ముంబై: గుజరాత్‌లోని టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్, ఎయిర్‌బస్ ఫ్యాక్టరీ మహారాష్ట్రలో ఏర్పాటు చేయవల్సి ఉండగా.. ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్‌కు తరలించుకుపోయారని కేంద్ర మాజీ మంత్రి, ఎన్సీపీ(ఎస్పీ) అధినేత శరద్ పవార్ ఆరోపణలు చేశారు. ఆయన మంగళవారం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. బారామతి అసెంబ్లీ నియోజకవర్గంలో నిర్వహించిన ర్యాలీలో ప్రసంగించారు.
‘‘రతన్ టాటా మహారాష్ట్రలో టాటా ఎయిర్‌బస్ ప్రాజెక్ట్ రావాలని భావించారు. సంప్రదింపులు జరిపిన అనంతరం.. నాగ్‌పూర్ ఎంఐడీసీ ప్రాంతంలో 500 ఎకరాల స్థలాన్ని కూడా గుర్తించటం జరిగింది. ఇది మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో జరిగింది. ఇందులో నేను కూడా భాగమయ్యాను. తర్వాత మా ప్రభుత్వం మారిపోయింది.
..అనంతరం నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయ్యాక.. రతన్ టాటాకు ఫోన్ చేసి ఒప్పించి గుజరాత్‌లో ఫ్యాక్టరీని స్థాపించాలని చెప్పారు. ఆ ప్రాజెక్టు వల్ల మహారాష్ట్రలో వేల మందికి ఉద్యోగాలు లభించేవి. మహారాష్ట్ర కోసం ఉద్దేశించిన (సెమీకండక్టర్) ఫ్యాక్టరీని గుజరాత్‌లో ఏర్పాటు చేయాలని ఫాక్స్‌కాన్‌ను మోదీ కోరడంతో మహారాష్ట్రలో వేలాది మంది ఉద్యోగాలు కోల్పోయారు. ప్రధానమంత్రి ఏ ఒక్క రాష్ట్రానికి చెందినవారు కాదు.. దేశం మొత్తం గురించి ఆలోచించాలి’’ అని అన్నారు. అయితే ప్రస్తుతానికి శరద్ పవార్ ఆరోపణలపై బీజేపీ స్పందించలేదు.
చదవండి: ఢిల్లీ.. 72 గంటలు డేంజర్
Comments
Please login to add a commentAdd a comment