Tirupati Laddu Case
-
ఆ అసత్యాలపై బదులేది బాబూ?
సాక్షి, న్యూఢిల్లీ: తిరుపతి లడ్డూ విషయంలో అసత్యాలు చెప్పినందుకు అత్యున్నత న్యాయస్థానం మందలించడంపై ఏపీ సీఎం చంద్రబాబు నుంచి ఇంతవరకూ సమాధానమే లేదని బీజేపీ సీనియర్ నేత, ప్రముఖ ఆర్థికవేత్త డాక్టర్ సుబ్రమణియన్ స్వామి మండిపడ్డారు. ఈమేరకు తిరుపతి లడ్డూ కల్తీ కేసు విచారణ సందర్భంగా గతేడాది సెప్టెంబర్ 30న సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ స్వామి ఆదివారం తన ఎక్స్ ఖాతాలో మూడు పోస్టులు చేశారు. తిరుపతి లడ్డూ వివాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబును కోర్టు తీవ్రంగా మందలించిందని, కల్తీ నెయ్యిని వాడారనేందుకు ఎలాంటి ప్రాథమిక ఆధారాలు లేవని న్యాయస్థానం స్పష్టం చేసిందని గుర్తు చేశారు. ‘ఆ అసత్యాలపై ఇప్పటికీ చంద్రబాబు నుంచి సమాధానం లేదు. ఆయన నిర్లక్ష్యంపై మోదీ ఎందుకు చర్యలు తీసుకోరు? బాబు ఎప్పడు బీజేపీని వదిలేస్తారు?’ అని ఎక్స్‌లో స్వామి ప్రశ్నలు సంధించారు.సుప్రీంలో పిల్ దాఖలు చేసిన స్వామి..: తిరుమల శ్రీవారి లడ్డూ తయారీకి ఉపయోగించే నెయ్యిలో జంతు కొవ్వులను కలిపారన్న ఆరోపణలపై వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు సుప్రీం కోర్టు పర్యవేక్షణలో ఓ కమిటీని నియమించాలని కోరుతూ సుబ్రమణియన్ స్వామి గతేడాది సెప్టెంబర్‌లో సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేయడం తెలిసిందే. ల్యాబ్ నివేదికపై పూర్తిస్థాయి ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించేలా ఆదేశాలు జారీ చేయాలని అభ్యర్ధించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి, టీటీడీ ఈవోలను ఈ వ్యాజ్యంలో ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈ కేసులో సుబ్రమణియన్ స్వామి స్వయంగా (పార్టీ ఇన్ పర్సన్) వాదనలు వినిపించారు. ఏ నివేదిక ఆధారంగా రాద్ధాంతం చేస్తూ భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారో.. దాన్ని రూపొందించేందుకు ఉపయోగించిన నెయ్యి ఎక్కడిది? టీటీడీ తిరస్కరించిన నెయ్యిలో అది ఉందా? నివేదిక వెనుక రాజకీయ పార్టీల దురుద్దేశాలున్నాయా? అనే విషయాలను తేల్చాలని స్వామి తన పిటిషన్లో సుప్రీంకోర్టును అభ్యర్థించారు.దేవుడిని రాజకీయాలకు దూరంగా ఉంచాలన్న కోర్టు..లడ్డూ తయారీకి జంతువుల కొవ్వుతో కూడిన నెయ్యిని వాడారంటూ దాఖలైన పిటిషన్‌పై సెప్టెంబర్ 30న విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు.. దేవుడిని రాజకీయాలకు దూరంగా ఉంచాలంటూ చంద్రబాబు ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేసింది. తిరుపతి లడ్డూ తయారీకి జంతువుల కొవ్వుతో కూడిన నెయ్యిని వాడారంటూ ప్రభుత్వం చేసిన వాదనను నిరూపించేందుకు ఖచ్చితమైన ఆధారాలు లేవంటూ.. ఆ ఆరోపణలను తీవ్రంగా తప్పుబట్టింది. ఏపీ ప్రభుత్వం సమర్పించిన ల్యాబ్ నివేదికను పరిశీలించిన సుప్రీంకోర్టు.. పరీక్ష కోసం పంపిన నెయ్యిని తిరస్కరించారని, లడ్డూల తయారీకి దాన్ని ఉపయోగించలేదని పేర్కొంది. -
‘సిట్ రిపోర్ట్‌లో నెయ్యిలో కల్తీ జరిగినట్లు ఎక్కడా చెప్పలేదు’
సాక్షి, తాడేపల్లిగూడెం: టీటీడీ టెండర్లలో ఉల్లంఘనలకు పాల్పడ్డారంటూ నలుగురిని సిట్ అరెస్ట్ చేసిన ఘటనను శ్రీవారి లడ్డూకి వాడే నెయ్యిలో కల్తీ ఆరోపణలకు ముడిపెట్టడం ఒక్క చంద్రబాబుకు మాత్రమే సాధ్యమని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత కొట్టు సత్యనారాయణ మండిపడ్డారు. తాడేపల్లిగూడెంలో ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. శ్రీవారి లడ్డూలో కల్తీనెయ్యి వినియోగించారంటూ ఎటువంటి ఆధారాలు లేని ఆరోపణలు చేయడంపై సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసినా చంద్రబాబులో మాత్రం మార్పు రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన ఈ అంశంలో నిర్ధిష్టమైన ఆధారాలు లేకుండానే ఇష్టారాజ్యంగా చంద్రబాబు, ఆయనకు నిత్యం భజన చేసే ఎల్లో మీడియా తప్పడు ప్రచారాలతో రాజకీయ లబ్ధికి ప్రయత్నిస్తున్నారని ఆక్షేపించారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..కూటమి ప్రభుత్వం వంద రోజుల వైఫల్యాలను వైఎస్సార్సీపీ బయటపెడుతుందనే భయంతో చంద్రబాబు గత ఏడాది సెప్టెంబర్ నెలలో ప్రపంచ వ్యాప్తంగా శ్రీవారి భక్తులు తల్లడిల్లేలా తప్పుడు ఆరోపణలు చేశారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో పందికొవ్వు, గొడ్డు కొవ్వు కలిసాయంటూ ఒక పథకం ప్రకారం ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు సెప్టెంబర్ 18వ తేదీన ప్రకటించారు. తరువాత సెప్టెంబర్ 25న కేసు నమోదు చేశారు. 26వ తేదీన రాష్ట్రప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. తరువాత దీనిపై సుప్రీంకోర్ట్ లో వ్యాజ్యం దాఖలైన నేపథ్యంలో సీబీఐ నేతృత్వంలో సిట్ ను ఏర్పాటయ్యింది.టెండర్లలో ఉల్లంఘనలను మాత్రమే గుర్తించిన సిట్ నెయ్యిలో కల్తీ జరిగిందా లేదా అనే అంశంపై విచారణకు వచ్చిన సిట్ ముందుగా టీటీడీ నిర్వహిస్తున్న టెండర్లను పరిశీలించింది. దీనిలో నిబంధనల ఉల్లంఘన జరిగిందని గుర్తించి, దానికి కారణమైన నలుగురిపై కేసు నమోదు చేసి వారిని అరెస్ట్ చేసింది. ఈ అంశాన్ని మరోసారి చంద్రబాబు, ఆయనకు వంతపాడే ఎల్లో మీడియా మరోసారి వక్రీకరిస్తూ తప్పుడు ప్రచారానికి తెగబడ్డారు. నెయ్యిలో కల్తీ జరిగిపోయిందని, ఈ కల్తీ నెయ్యి విషయంలోనే నలుగురి అరెస్ట్ జరిగిందంటూ అసత్య ప్రచారానికి తెర తీశారు. నెయ్యిలో కల్తీ జరిగిందనే అంశాన్ని సిట్ నిర్ధారించక ముందే ముఖ్యమంత్రిగా చంద్రబాబు, ఆయనకు నిత్యం భజన చేసే ఎల్లో మీడియా నిర్ధారించి తీర్పులు కూడా చెప్పేయడం దుర్మార్గం.ఆది నుంచి చంద్రబాబు ప్రతి అంశాన్ని తనకు అనుకూలంగా వాడుకోవడం, వైఎస్సార్సీపీపై బురద చల్లడమే పనిగా పెట్టుకున్నారు. శ్రీవారి ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందంటూ మొదట్లో తప్పుడు ప్రచారం చేశారు. నీచమైన రాజకీయాలకు పవిత్రమైన శ్రీవారి ప్రసాదాన్ని అడ్డం పెట్టుకోవడం అత్యంత దుర్మార్గం. చంద్రబాబు తన స్వార్థం కోసం ఏఅంశాని అయినా సరే వాడుకోగల ఘనుడు. నిత్యం అబద్ధాలతోనే రాజకీయాలు చేసే చంద్రబాబుకు ఎల్లో మీడియా అండగా నిలుస్తోంది. చంద్రబాబు చెప్పే ప్రతి దుర్మార్గమైన మాటను విస్తృతంగా ప్రచారం చేస్తూ ప్రపంచంలోని కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీశారు.నెయ్యిలో నాణ్యతా ప్రమాణాలను గుర్తించే ల్యాబ్‌లు టీటీడీకి ఉన్నాయి. 2024 జూన్ 12, 20, 25, జూలై 4వ తేదీల్లో లడ్డూ ప్రసాదం తయారీ కోసం టీటీడీకి సరఫరా అయిన నెయ్యి ట్యాంకర్ల నుంచి నెయ్యి శాంపిళ్లను తీసి టీటీడీ ల్యాబ్‌లో పరిశీలించారు. ప్రమాణాలకు అనుగుణంగానే ఈ శాంపిళ్లు ఉన్నాయని నిర్థారించడం కూడా జరిగింది. అంటే లడ్డూ తయారీకి వస్తున్న నెయ్యిని పూర్తి స్థాయిలో పరిశీలించే ల్యాబ్‌లు, మెకానిజం టీటీడీకి ఉంది. ఈ పరిశీలనలో ఏ మాత్రం నాణ్యాతా ప్రమాణాలు తక్కువగా ఉన్నట్లు తేలినా ఆ నెయ్యి ట్యాంకర్లను వెనక్కి పంపిస్తారు.ఈ విషయాన్ని మొదటి నుంచి వైఎస్సార్సీపీ చెబుతూనే ఉంది. కానీ చంద్రబాబుకు, ఎల్లో మీడియాకు వాస్తవాలు అక్కరలేదు. ఏదో ఒక రకంగా చంద్రబాబు వైఫల్యాలను ప్రజలు మరిచిపోయేలా చేయాలంటే ఒక బలమైన అంశంతో ప్రజలను డైవర్ట్ చేయాలన్నదే వారి లక్ష్యం. హిందూధర్మాన్ని అనుసరించే భక్తులు శ్రీవారి లడ్డూలో పందికొవ్వు, గొడ్డు కొవ్వు కలిసిందని ఉచ్ఛరించడానికే ఇష్టపడరు. అలాంటిది దుర్మార్గమైన కుట్రకు చంద్రబాబు పాల్పడ్డారు.వెనక్కి పంపిన ఆ నాలుగు ట్యాంకర్ల నెయ్యిని ఎలా వినియోగిస్తారు?గత ఏడాది జూలై 6, 12వ తేదీల్లో నాలుగు ట్యాంకర్ల ద్వారా కల్తీ నెయ్యి తిరుమలకు వచ్చిందనే ఆరోపణలు వచ్చాయి. వీటి నుంచి ఎన్డీడీపీకి టెస్ట్ కోసం నెయ్యి శాంపిళ్ళను పంపించారు. ఇదే అంశాన్ని రిమాండ్ రిపోర్ట్‌లో రాశారు. దీనిలో కూడా ఈ నెయ్యిలో కల్తీ జరిగినట్లు ఎక్కడా లేదు. ఎన్డీడీపీ తన నివేదికలో ఈ నెయ్యిలో వనస్పతి కలిసి ఉండే అవకాశం ఉందని, మా నివేదిక తప్పు కూడా అయ్యేందుకు అవకాశం ఉందని కూడా చెప్పింది. ఇదే విషయాన్ని సాక్షాత్తు సుప్రీంకోర్టు కూడా ప్రశ్నించింది.ఇదీ చదవండి: మళ్లీ అధికారంలోకి వస్తాం.. అందరి లెక్కలు తేలుస్తాం: వైఎస్ జగన్అదే విధంగా జూలై 23నే టీటీడీ ఈవో శ్యామలరావు మాట్లాడుతూ ఈ నాలుగు ట్యాంకర్ల ద్వారా వచ్చిన నెయ్యిని వెనక్కి పంపించేశామని, ప్రసాదంలో ఉపయోగించలేదని కూడా ప్రకటించారు. ఈ నాలుగు ట్యాంకర్ల నెయ్యిని వాడకపోయినా రెండు నెలల తరువాత అంటే సెప్టెంబర్ 18న చంద్రబాబు ఆ నెయ్యిని వాడినట్లు ప్రకటించడం రాజకీయ దురుద్దేశంతో కాదా? ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏఆర్ డెయిరీ నుంచి నెయ్యి చంద్రబాబు అధికారంలోకి వచ్చిన నాటి నుంచే సరఫరా ప్రారంభించారు. దీనిని సీబీఐ కూడా గుర్తించింది. సీఎం చంద్రబాబు లడ్డూ కల్తీపై మాట్లాడేప్పుడు ఏ ఆధారాలతో నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసినట్లు ఆరోపించారని సుప్రీంకోర్టు ప్రశ్నించడంతో పాటు తప్ప పట్టింది. దీనికి చంద్రబాబు ఎటువంటి సమాధానం చెప్పలేదు. -
శ్రీవారి లడ్డూలో కాదు.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మాటల్లోనే ఉంది కల్తీ
సాక్షి,తిరుపతి: తిరుమల శ్రీవారి లడ్డూ వ్యవహారంలో సిట్ జరిపిన అరెస్టులకు సంబంధించి రిమాండ్ రిపోర్టుల్లో ఎక్కడా లడ్డూలో కల్తీ నెయ్యి వాడినట్టు పేర్కొనలేదని టీటీడీ మాజీ ఛైర్మన్, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన కరుణాకర్‌రెడ్డి స్పష్టం చేశారు. అయినా టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు సహా ఎల్లో మీడియా.. నెయ్యిలో కల్తీ జరిగిందని సిట్ నిర్ధారించినట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. తిరుపతిలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడిన భూమన కరుణాకర్‌రెడ్డి, ఇకనైనా తప్పుడు ప్రచారం ఆపకపోతే దేవదేవుని ఆగ్రహానికి గురవడం ఖాయమని హెచ్చరించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మాటలు, ఆలోచనల్లోనే కల్తీ కొవ్వు ఉందని.. లడ్డూకి వాడే నెయ్యిలో కల్తీ జరిగే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు.ప్రెస్మీట్లో భూమన కరుణాకర్‌రెడ్డి ఇంకా ఏం మాట్లాడారంటే..:ఆ విషయం రిమాండ్ రిపోర్టులో లేదు: నిందితుల రిమాండ్ రిపోర్టులో నెయ్యి కల్తీ జరిగిందని సిట్ చెప్పలేదు. అయినా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు సహా ఎల్లో మీడియాలో మాత్రం నెయ్యి కల్తీ జరిగిందని నిర్ధారణ జరిగిపోయినట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. బోలే బాబా డెయిరీ, వైష్ణవి డెయిరీ, ఏఆర్ డెయిరీ చేసిన తప్పులపై మాత్రమే సిట్ విచారణ జరిపి రిమాండ్ బాధ్యులను రిమాండ్‌కి తరలించింది. సుప్రీం కోర్టు నియమించిన సీబీఐ డైరెక్టర్ ఆధ్వర్యంలోని సిట్ బృందం ఎక్కడా నెయ్యి కల్తీపై మాట్లాడలేదు. టెండర్ల అవకతవకలపై మాత్రమే విచారణ జరుగుతోంది. దానికి సంబంధించే నలుగురిని అరెస్టు చేశారు.అయినా నిస్సిగ్గుగా దుష్ప్రచారం:కానీ, చంద్రబాబు మాత్రం వైఎస్సార్సీపీ మీద నిందలు మోపడానికి లడ్డూ తయారీ కోసం పంది కొవ్వును ఉపయోగించారని ఆధారాలు లేకుండా తప్పుడు ప్రచారం చేశాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది భక్తుల మనోభావాలను కించపరిచారు. పవన్ కళ్యాణ్ మరింత ముందుకెళ్లి సనాతన ధర్మ పరిరక్షణ కోసం తానే ఆవిర్భవించినట్టు వేషం కట్టి బిల్డప్ ఇచ్చాడు. తిరుపతిలో పవన్ ముందుకు వెళ్లి పవానంద స్వామి వేషంలో సనాతనధర్మం కోసం నడుం బిగించాను అని, తిరుపతిలో లడ్డూను నీచులు అపవిత్రం చేశారు అని మాట్లాడారు. అయోధ్య ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి కూడా కల్తీ నెయ్యితో తయారు చేసిన లడ్డూలే పంపారని డిప్యూటీ సీఎం పవనానంద స్వామి తీవ్రమైన నిరాధార ఆరోపణలు చేశారు..నిజానికి అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి పంపిన లక్ష లడ్డూల తయారీకి కావాల్సిన నెయ్యిని చంద్రబాబు నియమించిన టీటీడీ బోర్డులోనే సభ్యుడిగా ఉన్న ముంబైకి చెందిన సౌరభ్ బోరా అనే వ్యక్తి సరఫరా చేశాడు. పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణల్లో నిజం ఉంటే ముందుగా ఆ సౌరభ్ బోరాను అరెస్ట్ చేయాలి.కల్తీ నెయ్యి వినియోగించే ఛాన్స్ లేనేలేదు:చంద్రబాబు తన పాలన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగా క్షుద్ర రాజకీయాల కోసం అత్యంత పవిత్రమైన తిరుమల తిరుపతి వేంకటేశ్వరుడిని కూడా వాడుకున్నాడు. నెయ్యి నాణ్యతను నిర్ధారించే పటిష్టమైన వ్యవస్థ టీటీడీలో దశాబ్దాలుగా ఉంది. గత మా వైఎస్సార్సీపీ పాలనలో 2019–24 మధ్య నాణ్యత పరీక్షల్లో విఫలమైన 18 ట్యాంకర్లను వెనక్కి పంపడం జరిగింది. అంతకుముందు కూడా ఇదే విధంగా చంద్రబాబు పాలనలో 2014–19 మధ్య 15 ట్యాంకర్లు తిప్పి పంపించడం జరిగింది. నెయ్యి నాణ్యత టెస్టుల్లో ఫెయిలైతే ట్యాంకర్లను వెనక్కి పంపడమే తప్ప వాడటం అనేది జరగదు.టీటీడీ ఈఓ కూడా ఏమన్నారు?:తిరుమల శ్రీవారి లడ్డూల తయారీలో కల్తీ నెయ్యి వాడలేదని ఈవో శ్యామలరావు చెప్పారు. జూన్ 12, 20, 25, జూలై4న వచ్చిన నెయ్యిని పరిశీలించి టెస్టులు పాసయ్యాక వినియోగానికి పంపించామని, గత సెప్టెంబరు 20న టీటీడీ ఈవో శ్యామలారావు చాలా స్పష్టంగా చెప్పారు. ఇంకా జూలై 6, 12న ఏఆర్ డెయిరీ నుంచి వచ్చిన నాలుగు ట్యాంకర్ల శాంపిల్స్ పరీక్షించగా,వనస్పతి ఆయిల్ కలిసిన ఆనవాళ్లు తేలడంతో, ఆ ట్యాంకర్లు వెనక్కి పంపామని చెప్పారు. కాబట్టి, లడ్డూల తయారీలో ఎక్కడా కల్తీ నెయ్యి వాడలేదని స్పష్టంగా తేలిపోయింది. పెరిగిన నెయ్యి నాణ్యత:2019కి పూర్వం నెయ్యి నాణ్యత నిర్ధారణకు హెల్త్ ఆఫీసర్ మాత్రమే ఉండేవాడు. తిరుమల నెయ్యి నాణ్యతను మరింత పెంచడంలో భాగంగా వైయస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రీనివాస స్వామి అనే రిటైర్డ్ సైంటిస్టుని సీఎఫ్టీఆర్టీఐ నుంచి టీటీడీ ల్యాబరేటరీకి తీసుకురావడం జరిగింది. ఆయనతో పాటు మరో 12 మందిని ల్యాబ్ టెక్నీషియన్లను కూడా నియమించడం జరిగింది. దీంతో పాటు రకరకాల ప్రాంతాల్లో ట్యాంకర్ల నుంచి శాంపిల్స్ సేకరణ విధానాన్ని కొత్తగా తీసుకురావడం జరిగింది. ల్యాబ్ అప్‌గ్రేడేషన్ చేయడం కోసం కమలవర్థన్ అనే సీనియర్ ఐఏఎస్ అధికారి సూచనలు తీసుకోవడం జరిగింది. ఎన్డీడీబీ సాయంతో రూ.46 కోట్లతో ల్యాబ్ ఆధునికీకరణ చేయాలని నిర్ణయించాం. అందులో భాగంగా రూ.8 కోట్ల పనులకు టెండర్లు పిలవడం జరిగింది. కానీ ఒకే కంపెనీ ముందుకుడరావడంతో టెండరింగ్ ఆలస్యమైంది.నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధం:‘మేం ఆరోపణలు చేస్తాం.. వైఎస్సార్సీపీ తుడుచుకోవాలి’.. అన్నట్లుగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ వ్యవహరిస్తున్నారు. వినాశకాలే విపరీతబుద్ధి అనేలా తొందర్లోనే చంద్రబాబుకి వినాశనం తప్పదు. సర్వం ఎరిగిన స్వామికి ఆగ్రహం కలిగిస్తే వీరి పీఠాలే కదిలిపోతాయని గుర్తుంచుకోవాలి. వైఎస్సార్సీపీ మీద దాడి చేయడానికి, వైఎస్ జగన్ వ్యక్తిత్వాన్ని హననం చేయడానికి తిరుమల స్వామి వారిని వాడుకోవడం అన్నది చాలా దారుణమైన విషయం. నెయ్యిలో కల్తీ జరిగిందని నిరూపిస్తే ఎలాంటి శిక్షకైనా సిద్ధం. ఆవులు తినే ఆహారాన్ని బట్టి రిపోర్టుల్లో తేడాలు రావొచ్చని, మా నివేదిక నూటికి నూరుపాళ్లు ప్రామాణికం కాదని ఎన్డీడీబీ కూడా తన రిపోర్టులో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. అందుకే ఇకనైనా ఎల్లో మీడియా దేవదేవుని విషయంలో అసత్య ప్రచారం మానుకోవాలని భూమన కరుణాకర్‌రెడ్డి హితవు పలికారు. -
HYD: పవన్‌కల్యాణ్‌పై సిటీ సివిల్ కోర్టులో పిటిషన్
సాక్షి,హైదరాబాద్: తిరుపతి లడ్డూపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనుచిత వాఖ్యలు చేశారని హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలైంది. న్యాయవాది ఇమ్మనేని రామారావు సోమవారం(అక్టోబర్ 14)ఈ పిటిషన్ వేశారు. ‘హిందువుల మనోభావాలు దెబ్బతినేలా పవన్ కళ్యాణ్ వాఖ్యలు ఉన్నాయి. శాస్త్రీయమైన ఆధారాలు ఏవీ లేకుండా తిరుపతి లడ్డూలో జంతుమాంసంతో చేసిన నెయ్యి కలిసిందని పవన్ వ్యాఖ్యానించారు. డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ తన హోదా మరచి వివాదస్పద వాఖ్యలు చేశారు. పవన్ వ్యాఖ్యలను సుప్రీంకోర్టు సైతం తప్పుపట్టింది. ఇంటర్నెట్లో పవన్ మాట్లాడిన వీడియోలు డిలీట్ చేయాలి. తిరుపతి లడ్డూ వివాదంలో సమగ్ర దర్యాప్తునకు సుప్రీంకోర్టు ఇప్పటికే స్వతంత్ర సిట్ ఏర్పాటు చేసింది. మరోసారి తిరుపతి ప్రసాదంపై పవన్ కళ్యాణ్ ఇలాంటి వాఖ్యలు చేయకుండా గ్యాగ్ ఆర్డర్ ఇవ్వాలి’అని పిటిషనర్ తన పిటిషన్లో కోర్టును కోరారు.ఈ పిటిషన్‌ను సిటీ సివిల్ కోర్టు మంగళవారం విచారించనుంది.ఇదీ చదవండి: జనం లేని పవన్ పల్లె పండుగ సభ -
తిరుమల శ్రీవారి లడ్డూ వ్యవహారంపై సీబీఐ అధికారులతో ప్రత్యేక దర్యాప్తు బృందం... ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ‘సిట్’ను పక్కనపెట్టిన సుప్రీంకోర్టు