేఖర్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. చదవండి: ఎలాగో ఈ సైడ్ ఎఫెక్ట్స్ నుంచి తప్పించుకోలేను.. నటి #Shekar Thanking our audience for constantly standing by us! pic.twitter.com/9nTE5ulig9 — Dr.Rajasekhar (@ActorRajasekhar) May 23, 2022 -
‘శేఖర్’ మూవీ ప్రదర్శన నిలిపివేత.. రాజశేఖర్ ఎమోషనల్ ట్వీట్
యాంగ్రీ స్టార్ రాజశేఖర్ హీరోగా నటించిన తాజా చిత్రం శేఖర్. ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రదర్శన ఆగిపోయింది. ‘శేఖర్’ చిత్రం ప్రదర్శనను నిలిపివేయాలని సిటీ సివిల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. హీరో రాజశేఖర్ తనకు డబ్బులు ఇవ్వాలంటూ ఫైనాన్షియర్ పరంధామరెడ్డి సిటీ కోర్టును ఆశ్రయించాడు. కోర్డు ఆదేశించిన డబ్బు చెల్లించకపోవడంతో ప్రదర్శనను నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. కాగా, శేఖర్ సినిమా ప్రదర్శన నిలిపివేతపై ట్విటర్ వేదికగా రాజశేఖర్ స్పందించారు. (చదవండి: మా కష్టానికి తగిన ఫలితం దక్కింది : 'శేఖర్' నిర్మాత) ‘శేఖర్ చిత్రాన్ని నేను, నా కుటుంబం మా సర్వస్వంగా భావించాం. ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు చాలా కష్టపడ్డాం. శేఖర్ చిత్రానికి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. కానీ, ఇంతలోనే కొందరు కావాలనే మా చిత్రాన్ని అడ్డుకుంటున్నారు. సినిమా అనేది మా ప్రాణం. ‘శేఖర్’ మాకు చాలా ప్రత్యేకం. ఇక నేను చెప్పాల్సిందేమీ లేదు.... ఎవరెన్ని చేసినా ఈ చిత్రం ప్రదర్శితమై, ప్రశంసలు పొందుతుందని, ఆ అర్హత ఈ సినిమాకు ఉందని నేను భావిస్తున్నాను’ అంటూ రాజశేఖర్ ట్వీట్ చేశాడు. #Shekar pic.twitter.com/JipmYOnh57 — Dr.Rajasekhar (@ActorRajasekhar) May 22, 2022 -
కేటీఆర్‌పై ఆ విమర్శలు చేయొద్దు.. రేవంత్‌కు సిటీ సివిల్ కోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కె.తారక రామారావుకు సిటీ సివిల్ కోర్టులో ఊరట లభించింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు చేస్తున్న డ్రగ్స్ కేసుతో ముడిపెట్టి, కేటీఆర్‌కు వ్యతిరేకంగా ఎటువంటి వ్యాఖ్యలు, విమర్శలు చేయరాదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని కోర్టు ఆదేశించింది. పత్రికలు, టీవీ, సామాజిక మాధ్యమాల్లో సైతం ప్రస్తావించడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు మూడో అదనపు చీఫ్ జడ్జి కళ్యాణ చక్రవర్తి మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు (యాడ్ ఇంటరిమ్ ఇంజక్షన్) జారీ చేశారు. డ్రగ్స్ కేసుతో ముడిపెట్టి తనకు వ్యతిరేకంగా ఎటువంటి వ్యాఖ్యలు చేయకుండా రేవంత్‌ను ఆదేశించాలని కోరుతూ కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం దావాను న్యాయమూర్తి విచారించారు. అడ్డగోలుగా ఆరోపణలు..: మంత్రి హోదాలో ఉన్న కేటీఆర్‌పై రేవంత్‌రెడ్డి ఎటువంటి ఆధారాలు లేకుండా అడ్డగోలుగా ఆరోపణలు చేస్తున్నారని ఆయన తరఫు సీనియర్ న్యాయవాది ఎస్.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. డ్రగ్స్ కేసుతో ఎటువంటి సంబంధం లేకపోయినా నిరాధారమైన ఆరోపణలతో ట్విట్టర్, ఫేస్బుక్, యూట్యూబ్‌తో పాటు ఇతర సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున తప్పుడు కథనాలను ప్రచారం చేస్తున్నారని కోర్టు దృష్టికి తెచ్చారు. దీనివల్ల కేటీఆర్ పరువు, ప్రతిష్టలకు తీవ్రస్థాయిలో భంగం కలుగుతోందని తెలిపారు. మంత్రిగా ఉత్తమ పనితీరుతో రాష్ట్రంలో, దేశ, విదేశాల్లోనూ కేటీఆర్ పేరు సంపాదించుకున్నారని, అనేక అవార్డులు పొందారని వివరించారు. దీంతె స్పందించిన న్యాయమూర్తి... పై ఆదేశాలు జారీ చేశారు. ప్రతివాది రేవంత్‌రెడ్డికి నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను అక్టోబర్ 20వ తేదీకి వాయిదా వేశారు. -
కేటీఆర్‌పై ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దు: రేవంత్‌కు కోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: డ్రగ్స్ వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా దుమారం రేపుతోంది. తెలంగాణలో డ్రగ్స్‌పై అధికార, ప్రతిపక్షాల సవాళ్ల పర్వం కొనసాగుతోంది. అయితే తనపై నిరాధార ఆరోపణలు చేస్తూ పరువు నష్టం కలిగించారని మంత్రి కల్వకుంట్ల తారక రామారావు న్యాయ పోరాటానికి దిగారు. ఈ సందర్భంగా నిన్న సోమవారం పరువునష్టం దావా వేయగా వివరాలు సక్రమంగా లేవని చెప్పడంతో మంగళవారం మరోసారి మంత్రి కేటీఆర్ దావా వేశారు. చదవండి: యువతకు గుడ్‌న్యూస్.. నిరుద్యోగ భృతి, 80 శాతం ఉద్యోగాలు మీకే.. సిటీ సివిల్ కోర్టులో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై మంత్రి కేటీఆర్ పరువు నష్ట దావా పిటిషన్ వేయగా ధర్మాసనం విచారణకు స్వీకరించింది. సిటీ సివిల్ కోర్ట్ మూడో అదనపు సీనియర్ న్యాయమూర్తి ఆ పిటిషన్‌పై విచారణ చేసి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. కౌంటర్ దాఖలు చేయాలని రేవంత్‌రెడ్డికి న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. డ్రగ్స్ కేసు, ఈడీ కేసుల్లో కేటీఆర్‌పై ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని కోర్టు సూచించింది. అక్టోబర్ 20వ తేదీకి విచారణ వాయిదా వేసింది. చదవండి: ఒక్క మహిళా లేదు.. పురుషులతో నిండిన మంత్రివర్గం -
వీడియో సీడీలంటేనే వణికిపోతున్న మంత్రులు
సాక్షి, మైసూరు: కర్ణాటకలో వీడియో సీడీలంటేనే మంత్రులు వణికిపోతున్నారు. తమకు చెందిన సీడీలు ఏవైనా ఉంటే వాటిపై పత్రికలు, టీవీ చానెళ్లలో వార్తా ప్రసారాలు రాకుండా చూడాలని పలువురు అమాత్యులు బెంగళూరు సిటీ సివిల్ కోర్టులో పిటిషన్లను వేశారు. దీనికి కోర్టు కూడా అంగీకారం తెలుపుతూ తాత్కాలిక అనుమతి ఇచ్చింది. ఇటీవల జలవనరుల మంత్రి రమేశ్ జార్కిహొళి అశ్లీల వీడియో బయటకు రావడం, ఆయన పదవి పోవడం తెలిసిందే. సిటీ సివిల్ కోర్టు వెబ్సైట్లో పేర్కొన్న ప్రకారం శివరాం హెబ్బార్, బీసీ పాటిల్, హెచ్‌టీ సోమేశేఖర్, కె.సుధాకర్, నారాయణగౌడ, బైరతి బసవరాజు ఉన్నట్లు తెలిసింది. భగ్గుమంటున్న విపక్ష నేతలు మంత్రుల పిటిషన్లపై విపక్ష నేతలు భగ్గుమంటున్నారు. అలా పిటిషన్లను వేసిన ఆరుమంది మంత్రులను వెంటనే కేబినెట్ నుంచి తొలగించాలని జేడీఎస్ ఎమ్మెల్యే. సా.రా. మహేష్ డిమాండు చేశారు. శనివారం మైసూరులో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. తమకు సంబంధించిన వీడియోలు ఏవైనా ఉంటే వాటిని మీడియాలో ప్రసారం చేయకుండా ఆదేశాలను జారీ చేయాలని ఆరుమంది మంత్రులు కోర్టును ఆశ్రయించారని, వారిపై కఠిన చర్యల తీసుకోవాలని అన్నారు. మంత్రి పదవుల్లో ఉన్నవారు తమ వీడియోల గురించి డిమాండ్లు చేయడం అసెంబ్లీని అవమానపర్చడమేనని ధ్వజమెత్తారు. మీరు తప్పు చేయకుంటే కోర్టును ఎందుకు ఆశ్రయించారని మహేశ్ ప్రశ్నించారు. అంటే మీరు తప్పు చేశారు కాబట్టి ఆ వీడియోలు బయటకి వస్తే మీ బండారం మొత్తం బయట పడుతుంది, అలా జరగకుండా కోర్టుకెళ్లారు అని ఆరోపించారు. ముంబైకి వెళ్ళిన మంత్రులు అక్కడ చేసిన ఘనకార్యాలు ఏమిటో రాష్ట్ర ప్రజలకు తెలియాలని ఎద్దేవా చేశారు. పలువురు ప్రతిపక్ష నేతలు ఇదే తరహాలో ఆరోపణలు సంధించారు. చదవండి: (రాసలీలల వీడియో : ఆ యువతి ఎక్కడ?) వారు కోర్టుకెళ్లడం సరికాదు: సదానందగౌడ యశవంతపుర: తమ సీడీలను విడుదల చేయరాదని కొందరు కర్ణాటక మంత్రులు, ఎమ్మెల్యేలు అనవసరంగా కోర్టుకెళ్లడం సరికాదని కేంద్ర మంత్రి డీవీ సదానందగౌడ అన్నారు. ఆయన శనివారం బెంగళూరు కేసీ జనరల్ ఆస్పత్రిలో కరోనా వ్యాక్సిన్ వేయించుకొని విలేకర్లతో మాట్లాడారు. రాసలీలల సీడీపై పార్టీ జాతీయ అధ్యక్షునికి పార్టీ రాష్ట్ర ఇన్చార్జ్ సమాచారం పంపించారు. మీడియాలో వచ్చిన వార్తలనూ నాయకత్వానికి పంపారు. ఇలాంటి ఘటనల్లో నైతిక విలువలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. కేరళ సీఎంపై బంగారం స్మగ్లింగ్ వంటి బలమైన ఆరోపణలు వచ్చినందున ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. -
హైకోర్టులో 10 మందికి పాజిటివ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ హైకోర్టులో పని చేస్తున్న ఉద్యోగులకు, సెక్యూరిటీ సిబ్బందికి కరోనా పాజిటివ్ అని తేలడం కలకలం రేపుతోంది. మంగళవారం న్యాయస్థానంలో పని చేసే 50 మందికి సిబ్బందికి పరీక్షలు నిర్వహించారు. నేడు దీని ఫలితాలు వెలువడగా అందులో 10 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. దీంతో అప్రమత్తమైన అధికారులు హైకోర్టు భవనాన్ని మూసివేసి శానిటైజేషన్ చేస్తున్నారు. హైకోర్టులోని ఈ-ఫైలింగ్ విభాగాన్ని జ్యుడీషియల్ అకాడమీకి తరలించారు. (మెడికల్ పీజీ పరీక్షలకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్) మరోవైపు కరోనా ప్రబలుతున్న వేళ ముందు జాగ్రత్తలు చేపట్టిన హైకోర్టు వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా ముఖ్యమైన కేసుల విచారణ చేపడుతున్న విషయం తెలిసిందే. అయితే మరిన్ని కేసులు వెలుగుచూస్తున్న తరుణంలో ఇదే విధానాన్ని కొనసాగిస్తూ కేసుల విచారణ చేపట్టనున్నట్లు నిర్ణయం తీసుకుంది. (ఆ ఆస్పత్రులపై కొరడా! ) -
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భార్యాభర్తల వివాద కేసుల విచారణ
సాక్షి, హైదరాబాద్: వివాహమయ్యాక విదేశాలకు వెళ్లిన దంపతుల మధ్య తలెత్తే వివాదాలు సత్వరం పరిష్కారమయ్యే విధంగా హైకోర్టు తీర్పు వెలువరించింది. దంపతుల మధ్య తలెత్తే ఈ తరహా కేసులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించవచ్చని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామ చంద్రరావు ఇటీవల కీలక తీర్పు చెప్పారు. పీసీసింగ్–ప్రపుల్ బి.దేశాయ్ కేసులో సుప్రీంకోర్టు వీడియో కాన్ఫరెన్స్ విచారణకు చట్టబద్ధత కల్పించిందని హైకోర్టు గుర్తు చేసింది. ‘ఇప్పటి వరకూ క్రిమినల్ కేసుల్లో అరెస్ట్ అయిన నిందితుల్ని జైలు నుంచే కోర్టులు విచారిస్తున్నాయి. దంపతుల మధ్య తలెత్తే కుటుంబ కలహాల కేసులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించడానికి వీల్లేదనడానికి న్యాయపరమైన కారణాలు ఏమీ కనబడటం లేదు’అని స్పష్టం చేసింది. సిటీకోర్టు తిరస్కరణపై హైకోర్టులో సవాల్ ఖమ్మం జిల్లాకు చెందిన ఓ మహిళ తన వివాహాన్ని రద్దు చేసి విడాకులు ఇప్పించాలని హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో 2012లో కేసు వేసింది. అయితే, వివాహ బంధం కొనసాగేలా ఉత్తర్వులు ఇవ్వాలని ఆమె భర్త 2013లో పిటిషన్ వేశాడు. ఈ రెండు కేసుల్ని కలిసి సిటీ సివిల్ కోర్టు విచారిస్తోంది. ఆమె తన కుమారుడితో కలిపి అమెరికాలో ఉండగా, ఈ కేసులో ఆమె తండ్రి కోర్టుకు హాజరౌతున్నారు. వాంగ్మూలం నమోదు చేసే విషయంలో ఆమె కింది కోర్టుకు హాజరుకావాలని హైకోర్టు ఆదేశించింది. దాంతో హైదరాబాద్ వచ్చిన ఆమె గత ఏడాది మార్చి 25 ఏప్రిల్ 14 వరకూ 21 రోజులపాటు ఇక్కడే ఉన్నది. ఏప్రిల్‌లో తిరిగి అమెరికా వెళ్లకపోతే తన పాస్‌పోర్టు సీజ్ చేస్తారని ఆమె కోర్టు దృష్టికి తెచ్చింది. కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని మాత్రమే కోర్టు ఆదేశించడంతో విచారణ జరగడం లేదని ఆమె అమెరికా వెళ్లిపోయింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేసు విచారణ చేయాలని అమెరికా నుంచి ఆమె కోరగా సిటీ సివిల్ కోర్టు అనుమతించలేదు. దీంతో ఆమె హైకోర్టులో సవాల్ చేశారు.‘భార్యాభర్తలకు అనుకూలమైన తేదీని నిర్ణయించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేసుల విచారణ జరపాలి. అమెరికాలో ఉంటూ ఉద్యోగం చేసుకునేవారు ఇక్కడి కేసుల విచారణకు రావాలంటే వారికి సమస్యలు వస్తాయి. ఒక్కోసారి ఉద్యోగం పోయే ప్రమాదం కూడా రావచ్చు. ఆర్థికంగా కూడా ఇబ్బందులు ఎదురౌతాయి. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దంపతుల మధ్య వివాదాల్ని కూడా విచారించ వచ్చు’అని న్యాయమూర్తి పేర్కొన్నారు. -
‘న్యాయం కోసం వచ్చేవారికి బాసటగా నిలవాలి’
సాక్షి, హైదరాబాద్: భారత న్యాయవ్యవస్థలో పెండింగ్‌లో ఉన్న కేసులు సమస్యగా మారాయని.. న్యాయం కోసం కోర్టుకు వస్తున్న వారి పట్ల శ్రద్ధ వహించాలని సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. ఆదివారం సికింద్రాబాద్‌లో నిర్మించిన సిటీ సివిల్ కోర్టు ఫేస్ వన్ భవనాన్ని జస్టిస్ ఠాకూర్ ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా జస్టిస్ రమణ మాట్లాడుతూ.. ఈ కోర్టు భవనంలోని న్యాయముర్తుల ఛాంబర్లు సుప్రీం కోర్టు, హైకోర్టు ఛాంబర్ల కంటే బాగున్నాయని పేర్కొన్నారు. అదేవిధంగా సమాజంలో ఏ వృత్తికి లేని గౌరవం న్యాయముర్తుల వృత్తికి ఉందని.. కావున న్యాయం కోసం వచ్చేవారికి, ప్రజల హక్కులకు బాసటగా నిలవాలని తెలిపారు. దీంతోపాటు న్యాయ వ్యవస్థను గౌరవించి.. కోర్టుకు వచ్చే వారి సమస్యలు పరిష్కరించాలని చెప్పారు. ఈ సమాజం న్యాయమూర్తులకు చాలా గౌరవం ఇస్తుంది.. అందుకే సమాజం కోసం సేవ చేయాలన్నారు. అయితే చాలా కేసుల్లో సాక్షి కోర్టుకు రావటం గగనం అవుతోందని.. సాక్షులను గౌరవించి కాపాడుకోవాలని అయన పేర్కొన్నారు. కాగా న్యాయ వ్యవస్థలో సీనియర్లు తల్లిదండ్రుల వంటి వారని.. అందరిని గౌరవించి, న్యాయ వ్యవస్థపై మరింత గౌరవాన్ని పెంపొందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సుప్రీం కోర్టు న్యాయముర్తి జస్టిస్ సుభాష్ రెడ్డి మాట్లాడుతూ.. సుమారు రూ. 12 కోట్ల వ్యయంతో కోర్టు కోసం మంచి భవనం నిర్మించినందుకు సంతోషంగా ఉందన్నారు. అదేవిధంగా న్యాయవ్యవస్థకు లోబడే మనమంతా పని చేయాలని పేర్కొన్నారు. గతం కంటే ప్రస్తుతం ఎన్నో మార్పులు వచ్చాయని తెలిపారు. అనంతరం సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ నాగేశ్వరరావు మాట్లాడుతూ.. న్యాయవ్యవస్థ కోసం మౌలిక సదుపాయాలు అందించే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాలని కోరారు. -
పరువు నష్టం దావా: కోర్టుకు రాని పేర్వారం రాములు
హైదరాబాద్ : తెలంగాణ మాజీ డీజీపీ పేర్వారం రాములుపై మాజీ ఇన్స్పెక్టర్ మాధవరెడ్డి సిటీ సివిల్ కోర్టులో పరువునష్టం దావా వేశారు. మాధవరెడ్డిపై తప్పుడు కేసులు నమోదు చేసి పీడీయాక్ట్ పెట్టి జైలుకు పంపిన నేపథ్యంలో రాములుపై పరువునష్టం దావా వేశారు. బుధవారం రాములును విచారణకు హాజరు కావల్సిందిగా కోర్టు ఆదేశించింది. 7 శాతం వడ్డీతో రూ.75 లక్షలు చెల్లించాలని 2017లో రాములును కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. కాగా, రాములు ఈ రోజు కోర్టుకు హాజరు కాలేదు. ఈ క్రమంలో కోర్టు ఆదేశాలను పాటించని కారణంగా మాజీ డీజీపీ రాములును అరెస్ట్ చేయాలని పిటీషనర్ మాధవరెడ్డి డిమాండ్ చేశారు. మాజీ డీజీపీ పేర్వారం రాములు 75 ఏళ్ల వయస్సుతో ఉండటం వల్ల కోర్టుకు హాజరు కాలేదని.. రాములు తరపు న్యాయవాది కోర్టుకు తెలిపాడు. ఈ క్రమంలో ఇరు వాదనలు పూర్తిగా విన్న న్యాయస్థానం ఈ కేసుపై తుది తీర్పును జూలై 5వ తేదీకి వాయిదా వేసింది. -
సిటీ సివిల్ కోర్టులో తాత్కాలిక హైకోర్టు
సాక్షి, అమరావతి: రాజధానిలో తాత్కాలిక హైకోర్టు నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం కొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. అమరావతిలో సిటీ సివిల్ కోర్టు నిర్మించి అందులోనే తాత్కాలికంగా హైకోర్టు ఏర్పాటు చేయాలని భావిస్తోంది. తాత్కాలిక హైకోర్టును నాలుగు ఎకరాల్లో ప్రత్యేకంగా నిర్మించే ఆలోచనను విరమించుకుంది. సోమవారం వెలగపూడిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సీఆర్డీఏ సమావేశంలో పలు అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు. భారీ వ్యయంతో తాత్కాలిక హైకోర్టు నిర్మాణంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆ యోచనను విరమించుకున్నారు. 15న ఢిల్లీకి చంద్రబాబు :ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 15వ తేదీన ఢిల్లీ వెళ్లనున్నారు. కేంద్ర బడ్జెట్ అనంతరం బీజేపీ–టీడీపీ మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో సీఎం ఢిల్లీ పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తదితరులతో చంద్రబాబు చర్చలు జరుపుతారని టీడీపీ వర్గాలు తెలిపాయి. -
సమసిపోని 'మా' ఎన్నికల వివాదం
హైదరాబాద్: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) వివాదం ఇంకా సమసిపోలేదు. 'మా' ఎన్నికలపై నటుడు ఓ.కళ్యాణ్ సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కొత్తగా ఎన్నికైన మా అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్, మాజీ అధ్యక్షుడు మురళీ మోహన్, శివాజీ రాజాలకు కోర్టు నోటీసులు జారీ చేసింది. 'మా' ఎన్నికలకు ముందు కోర్టులో పిటిషన్ - ఆ తరువాత వాడీవేడీ విమర్శలతో ఎన్నికలు జరగడం తెలిసిందే. మార్చి 29న ఎన్నికలు జరిగినా కోర్టు ఆదేశాల మేరకు ఓట్ల లెక్కింపు నిలిపివేశారు. ఆ తరువాత కోర్టు అనుమతితో ఏప్రిల్ 17న ఓట్లను లెక్కించి ఫలితాలు విడుదల చేశారు. సమీప ప్రత్యర్థి జయసుధపై 85 ఓట్ల ఆధిక్యంతో రాజేంద్ర ప్రసాద్ విజయం సాధించారు. కొత్తగా అధ్యక్షుడుగా ఎన్నికైన రాజేంద్ర ప్రసాద్ ఏప్రిల్ 19న ప్రమాణస్వీకారం కూడా చేశారు. మళ్లీ ఇప్పుడు నటుడు ఓ.కళ్యాణ్ 'మా' ఎన్నికలపై పిటిషన్ దాఖలు చేయడంతో రాజేంద్ర ప్రసాద్, మురళీ మోహన్, శివాజీ రాజాలకు నోటీసులు జారీ అయ్యాయి. -
’మా’ ఎన్నికలకు కోర్టు గ్రీన్ సిగ్నల్
-
'మా' ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్ : మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ [మా] ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ లభించింది. కాగా కోర్టు ఆమోదం తర్వాతే ఫలితాలు ప్రకటించాలని షరతు విధించారు. శుక్రవారం సిటీ సివిల్ కోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించింది. ఆరోపణలు, ప్రత్యారోపణలతో ఇప్పటికే వేడెక్కిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ [మా] ఎన్నికలు వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. ఎన్నికల బరిలో ఓ వర్గం వారు.. 'మా' ఎన్నికల తీరును సవాలు చేస్తూ సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు. ఎన్నికల్లో అవకతవకలు జరుగుతున్నాయంటూ ఆరోపించారు. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం ఇరువర్గాల వాదనలు విన్నది. అనంతరం ఎన్నికల నిర్వహణకు షరతులతో కూడిన అనుమతి మంజూరు చేసింది. మా ఎన్నికలు ఆదివారం జరగనున్నాయి. అధ్యక్ష పదవికి రాజేంద్ర ప్రసాద్, జయసుధ పోటీ చేస్తున్నారు. వారి ప్యానల్ తరపున ఇతర పదవులకు బరిలో నిలిపారు. -
సినీనటి జీవితకు నాన్‌బెయిలబుల్ వారెంట్
హైదరాబాద్ : చెక్ బౌన్స్ కేసులో సినీ నటి జీవితకు సిటీ సివిల్ కోర్టు మంగళవారం నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. జీవిత ఇచ్చిన రూ.25 లక్షల చెక్ బౌన్స్ అయిందంటూ పరంధామయ్య రెడ్డి మరోసారి కోర్టును ఆశ్రయించారు. దాంతో సివిల్ కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు ఇవాళ నాన్‌బెయిబుల్ వారెంట్‌తో జీవిత ఇంటికి వెళ్లారు. అయితే ఆమె అందుబాటులో లేకపోవటంతో పోలీసులు వెనుదిగిరారు. కాగా మరో చెక్ బౌన్స్ కేసులో జీవితకు ఇటీవలే ఎర్రమంజిల్ కోర్టు రెండేళ్ల జైలుశిక్షతో పాటు రూ. 25 లక్షల జరిమానా కూడా విధించిన విషయం తెలిసిందే. -
ఎంసీఏ బాధ్యతలకు దూరంగా ఉండాలి
ముంబై: ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) అధ్యక్షుడిగా కొనసాగుతున్న శరద్ పవార్‌కు ఎదురుదెబ్బ తగిలింది. తాత్కాలికంగా ఈ పదవికి దూరంగా ఉండాలని సిటీ సివిల్ కోర్టు ఆదేశించింది. అయితే వారంలోగా ఈ తీర్పుపై పవార్ అప్పీల్ చేసుకోవచ్చని తెలిపింది. ఎంసీఏ చీఫ్‌గా పవార్ కొనసాగడాన్ని అడ్డుకోవాలని సీనియర్ బీజేపీ నాయకుడు గోపీనాథ్ ముండే కోర్టుకెక్కారు. అలాగే ఈ పదవి కోసం తాను వేసిన నామినేషన్‌ను తిరస్కరించడాన్ని కూడా ఆయన కోర్టులో సవాల్ చేశారు. నివాస ధృవీకరణ సరిగా లేదనే కారణంతో ఎంసీఏ ఎన్నికల్లో ముండేను పాల్గొనకుండా గతంలో అధికారులు అడ్డుకున్నారు. ఎంసీఏ నిబంధనల ప్రకారం అధ్యక్షుడిగా పోటీ చేసేవారు కచ్చితంగా ముంబై వాసి అయి ఉండాలి. ఈ నేపథ్యంలో ముండే పిటిషన్‌ను స్వీకరించిన సివిల్ కోర్టు పవార్‌ను బాధ్యతలకు దూరంగా ఉండాలని ఆదేశించింది.