lawyers
-
విశాఖలో హైకోర్టు బెంచ్ కోరుతూ సదస్సు
విశాఖ : విశాఖలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలంటూ ఉత్తరాంధ్ర న్యాయవాదులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు(ఆదివారం) సదస్సు ఏర్పాటు చేశారు. ఏజెన్సీ ప్రజలకి సైతం విశాఖ అందుబాటులో ఉంటుందని ఉత్తరాంధ్రకు చెందిన ఆరు జిల్లాల న్యాయవాదులు కోరుతున్నారు. హైకోర్టు బెంచ్ విశాఖకు ఇచ్చేంత వరకూ తమ పోరాటం కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు.శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల న్యాయవాదులతో సదస్సు నిర్వహించారు. విఖాఖలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలనే డిమాండ్ గత 20 ఏళ్ల నుంచి కొనసాగుతూ వస్తుందని న్యాయవాదులు అంటున్నారు. విజయవాడలో ఉన్న హైకోర్టుకు వెళ్లాలంటే సుమారు 700 కి.మీ ప్రయాణించాల్సిన కారణంగా ఇక్కడ హైకోర్టు బెంచ్ అనేది అనివార్యమని వారు డిమాండ్ చేస్తున్నారు. -
గౌనును బట్టి గౌరవం లభించదు
న్యూఢిల్లీ: ధరించిన గౌనును బట్టి లాయర్లకు గౌరవం లభించదని సుప్రీంకోర్టు పేర్కొంది. 70 మంది లాయర్లకు ఢిల్లీ హైకోర్టు సీనియర్ హోదాను ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కె. వినోద్ చంద్రన్ల ధర్మాసనం ఈ వ్యాఖ్య చేసింది. గౌనును బట్టి వేరుగా గౌరవం దక్కుతుందని తాము భావించడం లేదని పేర్కొంది. పిటిషన్ వేసిన నెడుంపర అనే లాయర్ వాదనను తోసిపుచ్చుతూ, ‘‘జడ్జిలు కూడా అవసరాన్ని బట్టి రాత్రి దాకా కేసుల విచారణలోనే ఉంటున్నారు. వాళ్లూ మనుషులే. శాయశక్తులా చేయగలిగిందంతా చేస్తున్నారు’’ అని పేర్కొంది. కేసుల సత్వర విచారణకు మరింతమంది జడ్జీల అవసరముందని నెడుంపర తెలపగా ఎక్కువ మంది జడ్జీలను నియమించడం తమ చేతుల్లో లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. -
రాజ్యాంగ సంస్థలు పరిధి దాటొద్దు
సాక్షి, హైదరాబాద్: చట్టసభలు, న్యాయస్థానాల లాంటి రాజ్యాంగ సంస్థలు తమ పరిధి దాటి ఇతర వ్యవస్థల పరిధిలో జోక్యం చేసుకోవద్దని రాజ్యాంగం పేర్కొంటోందంటూ పార్టీ ఫిరాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, న్యాయశాఖ తరఫు న్యాయవాదులు హైకోర్టులో వాదనలు వినిపించారు. దేనికదే హుందాతనాన్ని పాటించాలని, స్పీకర్ పరిధిలోని అంశాల్లో న్యాయ సమీక్ష సాధ్యం కాదని పేర్కొన్నారు. స్పీకర్ తుది నిర్ణయం తీసుకున్న తర్వాత న్యాయస్థానాలు జోక్యం చేసుకునేందుకు కొంత వీలుంటుందని అన్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై నిర్ణయం తీసుకునేందుకు నాలుగు వారాలకు గడువిస్తున్నామని.. ఆలోగా దీనికి సంబంధించిన వివరాలు అందజేయకుంటే తామే ఆదేశాలు జారీ చేయాల్సి వస్తుందని సెప్టెంబర్ 9న స్పీకర్ కార్యదర్శికి హైకోర్టు తేల్చిచెప్పింది. ఈ మేరకు సింగిల్ జడ్జి ఇచ్చిన గడువు సమీపిస్తున్న నేపథ్యంలో ఆ ఉత్తర్వులను రద్దు చేయాలని అసెంబ్లీ కార్యదర్శి గత నెల హైకోర్టు ద్విసభ్య ధర్మాసనాన్ని ఆశ్రయించారు. ఈ అప్పీళ్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జె.శ్రీనివాస్‌రావు ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ చేపట్టింది. ఫిరాయింపు ఎమ్మెల్యేల తరఫున సీనియర్ న్యాయవాది శ్రీరఘురాం, న్యాయశాఖ ముఖ్య కార్యదర్శి తరఫున రవీంద్ర శ్రీవాస్తవ వాదనలు వినిపించారు. ‘కైశం మేఘాచంద్ర సింగ్’లో ముగ్గురు జడ్జిల తీర్పు చెల్లదు ‘చట్టప్రకారం తహసీల్దార్ లాంటి వారి నిర్ణయానికి కూడా నెల సమయం ఉంటుంది. అలాంటిది స్పీకర్ నిర్ణయం తీసుకోవడానికి పిటిషనర్లు కనీసం ఆ సమయం కూడా ఇవ్వలేదు. ఫిరాయింపు పిటిషన్లపై నిర్దిష్ట వ్యవధిలోగా విచారణ పూర్తి చేయాలనే ఉత్తర్వులు ఇస్తే, భవిష్యత్‌లో స్పీకర్ చట్టసభలో ఎలా నిర్ణయాలు తీసుకోవాలో కూడా కోర్టులు ఆదేశాలు జారీ చేసేందుకు ఆస్కారం ఇచ్చినట్లు అవుతుంది. కిహోటో హోలోహన్ (1992) కేసు విచారణ సందర్భంగా ఐదుగురు జడ్జిల సుప్రీంకోర్టు ధర్మాసనం స్పీకర్‌ను ట్రిబ్యునల్‌గా పేర్కొన్నందున.. ఆయన నిర్ణయాలపై సమీక్ష జరపొచ్చు. కానీ నిర్ణయం తీసుకోక ముందు కోర్టుల జోక్యం కూడదు. కైశం మేఘాచంద్ర సింగ్ (2020) కేసు విచారణ సందర్భంగా ముగ్గురు జడ్జిల సుప్రీంకోర్టు ధర్మాసనం.. స్పీకర్ ముందున్న అనర్హత పిటిషన్లపై జోక్యం చేసుకోవచ్చు అని చెప్పింది. అయితే ఐదుగురు జడ్జిల తీర్పు తర్వాత ముగ్గురు జడ్జి ఇచ్చిన తీర్పు చెల్లదు. విస్తృత ధర్మాసనం ఇచ్చిన తీర్పే పరిగణనలోకి తీసుకోవాలి. సింగిల్ జడ్జి ఉత్తర్వులు కూడా స్పీకర్ పరిధిలో జోక్యం చేసుకున్నట్లే ఉన్నాయి..’అని రవీంద్ర శ్రీవాస్తవ, శ్రీరఘురాం వాదనలు వినిపించారు. ప్రభుత్వం తరఫున ఏజీ సుదర్శన్‌రెడ్డి, ఫిరాయింపులపై పిటిషన్ దాఖలు చేసిన బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి తరఫున జె.ప్రభాకర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తరఫున గండ్ర మోహన్‌రావు, పార్టీ ఫిరాయించిన కడియం శ్రీహరి తరçఫున మయూర్‌రెడ్డి హాజరయ్యారు. తదుపరి విచారణను ధర్మాసనం గురువారానికి వాయిదా వేసింది. -
సామాన్యుల భాషలో... సన్నిహితమైన న్యాయం
మన దేశంలోని అన్ని హైకోర్టుల్లో అధికారికంగా వాడేది ఇంగ్లీషు భాష. కానీ కేసులో గెలిచినవాడు, ఓడిన సామాన్యుడు కూడా తమ గెలుపోటములకు కారణాలు అర్థం చేసుకోలేని పరిస్థితి. అందుకే తీర్పుల్లోని కారణాలు అర్థమయ్యే భాషలో తెలియ జేసి, సామాన్యుడికి న్యాయ వ్యవస్థ చేరువ కావాలనే సదుద్దేశ్యంతో సుప్రీంకోర్టు, దేశంలోని అన్ని హైకోర్టులు వారి తీర్పులను ప్రాంతీయ భాషల్లోకి అనువదించి, ఉచితంగా అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. ఇటీవల తెలంగాణ రాష్ట్ర హైకోర్టు తాము ఇంగ్లీషులో వెలువరించే ముఖ్యమైన తీర్పులను తెలుగులోకి అనువాదం చేయించే ప్రక్రియను యుద్ధ ప్రాతి పదికన చేపట్టింది. తదనుగుణంగా ఇంగ్లీషు నుండి తెలుగులోకి తర్జుమా చేయటానికి విశ్రాంత ఉద్యోగులు, విశ్రాంత న్యాయమూర్తులు, న్యాయవాదుల సేవలు వినియోగించుకుంటోంది. అనువాదకుల కొరత మూలాన ప్రస్తుతానికి ముఖ్యమైన తీర్పులకే ప్రాధాన్యం ఇస్తున్నారు. అనువాదకుల సేవలు ఉచితంగా స్వీకరించటం లేదు. వారి సేవలకు గాను, హైకోర్టు ప్రతి పేజీకి మూడు వందల రూపాయలు చెల్లిస్తుంది. ఇంగ్లీషులో వెలువరించిన తీర్పుల కాపీలను వారి ఇంటి దగ్గరే అనువాదం చేసి, సహేతుకమైన సమయంలో అను వాదాన్ని హైకోర్టులోని సంబంధిత అధికారులకు స్వయంగా అందజేయడం లేదా ఆన్లైన్లో పంపించటం అనువాదకుల పని. ఈ కార్యక్రమ సక్రమ నిర్వహణ కోసం హైకోర్టు తన పరిపాలనా భవనంలో ప్రత్యేకంగా ఒక విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఈ విభాగంలో తెలుగు భాషపై పట్టున్న ఇద్దరు విశ్రాంత జిల్లా న్యాయమూర్తులను ఎడిటర్, డిప్యూటీ ఎడిటర్‌గా; ఒక విశ్రాంత సీనియర్ సివిల్ జడ్జిని రిపోర్టర్‌గా నియామకం చేసింది. ఇంగ్లీషు నుండి తెలుగులోకి ప్రైవేటు అనువాదకులు తర్జుమా చేసిన∙ముఖ్యమైన తీర్పులను జాగ్రత్తగా పరిశీలించి, ప్రతి తీర్పుకు అందులో ఉన్నటువంటి ముఖ్యాంశాలను జోడించి, వాటిని తెలంగాణ హైకోర్టు వెబ్సైట్లో నెల వారీగా పెట్టవలసిన బాధ్యత వీరికి అప్పగించింది. వెబ్‌సైట్‌ను 2024 ఆగస్టు 15న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ ముఖ్య మైన తీర్పుల తెలుగు ప్రతులను ఉచితంగా డౌన్లోడ్ చేసుకొని చదువుకునే అవకాశం కల్పించారు. అనువాదకులను శాశ్వత ప్రాతిపదికన నియమించుకోడానికి, రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు అనుమతి ఇచ్చింది. 25 తెలుగు అనువాదకులు, 10 డేటా ఎంట్రీ ఆపరేటర్లు, 5 తెలుగు టైపిస్ట్ పోస్టులను కూడా మంజూరు చేసింది. త్వరలో హైకోర్టు ఈ పోస్టులను భర్తీ చేసే అవకాశం లేకపోలేదు. తెలుగు అనువాదకులు దొరకటం అంత సులభమేమీ కాదు. ఎందుకంటే తెలంగాణ సచివాలయంలో కూడా ఈ కొరత ఉందని తెలుస్తోంది.మరో విషయమేమంటే ప్రతి పౌరుడికీ హైకోర్టు వెబ్సైట్ ద్వారా ముఖ్యమైన తెలుగు తీర్పులను డౌన్ లోడ్ చేసుకునే సౌలభ్యం ఉందనే విషయం తెలియ జేయాలనే ఆశయంతో... జిల్లా న్యాయమూర్తులు, జిల్లా, మండల న్యాయ సేవాధికార సంస్థలు; సంబంధిత జిల్లా ప్రభుత్వ అధికారులు న్యాయ విజ్ఞాన సదస్సుల ద్వారా ప్రచారం కల్పించాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇంతగా ప్రచారం కల్పించినా తెలుగులో తీర్పులు చదువుకోవాలనుకునే విషయం, అది ప్రజలకు ఉచితంగా అందుబాటులో ఉందనే విషయం అంత సులువుగా సామాన్యుడికి తెలియక పోవచ్చు. అవగాహన కల్పించటానికి సకల ప్రయత్నాలు చేయటానికి న్యాయ వ్యవస్థ గట్టిగానే కృషి చేయాలి. దీనికి న్యాయవాదుల పాత్ర పరిమితమని అనుకోవద్దు. ఈ ప్రక్రియ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, కక్షిదారులు తాము దాఖలు చేసిన కేసుల్లో న్యాయ మూర్తులు ఇంగ్లీషులో వెలువరించిన తీర్పులను తమ భాషలో చదివి అర్థం చేసుకొని సంతృప్తి పడాలనే దృక్పథం. అనువాదం అంటే ప్రస్తుత కాలంలో ఎవరికీ అర్థం కాని పూర్తి గ్రాంథిక భాషా ప్రయోగం చేయకుండా, వ్యవహారిక భాషను వాడాలనీ, అవసరమైతే దైనందిన ఇంగ్లీషు పదాలను అదే విధంగా వాడాలనీ హైకోర్టు సూచన చేసింది. టెక్నాలజీ అతి వేగంగా దూసుకుపోతున్న ప్రస్తుత కాలంలో, ఇప్పటికే హైకోర్టులో ఎలక్షన్ పిటిషన్లలో రికార్డ్ చేసిన సాక్ష్యాల నకళ్ళను అప్పటికప్పుడు ఇరు పక్షాలకు ఉచితంగా అందజేసే ఏర్పాటు ఉంది. అదే విధంగా హైకోర్టు రిజిస్ట్రీ జోక్యం లేకుండా, తీర్పు చెప్పిన రోజే తీర్పు ప్రతిని ఇరుపక్షాలకు కోర్టులోనే ఉచితంగా అందజేయాలి. దిగువ కోర్టుల్లో కూడా సివిల్, క్రిమినల్ తీర్పు అనే భేదం లేకుండా, ఇదే పద్ధతి పాటించడానికి ఎటువంటి ఆటంకం ఉండకపోవచ్చు. అయితే నూటికి నూరు శాతం తీర్పుల తెలుగు అనువాదం సరైనది లేదా తప్పులు లేనిదని చెప్పలేం. ఈ తెలుగు తీర్పుల అనువాదం కేవలం చదువుకొని అర్థం చేసుకోవడానికి మాత్రమే పరిమితం. తెలుగు అనువాదం ఆధారంగా ఎవరు కూడా తప్పొప్పులు ఎంచి దానిపై అప్పీళ్ళు వేసే అవకాశం లేదు. ఇందు కోసం హైకోర్టు వెబ్సైట్లో డిస్ క్లెయిమర్ కూడా చొప్పించారు.తడకమళ్ళ మురళీధర్ వ్యాసకర్త విశ్రాంత జిల్లా జడ్జిమొబైల్: 98485 45970 -
న్యాయ వ్యవస్థపై ఏఐ ప్రభావం
కృత్రిమ మేధ (ఏఐ) ప్రభావం అన్ని రంగాలపైనా విశేషంగా పడుతోంది. అందులో భాగంగానే న్యాయ వ్యవస్థనూ అది ప్రభావితం చేస్తోంది. ఏఐతో న్యాయమూర్తుల పని సులువవుతుంది. దేశంలో లక్షల సంఖ్యలో ప్రాక్టీసు చేస్తున్న న్యాయవాదులు సాధ్యమైనంత త్వరగా ఏఐ వినియోగంలో నైపుణ్యాన్ని అందిపుచ్చుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. న్యాయ శాస్త్రంలోని అనేక అంశాలు చిటికెలో ఏఐ ద్వారా అందుబాటు లోకి వచ్చే అవకాశం ఉంది. అందువల్ల న్యాయ వ్యవస్థలో ఉన్నవారి పని భారం తగ్గుతుంది. మొత్తం మీద ఏఐ వల్ల న్యాయవ్యవస్థ ఎలా లాభం పొందుతుందో ఇక్కడ చూద్దాం:ఏఐ కేసు డేటాను విశ్లేషించడానికీ, ఫలితా లను అంచనా వేయడానికీ, నమూనాలను గుర్తించడానికీ సాయపడుతుంది. న్యాయ మూర్తులు అదనపు సమాచారంతో నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది. ఏఐ ఆధారిత సాధనాలు న్యాయవాదులు, న్యాయమూర్తులకు సంబంధిత చట్టాల పూర్వాపరాలు, కేస్ స్టడీస్, పరిశోధనలో సమయం ఆదా చేయడంలో సహాయ పడతాయి. ఏఐ ఆధారిత చాట్ బాట్లు వర్చువల్ కోర్టు ప్రొసీడింగ్స్‌లో సహాయ పడతాయి. షెడ్యూల్ చేయడం, రిమైండర్లు, ప్రాథమిక విచారణల వంటి పనులలో సహాయ పడతాయి. ఏఐ ఆధా రిత న్యాయ సహాయం, మద్దతును అందించడం ద్వారా... ముఖ్యంగా అట్టడుగు వర్గాలు న్యాయం పొందడంలో అంతరాన్ని తగ్గించవచ్చు. ఏఐ రొటీన్ టాస్క్‌ను ఆటోమేట్ చేయగలదు. న్యాయ మూర్తులు, న్యాయస్థాన సిబ్బందిని మరింత సంక్లిష్టమైన, అధిక విలువైన పనులపై దృష్టి పెట్టేలా చేస్తుంది. న్యాయ ప్రక్రియలను మెరుగు పరచడానికి, జాప్యాలను తగ్గించడానికి, న్యాయ వ్యవస్థకు గల మొత్తం సామర్థ్యాన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది.ఏజీఐ... అంటే ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలి జెన్స్ (కృత్రిమ సాధారణ బుద్ధి) ఒక భావితర హిత ఏఐ వ్యవస్థను సూచిస్తుంది. ఇది మనుషుల మేధస్సుకు సమానంగా విభిన్న పనులను అర్థం చేసుకోవడం, నేర్చుకోవడం జ్ఞానాన్ని అనేక విభాగాల్లో ఉపయోగించే సామర్థ్యాలు కలిగి ఉంటుంది. ఉదాహరణకు: కారణాలు చెప్పడం, సమస్యలను పరిష్కరించడం; అనుభవం నుంచి నేర్చుకోవడం; సహజ భాషను అర్థం చేసుకోవడం, వివిధ రంగాల్లో జ్ఞానాన్ని ఉపయోగించడం వంటి పనులకు ఇది బాగా ఉపయోగపడుతుంది.ఏఐ పరిశోధనలో ఏజీఐని పవిత్ర కాంక్షగా పరిగణిస్తారు. ఎందుకంటే ఇది అపారమైన అవకా శాలను తెచ్చిపెడుతుంది. అయితే ఏజీఐ ఇంకా పరిశోధన, అభివృద్ధి దశలోనే ఉంది. ఏఐ సాధానాలతో సమర్థవంతంగా పని చేయడానికి వ్యూహం, న్యాయవాదులకు, కక్షి దారులకు కౌన్సెలింగ్ వంటి అధిక విలువ గల పనులపై దృష్టి పెట్టడానికి, న్యాయవాదులు కొత్త నైపుణ్యాలను పెంచుకోవాల్సి ఉంటుంది. న్యాయ వాద వృత్తిలో జూనియర్లు, లేదా పారాలీగల్స్ వంటి నిర్దిష్ట పాత్రలను ఏఐ స్థానభ్రంశం చేయ గలదు. సబ్స్క్రిప్షన్ ఆధారిత చట్టపరమైన సేవలు, ఏఐ ఆధారిత లీగల్ కన్సల్టింగ్ వంటి కొత్త వ్యాపార నమూనాలను ఏఐ ప్రారంభించగలదు.చట్టపరమైన ఆచరణలో ఏఐ ఉపయోగం, నిర్ణయాధికారం పారదర్శకంగా, జవాబుదారీ తనంగా ఉండేలా చూసుకోవడం వంటి నియంత్రణ సమస్యలను లేవనెత్తవచ్చు. న్యాయవాదులు ఏఐపై ఎక్కువగా ఆధారపడవచ్చు. దీని వల్ల అవ సరమైన నైపుణ్యాలను, నిర్ణయాన్ని (తీర్పును) కోల్పోయే అవకాశం ఉంది. ఏఐ ఆధారిత చట్ట పరమైన సాధనాలు డేటా చౌర్యం, ఉల్లంఘనల వంటి ప్రమాదాన్ని పెంచుతాయి.న్యాయవాదులు ఏఐని ఉపయోగించడంలో నైతికపరమైన చిక్కులను పరిగణనలోకి తీసు కోవాలి. ఏఐ తీసుకునే నిర్ణయం న్యాయంగా, నిష్పక్ష పాతంగా ఉండేలా చూసుకోవాలి. నైపుణ్యా లను సాధ్యమైనంత త్వరగా పెంచుకోవడం ద్వారా భవిష్యత్తులో ఏఐ నుంచి ఎదురయ్యే సవా ళ్లను దీటుగా ఎదుర్కోవచ్చు. వృత్తిపరంగా విజ యవంతంగా ముందుకు వెళ్లవచ్చు. అయితే ఈ వ్యస్థపై నిరంతర పరిశీలన, పర్యవేక్షణ ఉండాలి.– ఆగూరు ఉమామహేశ్వరరావు సీనియర్ న్యాయవాది -
హైకోర్టు ఇస్తారా.. ప్రత్యేక రాష్ట్రం చేస్తారా.. చంద్రబాబుకి లాయర్లు డిమాండ్
-
ధిక్కార ‘స్వర’ భాస్కరం!
స్వర భాస్కర్... బాలీవుడ్ హీరోయిన్, నటిగా కొందరికి తెలుసు. హిందుత్వ వ్యతిరేకిగా... తప్పును తప్పు అని ఎత్తిచూపగల వ్యక్తిగా మరికొందరికి పరిచయం! ముస్లిం స్నేహితుడిని పెళ్లాడి.. ఇటీవలే తల్లిఅయిన స్వర భాస్కర్ తాజాగా మళ్లీ తన ధిక్కార స్వరంతో మళ్లీ వార్తల్లోకి ఎక్కారు. న్యాయస్థానాలు, న్యాయమూర్తుల తీరును నేరుగా ప్రశ్నించారు. ఏళ్లుగా నిర్బంధంలో మగ్గుతున్న జేఎన్‌యూ విద్యార్థి నేత ఉమర్ ఖలీద్, గుజరాత్ ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్ వంటి వారికి మద్దతుగా ఏర్పాటైన ఒక కార్యక్రమంలో స్వర భాస్కర్ మాట్లాడుతూ... ‘‘నేను ఈ రోజు న్యాయవ్యవస్థను ఒక ప్రశ్న అడగదలిచాను. దేనికి మీకు భయం? సామాన్య ప్రజలకైతే బతుకు సాగాలన్న భయం ఉంటుంది. ఎవరైనా దాడి చేసి కొడతారన్న భయం ఉంటుంది. దేశంలో ముస్లింలను ఎక్కడపడితే అక్కడ దాడి చేసి కొట్టేస్తున్నారు. పాపం ఈ దేశంలో దళితులపై కూడా విచ్చలవిడి దాడులు జరుగుతున్నాయి. మాలాంటి వాళ్లకు కూడా పని దొరకదనో.. కామెడీ షోల్లాంటివి చేయనివ్వరని, నటించిన సినిమాలు రిలీజ్ కాకుండా అడ్డుకంటారనో భయాలు ఉండవచ్చు. మరి మీకే రకమైన భయాలు ఉన్నాయి? అధికారం మీ చేతుల్లో ఉంది. ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ఉంది. అరవై, డెబ్భై ఏళ్ల వయసు వాళ్లు.. హైకోర్టుల్లో, సుప్రీంకోర్టుల్లోకి చేరిపోతున్నారు. మీ పిల్లలు కూడా పెద్దవాళ్లై పోయి ఉంటారు. ఖరీదైన.. మంచి కాలేజీల్లో, విదేశాల్లో చదువుకుని ఉంటారు. పెళ్లాం పిల్లలతో వాళ్లు జీవితంలో స్థిరపడి పోయి ఉంటారు. అలాంటి మీకు ఈ వృద్ధాప్యంలో ఎందుకు భయం? ఇంకా ఎలాంటి ఆశ మిగిలిపోయింది మీలో? ఏం కావాలి మీకు? రాజ్య సభ సభ్యత్వం, గవర్నర్ పదవుల అవసరం ఏమిటి? ఇన్ని ఆశలు పెట్టుకున్న మీరు మీ పని చేయమని మాత్రమే కదా మేము అడుగుతున్నది? అది కూడా మీరు చేయలేకపోతున్నారు ఎందుకు?’’ అంటూ న్యాయవ్యవస్థపై, న్యాయమూర్తులపై ప్రశ్నల వర్షం కురిపించారు.Why are you so scared at this age? What is the greed you have at this age? Do you want a Governor or Rajya Sabha post at this age?- @ReallySwara#UmarKhalidpic.twitter.com/2CSyEGWUFL— Mohammed Zubair (@zoo_bear) September 18, 2024 ఉమర్, ఖాలిద్, అతర్, గుష్ఫా, షెర్జీల్ ఇమామ్ వంటి ఎందరో మూడు నాలుగైదేళ్లుగా జైళ్లలో మగ్గిపోతున్నారని గుర్తు చేసిన స్వర.. ‘‘న్యాయవ్యవస్థ వీరిని పూర్తిగా మరచిపోయినట్లు అనిపిస్తోంది’’ అని వ్యాఖ్యానించారు. బెయిల్ లేకుండా.. విచారణ కూడా మొదలు కాకుండా ఇలాంటి వాళ్లు ఎంతకాలం నుంచి మగ్గిపోతున్నారో కూడా న్యాయవ్యవస్థ పట్టించుకోవడం లేదని అన్నారు. ‘‘అందుకే నేను ఈ వేదికపై నుంచి నాలుగేళ్ల కాలం అనేది ఎంత పెద్ద సమయమో చెప్పదలుచుకున్నాను. ఉమర్ ఖలీద్ 2020 సెప్టెంబరులో ఇరవయ్యవ తేదీ అరెస్ట్ అయ్యాడు. ఆ తరువాత మూడుసార్లు కోవిడ్ వచ్చి పోయింది. వ్యాధి కారక వైరస్ మూడు నాలుగు మార్లు రూపం మార్చుకుంది కూడా. ప్రాణాంతక మహమ్మారి జబ్బుకు చికిత్స కూడా దాదాపుగా అందుబాటులోకి వచ్చింది. నాలుగేళ్ల క్రితం ఫహాద్ (భర్త)ను కలిశా. అప్పట్లో ఇద్దరి మధ్య స్నేహం మాత్రమే ఉండింది. తరువాత మా దోస్తీ కాస్తా ప్రేమగా మారింది.. రెండు కుటుంబాలు కలిసి మాట్లాడుకున్నాయి. పెళ్లికి నిర్ణయించాం. అదీ పూర్తయ్యింది. కానీ... అప్పుడూ.. ఇప్పుడూ వాళ్లు (ఉమర్ తదితరులు) జైళ్లల్లోనే ఉండిపోయారు. బెయిల్ రాలేదు.. విచారణ మొదలు కాలేదు.’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. -
Supreme Court: మా విశ్వాసం చెదిరిపోతోంది
న్యూఢిల్లీ: వివిధ కేసుల్లో జైలు శిక్ష పడిన దోషులను శిక్షాకాలం ముగియకముందే కారాగారం నుంచి బయటకు రప్పించడానికి న్యాయవాదులు తప్పుడు మార్గాలు అనుసరిస్తున్నారని సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తంచేసింది. కోర్టు ముందు పదేపదే తప్పుడు స్టేట్మెంట్లు ఇస్తున్నారని ఆక్షేపించింది. దోషులకు శిక్షాకాలం తగ్గించాలని కోరుతూ దాఖలు చేసే పిటిషన్లలోనూ అసత్య సమాచారం చేరుస్తున్నారని విమర్శించింది. ఇలాంటి కేసులు ఎదురైనప్పుడు తమ విశ్వాసం చెదిరిపోతోందని స్పష్టంచేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ అభయ్ ఎస్.ఓకా, జస్టిస్ అగస్టీన్ జార్జి మాసీతో కూడిన ధర్మాసనం ఈ నెల 10వ తేదీన ఒక ఉత్తర్వు జారీ చేసింది. ఈ ఉత్తర్వును తాజాగా సుప్రీంకోర్టు వెబ్సైట్లో పొందుపర్చారు. ఖైదీల రెమిషన్ విషయంలో లాయర్ల తప్పుడు స్టేట్మెంట్లపై ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘మూడు వారాలుగా ఇలాంటి కేసులను పెండింగ్‌లో పెట్టాం. పరి్మనెంట్ రెమిషన్ మంజూరు చేయడం లేదు. అయినా ఇందుకోసం భారీగా తప్పుడు పిటిషన్లు దాఖలవుతున్నాయి’’ అని ధర్మాసనం ఆగ్రహించింది. -
Supreme Court: లాయర్లుగా ఎన్రోల్కు అంత ఫీజా?
న్యూఢిల్లీ: న్యాయవాద వృత్తిలోకి అడుగుపెట్టేందుకు లాయర్లుగా ఎన్రోల్చేసుంటున్న న్యాయశాస్త్ర పట్టభద్రుల నుంచి రాష్ట్రాల బార్ కౌన్సిళ్లు(ఎస్బీసీ) భారీ స్థాయిలో ఫీజులు వసూలుచేయడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. నిబంధనల ప్రకారం ఎస్సీ–ఎస్టీ కేటగిరీ లా పట్టభద్రుల నుంచి రూ.125 ఫీజు, జనరల్ కేటగిరీ నుంచి రూ.750 మించి వసూలుచేయకూడదని ధర్మాసనం ఆదేశించింది. ఎస్బీసీలు వసూలుచేస్తున్న విపరీతమైన ఫీజుల కారణంగా అణగారిన, ఆర్థికంగా వెనకబడిన వర్గాల పేద, మధ్యతరగతి లా పట్టభద్రులు న్యాయవృత్తిలోకి రాలేని పరిస్థితి నెలకొంటోందని, వారు ఈ వృత్తిలో భాగస్వాములయ్యే అవకాశాలు తగ్గిపోతాయని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆవేదన వ్యక్తంచేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్ధివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాల ధర్మాసనం ఈ తీర్పు వెలువరిచింది. -
న్యాయవాదులపై అక్రమ కేసులు బనాయిస్తే సహించం
విజయవాడస్పోర్ట్స్: గుంటూరు జిల్లా మంగళగిరి టీడీపీ కార్యాలయంపై మూడేళ్ల కిందట జరిగిన దాడి ఘటనలో న్యాయవాది ఒగ్గు గవాస్కర్‌ను నిందితుడుగా చేర్చడాన్ని బెజవాడ బార్ అసోసియేషన్(బీబీఏ) న్యాయవాదులు తప్పుబట్టారు. రాజకీయ కోణంలో జరిగిన ఈ దాడి ఘటనలో న్యాయవాదులను ఇరికించేందుకు మంగళగిరి రూరల్ పోలీసులు కుట్రపూరితంగా వ్యవహరించడం సబబు కాదని అభిప్రాయపడ్డారు. డిఫెన్స్ తరుఫున న్యాయస్థానానికి వాదనలు వినిపించేందుకు వెళ్లిన గవాస్కర్‌పై తాజాగా కేసు నమోదు చేసి ఇబ్బందులకు గురి చేసేందుకు పోలీసులు ప్రయత్నాలు చేయడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. పోలీసుల తీరును ఖండిస్తూ బీబీఏ న్యాయవాదులు విధులు బహిష్కరించి గవాస్కర్‌కు సంఘీభావంగా విజయవాడ సివిల్ కోర్టుల ప్రాంగణం వద్ద సోమవారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా బీబీఏ అధ్యక్షుడు కొత్త చంద్రమౌళి మాట్లాడుతూ 2021లో టీడీపీ కార్యాలయంపై దాడి జరిగిందని, అప్పట్లోనే పోలీసులు నిందితులపై కేసులు నమోదు చేశారన్నారు. అయితే పలువురు నిందితుల తరుఫున వకల్తా పుచ్చుకున్న గవాస్కర్‌పై తాజాగా కేసు నమోదు చేసి 88వ నిందితుడిగా చేర్చడం ఎంతవరకు సబబని ప్రశి్నంచారు. సీనియర్ న్యాయవాది గౌతంరెడ్డి మాట్లాడుతూ పోలీసులు ఈ చర్యలను వెంటనే ఉపసంహరించుకోకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. న్యాయవాది గవాస్కర్ మాట్లాడుతూ ఈ కేసులో తన పేరు ఉందని వారం కిందటి వరకు తనకు తెలీదన్నారు. నాలుగు రోజుల క్రితం కోర్టుకు వెళితే హత్యాయత్నం కేసులో నిందితుడిగా తన పేరును పోలీసులు చేర్చడంతో ఒక్క సారిగా ఖంగుతిన్నట్టు చెప్పారు. ఇదేంటని ప్రశి్నస్తే.. పై నుంచి వచ్చిన ఒత్తిడి కారణంగా కేసు నమోదు చేయాల్సి వచ్చిందని పోలీసులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. అనంతరం పోలీసుల తీరుకు నిరసనగా న్యాయవాదులు ఫ్లకార్డులను ప్రదర్శించారు. ఆందోళన కార్యక్రమంలో న్యాయవాదులు మన్మథరావు, నిర్మల్రాజేష్, కోటంరాజు, బసవరెడ్డి, సాయిరామ్, ఆదాం, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. -
కేజ్రీవాల్ బెయిల్ నిలిపివేత.. సీజేఐకు 150 మంది న్యాయవాదుల లేఖ
న్యూఢిల్లీ: లిక్కర్ పాలసీ కుంభకోణం కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ట్రయల్ కోర్టు మంజూరు చేసిన బెయిల్ ఆదేశాలను ఢిల్లీ హైకోర్టు నిలిపివేయడంపై 150 మంది న్యాయవాదులు ఆందోళన వ్యక్తం చేశారు. కోర్టులు ఆచరిస్తున్న అసాధారణ పద్ధతులపై జోక్యం చేసుకోవాలని కోరుతూ భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) డీవై చంద్రచూడ్‌కు లేఖ రాశారు.లిక్కర్ కేసులో కేజ్రీవాల్‌కు రౌస్ అవెన్యూ కోర్టు మంజూరు చేసిన బెయిల్ ఆర్డర్ ఉత్తర్వులు ఆప్‌లోడ్ చేయడానికి ముందే ఢిల్లీ హైకోర్టులో ఈడీ ఎలా సవాల్ చేసింది?, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుధీర్ కుమార్ జైన్ ఈడీ సవాల్‌పై ఎలా విచారణ చేపట్టి ఆర్డర్‌ను హోల్డ్‌లో ఉంచారు? బెయిల్ అమలును ఎలా నిలిపివేశారు? అని ప్రశ్నించారు. భారత న్యాయవ్యవస్థ చరిత్రలో ఇలాంటివి ఎప్పుడూ చూడలేదని, ఇది న్యాయవాదుల్లో తీవ్ర ఆందోళన రేకెత్తించిందని 9 పేజీల లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు.అదే విధంగా న్యాయవాదుల సమర్పణలను న్యాయమూర్తులు తమ ఆదేశాలలో రికార్డ్ చేయడం లేదని న్యాయవాదులు ఆరోపించారు. ఇది కోర్టు చరిత్రలో మొదటిసారి అని, ఇది చాలా అసాధారణమైనదని పేర్కొన్నారు. దీనిని సరిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. విచారణ సమయంలో చేసిన సమర్పణలను న్యాయవాదుల ముందు, కేసు వాయిదా వేయడానికి ముందు రికార్డ్ చేయాలని ఆదేశాలు జారీ చేయవలసిందిగా అభ్యర్ధించారు.బెయిల్ మంజూరులో జాప్యం గురించి ప్రస్తావిస్తూ.. ‘ముఖ్యంగా ఈడీ, సీబీఐకు సంబంధించిన కేసుల్లో న్యాయమూర్తులు ఎక్కువ వ్యవధిలో విచారణ తేదీలు ఇస్తారు. బెయిల్ విషయాలను త్వరగా పరిష్కరించరు. న్యాయ సూత్రాలకు, రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛ హామీకి ఇది విరుద్ధం.ఈ దేశ ప్రజలు ఎంతో ఆశతో, విశ్వాసంతో న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు. ఈ నమ్మకాన్ని న్యాయవ్యవస్థ, న్యాయ సంఘం సమర్థించాల్సిన అవసరం ఉంది. ఈ క్రమంలోనే మా ఆందోళనలను మీతో పంచుకుంటున్నాం. వీటిని త్వరగా సరిదిద్దుతారని ఆశిస్తున్నాం.’ అని లేఖలో ప్రస్తావించారు. -
మంచి న్యాయవాది వద్ద శిష్యరికం చేయండి
సాక్షి, అమరావతి: యువ న్యాయవాదులు వృత్తి మెళకువలు నేర్చుకుని పైకి రావాలంటే ఓ మంచి న్యాయవాదిని ఎంపిక చేసుకొని, ఆయన వద్ద శిష్యరికం చేయాలని ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి, ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) చైర్మన్ జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి తెలిపారు. మంచి న్యాయవాది అంటే ఆర్థికంగా బలం ఉన్న వ్యక్తి కాదని, న్యాయశాస్త్రంలో అంశాల మీద మంచి పట్టున్న వ్యక్తి అని చెప్పారు. అలాంటి వ్యక్తి వద్ద చేరితే కేసులను వాదించే అవకాశం దక్కి, మన సామర్థ్యాన్ని నిరూపించుకునే అవకాశం వస్తుందని, తద్వారా వృత్తిలో ముందుకెళ్లే అవకాశం దొరుకుతుందని చెప్పారు.వాదించే అవకాశం సులభంగా రాదని, బాగా కష్టపడాలని ఉద్బోధించారు. తాను కూడా అలా కష్టపడితేనే ఈ రోజు ఈ స్థానంలో ఉన్నానన్నారు. యువ న్యాయవాదులకు రాష్ట్ర న్యాయవాద మండలి (బార్ కౌన్సిల్), కేఎల్ యూనివర్సిటీ సంయుక్తంగా నిర్వహిస్తున్న మూడు రోజుల శిక్షణ తరగతుల్లో రెండో రోజు శనివారం “ఆర్ట్ ఆఫ్ అడ్వొకసీ’ అనే అంశంపై జస్టిస్ నాగార్జునరెడ్డి మాట్లాడారు. కేవలం వాదనలు వినిపిస్తే సరిపోదని, వాదనలు ఎలా వినిపించాలో నేర్చుకోవాలని, అది ఓ కళ అని తెలిపారు. ఆ కళని ఒంటబట్టించుకుంటేనే విజయవంతమైన న్యాయవాది అవుతారన్నారు. ఎప్పటికప్పుడు కొత్త సాంకేతికతను అందిపుచ్చుకోవాలని తెలిపారు.అందరిలో ఒకరిలా ఉండిపోకండి‘న్యాయ పాలనలో న్యాయవాదులు, న్యాయమూర్తుల పాత్ర’ అన్న అంశంపై సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు మాట్లాడారు. న్యాయమూర్తిగాకంటే న్యాయవాదిగా తాను ఎక్కువ ఆనందంగా ఉన్నానని ఆయన చెప్పారు. మూడుసార్లు తాను న్యాయమూర్తి పోస్టును తిరస్కరించానని, చివరకు విధి లేని పరిస్థితుల్లో ఆ పోస్టును అంగీకరించాల్సి వచ్చిందన్నారు. ఆ మరుసటి రోజే తన అంగీకారన్ని ఉపసంహరించుకుంటానని అప్పటి ప్రధాన న్యాయమూర్తిని కోరానని, అప్పటికే జాబితా కేంద్ర ప్రభుత్వానికి వెళ్లిపోవడంతో అది సాధ్యం కాలేదని తెలిపారు.తాను ఎక్కడో చిన్న పల్లెలో పుట్టి ఈ స్థాయికి రావడం వెనుక ఎంతో కృషి ఉందన్నారు. ఎప్పుడూ పెద్ద కలలు కనాలని, అప్పుడే ఖచ్చితంగా ఏదో ఒక స్థానానికి చేరుకుంటారని, అసలు కలలు కనకుంటే ఏ స్థాయికీ రాలేరని తెలిపారు. అందరిలో ఒకరిలా ఉండపోకూడదని, మనకంటూ ఓ ప్రత్యేకత ఉండేలా చూసుకోవాలని చెప్పారు. న్యాయస్థానాల్లో సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులను పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. న్యాయవ్యవస్థపై ఉన్న ప్రతికూల అభిప్రాయాన్ని తొలగించాల్సిన బాధ్యత న్యాయవాదులపై ఉందన్నారు. అనంతరం జస్టిస్ నాగార్జునరెడ్డి, జస్టిస్ లావు నాగేశ్వరరావును బార్ కౌన్సిల్ చైర్మన్ ఎన్.ద్వారకనాథరెడ్డి, ఇతర సభ్యులు ఘనంగా సన్మానించారు.కక్షిదారుడు న్యాయవాదులకు దేవుడుమనకు కేసు అప్పగించే కక్షిదారుడిని ఎప్పుడూ దేవుడిలా చూడాలని జస్టిస్ నాగార్జునరెడ్డి చెప్పారు. కక్షిదారుడిని అవమానించడం, తక్కువ చేసి చూడటం, అతనితో కర్కశంగా మాట్లాడటం వంటివి చేయకూడదన్నారు. కక్షిదారుడు ఇచ్చే ఫీజుతో మన కుటుంబాలు నడుస్తున్నాయన్న విషయాన్ని విస్మరించకూడదని స్పష్టం చేశారు. అలాగే కక్షిదారుల నుంచి వసూలు చేసే ఫీజుల విషయంలో కూడా సహేతుకంగా ఉండాలని హితవు పలికారు. -
మేమంతా సిద్ధం బస్సు యాత్రకు న్యాయవాదుల స్వాగతం
-
సీజేఐ డీవై చంద్రచూడ్ కు ప్రముఖ న్యాయవాదుల లేఖ
-
సీజేఐకి 600 మంది న్యాయవాదుల సంచలన లేఖ
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్‌కు సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ మనన్ కుమార్ మిశ్రా సహా దాదాపు 600 మంది ప్రముఖ న్యాయవాదులు లేఖ రాశారు. పొలిటికల్ అజెండాతో కొన్ని ‘ప్రత్యేక బృందాలు’ తమ స్వార్థ ప్రయోజనాల కోసం న్యాయ వ్యవస్థపై ఒత్తిడి తెచ్చేందుకు, న్యాయస్థానాల పరువు, ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. న్యాయవ్యవస్థ సమగ్రతను దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. లేఖ రాసిన వారిలో ప్రముఖ న్యాయవాది హరీశ్ సాల్వే, మనన్ కుమార్ మిశ్రా, ఆదిష్ అగర్వాల్, చేతన్ మిట్టల్, పింకీ ఆనంద్, హితేష్ జైన్, ఉజ్వల వార్, ఉదయ్ హోల్లా, స్వరూపమా చతుర్వేది, సహా దేశవ్యాప్తంగా 600 మందికిపైగా న్యాయవాదులు ఉన్నారు. వీరంతా లేఖలో ఒకవర్గం న్యాయమూర్తులను తమ పేర్లు ప్రస్తావించకుండా టార్గెట్ చేస్తూ ఈ ఆరోపణలు చేశారు. కొందరు లాయర్లు పగటిపూట రాజకీయ నాయకులను సమర్థించి.. రాత్రిపూట మీడియా ద్వారా న్యాయమూర్తులను ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ముఖ్యంగా రాజకీయ నేతలకు సంబంధించిన అనేక కేసుల్లో వారు కోర్టు తీర్పులను ప్రభావితం చేసేందుకు ఒత్తిళ్లకు గురి చేస్తున్నాయని ఆరోపించారు. ఇందుకోసం వారు అనేక మార్గాలను అనుసరిస్తున్నారు. కోర్టులపై ప్రజల్లో విశ్వాసాన్ని తగ్గించేందుకు న్యాయస్థానాల కీలక తీర్పులపై తప్పుడు కథనాలు సృష్టిస్తున్నారని పేర్కొన్నారు. కోర్టు నిర్ణయాలు తమకు అనుకూలంగా రాకపోతే వెంటనే బహిరంగ విమర్శలకు దిగుతున్నారని అన్నారు. సోషల్ మీడియాలో అవాస్తవాలను ప్రచారం చేస్తూ న్యాయమూర్తులపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. వ్యక్తిగత, రాజకీయ కారణాలతో కోర్టు ప్రతిష్ఠను దెబ్బతీసే ఇలాంటి ప్రయత్నాలను తిప్పికొట్టాలన్నారు. న్యాయస్థానాల కోసం నిలబడాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. ఈ లేఖను మార్చి 26 రాసినట్లు సమాచారం. చదవండి: కేజ్రీవాల్‌ను సీఎంగా తొలగించలేం: ఢిల్లీ హైకోర్టు -
జీజేఆర్ క్రికెట్ టోర్నీ విజేత ‘హైకోర్టు’ జట్టు
సాక్షి,హైదరాబాద్: హైదరాబాద్ మెట్రోపాలిటన్ క్రిమినల్ కోర్టు న్యాయవాదుల క్రికెట్ అసోసియే షన్ ఆధ్వర్యంలో జరిగిన జీజేఆర్ టోర్నమెంట్ పోటీల్లో హైకోర్టు న్యాయవాదుల జట్టు విజేతగా నిలిచింది. ఫైనల్ విజేతగా నిలిచిన జట్టుకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూరేపల్లి నందా శనివారం కప్‌ను అందజేశారు. బోడుప్పల్‌లోని సాగర్ క్రికెట్ గ్రౌండ్, ఆరంఘర్లోని విజయానంద్ క్రికెట్ గ్రౌండ్లో జరిగిన పోటీల్లో నగరంలోని 13 కోర్టుల న్యాయవాదులు పాల్గొన్నారు. సెమీ ఫైనల్లో సిటీ సివిల్ కోర్టు న్యాయవాదుల జట్టు (78)పై హైకోర్టు టీమ్(79) విజయం సాధించింది. అనంతరం జరిగిన ఫైనల్లో హైకోర్టు జట్టు... హైదరాబాద్ మెట్రోపాలిటన్ క్రిమినల్ కోర్టు టీమ్‌పై గెలుపొందింది. మ్యాన్ ఆఫ్‌ది ఫైనల్లో బెస్ట్ బ్యాట్స్‌మన్‌గా వి.మనోహర్, బెస్ట్ బౌలర్‌గా సాయిచందర్ నిలిచారు. ఈ కప్ అందజేత కార్య క్రమంలో బార్ కౌన్సిల్ వైస్ చైర్మన్ కె.సునీల్‌గౌడ్, కౌన్సిల్ సభ్యుడు జితేందర్‌రెడ్డి, కటకం శారద, శ్రీనివాస్, సత్యనారాయణ పాల్గొన్నారు. -
హైకోర్టు ఆగ్రహం.. న్యాయవాదులు సమ్మె విరమించాల్సిందే
సాక్షి, అమరావతి: ఏపీ భూ యాజమాన్య హక్కుల చట్టాన్ని వ్యతిరేకిస్తూ సమ్మె చేస్తున్న న్యాయవాదులపై హైకోర్టు మండిపడింది. సమ్మె విరమించి తీరాల్సిందేనని అల్టిమేటం జారీ చేసింది. సమ్మె విరమించని పక్షంలో ఆ న్యాయవాదులపై చర్యలు తీసుకోవాలని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ), రాష్ట్ర బార్ కౌన్సిల్‌ను ఆదేశించింది. ఏపీ భూ యాజమాన్య హక్కుల చట్టం విషయంలో న్యాయవాదుల ప్రయోజనాలను పరిరక్షిస్తూ తాము మధ్యంతర ఉత్తర్వులిచ్చినా.. జిల్లాల్లో న్యాయవాదులు ఇప్పటికీ సమ్మె చేస్తూ ఆందోళనలు కొనసాగించడమేంటని హైకోర్టు ప్రశ్నించింది. సమ్మె చేస్తున్న న్యాయవాదుల విషయంలో ఇప్పటివరకు ఏం చర్యలు తీసుకున్నారు, ఇకపై ఏం చర్యలు తీసుకోబోతున్నారో స్పష్టంగా తెలియచేస్తూ కౌంటర్లు దాఖలు చేయాలని బీసీఐ, రాష్ట్ర బార్ కౌన్సిల్‌ను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 14కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్‌రావు ధర్మాసనం బుధవారం ఉత్తర్వులిచ్చింది. న్యాయవాద వృత్తిలో ఉన్న వారిలో అనేక మంది పేదలున్నారని, ఏ రోజుకు ఆ రోజు సంపాదించుకుని బతుకుతున్నారని, సమ్మె వల్ల వారి జీవనోపాధి దెబ్బతింటుందని ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. యువ న్యాయవాదులు కూడా నష్టపోతారని తెలిపింది. ప్రభుత్వ చట్టంపై అభ్యంతరాలుంటే న్యాయ పోరాటం చేయాలే తప్ప సమ్మె పరిష్కారం కాదంది. ఇప్పటివరకు చేసింది చాలని, ఇక సమ్మె ఆపి తీరాల్సిందేనని తేల్చి చెప్పింది. అవసరమైతే ఈ దిశగా ఆదేశాలిస్తామంది. ఈ విషయంలో తమకు మరో మార్గం లేదని స్పష్టం చేసింది. సమస్యకు సమ్మె ఎంత మాత్రం పరిష్కారం కాదంది. వ్యవస్థ నడవడమే తమకు ముఖ్యమంది. సమ్మె చేస్తున్న న్యాయవాద సంఘాలతో చర్చలు జరిపి, సమ్మె విరమించేలా చూడాలని బార్ కౌన్సిల్‌ను ఆదేశించింది. కోర్టు విధుల బహిష్కరణతో కక్షిదారుల ఇక్కట్లు సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా న్యాయవాద సంఘాలు సమ్మెకు పిలుపునిస్తూ కోర్టు విధులను బహిష్కరిస్తున్నాయని, దీనివల్ల కక్షిదారులు ఇబ్బందిపడుతున్నారంటూ న్యాయవాది తాండవ యోగేష్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై సీజే ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ జరిపింది. ఈ సందర్భంగా యోగేష్ వాదనలు వినిపిస్తూ.. కింది కోర్టుల్లో న్యాయవాదులు సమ్మె చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని కోర్టుల్లో 8.64 లక్షల సివిల్, క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని గుర్తు చేశారు. ఈ సమయంలో ధర్మాసనం జోక్యం చేసుకుంది. సమ్మె చేస్తున్న న్యాయవాదుల విషయంలో మీ పాత్ర ఏమిటని రాష్ట్ర బార్ కౌన్సిల్‌ను ప్రశ్నించింది. దీనికి బార్ కౌన్సిల్ తరఫు న్యాయవాది జి.వెంకటరెడ్డి స్పందిస్తూ.. సమ్మె చేస్తున్న అన్ని న్యాయవాద సంఘాలకు బార్ కౌన్సిల్ కార్యదర్శి సర్క్యులర్లు పంపి, సమ్మె విరమించాలని పలుమార్లు విజ్ఞప్తి చేశారని తెలిపారు. మరి మీ సమ్మె విషయంలో మీ ఆదేశాలను పాటించకుంటే ఏం చర్యలు తీసుకున్నారని ధర్మాసనం ప్రశ్నించింది. న్యాయవాదులపై చర్యలు తీసుకున్నారా? తీసుకోకుంటే ఎందుకు తీసుకోలేదు? చర్యలు తీసుకునే ఉద్దేశం ఉందా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది. చర్చలు ఫలించకుంటే చర్యలు తీసుకుంటాం అన్ని న్యాయవాద సంఘాలను చర్చలకు ఆహ్వానించామని వెంకటరెడ్డి చెప్పారు. చర్చలు ఫలించకుంటే అప్పుడు చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటివరకు చర్యలు ఎందుకు తీసుకోలేదన్న ధర్మాసనం.. సర్క్యులర్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారా అని ప్రశ్నించింది. ఎప్పుడు సర్క్యులర్లు ఇచ్చారు? ఏం చర్యలు తీసుకోబోతున్నారో చెప్పాలని ధర్మాసనం స్పష్టం చేసింది. కొంత గడువునిస్తే పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామని వెంకటరెడ్డి చెప్పారు. మరి మీ సంగతేంటని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా న్యాయవాదిని ప్రశ్నించింది. క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సింది రాష్ట్ర బార్ కౌన్సిలేనని బీసీఐ న్యాయవాది కుంచెం మహేశ్వరరావు తెలిపారు. రాష్ట్ర బార్ కౌన్సిల్ చర్యలు తీసుకోకుంటే మీరు చర్యలు తీసుకోరా? అని ధర్మాసనం ప్రశ్నించింది. అలా కాదని, ముందు స్పందించాల్సింది రాష్ట్ర బార్ కౌన్సిలేనని, ఒకవేళ రాష్ట్ర బార్ కౌన్సిల్ చర్యలు తీసుకోకుంటే అప్పుడు తాము రంగంలోకి దిగుతామని మహేశ్వరరావు తెలిపారు. ఒరిస్సాలో కూడా సమ్మె చేస్తున్న 42 మంది న్యాయవాదులను సస్పెండ్ చేశామని వివరించారు. న్యాయవాదులు న్యాయబద్ధమైన వాటి కోసం ఆందోళనలు చేస్తున్నారా? లేదా? చూస్తామని మహేశ్వరరావు తెలిపారు. రూ.20 వెల్ఫేర్ స్టాంపు విషయంలో బార్ కౌన్సిల్ నిర్ణయంపై, భూ యాజమాన్య హక్కుల చట్టంపై న్యాయవాదులు సమ్మె చేస్తున్నారని తెలిపారు. భూ యాజమాన్య హక్కుల చట్టం వ్యవహారం ప్రస్తుతం హైకోర్టు ముందు పెండింగ్‌లో ఉందన్నారు. భూ యాజమాన్య హక్కుల చట్టం వచ్చిన నేపథ్యంలో ఆస్తి వివాదాల దావాలను తిరస్కరించవద్దని కింది కోర్టును ఆదేశిస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చిందని చెప్పారు. అలాగే రూ.20 వెల్ఫేర్ స్టాంపు విషయంలో ప్రభుత్వ చట్ట సవరణ చేసి, జీవో జారీ చేసిందన్నారు. ఇప్పుడు ఎలాంటి సమస్యా లేదని వివరించారు. మరలాంటప్పుడు సమ్మె ఎందుకు కొనసాగిస్తున్నారని ధర్మాసనం ప్రశ్నించింది. ఇప్పటివరకు జరిగింది చాలని, వెంటనే సమ్మె విరమించాలని న్యాయవాదులను ఆదేశించింది. -
ఏపీకి చంద్రబాబు కరోనా వైరస్ కంటే ప్రమాదకరం: వక్తలు
-
బెయిల్ నిబంధనలు బేఖాతర్!
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని కొందరు రాజకీయ నాయకులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం న్యాయ వ్యవస్థను అభాసుపాల్జేస్తున్నారని పలువురు న్యాయ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనారోగ్య కారణాలతో కండిషనల్ బెయిల్‌పై వచ్చి న వ్యక్తి న్యాయస్థానం విధించిన నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘించి విజయోత్సవాలు చేసుకోవడం ద్వారా ప్రజలకు తప్పుడు సంకేతాలిస్తున్నారని విమర్శించారు. ఇలాంటి వారు తప్పులు చేసి పట్టుబడినా చట్టాల నుంచి తప్పించుకునే మార్గాలను అన్వేషిన్నారని దుయ్యబట్టారు. ఇందుకు చంద్రబాబు విషయమే ఉదాహరణగా పేర్కొన్నారు. ‘చంద్రబాబు వ్యవహార శైలి– బెయిల్ నిబంధనల ఉల్లంఘన– శిక్షలు’ అంశంపై ఏపీ ఇంటిలెక్చువల్స్– సిటిజన్స్ ఫోరం(ఎపిక్) ఆధ్వర్యంలో చర్చ నిర్వహించారు. విజయవాడలో ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు మేధావులు, న్యాయవాదులు పాల్గొని తమ అభిప్రాయాలు పంచుకున్నారు. బెయిల్ మంజూరు విషయంలో జాతీయ స్థాయిలో చర్చ జరగాలని, కోర్టు నిబంధనలను ఉల్లంఘిస్తే వెంటనే బెయిల్ రద్దు చేయాల్సిన అవసరం ఉందని వారు అభిప్రాయపడ్డారు. తెలుగు రాష్ట్రాల్లో ఓ వర్గం పెత్తందారి, నియంతృత్వ పోకడలకు పోతోందని, కోర్టులను, న్యాయమూర్తులపైనా ఆరోపణలు చేస్తోందన్నారు. చంద్రబాబు కేసులో తాము చెప్పినట్టుగా తీర్పు ఇవ్వాలంటూ బెదిరింపులకు దిగిన తీరు ఇటీవల కోర్టులో చూశామన్నారు. తీవ్ర నేరాలు చేసిన చంద్రబాబు, రామోజీరావులు తాము చట్టాలకతీతమన్నట్టుగా వ్యవహరిస్తూ.. వాటి నుంచి తప్పించుకునేందుకు యత్ని స్తున్నారని ధ్వజమెత్తారు. కోర్టులను బాబు మేనేజ్ చేస్తున్నారు తన రాజకీయ జీవితంలో కోర్టులను చంద్రబాబు మాత్రమే మేనేజ్ చేసినట్టు అనేక సందర్భాల్లో రుజువైంది. న్యాయస్థానాలు చట్ట ప్రకారం పనిచేస్తుంటే మాత్రం దు్రష్పచారం చేస్తున్నారు. చంద్రబాబు తీవ్రమైన ఆర్థిక నేరం కేసులో జైలుకు వెళితే.. తాము చేప్పినట్టు తీర్పు ఇవ్వలేదని ఆయన వర్గం వారు న్యాయమూర్తులపైనా తీవ్రమైన ఆరోపణలు చేశారు. చివరికి బెయిల్ రాకపోయేసరికి ‘అనారోగ్యం’ సాకుగా చూపారు. కోర్టు కండిషన్లు పెట్టి బెయిల్ మంజూరు చేసింది. జైలు నుంచి బయటికొచ్చాక ఆస్పత్రికో, ఇంటికో వెళ్లాల్సి చంద్రబాబు.. 14 గంటల పాటు ర్యాలీ చేశారు. ప్రసంగాలు చేశారు. ఇది పూర్తిగా బెయిల్ నిబంధనలు ఉల్లంఘించడమే. – విజయ్‌బాబు, ఎపిక్ ఫోరం వ్యవస్థాపకుడు ఇది పూర్తిగా న్యాయ ధిక్కరణే చంద్రబాబు కేసులో దాదాపు 53 రోజులు దేశంలో ప్రముఖ న్యాయవాదులు కేసును వాదించారు. చివరికి ‘వైద్యం’ పేరుతో అబద్ధం చెప్పి బెయిల్ తీసుకుని రాజకీయ ర్యాలీలు, ప్రసంగాలు చేశారు. ఇది పూర్తిగా న్యాయ ధిక్కరణ. ఆయన బెయిల్ రద్దు చేయాలి. లేకుంటే తప్పు చేసిన ప్రతి ఒక్కరూ ఇలాగే బయటకొచ్చే అవకాశం ఉంది. – పిళ్లా రవి, న్యాయవాది న్యాయ వ్యవస్థలో ఏం లోపాలు ఉన్నాయో పురందేశ్వరి చెప్పాలి పురందేశ్వరి, టీడీపీ నాయకులు న్యాయ వ్యవస్థపైనా, న్యాయమూర్తులపైనా తీవ్ర ఆరోపణలు చేశారు. గతంలో వారు బెయిళ్లు తెచ్చుకున్నప్పుడు.. ఇప్పుడు అవే చట్టాలు. తనకు అనుకూలంగా బెయిళ్లు వచ్చినప్పుడు చట్టం తనపని చేసుకుపోతుందన్నారు, ఇప్పుడేమో మేనేజ్ చేస్తున్నారంటున్నారు. చంద్రబాబు ఆరి్థక నేరాలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి. న్యాయ వ్యవస్థలో ఏం లోపాలున్నాయో పురందేశ్వరి చెప్పాలి. – విఠల్‌రావు, న్యాయవాది బెయిల్ నిబంధనలపై చర్చ అవసరం దేశంలో రూల్ ఆఫ్ లా సరిగా అమలు కావడం లేదు. ఏదైనా కేసులో అండర్ ట్రైల్ కింద జైలుకు వెళ్లిన వారు బెయిల్ కోసం అప్లై చేసుకోవడం వారి హక్కు. కానీ ఇక్కడ అందరికీ ఈ హక్కు లభించడం లేదు. వ్యవస్థలను మేనేజ్ చేసుకునేవారికి, ఆర్థికంగా శక్తిమంతమైన వారికి సులభంగా బెయిల్ వచ్చేస్తోంది. కానీ చాలామంది సామాన్యులు అండర్ ట్రైల్‌లోనే ఏళ్ల తరబడి జైళ్లలో మగ్గిపోతున్నారు. బెయిల్ మంజూరుపై సుప్రీంకోర్టు న్యాయ సమీక్ష చేయాలి. ప్రభుత్వంలో ఉండి ఆరి్థక నేరాలకు పాల్పడిన వారికి బెయిల్ ఇవ్వకూడదు. – కృష్ణంరాజు, ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పురందేశ్వరి టీడీపీలో పదవి ఆశిస్తున్నట్టున్నారు.. చంద్రబాబు సీఎంగా 2014–19 మధ్య చట్టాలను యథేచ్ఛగా ఉల్లంఘించారు. ఇప్పుడు దొరికిపోయాక అరెస్టు నుంచి బెయిల్ వరకు చట్టాలను ఉల్లంఘించారు. చివరికి న్యాయమూర్తులపైనా ఆరోపణలు చేస్తున్నారు. మెడికల్ కండిషన్‌పై బెయిల్ తెచ్చుకుని నిబంధనలు ఉల్లంఘించారు. పురందేశ్వరికి ఇవన్నీ కనిపించడం లేదా? ఆమె బీజేపీ పదవి కంటే టీడీపీ పదవి ఆశిస్తున్నట్టు కనిపిస్తోంది. – సాయిరామ్, అడ్వకేట్ వారికి చట్టాలంటే గౌరవం లేదు ఒకరు నేరం చేశారని కేసు నమోదైతే కింది కోర్టులో తీర్పు వెలువడ్డాక పైకోర్టులకు వెళతారు. కానీ చంద్రబాబు కేసులో మాత్రం అందుకు విరుద్ధం. చేసిన నేరం నుంచి బయటపడేందుకు కింది కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు పిటిషన్లు వేశారంటే జరిగింది ఎంత పెద్ద నేరమో అర్థం చేసుకోవచ్చు. పైగా వ్యవస్థను ఎలా మేనేజ్ చేయాలో తెలిసినవారే ఇలా చేస్తారు. ఈ కేసులో చంద్రబాబు వర్గానికి చట్టాలు, న్యాయస్థానాలు, న్యాయమూర్తులపై గౌరవం లేదు. యథేచ్ఛగా చట్టాలను ఉల్లఘించారు. – నరహరిశెట్టి శ్రీహరి, హైకోర్టు న్యాయవాది బాబుకు స్టేలు ఇచ్చి నంత కాలం న్యాయస్థానాలు మంచివయ్యాయి.. సామాన్యులు బెయిల్ రాకుండా అండర్ ట్రైల్‌లోనే ఉండిపోతున్నారు. కానీ చంద్రబాబు, రామోజీరావులు కోర్టు మెట్లు ఎక్కకుండానే బెయిల్ తెచ్చుకుంటున్నారు. స్కిల్ స్కాం తప్ప మరే కేసులోను బాబు కోర్టుకు, జైలుకు వెళ్లింది లేదు. తనకు స్టేలు ఇచ్చి నంత కాలం న్యాయస్థానాలు మంచివే అన్నారు, ఈ ఒక్క కేసులో బెయిల్ రాకపోయేసరికి ఆరోపణలు చేస్తున్నారు. బెయిల్ నిబంధనలపై న్యాయ సమీక్ష అవసరం – ధనలక్ష్మి, న్యాయవాది అబద్ధాలు చెప్పి బయటికొచ్చారు చంద్రబాబుకు వైద్యం కోసం కోర్టు బెయిల్ ఇచ్చి ంది. బయట ప్రసంగాలు చేయొద్దని చెప్పింది. కానీ బాబు మాత్రం తన హక్కును కాపాడిన కోర్టు హక్కులనూ కాలరాశారు. అబద్ధం చెప్పి బయటకు వచ్చి ర్యాలీలు చేశారు. – ఎన్.జ్యోతి, న్యాయవాది రోజుకో రోగమని చెప్పారు.. చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు రోజుకో రోగమని చెప్పారు. వైద్యం కోసం బెయిల్ తెచ్చుకుని బయటికి రాగానే ర్యాలీలు చేశారు. బాబు అరెస్ట్ సమయంలోనూ ఇలాగే ప్రవర్తించారు. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యానికి ప్రమాదం. – జె.జయలక్ష్మి, న్యాయవాది ఇలాంటి చర్యలను న్యాయస్థానాలు గమనించాలి చంద్రబాబు అన్ని రకాల బెయిళ్లకు అప్లై చేసి, ఏదీ రాకపోయేసరికి ‘అనారోగ్యాన్ని’ అడ్డుపెట్టుకుని బయటపడ్డారు. జైలు నుంచి విడుదలయ్యాక ఆస్పత్రికి వెళ్లాల్సింది పోయి.. రాజకీయ ర్యాలీలు చేశారు. న్యాయస్థానాలు ఇలాంటివి గమనించాలి. – ఉషాజ్యోతి, న్యాయవాది -
‘మై లార్డ్’ అనకండి..సగం వేతనం ఇచ్చేస్తా!
న్యూఢిల్లీ: కోర్టులో వాదోపవాదాల సమయంలో పదేపదే మై లార్డ్, యువర్ లార్డ్‌షిప్స్’అంటూ లాయర్లు తమను సంబోధిస్తుండటంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘మై లార్డ్స్ అని ఎన్నిసార్లు అంటారు? ఇలా అనడం ఆపేస్తే, నా వేతనంలో సగం మీకిచ్చేస్తా’అని జస్టిస్ పీఎస్ నరసింహ పేర్కొన్నారు. బుధవారం జస్టిస్ ఏఎస్ బొపన్నతో కలిసి ఆయన ఓ కేసు విచారణలో పాల్గొన్నారు. వాదోపవాదాల సమయంలో ఓ సీనియర్ లాయర్ పదేపదే ‘మై లార్డ్, యువర్ లార్డ్‌షిప్స్’ అంటుండటంపై పైవిధంగా ఆయన స్పందించారు. వాటికి బదులుగా సర్ అని అనొచ్చు కదా అని తెలిపారు. లేకుంటే ఆ మాటలను ఎన్నిసార్లు వాడేదీ లెక్కపెడ తానని చెప్పారు. ‘మై లార్డ్, యువర్ లార్డ్‌షిప్’అనే మాటలు వలస పాలన ఆనవాళ్లని, కోర్టు ప్రొసీడింగ్స్ సమయంలో వాడరాదంటూ 2006లో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తీర్మానం చేసింది. -
లాయర్ల ఫీజు చెల్లించడానికి డబ్బులు ఎక్కడివి?: లక్ష్మీపార్వతి
సాక్షి, విజయవాడ: లాయర్లకు వేల కోట్ల ఫీజులు చెల్లించడానికి. .చంద్రబాబుకు ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని ఏపీ తెలుగు అకాడమీ చైర్పర్సన్ లక్ష్మీ పార్మతి ప్రశ్నించారు. దాచుకున్న అవినీతి సొమ్మును.. లాయర్లకు చెల్లించడానికే లోకేష్ ఢిల్లీలో మకాం పెట్టారా అని మండిపడ్డారు. ఎక్కడెక్కడో దాచిపెట్టిన అవినీతి సొమ్మును తెప్పిస్తున్నాడా అనే సందేహం కలుగుతోందన్నారు. 40 రోజులుగా చంద్రబాబు కోసం 19 మంది లాయర్లు పనిచేస్తున్నారని, సీనియర్ లాయర్లకు రోజు రూ. కోటి నుంచి రూ.2.50 కోట్ల ఫీజు ఉందని తెలిపారు. ఏసీబీ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరసు నడుస్తున్న చంద్రబాబు కేసుల మీద వాదించడానికి రోజుకు అన్ని ఖర్చులు కలిసి మూడు కోట్లు అయితే..లాయర్ల ఫీజుకే రూ. 2 వేల కోట్లకు పైగా ఖర్చు అయి ఉండొచ్చని ఆరోపించారు. 2 శాతం హెరిటేజ్ షేర్లను విక్రయిస్తే రూ. 400 కోట్ల ఆదాయం వస్తుందని భువనేశ్వరి చెప్పిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. న్యాయవాదలు ఫీజులు, ఇతర ఖర్చులు చెల్లించడానికి ఆమె 5000 కోట్లకు మించి ఎన్ని షేర్లను విక్రయించారో చెప్పాలని డిమాండ్ చేశారు. చదవండి: చంద్రబాబుకి కోర్టుల్లో వరుస ఎదురుదెబ్బలు లాయర్ల ఫీజు చెల్లించడానికి ఎక్కడి నుంచి డబ్బులు వచ్చాయో చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యలు చెప్పాలని, వారి సంపద, ఆదాయ వివరాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. లాయర్లకు ఎంత చెల్లిస్తున్నారు.. ఆ డబ్బును ఎక్కడనుంచి తెస్తున్నారనే విషయం చంద్రబాబును రోజు తమ పేపర్లలో, టీవీలలో చూపిస్తున్న పచ్చమీడియా అయినా దీనికి సమాధానం చెప్పాలని అన్నారు. దేశ ప్రధానిగా 16 సంవత్సరాలు పనిచేసిన ఇందిరాగాంధీ కూడా తన కేసును వాదించడానికి ఇద్దరే లాయర్లను పెట్టుకున్నారని, ఇంత స్థాయిలో అమెరికా ప్రెసిడెంటు కూడా పెట్టుకోలేదనుకుంటానంటూ సెటైర్లు వేశారు. -
చంద్రబాబు ఢిల్లీ లాయర్లు ఖుషి చేస్తున్నారు..!
-
చంద్రబాబు లాయర్లపై చర్యలు !..బాబు కొంప ఎక్కడ..?
-
బాబు లాయర్లు రౌడీయిజం...ఏసీబీ జడ్జి సీరియస్..!
-
బాబు లాయర్ల అతి.. బెంచ్ దిగి వెళ్లిపోయిన జడ్జి
సాక్షి, విజయవాడ: వరుసబెట్టి పిటిషన్లు.. న్యాయస్థానాల్లో వరుస ఎదురు దెబ్బలు.. అయినా కొనసాగుతున్న పిటిషన్ల పర్వం. దారులన్నీ మూసుకుపోతున్న తరుణంలో.. ఏం చేయాలో పాలుపోని స్థితిలో చంద్రబాబు అండ్ కో ఉంది. ఈ సమయంలో ఆయన తరపు లాయర్లు కూడా ఫ్రస్టేట్ అవుతున్నారు. సీఐడీ తరపు న్యాయవాదులతో తాజాగా దురుసుగా ప్రవర్తించారు. ఇవాళ ఏసీబీ కోర్టులో కాల్ డేటా రికార్డులపై విచారణ జరిగింది. సీఐడీ అధికారుల కాల్‌డేటా ఇవ్వాలంటూ టీడీపీ వర్గాలు పిటిషన్ వేశాయి. పిటిషన్ వేసి ఇప్పటికే నెల రోజులైందని చంద్రబాబు తరపు న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ జడ్జికి వివరించగా.. అసలు పిటిషనుకు అర్హతే లేదని సీఐడీ న్యాయవాది వివేకానంద తెలిపారు. ఈ సందర్భంలో.. సీఐడీ తరపు స్పెషల్ గవర్నమెంట్ ప్లీడర్ వివేకానందపైకి చంద్రబాబు లాయర్లు దూసుకెళ్లారు. వివేకా లీగల్ సబ్మిషన్లు చెబుతున్న సమయంలో లాయర్ లక్ష్మీనారాయణ అత్యుత్సాహం ప్రదర్శించారు. దీంతో.. ఈ కేసులో ఎందుకిలా చేస్తున్నారంటూ లక్ష్మీ నారాయణను జడ్జి ప్రశ్నించారు. మరోవైపు లక్ష్మీ నారాయణ తీరు మీద అభ్యంతరం వ్యక్తం చేశారు సీఐడీ తరపు న్యాయవాది వివేకానంద. అయితే ఇరువైపులా వాగ్వాదం జరిగింది. ఇరువైపులా అరుపులతో కాసేపు కోర్ట్ హాల్ దద్దరిల్లిపోయింది. దీంతో.. న్యాయవాదులపై జడ్జి ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్ష్మీనారాయణ, నాగరాజు అనే లాయర్లు.. అడ్వకేట్ ఆన్ రికార్డ్సులో ఉన్నారా? అంటూ ఏసీబీ కోర్టు జడ్జి ప్రశ్నించారు. అయితే ‘లేరు’అని చంద్రబాబు తరపు న్యాయవాదులు సమాధానం ఇచ్చారు. దీంతో.. న్యాయమూర్తి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కోర్టు హాల్లో అతిగా ప్రవర్తించిన వాళ్ల పేర్లు రాసుకోవాలంటూ జడ్జి ఆదేశించారు. అడ్వకేట్ ఆన్ రికార్డ్సులో ఉన్న వాళ్లు తప్ప అందరూ బయటకెళ్లాల్సిందిగా ఆదేశిస్తూ.. ఈ విధంగా ఉంటే విచారించాలేనంటూ బెంచ్ దిగి వెళ్లిపోయారు. -
చంద్రబాబు లాయర్లకు ఏసీబీ కోర్టు ఆదేశం
-
చంద్రబాబు 3 లాయర్లపై ఆర్జీవీ కామెంట్స్
-
భువనేశ్వరికి లాయర్ల కౌంటర్
-
చంద్రబాబు లాయర్ల కొత్త స్కెచ్..
-
తండ్రి కోసం కోడుకు..బయటనుండి లోకేష్ డైరెక్షన్స్...
-
ఏసీబీ కోర్టు జడ్జి ఇంటి వద్ద టీడీపీ లాయర్ల హంగామా
సాక్షి, అమరావతి: విజయవాడలో ఏసీబీ కోర్టు జడ్జి ఇంటి వద్ద శనివారం అర్ధరాత్రి టీడీపీ లీగల్ సెల్ న్యాయవాదులు హంగామా సృష్టించారు. టీడీపీ న్యాయవాదులు నిబంధనలకు విరుద్ధంగా అర్ధరాత్రి జడ్జిని కలిసేందుకు ప్రయత్నించడంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో న్యాయవాదులు వారితో వాగ్వాదానికి దిగారు. చంద్రబాబు అరెస్టుకు సంబంధించి హౌస్ మోషన్ పిటిషన్ ఇచ్చేందుకు రాత్రి 12 గంటల సమయంలో టీడీపీ న్యాయవాదులు వెళ్లారు. పిటిషన్ తీసుకునేందుకు జడ్జి నిరాకరించారు. కోర్టుకే రావాలని సూచించారు. జడ్జి సూచనల మేరకు పోలీసులు న్యాయవాదులను బయటకు వెళ్లాలని కోరారు. దీంతో లాయర్లు పోలీసులతో గొడవకు దిగారు. జడ్జి చెప్పడం వల్లే తాము బయటకు వెళ్లాలంటున్నామని పోలీసులు చెబుతున్నా వినలేదు. -
బుద్వేల్ భూముల వేలంపై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్
సాక్షి, హైదరాబాద్: బుద్వేల్ భూముల అంశంలో హెచ్ఎండీఏ వేలాన్ని సవాల్ చేస్తూ న్యాయవాదుల సంఘం తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. భూముల వేలంపై స్టే ఇవ్వాలని కోర్టుని కోరింది. అయితే లంచ్ మోషన్ పిటిషన్ హైకోర్టు తిరస్కరించింది. దీనిపై స్పందిస్తూ.. బార్ అసోసియేషనల్లో విభేదాలు ఉన్నాయని, అందరూ ఏకాభిప్రాయంతో వస్తే వాదనలు వింటామని స్పష్టం చేసింది. కాగా బుద్వేల్ లోని ప్రభుత్వ భూములను గతంలో హైకోర్టు కోసం కేటాయిస్తామన్న వాదనతో బార్ అసోసియేషన్ కోర్టుకు వెళ్లింది. దీంతో బుద్వేల్ భూముల వేలంపై న్యాయవాదుల సంఘం కోర్టుని ఆశ్రయించింది. రంగారెడ్డి బుద్వేల్లోని 100 ఎకరాలకు హెచ్ఎండీఏ ఈ వేలం వేసేందుకు సిద్ధమైంది. 100 ఎకరాల్లో 14 ప్లాట్‌కు ఆన్లైన్ వేలం జరపాలని నిర్ణయించింది. ఈ భూమూలను దక్కించుకోవాలని రియల్ ఎస్టేట్ దిగ్గజాలు పోటీపడుతున్నాయి. దీని ద్వారా రూ.4 వేల కోట్ల ఆదాయం వస్తుందని హెచ్ఎండీఏ అంచనా వేస్తోంది. చదవండి: హవ్వ.. చెట్లను కొట్టేసి మొక్కలు నాటుతారట? -
'ఇంత భయంకరమైన జైలులో ఉండలేను..'
ఇస్లామాబాద్: తొషాఖానా కేసులో పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ జైలు శిక్షను అనుభవిస్తున్నారు. ఇమ్రాన్ ఖాన్‌ను అతి దారుణమైన సెల్లో ఉంచారనే విషయాన్ని ఇటీవల ఆయన తరుపు లాయర్ చెప్పిన విషయం తెలిసిందే. అయితే.. తనను ఆ జైలు నుంచి బయటకు తీసుకురావాలని ఇమ్రాన్ ఖాన్ కోరినట్లు ఆయన తరుపు న్యాయవ్యాది చెప్పారు. పగలు ఈగలు, రాత్రి కీటకాలు ఇబ్బంది పెడుతున్న భయంకరమైన జైలులో జీవితాంతం ఉండలేనని చెప్పినట్లు వెల్లడించారు. అవినీతి కేసులో ఇస్లామాబాద్ ట్రయల్ కోర్టు ఇమ్రాన్ ఖాన్ దోషిగా నిర్ధారించిన కొద్దిసేపటికే లాహోర్‌లోని అతని ఇంటి నుండి ఖాన్‌ను అరెస్టు చేశారు. అనంతరం రావల్పిండిలోని అడియాలా జైలుకు పంపాలని అధికారులను ఆదేశించినప్పటికీ, అతన్ని పంజాబ్ ప్రావిన్స్‌లోని అటాక్ నగరంలోని అటాక్ జైలుకు తరలించారు. కోర్టు తీర్పును సవాలు చేసేందుకు ఖాన్ తరపు న్యాయవాది హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. తీర్పును సవాలు చేసే క్రమంలో ఇమ్రాన్ ఖాన్‌ను కలిసేందుకు ఆయన తరపు న్యాయవాది నయీమ్ హైదర్ పంతోజీ ఇటీవల జైలుకి వెళ్లారు. ఈ నేపథ్యంలో ఇమ్రాన్‌తో ఆయన దాదాపు గంట పాటు మాట్లాడారు. తనకు జైల్లో కల్పిస్తున్న సదుపాయాలు చాలా దారుణంగా ఉన్నాయని ఇమ్రాన్ చెప్పినట్లు న్యాయవాది మీడియాతో వెల్లడించారు. ఇదీ చదవండి: పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ రద్దు.. తాత్కాలిక ప్రధాని ఎవరు? -
అవునని తెలిసీ... కాదని అంటాం!
‘‘దేశంలోని వివిధ వ్యవస్థల దర్యాప్తు అధికారులు, ప్రభుత్వం తరఫున వాదించే న్యాయవాదులు, కేసు విచారణ న్యాయమూర్తులు... వీళ్లంతా తమ వాదనలలో, తీర్పులలో పదే పదే స్పష్టమైన కుల దురభిమానాన్ని ప్రదర్శించి కూడా అలాంటిదేమీ లేనట్లు మళ్లీ మళ్లీ ఎలా తప్పించుకోగలరో అర్థం చేసుకోడానికి ప్రత్యక్ష హింసను దాటి చూడాలన్న అవసరాన్ని నేను గ్రహించాను’’ అంటాడు ‘క్యాస్ట్ ప్రైడ్’ రచయిత మనోజ్ మిత్తా. కులహత్యలు జరిగినప్పుడు వ్యక్తులుగా, వ్యవస్థలుగా మనం దాదాపు ప్రతిసారీ ఆ హత్యల వెనుక కులపరమైన కారణాలు లేనే లేవని ఖండిస్తాం. మనోజ్ అదే రాస్తూ, ‘‘స్పష్టంగా కనిపించే కుల దౌర్జన్యాల వెనుక ఉన్న కులకోణాన్ని సైతం భారతదేశం దశాబ్దాలుగా తిరస్కరిస్తూనే వస్తోంది’’ అంటాడు. కులం గురించి, అది మన వ్యవస్థలలోకి చొరబడిన విద్వేష మార్గం గురించి నాకు మరీ అంతగా తెలియదు. అదృష్టవశాత్తూ మనోజ్ మిత్తా రాసిన ‘క్యాస్ట్ ప్రైడ్: బ్యాటిల్స్ ఫర్ ఈక్వాలిటీ ఇన్ హిందూ ఇండియా’ నా చేతికి అందింది. దట్టమైన పుస్తకం అది. పుస్తకాన్ని చదువుతున్నప్పుడు అడవిని చూడలేనంతగా చెట్ల కింద కూరుకుపోయినట్లుగా ఉంది. అయితే మీరు గొప్ప పట్టుదలను కలిగి ఉంటే కనుక చదవదగిన పుస్తకమే అనిపిస్తుంది. ఏమైనా, మనోజ్ తనకు తానుగా సత్యాన్ని గుర్తించాడని కనిపెట్టినప్పుడు మొదట నా ముఖంపై చిరునవ్వు వెలసింది. ‘‘1984లో సిక్కుల ఊచకోత, 2002లో ముస్లింలపై జరిగిన మారణకాండల మీద పుస్తకాలు రాశాక, మూడో పుస్తకాన్ని భారతదేశంలోని సామూహిక హింసపై రాయాలన్నది నా అసలు ప్రణాళిక. దళితుల హత్యలపై దృష్టి పెట్టాలన్నది నా ఉద్దేశం’’ అంటాడు మనోజ్. అయితే ఏడేళ్ల పరిశోధన తర్వాత అతడు తెలుసుకున్నది ఏమిటంటే, ఇంకా చాలా కథే ఉందని! ‘‘దేశంలోని వివిధ వ్యవస్థల దర్యాప్తు అధికారులు, ప్రభుత్వం తరఫున వాదించే న్యాయవాదులు, కేసు విచారణ న్యాయమూర్తులు, పునర్విచారణ న్యాయ నిర్ణేతలు వీళ్లంతా తమ వాదనలలో, తీర్పులలో పదే పదే స్పష్టమైన కుల దురభిమానాన్ని ప్రదర్శించి కూడా అలాంటిదేమీ లేనట్లు మళ్లీ మళ్లీ ఎలా తప్పించుకోగలరో అర్థం చేసుకోడానికి ప్రత్యక్ష హింసను దాటి చూడాలన్న అవసరాన్ని నేను గ్రహించాను’’ అంటాడు మనోజ్. అతడి ఈ గ్రహింపు సూటిగా ఉన్నది, సరళమైనది, బాధతో కూడినది. కులహత్యలు జరిగినప్పుడు, కుల మారణ కాండలు సంభవించినప్పుడు వ్యక్తులుగా, వ్యవస్థలుగా కూడా మనం దాదాపు ప్రతిసారీ ఆ హత్యల వెనుక కులపరమైన కారణాలు లేనే లేవని ఖండిస్తాం. మనోజ్ అదే రాస్తూ, ‘‘అత్యంత స్పష్టంగా కనిపించే కుల దౌర్జన్యాల వెనుక ఉన్న కులకోణాన్ని సైతం భారతదేశం దశాబ్దాలుగా తిరస్కరిస్తూనే వస్తోంది’’ అంటాడు. కుల వివాదాలను, కుల దౌర్జన్యాలను అదుపులోకి తెచ్చేందుకు 1816–2019 మధ్య ఏ విధమైన ప్రయత్నాలు జరిగాయో తెలిపే వివరాలు ఈ పుస్తకంలో ఉన్నాయి. ‘‘అంటరానితనం నిర్మూలనకు అంటూ 1950లో ఏదైతే ప్రయత్నం జరిగిందో అది... అప్పటికే అంటరానితనం నుంచి విముక్తి పొంది ఉన్నవాళ్లపై మరింతగా దిగ్భ్రాంతి కరమైన హింసాత్మక చర్యలకు ఆధిపత్య కులాలవారిని ప్రేరేపించి, సామూహిక హత్యలు అనే ఒక కొత్త దురాగతాన్ని కనిపెట్టేందుకు వారు పాల్పడేంతగా వ్యతిరేకతకు కారణమైంది’’ అని మనోజ్ రాశారు. 1968లో తమిళనాడులోని కీలవేణ్మణిలో తొలిసారి అటువంటి సామూహిక హత్యలు జరిగాయి. మనోజ్ పేర్కొన్న దారుణాలలో నేను బాగా గుర్తెరిగినది బెల్చి హత్యాకాండ. అది జరిగినప్పుడు నా వయసు 22. ఆ భయానక ఊచకోతకు లండన్ నుంచి వెలువడే ‘ది స్పెక్టేటర్’ పత్రిక ‘ది హంటింగ్ ఆఫ్ హరిజన్’ అనే శీర్షికను పెట్టడం కన్నా కూడా నాకు ఇప్పటికీ బాగా జ్ఞాపకం ఉన్నది... ఇందిరా గాంధీ చూపిన చొరవ. అర్ధరాత్రి సమయంలో రుతుపవనాలు కుండపోతగా కురుస్తున్నప్పుడు మావటి వెనుక ఏనుగుపై కూర్చొని, ఆ చీకట్లో తనను అంతా గుర్తించగలిగేలా టార్చిలైట్ల వెలుగులో బెల్చి చేరుకోవడం. ‘‘ఆ విధంగా చేయడం ద్వారా ఆమె జనాదరణను ఒడిసి పట్టుకున్నట్లయింది’’ అంటాడు మనోజ్. ఈ పుస్తకం ద్వారా తప్ప... ఇంతవరకు నాకు తెలియందీ, నన్ను ఆశ్చర్యానికి గురి చేసిందీ, ‘‘కులపరమైన హత్యలు జరిగిన ఘటనా స్థలాన్ని సందర్శించిన మొట్టమొదటి, బహుశా ఏకైక జాతీయ నాయకురాలు ఇందిరాగాంధీ’’ కావడం. మన తాజా రాజకీయాలపై, నిజానికి ఇప్పటి మన ప్రజాస్వామ్యంపై ఎంత కఠోర వ్యాఖ్య! మనల్ని బాధించే విషాదాలపై మన పాలకులు ఎలా çస్పందిస్తున్నారనే దానిపైన కూడా ఇది కచ్చితమైన వ్యాఖ్య. అయితే మనోజ్ ఉద్దేశం ఇందిరాగాంధీ చొరవ గురించి చెప్పడం కాదు. బెల్చి ఘటనను మన వ్యవస్థ ఒక కులద్వేష దురాగతంగా అంగీకరించడానికి ఎందుకు ఇష్టపడలేదన్న ప్రశ్నను లేవనెత్తడం. నాడు హోమ్ మంత్రిగా ఉన్న చరణ్‌సింగ్ పార్లమెంటులో మాట్లాడుతూ... ‘‘ఈ ఘటనకు కుల, మత, భూ తగాదాలు గానీ, రాజకీయాలు గానీ కారణం కాదు. కొన్ని పత్రికల్లో వచ్చిన విధంగా సమాజంలోని బలహీన వర్గాలపై జరిగిన దౌర్జన్యం కూడా కాదు’’ అని ప్రకటించారు. జనతాపార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ధన్ చైర్మన్‌గా ఉన్న పార్లమెంటరీ కమిటీ చరణ్ సింగ్‌తో తీవ్రంగా విభేదించింది కానీ, అది కుల దురాగతమేనని ఆయన్ని ఒప్పించలేకపోయింది. చరణ్ సింగ్ చేసినటువంటి ఖండన ప్రకటనలు దాదాపు ప్రతిసారి కూడా మన ప్రతిస్పందనల్ని వికలపరుస్తాయని మనోజ్ వాదిస్తాడు. అగ్రవర్ణాలవారు ఉద్దేశపూర్వకంగా వాస్తవాలను తిరస్కరిస్తారు. అది ప్రతి దశలోనూ జరుగుతుంది. పోలీసులు, దర్యాప్తు అధికారులు సహకరించుకోవడం, బలహీనమైన న్యాయ విచారణ, వాదనలు, తీర్పులు, సుప్రీంకోర్టుకు చేరిన పునర్విచారణల నిర్వహణలో సైతం ఈ అగ్రవర్ణ భావన పని చేస్తుందని మనోజ్ అంటాడు. ఆఖరికి మనమెంతో గొప్పగా భావించే నాయకుల గురించి కూడా మనోజ్ చేసిన వ్యాఖ్యలు మనల్ని ఆశ్చర్యపరుస్తాయి. ‘‘ఈ నిర్దిష్ట సందర్భంలో ఎల్లవేళలా మహాత్ముడిలా కనిపించరు’’ అని గాంధీ గురించి, ‘‘కుల సంస్కరణలను ఆయన ప్రతిఘటించలేదు, లేదా పెద్దగా వాటి కోసం ప్రయత్నించనూ లేదు. ఆయనది అతిథి పాత్ర మాత్రమే’’ అని నెహ్రూ గురించి, చివరికి అంబేడ్కర్ గురించి కూడా – నేను ఎక్కువ వివరాలు ఇవ్వను గానీ– ‘‘ఆయన కథేమీ ఆశ్చర్యాలు లేనిదైతే కాదు’’ అని అంటూ... ‘‘స్వాతంత్య్ర సమరయోధులు తప్పనిసరిగా సమానత్వ ఉద్యమశీలురు కావాలనేముంది?’’ అని ముగిస్తాడు మనోజ్. పుస్తకం గురించి నా ఏకైక విమర్శ ఏమిటంటే... చదివేందుకు ఇది కొంచెం తేలికగా ఉండవలసిందనీ, పేజీలు పొంగిపొర్లేలా వివరాలు ఇవ్వడం వల్ల పుస్తకంలో ప్రధాన సందేశాన్ని తరచు అవి మరుగున పడేస్తున్నాయనీ. అయినప్పటికీ అది మనం వినవలసిన, మనం గుర్తుంచుకోవలసిన సందేశమే. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్టు -
లాయర్ల మధ్య వాగ్వాదం.. కోర్టు ప్రాంగణంలో కాల్పుల కలకలం
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఓ కోర్టులో బుధవారం ఉదయం కాల్పులు కలకలం చెలరేగింది. తీస్ హాజారీ కోర్టు ప్రాంగణంలో న్యాయవాదులు తుపాకీ చేతబట్టి కాల్పులకు తెగబడ్డారు. . అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు అవ్వలేదు. సమాచారం అందుకున్న పోలీసులు కోర్టు వద్దకు చేరుకున్నారు. ఏదో విషయంపై రెండు వర్గాల లాయర్ల మధ్య వాగ్వాగం చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. ఈ గొడవ కాస్తా పెద్దది కావడంతో ఓ వర్గం న్యాయవాదులు తమ వద్ద ఉన్న పిస్తోళ్లతో గాల్లోకి కాల్పులు జరిపినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు అవ్వలేదని పేర్కొన్నారు. కోర్టు వద్ద పరిస్థితి అదుపులో ఉన్నట్లు వెల్లడించారు. #WATCH | An incident of firing was reported at Tis Hazari Court premises in Delhi this afternoon. No injuries were reported. Police say that this happened after an argument among lawyers. (Note: Abusive language) (Video Source: A lawyer) pic.twitter.com/AkRYOoyQPe — ANI (@ANI) July 5, 2023 కోర్టులో కాల్పులు జరపడాన్ని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ కేకే మనన్ ఖండించారు. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ చేపడతామని తెలిపారు. అయితే సదరు గన్లకు లైసెన్స్ ఉందా లేదాన అనే కోణంలో దర్యాప్తు చేస్తామని చెప్పారు. ఒకవేళ లైసెన్స్డ్ ఆయుధాలు అయినప్పటికీ కోర్టు కాంప్లెక్స్‌లో న్యాయవాదులు కానీ ఇతరులు కానీ కాల్పులు జరపడం నేరమని పేర్కొన్నారు. చదవండి: మొత్తం శరద్ పవారే చేశారు.. ఎన్సీపీ చీఫ్‌పై సంచలన వ్యాఖ్యలు Delhi | A firing incident reported at Tis Hazari Court premises, no injuries reported. Police say that this happened after an argument among lawyers. (Note: Abusive language) (Video Source: A lawyer) pic.twitter.com/MMPOQwpWaZ — ANI (@ANI) July 5, 2023 -
జూనియర్ లాయర్ల నుంచి పేదల పట్ల మమకారాన్ని ఆశిస్తున్నానని చెప్పిన ఏపీ సీఎం వైఎస్ జగన్.. ఇంకా ఇతర అప్డేట్స్
-
న్యాయ సాయం అందించడంలో.. పేదలకు మీరే నేస్తం: సీఎం జగన్
జూనియర్ లాయర్లు న్యాయవాద వృత్తిలో స్థిరపడ్డాక పేదల పట్ల ఇదే రీతిలో మమకారం చూపాలి. ప్రభుత్వం తరఫున ఒక అన్నగా, స్నేహితుడిగా మీ నుంచి నేను ఆశించేది అదే. దీన్ని ఎప్పుడూ మరచిపోవద్దని కోరుతున్నా. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: యువ న్యాయవాదులకు అండగా నిలుస్తూ ప్రవేశపెట్టిన ‘వైఎస్సార్ లా నేస్తం’ లాంటి పథకం దేశంలో మరే రాష్ట్రంలోనూ లేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. యువ న్యాయవాదులు వృత్తిలో ప్రవేశించిన తొలి మూడేళ్ల పాటు ఆర్థికంగా ఊతమిచ్చేలా ఈ పథకాన్ని రూపొందించామన్నారు. నాలుగేళ్లుగా లా నేస్తం పథకాన్ని అమలు చేస్తూ ఇప్పటివరకు 5,781 మందికి మొత్తం రూ.41.52 కోట్లు అందించినట్లు చెప్పారు. ఈ ఏడాది ఫిబ్రవరి – జూన్ వరకు మొదటి విడత వైఎస్సార్ లా నేస్తం సాయం కింద 2,677 మంది జూనియర్ న్యాయవాదుల ఖాతాల్లో నెలకు రూ.ఐదు వేలు స్టైఫండ్ చొప్పున రూ.25,000 అందచేస్తూ మొత్తం రూ.6,12,65,000ని ముఖ్యమంత్రి జగన్ సోమవారం తన క్యాంపు కార్యాలయం నుంచి బటన్ నొక్కి నేరుగా ఖాతాల్లో జమ చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి, లా సెక్రటరీ జి.ప్రభాకర్, న్యాయవాదులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే... వృత్తిలో నిలదొక్కుకునేలా.. న్యాయవాదులు లా కోర్సు పూర్తి చేసిన మొదటి మూడేళ్లు ప్రాక్టీస్పరంగా నిలదొక్కుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడే చదువులు పూర్తై కోర్టుల్లో అడుగుపెడుతున్న తరుణంలో వారి కాళ్లమీద వాళ్లు నిలబడేలా తోడుగా నిలిచి నెలకు రూ.5 వేలు చొప్పున ఏడాదిలో రూ.60 వేలు ఇస్తున్నాం. మూడేళ్లలో ఇలా ఒక్కొక్కరికీ రూ.1.80 లక్షలు అందిస్తున్నాం. దీనివల్ల వృత్తిలో ఇబ్బంది పడకుండా నిలదొక్కుకుని ముందుకు వెళ్తారన్న ఆలోచనతో ఈ పథకాన్ని ప్రారంభించాం. ఇది ఒక మంచి ఆలోచన, మంచి కార్యక్రమం. రూ.వంద కోట్లతో వెల్ఫేర్ ట్రస్ట్.. ఇలాంటి ఆలోచన, ఇలాంటి పథకం కేవలం మన రాష్ట్రంలో మాత్రమే అమలు జరుగుతోంది. ఇదొక్కటే కాకుండా అడ్వొకేట్లకు అన్ని రకాలుగా మంచి జరగాలనే ఉద్దేశంతో రూ.100 కోట్లతో అడ్వొకేట్ జనరల్ ఆధ్వర్యంలో ఇప్పటికే వెల్ఫేర్ ట్రస్ట్‌ను ఏర్పాటు చేశాం. మెడిక్లెయిమ్, న్యాయవాదుల అవసరాలకు రుణాలు లాంటి వాటికి ఈ ఫండ్ నుంచి రూ.25 కోట్లు సహాయం చేశాం. ఈ రెండు కార్యక్రమాల ద్వారా అడ్వొకేట్లకు రాష్ట్ర ప్రభుత్వం తోడుగా ఉందనే సంకేతం వెళ్లింది. ఇంకా బాగా ఉపయోగపడాలని.. ఇంత మనసు పెట్టి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి నేను న్యాయవాదులను కోరేది ఒక్కటే. జూనియర్ న్యాయవాదులకు ఈ పథకం ద్వారా మంచి జరిగితే వారు వృత్తిలో స్థిరపడ్డాక ఇదే మమకారాన్ని పేదల పట్ల చూపిస్తారని విశ్వసిస్తున్నా. ఒక అన్నగా, స్నేహితుడిగా వారి దగ్గరనుంచి నేను ఆశిస్తున్నది ఇదే. దేవుడి దయ వల్ల మంచి జరుగుతోంది. దీన్ని ఎప్పుడూ మరచిపోవద్దని కోరుతున్నా. ఈ మంచిని ప్రతి పేదవాడికి తిరిగి బదిలీ అయ్యేలా గుర్తుంచుకోవాలని కోరుకుంటున్నా. వైఎస్సార్ లా నేస్తం ద్వారా ఆర్నెళ్లకు కలిపి ఒకేసారి మొత్తం రూ.30 వేలు అందిస్తే జూనియర్ న్యాయవాదులకు ఇంకా బాగా ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో క్రితంసారి మార్పులు చేశాం. మళ్లీ డిసెంబరులో ఈ ఏడాది రెండో దఫాకి సంబంధించిన కార్యక్రమం జరుగుతుంది. వీటన్నింటి వల్ల న్యాయవాదులకు మంచి జరగాలని కోరుకుంటున్నా. మీ స్ఫూర్తితో పేదలకు సాయం చేస్తా.. గుంటూరు బార్ అసోసియేషన్‌లో జూనియర్ అడ్వొకేట్‌గా ప్రాక్టీస్ చేస్తున్నా. నిరుపేద కుటుంబానికి చెందిన నేను చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయా. మా బాబాయి కూలి పనులు చేస్తూ తన పిల్లలతో పాటు నన్ను చదివించారు. లా కోర్సు పూర్తవగానే గుంటూరులో ఎక్కడ ఉండాలో అర్ధం కాలేదు. స్పందనలో దరఖాస్తు చేసుకోగానే మహిళా ప్రాంగణంలో వసతి కల్పించారు. వైఎస్సార్ లా నేస్తం కింద నెలకు రూ.ఐదు వేలు చొప్పున రెండేళ్లుగా క్రమం తప్పకుండా అందుతోంది. మా బాబాయి పిల్లలకు అమ్మ ఒడి, విద్యా కానుక, విద్యా దీవెన వస్తోంది. పిన్నికి చేయూత అందుతోంది. మా కుటుంబ సభ్యులంతా మీ పథకాలను పొందుతున్నారు. అందరి సంక్షేమం కోసం ఆలోచిస్తున్న ఇలాంటి ప్రభుత్వం, ముఖ్యమంత్రి దీర్ఘకాలం ప్రజలకు సేవ అందించాలని కోరుకుంటున్నా. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుని మీ స్ఫూర్తితో పేదలకు న్యాయం సాయం చేస్తానని మాట ఇస్తున్నా సార్. – రత్నకుమారి, న్యాయవాది, గుంటూరు ఎంతో ఉపయోగం.. జూనియర్ అడ్వొకేట్‌గా 2020లో బెజవాడ బార్ అసోసియేషన్‌లో ప్రాక్టీస్ ప్రారంభించా. పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు మీరు సాయం చేస్తుండడంతో మాలాంటి ఎంతోమంది జూనియర్ అడ్వొకేట్స్ లబ్ధి పొందుతున్నారు. లా నేస్తం పథకానికి దరఖాస్తు చేయగానే వెరిఫికేషన్ చేసి మంజూరు చేశారు. మీరు అందిస్తున్న ఈ సాయం నాకు చాలా ఉపయోగపడుతుంది. అడ్వొకేట్స్ కమ్యూనిటీ నుంచి మా మద్దతు మీకు ఎప్పుడూ ఉంటుంది. – అరవింద్, అడ్వొకేట్, విజయవాడ -
నేడు వైఎస్సార్ లా నేస్తం ఆర్థిక సాయం
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన 2,677 మంది యువ న్యాయవాదుల ఖాతాల్లో నెలకు రూ.5 వేల స్టైఫండ్ చొప్పున 2023–24 సంవత్సరానికి మొదటివిడత ‘వైఎస్సార్ లా నేస్తం’ ఆర్థిక ప్రోత్సాహకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం తన క్యాంపు కార్యాలయం నుంచి బటన్ నొక్కి విడుదల చేయనున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి జూన్ వరకు (5 నెలలు) రూ. 25 వేల చొప్పున మొత్తం రూ.6,12,65,000 జమ చేయనున్నారు. ప్రభుత్వం కొత్తగా లా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన యువ న్యాయవాదులు వృత్తిలో నిలదొక్కుకునేలా మూడేళ్ల పాటు ఏడాదికి రూ.60 వేల చొప్పున రెండు దఫాల్లో చెల్లిస్తూ.. మొత్తం రూ.1.80 లక్షల ఆర్థిక సాయం అందిస్తోంది. తాజాగా విడుదల చేస్తున్న ఆర్థిక సాయంతో కలిపి ఇప్పటివరకు 5,781 మంది యువ న్యాయవాదులకు రూ.41.52 కోట్లు చెల్లించింది. న్యాయవాదుల సంక్షేమం కోసం అడ్వకేట్ జనరల్ ఆధ్వర్యంలో లా, ఫైనాన్స్ సెక్రటరీ సభ్యులుగా రూ.100 కోట్లతో ‘అడ్వకేట్స్ వెల్ఫేర్ ట్రస్ట్’ను ఏర్పాటు చేసి.. న్యాయవాదులకు రుణాలు, గ్రూప్ మెడిక్లెయిమ్ పాలసీలు, తదితర అవసరాల కోసం ఇప్పటికే రూ.25 కోట్ల సాయం అందించింది. ఆర్థిక సాయం కోరే న్యాయవాదులు ఆన్లైన్లో sec_law@ap. gov.in ద్వారా/నేరుగా లా సెక్రటరీకి దరఖాస్తు చేసుకోవాలి. వైఎస్సార్ లా నేస్తం పథకానికి సంబంధించి న్యాయవాదుల ఇబ్బందులను అధిగమించేందుకు 1902 నంబర్‌ను అందుబాటులో ఉంచింది. -
చంద్రబాబు రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటున్నారని మండిపాటు
-
సూరత్ కోర్టులో వాదనలు.. ‘మరీ ఇంత పెద్ద శిక్షా ?’
సూరత్: మోదీ ఇంటి పేరును అనుచితంగా వాడారనే పరువు నష్టం కేసులో రెండేళ్ల జైలు శిక్ష, ఎంపీగా అనర్హత వేటును ఎదుర్కొంటున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తరఫున ఆయన న్యాయవాదులు గురువారం సూరత్ కోర్టులో వాదనలు వినిపించారు. ‘ నేర నిరూపణ విధానం సవ్యంగా లేదు. ఈ కేసులో ట్రయల్ కోర్టు జడ్జి అసమతుల్య సాక్ష్యాధారాలను ఆధారం చేసుకుని తీర్పు చెప్పారు. ఎలక్ట్రానిక్ సాక్ష్యాలతో మొత్తం కేసు ఆధారపడింది. రాఫెల్ కేసులో రాహుల్ చెప్పిన బేషరతు క్షమాపణ అంశాన్ని ఈ కేసుకు సంబంధంలేకున్నా ఇందులో జతచేశారు. మరీ ఇంత పెద్ద శిక్షా ?. ఈ కేసులో గరిష్ట శిక్షను అమలుచేయాల్సిన అవసరం లేదు’ అని అదనపు సెషన్స్ జడ్జి ఆర్పీ మొగెరా ముందు రాహుల్ లాయర్ ఆర్ఎస్ ఛీమా వాదించారు. శిక్షను నిలుపుదల చేయాలని కోరారు. ‘ దొంగలందరి ఇంటి పేరు మోదీ అనే ఎందుకుంది? అనే ప్రసంగం చేసే నాటికి రాహుల్ దేశంలోనే రెండో అతిపెద్ద పార్టీకి అధ్యక్షునిగా ఉన్నారు. దేశ ప్రజలపై ఆయన ప్రసంగ ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది. ప్రసంగాన్ని సంచలనం చేయాలనేది ఆయన ఉద్దేశ్యం. ఇలాంటి పరువునష్టం కేసులు ఆయన వేర్వేరు చోట్ల చాలా ఎదుర్కొంటున్నారు. రాఫెల్ కేసులో అనుచిత వ్యాఖ్యలు, ఆనక క్షమాపణల తర్వాతా ఆయన ఇలాంటి ప్రసంగాలు చేశారు’ అని పరువునష్టం కేసు వేసిన పూర్ణేశ్ మోదీ తరఫు లాయర్ హర్షిత్ తోలియా వాదించారు. తర్వాత జడ్జి తీర్పును 20వ తేదీకి వాయిదావేశారు. -
మన లక్ష్యం.. పేదలకు ‘న్యాయం’
సాక్షి, అమరావతి: న్యాయవాదులకు అండగా ఉండేందుకు ‘వైఎస్సార్ లా నేస్తం’ తీసుకొచ్చామని, పథకం ద్వారా ప్రయోజనం పొందుతున్న వారు వృత్తి జీవితంలో పేదలకు సాయపడాలని సీఎం వైఎస్ జగన్ కోరారు. పథకంలో కొద్ది మార్పులు చేసి ఆర్నెల్లకు ఒకసారి, ఏడాదికి 2 దఫాలు చొప్పున ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. ‘వైఎస్సార్ లా నేస్తం’ ద్వారా దాదాపు 4,248 మంది లాయర్లను ప్రతి నెలా ఆదుకున్నామని వెల్లడించారు. రూ.100 కోట్లతో కార్పస్ ఫండ్ ఏర్పాటు చేయడంతోపాటు కోవిడ్ సమయంలో దాదాపు రూ.25 కోట్ల మేర లాయర్లకు ప్రయోజనం చేకూర్చినట్లు వివరించారు. పేదవాడి పట్ల న్యాయవాదులు అంకితభావం చూపాలని కోరారు. వరుసగా నాలుగో ఏడాది వైఎస్సార్ లా నేస్తం పథకం కింద రాష్ట్రవాప్తంగా 2,011 మంది అర్హులైన జూనియర్ న్యాయవాదుల ఖాతాల్లో రూ.1,00,55,000 మేర ఆర్థికసాయాన్ని సీఎం జగన్ బుధవారం క్యాంపు కార్యాలయం నుంచి బటన్ నొక్కి జమ చేశారు. సీఎం ఏమన్నారంటే.. వృత్తిలో ఊతమిచ్చేందుకు... దేవుడి దయతో గత మూడు సంవత్సరాలుగా మంచి కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాం. న్యాయవాదులకు ప్రభుత్వం తోడుగా ఉందన్న సంకేతాన్ని గట్టిగా చెప్పేందుకు ఈరోజు ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటున్నా. న్యాయవాది వృత్తిని ఎంచుకున్నవారు మన రాజ్యాంగాన్ని, చట్టాలను క్షుణ్నంగా చదువుకుని న్యాయవాదులుగా స్ధిరపడే క్రమంలో తొలి మూడేళ్లు ఎలాంటి ఇబ్బందులు ఉంటాయో పాదయాత్ర సందర్భంగా చాలాసార్లు నా దృష్టికి తెచ్చారు. వారంతా సొంత కాళ్ల మీద నిలబడే ఒక గొప్ప పథకం ఇది. ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమం న్యాయవాదులుగా స్థిరపడేందుకు దోహదం చేస్తుంది. ప్రభుత్వం వారికి తోడుగా నిలవడం వల్ల డబ్బులు లేని పేదవాడికి సాయం చేయగలుగుతారనే విశ్వాసం ఉంది. ప్రభుత్వం తమకు తోడుగా నిలిచినట్లుగానే, తాము కూడా పేదలకు సాయపడాలనే తలంపు వారి మనసులో మెదలాలన్నదే మా ఆరాటం. చదువు పూర్తి చేసుకుని న్యాయవాద వృత్తిలోకి ప్రవేశించిన తరువాత తొలి మూడేళ్లు ఇబ్బంది పడకుండా ప్రభుత్వం తోడుగా ఉందనే భరోసా ఇవ్వడం కోసం లా నేస్తం పథకాన్ని తీసుకొచ్చాం. ఇది వారికి వృత్తిలో ఊతమివ్వడంతో పాటు స్ధిరపడేందుకు దోహదం చేస్తుంది. మూడున్నరేళ్లలో 4,248 మందికి లబ్ధి.. ఈ పథకం ద్వారా మూడున్నరేళ్లలో దాదాపు 4,248 మంది లాయర్లను ప్రతి నెలా ఆదుకున్నాం. రూ.35.40 కోట్లు సహాయంగా అందించాం. ఈరోజు 2011 మంది అర్హులైన జూనియర్ న్యాయవాదులు పథకంలో కొనసాగుతున్నారు. వీరికి ఇవాళ దాదాపు రూ.కోటికి పైగా జమ చేస్తున్నాం. ఒకేసారి పెద్ద అమౌంట్ ఇస్తే వారి అవసరాలకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో పథకంలో కొద్ది మార్పులు చేసి ఆర్నెల్లకు ఒకసారి, ఏడాదికి 2 సార్లు అందచేస్తున్నాం. రూ.100 కోట్లతో కార్పస్ ఫండ్... న్యాయవాదుల సంక్షేమం కోసం మరో గొప్ప అడుగు వేసి రూ.100 కోట్లతో లాయర్ల కార్పస్ ఫండ్ నెలకొల్పాం. కోవిడ్ సమయంలో కార్పస్ ఫండ్ ద్వారా దాదాపు రూ.25 కోట్ల మేర మంచి చేయగలిగాం. అడ్వొకేట్ జనరల్ ఆధ్వర్యంలో లా, ఫైనాన్స్ సెక్రటరీలు సభ్యులుగా ఉంటూ అడ్వకేట్ వెల్ఫేర్ ట్రస్ట్ నిర్వహిస్తున్నారు. ఇందుకోసం లా సెక్రటరీకి నేరుగా దరఖాస్తుతో పాటు ఆన్లైన్లో లా సెక్రటరీ మెయిల్ ఐడీకి కూడా దరఖాస్తు చేయవచ్చు. sec&law@ap.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక లా నేస్తం పథకానికి సంబంధించి కూడా పారదర్శకంగా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉంది. ysrlawnestham.ap.gov.in వెబ్సైట్లో వివరాలను అప్లోడ్ చేసుకోవాలి. దరఖాస్తుల వెరిఫికేషన్ పూర్తి చేసి ఏ ఒక్కరూ మిస్ కాకుండా సంతృప్త స్థాయిలో ప్రయోజనం చేకూర్చేలా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. న్యాయవాది చేతిలో ఉన్న ఆయుధం.. సైనికుడి చేతిలో ఉన్న తుపాకీ లాంటిదని, హంతకుడి చేతిలో ఉండే బాకు లాంటిది కాదని చెబుతుంటారు. నేను మీ అందరికీ ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు ప్రభుత్వం చేస్తున్న మంచి ద్వారా ప్రయోజనం పొందుతున్న వారు దాన్ని గుర్తుంచుకుని అదే అంకిత భావాన్ని పేదవాడి పట్ల చూపాలని కోరుతున్నా. ఈ కార్యక్రమంలో లా సెక్రటరీ జి.సత్యప్రభాకరరావు, బెజవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రగిరి విష్ణువర్ధన్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆత్మవిశ్వాసం పెరిగింది బెజవాడ బార్ అసోసియేషన్‌లో ఏడాది నుంచి జూనియర్ న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నా. మంచి క్రిమినల్ లాయర్ అవ్వాలన్నది నా లక్ష్యం. మాది మధ్యతరగతి కుటుంబం కావడంతోకోర్టుల చుట్టూ ఎందుకు తిరుగుతావు? మంచి జీతం వచ్చే ఉద్యోగంలో చేరమని తల్లిదండ్రులు చెబుతుంటారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక వైఎస్సార్ లా నేస్తం పథకం ఎంతో ఉపయోగపడింది. దీంతో నాలో కాన్ఫిడెన్స్ పెరిగింది. తల్లిదండ్రులపై ఆధారపడకుండా నేను నిలదొక్కుకునేందుకు ఈ పథకమే కారణం. పాదయాత్ర హామీని సీఎం జగన్ నెరవేర్చడంతో చాలా సంతోషంగా ఉన్నాం,ద్యాంక్యూ సార్. –అమూల్య, లా నేస్తం లబ్ధిదారు, జూనియర్ న్యాయవాది, ఎన్టీఆర్ జిల్లా ఉన్నత చదువులకు ఉపకారం.. జూనియర్ అడ్వకేట్‌గా పని చేస్తున్నా. అమ్మ టైలరింగ్ చేస్తుండగా నాన్న ప్రైవేట్ ఉద్యోగి. 2021 నుంచి లా నేస్తం తీసుకుంటున్నా. ఈ డబ్బులు జ్యూడీషియల్ ఎగ్జామ్స్ ఫీజు కోసం, మెటీరియల్ తీసుకోవడానికి ఉపయోగపడుతోంది. ఉన్నత చదువులకు మీరు ఇస్తున్న సపోర్ట్ ఎంతో బాగుంది. విద్యార్థులకు మంచి పథకాలు ప్రవేశపెట్టారు. విదేశాల్లో చదువుకునేందుకు కూడా సాయం చేస్తున్నారు. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుని పేద విద్యార్ధులకు ఉచితంగా సాయం చేయాలనుకుంటున్నా. రాష్ట్రంలో ఎన్నో కుటుంబాలు మీవల్ల ప్రయోజనం పొందుతున్నాయి. పెన్షన్, రేషన్ ఇంటి దగ్గరే ఇస్తున్నారు. మా అమ్మకు ఇంటి పట్టా వచ్చింది. –సీహెచ్. వెన్నెల, జూనియర్ న్యాయవాది, గుంటూరు -
జూనియర్ న్యాయవాదులకు అండగా లా నేస్తం
సాక్షి, అమరావతి: లా నేస్తం పథకం కింద రాష్ట్రంలో అర్హులైన 2,011 మంది జూనియర్ న్యాయవాదుల కోసం రూ.1,00,55,000లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయనుంది. సీఎం వైఎస్ జగన్ బుధవారం సీఎం క్యాంప్ కార్యాలయంలో బటన్ నొక్కి ఆ మొత్తాన్ని జూనియర్ న్యాయవాదుల ఖాతాల్లోకి జమచేయనున్నారు. పాదయాత్రలో ఇచ్చిన హామీలో భాగంగా జూనియర్ న్యాయవాదులను ఆదుకునేందుకు ప్రభుత్వం లా నేస్తం పథకాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. లా నేస్తం ద్వారా కొత్తగా న్యాయవాద వృత్తిలోకి వచ్చిన జూనియర్ న్యాయవాదులు వృత్తిలో ఎదురయ్యే ఆర్థిక ఇబ్బందులను తట్టుకుని నిలబడేందుకు వీలుగా అర్హులైన ప్రతీ జూనియర్ న్యాయవాదికి నెలకు రూ.5వేల చొప్పున మూడేళ్లపాటు ఆర్థిక సాయం అందిస్తున్నారు. బుధవారం చెల్లించబోయే మొత్తంతో కలిపి ఇప్పటివరకు 4,248 మంది న్యాయవాదులకు మూడున్నరేళ్లలో అందించిన ఆర్థిక సాయం రూ.35.40 కోట్లు. ఇదే సమయంలో న్యాయవాదులను ఆదుకునేందుకు రూ.100 కోట్లతో కార్పస్ ఫండ్ సైతం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసింది. ఇందుకోసం అడ్వొకేట్ జనరల్ ఆధ్వర్యంలో న్యాయ, ఆర్థిక శాఖ కార్యదర్శులు సభ్యులుగా ఓ ట్రస్ట్‌ను ఏర్పాటుచేసింది. కోవిడ్ సమయంలో న్యాయవాదులను ఆదుకునేందుకు ఈ కార్పస్ ఫండ్ నుంచి రూ.25 కోట్లను వైఎస్ జగన్ ప్రభుత్వం విడుదల చేసింది. అర్హులైన న్యాయవాదులకు రుణం, బీమా, ఇతర వైద్య అవసరాల నిమిత్తం ఈ ఫండ్ నుంచి ఆర్థిక సాయం అందచేస్తారు. -
తెలంగాణ సీఎస్‌కు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ లేఖ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సీఎస్‌కు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ లేఖ రాసింది. ప్రైవేట్ లాయర్లకు ప్రభుత్వం ఎక్కువ ఖర్చు పెడుతుందని లేఖలో పేర్కొంది. ఏజీ, అడిషనల్ ఏజీ ఉండగా, ప్రైవేట్ లాయర్ల ఎందుకు అని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రశ్నించింది. గవర్నర్ రిపబ్లిక్ డే కేసుతో పాటు, ఎమ్మెల్యేల ఫాంహౌస్ కేసులోనూ ప్రభుత్వం తరుపున న్యాయవాది దుష్యంత్ దవే వాదించారు. ప్రైవేట్ న్యాయవాదులకు లక్షల్లో ఫీజులు ఇచ్చి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఫోరం ఫిర్యాదు చేసింది. చదవండి: E-Car Racing: ఓరి నాయనో ఇదేంటి! వాహనాలు రేసింగ్ ట్రాక్‌పైకి ఎలా వచ్చాయ్? -
జీవో 1లో నిషేధం అనే పదం లేదు.. రాజకీయ రాద్ధాంతమే..
సాక్షి, అమరావతి: ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ విపక్ష పార్టీల నాయకులు జీవో నం.1పై రాజకీయాలు చేస్తున్నారని విద్యావంతులు, న్యాయవాదులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేత స్వార్థ ప్రయోజనాలకు 11 మంది అమాయకులు బలైతే పోలీసులపై నిందలు వేయడం ఏమిటని నిలదీశారు. గతంలో గోదావరి పుష్కరాల సందర్భంగా రాజమహేంద్రవరంలో చంద్రబాబు పబ్లిసిటీ పిచి్చతో 29 మంది మృత్యువాత పడితే అందుకు ప్రజలదే బాధ్యతంటూ టీడీపీ నిస్సిగ్గుగా వ్యవహరించిందని మండిపడ్డారు. వాస్తవానికి మన దేశంలో న్యాయ వ్యవస్థ నిర్మాణంతో పాటు చట్టాలన్నీ బ్రిటిష్ కాలం నాటివేనని స్పష్టం చేశారు. సభలు, సమావేశాలను రోడ్లపై కాకుండా అనువైన ప్రదేశంలో తగిన జాగ్రత్తలతో నిర్వహించుకోవాలని సూచిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నం.1పై శుక్రవారం విజయవాడలో చర్చా వేదిక నిర్వహించారు. పౌర హక్కులపై ఏపీ ఇంటెలెకు్చవల్ అండ్ సిటిజన్ ఫోరం (ఎపిక్) ఆధ్వర్యంలో పి.విజయబాబు అధ్యక్షతన ఓ హోటల్లో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రసంగించారు. కొందరు రాజకీయ నాయకులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం సామాన్యులను సమిధలుగా మారుస్తున్నారని సిద్ధార్థ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ పద్మారావు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో పౌరహక్కులే ప్రధానమని, వాటి పరి రక్షణకు చట్టాలు చేయడం ప్రభుత్వాల బాధ్యతని విజయబాబు పేర్కొన్నారు. ప్రాథమిక హక్కులు అందరికీ ఉంటాయి.. రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన జీవో నం.1లో ఏముందో తెలుసుకోకుండా ఓ వర్గం మీడియా భావ కాలుష్యాన్ని సృష్టిస్తోంది. రోడ్లు, ఇరుకైన ప్రాంతాల్లో బహిరంగ సభలు నిర్వహించరాదని అందులో ఉంది. సభలు నిర్వహించుకునేందుకు ముందస్తు అనుమతి, జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. ర్యాలీలు, రోడ్డు షోలపై నిషేధం లేదు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం రోడ్లపై సభలు, సమావేశాలు నిర్వహించకూడదు. రోడ్లు ఉన్నది ప్రజలు తిరిగేందుకేగానీ సభల కోసం కాదని కోర్టు పేర్కొంది. రోడ్లను రాజకీయ క్రీడా మైదానాలుగా మారుస్తున్న కొందరు నాయకులు తమ ప్రాథమిక హక్కులకు భంగం కలుగుతున్నట్లు విష ప్రచారం చేస్తున్నారు. ప్రాథమిక హక్కులనేవి రోడ్డుపై తిరిగే ప్రతి ఒక్కరికీ ఉంటాయి. ప్రతిపక్ష నేత చంద్రబాబు నిర్వహించిన సభల్లో 11 మంది ప్రాణాలు కోల్పోయినా కమ్యూనిస్టులు స్పందించలేదు. కారకులను వదిలేసి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకున్న ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు. రోడ్లను ఆక్రమించి కట్టిన గోడ కూల్చినందుకే ఉద్యమ స్థాయిలో స్పందించిన జనసేన అధినేత 11 మంది అమాయకులు చనిపోతే ఎందుకు స్పందించడం లేదు? – పి.విజయబాబు, ఎపిక్ ఫోరం అధ్యక్షుడు చట్టంపై వక్రభాష్యం ఏదైనా దుర్ఘటన జరిగి సామాన్యులకు ఇబ్బందిగా, ప్రమాదకరంగా మారినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. రాష్ట్ర ప్రభుత్వం జీవో నం.1తో తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించింది. ఈ చట్టం ప్రతి ఒక్కరికీ వర్తిస్తుంది. తన చర్యలతో ప్రాణాలు పోతున్నా పట్టించుకోకుండా హక్కులను వినియోగించుకుంటున్నానని చెప్పే వారిని ఏమనాలి? రోడ్లపై ర్యాలీలు నిర్వహించరాదని చట్టంలో లేదు. సభలు మాత్రమే వద్దని అందులో పేర్కొన్నారు. – జి.రామచంద్రారెడ్డి, రిటైర్డ్ ప్రొఫెసర్ చట్టాలన్నీ బ్రిటిష్ కాలం నాటివే.. శాంతి భద్రతలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. ప్రస్తుతం దేశంలో అమలు చేస్తున్న చట్టాలన్నీ బ్రిటిష్ కాలం నాటివే. అలాంటి వాటిలో 1861 పోలీస్ చట్టం ఒకటి. జీవో నం.1 పోలీస్ చట్టానికి అనుగుణంగానే ఉంది. ఇందులోని నిబంధనలు ఎప్పటి నుంచో ఆచరణలో ఉన్నాయి. చంద్రబాబు ప్రభుత్వంలోనూ ఈ నిబంధనలు ఉన్నాయి. ఇప్పుడు రాజకీయ లబ్ధి కోసం రాద్ధాంతం చేస్తున్నారు. బహిరంగ సభల నిర్వహణకు ఏర్పాట్ల బాధ్యత నిర్వాహకులదే. సమయం, ప్రదేశం, ఎంతమంది వచ్చే అవకాశం ఉంది? ఎప్పటి నుంచి ఎప్పటిదాకా నిర్వహిస్తారు? వలంటీర్ల ఏర్పాటు లాంటి వివరాలతో పోలీసుల అనుమతి తీసుకోవాలి. నిర్దిష్ట సమయానికి నిర్వహించలేకపోతే కారణాలను వివరిస్తూ మరోసారి అనుమతి పొందాలి. పోలీసులు సభ సజావుగా జరిగేందుకు సహకరించాలని చట్టంలో ఉంది. జీవో నం.1లో సభలపై నిషేధం గానీ, అభ్యంతరకర అంశాలుగానీ లేవు. – ఏఎస్ఎన్ రెడ్డి, రిటైర్డ్ ఎస్పీ జీవో వచ్చాక కూడా సభలు జరిగాయ్ ఓ ఘటన జరిగినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం జీవో నం.1 తెచ్చింది. ఇది సభలను, ర్యాలీలను నిషేధిస్తూ చేసింది కాదు. ఈ చట్టం చేశాక ఒంగోలులో బాలకృష్ణ, విశాఖలో చిరంజీవి సినిమా సభలు జరిగాయి. తర్వాత పవన్ కళ్యాణ్ సభ కూడా జరిగింది. ఒకవేళ జీవోలో నిషేధం అని ఉంటే ఈ సభలు జరిగేవా? ప్రతిపక్ష పార్టీలు స్వలాభం కోసం ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నాయి. 14 ఏళ్లు సీఎంగా చేసిన వ్యక్తికి ఈ చట్టంలో ఏముందో తెలియదంటే అవివేకమే అవుతుంది. – పిళ్లా రవి, న్యాయవాది రోడ్లను దిగ్బంధించే హక్కు లేదు నిరసనలు తెలిపేందుకు, బహిరంగ సభల నిర్వహణకు ప్రత్యేక వేదికలుంటాయి. అక్కడ మాత్రమే చేపట్టాలి. రోడ్లను దిగ్బంధించి సభలు నిర్వహించే హక్కు ఎవరికీ లేదని కేరళ హైకోర్టు గతంలో తీర్పునిచ్చింది. దండి మార్చ్ సైతం మహాత్మాగాంధీ 78 మందితోనే నిర్వహించారు. ఇప్పుడు రాజకీయ నేతలు తమ ఉనికిని చాటుకునేందుకు, స్వలాభం కోసం రోడ్లను దిగ్బంధిస్తున్నారు. ఏదైనా దుర్ఘటన జరిగినప్పుడు పునరావృతం కాకుండా సరిదిద్దే బాధ్యత ప్రభుత్వానిది. అందుకోసమే జీవో నం.1 జారీ చేశారు. అందులో సభలు, ర్యాలీలను నిషేధించలేదు. రోడ్లపై సభలు వద్దని మాత్రమే పేర్కొన్నారు. ప్రత్యేక ప్రదేశంలో నిర్వహించే సభలకు ముందస్తు అనుమతి తీసుకోవాలని, తగిన జాగ్రత్తలు చేపట్టాలని సూచించారు. ఈ జీవోను అమలు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని ఓ యువకుడు హైకోర్టుకు వెళితే దీనిపై వెంటనే స్పందించాల్సిన అవసరం లేదని న్యాయస్థానం పేర్కొంది. కానీ నాలుగు రోజుల్లోనే ఈ జీవోను రద్దు చేయాలని ఒకరు ఆశ్రయిస్తే ఇది బ్రిటీష్ కాలం నాటి చట్టమని ఆక్షేపించింది. వాస్తవానికి మన న్యాయ వ్యవస్థ నిర్మాణం, చట్టాలన్నీ బ్రిటిష్ కాలం నాటివే. – కృష్ణంరాజు, ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు -
న్యాయవాదుల సంక్షేమానికి కృషి
సాక్షి, హైదరాబాద్: న్యాయవాదుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని, వారి సమస్యల పరిష్కారానికి సహకారం అందిస్తామని న్యాయశాఖమంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. దేశంలో తొలిసారిగా న్యాయవాదుల సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.100 కోట్లు కేటాయించిందని తెలిపారు. నిధుల నిర్వహణ బాధ్యతను అడ్వొకేట్ వెల్ఫేర్ ట్రస్ట్‌కు అప్పగించిన విషయాన్ని గుర్తు చేశారు. అరణ్యభవన్‌లో శనివారం న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డిని తెలంగాణ బార్ కౌన్సిల్ చైర్మన్ నరసింహారెడ్డి, కౌన్సిల్ సభ్యులు కలిసి న్యాయవాదుల సంక్షేమానికి సంబంధించిన పలు అంశాలపై వినతిపత్రం అందజేశారు. తెలంగాణ న్యాయవాదుల సంక్షేమనిధికి ప్రతి ఏడాది రూ.10 కోట్ల మ్యాచింగ్ గ్రాంట్ మంజూరు చేయాలని, దీనివల్ల సభ్యులకు, మరణించిన లాయర్ల కుటుంబాలకు ప్రయోజనం కలుగుతుందని మంత్రికి వివరించారు. మరణించిన న్యాయవాది నామినీకి న్యాయవాదుల సంక్షేమం నిధి ద్వారా రూ.4 లక్షలు చెల్లిస్తున్నామని, ప్రభుత్వం తరఫున అదనంగా మరో రూ.4 లక్షలు, జూనియర్ న్యాయవాదులకు మూడేళ్ల కాలపరిమితికి ప్రతీ నెల రూ.ఐదువేలు ఉపకార వేతనం చెల్లించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కాగా, ఈ అంశాలను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు దృష్టికి తీసుకెళ్తామని మంత్రి హమీనిచ్చారు. మంత్రిని కలిసిన వారిలో కౌన్సిల్ సభ్యులు గండ్ర మోహన్‌రావు, రాజేందర్‌రెడ్డి, కిరణ్ పాలకుర్తి, న్యాయశాఖ అదనపు కార్యదర్శి మన్నన్ తదితరులు ఉన్నారు. -
జడ్జిల బదిలీలను వివాదాస్పదం చేయడం సరికాదు: లాయర్లు
విజయవాడ: జడ్జిల బదిలీలను వివాదాస్పదం చేయడం సరికాదని ఏపీ హైకోర్టు లాయర్లు తెలిపారు. న్యాయమూర్తులు, న్యాయవాదులకు కులాలు,మతాలు ఆపాదించడం తగదన్నారు. కొలీజియం నిర్ణయం మేరకే జడ్జిల నియామకాలు, బదిలీలు ఉంటయాన్నారు. జడ్జిల బదిలీల అంశానికి సంబంధించి సీఎం జగన్‌పై తప్పుడు ప్రచారం చేయడం మంచిది కాదన్నారు. అసలు కులాలు, మతాలతో రాజకీయం చేసేది చంద్రబాబేనని వారు స్పష్టం చేశారు. -
రాజధాని భూములను ఇతర అవసరాలకు వాడకూడదు
సాక్షి, అమరావతి: రాజధాని కోసం ఇచ్చిన భూములను ఆ ప్రయోజనం కోసం కాకుండా, ఇతర అవసరాలకు ఉపయోగించడం చట్ట విరుద్ధమని అమరావతి రైతుల తరఫు సీనియర్ న్యాయవాది బి.ఆదినారాయణరావు బుధవారం హైకోర్టుకు నివేదించారు. రాజధాని నిర్మాణం కోసం ఉపయోగించాల్సిన భూములను ఇతరులకు ఇళ్ల స్థలాల కోసం కేటాయించడం మాస్టర్ ప్లాన్‌కు విరుద్ధమని అన్నారు. సీఆర్డీఏ చట్ట సవరణ ద్వారా రాజధానిలో రాజధానేతరులకు ఇళ్ల స్థలాలు కేటాయించకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని హైకోర్టును కోరారు. మధ్యంతర ఉత్తర్వుల జారీ వ్యవహారంలో రైతుల తరఫు న్యాయవాదుల వాదనలు ముగియడంతో ప్రభుత్వం, సీఆర్డీఏ వాదనల నిమిత్తం హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావు, జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాజధాని ప్రాంతంలో ఇతర ప్రాంతాల వారికి కూడా ఇళ్ల స్థలాలు మంజూరుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలను సవాలు చేస్తూ అమరావతి రైతు సంఘాలు వేర్వేరుగా వేసిన పిటిషన్లు, ఇళ్ల స్థలాలు కేటాయించకుండా యథాతథస్థితి కొనసాగించేలా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ వేసిన అనుబంధ పిటిషన్లపై జస్టిస్ దుర్గాప్రసాదరావు ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ జరిపింది. పిటిషనర్ల తరఫున బి.ఆదినారాయణరావు, కారుమంచి ఇంద్రనీల్ వాదనలు వినిపించారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలనుకుంటే తగిన పరిహారం చెల్లించి భూ సేకరణ ద్వారా కేటాయించాలే తప్ప, రాజధాని కోసం తామిచ్చిన భూముల్లో స్థలాలు ఇవ్వడానికి వీల్లేదని అన్నారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం ద్వారా రాజధాని నగరాన్ని మురికివాడగా మార్చకూడదన్నదే తమ వాదనని తెలిపారు. -
చెంగల్రాయుడును అరెస్ట్ చేయాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్)/విజయవాడ స్పోర్ట్స్/సాక్షి, భీమవరం/ఉండి/నెల్లూరు(లీగల్): రాజ్యాంగబద్ధమైన పోలీసు, న్యాయ వ్యవస్థలపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లేలా కుట్రపూరితమైన వ్యాఖ్యలు చేసిన టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయుడును తక్షణమే అరెస్ట్ చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం డిమాండ్ చేసింది. కర్నూలు జిల్లాలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశంలో చెంగల్రాయుడు పోలీసు, న్యాయ వ్యవస్థలను కించపరిచే విధంగా పరుష పదజాలంతో దూషించడాన్ని తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు ఏపీ పోలీసు అధికారుల సంఘ అధ్యక్షుడు జె.శ్రీనివాసరావు విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా 14 ఏళ్లు పనిచేసిన చంద్రబాబు సమక్షంలోనే చెంగల్రాయుడు పోలీసు, న్యాయ వ్యవస్థలను తిడుతూ కుట్రపూరిత వ్యాఖ్యలు చేశారని, అయినా ఆయన ఖండించకపోవడం అత్యంత దుర్మార్గమని అన్నారు. ఇందుకు రాష్ట్ర ప్రజలకు, పోలీసు, న్యాయ వ్యవస్థలకు చంద్రబాబు బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. చెంగల్రాయుడు లాంటి వ్యక్తులను చట్టసభలకు పంపిన చంద్రబాబు సిగ్గుపడాలన్నారు. ఇటీవల కొంతమంది నాయకులు తమ రాజకీయ స్వార్థం, స్వలాభం కోసం పోలీసు వ్యవస్థపై పరుష పదజాలంతో నిరాధారమైన, అవాస్తవమైన వ్యాఖ్యలు చేయడం పరిపాటిగా మారిందన్నారు. మాజీ సీఎం చంద్రబాబు ఒక సందర్భంలో పోలీసులను కట్టు బానిసలుగా అభివర్ణించారని, దానిని కూడా ఖండిస్తున్నామని శ్రీనివాసరావు చెప్పారు. పోలీసులు రాజ్యాంగానికి, చట్టాలకు లోబడి విధులు నిర్వహించడంలో మాత్రమే కట్టు బానిసలుగా ఉంటారని స్పష్టంచేశారు. పోలీసు వ్యవస్థ మీద విమర్శలపై న్యాయపోరాటం చేస్తామన్నారు. ఈ సమావేశంలో ఏపీ పోలీసు అధికారుల సంఘ ఉపాధ్యక్షుడు ఆర్.రఘురాం, సీఐడీ యూనిట్ అధ్యక్షుడు అక్కిరాజు, పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షుడు ఆర్.నాగేశ్వరరావు, సభ్యుడు సత్యారావు, విజయవాడ నగర అధ్యక్షుడు ఎం.సోమయ్య పాల్గొన్నారు. చెంగల్రాయుడు, చంద్రబాబుపై విజయవాడలో సీపీకి న్యాయవాదుల ఫిర్యాదు న్యాయ, పోలీసు వ్యవస్థలను కించపరిచేలా టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ విజయవాడకు చెందిన న్యాయవాదులు మంగళవారం ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ టీకే రాణాకు ఫిర్యాదు చేశారు. చెంగల్రాయుడును ప్రోత్సహించిన చంద్రబాబుపై కూడా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. సీపీకి ఫిర్యాదు చేసిన వారిలో న్యాయవాదులు జి.నాగిరెడ్డి, పి.నిర్మల్ రాజేష్, జె.జయలక్ష్మి, నరహరిశెట్టి శ్రీహరి, కె.వెంకటేష్‌శర్మ, గవాస్కర్, జి.కిరణ్, ఎస్.పరమేష్, బసవారెడ్డి, పి.రాంబాబు, కె.ప్రభాకర్, బి.రమణి, అల్లాభక్షు, ఎం.విఠల్‌రావు, ఎన్.కోటేశ్వరరావు, శ్రీకాంత్ తదితరులు ఉన్నారు. పలు ప్రాంతాల్లో ఫిర్యాదులు చెంగల్రాయుడు, చంద్రబాబుపై భీమవరం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో, పశ్చిమగోదావరి జిల్లా ఉండి పోలీస్ స్టేషన్లో, ఏలూరులో, నెల్లూరులోని చిన్నబజారు పోలీస్‌స్టేషన్‌లో, తిరుపతిలో వైఎస్సార్సీపీ లీగల్ సెల్ నాయకులు ఫిర్యాదు చేశారు. చెంగల్రాయుడు వ్యాఖ్యలతో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని, ఆయనపై చర్యలు చేపట్టాలని కోరారు. న్యాయ వ్యవస్థ, పోలీసులను కించపరిచేలా చెంగల్రాయుడు వ్యాఖ్యలు చేశారని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయనను ప్రోత్సహించిన చంద్రబాబుపై కూడా చర్యలు తీసుకోవాలని కోరారు. -
చంద్రబాబు కాన్వాయ్ ను అడుగడుగునా అడ్డుకుంటున్న విద్యార్థి సంఘాలు, న్యాయవాదులు
-
చంద్రబాబుకు చేదు అనుభవం.. గో బ్యాక్ అంటూ నినాదాలు
కర్నూలు జిల్లా: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు మరోసారి జిల్లాలో చేదు అనుభవం ఎదురైంది. వికేంద్రీకరణ అంశంతో పాటు కర్నూలులో హైకోర్టు ఏర్పాటు అంశానికి సంబంధించి చంద్రబాబు వైఖరి ఏమిటో తెలపాలని న్యాయవాదులు శుక్రవారం ధర్మా చేపట్టారు. ఈ క్రమంలోనే కర్నూలులో చంద్రబాబు బస చేసే హోటల్ ముందు న్యాయవాదులు ధర్నాకు దిగారు. చంద్రబాబు డౌన్ డౌన్ అంటూ నిరసన చేపట్టారు. న్యాయ రాజధానిని వ్యతిరేకిస్తున్న చంద్రబాబు గో బ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం న్యాయ రాజధానికి అంగీకరించాల్సిందేనని వారు డిమాండ్ చేశారు. రాయలసీమ ద్రోహి చంద్రబాబు.. ఇక్కడ అడుగుపెట్టే అధికారం లేదని న్యాయవాదుల సంఘం హెచ్చరించింది. ఇక్కడ చదవండి: కర్నూలులో చంద్రబాబుకు అడుగడుగునా నిరసన సెగ -
చంద్రబాబు పర్యటనను అడ్డుకుంటాం : న్యాయవాదులు
-
కోర్టులో లేడీ లాయర్ల ఫైటింగ్ .. వీడియో వైరల్..
-
3,432 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
సాక్షి, అమరావతి: అటు హైకోర్టుతోపాటు ఇటు జిల్లా కోర్టుల్లో సుదీర్ఘకాలంగా ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి హైకోర్టు చర్యలు చేపట్టింది. ప్రధానంగా హైకోర్టులో పెద్ద సంఖ్యలో పోస్టుల ఖాళీలతో ప్రస్తుతమున్న ఉద్యోగులు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఇది హైకోర్టు పాలనపై తీవ్ర ప్రభావం చూపుతుండటంతో ఖాళీల భర్తీపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా దృష్టిసారించారు. ఇందులో భాగంగా ఇటీవల ఉద్యోగులందరికీ పదోన్నతులు కల్పించి తద్వారా ఏర్పడిన ఖాళీలను సైతం ఇప్పటికే ఉన్న ఖాళీలతో కలిపి భర్తీచేయాలని నిర్ణయించారు. జిల్లా కోర్టుల్లో వివిధ కేటగిరీల్లో.. అందుకనుగుణంగా హైకోర్టులో వివిధ కేటగిరీల్లో 241 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీచేసింది. అలాగే, జిల్లా కోర్టులు కూడా ఉద్యోగుల కొరతను ఎదుర్కొంటున్నాయి. ఆ వివరాలన్నింటినీ ఆయా కోర్టుల నుంచి తెప్పించుకున్న ప్రధాన న్యాయమూర్తి అక్కడ ఖాళీల భర్తీకీ ఆదేశాలిచ్చారు. వీటి ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జిల్లా కోర్టుల్లో వివిధ కేటగిరీల్లో 3,432 పోస్టుల భర్తీకి హైకోర్టు వర్గాలు నోటిఫికేషన్లు జారీచేశాయి. అటు హైకోర్టు, ఇటు జిల్లా కోర్టుల్లో పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్లను హైకోర్టు వెబ్సైట్ http://hc.ap.nic.inలో పొందుపరిచారు. దరఖాస్తు చివరి తేదీ ఇదే.. ఇక హైకోర్టు ఉద్యోగాల దరఖాస్తులను హైకోర్టు వెబ్సైట్లో, జిల్లా కోర్టుల్లో ఉద్యోగాల దరఖాస్తులను హైకోర్టు, ఆయా జిల్లాల ఈ–కోర్టు వెబ్సైట్లలో అందుబాటులో ఉంచారు. హైకోర్టు ఉద్యోగాలకు ఈ నెల 29 నుంచి నవంబర్ 15వరకు అందుబాటులో ఉంటాయి. దరఖాస్తులను నవంబర్ 15 రాత్రి 11.59లోపు ఆన్లైన్లో సమర్పించాల్సి ఉంటుంది. జిల్లా కోర్టుల్లో ఉద్యోగాలకు ఈనెల 22 నుంచి నవంబర్ 11 వరకు దరఖాస్తులు అందుబాటులో ఉంటాయి. దరఖాస్తులను నవంబర్ 11 రాత్రి 11.59 లోపు ఆన్లైన్ ద్వారానే సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తుల పరిశీలన తరువాత పరీక్షా షెడ్యూల్‌ను తెలియజేస్తారు. దరఖాస్తు ఫీజు ఇలా.. : ఓసీ, ఈడబ్ల్యూఎస్, బీసీ అభ్యర్థులు రూ.800, ఎస్సీ, ఎస్టీ దివ్యాంగుల అభ్యర్థులు రూ.400లను ఫీజుగా చెల్లించాలి. ప్రతీ పోస్టుకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఉంటుంది. కానీ, హైకోర్టులో సెక్షన్ ఆఫీసర్ (ఎస్ఓ), అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (ఏఎస్ఓ) పోస్టులను పదోన్నతుల ద్వారా కాకుండా ప్రత్యక్షంగా భర్తీచేస్తున్నారు. ఈ మేరకు హైకోర్టు రిజిస్ట్రార్ ఆలపాటి గిరిధర్ వేర్వేరు నోటిఫికేషన్లు జారీచేశారు. హైకోర్టులో పోస్టుల ఖాళీల వివరాలు ఇలా.. ► ఆఫీస్ సబార్డినేట్–135 ►కాపీయిస్టు–20 ►టైపిస్ట్–16 ►అసిస్టెంట్–14 ►అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్–13 ►ఎగ్జామినర్–13 ►కంప్యూటర్ ఆపరేటర్లు–11 ►సెక్షన్ ఆఫీసర్లు–9 ►డ్రైవర్లు–8 ►ఓవర్సీర్–1 ►అసిస్టెంట్ ఓవర్సీర్–1 ►మొత్తం 241 పోస్టులు. జిల్లా కోర్టుల్లో పోస్టుల ఖాళీల వివరాలు ఇవే.. ►ఆఫీస్ సబార్డినేట్–1,520 ►జూనియర్ అసిస్టెంట్–681 ►ప్రాసెస్ సర్వర్–439 ►కాపీయిస్టు–209 ►టైపిస్ట్–170 ►ఫీల్డ్ అసిస్టెంట్–158 ►స్టెనోగ్రాఫర్ (గ్రేడ్–3)–114 ►ఎగ్జామినర్–112 ►డ్రైవర్(ఎల్వీ)–20 ►రికార్డ్ అసిస్టెంట్–9 ►మొత్తం 3,432 పోస్టులు. -
కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయండి
సాక్షి ప్రతినిధి, కర్నూలు: కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని కర్నూలు జిల్లా బార్ అసోసియేషన్ ప్రతినిధులు సీఎం వైఎస్ జగన్‌ను కోరారు. రామ్‌కో సిమెంట్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం అనంతరం హెలిప్యాడ్‌లో ఆయనకు వినతిపత్రం ఇచ్చారు. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం హైకోర్టును ఏర్పాటు చేయాలని, అమరావతి నుంచి కర్నూలుకు హైకోర్టు తరలించేవరకు ఉద్యమం కొనసాగిస్తామని తెలిపారు. సీఎంను కలిసిన వారిలో కృష్ణరంగడు, పుల్లారెడ్డి, జయరాజ్, ఓంకార్, రవిగువేరా, నరసింహ, లక్ష్మీనారాయణ ఉన్నారు. -
కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేసే వరకు ఉద్యమం
కర్నూలు(లీగల్): హైకోర్టును అమరావతి నుంచి కర్నూలుకు తరలించే వరకు ఉద్యమం ఆపేది లేదని న్యాయవాదులు స్పష్టంచేశారు. కర్నూలులోని ధర్నా చౌక్‌లో బార్ అసోసియేషన్ ఆధ్వర్యాన చేపట్టిన నిరాహార దీక్షలు మంగళవారం కూడా కొనసాగాయి. న్యాయవాదులు నరసింహ, సంపత్‌కుమారి, బి.కృష్ణమూర్తి, సోమశేఖర్ తదితరులు దీక్షలో కూర్చున్నారు. దీక్షా శిబిరం వద్దకు ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ధర్మవరం, కదిరితోపాటు ఉమ్మడి కర్నూలు జిల్లాలోని నంద్యాల, డోన్, ఆళ్లగడ్డకు చెందిన న్యాయవాదులు వచ్చి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ధర్మవరం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సురేష్ చౌదరి, కార్యదర్శి దస్తగిరి మరికొందరు మాట్లాడుతూ హైకోర్టు కర్నూలులో ఏర్పాటు చేసేవరకు ఉద్యమం కొనసాగిస్తామని చెప్పారు. బీఎస్ఎన్ఎల్ ఉద్యోగుల సంఘం నాయకుడు భాస్కర్‌రెడ్డి కూడా న్యాయవాదులకు మద్దతు తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని బుధవారం కొలిమిగుండ్ల ప్రాంతంలో కలసి వినతిపత్రం సమరి్పస్తామని కర్నూలు బార్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎంఆర్ కృష్ణ, కాటం రంగడు, బార్ కౌన్సిల్ సభ్యుడు పి.రవిగువేరా, రాయలసీమ న్యాయవాదుల ఐక్యకార్యాచరణ కమిటీ నేత వై.జయరాజు, ఓంకార్ తెలిపారు. సీఎం జగన్‌ను కలిసిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు. -
కర్నూలుకు హైకోర్టును తరలించాల్సిందే
కర్నూలు(సెంట్రల్): ఏపీ హైకోర్టును అమరావతి నుంచి కర్నూలుకు తరలించాల్సిందేనని ఏపీ హైకోర్టు సీనియర్ న్యాయవాది జయరాజు డిమాండ్ చేశారు. హైకోర్టును కర్నూలుకు తరలించాలని న్యాయవాదులు చేపట్టిన దీక్షలు ఆదివారంతో ఏడో రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్నూలుకు హైకోర్టును తరలించే వరకు దీక్షలను కొనసాగిస్తామన్నారు. సీఎం వైఎస్ జగన్ హైకోర్టును కర్నూలుకు తరలించేందుకు సానుకూలంగా ఉన్నా ప్రతిపక్ష పార్టీలు అమరావతి భ్రమలో ఉన్నాయన్నారు. శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం రాజధాని కోస్తాలో ఉంటే హైకోర్టు రాయలసీమలో ఉండాలన్నారు. దీనిని అమలు చేయకుండా గతంలో చంద్రబాబు సీమకు అన్యాయం చేశారన్నారు. దీక్షల్లో న్యాయవాదులు శ్రీనివాసులు, సోమశేఖర్, కె.రవికుమార్, ఎం.సుంకన్న, ఎం.మహావిష్ణు విజయలక్ష్మి కూర్చున్నారు. వారికి బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు ఎంఆర్ కృష్ణ, కె.రంగడు, రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు పి.రావిగువేరా, సీనియర్ న్యాయవాదులు ఓంకార్, వెంకటస్వామి, సుబ్బయ్య మద్దతు తెలిపారు. -
హైకోర్టును కర్నూలుకు తరలించాలి
కర్నూలు(సెంట్రల్/లీగల్): కర్నూలుకు వెంటనే హైకోర్టును తరలించాలని కర్నూలు జిల్లా బార్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. గురువారం కర్నూలు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు విధులు బహిష్కరించి.. కలెక్టరేట్ వరకు బైక్ ర్యాలీ చేశారు. అనంతరం కలెక్టరేట్ వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎంఆర్ కృష్ణ, జేఏసీ కన్వీనర్ వై.జయరాజ్ మాట్లాడుతూ.. గతంలో కర్నూలుకు జరిగిన అన్యాయాన్ని కొంతవరకైనా తగ్గించాలంటే హైకోర్టును ఏర్పాటు చేయాల్సిందేనన్నారు. సీఎం వైఎస్ జగన్ హైకోర్టు ఏర్పాటుకు సానుకూలంగా ఉన్నారని, టీడీపీ అధినేత చంద్రబాబు అమరావతి పేరుతో రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. హైకోర్టు తరలింపును అడ్డుకునే పార్టీలకు వచ్చే ఎన్నికల్లో తమ సత్తా ఏంటో తెలియజేస్తామన్నారు. హైకోర్టు తరలింపు కోసం వెంటనే తీర్మానం చేసి కేంద్రానికి పంపించాలని కోరారు. అసెంబ్లీ సమావేశాలు పూర్తయ్యే వరకు విధులను బహిష్కరించి.. తమ ఆందోళన తెలియజేస్తామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు పి.రవిగువేరా, సీనియర్ న్యాయవాదులు ఓంకార్, వి.నాగలక్ష్మీ, పి.సువర్ణరెడ్డి, ఎం.సుబ్బయ్య, బి,చంద్రుడు, కర్నాటి పుల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలి
కర్నూలు (లీగల్): రాష్ట్ర హైకోర్టును కర్నూలులో ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు ప్రతిపక్ష పార్టీలు సహకరించి సీమ ప్రజల చిరకాల వాంఛను తీర్చాలని కర్నూలు న్యాయవాదులు డిమాండ్ చేశారు. రాష్ట్ర శాసనసభ సమావేశాలు గురువారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని కోరారు. కర్నూలులో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం.ఆర్.కృష్ణ, సీమ న్యాయవాదుల జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ వై.జయరాజు, రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు పి.రవిగువేరా, సీనియర్ న్యాయవాదులు ఓంకార్, నాగలక్ష్మీదేవి, ఎం.సుబ్బయ్య, పి.సువర్ణరెడ్డి, బి.చంద్రుడు, రాజేష్, రంగనాథ్ మాట్లాడారు. హైకోర్టును కర్నూలుకు తరలించేందుకు ప్రభుత్వం మూడు సంవత్సరాలుగా ప్రయత్నిస్తున్నా టీడీపీ అధినేత చంద్రబాబు అడ్డుకుంటున్నారని దుయ్యబట్టారు. సీమలో హైకోర్టు ఏర్పాటు చరిత్రాత్మక అవసరమే కాకుండా మూడుప్రాంతాల సమతుల్యానికి దోహదం చేస్తుందన్నారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు టీడీపీ తప్ప అన్ని రాజకీయ పార్టీలు మద్దతిచ్చాయని గుర్తుచేశారు. శాసన రాజధాని, కార్యనిర్వాహక రాజధానులతో సంబంధం లేకుండా తక్షణం రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని కోరారు. ఈ మేరకు సీఎం జగన్‌కు, ప్రతిపక్ష నేతకు, సీమప్రాంత ఎమ్మెల్యేలు, ఎంపీలకు వినతిపత్రాలు ఇస్తామని చెప్పారు. -
హైకోర్టులో 35 మంది ప్యానెల్ అడ్వొకేట్ల నియామకం
సాక్షి, అమరావతి: రాష్ట్ర హైకోర్టులో కేంద్రం తరఫున వాదనలు వినిపించేందుకు 35 మంది న్యాయవాదులతో కూడిన ప్యానెల్‌ను నియమిస్తూ కేంద్ర న్యాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రైల్వే క్లెయిమ్స్ ట్రిబ్యునల్ (అమరావతి)లో వాదనలు వినిపించేందుకు మరో ఏడుగురు న్యాయవాదులను నియమించింది. వీరంతా మూడేళ్లు లేదా తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు ఈ పోస్టుల్లో కొనసాగుతారు. హైకోర్టులో నియమితులైన న్యాయవాదులంతా కూడా అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ (ఏఎస్జీ) ఎన్.హరినాథ్ మార్గదర్శకత్వంలో పనిచేశారు. కేంద్ర ప్రభుత్వ ప్యానెల్ న్యాయవాదులుగా నియమితులైనవారిలో సాగి శ్రీనివాసవర్మ, జోస్యుల భాస్కరరావు, బొమ్మినాయుని అప్పారావు, ఏవీఎస్ రామకృష్ణ, తాత సింగయ్య గౌడ్, గేదెల తుహిన్ కుమార్, అంబటి సత్యనారాయణ, మల్లంపల్లి శ్రీనివాస్, సీవీఆర్ రుద్రప్రసాద్, అరవల శ్రీనివాసరావు, మంచాల ఉమాదేవి, పోతంశెట్టి విజయకుమారి, బేతంపల్లి సూర్యనారాయణ, బాచిన హనుమంతరావు, తానేపల్లి నిరంజన్, అరవ రవీంద్రబాబు, గుడిసేవ నరసింహారావు, గుండుబోయిన వెంకటేశ్వర్లు, పసల పున్నారావు, గేదెల సాయి నారాయణరావు, వి.వెంకట నాగరాజు, ఇ.అంజనారెడ్డి, కామిని వెంకటేశ్వర్లు, తుమ్మలపూడి శ్రీధర్, ఓరుగంటి ఉదయ్ కుమార్, కె.శ్రీధర్ మూర్తి, సోమిశెట్టి గణేష్ బాబు, తడసిన అలేఖ్య రెడ్డి, వైవీ అనిల్ కుమార్, సోమసాని దిలీప్ జయరామ్, పల్లేటి రాజేష్ కుమార్, పామర్తి కామేశ్వరరావు, మన్నవ అపరాజిత, షేక్ బాజీ, గొర్రెముచ్చు అరుణ్ శౌరి ఉన్నారు. రైల్వే క్లెయిమ్స్ ట్రిబ్యునల్‌లో నియమితులైన వారిలో కవిపురపు పట్టాభి రాముడు, గొరికపూడి అంకమ్మరావు, ఎన్.వీరప్రసాద్, సీతిరాజు రామకృష్ణ, మాదాల ఆదిలక్ష్మి, షేక్ మంజూర్ అహ్మద్, బి.బి.లక్ష్మయ్య ఉన్నారు. -
విభిన్న ప్రతిభావంతుల కోసం ‘నల్సా’ కొత్త పథకం
కడప అర్బన్ : విభిన్న ప్రతిభావంతుల కోసం జాతీయ న్యాయ సేవాధికారసంస్థ (నల్సా) కొత్త పథకాన్ని అమల్లోకి తీసుకువచ్చిందని జిల్లా న్యాయసేవాధికార సంస్థ సెక్రటరీ, జడ్జి ఎస్. కవిత తెలిపారు. శుక్రవారం కడపలోని జిల్లా కోర్టు ఆవరణలో న్యాయసేవాసదన్‌లో విభిన్న ప్రతిభావంతుల కోసం నల్సా రూపొందించిన న్యాయ సేవలు పథకం 2021పై అవగాహన సదస్సు నిర్వహించారు. జడ్జి కవిత మాట్లాడుతూ ఈ పథకం గురించి విస్తృత ప్రచారం చేయాల్సిన అవసరం ఉందన్నారు. దీనిలో భాగంగా మానసిక, శారీరక దివ్యాంగులైన పిల్లల హక్కుల పరిరక్షణ, వారి సంక్షేమానికి సంబంధిత శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. విభిన్న ప్రతిభావంతులైన పిల్లల పట్ల వివక్ష చూపరాదని, 18 సంవత్సరాలు వచ్చేంతవరకు ఉచిత విద్యను అందించాలన్నారు. వీరికి ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ప్రవేశాలు, ప్రత్యేక సదుపాయాలు కల్పించాలన్నారు. న్యాయసేవలు ఉచితంగా అందజేస్తామన్నారు. కొత్తపథకంపై పాఠశాలలు, ఆసుపత్రులు, పంచాయతీ కార్యాలయాల్లో బోర్డులు ప్రదర్శించాలని జడ్జి వివరించారు. కార్యక్రమంలో భాగంగా అంధులైన పిల్లలకు డైజీ ప్లేయర్స్, విభిన్న ప్రతిభావంతులైన పిల్లలకు టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్, వీల్ చైర్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతులు, వారి తల్లిదండ్రులు, వెల్ఫేర్ ఆఫ్ డిఫరెంట్లీ ఆబ్లెడ్ ట్రాన్స్‌జెండర్ అండ్ సీనియర్ సిటిజన్స్, ఎస్ఎస్ఏ పీఓ ప్రభాకర్‌రెడ్డి, అడిషనల్ డీఎంహెచ్ఓ డాక్టర్ ఖాదర్‌బాష, అన్నమయ్య జిల్లా విద్యాశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ పి. నరసింహులు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ సాంబశివరావు, లీగల్ కమ్ ప్రొహిబిషన్ ఆఫీసర్ సునీతరాజ్, అన్నమయ్య జిల్లా డీసీపీఓ సుభాష్‌యాదవ్, జిల్లా ప్రొహిబిషన్ ఆఫీసర్ చెన్నారెడ్డి, రాష్ట్రీయ సేవాసమితి, ఆల్షిఫా ఇనిస్టిట్యూట్ కరస్పాండెంట్ రఫి, హెలెన్‌కెల్లర్ గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూట్ సిబ్బంది పాల్గొన్నారు. -
అంతంత ఫీజులు సామాన్యుడు ఎలా భరించగలడు?
జైపూర్: పౌరులకు ఉచిత న్యాయసేవను అందిస్తున్న దేశాల్లో మనది ఒకటి. అలాంటి దేశంలో కేసుల కోసం లక్షల నుంచి కోట్లలో ఫీజులు వసూలు చేస్తున్న న్యాయవాదులు ఉంటున్నారు. ఈ తరుణంలో ఆసక్తికర వ్యాఖ్యల చేశారు కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరెన్ రిజిజు. దేశంలోని పేదలు, అట్టడుగు వర్గాలకు న్యాయం జరగకుండా ప్రముఖ న్యాయవాదులు వసూలు చేస్తున్న అధిక లీగల్ ఫీజులపై ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం జైపూర్‌లో జరిగిన 18వ ఆల్ ఇండియా లీగల్ సర్వీసెస్ అథారిటీస్ మీట్లో మంత్రి రిజిజు మాట్లాడుతూ.. “డబ్బున్నవాళ్లు బడా లాయర్లను నియమించుకుంటారు. అంతెందుకు సుప్రీంకోర్టులో ఉన్న కొందరు న్యాయవాదుల ఫీజులను సామాన్యులు భరించలేని పరిస్థితి నెలకొంది. ఒక్కో వాదన కోసం రూ.10-15 లక్షలు వసూలు చేస్తే.. అసలు సామాన్యుడు ఎలా చెల్లించగలడు?. పేదలకు న్యాయం ఎలా అందుతుంది. ఈ పరిస్థితిలో మార్పు రావాల్సిన అవసరం ఉంది కదా! అని న్యాయశాఖ మంత్రి అభిప్రాయపడ్డారు. జూలై 18, సోమవారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో 71 వాడుకలో లేని చట్టాలను రద్దు చేస్తామని న్యాయ మంత్రి వెల్లడించారు. आज जयपुर में राष्ट्रीय विधिक सेवा प्राधिकरण की 18वी अखिल भारतीय बैठक के उद्घाटन समारोह में भाग लेंगे। pic.twitter.com/ADBCN4a9zo — Kiren Rijiju (@KirenRijiju) July 16, 2022 ఇక న్యాయ సేవల సమావేశానికి రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కూడా హాజరయ్యారు. ముహమ్మద్ ప్రవక్తపై బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులపై సోషల్ మీడియా జరిగిన ప్రచారంపైనా గెహ్లట్ స్పందించారు. “సస్పెండ్ చేయబడిన బిజెపి los నూపుర్ శర్మ పిటిషన్‌ను విచారిస్తున్నప్పుడు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినందుకు ఇద్దరు సుప్రీం న్యాయమూర్తులపై దుష్ప్రచారం ప్రారంభించడం చాలా ఆందోళన కలిగించే విషయం” అని ఆయన అన్నారు. పనిలో పనిగా బీజేపీపై విరుచుకుపడిన గెహ్లాట్.. హార్స్ ట్రేడింగ్ ద్వారా ప్రభుత్వాలను మారుస్తున్నారని వ్యాఖ్యానించారు. “దేశంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితి చాలా క్లిష్టంగా ఉంది. నా(రాజస్థాన్) ప్రభుత్వం ఎలా మనుగడ సాగించిందనేది ఆశ్చర్యం కలిగించే విషయమని ఆయన పేర్కొన్నారు. -
దివ్యాంగుల కోసం కోర్టుల్లో సౌకర్యాలు కల్పించాలి: హైకోర్టు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అన్ని న్యాయస్థానాల్లో దివ్యాంగులైన న్యాయవాదులు, కక్షిదారుల సౌకర్యార్థం లిఫ్టులు, రాకపోకలు సాగించేందుకు వీలుగా ఏర్పాట్లు, ఇతర వసతులు కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది. వసతుల ఏర్పాటు బాధ్యత ప్రభుత్వంపై ఉందని, ఈ విషయంలో ప్రభుత్వ వైఖరి ఏమిటో తెలుసుకోవాలని భావిస్తున్నట్లు పేర్కొంది. ఇందుకోసం తమ ముందున్న వ్యాజ్యంలో ప్రభుత్వాన్ని కూడా ప్రతివాదిగా చేర్చాలని పిటిషనర్లను ఆదేశించింది. విచారణను ఏప్రిల్ 6వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్ కుమార్‌మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. గుంటూరు జిల్లా నరసరావుపేట కోర్టులో దివ్యాంగులైన న్యాయవాదులకు, కక్షిదారులకు తగిన సౌకర్యాలు కల్పించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ న్యాయవాదులు జీఎల్‌వీ రమణమూర్తి, మరో ఏడుగురు దాఖలు చేసిన వ్యాజ్యాన్ని విచారించిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది. -
న్యాయవాదులుగా ఉంటూ.. న్యాయవ్యవస్థను కించపరుస్తారా?
సాక్షి, అమరావతి: సామాజిక మాధ్యమాల్లో న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో హైకోర్టు ఆదేశాల మేరకు దర్యాప్తు చేస్తున్న సీబీఐ.. న్యాయవాదులు మెట్టా చంద్రశేఖరరావు, గోపాలకృష్ణ కళానిధి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ రమేశ్‌కుమార్‌లనూ ఇటీవల అరెస్టుచేసింది. ఈ నేపథ్యంలో వారు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ గురువారం విచారణ జరిపారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు కేజీ కృష్ణమూర్తి, హేమేంద్రనాథ్ రెడ్డి, న్యాయవాది కోదండరామిరెడ్డి వాదనలు వినిపించారు. మెట్టా చంద్రశేఖరరావు, గోపాలకృష్ణ కళానిధి తమ వ్యాఖ్యలపై పశ్చాత్తాపం వ్యక్తంచేశారని వారు వాదించారు. కోర్టును లిఖితపూర్వకంగా క్షమాపణ కోరుతూ భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు చేయబోమని హామీ కూడా ఇచ్చారన్నారు. వారి క్షమాపణలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు వారిపై కోర్టు ధిక్కార చర్యలను మూసివేసిందన్నారు. వారి వయస్సు, అనారోగ్యాన్ని పరిగణనలోకి తీసుకుని వారికి బెయిల్ మంజూరు చేయాలని కోరారు. ఎంతమాత్రం సహించేదిలేదు.. ఈ సమయంలో న్యాయమూర్తి స్పందిస్తూ, న్యాయవాదులుగా న్యాయవ్యవస్థ గౌరవాన్ని కాపాడాల్సిందిపోయి, ఇష్టమొచ్చినట్లు మాట్లాడి దాని ప్రతి ష్టను దిగజార్చడం ఏమిటని ప్రశ్నించారు. ఇలాంటి చర్యలను ఎంతమాత్రం సహించేదిలేదని జస్టిస్ రాయ్ చెప్పారు. వ్యవస్థలో భాగమైన న్యాయవాదులు న్యాయవ్యవస్థను గౌరవిస్తేనే ప్రజా నీకం కూడా గౌరవిస్తుందన్నారు. సీబీఐ న్యాయవాది కె. చెన్నకేశవులు వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్లు న్యాయవ్యవస్థ, న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, అందువల్ల వారికి బెయిల్ మంజూరు చేయరాదన్నారు. కింది కోర్టు రెండ్రోజుల పాటు నిందితులను సీబీఐ కస్టడీకి ఇచ్చిందని, న్యాయవాది కళా నిధి అనారోగ్యంతో బాధపడుతున్న నేపథ్యంలో ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని తెలిపారు. కస్టడీ ఉత్తర్వులు అమల్లో ఉండగా బెయిల్ మంజూరు చేయరాదన్నారు. అది న్యాయపరమైన చిక్కులకు దారితీస్తుందన్నారు. కస్టడీ ముగిసిన తరువాత కూడా వారిని జ్యుడిషియల్ రిమాండ్‌లో ఉంచాల్సిన అవసరం ఏముందో చెప్పాలని సీబీఐని ఆదేశించింది. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి విచారణను ఈ నెల 21కి వాయిదా వేశారు. -
మై లార్డ్, యువరానర్ అనాల్సిన అవసరం లేదు.. సర్ చాలు!
సాక్షి, భువనేశ్వర్/కటక్: సాధారణఃగా కోర్టుల్లో కేసుల విషయంలో వాదనలు వినిపించేటప్పుడు న్యాయవాదులు న్యాయమూర్తుల్ని ‘మైలార్డ్ లేదా..యువరానర్’ అని సంభోదిస్తుంటారు. అయితే న్యాయమూర్తులను ఉద్దేశించి చేసే మై లార్డ్, యువర్ లార్డ్‌షిప్, యువర్ ఆనర్ వంటి సంబోధనలు మినహాయించాలని రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ ఎస్.మురళీధర్ న్యాయవాదులకు విన్నపం చేశారు. సర్ వంటి సాధారణ సంబోధన సరిపోతుందని ఆయన అన్నారు. ఆయన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా ఆయన సోమవారం ఈ సందేశం జారీ చేశారు. 2009లో ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న రోజుల్లో సైతం న్యాయవాదులకు ఆయన ఇదే సందేశాన్ని జారీ చేయడం విశేషం. 2006 మే 29 నుంచి 2020 మార్చి 5వ తేదీ వరకు ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా ఆయన బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత 2020లో పంజాబ్–హర్యానా ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి హోదాలో ఉండే సమయంలో కూడా ఇదే విన్నపం అక్కడి న్యాయవాదులకు విన్నవించడం గమనార్హం. 2020 మార్చి 6 నుంచి 2021 జనవరి 3వ తేదీ వరకు పంజాబ్–హర్యానా ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. ఇదిలా ఉండగా, చీఫ్ జస్టిస్ ప్రతిపాదన పట్ల హర్షం వ్యక్తం చేసిన బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(బీసీఐ) న్యాయస్థానాల్లో న్యాయమూర్తులను ఉద్దేశించి మై లార్డ్, లార్డ్‌షిప్, యువర్ ఆనర్, ఆనరబుల్ వంటి సంబోధనలు నివారించాలని 2006లో తీర్మానించింది. చదవండి: వేల సంఖ్యలో కేసులు.. భారత్‌లో మొదలైన కరోనా థర్డ్‌వేవ్? చీఫ్ జస్టిస్ నిర్ణయం అభినందనీయం.. హైకోర్టులో న్యాయమూర్తులను ఉద్దేశించాల్సిన సంబోధనల పురస్కరించుకుని, ప్రధాన న్యాయమూర్తి జారీ చేసిన సందేశం అభినందనీయమని ఒడిశా హైకోర్టు బార్ అసోసియేషన్ కార్యదర్శి జె.కె.లెంకా తెలిపారు. ఆయన విన్నపం నేపథ్యంలో తోటి న్యాయమూర్తులు ఈ సంస్కరణ ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. న్యాయవాదులు, కోర్టు విచారణకు హాజరయ్యే వ్యక్తులు ఇదే పద్ధతి పాటించాలని కోరారు. హైకోర్టు న్యాయమూర్తులను ఉద్దేశించి చేసే సంబోధనల నివారణకు జస్టిస్ గతికృష్ణ మిశ్రా హయాంలో బీజం పడిందని సీనియర్ న్యాయవాదులు గుర్తు చేసుకున్నారు. 1969 నుంచి 1975 వరకు జస్టిస్ గతికృష్ణ మిశ్రా హైకోర్టు ప్రధాన న్యా యమూర్తిగా బాధ్యతలు నిర్వహించారు. న్యాయమూర్తులను సర్ అని సంబోధించాలని ఫుల్ బెంచ్ అప్పట్లో జారీ చేసిన ఉత్తర్వులు వాస్తవ కార్యాచరణకు నోచుకోలేదని విచారం వ్యక్తం చేశారు. -
న్యాయవాదులు సమాజానికి మార్గ దర్శకులు
-
వారధిలా న్యాయ విద్యార్థులు
సాక్షి, అమరావతి: పేదలకు న్యాయం అందించే దిశగా ప్రారంభించిన ‘మిషన్ లీగల్ సర్వీసెస్’ను ఓ ఉద్యమంలా చేపట్టాల్సిన అవసరం ఉందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా పేర్కొన్నారు. పేదలకు సాయం అందించడంలో న్యాయ విద్యార్థులే కీలకమని, మిషన్ లీగల్ సర్వీసెస్‌కు వారు వెన్నెముక లాంటి వారని చెప్పారు. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా జాతీయ న్యాయ సేవాధికార సంస్థ పిలుపు మేరకు చేపట్టిన మిషన్ లీగల్ సర్వీసెస్ కార్యక్రమాన్ని సీజే జస్టిస్ మిశ్రా మంగళవారం ఉదయం ప్రారంభించి మాట్లాడారు. దత్తత గ్రామాల పర్యటనకు ఉద్దేశించిన వాహనాలను ఆయన ప్రారంభించారు. దత్తత గ్రామాల్లో సేవలు... గుంటూరు జిల్లాలోని తాడేపల్లి, తుళ్లూరు, సత్తెనపల్లి, ప్రత్తిపాడు, కృష్ణా జిల్లా పెనమలూరు మండలాల్లో ఎంపిక చేసిన గ్రామాలను న్యాయసేవాధికార సంస్థలు దత్తత తీసుకుని మిషన్ లీగల్ సర్వీసెస్‌ను ప్రారంభిస్తాయని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మిశ్రా తెలిపారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడం న్యాయ విద్యార్థులపై ఆధారపడి ఉందన్నారు. వారు ప్రజలు, న్యాయవ్యవస్థకు మధ్య వారధిలా పని చేస్తారన్నారు. మిషన్ లీగల్ సర్వీసెస్ ద్వారా గ్రామాల్లో మహిళలు, పిల్లలు, వృద్ధులు, ట్రాన్స్జెండర్లు, రైతుల సమస్యలతో పాటు తాగునీటి ఇబ్బందులను గుర్తించేందుకు కోర్ కమిటీని ఏర్పాటు చేశామని తెలిపారు. ఎంపిక చేసిన న్యాయవాదులు, న్యాయ విద్యార్థులు కమిటీ సభ్యులుగా ఉంటూ గ్రామ, మండల స్థాయిల్లో సమస్యలను పరిష్కరిస్తారని చెప్పారు. న్యాయస్థానాల్లో పిటిషన్లు దాఖలు చేయాల్సి వస్తే సంబం«ధిత వ్యక్తులకు కోర్ కమిటీ ఉచితంగా న్యాయ సాయం అందిస్తుందన్నారు. చట్టాలున్నా... అవగాహన లేక పేదల హక్కుల రక్షణ విషయంలో పలు చట్టాలున్నా అవగాహన లేకపోవడం వల్ల నిరర్థకం అవుతున్నాయని ఏపీ న్యాయసేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జస్టిస్ అసనుద్దీన్ అమానుల్లా పేర్కొన్నారు. చట్టాలపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన బాధ్యత న్యాయ విద్యార్థులపై ఉందన్నారు. మిషన్ లీగల్ సర్వీసెస్ సమర్థంగా అమలయ్యేలా 6 కమిటీలు ఏర్పాటు చేశామని హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి తెలిపారు. ఎనిమిది న్యాయ కళాశాలలకు చెందిన ప్రిన్సిపాళ్లు, లెక్చరర్లు, న్యాయ విద్యార్థులు, 41 మంది న్యాయవాదులు ఈ కమిటీల్లో సభ్యులుగా ఉన్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ కార్యదర్శి ఎంవీ రమణకుమారి, హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కె.జానకిరామిరెడ్డి, పలువురు న్యాయవాదులు, న్యాయ విద్యార్థులు పాల్గొన్నారు. -
కోవిడ్‌తో 77 మంది లాయర్ల మృతి.. సుప్రీంకోర్టు నివాళి
న్యూఢిల్లీ: కోవిడ్‌తో మృత్యువాతపడిన 77 మంది లాయర్లకు సుప్రీంకోర్టు నివాళులర్పించింది. వేసవి సెలవుల తర్వాత సోమవారం సుప్రీంకోర్టు కార్యకలాపాలు ప్రారంభం కాగానే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సహా న్యాయమూర్తుల తరఫున సంతాపం వ్యక్తం చేశారు. ‘సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ (ఎస్సీబీఏ)కు చెందిన 77 మంది కోవిడ్‌తో మృతి చెందినట్లు ఎస్సీబీఏ తెలిపింది. మృతులకు మా ప్రగాఢ సంతాపం. వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ 2 నిమిషాలు మౌనం పాటిస్తున్నాం’ అని జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. కరోనాతో మృతి చెందిన సభ్యులను స్మరించుకోవడం ఉత్తమమైన చర్యగా న్యాయవాది గోపాల్ శంకర నారాయణ అభివర్ణించారు. చదవండి: చార్ధామ్ యాత్రకు కోర్టు బ్రేక్ -
ఓటుకు కోట్లు కేసు: కుట్రదారును వదిలి పాత్రధారులపై అభియోగాలా?
సాక్షి, హైదరాబాద్: ఈడీ చార్జిషీట్లో ‘ఓటుకు కోట్లు’కుట్రకు ప్రధాన సూత్రధారి, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి పేరును నిందితుడిగా చేర్చకపోవడంపై న్యాయ నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ‘మనవాళ్లు అంతా బ్రీఫ్డ్ మీ. వారిచ్చిన హామీని నెరవేరుస్తా’నంటూ నేరుగా స్టీఫెన్సన్ను ప్రలోభపెట్టిన చంద్రబాబును పక్కనపెట్టి.. కుట్రను అమలుచేసిన పాత్రధారులపై మాత్రమే అభియోగాలు మోపడం ఆశ్చర్యకరమని అంటున్నారు. టీడీపీ మహానాడు వేదికగా కుట్ర జరిగినట్టు బయటపడినా, స్పష్టమైన ఆడియో, వీడియో ఆధారాలున్నా కూడా చంద్రబాబును నిందితుడిగా ఎందుకు చేర్చలేదని ప్రశ్నిస్తున్నారు. ఆ స్వరం చంద్రబాబుదే.. స్టీఫెన్సన్ను ప్రలోభపెడుతూ చంద్రబాబు ఫోన్లో మాట్లాడిన సంభాషణలను ప్రఖ్యాత ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ (ఎఫ్ఎస్ఎల్) పరీక్షించింది. ఆ స్వరం చంద్రబాబుదేనని తేల్చిచెప్పింది. చంద్రబాబు చేసిన ఈ కుట్రను రేవంత్‌రెడ్డి తదితరులు అమలు చేశారనేందుకు స్పష్టమైన ఆధారాలున్నాయి. ఆడియో, వీడియో ఆధారాలున్నా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఈడీ కూడా చంద్రబాబును నిందితుడిగా చేర్చకపోవడం సరికాదు. చట్టం దృష్టిలో అందరూ సమానమనే సందేశం ఇవ్వాలంటే చంద్రబాబును కూడా నిందితుడిగా చేర్చాలి. – కొంతం గోవర్ధన్‌రెడ్డి, న్యాయవాది చంద్రబాబే కుట్రదారు టీడీపీ అధినేత, అప్పటి ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకే వచ్చామని రేవంత్, ఇతర నిందితులు స్టీఫెన్సన్కు చెప్పారు. అంటే ప్రధాన కుట్రదారు చంద్రబాబే. ఆయనను వదిలేసి పాత్రధారుల్ని నిందితులుగా చేర్చడం శోచనీయం. చంద్రబాబు కనుసన్నల్లోనే ఈ కుట్రను అమలు చేసినా ఈడీ ఆయనను విచారించలేదు. లంచం డబ్బును తీసుకొచ్చిన వారిని నిందితులుగా చేర్చి.. డబ్బు సమకూర్చి పంపిన చంద్రబాబును విడిచిపెట్టడం ఏమిటి? ఇప్పటికైనా చంద్రబాబును నిందితుడిగా చేరుస్తూ సప్లిమెంటరీ చార్జిషీట్ దాఖలు చేయాలి. – ఒద్యారపు రవికుమార్, న్యాయవాది -
సంచలనం సృష్టించిన పుట్ట మధు అదృశ్యం కేసు
సాక్షి, కరీంనగర్: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన హైకోర్టు లాయర్ల జంట హత్యల కేసు చివరికి పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధు మెడకు చుట్టుకుంటోంది. కేసు చార్జిషీటు దాఖలు చేసే సమయంలో గన్మెన్లను వదిలి వారం రోజులపాటు అదృశ్యం కావడంతో ఆయన ప్రమేయంపై పోలీసులు ఆరా తీసే పరిస్థితి తలెత్తింది. లాయర్ల హత్యకేసులో ప్రధాన నిందితుడైన కుంట శ్రీను జైలులో ఉండగా.. అతని ఇంటి నిర్మాణానికి పుట్ట మధు సహకరిస్తున్నట్లు వామన్‌రావు తండ్రి కిషన్‌రావు ఫిర్యాదు చేశారు. వాటితోపాటు మరిన్ని అనుమానాస్పద అంశాలు జెడ్పీ చైర్మన్ మధుకు తలనొప్పిగా మారుతున్నాయి. వారం రోజుల క్రితం అదృశ్యమైన మధును శుక్రవారం రాత్రి ఏపీలోని భీమవరంలో అదుపులోకి తీసుకున్నట్లు చెప్పిన పోలీస్ కమిషనర్ వి.సత్యనారాయణ.. వామన్‌రావు హత్య కేసులో ఆయన ప్రమేయంపై విచారణ జరుపుతున్నట్లు వెల్లడించారు. శనివారం ఉదయం 11 గంటల నుంచి ముగ్గురు ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో కేసు దర్యాప్తు సాగిస్తున్నారు. హత్య కేసు విచారణాధికారి అడిషనల్ డీసీపీ అశోక్‌కుమార్, ఓఎస్డీ శరత్‌చంద్రపవర్, రామగుండం పోలీసు కమిషనర్ వి.సత్యనారాయణ వేర్వేరుగా విచారించారు. పుట్ట మధును పోలీసులు అదుపులోకి తీసుకున్న అంశం రాష్ట్ర వ్యాప్తంగా మరోసారి చర్చనీయాంశమైది. రూ, 2 కోట్లు సుపారీ నిజమేనా..? హత్యకేసులో ప్రధాన నిందితులకు సుపారీ కింద రూ.2 కోట్లు ముట్ట జెప్పారని, ఏ 1 కుంట శ్రీను జైల్లో ఉన్నప్పటికీ అతని స్వగ్రామంలో ఇంటి నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయని ఆరోపిస్తూ వామన్‌రావు తండ్రి కిషన్‌రావు గత నెల 16న ఐజీ నాగిరెడ్డికి లేఖ రాశారు. ఇప్పుడు ఆ లేఖనే పుట్ట మధుపై ఎంక్వైరీకి కారణమైంది. వామన్‌రావు దంపతుల హత్యకు రూ.2 కోట్లు డీల్ మాట్లాడిందెవరు? బిట్టు శ్రీనుకు కొత్త కారు కొనిచ్చింది ఎవరు? కుంట శ్రీను ఇంటికి ఎవరు డబ్బులు స్పాన్సర్ చేస్తున్నారు? అనే కోణంలో విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది. కోట్ల రూపాయలను ఏ బ్యాంకు నుంచి తెచ్చారు? విత్‌డ్రా చేసిందెవరు? తదితర కోణాలపై రామగుండం పోలీసులు దృష్టి పెట్టారు. హత్య జరగడానికి ముందు నుంచి తరువాత చోటు చేసుకున్న పరిణామాల వరకు పుట్ట మధు ఎవరెవరితో మాట్లాడారో కాల్‌డేటా కూడా తీసుకుని విచారిస్తున్నారు. చార్జిషీటు దాఖలుకు సమయం ఆసన్నమైన పరిస్థితుల్లో కోర్టుకు సమాధానం చెప్పుకొనేందుకు.. వామన్‌రావును అంతమొందించడం వల్ల ఎవరికి ప్రయోజనం కలుగుతుందనే కోణంపై పోలీసులు దృష్టి పెట్టినట్లు సమాచారం. వారం రోజులు ఎందుకు అదృశ్యం..? జెడ్పీ చైర్మన్ పుట్ట మధు వారం రోజులు అదృశ్యం కావడానికి గల కారణాలను కూడా పోలీసులు సేకరించే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. రక్షణ కోసం గన్మెన్లుగా వచ్చిన నలుగురు పోలీసులకు సమాచారం ఇవ్వకుండా.. ప్రభుత్వ కారును వదిలేసి ఎందుకు అదృశ్యం కావలసి వచ్చిందనే కోణంలో విచారణ జరుపుతున్నారని సమాచారం. పోలీసుల కళ్లు కప్పి మహారాష్ట్ర, హైదరాబాద్, భీమవరం ప్రాంతాల్లో ఎవరెవరిని కలిశారనే కోణాన్ని కూడా పరిశీలిస్తున్నారని తెలిసింది. ఈ కేసుతో సంబంధం ఉందన్న కారణంగానే మధు గాయబ్ అయ్యాడా? ఇంకేమైనా రాజకీయ కారణాలు ఉన్నాయా? అనే కోణంలో కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నారు. అదృశ్యంపై గోప్యత ఎందుకు? గత నెల 29న రాత్రి హైదరాబాద్ నుంచి ఓ పోలీస్ అధికారి నుంచి ఫోన్ కాల్ రావడంతో అదేరోజు రాత్రి పుట్ట మధు అదృశ్యమయ్యారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. మధు అదృశ్యమైన తరువాత మరుసటి రోజు ఉదయం గన్మెన్లు ఈ విషయాన్ని ఏఆర్ విభాగం చీఫ్‌కు తెలియజేయడం, ఆయన ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగిపోయాయి. గన్మెన్లు తమ ఆయుధాలను సరెండర్ చేసి, ఏఆర్‌కు అటాచ్డ్ అయ్యారు. ఆ వెంటనే రామగుండం టాస్క్‌ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగారు. వివిధ వర్గాల నుంచి సేకరించిన సమాచారం, మధు, ఆయన డ్రైవర్ సెల్ టవర్ సిగ్నల్స్ మేరకు మహారాష్ట్ర వెళ్లారు. ఈనెల 1న మహారాష్ట్రలోని వని పట్టణంలో మధు సోదరుని నివాసానికి వెళ్లి విచారణ జరపగా, మధు అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు తేలింది. అదే సమయంలో ఈటల రాజేందర్ వ్యవహారం తెరపైకి రావడంతో హైదరాబాద్ వెళ్లినట్లు తెలిసింది. మధు కోసం జిల్లాకు చెందిన ఓ మంత్రి పార్టీ పెద్దలతో సంప్రదింపులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. మూడు రోజుల క్రితం సదరు మంత్రికి ‘సాక్షి’ ఫోన్ చేయగా, మధు హైదరాబాద్‌లోనే ఉన్నారని చెప్పడం గమనార్హం. సాక్షి కథనాలతో అప్రమత్తమైన పోలీసులు ‘భీమవరం’ నుంచి అదుపులోకి తీసుకోవడం కొసమెరుపు. ‘సాక్షి’ వరుస కథనాల సంచలనం పుట్ట మధు అదృశ్యమైన విషయంపై ఈనెల 6న ‘సాక్షి’ దినపత్రికలో ‘పుట్ట మధు ఎక్కడ..?’ అనే శీర్షికతో కథనం ప్రచురితమైంది. అప్పటివరకు పుకారుగా ప్రచారంలో ఉన్న ఈ అంశాన్ని ‘సాక్షి’ ఆధారాలతో సహా వెలుగులోకి తేవడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. మరుసటి రోజు 7న ‘అజ్ఞాతంలోనే మధు’ శీర్షికతో వారం రోజులుగా వీడని సస్పెన్స్‌ను హైలైట్ చేస్తూ కథనం ప్రచురించింది. మధు ఎక్కడికి వెళ్లలేదని, గన్‌మెన్ ఆయనతోనే ఉన్నారని, మిస్సింగ్ ఫిర్యాదులు ఏవీ అందలేదని రామగుండం పోలీస్ కమిషనర్ ఇచ్చిన వివరణతోపాటు జరుగుతున్న పరిణామాలను పూసగుచ్చినట్లు వివరించడం జరిగింది. అదే సమయంలో తన భర్త ఆచూకీ తెలపాలని మధు సతీమణి, మంథని మున్సిపల్ చైర్పర్సన్ పుట్ట శైలజ మంత్రి ప్రశాంత్‌రెడ్డిని కలిసిన వివరాలను ప్రచురించింది. ఈ పరిణామాల నేపథ్యంలో పోలీసులు పుట్ట మధును అదుపులోకి తీసుకున్న విషయాన్ని మీడియాకు వెల్లడించాలని నిర్ణయించారు. అదే సమయంలో శుక్రవారం పుట్ట శైలజ ‘సాక్షి’తో మాట్లాడుతూ పుట్ట మధు హైదరాబాద్‌లోనే ఉన్నట్లు ధ్రువీకరించారు. ఈ మేరకు 8న ‘అజ్ఞాతంలోకి పోలేదట..’ శీర్షికతో మరో కథనం ప్రచురితమైంది. చివరికి పుట్ట తమ అదుపులో ఉన్న విషయాన్ని పోలీసులు వెల్లడించక తప్పలేదు. -
నకిలీ వకీలు: కోర్టులో ప్రశ్నలకు తడబడటంతో..
అనకాపల్లి టౌన్: విశాఖ జిల్లా అనకాపల్లిలో న్యాయస్థానాన్ని మోసగించబోయిన ఓ నకిలీ వకీలు న్యాయమూర్తి అప్రమత్తతతో అడ్డంగా దొరికిపోయాడు. ఇద్దరు వ్యక్తుల బెయిల్ పిటిషన్ వాదించడానికి వచ్చిన తానే కటకటాలపాలయ్యాడు. పట్టణ ఎస్ఐ ఎల్.రామకృష్ణ అందించిన వివరాలు.. విశాఖ డాబాగార్డెన్స్‌కు చెందిన సంపంగి చినబంగారి దుర్గా సురేష్‌కుమార్ న్యాయవాదిలా నల్లకోటు వేసుకొని అనకాపల్లి 11వ మెట్రోపాలిటన్ జడ్జి ఎస్.విజయచందర్ ముందు గురువారం బెయిల్ పత్రాలు దాఖలు చేశాడు. కోర్టు ప్రశ్నలకు తడబడడంతో న్యాయమూర్తికి అనుమానం వచ్చి అతని పూర్తి వివరాలు చెప్పాలని కోరారు. సమాధానం చెప్పలేక అక్కడి నుంచి పలాయనం చిత్తగించే ప్రయత్నం చేయగా, అక్కడున్న న్యాయవాదులు అతన్ని పట్టుకున్నారు. సురేష్‌కుమార్ వద్ద ఉన్న గుర్తింపు కార్డును పరిశీలిస్తే.. దానిపై టి.దేవేందర్ అనే అడ్వకేట్ పేరు ఉండగా, ఫొటో మాత్రం సురేష్కుమార్ది ఉంది. దీంతో న్యాయమూర్తి కోర్టు సూపరింటెండెంట్‌ను పిలిచి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆదేశించారు. నకిలీ వకీల్‌ను పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకొని న్యాయమూర్తి ముందు శుక్రవారం ప్రవేశపెట్టగా, 14 రోజులు రిమాండ్ విధించారు. -
తీర్మానాలు చించేశారు.. కుర్చీలు విసిరేశారు..
సాక్షి, అమరావతి: బెజవాడ బార్ అసోసియేషన్‌కు చెందిన కొందరు న్యాయవాదులు.. హైకోర్టు న్యాయవాదుల సంఘం కార్యకలాపాల్లో జోక్యానికి ప్రయత్నించడం, హైకోర్టు వద్ద సర్వసభ్య సమావేశానికి పిలుపునివ్వడం వివాదాస్పదమైంది. ఇది గురువారం న్యాయవాదుల మధ్య ఘర్షణకు దారి తీసింది. హైకోర్టు న్యాయవాదుల సంఘం కార్యదర్శి, అధ్యక్షులను విజయవాడ న్యాయవాదులు నిర్ణయించడం ఏమిటంటూ హైకోర్టు న్యాయవాదులు అభ్యంతరం తెలిపారు. సర్వసభ్య సమావేశం తీర్మానాలను కొందరు చించివేయగా.. మరికొందరు కుర్చీలు విసిరేశారు. బయట నుంచి వచ్చిన న్యాయవాదులు విసిరేసిన కుర్చీ తగలడం వల్ల బార్ కౌన్సిల్ సభ్యుడు చలసాని అజయ్‌కు గాయమైందంటూ.. ఆయన జూనియర్లు ఆందోళనకు దిగారు. ఈ సమయంలో పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అనంతరం అజయ్‌కుమార్ తదితరులు ప్రధాన న్యాయమూర్తికి ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు. అయితే న్యాయవాదుల మధ్య వివాదంలో తాను ఏరకంగానూ జోక్యం చేసుకోనని ప్రధాన న్యాయమూర్తి వారికి స్పష్టం చేసినట్లు తెలిసింది. మరోవైపు హైకోర్టు న్యాయవాదులు మెట్టా చంద్రశేఖర్‌తో పాటు మరికొందరు ఎస్పీఎఫ్ డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. హైకోర్టు న్యాయవాదుల సంఘంలో సభ్యులు కాని వ్యక్తులు తమపై దాడికి ప్రయత్నించారంటూ డీఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదులో వారు పేర్కొన్నారు. దీనిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కోరారు. వాస్తవానికి హైకోర్టు న్యాయవాదుల సంఘం పాలకవర్గం కాల పరిమితి ఎప్పుడో ముగిసింది. గతేడాది ఎన్నికలు జరగాల్సి ఉన్నా కరోనా వల్ల వాయిదా పడుతూ వస్తోంది. ఈ పరిస్థితుల్లో హైకోర్టు న్యాయవాదుల సంఘం కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు అడ్వొకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీకి తెలియకుండా సంఘం సర్వసభ్య సమావేశం నిర్వహించడం వివాదానికి కారణమైంది. చలసాని అజయ్ ఇటీవల జరిగిన బెజవాడ బార్ అసోసియేషన్ ఎన్నికల్లో ఓటు హక్కు ఉపయోగించుకున్నారని, అతనికి హైకోర్టు న్యాయవాదుల సంఘంలో ఓటు హక్కు లేదని పలువురు న్యాయవాదులు చెబుతున్నారు. బయట వ్యక్తులను తీసుకొచ్చి ఉద్దేశపూర్వకంగా ఆయనే గొడవ సృష్టించారని చెబుతున్నారు. చదవండి: వీడియో వైరల్: హైదరాబాద్‌కు రజనీకాంత్ రోజుకు 6 లక్షల మందికి టీకా: సీఎం జగన్ -
లాయర్ దంపతుల హత్య: మే 17లోగా చార్జిషీట్
సాక్షి, హైదరాబాద్: న్యాయవాద దంపతులు గట్టు వామన్‌రావు, పీవీ నాగమణి హత్య కేసులో మే 17 నాటికి 90 రోజులు పూర్తవుతుందని, ఆ లోగా అభియోగపత్రం (చార్జిషీట్) దాఖలు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని హైకోర్టుకు అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ నివేదించారు. న్యాయవాద దంపతుల దారుణహత్యపై పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా గత ఫిబ్రవరిలో సుమోటో ప్రజాహిత వ్యాజ్యంగా హైకోర్టు విచారణకు స్వీకరించిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమకోహ్లీ, జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం బుధవారం మరోసారి విచారించింది. ఈ సందర్భంగా దర్యాప్తు పురోగతిని వివరిస్తూ ఏజీ బీఎస్ ప్రసాద్ నివేదిక సమర్పిం చారు. ఈ కేసులో 32 మంది ప్రత్యక్ష సాక్షులను గుర్తించామని, వారిలో 26 మంది వాంగ్మూలాలను సీఆర్పీసీ సెక్షన్ 164 కింద న్యాయమూర్తి ఎదుట రికార్డు చేశామని, మిగిలినవారి వాంగ్మూలాలను త్వరలో నమోదు చేస్తామని తెలిపారు. అలాగే ఏడుగురు నిందితుల వాంగ్మూలాలను కూడా న్యాయమూర్తి ఎదుట రికార్డు చేశామని వివరించారు. నిందితులు లచ్చయ్య, వసంతరావు, అనిల్ మొబైల్ ఫోన్లు, సిమ్‌కార్డులను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించామని.. ఆ నివేదిక వచ్చేందుకు నాలుగు వారాల సమయం పట్టవచ్చని తెలిపారు. ఫిబ్రవరి 17న హత్య జరిగిన నేపథ్యంలో మే 17 నాటికి 90 రోజులు అవుతుందని, 17లోగా సమగ్రంగా అన్ని ఆధారాలతో చార్జిషీట్ దాఖలు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వం సమర్పించిన నివేదికను ఇస్తే.. తమ అభ్యంతరాలను తెలియజేసేందుకు అవకాశం ఉంటుందని గట్టు వామన్‌రావు తండ్రి కిషన్‌రావు తరఫు న్యాయవాది విజయభాస్కర్ ధర్మాసనాన్ని అభ్యర్థించారు. నివేదికపై హైకోర్టు సంతృప్తి.. దర్యాప్తు పురోగతికి సంబంధించి పోలీసుల నివేదిక సంతృప్తికరంగా ఉందని, దర్యాప్తు తీరుతెన్నులపై పూర్తి వివరాలు తెలుసుకోవాలన్నదే తమ ఉద్దేశమని ధర్మాసనం పేర్కొంది. నిర్ణీత గడువులోగా అన్ని ఆధారాలతో చార్జిషీట్ దాఖలు చేసేలా చూడాల్సిన అవసరం ఉందని, ఈ నేపథ్యంలో దర్యాప్తు నివేదికను ఇవ్వాలని ఆదేశించలేమని ధర్మాసనం స్పష్టంచేసింది. తదుపరి విచారణలోగా దర్యాప్తుపై స్థాయీ నివేదిక సమర్పించాలని ఏజీని ఆదేశిస్తూ విచారణను ఈనెల 23కు వాయిదా వేసింది. చదవండి: బిట్టు శ్రీనుకు ఫోన్ ఇచ్చిన పుట్ట శైలజ, కేసు నమోదు -
‘న్యాయవాద దంపతులది ప్రభుత్వ హత్యే’
సాక్షి, పెద్దపల్లి : పెద్దపల్లి జిల్లాలో హైకోర్టు న్యాయవాదులు వామన్‌రావు, నాగమణిల హత్యను ప్రభుత్వ హత్యగానే పరిగణిస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. టీఆర్ఎస్ నేతలు, ప్రజాప్రతినిధుల అక్రమాల చిట్టా వారి వద్ద ఉందని, వాటి ఆధారంగా హైకోర్టులో కేసులు దాఖలు చేసినందునే పోలీసు అధికారుల సహకారంతో వారిని పక్కాగా అంతమొందించారని సంజయ్ ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా ప్రభుత్వాస్పత్రిలో న్యాయవాద దంపతుల మృతదేహాలను గురువారం ఆయన పరిశీలించారు. అనంతరం మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించి మాట్లాడారు. హత్య వెనుక టీఆర్ఎస్ హస్తం: ఉత్తమ్ సాక్షి, హైదరాబాద్: న్యాయవాదులు గట్టు వామన్‌రావు దంపతుల హత్య వెనుక టీఆర్ఎస్ హస్తం ఉందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. గురువారం గాంధీభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, వామన్‌రావు హత్యపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఇది కచ్చితంగా టీఆర్ఎస్ చేసిన హత్యేనని, ఇప్పటివరకు సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ నేతలు హత్యను ఖండించకపోవడమేంటని ప్రశ్నించారు. హత్యపై హైకోర్టు న్యాయమూర్తిని కలిసి ఫిర్యాదు చేస్తానని, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాస్తానని, పార్లమెంట్లో ఈ అంశంపై ప్రస్తావన తీసుకొస్తానని తెలిపారు. సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలి: జీవన్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: లాయర్ దంపతులను హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి డిమాండ్ చేశారు. కేసును సీబీఐ విచారణకు ఆదేశించి, సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ ప్రజలకు కాదని.. టీఆర్ఎస్ నేతలకేనని ఓ ప్రకటనలో విమర్శించారు. -
కారు, కత్తులు సమకూర్చింది అతడే..
సాక్షి, కరీంనగర్: హైకోర్టు న్యాయవాద దంపతులు గట్టు వామన్‌రావు, పీవీ నాగమణి హత్యకు సొంత గ్రామంలో నెలకొన్న గొడవలే కారణమని పోలీసులు తెలిపారు. ఈ హత్యకు నిందితులు ఉపయోగించిన నల్లని బ్రీజా కారు పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధు మేనల్లుడు బిట్టు శ్రీనుదని కొత్త ట్విస్ట్ ఇచ్చారు. గురువారం రాత్రి పెద్దపల్లిలో రామగుండం పోలీస్ కమిషనర్ వి.సత్యనారాయణ, డీఐజీ ప్రమోద్ కుమార్‌తో కలిసి వరంగల్ జోన్ ఐజీ వి.నాగిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు కుంట శ్రీనివాస్, బిట్టు శ్రీను కారు డ్రైవర్ శివందుల చిరంజీవి కలిసి కొబ్బరికాయలు నరికే కత్తులతో ఈ హత్యాకాం డకు పాల్పడ్డారని తెలిపారు. గుంజపడుగు గ్రామానికి చెందిన కుంట శ్రీనివాస్ ఇంటి నిర్మాణాన్ని వామన్‌రావు అడ్డుకోవడం, ఊరిలో నిర్మిస్తున్న దేవాలయం పనులకు అభ్యంతరం తెలపడం, రామాలయ కమిటీ వివాదాల కార ణంగా హత్యలు జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని వివరించారు. ‘రిజిస్ట్రేషన్ కాని బ్రీజా కారును, కొబ్బరికాయలు కోసే కత్తులను బిట్టు శ్రీను సమకూర్చగా.. అతడి కారు డ్రైవర్ చిరంజీవితో కలిసి కుంట శ్రీనివాస్ నడిరోడ్డుపై హత్యాకాండకు తెగబడ్డాడు. కుంట శ్రీనివాస్‌ను ఏ1గా, చిరంజీవిని ఏ2గా, అక్కపాక కుమార్‌ను ఏ3గా పేర్కొంటూ కేసు నమోదు చేశాం. కుంట శ్రీనివాస్, చిరంజీవిని గురువారం మహారాష్ట్ర సరిహద్దుల్లో అరెస్టు చేశాం. కుమార్‌ను కూడా అదుపులోకి తీసుకున్నాం. వామన్‌రావు తండ్రి ఫిర్యాదు మేరకు రిటైర్డ్ డీఈ వసంతరావుకు ఈ కేసులో ఏమైనా ప్రమేయం ఉందా అనేదానిపై దర్యాప్తు చేస్తున్నాం. హత్య చేయడానికి కారు, కత్తులను సమకూర్చిన బిట్టు శ్రీను కోసం గాలిస్తున్నాం’అని నాగిరెడ్డి వెల్లడించారు. పథకం ప్రకారమే హత్య... న్యాయవాద దంపతుల హత్య పక్కా పథకం ప్రకారమే జరిగిందని ఐజీ నాగిరెడ్డి తెలిపారు. ‘గుంజపడుగు గ్రామంలోని దేవాలయానికి సంబంధించి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసేందుకు తన తండ్రి, సోదరుడి సంతకాల కోసం గట్టు వామన్‌రావు దంపతులు గురువారం మంథని కోర్టుకు వచ్చారు. ఈ విషయం తెలుసుకొన్న కుంట శ్రీనివాస్ హైదరాబాద్ వెళ్లేటప్పుడు వామన్‌రావును చంపాలని పథకం వేసుకున్నాడు. తన కారును అక్కపాక కుమార్‌కు ఇచ్చి వామన్‌రావు కదలికలను తెలియజేయాలని సూచించాడు. బిట్టు శ్రీను అనే వ్యక్తి నుంచి నల్లని బ్రీజా కారును, రెండు కొబ్బరి కాయలు కోసే కత్తులు తీసుకుని అతడి డ్రైవర్ చిరంజీవితో కలిసి మధ్యాహ్నం సమయంలో కల్వచర్ల శివారులో కాపు కాశాడు. వామన్‌రావు కారు రాగానే దానిని ఢీకొట్టి కారు ఆపారు. అనంతరం కుంట శ్రీను కత్తి తీసుకుని వెళ్లి కారు అద్దం పగలగొట్టాడు. దీంతో డ్రైవర్ భయపడి కారు దిగిపోవడంతో వామన్‌రావు డ్రైవర్ సీట్లోకి వచ్చి కారు నడిపే ప్రయత్నం చేశారు. వెంటనే కుంట శ్రీను ఆయన్ను కారులో నుంచి బయటకు లాగి కత్తితో దాడి చేశాడు. అదే సమయంలో చిరంజీవి రెండోవైపు నుంచి వచ్చి వామన్‌రావు భార్య నాగమణిపై కత్తితో దాడి చేయడంతో ఆమె కారులోనే కుప్పకూలిపోయారు. తర్వాత చిరంజీవి కూడా వామన్‌రావు వద్దకు వచ్చి విచక్షణారహితంగా దాడి చేశాడు. అనంతరం ఇరువురూ బ్రిజా కారులో ఇంక్లైన్ కాలనీ నుంచి సుందిళ్ల బ్యారేజీ వైపు వెళ్లిపోయారు. రక్తపు మరకలు అంటున్న బట్టలు, దాడికి ఉపయోగించిన కత్తులను సుందిళ్ల బ్యారేజీలో పడేసి, అక్కడి నుంచి మహారాష్ట్ర వైపు పారిపోయారు. మహారాష్ట్ర ప్రాంతంలో తెలంగాణ పోలీసుల కదలికలున్నాయనే అనుమానంతో ముంబై వెళ్తుండగా, వాంకిడి చంద్రపూర్ మధ్యలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు’అని నాగిరెడ్డి వివరించారు. ఐదేళ్లుగా వివాదాలు.. వామన్‌రావుకు తన గ్రామానికే చెందిన కుంట శ్రీనివాస్‌తో ఐదేళ్లుగా వివాదాలున్నట్లు ఐజీ నాగిరెడ్డి తెలిపారు. ఇటీవల గుంజపడుగులో ఉన్న రామస్వామి గోపాలస్వామి దేవాలయం మేనేజ్మెంట్ కమిటీ వివాదంతోపాటు ఇల్లు, కుల దేవత పెద్దమ్మ ఆలయం నిర్మాణాలు నిలిపివేయించారనే కక్షతోనే కుంట శ్రీను వామన్‌రావును చంపాలని కుట్ర పన్ని, బిట్టు శ్రీను సహకారంతో హత్య చేసినట్లు వివరించారు. కుంట శ్రీనివాస్ గతంలో నిషేధిత సింగరేణి కార్మిక సమాఖ్య (సికాస)లో పనిచేశాడని, బస్సు దహనం, 498ఏ కేసుల్లో నిందితుడని తెలిపారు. చిరంజీవికి ఎలాంటి నేర చరిత్ర లేకపోయినా, ఆర్థికంగా ఆదుకున్న కుంట శ్రీనివాస్ మీద అభిమానంతో ఈ హత్యలో పాలుపంచుకున్నట్లు చెప్పారు. అరెస్టు చేసిన ముగ్గురు నిందితులను కోర్టు ముందు హాజరు పరచనున్నట్లు వెల్లడించారు. కేసులో ఎలాంటి రాజకీయ కారణాలు వెల్లడి కాలేదని, పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. హత్య సమయంలో ప్రయాణికులు తీసిన వీడియో క్లిప్పింగులు ఏవైనా ఉంటే తమకు పంపించాలని ఆయన కోరారు. -
న్యాయవాదుల హత్యలో వారిదే పాత్ర: రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: మంథనిలో జరిగిన న్యాయవాదుల హత్యోదంతంపై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. టీఆర్ఎస్ పెద్దల ఆదేశాల మేరకే హత్యలు జరిగాయని ఆరోపణలు చేశారు. వారిపై కుట్ర కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. మంథని న్యాయవాదుల హత్యలో స్థానిక టీఆర్ఎస్ నేతలు కేవలం పాత్రధారులేనని, హత్యకు ఉసిగిల్పింది మాత్రం కేసీఆర్, కేటీఆర్, బాల్క సుమన్‌లను తీవ్ర ఆరోపణలు చేశారు. మొన్న హాలియా సమావేశంలో కేసీఆర్, తమను ఎవరైనా ప్రశ్నిస్తే నషంలాగా నలిపివేస్తామని చెప్పినట్లు రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. బాల్క సుమన్ ఏకంగా హత్య చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారని తెలిపారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే తొక్కేస్తమని పెద్దలే చెపుతున్నారని ఉదాహరించారు. ఈ హత్యలకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే బాల్క సుమన్ బాధ్యులని చెప్పారు. ఈ అంశాన్ని సీబీఐ పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ హత్యపై సీబీఐ దర్యాప్తు కోసం కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సుమోటోగా చర్య తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. -
న్యాయవాదుల బీమా పథకానికి శ్రీకారం
సాక్షి, అమరావతి: న్యాయవాదుల సంక్షేమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక సాయంతో చేపట్టిన లాయర్ల బీమా పథకం అమలుకు రాష్ట్ర బార్ కౌన్సిల్ శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా యునైటెడ్ ఇన్సూరెన్స్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకు సంబంధించిన మొత్తాన్ని బార్ కౌన్సిల్ ఆ ఇన్సూరెన్స్ కంపెనీకి చెల్లించింది. మొదటి పాలసీని అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్‌కు కంపెనీ ప్రతినిధులు గురువారం అందచేశారు. ఈ కార్యక్రమంలో బార్ కౌన్సిల్ చైర్మన్ గంటా రామారావు, సభ్యుడు యర్రంరెడ్డి నాగిరెడ్డి, రవి గువేరా తదితరులు పాల్గొన్నారు. న్యాయవాది, వారి కుటుంబసభ్యులకు రూ.2 లక్షల వరకు నగదు రహిత వైద్యసాయం, రూ.10 లక్షల వరకు ప్రమాద బీమా కల్పించాలని అడ్వొకేట్ జనరల్ నేతృత్వంలోని ప్రత్యేక కమిటీ నిర్ణయం తీసుకుంది. ఈ బీమా సౌకర్యం కోసం 15,552 మంది న్యాయవాదులు బార్ కౌన్సిల్ వద్ద దరఖాస్తు చేసుకున్నారు. ప్రీమియం కింద ఒక్కొక్కరు రూ.5,348 చొప్పున చెల్లించాల్సి ఉండగా, ఇందులో న్యాయవాది వాటా రూ.1000 కాగా, మిగిలిన మొత్తాన్ని(రూ.4,348) ఆంధ్రపదేశ్ ప్రభుత్వం చెల్లిస్తుంది. సంక్షేమ నిధికి ప్రభుత్వం ఇచ్చిన నిధుల నుంచి ఈ ప్రీమియం చెల్లించడం జరుగుతుంది. 2020, డిసెంబర్ 30 నుంచి 2021, డిసెంబర్ 29 వరకు ఈ పాలసీ అమల్లో ఉంటుందని బార్ కౌన్సిల్ చైర్మన్ గంటా రామారావు తెలిపారు. న్యాయవాదుల సంక్షేమం కోసం రూ.100 కోట్లతో ఏర్పాటు చేసిన సంక్షేమ నిధికి రూ.25 కోట్లు విడుదల చేసినందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు గంటా రామారావు, నాగిరెడ్డి తదితరులు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ అధ్యక్షుడు ఎం.మనోహర్‌రెడ్డి కూడా ఇదే విషయంపై ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలుపుతూ ఓ ప్రకటన విడుదల చేశారు. -
పేదలకు ఇకపై ఉచిత ప్రతివాద న్యాయసేవలు
అనంతపురం లీగల్: పేద, బడుగు వర్గాలపై నమోదైన క్రిమినల్ కేసుల్లో ఉచిత న్యాయ సహాయం అందించేందుకు న్యాయవాదుల నియామకానికి జాతీయ న్యాయ సేవాధికార సంస్థ శ్రీకారం చుట్టిందని రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ కార్యనిర్వాహక అధ్యక్షులు, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాకేష్‌కుమార్ చెప్పారు. పైలట్ ప్రాజెక్ట్ కింద అనంతపురం జిల్లాకు మంజూరైన న్యాయ సహాయ ప్రతివాద న్యాయవాది వ్యవస్థను జస్టిస్ రాకేష్‌కుమార్ శుక్రవారం డిజిటల్ విధానంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెషన్స్ కేసుల్లో పేదవారి తరఫున అండగా నిలిచి న్యాయసహాయం అందించటానికి ఈ వ్యవస్థ చక్కటి అవకాశమన్నారు. జిల్లా పరిపాలనా న్యాయమూర్తి, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్.రఘునందన్‌రావు మాట్లాడుతూ.. సకాలంలో సరైన న్యాయ సహాయకులు లేక ఎందరో జైళ్లలో మగ్గిపోతున్నారని, వారందరికీ అండగా లీగల్ ఎయిడ్ డిఫెన్స్ సిస్టం నిలుస్తుందని చెప్పారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ మెంబర్ సెక్రటరీ చిన్నంశెట్టి రాజు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణసారిక, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి గరికపాటి దీనబాబు, జాతీయ బార్ కౌన్సిల్ సభ్యుడు రావిురెడ్డి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పి.గురుప్రసాద్, అన్ని జిల్లాల జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శులు, సీనియర్ సివిల్ జడ్జిలు పాల్గొన్నారు. -
ఆంధ్రజ్యోతి తప్పుడు కథనం: ఆ పిల్‌ను కొట్టేయండి
సాక్షి, అమరావతి: న్యాయమూర్తుల ఫోన్లను ప్రభుత్వం ట్యాపింగ్ చేస్తోందంటూ ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చిన నిరాధార, తప్పుడు కథనాన్ని ఆధారంగా చేసుకుని దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని ప్రాథమిక దశలోనే కొట్టేయాలని రాష్ట్ర ప్రభుత్వం గురువారం హైకోర్టును అభ్యర్థించింది. ఈ వార్తా కథనం ప్రామాణికతను తెలుసుకోకుండా ప్రభుత్వంపై నిరాధారణ ఆరోపణలు చేస్తూ హైకోర్టులో పిల్ దాఖలు చేయడం ద్వారా పిటిషనర్ న్యాయ ప్రక్రియను దుర్వినియోగం చేశారని తెలిపింది. తప్పుడు కథనం ప్రచురించిన ఆ పత్రికకు ఇప్పటికే లీగల్ నోటీసు జారీ చేశామని, ఆ తదుపరి చర్యలు కూడా ఉంటాయని వివరించింది. ప్రామాణికత లేని వార్తల ఆధారంగా పిల్ దాఖలు చేయడానికి కుదరదంది. ఇదే విషయాన్ని కుసుమలత వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పిందని పేర్కొంది. ఆంధ్రజ్యోతి ప్రచురించిన తప్పుడు కథనం ఆధారంగా విశాఖపట్నంకు చెందిన న్యాయవాది నిమ్మిగ్రేస్ హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యం విచారణార్హతపై అభ్యంతరం వ్యక్తం చేసిన ప్రభుత్వం ఈ విషయంలో కౌంటర్ దాఖలు చేస్తామని తెలిపింది. ఇందుకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జితేంద్రకుమార్ మహేశ్వరి, న్యాయమూర్తి జస్టిస్ కన్నెగంటి లలిత నేతృత్వంలోని ధర్మాసనం అంగీకరించింది. అందులో భాగంగా ప్రభుత్వం తరఫున హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ కౌంటర్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంలో ప్రభుత్వం తరఫున హాజరవుతున్న అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి కరోనాతో బాధపడుతుండటంతో హైకోర్టు విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. (బ్యాంకు రుణం ఎగ్గొట్టి సొంత ఖాతాలకు..) -
లిస్టులో కేసులున్న న్యాయవాదులకే ప్రవేశం
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 7(సోమవారం) నుంచి ప్రయోగాత్మకంగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనంతోపాటు నలుగురు న్యాయమూర్తులు భౌతికంగా కేసులు విచారించనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లిస్టులో కేసులు ఉన్న న్యాయవాదులు, పిటిషనర్లను మాత్రమే అనుమతించాలని హైకోర్టు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు న్యాయవాదులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన మార్గదర్శకాలను రిజిస్ట్రార్ జనరల్ శుక్రవారం జారీచేశారు. ‘‘ఒక కేసుకు సంబంధించి పిటిషనర్ తరఫున ఒకరు, ప్రతివాది తరఫున ఒక న్యాయవాది మాత్రమే హాజరుకావాలి. కోర్టు హాల్లో మొత్తం న్యాయవాదులు, కేసులను నేరుగా వాదించుకునే (పార్టీ ఇన్ పర్సన్స్) వారి సంఖ్య ఆరుకు మించడానికి వీల్లేదు. కేసు విచారణ పూర్తవుతూనే ఈ కేసుకు సంబంధించిన న్యాయవాదులు హైకోర్టు ఆవరణ నుంచి వెళ్లిపోవాలి. జూనియర్ న్యాయవాదులు, న్యాయవాదుల క్లర్కులతోపాటు ఇతరులెవరికీ ప్రవేశం లేదు. జలుబు, దగ్గు, జ్వరం ఉన్న వారెవరూ హైకోర్టు ఆవరణలోకి రావడానికి వీల్లేదు. న్యాయవాదులు సైతం తమ కేసు విచారణకు వచ్చే వరకూ వెయిటింగ్ హాల్స్ లేదా ఖాళీగా ఉన్న ఇతర కోర్టులో వేచి ఉండాలి. ఉదయం 7.30, 9.30 గంటలకు, సాయంత్రం 5 గంటల తర్వాత కోర్టు హాల్స్‌ను పూర్తిగా శానిటైజ్ చేస్తారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్.చౌహాన్, జస్టిస్ బి.విజయసేన్ రెడ్డితో కూడిన ధర్మాసనంతోపాటు న్యాయమూర్తులు జస్టిస్ పి.నవీన్‌రావు, జస్టిస్ చల్లా కోదండరామ్, జస్టిస్ షమీమ్ అక్తర్, జస్టిస్ జి.శ్రీదేవి బెంచ్‌లు భౌతికంగా కేసులను విచారిస్తాయి. హైకోర్టు జారీచేసిన మార్గదర్శకాలతోపాటు కోవిడ్ నిబంధనలు తప్పక పాటించాలి’’అని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
న్యాయమూర్తుల అనవసర బదిలీలు
ఉద్యోగస్తులకి బదిలీలు సర్వ సామాన్యం. ఆరోపణలు వచ్చినా, మూడు సంవత్సరాలు గడిచినా ఆ ఉద్యోగిని ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతా నికి బదిలీ చేస్తారు. ప్రభుత్వ ఉద్యోగులకన్నా న్యాయమూర్తుల బదిలీలు క్రమబద్ధంగా జరు గుతూ ఉంటాయి. ప్రతి సంవ త్సరం ఏప్రిల్, మే నెలల్లో ఈ బదిలీలు తప్పక జరుగు తాయి. కోవిడ్–19 వచ్చిన తరువాత ఈ బదిలీల విష యంలో ప్రభుత్వాలు వెనుకంజ వేశాయి. కేంద్ర ప్రభుత్వం, ఆ ప్రభుత్వ అధీనంలో ఉన్న సంస్థలు ఈ వార్షిక బదిలీలని నిలిపివేశాయి. మనదేశంలోని చాలా హైకోర్టులు కూడా ఇలాంటి నిర్ణయాన్ని ప్రకటించాయి. అందులో ముఖ్యమైనవి తెలంగాణ, బాంబే, అలహా బాద్, మద్రాస్, మధ్యప్రదేశ్, కేరళ లాంటి రాష్ట్రాలు ఉన్నాయి. కరోనా తీవ్రత లేని రాష్ట్రాలు కూడా ఈ సంవత్సరం సాధారణ బదిలీలను నిలిపివేశాయి. ఒక్క ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మాత్రం న్యాయమూర్తులను బదిలీలు చేసింది. ఆ హైకోర్టు ఇన్చార్జ్ న్యాయ మూర్తులను బదిలీలు చేసింది. ఆ హైకోర్టు ఇన్చార్జ్ రిజిస్ట్రార్ జనరల్ బి.రాజశేఖర్ ఈ మధ్య గుండెపోటుతో మరణించారు. పని ఒత్తిడి వల్ల మరణించినాడని, కోవిడ్ వల్ల మర ణించాడని వార్తలు విన్పిస్తున్నాయి. అందులో ఏది వాస్తవమో మనకు తెలియదు. కరోనా విజృంభిస్తున్నవేళ, కోర్టులే వర్చువల్ కోర్టులుగా పనిచేస్తున్న సందర్భంలో న్యాయమూర్తుల బదిలీలు అవసరమా అన్న ప్రశ్నని చాలామంది న్యాయమూర్తులు, న్యాయవాదులు, వెలి బుచ్చుతున్నారు. కొన్ని మాసాలపాటు కోవిడ్‌తో సహజీవనం చేయాల్సిన పరిస్థితులు వున్నాయని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోషిస్తున్నాయి. లాక్‌డౌన్‌వల్ల, కొత్త పద్ధతులకి, న్యాయ మూర్తులు, సిబ్బంది అలవాటు పడే పరిస్థితి ఏర్పడింది. ఈ కొత్త వాతావరణానికి న్యాయమూర్తులు, సిబ్బంది ఇప్పుడిప్పుడే అలవాటు పడుతున్నారు. ఈ వాతావర ణంలో కోర్టులో కేసుల పరిష్కారం, కుటుంబ బాధ్యత, పిల్లల చదువు, ఆరోగ్యం లాంటి అంశాలతో న్యాయ మూర్తులు తల్లడిల్లుతున్నారు. ఈ దశలో న్యాయమూర్తులకి బదిలీలు వాళ్లని తెలియని ఒత్తిడికి గురిచేస్తాయి. కరోనా కాలంలో కొత్త ప్రాంతానికి వెళ్లడం, అక్కడ సర్దుబాటు కావడం సులువైన విషయం కాదు. సామాను సర్దుకోవడం చాలా కష్టమైన పని. దానికి పనివాళ్ళ సహాయం కావాలి. ప్యాకర్స్, మూవర్స్ అవసరం ఏర్పడుతుంది. కూరగాయలనే కడు గుతున్న కాలంలో సామానుని ఒక ఊరి నుంచి మరో ఊరికి తరలించడం కష్టసాధ్యమైన పని. లగేజీకి, అంటు వ్యాధి సంక్రమించకుండా చూసుకోవడం చాలా కష్టమైన పని. పిల్లల చదువూ, ఆరోగ్యం, తల్లిదండ్రుల బాధ్యత మధ్య న్యాయమూర్తులు సతమతమయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. ఇంత ఒత్తిడిలో ఉన్న న్యాయమూర్తులు తన విధు లని ఎలా నిర్వహిస్తారన్న ప్రశ్నని చాలామంది విజ్ఞులు లేవనెత్తుతున్నారు. ఇన్ని సమస్యలు ఉన్నా న్యాయ మూర్తులు నోరు విప్పరు. అలాంటి క్రమశిక్షణ వాళ్ళలో ఉంటుంది. వాళ్ళ అసోసియేషన్స్ కూడా మాట్లాడటానికి జంకుతారు. మిగతా ఉద్యోగులు వేరు. న్యాయమూర్తులు వేరు. కిందికోర్టు న్యాయమూర్తులని అనవసర బదిలీల ద్వారా, అసౌకర్య బదిలీల ద్వారా బలిపశువులని చేస్తూ ఉంటారని సుప్రీంకోర్టు మింటూ మాలిక్ కేసులో (హైకోర్టు ఆఫ్ కలకత్తా వర్సెస్ మింటూ మాలిక్ మరియు ఇతరులు, స్పెషల్ లీవ్ పిటిషన్ (సివిల్) నెం. 24240/2019, తీర్పు తేదీ నవంబర్ 15, 2019) అభిప్రా యపడింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఇందిరా బెనర్జీ, బి.ఆర్. గవాయ్‌లు ఈ తీర్పుని వెలువరించారు. న్యాయమూర్తులని బలిపశువులు చేసే విషయంలో సుప్రీంకోర్టు తన ఆందోళనని ఈ తీర్పులో వెలువ రించింది. ఈ కేసులో ఒక రైల్వే మేజిస్ట్రేట్‌ని నిర్బంధంగా పదవీ విరమణ చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఈ ఉత్తర్వులని ఆ న్యాయమూర్తి కలకత్తా హైకోర్టులో సవాలు చేశాడు. ఆ న్యాయమూర్తిని తిరిగి విధుల్లో చేర్చుకోవా లని హైకోర్టులోని డివిజన్ బెంచ్ హైకోర్టుని ఆదేశిం చింది. అతను చేసిన చర్యలో చెడు నడవడిక లేదని సదు ద్దేశంతో అతను ఆ చర్యను చేశాడని హైకోర్టు అభి ప్రాయపడింది. ఆ మేజిస్ట్రేట్ ప్రయాణం చేసే రైలు తరచూ ఆల స్యంగా రావడానికి కారణం అనవసరంగా కొన్ని ప్రదే శాల్లో ఆపి, చట్ట వ్యతిరేకంగా కొన్ని వస్తువులని దింపడం. తన అధికార పరిధిలో చట్ట వ్యతిరేక పనులు జరగడం పట్ల ఆందోళన చెంది అతను ఆ రైల్వే ఉద్యోగుల మీద చర్య తీసుకుంటాడు. ఈ విషయం మీద హైకోర్టు విచా రణ జరిపి అతన్ని సస్పెండ్ చేసి, నిర్బంధంగా పదవీ విరమణకు ఆదేశాలు జారీ చేస్తుంది. ఈ ఆదేశాలను అతను హైకోర్టులో సవాలు చేస్తే, అతన్ని తిరిగి ఉద్యోగంలో చేర్చుకోవాలని అదేవిధంగా లక్ష రూపాయలు అతనికి ఖర్చుల కింద ఇవ్వాలని హైకోర్టు డివిజన్ బెంచ్ హైకోర్టునే ఆదేశించింది. ఈ తీర్పుకి వ్యతిరేకంగా హైకోర్టు, సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై తీర్పు చెబుతూ సుప్రీంకోర్టు ఇలా అభిప్రాయపడింది. ఈ రోజుల్లో న్యాయమూర్తులని బలిచేసే ట్రెండ్ ఒకటి మొదలైంది. అనవసర బదిలీల ద్వారా మరో విధమైన చర్యల ద్వారా న్యాయమూర్తుల మీద చర్యలు తీసుకుంటున్నారు. న్యాయమూర్తులకి వ్యతిరేకంగా న్యాయవాదులు గానీ, ఇతరులు కానీ ధర్నాలు చేస్తే చాలు.. వారిని బది లీలు చేస్తున్నారు. అదేవిధంగా చర్యలు తీసుకుంటు న్నారు. న్యాయమూర్తుల తప్పు ఎంతవుందన్న ఆ విష యాన్ని పరిగణనలోకి తీసుకోవడం లేదు. సాధారణ బదిలీల విషయంలో మింటూ మాలిక్ కేసులో మాదిరిగా చెడు నడవడిక, ధర్నాల ప్రస్తావన వుండదు. అలాంటి కేసులు ఒకటి అరా ఉండవచ్చేమో తెలియదు. కానీ, ఇవి ప్రతి ఏడాది ఏప్రిల్, మే నెలల్లో జరిగే ప్రక్రియ. ఈ కోవిడ్–19 కాలంలో అన్ని హైకోర్టుల మాదిరిగా బదిలీలను నిలిపివేస్తే న్యాయమూర్తులు అసౌక ర్యానికి, వేదనకి గురికాకుండా ఉంటారు. వ్యాసకర్త, మంగారి రాజేందర్