
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ, హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ పర్యటన రాజకీయ దుమారం రేపుతోంది. టీఆర్‌ఎస్, కాంగ్రెస్ విద్యార్థి సంఘాలు, పార్టీ నేతల పోటాపోటీ విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో.. మరోసారి హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. బుధవారం పర్యటన అనుమతి వ్యవహారంపై మరో పిటిషన్ వేసింది కాంగ్రెస్ పార్టీ.
రాహుల్ ఓయూ పర్యటనపై మరోసారి హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. హౌజ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేసింది కాంగ్రెస్ పార్టీ. ఓయూ వీసీ, హైకోర్టు ఆదేశాలను పరిగణనలోకి తీసుకోవడం లేదంటూ పిటిషన్‌లో పేర్కొంది. దీంతో కాంగ్రెస్ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోవాలని వీసీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఇదిలా ఉంటే.. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ముందస్తు షెడ్యూల్ ప్రకారం.. మే 7వ తేదీన ఓయూలో పర్యటించి.. విద్యార్థులతో ముఖాముఖిలో పాల్గొనాల్సి ఉంది. కానీ, ఆంక్షల నేపథ్యంలో ఓయూ వీసీ ప్రొఫెసర్ రవీందర్ యాదవ్ అందుకు అనుమతి నిరాకరించారు. ఈ విషయమై ఇదివరకే తెలంగాణ కాంగ్రెస్.. హైకోర్టును ఆశ్రయించగా, నిర్ణయం వీసీదేనని హైకోర్టు సైతం పేర్కొంది.
చదవండి: ఓయూకొచ్చి స్టూడెంట్స్‌తో నైట్ క్లబ్ గురించి చెప్తారా?
Comments
Please login to add a commentAdd a comment