
యాంగ్రీ స్టార్ రాజశేఖర్ హీరోగా నటించిన తాజా చిత్రం శేఖర్. ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రదర్శన ఆగిపోయింది. ‘శేఖర్’ చిత్రం ప్రదర్శనను నిలిపివేయాలని సిటీ సివిల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. హీరో రాజశేఖర్ తనకు డబ్బులు ఇవ్వాలంటూ ఫైనాన్షియర్ పరంధామరెడ్డి సిటీ కోర్టును ఆశ్రయించాడు. కోర్డు ఆదేశించిన డబ్బు చెల్లించకపోవడంతో ప్రదర్శనను నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. కాగా, శేఖర్ సినిమా ప్రదర్శన నిలిపివేతపై ట్విటర్ వేదికగా రాజశేఖర్ స్పందించారు.
(చదవండి: మా కష్టానికి తగిన ఫలితం దక్కింది : 'శేఖర్' నిర్మాత)
‘శేఖర్ చిత్రాన్ని నేను, నా కుటుంబం మా సర్వస్వంగా భావించాం. ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు చాలా కష్టపడ్డాం. శేఖర్ చిత్రానికి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. కానీ, ఇంతలోనే కొందరు కావాలనే మా చిత్రాన్ని అడ్డుకుంటున్నారు. సినిమా అనేది మా ప్రాణం. ‘శేఖర్’ మాకు చాలా ప్రత్యేకం. ఇక నేను చెప్పాల్సిందేమీ లేదు.... ఎవరెన్ని చేసినా ఈ చిత్రం ప్రదర్శితమై, ప్రశంసలు పొందుతుందని, ఆ అర్హత ఈ సినిమాకు ఉందని నేను భావిస్తున్నాను’ అంటూ రాజశేఖర్ ట్వీట్ చేశాడు.
#Shekar pic.twitter.com/JipmYOnh57
— Dr.Rajasekhar (@ActorRajasekhar) May 22, 2022
Comments
Please login to add a commentAdd a comment