rajesekhar
-
'శేఖర్' సినిమా వివాదం.. జీవితా రాజశేఖర్ గెలుపు?
యాంగ్రీ స్టార్ రాజశేఖర్ హీరోగా నటించిన తాజా చిత్రం శేఖర్. ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఫైనాన్షియర్ పరంధామరెడ్డి వేసిన కేసు కారణంగా ప్రదర్శన నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ‘శేఖర్’ చిత్రాన్ని నిలిపివేయాలని కోరుతూ ఆయన సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించాడు. అయితే తాజాగా ఈ మూవీ నిలిపివేతపై కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని తెలుస్తోంది. ఈ కేసులో జీవితా రాజశేఖర్, శేఖర్ చిత్ర బృందానికి అనుకూలంగా కోర్టులో న్యాయమూర్తి మాట్లాడినట్లు సమాచారం. తాజాగా జరిగిన ఈ కేసు విచారణలో శేఖర్ మూవీ ప్రదర్శనను నిలిపివేయాలని తామెప్పుడూ చెప్పలేదని న్యాయస్థానం వ్యాఖ్యానించినట్లు తెలిసింది. చదవండి: ప్రేమపై నోరు విప్పిన సాయి పల్లవి, ఏమన్నదంటే.. కొంతమంది ఉద్దేశపూర్వకంగా సినిమా ప్రదర్శనకు ఆటంకం కలిగించినట్లు సమాచారం. అయితే, కోర్టు సినిమా ప్రదర్శనకు ఎటువంటి అభ్యంతరం తెలుపలేదని తాజాగా జీవిత రాజశేఖర్, నిర్మాత తరపు న్యాయవాదులు తెలిపారు. శేఖర్ సినిమాను నిరభ్యంతరంగా ప్రదర్శించవచ్చని కోర్టు చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు. ఇక ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను జీవితా రాజశేఖర్, నిర్మాత బీరం సుధాకర్ రెడ్డి తరపు న్యాయవాదులు మంగళవారం(మే 24న) విలేకరుల సమావేశంలో వెల్లడించనున్నారు. అయితే తాజాగా దీనిపై రాజశేఖర్ కూడా ట్వీట్ చేశాడు. ఆసత్య ప్రచారం వల్ల తమ సినిమాను నిలిపివేశారని, శేఖర్ మూవీపై కోర్టు స్టే ఇచ్చిందంటూ వచ్చిన వార్తల్లో నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. కాగా ఈ సినిమాకు ఆయన సతీమణి జీవిత రాజశేఖర్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. చదవండి: ఎలాగో ఈ సైడ్ ఎఫెక్ట్స్ నుంచి తప్పించుకోలేను.. నటి #Shekar Thanking our audience for constantly standing by us! pic.twitter.com/9nTE5ulig9 — Dr.Rajasekhar (@ActorRajasekhar) May 23, 2022 -
‘శేఖర్’ మూవీ ప్రదర్శన నిలిపివేత.. రాజశేఖర్ ఎమోషనల్ ట్వీట్
యాంగ్రీ స్టార్ రాజశేఖర్ హీరోగా నటించిన తాజా చిత్రం శేఖర్. ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రదర్శన ఆగిపోయింది. ‘శేఖర్’ చిత్రం ప్రదర్శనను నిలిపివేయాలని సిటీ సివిల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. హీరో రాజశేఖర్ తనకు డబ్బులు ఇవ్వాలంటూ ఫైనాన్షియర్ పరంధామరెడ్డి సిటీ కోర్టును ఆశ్రయించాడు. కోర్డు ఆదేశించిన డబ్బు చెల్లించకపోవడంతో ప్రదర్శనను నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. కాగా, శేఖర్ సినిమా ప్రదర్శన నిలిపివేతపై ట్విటర్ వేదికగా రాజశేఖర్ స్పందించారు. (చదవండి: మా కష్టానికి తగిన ఫలితం దక్కింది : 'శేఖర్' నిర్మాత) ‘శేఖర్ చిత్రాన్ని నేను, నా కుటుంబం మా సర్వస్వంగా భావించాం. ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు చాలా కష్టపడ్డాం. శేఖర్ చిత్రానికి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. కానీ, ఇంతలోనే కొందరు కావాలనే మా చిత్రాన్ని అడ్డుకుంటున్నారు. సినిమా అనేది మా ప్రాణం. ‘శేఖర్’ మాకు చాలా ప్రత్యేకం. ఇక నేను చెప్పాల్సిందేమీ లేదు.... ఎవరెన్ని చేసినా ఈ చిత్రం ప్రదర్శితమై, ప్రశంసలు పొందుతుందని, ఆ అర్హత ఈ సినిమాకు ఉందని నేను భావిస్తున్నాను’ అంటూ రాజశేఖర్ ట్వీట్ చేశాడు. #Shekar pic.twitter.com/JipmYOnh57 — Dr.Rajasekhar (@ActorRajasekhar) May 22, 2022 -
ఫీల్డ్ అసిస్టెంట్ సస్పెన్షన్
నర్సరీ నిర్వహణ సరిగా లేదనీ ఫీల్డ్ అసిస్టెంట్ను డ్వామా పీడీ సస్పెండ్ చేశారు. ఈ సంఘటన వరంగల్ జిల్లా నర్మెట్ట మండలం అబ్దుల్నాగారం గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. గ్రామంలో ఫీల్డ్ అసిస్టెంట్గా పనిచేస్తున్న శ్రీనివాస్ గత కొంతకాలంగా విధుల్ని సక్రమంగా నిర్వర్తించడం లేదు. ఈ నేపథ్యంలో పీడీ రాజశేఖర్ నర్సరీని సోమవారం తనిఖీ చేయగా పలు లోపాలు బయటపడ్డాయి. శ్రీనివాస్ పనితీరుపై అసంతృప్తిని వ్యక్తం చేసిన పీడీ అతన్ని సస్పెండ్ చేశారు. నర్సరీలో పర్యవేక్షణ లోపం ఉందనీ టె క్నికల్ అసిస్టెంట్ రంజిత్కుమార్కు షోకాజ్ నోటీసు జారీ చేశారు.