
'మా' ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్ : మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ [మా] ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ లభించింది. కాగా కోర్టు ఆమోదం తర్వాతే ఫలితాలు ప్రకటించాలని షరతు విధించారు. శుక్రవారం సిటీ సివిల్ కోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించింది.
ఆరోపణలు, ప్రత్యారోపణలతో ఇప్పటికే వేడెక్కిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ [మా] ఎన్నికలు వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. ఎన్నికల బరిలో ఓ వర్గం వారు.. 'మా' ఎన్నికల తీరును సవాలు చేస్తూ సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు. ఎన్నికల్లో అవకతవకలు జరుగుతున్నాయంటూ ఆరోపించారు. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం ఇరువర్గాల వాదనలు విన్నది. అనంతరం ఎన్నికల నిర్వహణకు షరతులతో కూడిన అనుమతి మంజూరు చేసింది. మా ఎన్నికలు ఆదివారం జరగనున్నాయి. అధ్యక్ష పదవికి రాజేంద్ర ప్రసాద్, జయసుధ పోటీ చేస్తున్నారు. వారి ప్యానల్ తరపున ఇతర పదవులకు బరిలో నిలిపారు.