క్రైమ్: ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో న్యాయస్థానంలోనే గ్యాంగ్ వార్ కలకలం రేగింది. బుధవారం సిటీ సివిల్ కోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో.. లాయర్ దుస్తుల్లో వచ్చిన కొందరు దుండగులు ఓ గ్యాంగ్‌స్టర్‌పై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో సంజీవ్ జీవా అనే గ్యాంగ్‌స్టర్ మరణించగా.. పలువురు పోలీసులకు గాయలైనట్లు సమాచారం.
కాల్పులు జరిపింది ముక్తార్ అన్సారి అనుచరులుగా భావిస్తున్నారు పోలీసులు. మొత్తం ఐదు రౌండ్ల కాల్పులు జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఘటనా స్థలంలోనే నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన పోలీస్ సిబ్బందిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దీనికి సంబంధించిన అదనపు సమాచాంర అందాల్సి ఉంది.
Disclaimer: ఇందులోని ఫొటోలు, దృశ్యాలు మిమ్మల్ని కలవరపాటుకు గురిచేయొచ్చు
#WATCH | Uttar Pradesh: Gangster Sanjeev Jeeva shot outside the Lucknow Civil Court. Further details awaited
— ANI UP/Uttarakhand (@ANINewsUP) June 7, 2023
(Note: Abusive language) pic.twitter.com/rIWyxtLuC4
Gangster Sanjeev Jeeva shot dead by unknown assailants outside a Lucknow court. More details are awaited. pic.twitter.com/8xvaTNoQjw
— Press Trust of India (@PTI_News) June 7, 2023
Comments
Please login to add a commentAdd a comment