సాక్షి,హైదరాబాద్: తిరుపతి లడ్డూపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనుచిత వాఖ్యలు చేశారని హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలైంది. న్యాయవాది ఇమ్మనేని రామారావు సోమవారం(అక్టోబర్ 14)ఈ పిటిషన్ వేశారు.
‘హిందువుల మనోభావాలు దెబ్బతినేలా పవన్ కళ్యాణ్ వాఖ్యలు ఉన్నాయి. శాస్త్రీయమైన ఆధారాలు ఏవీ లేకుండా తిరుపతి లడ్డూలో జంతుమాంసంతో చేసిన నెయ్యి కలిసిందని పవన్ వ్యాఖ్యానించారు. డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ తన హోదా మరచి వివాదస్పద వాఖ్యలు చేశారు. పవన్ వ్యాఖ్యలను సుప్రీంకోర్టు సైతం తప్పుపట్టింది. ఇంటర్నెట్‌లో పవన్ మాట్లాడిన వీడియోలు డిలీట్ చేయాలి.
తిరుపతి లడ్డూ వివాదంలో సమగ్ర దర్యాప్తునకు సుప్రీంకోర్టు ఇప్పటికే స్వతంత్ర సిట్ ఏర్పాటు చేసింది. మరోసారి తిరుపతి ప్రసాదంపై పవన్ కళ్యాణ్ ఇలాంటి వాఖ్యలు చేయకుండా గ్యాగ్ ఆర్డర్ ఇవ్వాలి’అని పిటిషనర్ తన పిటిషన్‌లో కోర్టును కోరారు.ఈ పిటిషన్‌ను సిటీ సివిల్ కోర్టు మంగళవారం విచారించనుంది.
ఇదీ చదవండి: జనం లేని పవన్ పల్లె పండుగ సభ
Comments
Please login to add a commentAdd a comment