సాక్షి, హైదరాబాద్: సిటీ సివిల్ కోర్టులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఊరట లభించింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో సిటీ సివిల్ కోర్టు బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కవితపై ఆరోపణలు చేసిన ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. బీజేపీ ఎంపీ పర్వేశ్ వర్మ, మాజీ ఎమ్మెల్యే ముజంధర్ సిర్సాలకు నోటీసులు జారీ అయ్యాయి.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత పేరు వాడొద్దంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కవితపై మీడియా, సోషల్ మీడియా ముందు ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదని ఆదేశించింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 13కు వాయిదా వేసింది.
చదవండి: రాజాసింగ్ లాయర్‌కు బెదిరింపులు.. చంపేస్తామంటూ..
Comments
Please login to add a commentAdd a comment