Manchu Vishnu Faced Trolls By 'Snake' Batch - Sakshi
Sakshi News home page

Manchu Vishnu: మాపై ట్రోల్స్‌ చేస్తుంది ఆ 'స్నేక్‌' బ్యాచ్‌నే: మంచు విష్ణు

Published Sat, Aug 19 2023 9:48 AM | Last Updated on Sat, Aug 19 2023 10:17 AM

Manchu Vishnu Faced Trolls Behind Snake Batch - Sakshi

సినిమా రంగానికి చెందిన కొందరిని టార్గెట్‌ చేస్తూ పలువురు ట్రోల్స్‌ చేస్తుంటారు. అవి ఆరోగ్యకరమైనవి అయితే పర్వాలేదు.. కానీ ఒక్కోసారి అవి శ్రుతిమించి వారిని బాధకు గురిచేస్తాయి కూడా..  ఈ ట్రోల్స్‌ వల్ల సినిమా రంగంలోని చాలామంది ప్రముఖులు ఇబ్బందులకు గురైనవారే ఉన్నారు. 'మా' ఎన్నికల నేపథ్యంలో మంచు మోహన్‌బాబు కుటుంబంపై కొందరు పనికట్టుకుని ట్రోల్స్‌ చేస్తున్నారని వారి అభిమానులు పలు పోలీస్‌ స్టేషన్‌లలో ఫిర్యాదులు కూడా చేశారు. అప్పటికి అవి ఏ మాత్రం తగ్గకపోవడంతో మంచు విష్ణు కలుగచేసుకుని పోలీస్‌ స్టేషన్‌లో  ఫిర్యాదు చేశారు. తాజాగ ఈ విషయంపై ఆయన స్పందించారు.

(ఇదీ చదవండి: మామయ్య కోసం పొలిటికల్‌ వేడుకకు వెళ్తున్న అల్లు అర్జున్‌)

తమపై ట్రోలింగ్‌ చేయిస్తున్నది.. చేస్తున్నది ఎవరో  ఇండస్ట్రీలో ఉన్న వారందరికీ తెలుసని ఆయన అన్నారు. అదొక 'స్నేక్‌' బ్యాచ్‌ చేస్తున్న పనే అని విష్ణు అన్నారు. కానీ అలాంటి ట్రోలింగ్‌ను పెద్దగా పట్టించుకోనని ఆయన తెలిపారు. ప్రస్తుత రోజుల్లో అందరికీ ట్రోల్స్‌ నుంచి ఇబ్బందులు ఎదరవుతున్నాయని ఆయన గుర్తు చేశారు. కానీ అవి కొన్నిసార్లు మితిమీరిపోతున్నాయని అలాంటి సమయంలో మాత్రం సహించేదిలేదని విష్ణు పేర్కొన్నారు. కొంతమంది తమ మీద వేసే సెటైర్లు చాలా బాగుంటాయి.. వాటిని చూసినప్పుడు తాము కూడా ఎంజాయ్‌ చేస్తామని ఆయన అన్నారు.

(ఇదీ చదవండి: చిరంజీవిని అలా అంటుంటే చాలా బాధగా ఉంది: ప్రముఖ హీరో)

కొంతమంది పనికట్టుకుని డబ్బులిచ్చిమరీ ట్రోల్ చేయిస్తున్నారు. అది మాత్రం చాలా తప్పని విష్ణు ఇలా తెలిపారు. 'మా ఎలక్షన్స్ ముందు వరకూ నాపై ట్రోలింగ్ ఉండేది కాదు.. ఎప్పుడైతే ఎలక్షన్స్‌ ప్రారంభం అయ్యాయో అప్పుడే నాపై ట్రోల్ చేయడం ప్రారంభించారు. అది ఎవరు చేయించారో అందరికీ తెలుసు. ఆ స్నేక్ బ్యాచ్ గురించి ఇప్పుడెందుకులే’ అని ఆ ఇంటర్వ్యూలో మంచు విష్ణు అన్నారు. కానీ ఆ స్నేక్‌ బ్యాచ్‌ ఎవరు..? దాని వెనుక ఎవరున్నారనేది ఆయన తెలియచేయలేదు.

 'కన్నప్ప'కు శ్రీకారం చుట్టిన మంచు విష్ణు 
మంచు విష్ణు  తన డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తాజాగ వెల్లడించారు.  చాలా రోజులుగా ఈ సినిమా కథ మీద పని చేస్తున్న విష్ణు..  శ్రీ కాళహస్తిలో పూజ కార్యక్రమాలతో ప్రారంభించారు.  త్వరలో చిత్ర షూటింగ్ ప్రారంభిస్తామని వెల్లడించారు. అత్యంత భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియాస్థాయిలో ఈ సినిమాను నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు హీరో విష్ణు.

ఈ చిత్రానికి  మోహన్ బాబు నిర్మాతగా వ్యవహిస్తున్నారు. ఈ సినిమాను అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై నిర్మిస్తున్నారు. మహా భారతం సిరీస్‌కు దర్శకత్వం వహించిన ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్షన్‌లో తెరకెక్కించనున్నారు. ఈ చిత్రంలో ఆదిపురుష్ భామ కృతి సనన్ సోదరి నుపుర్ సనన్ హీరోయిన్‌గా కనిపించనుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement