
ఎంసీఏ బాధ్యతలకు దూరంగా ఉండాలి
ముంబై: ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) అధ్యక్షుడిగా కొనసాగుతున్న శరద్ పవార్‌కు ఎదురుదెబ్బ తగిలింది. తాత్కాలికంగా ఈ పదవికి దూరంగా ఉండాలని సిటీ సివిల్ కోర్టు ఆదేశించింది. అయితే వారంలోగా ఈ తీర్పుపై పవార్ అప్పీల్ చేసుకోవచ్చని తెలిపింది. ఎంసీఏ చీఫ్‌గా పవార్ కొనసాగడాన్ని అడ్డుకోవాలని సీనియర్ బీజేపీ నాయకుడు గోపీనాథ్ ముండే కోర్టుకెక్కారు.
అలాగే ఈ పదవి కోసం తాను వేసిన నామినేషన్‌ను తిరస్కరించడాన్ని కూడా ఆయన కోర్టులో సవాల్ చేశారు. నివాస ధృవీకరణ సరిగా లేదనే కారణంతో ఎంసీఏ ఎన్నికల్లో ముండేను పాల్గొనకుండా గతంలో అధికారులు అడ్డుకున్నారు. ఎంసీఏ నిబంధనల ప్రకారం అధ్యక్షుడిగా పోటీ చేసేవారు కచ్చితంగా ముంబై వాసి అయి ఉండాలి. ఈ నేపథ్యంలో ముండే పిటిషన్‌ను స్వీకరించిన సివిల్ కోర్టు పవార్‌ను బాధ్యతలకు దూరంగా ఉండాలని ఆదేశించింది.