osmania uniersity
-
Osmania University: ఉస్మానియా అలాయ్ బలాయ్!
వందేళ్ళకు పైగా ఘన చరిత్ర, కీర్తి గల ఉస్మానియా యూనివర్సిటీ మరొక అద్భుతమైన ఘట్టానికి తెరలేపుతోంది. గ్లోబల్ అలుమ్నయి మీట్ (జీఏఎమ్–23)ను జనవరి మూడు, నాలుగు తేదీలలో నిర్వహిస్తోంది. స్వాతంత్య్ర ఉద్యమ కాలంనాటి వందేమాతరం ఉద్యమం నుండి తొలి, మలి తెలంగాణ ఉద్యమాల వరకూ ఎన్నో ప్రజా యుద్ధాలకూ, తెలంగాణ ప్రజల అస్తిత్వానికీ, ఆత్మగౌరవానికీ చిహ్నంగా నిలిచింది ఉస్మానియా. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల 57వ రూమ్ ఎన్నో సామాజిక, రాజకీయ, అస్తిత్వ ఉద్యమాలకూ, మేధో చర్చలకూ వేదిక అయింది. హైదరాబాద్‌కు మణిహారం లాంటి ఆర్ట్స్ కళాశాల నుండి ప్రపంచాన్ని ప్రభావితం చేసిన మేధావులు, పాత్రికేయులు, రాజ కీయ నాయకులు, కళాకారులు, సాహితీ వేత్తలు, వ్యాపారవేత్తలు, సినీ, క్రీడా ప్రముఖులు తయారయ్యారు. మిగతా కళాశాలల నుంచి గొప్ప ఇంజినీరింగ్, శాస్త్త్ర సాంకేతిక నిపుణులూ, సైంటి స్టులూ తలెత్తారు. ఈ దేశానికి ప్రధాన మంత్రి అయిన పీవీ నర్సింహారావు, పార్లమెంట్లో గొప్ప వక్తగా, విమర్శకునిగా పేరున్న ఎస్. జైపాల్ రెడ్డి, లోక్ సభ మాజీ స్పీకర్ శివరాజ్ పాటిల్, వామపక్ష ఉద్యమాలకు ఊపిరులూదిన జార్జిరెడ్డి; గొప్ప కవి, రచయిత, టీచర్‌గా పేరున్న సి. నారాయణ రెడ్డి, సినీ దిగ్గజం శ్యాంబెనెగల్, ఆర్బీఐ మాజీ గవర్నర్ వైవీ రెడ్డి... ఇలా చెప్పుకుంటూపోతే ఉస్మానియా ఉత్పత్తి చేసిన మహామహుల పేర్లకు అంతుండదు. నిజానికి ఉస్మానియా చరిత్ర రాస్తే ఒక ఉద్గ్రంథమే అవుతుంది. కడుపు చేత పట్టుకొని వచ్చిన వేలాది మంది విద్యార్థులను అమ్మలాగా ఆదరించి అక్కున చేర్చుకొని వారికి సుందరమైన భవిష్యత్తును తీర్చిదిద్ది దేశ సేవ కోసం బయటికి పంపింది ఉస్మానియా. (క్లిక్ చేయండి: నూతన సంవత్సర తీర్మానాలు) ‘ఎన్సీసీ’ నుండి యూనివర్సిటీ ప్రాంగణంలోకి అడుగుపెట్టగానే ఏదో తెలియని అనుభూతి అనుభవిస్తే గాని మనసు కుదుటపడదు. పచ్చని చెట్లు, పిట్టల కిలకిలా రావాలతో జీవ వైవిధ్యం ఉట్టిపడే క్యాంపస్‌లో అడుగుపెడితే ఎన్నో అద్భుతమైన జ్ఞాపకాలు! యూనివర్సిటీ లైబ్రరీలో రేయింబవళ్లూ కూర్చొని చదువుకోవడం, ఇంజనీరింగ్ కాలేజీ క్యాంటీన్ కబుర్లూ; అబ్బాయిలూ, అమ్మాయిలూ కలిసి చెట్టాపట్టాల్ వేసుకుని తిరిగే దృశ్యాలూ, ఎల్లమ్మ తల్లి గుడి దగ్గర జరుపుకొన్న వేడుకలూ, యూనివర్సిటీలోని చాయ్ కొట్టుల దగ్గర జరిపిన సుదీర్ఘమైన సామాజిక, రాజకీయ చర్చలూ, సరదా సంభాషణలూ... ఎన్ని జ్ఞాపకాలు! మన యూనివర్సిటీ క్యాంపస్‌లో ఆత్మీయ ఆలింగనాలు చేసుకుని మరోసారి పలకరించుకుందాం రండి. సుదీర్ఘకాలం తర్వాత మళ్లీ ఒకసారి అందరం ఒక దగ్గర కూడి ఆనాటి మధుర జ్ఞాపకాలను తలుచుకుని తరించే అవకాశం యూనివర్సిటీ కల్పిస్తోంది. ఇలాంటి అవకాశాలు, సందర్భాలు రావడం బహు అరుదు. అన్ని విధాలా అభివృద్ధి చెందిన మన పాత విద్యార్థులు యూనివర్సిటీ అభివృద్ధికి తమ వంతు సాయం అందించడానికి తగిన సందర్భమూ ఇదే! – వలిగొండ నరసింహ, రీసెర్చ్ స్కాలర్, ఓయూ (జనవరి 3, 4 తేదీలలో ఓయూ పూర్వ విద్యార్థుల సమ్మేళనం) -
రాహుల్ ఓయూ పర్యటనపై హౌజ్ మోషన్ పిటిషన్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ, హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ పర్యటన రాజకీయ దుమారం రేపుతోంది. టీఆర్ఎస్, కాంగ్రెస్ విద్యార్థి సంఘాలు, పార్టీ నేతల పోటాపోటీ విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో.. మరోసారి హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. బుధవారం పర్యటన అనుమతి వ్యవహారంపై మరో పిటిషన్ వేసింది కాంగ్రెస్ పార్టీ. రాహుల్ ఓయూ పర్యటనపై మరోసారి హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. హౌజ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేసింది కాంగ్రెస్ పార్టీ. ఓయూ వీసీ, హైకోర్టు ఆదేశాలను పరిగణనలోకి తీసుకోవడం లేదంటూ పిటిషన్లో పేర్కొంది. దీంతో కాంగ్రెస్ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోవాలని వీసీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇదిలా ఉంటే.. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ముందస్తు షెడ్యూల్ ప్రకారం.. మే 7వ తేదీన ఓయూలో పర్యటించి.. విద్యార్థులతో ముఖాముఖిలో పాల్గొనాల్సి ఉంది. కానీ, ఆంక్షల నేపథ్యంలో ఓయూ వీసీ ప్రొఫెసర్ రవీందర్ యాదవ్ అందుకు అనుమతి నిరాకరించారు. ఈ విషయమై ఇదివరకే తెలంగాణ కాంగ్రెస్.. హైకోర్టును ఆశ్రయించగా, నిర్ణయం వీసీదేనని హైకోర్టు సైతం పేర్కొంది. చదవండి: ఓయూకొచ్చి స్టూడెంట్స్‌తో నైట్ క్లబ్ గురించి చెప్తారా? -
ఓయూలో సాంస్కృతిక సందడి
ఉస్మానియా యూనివర్సిటీ: అంతర్ కళాశాలల సాంస్కృతిక పోటీలతో ఓయూ క్యాంపస్‌లో సందడి వాతావరణం నెలకొంది. శనివారం ఠాగూర్ ఆడిటోరియంలో సాంస్కృతిక పోటీలను వీసీ ప్రొ.రవీందర్ ప్రారంభించారు. కరోనా కారణంగా మూడేళ్లుగా నిలిచిపోయిన సాంస్కృతిక పోటీలను చేపట్టడంతో ఓయూ పరిధిలోని వందలాది విద్యార్థులు ఉత్సాహంగా, ఉల్లాసంగా పాల్గొన్నారు. తొలి రోజు డ్యాన్స్, మ్యూజిక్ విభాగాల్లో క్లాసికల్, ఫోక్, ట్రైబల్, దేశభక్తి నృత్యాలు, సంగీతంలో ఇండియా, వెస్ట్రన్ పాటలతో అందరగొట్టారు. ఎంపికైన విద్యార్థులను అంతర్ విశ్వవిద్యాలయాల పోటీలకు పంపిస్తారు. -
‘ప్రవేశ పరీక్ష రాయకున్నా పీజీ ప్రవేశాలు’
ఉస్మానియా యూనివర్సిటీ: టీఎస్‌సీపీజీఈటీ–2021 మూడు విడతల వెబ్ కౌన్సెలింగ్ అనంతరం మిగిలిన సీట్లను ఆయా విశ్వవిద్యాలయాల పరిధిలోని కళాశాలలు భర్తీ చేసుకోవాలని కన్వీనియర్ ప్రొఫెసర్ పాండురంగారెడ్డి శనివారం పేర్కొన్నారు. ఈ నెల 31 నుంచి ఫిబ్రవరి 9 వరకు వివిధ పీజీ కోర్సుల సీట్లను భర్తీ చేసి 14న ఓయూలోని పీజీ అడ్మిషన్స్ కార్యాలయంలో సమర్పించాలని కోరారు. ప్రవేశ పరీక్షను రాయని అభ్యర్థులు, సీపీజీఈటీ–2021లో అర్హత సాధించని విద్యార్థులకు సైతం పీజీ కోర్సుల్లో ప్రవేశం కల్పించవచ్చని తెలిపారు. -
భారత్ బలాన్ని చాటేలా.. పరిశోధనలుండాలి!
సాక్షి, హైదరాబాద్: ఏపీ సీఎం వైస్ జగన్మోహన్రెడ్డి సహా చాలా మంది ప్రముఖులను ఉస్మానియా యూనివర్సిటీ ఈ దేశానికి అందించిందని డీఆర్డీవో చైర్మన్ డాక్టర్ జి.సతీశ్‌రెడ్డి పేర్కొన్నారు. సాంకేతిక సవాళ్లను ఎదుర్కొనే క్రమంలో నేటి తరం పాత్ర కీలకమని ఉద్బోధించారు. భారత్ బలాన్ని ప్రపంచానికి చాటే దిశగా యువత పరిశోధనలు ఉండాలని ఆకాంక్షించారు. బుధవా రం జరిగిన ఉస్మానియా యూనివర్సిటీ 81వ స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉస్మానియా యూనివర్సిటీ వెలుగులు విరజిమ్ముతోందని కీర్తించారు. వైఎస్ జగన్, కేసీఆర్‌తో విశ్వవిద్యాలయానికున్న అనుబంధాన్ని గుర్తు చేశారు. జాతీయ, అంతర్జాతీయ రంగానికెదిగిన ప్రముఖులను ప్రస్తావించారు. ఆర్బీఐ మాజీ గవర్నర్ వైవీరెడ్డి, పారిశ్రామికవేత్త జీవీకే రెడ్డి, ఎయిర్ చీఫ్ మార్షల్ ఐహెచ్ లతీఫ్, క్రీడాకారిణి సానియా మీర్జా అనేక మంది వర్సిటీ పూర్వ విద్యార్థులే అన్నారు. అంతరిక్షంలోకి వెళ్లిన మొదటి భారతీయుడు, వింగ్ కమాండర్ రాకేష్ శర్మ సైతం పూర్వ విద్యార్థి కావడం గర్వకారణమన్నారు. పరిశోధనల కేంద్రం దేశ ఆయుధాగారంలో ప్రధాన క్షిపణులు, వ్యూహాత్మక వ్యవస్థలకు సంబంధించిన పరిశోధన, అభివృద్ధి కార్యక్రమాలను ఉస్మానియా యూనివర్సిటీ లేబొరేటరీలతో కలసి నిర్వహించడం గర్వించదగ్గ పరిణామమని సతీశ్‌రెడ్డి పేర్కొన్నారు. కంప్యూటర్, ఎలక్ట్రానిక్స్‌లో భారత్ పురోభివృద్ధిలో ఉందన్నారు. రొబోటిక్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, నానో టెక్నాలజీ, వేగవంతమైన సమాచార వ్యవస్థను భారత్ సొంతం చేసుకోవడం అభినందనీయమన్నారు. ఏ దేశ బలానికైనా ఆర్థిక, సాంకేతిక అంశాలే కొలమానమని పేర్కొన్నారు. అత్యున్నత స్థాయికి ఎదగాలి ఉస్మానియాలో చదివిన విద్యార్థులు దేశంలో అత్యున్నత స్థాయికి చేరుకున్నారని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం జీవితానికి విజయ సూచిక అని పేర్కొన్నారు. వర్సిటీని వీడి వాస్తవ జీవితంలోకి వెళ్తున్న విద్యార్థులకు సమాజమే ప్రయోగశాల అని చెప్పారు. ఓయూ విద్యార్థులు ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా గర్వించేలా ఉండాలని సూచించారు. పరిశోధనలతో సరికొత్త ఆవిష్కరణలను చేపట్టాలన్నారు. ఎన్ని సవాళ్లు ఎదురైనా అనుకున్న లక్ష్యం దిశగా విద్యార్థులు ముందుకు సాగాలన్నారు. మీ జీవితాలు తెల్లకాగితం లాంటివి అందులో ఎలా రాసుకుంటే అలా భవిష్యత్తు ఉంటుందన్నారు. అనంతరం కెమిస్ట్రీలో 5బంగారు పతకాలు సాధించిన ఎస్.సుశాంత్, 4 బంగారు పతకాలు సాధించిన మహేష్కర్, గోల్డ్‌మెడల్స్ సాధించిన ఇతరులను అభినందించి పతకాలు అందజేశారు. కార్యక్రమంలో వీసీ ప్రొ.రవీందర్, రిజిస్ట్రార్ లక్ష్మీనారాయణ, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు. -
ఉస్మానియాను ‘ఆన్లైన్’ చేశా
ఉస్మానియాయూనివర్సిటీ: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉస్మానియా విశ్వవిద్యాలయానికి తొలి వీసీగా పనిచేయడం తన అదృష్టమని, వందేళ్ల ఓయూకు శతాబ్ది ఉత్సవాలు తన చేతుల మీదుగా నిర్వహించడం పూర్వజన్మ సుకృతమని ఉస్మానియా విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ రామచంద్రం ఆనందం వ్యక్తం చేశారు. అన్ని విభాగాల్లోనూ ఆన్లైన్ విధానం ప్రవేశపెట్టి అక్రమాలకు చోటు లేకుండా ఓయూను తీర్చిదిద్దానన్నారు. కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ విభాగం సీనియర్ ప్రొఫెసర్ రామచంద్రం 2017 జూలై 24న ఓయూ వీసీగా పదవీ బాధ్యతలు చేపట్టారు. బుధవారంతో ఆయన పదవీ కాలం పూర్తయింది. ఈ సందర్భంగా వీసీగా తన మూడేళ్ల పాలనా అనుభవాలను బుధవారం ‘సాక్షి’తో పంచుకున్నారు. సమయ పాలనతో తొలి అడుగు వర్సిటీ అభివృద్ధిలో వీసీ ప్రొఫెసర్ రామచంద్రం సమయ పాలన పాటించారు. అది తన నుంచే మొదలు పెట్టారు. తన నివాసాన్ని ఆర్టీసీ క్రాస్‌రోడ్డు అశోక్‌నగర్ నుంచి ఓయూ క్యాంపస్‌కు మార్చారు. వీసీగా బాధ్యతలు నిర్వహిస్తునే ఇంజినీరింగ్ కాలేజీలో విద్యార్థులకు క్రమం తప్పకుండా తరగతులను తీసుకున్నారు. భార్య ఇందిర బ్యాంక్ మేనేజర్, ఒకే కొడుగు అమెరికాలో స్థిరపడ్డారు. తనకు కుటుంబ బాధ్యతలు పెద్దగా లేకపోవడంతో నిత్యం వర్సిటీ కోసమే పనిచేసిన్నట్లు వివరించారు. రామచంద్రం కంటే ముందు ఓయూకు రెండేళ్ల పాటు శాస్వత వీసీ లేనందున తను పదవీ బాధ్యతలు చేపట్టేనాటికి అనేక సమస్యలతో ఉద్యోగుల ఆందోళనలు నిత్యం జరుగుతుండేవని, వీటితో పాటు నిధుల కొరతతో ఓయూ కొట్టుమిట్టాడుతుండేది. ఆరు నెలల్లోనే ఆందోళనలకు తావులేకుండా అభివృద్ధిపై దృష్టి సారించానన్నారు. అందరి సహకారంతో మూడేళ్లలో శతాబ్ది ఉత్సవాల నిర్వహణ, ఏడేళ్లకు ‘న్యాక్ ఎ ప్లస్’ గ్రేడ్ గుర్తింపు, రూసా పథకం ద్వారా రూ.100 కోట్లు, ఏడు పరిశోధన కేంద్రాల స్థాపన, ఆరేళ్ల స్నాతకోత్సవాన్ని ఒకేసారి నిర్వహించానన్నారు. ఓయూలో ఎన్నో అభివృద్ధి పనులు ఓయూలో చదివే విద్యార్థుల సౌకర్యార్థం అనేక అభివృద్ధి పనులు చేపట్టిన్నట్లు వీసీ రామచంద్రం వివరించారు. హాస్టల్ భవనాల నిర్మాణంతో పాటు కార్యాలయాలు, ఇతర భవనాలను నిర్మించిన్నట్లు చెప్పారు. క్యాంపస్‌లో రోడ్ల నిర్మాణం, తాగునీటి వసతి, ఉచిత వైఫై, వికలాంగ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు, పరీక్ష ఫీజు మొదలు హాస్టల్ మెస్ బిల్లుల వరకు ఆన్లైన్లో చెల్లిపును ప్రవేశ పెట్టామన్నారు. అన్ని ప్రవేశ పరీక్షలు ఆన్లైన్లో నిర్వహించి జవాబు పత్రాల మూల్యాంకనం సైతం ఆన్లైన్లో చేస్తున్నట్టు చెప్పారు. పరీక్షల విభాగంలో వివిధ డిగ్రీ కోర్సుల సర్టిఫికెట్లను ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే నేరుగా ఇంటికి పంపే ఏర్పాట్లు చేశామన్నారు. పీజీ ప్రవేశాలు, హాస్టల్స్ ప్రవేశాలను ఆన్లైన్ చేసినట్టు వివరించారు. ఓయూ పూర్వ విద్యార్థుల సమాఖ్య మాజీ వీసీ ప్రొఫెసర్ తిరుపతిరావు హయాంలో అంకురించిన ఓయూ పూర్వ విద్యార్థుల సమాఖ్యను ప్రొఫెసర్ రామచంద్రం బలోపేతం చేశారు. పూర్వ విద్యార్థుల ఆహ్వానం మేరకు అమెరికాలో పర్యటించి ఓయూ అభివృద్ధికి సహకరించాలని కోరారు. దాంతో అక్కడి వారు రూ.20 కోట్ల నిధులతో ఓయూలో భవన నిర్మాణాలు చేపట్టారు. మరిన్ని నిధుల కోసం ఎండోమెంట్ ఫండ్‌ను ఏర్పాటు చేశారు. ఉద్యోగులకు పదోన్నతులు తన హాయంలో అధ్యాపకులకు కెరీర్ అడ్వాన్స్ స్కీమ్ (సీఏఎస్) కింద రెండుసార్లు పదోన్నతులు కల్పించిన్నట్లు వీసీ వివరించారు. అసిస్టెంట్ ప్రొఫెసర్లను, అసోషియేట్‌గా, అసోషియేట్ ప్రొఫెసర్లకు ప్రొఫెసర్లుగా పదోన్నతులు కల్పించిన్నట్లు తెలిపారు. వందలాది మంది బోధనేతర ఉద్యోగులకు కూడా పదోన్నతులిచ్చి వారి మెప్పు పొందారు. 