
సాక్షి, హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీలో మళ్లీ ఉద్రిక‍్త పరిస్థితులు. ఓయూ ఆర్ట్స్ కాలేజీ వద్ద ఆందోళన చేపట్టిన విద్యార్థులను పోలీసులు అడ్డుకోవటంతో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది.
మురళి ఆత్మహత్యపై గత రాత్రి నుంచి యూనివర్సిటీ రణరంగంగా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఉదయం విద్యార్థులు మరోసారి ఆర్ట్స్ కాలేజీ వద్ద ఆందోళన చేట్టారు. మురళి కుటుంబానికి ఎక్స్ గ్రేషియా ప్రకటించాలంటూ డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో ర్యాలీ చేపట్టగా వారిని అడ్డుకునేందుకు పోలీసులు యత్నించగా.. తోపులాట జరిగింది. విద్యార్థులు రాళ్లు రువ్వటంతో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీఛార్జీ చేశారు.
ఇక ఇప్పటిదాకా కవ్వింపు చర్యలకు పాల్పడిన 34 మందిని అరెస్ట్ చేసినట్లు డీసీపీ ప్రకటించారు. నేతలు క్యాంపస్‌లోకి రావటం వల్లే పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయని ఆయన అంటున్నారు. ఒత్తిడి తట్టుకోలేక పోతున్నానంటూ మురళి ఓ సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకోగా.. విద్యార్థి సంఘాలు మాత్రం ఉద్యోగాల నోటిఫికేషన్లు రావటం లేదని తీవ్ర ఒత్తిడికిలో ఉన్న మురళీ మనస్తాపానికి లోనై బలవన్మరణం చెందాడని చెబుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment