న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరోసారి చుక్కెదురైంది. లిక్కర్ స్కామ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో వీరిద్దరి జ్యుడీషియల్ కస్టడీని సెప్టెంబర్ 2 వరకు పొడిగిస్తున్నట్లు రౌస్ అవెన్యూ కోర్టు మంగళవారం వెల్లడించింది.
వీరిద్దరికి గతంలో విధించిన జ్యుడీషియల్ కస్టడీ గడువు నేటితో ముగియడంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేజ్రీవాల్, కవితను కోర్టులో హాజరుపరిచారు. ఈ నేపథ్యంలోనే ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజా కస్టడీ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
కాగా లిక్కర్ పాలసీ కుంభకోణానికి సంబంధించిన ఈడీ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ఇప్పటికే సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈడీ కేసులో బెయిల్ లభించినా సీబీఐ కేసులో బెయిల్ రానందున ఆయన తిహార్ జైల్లోనే ఉంటున్నారు.
ఇక ఇదే కేసులో ఎమ్మెల్సీ కవితను మార్చి 15న హైదరాబాద్‌లో ఈడీ అధికారులు అరెస్టు చేశారు. ఆ తర్వాత ఇదే కేసులో సీబీఐ అధికారులు కూడా విచారించారు. ఏప్రిల్ 11వ తేదీన ఢిల్లీ లిక్కర్ కేసులో కవితను సీబీఐ అరెస్ట్ చేసింది. ఈ రెండు కేసుల్లోనూ ఆమె తిహార్ జైల్లో శిక్షననుభవిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment