బీఫ్ ఫెస్టివల్ ను అడ్డుకునేందుకు గత రాత్రి నుంచి ఎన్ఆర్ఐ హాస్టల్ ను పోలీసులు దిగ్బందించారని బీఫ్ పెస్టివల్ నిర్వాహకులు తెలిపారు.
హైదరాబాద్: బీఫ్ ఫెస్టివల్ ను అడ్డుకునేందుకు గత రాత్రి నుంచి ఎన్ఆర్ఐ హాస్టల్ ను పోలీసులు దిగ్బందించారని బీఫ్ పెస్టివల్ నిర్వాహకులు తెలిపారు. పోలీసులు వల్ల కనీసం మంచినీరు కూడా విద్యార్థులు అవస్థలు పడుతున్నారని అన్నారు.
నీళ్లు తాగుదామని బయటకు వస్తే అక్రమంగా పోలీసులు అరెస్టు చేసి తీసుకెళుతున్నారని చెప్పారు. రాత్రి కూడా మెస్ లు తెరవొద్దని ఆదేశాలు ఇచ్చారని, ఈ చర్యలను తాము ఖండిస్తున్నామని చెప్పారు. బీఫ్ ఫెస్టివల్ నిర్వహణ సమయం ముగిసిపోయినందున ఓయూ క్యాంపస్ నుంచి పోలీసులు వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు.