ఉస్మానియా యూనివర్సిటీ: అంతర్ కళాశాలల సాంస్కృతిక పోటీలతో ఓయూ క్యాంపస్‌లో సందడి వాతావరణం నెలకొంది. శనివారం ఠాగూర్ ఆడిటోరియంలో సాంస్కృతిక పోటీలను వీసీ ప్రొ.రవీందర్ ప్రారంభించారు. కరోనా కారణంగా మూడేళ్లుగా నిలిచిపోయిన సాంస్కృతిక పోటీలను చేపట్టడంతో ఓయూ పరిధిలోని వందలాది విద్యార్థులు ఉత్సాహంగా, ఉల్లాసంగా పాల్గొన్నారు. తొలి రోజు డ్యాన్స్, మ్యూజిక్ విభాగాల్లో క్లాసికల్, ఫోక్, ట్రైబల్, దేశభక్తి నృత్యాలు, సంగీతంలో ఇండియా, వెస్ట్రన్ పాటలతో అందరగొట్టారు. ఎంపికైన విద్యార్థులను అంతర్ విశ్వవిద్యాలయాల పోటీలకు పంపిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment