ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రకటన నేపథ్యంలో ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రను సరైన మార్గంలో నడిపించే వరకు తాను విశ్రమించబోనని తేల్చిచెప్పారు. తాను ప్రసంగిస్తున్న సభలో కొందరు యువకులు ‘84 ఏళ్లు’ అని ప్లకార్డులు చూపించడం పట్ల శరద్ పవార్ స్పందించారు.
‘కొంతమంది యువకులు చేతుల్లో 84 ఏళ్ల బోర్డులతో నిలబడి ఉన్నారు. దానిపై నా ఫొటో ఉంది. నాకు 84 ఏళ్ల వయస్సు అని రాసి ఉంది. అయితే మీరు చింతించకండి. ఇప్పుడు మాకు ఉంది నాకు 84 ఏళ్లు వచ్చినా, 90 ఏళ్లు వచ్చినా.. ఈ వృద్ధుడు విశ్రమించడు’’ అని అన్నారు. అదేవిధంగా అసెంబ్లీ ఎన్నికలకు సీట్ల షేరింగ్ ఫార్ములాకు సంబంధించిన చర్చల సందర్భంగా మహా వికాస్ అఘాడి (MVA)నియోజకవర్గాల మధ్య విభేదాల ఊహాగానాలను తిరస్కరించారాయన.
I'm 84 right now, I may even turn 90, but until Maharashtra comes back on the right track, I am not going anywhere
- Sharad Pawar NCP Chief pic.twitter.com/xQpJBWiK5t— Ravi Kapur (@Kap57608111) October 15, 2024
మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ( మంగళవారం) ప్రకటింనుంది. మధ్యాహ్నం 3.30 గంటలకు ఈసీఐ మీడియా సమావేశం ఏర్పాటు చేయనుంది. ఈ మీడియా సమావేశంలో ఎన్నికల షెడ్యూల్‌కు సంబంధించిన వివరాలను అధికారులు వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment