సాక్షి, అమరావతి: విజయవాడలో ఏసీబీ కోర్టు జడ్జి ఇంటి వద్ద శనివారం అర్ధరాత్రి టీడీపీ లీగల్ సెల్ న్యాయవాదులు హంగామా సృష్టించారు. టీడీపీ న్యాయవాదులు నిబంధనలకు విరుద్ధంగా అర్ధరాత్రి జడ్జిని కలిసేందుకు ప్రయత్నించడంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో న్యాయవాదులు వారితో వాగ్వాదానికి దిగారు.
చంద్రబాబు అరెస్టుకు సంబంధించి హౌస్ మోషన్ పిటిషన్ ఇచ్చేందుకు రాత్రి 12 గంటల సమయంలో టీడీపీ న్యాయవాదులు వెళ్లారు. పిటిషన్ తీసుకునేందుకు జడ్జి నిరాకరించారు. కోర్టుకే రావాలని సూచించారు. జడ్జి సూచనల మేరకు పోలీసులు న్యాయవాదులను బయటకు వెళ్లాలని కోరారు. దీంతో లాయర్లు పోలీసులతో గొడవకు దిగారు. జడ్జి చెప్పడం వల్లే తాము బయటకు వెళ్లాలంటున్నామని పోలీసులు చెబుతున్నా వినలేదు.
Comments
Please login to add a commentAdd a comment