
ఉస్మానియా యూనివర్సిటీ: టీఎస్‌సీపీజీఈటీ–2021 మూడు విడతల వెబ్ కౌన్సెలింగ్ అనంతరం మిగిలిన సీట్లను ఆయా విశ్వవిద్యాలయాల పరిధిలోని కళాశాలలు భర్తీ చేసుకోవాలని కన్వీనియర్ ప్రొఫెసర్ పాండురంగారెడ్డి శనివారం పేర్కొన్నారు. ఈ నెల 31 నుంచి ఫిబ్రవరి 9 వరకు వివిధ పీజీ కోర్సుల సీట్లను భర్తీ చేసి 14న ఓయూలోని పీజీ అడ్మిషన్స్ కార్యాలయంలో సమర్పించాలని కోరారు. ప్రవేశ పరీక్షను రాయని అభ్యర్థులు, సీపీజీఈటీ–2021లో అర్హత సాధించని విద్యార్థులకు సైతం పీజీ కోర్సుల్లో ప్రవేశం కల్పించవచ్చని తెలిపారు.