house motion petition
-
చంద్రబాబు న్యాయవాదుల పిటిషన్ ను తిరస్కరించిన కోర్టు..
-
ఏసీబీ కోర్టు జడ్జి ఇంటి వద్ద టీడీపీ లాయర్ల హంగామా
సాక్షి, అమరావతి: విజయవాడలో ఏసీబీ కోర్టు జడ్జి ఇంటి వద్ద శనివారం అర్ధరాత్రి టీడీపీ లీగల్ సెల్ న్యాయవాదులు హంగామా సృష్టించారు. టీడీపీ న్యాయవాదులు నిబంధనలకు విరుద్ధంగా అర్ధరాత్రి జడ్జిని కలిసేందుకు ప్రయత్నించడంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో న్యాయవాదులు వారితో వాగ్వాదానికి దిగారు. చంద్రబాబు అరెస్టుకు సంబంధించి హౌస్ మోషన్ పిటిషన్ ఇచ్చేందుకు రాత్రి 12 గంటల సమయంలో టీడీపీ న్యాయవాదులు వెళ్లారు. పిటిషన్ తీసుకునేందుకు జడ్జి నిరాకరించారు. కోర్టుకే రావాలని సూచించారు. జడ్జి సూచనల మేరకు పోలీసులు న్యాయవాదులను బయటకు వెళ్లాలని కోరారు. దీంతో లాయర్లు పోలీసులతో గొడవకు దిగారు. జడ్జి చెప్పడం వల్లే తాము బయటకు వెళ్లాలంటున్నామని పోలీసులు చెబుతున్నా వినలేదు. -
రాహుల్ ఓయూ పర్యటనపై హౌజ్ మోషన్ పిటిషన్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ, హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ పర్యటన రాజకీయ దుమారం రేపుతోంది. టీఆర్ఎస్, కాంగ్రెస్ విద్యార్థి సంఘాలు, పార్టీ నేతల పోటాపోటీ విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో.. మరోసారి హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. బుధవారం పర్యటన అనుమతి వ్యవహారంపై మరో పిటిషన్ వేసింది కాంగ్రెస్ పార్టీ. రాహుల్ ఓయూ పర్యటనపై మరోసారి హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. హౌజ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేసింది కాంగ్రెస్ పార్టీ. ఓయూ వీసీ, హైకోర్టు ఆదేశాలను పరిగణనలోకి తీసుకోవడం లేదంటూ పిటిషన్లో పేర్కొంది. దీంతో కాంగ్రెస్ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోవాలని వీసీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇదిలా ఉంటే.. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ముందస్తు షెడ్యూల్ ప్రకారం.. మే 7వ తేదీన ఓయూలో పర్యటించి.. విద్యార్థులతో ముఖాముఖిలో పాల్గొనాల్సి ఉంది. కానీ, ఆంక్షల నేపథ్యంలో ఓయూ వీసీ ప్రొఫెసర్ రవీందర్ యాదవ్ అందుకు అనుమతి నిరాకరించారు. ఈ విషయమై ఇదివరకే తెలంగాణ కాంగ్రెస్.. హైకోర్టును ఆశ్రయించగా, నిర్ణయం వీసీదేనని హైకోర్టు సైతం పేర్కొంది. చదవండి: ఓయూకొచ్చి స్టూడెంట్స్‌తో నైట్ క్లబ్ గురించి చెప్తారా? -
కౌంటింగ్‌పై ఉత్కంఠ: హౌజ్‌మోషన్ పిటిషన్ దాఖలు
-
కౌంటింగ్‌పై ఉత్కంఠ: హౌజ్‌మోషన్ పిటిషన్ దాఖలు
సాక్షి, హైదరాబాద్: మరికాసేపట్లో జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు విడుదల కానున్న నేపథ్యంలో.. పెన్నుతో టిక్‌పెట్టినా ఓటేసినట్లేనని ఎస్ఈసీ సర్క్యులర్ జారీ చేసింది. ఆ వెంటనే ఈసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ బీజేపీ శ్రేణులు హైకోర్టులో హౌజ్‌మోషన్ పిటిషన్‌ను దాఖలు చేశాయి. మరికాసేపట్లో దీనిపై వాదనలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఒట్ల లెక్కింపుపై ఉత్కంఠ నెలకొంది. -
ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్
-
ఆర్టీసీ సమ్మెపై హౌస్ మోషన్ పిటిషన్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెపై హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలైంది. తక్షణమే ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించేలా ఆదేశించాలంటూ పిటిషనర్ ఓయూ రీసెర్చ్ స్కాలర్ సురేంద్ర సింగ్ ఆదివారం ఈ పిల్ దాఖలు చేశారు. అలాగే కార్మికుల సమస్యలపై కమిటీ వేయాలని ఆయన తన వ్యాజ్యంలో కోరారు. ‘గతంలో ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తామని హామీ ఇచ్చింది. ఆ హామీని ఇప్పటికి అమలు చేయకపోవడంతో కార్మికులు సమ్మెకు దిగారు. ఇచ్చిన హామిని అమలు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలి. సమ్మె కారణంగా లక్షలమంది ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు.’ అని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై సాయంత్రం నాలుగు గంటలకు హైకోర్టు న్యాయమూర్తి వాదనలు విననున్నారు. కుందన్‌బాగ్‌లోని జడ్జి నివాసంలో విచారణ జరగనుంది. పిటిషనర్ తరఫున న్యాయవాది కృష్ణయ్య వాదనలు వినిపించనున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ మధ్యాహ్నం 1.30 గంటలకు ఆర్టీసీ సమ్మెపై సమీక్ష నిర్వహించనున్నారు. -
ముద్రగడ దీక్షపై హైకోర్టులో హౌస్‌మోషన్ పిటిషన్
ముద్రగడ దీక్ష నేపథ్యంలో పోలీసు ఆంక్షలపై ఆయన కుమారుడు బాలు హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు ధర్మాసనం.. దానిపై విచారణను బుధవారానికి వాయిదా వేసింది. జస్టిస్ ప్రవీణ్ కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును విచారిస్తుంది. కాగా, ముద్రగడను అరెస్టు చేసినట్లు చెబుతున్నా, ఇంతవరకు ఎఫ్ఐఆర్ కూడా దాఖలు చేయలేదని.. కేవలం 144 సెక్షన్ అమలుచేస్తున్నట్లు మాత్రమే చెబుతున్నారని పిటిషన్లో చెప్పారు. జిల్లాలో పోలీసు బందోబస్తు తీవ్రంగా పెట్టి భయాందోళనలకు గురి చేస్తున్నారని, కనీసం పిల్లలను స్కూళ్లకు కూడా వెళ్లనివ్వడం లేదని తెలిపారు. బంధువులను కూడా తమ ఇంటికి రానివ్వకుండా అడ్డుకుంటున్నారని, రాజ్యాంగం తమకు కల్పించిన ప్రాథమిక హక్కులను కూడా పోలీసులు హరిస్తున్నారని ముద్రగడ కుమారుడు బాలు తమ న్యాయవాది ద్వారా కోర్టుకు తెలిపారు. రాజ్యాంగ హక్కులు తమకు కల్పించేలా చూడాలని కోరారు. తమ ఇంటిపై పోలీసులు దాడి చేసి అనుచితంగా ప్రవర్తించారని బాలు చెప్పారు. -
కాసేపట్లో వైఎస్ జగన్ దీక్షపై కార్యాచరణ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 26 నుంచి గుంటూరులో వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన నిరవధిక దీక్ష విషయంపై కాసేపట్లో కార్యాచరణ వెలువడనుంది. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు వైఎస్ఆర్ సీపీ నాయకులు సమావేశమై చర్చించనున్నారు. వైఎస్ జగన్ దీక్షకు అనుమతి ఇవ్వాలంటూ వైఎస్ఆర్ సీపీ దాఖలు చేసిన హౌస్‌మోషన్ పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. ఈ విషయంపై రెగ్యులర్ కోర్టుకు వెళ్లాలని హైకోర్టు సూచించింది. కాగా వైఎస్ జగన్ దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించిన సంగతి తెలిసిందే. దీంతో వైఎస్ఆర్ సీపీ హైకోర్టును ఆశ్రయించింది. దీక్షకు అనుమతి ఇచ్చేలా ప్రభుత్వాని ఆదేశించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన పిటిషన్ లో న్యాయస్థానాన్ని కోరింది. అయితే రెగ్యులర్ కోర్టుకు వెళ్లాలని హైకోర్టు ఆదేశించింది.