60 మందిని కారుణ్య నియామకాల ద్వారా కొలువులిచ్చినట్టు చెప్పారు. వీసీ పదవీ కోసం మళ్లీ దరఖాస్తు ఓయూ క్యాంపస్ ఇంజినీరింగ్ కాలేజీకి ప్రిన్సిపల్‌గా పనిచేస్తున్న ప్రొఫెసర్ రామచంద్రం వీసీ పదవీ కోసం మరోసారి దరఖాస్తు చేశారు. తొలిసారి తను దరఖాస్తు చేసినప్పుడు తనను ఓయూకు వీసీగా నియస్తారని అనుకోలేదని కానీ తన బయోడాటా చూసిన సీఎం కేసీఆర్.. వందేళ్ల వర్సిటీకి వీసీగా నియమించారన్నారు. తన మూడేళ్ల పదవీ కాలాన్ని విజయవంతంగా ముగించుకున్న ఆయన్ను బుధవారం పాలన భవనం ఉద్యోగులు, అధ్యాపకులు, విద్యార్థులు ఘనంగా సన్మానించారు. ఏటా అధ్యాపకులు ఉద్యోగ విరమణ చేయడంతో 1260 శాస్వత అధ్యాపక ఉద్యోగాలకు ఇప్పుడు 465 మంది మాత్రమే ఉన్నారు. నా హయాంలో 415 అధ్యాపక పోస్టులు భర్తీ చేయాలని ప్రభుత్వం అనుమతిచ్చి్చంది. వాటి భర్తీకి కొన్ని అడ్డంకులు ఉన్నందున ఆ ప్రక్రియ ఆగిపోయింది. ఉద్యోగాలను భర్తీ చేయక పోవడం నా పాలనలో వెలితిగాకనిపిస్తోంది. -
అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న జిల్లా వాసి
సాక్షి, నల్లగొండ టౌన్ : నల్లగొండ జిల్లాకు చెందిన ప్రొఫెసర్ వీరనేని జగదీశ్వర్‌రావు జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో పాల్గొంటూ జిల్లాకు పేరు ప్రఖ్యాతలను తీసుకువస్తున్నారు. నార్కెట్‌పల్లి మండలం షేర్బావిగూడెం గ్రామానికి చెందిన జగదీశ్వర్‌రావు ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీలో ఎడ్యుకేషన్ మల్టిమీడియా రీసెర్చ్ సెంటర్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. అమెరికా, చైనా, సింగపూర్, హాంకాంగ్, మకావ్, థాయ్‌లాండ్ దేశాల్లో పర్యటించి దూరవిద్య విధానానికి సంబంధించిన పీజీ స్థాయిలో కోర్సు రైటర్‌గా బాధ్యతలను నిర్వహించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో న్యాయం కోసం తెలంగాణ అనే ఇతివృత్తంతో డాక్యుమెంటరీ ఫిలిమ్‌ను ఆంగ్లం, తెలుగు భాషల్లో రూపొందించారు. ప్రస్తుతం ఏడుగురు విద్యార్థులకు రీసెర్చ్ గైడెన్స్ ఇస్తూ పర్యవేక్షిస్తున్నారు. ఎంఏ సోషియాలజీని ఉస్మానియా యూనివర్సిటీ నుంచి 1989లో పొందారు. అదే సమయంలో ఆర్ట్ కళాశాల విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా కూడా బాధ్యతలను నిర్వర్తించి విద్యార్థుల సమస్యలపై అలుపెరగని పోరాటం చేశారు. ఇటీవల అమెరికాలోని హార్వర్డ్ ఎంబటీ విశ్వవిద్యాలయంలో అకడమిక్ డిసిప్టెన్స్ అనే అంశంపై నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో పాల్గొని ప్రాచీన కాలం నుంచి నేటి వరకు విద్యావిధానంలో వస్తున్న మార్పులు చేర్పులు అనే అంశంపై పరిశోధనా పత్రాన్ని సమర్చించి, 50 దేశాల ప్రతినిధుల సమక్షంలో ప్రసంగించి మన్ననలు పొందారు. హార్వర్డ్ యూనివర్సిటీ ప్రతిష్టాత్మకమైన లీడర్షిప్ కోర్సులో పాల్గొనేందుకు ఆయనకు యూనివర్సిటీ నుంచి ఆహ్వానం అందింది. ప్రతి సంవత్సరం యూనివర్సిటీలో వివిధ రంగాలకు చెందిన నిష్ణాతులైన వారికి లీడర్షిప్ ప్రోగ్రాంను నిర్వహిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 25 ఏళ్లకు పైగా సంబంధిత రంగంలో అనుభవం ఆధారంగా కోర్సులో పాల్గొనడానికి ఎంపిక చేస్తారు. ఈ లీడర్షిప్ కోర్సులో పాల్గొనడానికి ఎంపికైన వీరనేని జగదీశ్వర్‌రావు ఇటీవల హైదరాబాద్‌లో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అభినందించారు. ఈ నెల 21న హార్వర్డ్ యూనివర్సిటీ లీడర్షిప్ కోర్సులో ఆయన పాల్గొననున్నారు. -
ఉస్మానియా యూనివర్సిటీలో 80వ స్నాతకోత్సవం
-
సహర్, ఇఫ్తార్ సమయం చెప్పింది మనమే
సాక్షి, సిటీబ్యూరో: రంజాన్ మాసంలోముస్లింలు సూర్యోదయం ముందు నుంచి సూర్యాస్తమయం వరకు ఉపవాసం పాటిస్తారు. అయితే అప్పట్లో సహర్, ఇఫ్తార్ సమయాలనిర్ధారణ సరిగా లేకపోవడంతో ఇబ్బందులుఎదురయ్యాయి. దీన్ని గ్రహించిన నిజాం సమయ నిర్ధారణకు ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్లతో భూగోళ, ఖగోళ పరిశోధనలు చేయించారు.అనంతర ప్రొఫెసర్లు ఒక సమయ పట్టికను రూపొందించారు. ప్రపంచవ్యాప్తంగా నేటికీ దీన్నే ఉపయోగిస్తున్నారు. సహర్, ఇఫ్తార్ సమయాల నిర్ధారణకు 1930లో అప్పటి ఓయూ ప్రొఫెసర్ మహ్మద్ అబ్దుల్ వాసే ఆధ్వర్యంలోని బృందం వివిధ పరిశోధనలు చేసింది. పదేళ్లు భూగోళ, ఖగోళ పరిశోధనలు చేసిన బృందం 290 పేజీలతో ఒక పుస్తకాన్ని రూపొందించింది. దీనిని మియారుల్ అవుకాత్(సమయ నిర్ధారణ) అంటారు. ఈ పుస్తకం ఆధారంగానే ప్రపంచవ్యాప్తంగా సహర్, ఇఫ్తార్ సమయాలను పాటిస్తున్నారు. ఈ పుస్తకం ఇప్పటికీ ఓయూలో అందుబాటులో ఉంది. 1970 నుంచి ప్రచురణ.. అప్పట్లో దిన, వార, మాస పత్రికల్లో రంజాన్ మాసానికి ముందే ఉపవాస పట్టికను ప్రచురించేవారు. 1970 నుంచి ఉపవాస సమయ పట్టిక ప్రచురణకు ఆదరణ లభించింది. తర్వాత 1994 నుంచి దీన్ని అన్ని హంగులతో మల్టీ కలర్లో ప్రింట్ చేయడం ప్రారంభించారు. ప్రస్తుతం చెత్తబజార్ మార్కెట్లో ప్రచురించి తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటకకు తీసుకెళ్తున్నారు. ఇందులో సహర్, ఇఫ్తార్ సమయాలు, ఆ సమయాల్లో చదివే దువాలు, ఖురాన్ సూక్తులు, ప్రవక్త ప్రత్యేక ప్రారర్థనలు కూడా ప్రచురిస్తున్నారు. ఈ ఏడాది దాదాపు 10 కోట్ల కార్డులు ప్రింట్ చేయించారు. చాలా మంది వీటిని ప్రింట్ చేయించి ఉచితంగా పంపినీ చేస్తారు. ఇలా చేస్తే పుణ్యం లభిస్తుందని నమ్మకం. -
ఓయూలో మళ్లీ ఉద్రిక్తత
సాక్షి, హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు. ఓయూ ఆర్ట్స్ కాలేజీ వద్ద ఆందోళన చేపట్టిన విద్యార్థులను పోలీసులు అడ్డుకోవటంతో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మురళి ఆత్మహత్యపై గత రాత్రి నుంచి యూనివర్సిటీ రణరంగంగా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఉదయం విద్యార్థులు మరోసారి ఆర్ట్స్ కాలేజీ వద్ద ఆందోళన చేట్టారు. మురళి కుటుంబానికి ఎక్స్ గ్రేషియా ప్రకటించాలంటూ డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో ర్యాలీ చేపట్టగా వారిని అడ్డుకునేందుకు పోలీసులు యత్నించగా.. తోపులాట జరిగింది. విద్యార్థులు రాళ్లు రువ్వటంతో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీఛార్జీ చేశారు. ఇక ఇప్పటిదాకా కవ్వింపు చర్యలకు పాల్పడిన 34 మందిని అరెస్ట్ చేసినట్లు డీసీపీ ప్రకటించారు. నేతలు క్యాంపస్‌లోకి రావటం వల్లే పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయని ఆయన అంటున్నారు. ఒత్తిడి తట్టుకోలేక పోతున్నానంటూ మురళి ఓ సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకోగా.. విద్యార్థి సంఘాలు మాత్రం ఉద్యోగాల నోటిఫికేషన్లు రావటం లేదని తీవ్ర ఒత్తిడికిలో ఉన్న మురళీ మనస్తాపానికి లోనై బలవన్మరణం చెందాడని చెబుతున్నాయి. -
ఓయూ బీఈడీ ఫలితాలు విడుదల
హైదరాబాద్: ఓయూ పరిధిలో ఫిబ్రవరిలో జరిగిన బీఈడీ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలను ప్రకటించారు. ఈ నెల 20 నుంచి ఆయా కళాశాలల నుంచి మార్కుల జాబితాలను పొందవచ్చు అని అడిషనల్ కంట్రోలర్.. ప్రొఫెసర్ రాములు తెలిపారు. రివాల్యూయేషన్ కోసం ఈ నెల 11 నుంచి 22 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. -
'పండుగ అయిపోయిందిగా.. వెళ్లిపోండి'
హైదరాబాద్: బీఫ్ ఫెస్టివల్ ను అడ్డుకునేందుకు గత రాత్రి నుంచి ఎన్ఆర్ఐ హాస్టల్ ను పోలీసులు దిగ్బందించారని బీఫ్ పెస్టివల్ నిర్వాహకులు తెలిపారు. పోలీసులు వల్ల కనీసం మంచినీరు కూడా విద్యార్థులు అవస్థలు పడుతున్నారని అన్నారు. నీళ్లు తాగుదామని బయటకు వస్తే అక్రమంగా పోలీసులు అరెస్టు చేసి తీసుకెళుతున్నారని చెప్పారు. రాత్రి కూడా మెస్ లు తెరవొద్దని ఆదేశాలు ఇచ్చారని, ఈ చర్యలను తాము ఖండిస్తున్నామని చెప్పారు. బీఫ్ ఫెస్టివల్ నిర్వహణ సమయం ముగిసిపోయినందున ఓయూ క్యాంపస్ నుంచి పోలీసులు వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు.