సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత అరెస్ట్ కావడంతో ఆమె ఇంటి దగ్గర హైటెన్షన్ వాతావరణం నెలకొంది. కవిత ఇంటి ముందు బీఆర్‌ఎస్ శ్రేణుల నిరసనకు దిగడంతో భారీగా పోలీసులు మోహరించారు. కవిత ఇంటికి కేటీఆర్, హరీష్‌రావు చేరుకున్నారు. రాత్రి 8.45 నిమిషాలకు కవితను ఢిల్లీకి తరలించనున్నారు. కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కయ్యిందని బీఆర్‌ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. కవిత నివాసం వద్ద నిరసనకు దిగిన ఆమె అనుచరులు బీజేపీ, మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ట్రాన్సిట్ వారెంట్ లేకుండా ఎలా అరెస్టు చేస్తారంటూ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్ట్ చేయబోమని సుప్రీంకోర్టుకు చెప్పిన ఈడీ ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారు.
కేసు కోర్టులో ఉండగా.. దాడులు ఎలా చేస్తారంటూ బీఆర్‌ఎస్ లీగల్ సెల్ న్యాయవాది సోమ భరత్ కుమార్ ప్రశ్నించారు. సుప్రీంకోర్టులో కవిత కేసు పెండింగ్‌లో ఉంది. కేసు పెండింగ్‌లో ఉండగా ఈడీ అధికారులు కవిత ఇంటికి ఎలా వస్తారు?. ఢిల్లీ నుంచి ఈడి అధికారులు ఇలా రావడం కరెక్ట్ కాదు. ఎలాంటి చర్యలు తీసుకోమని కోర్టులో ఈడీ చెప్పింది. ఈనెల 19న సుప్రీంకోర్టులో కవిత కేసు విచారణ ఉందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment