Cultural Festival
-
గిరిజనుల ఐక్యతకు భారతీయ హార్న్‌బిల్
భారతదేశంలోని ఈశాన్యప్రాంతంలో ప్రతి డిసెంబర్లో నాగాలాండ్‌లోని రోలింగ్ కొండల మధ్య సుందరమైన కోహిమా ప్రాంతం నాగా తెగల సాంస్కృతిక వేడుకలకు కేంద్ర బిందువు అవుతుంది. అక్కడి గిరిజనులు తమ అరుదైన సంస్కృతిని ప్రదర్శించడానికి హార్న్‌బిల్ పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటారు. వివిధ తెగల మధ్య ఐక్యతకు, శాంతికి, సంస్కృతికి ప్రతీకగా పాతికేళ్లుగా ప్రతియేటా జరిగే ఈ వేడుకలో లక్షన్నరకు పైగా సందర్శకులు పాల్గొన్నారు. దీంతో ఈ వేడుక ప్రపంచమంతటినీ ఆకర్షించింది. పర్యాటకాన్ని ప్రోత్సహించడం, నాగా తెగల శక్తివంతమైన గుర్తింపును వెలుగులోకి తీసుకురావం ఈ వేడుక ముఖ్య ఉద్దేశ్యం. పండుగ సందర్భంగా ఇక్కడ ప్రతి తెగ దాని స్వంత సజీవ నృత్యాలు, పాటలు, ఆచారాలను ప్రదర్శించడమే కాదు నాగా వంటకాలు విభిన్న రుచులను అందిస్తాయి. స్థానిక కళాకారులు, హస్తకళాకారులు ప్రదర్శనలో భాగం అవుతారు. తద్వారా వారు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి అవకాశం కల్పిస్తుంది. చేతితో నేసిన వస్త్రాలు, సాంప్రదాయ ఆభరణాలు, వివిధ హస్తకళలతో నిండిన స్టాల్స్ పండుగకు వెళ్లేవారికి సాంస్కృతిక ్ర΄ాముఖ్యతతో కూడిన సావనీర్లను ఇంటికి తీసుకెళ్లడానికి సరైన అవకాశాన్ని అందిస్తాయి. నిర్దిష్ట తెగలు, వారి విలక్షణమైన సంప్రదాయాలకు నివాళులు అర్పిస్తూ ప్రత్యేక నేపథ్య సాయంత్రాలను ప్లాన్ చేయవచ్చు. ఉదాహరణకు కొన్యాక్ తెగ వారు వారి సంప్రదాయ పచ్చబొట్లు, పాటలు, కథలు వారి జీవన విధానంపై అవగాహన కలిగిస్తాయి. మరొక తెగ వారి ప్రాచీన నృత్యాల ద్వారా చారిత్రక కథలను వివరిస్తాయి.ఇదీ చదవండి: టీ లవర్స్ : టీ మంచిదా? కాదా? ఈ వార్త మీకోసమే!వివిధ తెగల మధ్య శాంతిఈ ఫెస్టివల్ తెగల మధ్య ఐక్యతను పెం΄÷ందిస్తుంది. గిరిజన సంఘర్షణల చుట్టూ తరచుగా గందరగోళ చరిత్ర ఉన్నందున, ఈ పండుగ వివిధ వర్గాల మధ్య అంతరాలను తగ్గిస్తుంది. భవిష్యత్ తరాలకు దేశీయ సంస్కృతుల పరిరక్షణకు భరోసానిస్తూ, నాగా యువకులు తమ మూలాలతో మళ్లీ కనెక్ట్ అవ్వడానికి ఇది ఒక వేదికగా మారుతుంది. వివిధ ΄ోటీలను నిర్వహించి గిరిజన యువతలో గర్వం, ప్రేరణను సృష్టిస్తుంది. రాత్రి సమయాల్లో జరిగే కచేరీలకు వివిధ ప్రాంతాల నుండి బ్యాండ్ లను ప్రదర్శిస్తారు. ప్రతి రోజు ఉత్సాహభరితమైన శ్రావ్యమైన పాటలతో ముగుస్తుంది. స్థానికులు, పర్యాటకులు, ప్రదర్శకులు కలిసి ఆనందాన్ని పొందడానికి వీలు కల్పిస్తుంది. పాతికేళ్లుగా హార్న్‌బిల్ ఫెస్టివల్ నాగా సంస్కృతిని పరిరక్షించడమే కాకుండా దాని అభివృద్ధిని కూడా వాగ్దానం చేస్తుంది. భవిష్యత్ తరాలకు ఈ విలువైన సంప్రదాయాలను వారసత్వంగా, భాగస్వామ్యం చేయడానికి మార్గం సుగమం చేస్తుంది. ఇలాంటి సంప్రదాయ వేడుకలు మన భారతీయ సంస్కృతిని ఇంకా సుసంపన్నం చేస్తూనే ఉన్నాయి అనడానికి హార్నబిల్ ఓ ఉదాహరణగా నిలుస్తుంది. View this post on Instagram A post shared by Hornbill Festival Nagaland (@hornbillfestivalofficial) -
విజయవాడ : సందడిగా దసరా సాంస్కృతికోత్సవాలు (ఫొటోలు)
-
‘370’ అనంతర మార్పుల్ని కశ్మీర్ ఆమోదించింది: అమిత్ షా
శ్రీనగర్: 2019లో ఆర్టికల్ 370 రద్దు అనంతర మార్పులను జమ్మూకశ్మీర్ ప్రజలు ఆమోదించారని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. ఉగ్రవాద చర్యలు, రాళ్లు రువ్వడం వంటి ఘటనలు 70% తగ్గిపోయాయన్నారు. ఇప్పుడు కొత్త జమ్మూకశ్మీర్ రూపుదిద్దుకుంటోందని చెప్పారు. మంత్రి శుక్రవారం శ్రీనగర్‌లో జరిగిన ‘వితస్త కల్చరల్ ఫెస్టివల్’కు హాజరయ్యారు. గత 30–40 ఏళ్ల జమ్మూకశ్మీర్ చరిత్ర మాత్రమే తెలిసిన వారు ఇది ఒక సమస్య అని, దీనిని వివాదాస్పద ప్రాంతంగానే భావిస్తారన్నారు. అదే జమ్మూకశ్మీర్ ఇప్పుడు వితస్త ఉత్సవాలు జరుపుకుంటోందని అమిత్ షా పేర్కొన్నారు. జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదంతో బలైన 42 వేల మంది ప్రజల బాధ్యతను ఎవరు తీసుకుంటారని అప్పట్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ), పీపుల్స్ డెమోక్రాటిక్ ఫ్రంట్(పీడీపీ)లను ఆయన ప్రశ్నించారు. ఆర్టికల్ 370తో ఇక్కడ ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. బీజేపీ కార్యాలయంలో పార్టీ సిద్ధాంతకర్త శ్యామాప్రసాద్ ముఖర్జీకి ఆయన నివాళులర్పించారు. -
కేరళ అయినా.. పక్కా తెలంగాణ అమ్మాయినే: యాంకర్ సుమ
కాజీపేట అర్బన్: నిట్ వరంగల్‌లోని అంబేడ్కర్ లర్నింగ్ సెంటర్ ఆడిటోరియంలో స్ప్రింగ్‌స్ప్రీ–23 కళాధ్వని కల్చరల్ ఫెస్ట్‌లో తొలి రోజు శుక్రవారం లెట్స్టాక్ ప్రోగ్రాంలో యాంకర్ సుమ కనకాల సందడి చేశారు. ‘చమ్కీల అంగిలేసి ఓ వదినె’ అంటూ డ్యాన్స్‌తో ఆమె ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో నిట్ డైరెక్టర్ ఎన్వీ.రమణారావు దంపతులు, డీన్ స్టూడెంట్ వెల్ఫేర్ పులి రవికుమార్, ఫ్యాకల్టీ కో–ఆరి్డనేటర్ హీరాలాల్, విద్యార్థులు పాల్గొన్నారు. కాగా.. స్ప్రింగ్‌స్ప్రీ కోర్ టీం కో–ఆరి్డనేటర్ జీవన్‌రెడ్డి నాలుగు రౌండ్లలో యాంకర్ సుమను అడిగిన ప్రశ్నలకు ఆమె ఉత్సాహంగా సమాధానాలు చెప్పారు. ఆమె చెప్పిన సమాధానాలివే.. కేరళ అయినా స్పష్టంగా తెలుగు మాట్లాడుతున్నారు? మానాన్న నారాయణ్ కుట్టి, అమ్మ విమల కుట్టి. నేను ఏకైక సంతానాన్ని. నాన్న రైల్వే ఉద్యోగి. ఉద్యోగంలో భాగంగా కేరళ నుంచి హైదరాబాద్ లాలాగూడకు వచ్చి సెటిల్ అయ్యాడు. నా స్వస్థలం కేరళ అయినా.. నేను పక్కా తెలంగాణ, హైదరాబాదీ అమ్మాయిని. నా కు లాలాగూడ రైల్వే డిగ్రీ కళాశాల అంటే ఇష్టం. నేను యాక్టింగ్, ప్రొడ్యూసింగ్, సామాజిక సేవ చేస్తున్నా. నా తొలి ప్రాధాన్యం యాంకరింగ్‌కే. అంత చిన్నవయసులో బుల్లితెరకు ఎలా వచ్చారు? సుమ: నాన్న రైల్వే ఉద్యోగంలో భాగంగా ఏర్పాటు చేసిన ఓ కల్చరల్ ఈవెంట్లో చాందిని సినిమాలో శ్రీదేవి నటించిన ‘మేరే హతోమే నౌనౌ చూడియా’ పాటకు డ్యాన్స్ చేశాను. అక్కడ అప్పుడు నన్ను చూసిన దూరదర్శన్ నిర్వాహకులు నాకు సీరియల్లో ఛాన్స్ ఇచ్చారు. 1991లో 15 ఏళ్ల వయస్సులోనే బుల్లితెరతో నా కలల ప్రయాణం ప్రారంభమైంది. ఇష్టమైన సెలబ్రిటీలు? తల్లిదండ్రులే మనకు మొదటి సెలబ్రిటీలు. మా అమ్మ నాకు కూచిపూడి నృత్యం నేర్పించడం వల్లే నాట్యం, యాక్టింగ్‌పై పట్టు సాధించి యాంకర్‌గా రాణిస్తున్నా. ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులను గౌరవించాలి. ప్రతీ కళాశాలలో కల్చరల్ టీం ఉండాలి. నిట్ వరంగల్ కల్చరల్ టీం ఉండడమే కాకుండా కల్చరల్ ఫెస్ట్‌ను ప్రత్యేకంగా నిర్వహించడం.. అందులో భాగంగా నేను రావడం చాలా ఆనందంగా ఉంది. యాక్టింగ్‌తో పాటు సమాజానికి ఏం చేస్తున్నారు? విద్యార్థులు విద్యనభ్యసించి ఉత్తమ స్థాయికి చేరుకోవాలి. ప్రతి ఒక్కరం మన బాధ్యతగా సమాజానికి సేవ చేయాలి. నేను ఏడేళ్ల క్రితం ఖమ్మంలో ప్రారంభించిన ఓల్డేజ్ హోమ్‌కు పవన్ కల్యాణ్‌తోపాటు ప్రభాస్ ఎంతో సాయం చేశారు. త్వరలో నేను హైదరాబాద్‌లో ప్రారంభించే వంద పడకల ఓల్డేజ్ హోమ్‌కు మీ వంతు బాధ్యతను నిర్వర్తించండి. ఫెస్టివల్ ఫర్ జాయ్(ఎఫ్ఎఫ్జే) పేరిట ఓ సంస్థను ఏర్పాటు చేశాను. అనాథలకు సైతం పండుగ సంతోషాన్ని అందజేస్తున్నాను. భద్రకాళి మాతకు పూజలు హన్మకొండ కల్చరల్: భద్రకాళి దేవాలయంలో శుక్రవారం యాంకర్ సుమ ప్రత్యేక పూజలు చేశారు. పూజల అనంతరం వేద పండితులు తీర్థప్రసాదాలు, అమ్మవారి శేషవస్త్రాలు, మహాదాశీర్వచనం అందజేశారు. -
మురిసిపోయిన కాకతీయులు నడయాడిన నేల (ఫొటోలు)
-
వరంగల్ గడ్డపై అడుగుపెట్టిన కాకతీయ వంశ 22వ వారసుడు
సాక్షి, హైదరాబాద్: ఓరుగల్లు కేంద్రంగా రాజ్యపాలన సాగించిన కాకతీయ రాజులు ప్రజల మెరుగైన జీవనం కోసం తెచ్చిన పథకాలు, చేపట్టిన నిర్మాణాలు ఇప్పటికీ ఆదర్శనీయమే. ఈ నేపథ్యంలో తమ పూర్వీకులు పాలించిన ప్రాంతాన్ని 700 ఏళ్ల తరువాత కాకతీయ వంశానికి చెందిన 22వ మహారాజు కమల్‌చంద్ర బంజ్‌దేవ్ దర్శించుకోనున్నారు. నేటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘కాకతీయ వైభవ సప్తాహం’ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఇందులో భాగంగా బంజ్‌దేవ్ గురువారం ఉదయం వరంగల్‌కు విచ్చేసి భద్రకాళీ అమ్మవారిని దర్శించుకున్నారు. తమ వంశస్థుల గడ్డకు రావడం సంతోషంగా ఉందని భంజ్‌దేవ్ తెలిపారు. ప్రజలకు సేవ చేయడమే మా లక్ష్యం అని పేర్కొన్నారు. తనను ఆహ్వానించిన నాయకులకు కమల్ చంద్ర భంజ్‌దేవ్ ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారువరంగల్ రాకపై ‘సాక్షి’ ప్రత్యేకంగా మహారాజుతో ముచ్చటించింది. పూర్వీకులు సాగించిన పాలన, ఓరుగల్లు వైభవం గురించి ఆయన అభిప్రాయాలు తెలుసుకుంది. ఆ వివరాలు ఆయన మాటల్లోనే... తల్లి చెంతకు చేరుకున్నట్లు ఉంది... కాకతీయ వంశ వారసునిగా ఓరుగల్లును సందర్శించే అవకాశం రానుండటం చూస్తుంటే తిరిగి నా తల్లి చెంతకు చేరుకున్నట్లు అనిపిస్తోంది. మాటల్లో చెప్పలేని ఆనందంతో మనస్సు నిండిపోయింది. వరంగల్ ప్రజలతో వీడదీయరాని ఆత్మీయ సంబంధం ఎప్పటికీ ఉంటుంది. వరంగల్ గురించి, కాకతీయ వైభవం గురించి నాకు ఎప్పటి నుంచో అవగాహన ఉంది. నేను ఉన్నతవిద్య కోసం లండన్ వెళ్లా. మాస్టర్స్ ఇన్ ఇంటర్నేషనల్ సైన్స్, మాస్టర్స్ ఇన్ పొలిటికల్ సైన్స్ పూర్తి చేశా. 2009లో తిరిగి భారత్‌కు వచ్చా. ఇప్పుడు నా మూలాలను వెతుక్కుంటూ మళ్లీ ఓరుగల్లుకు వస్తున్నా. విద్యుత్ దీపాల వెలుగుల్లో హనుమకొండ కలెక్టర్ కార్యాలయం ప్రజాపాలన సాగించింది మా పూర్వీకులే... రాచరిక చరిత్రలో ప్రజాపరిపాలన సాగించింది కేవలం కాకతీయులు మాత్రమే. మా పూర్వీకులు ప్రజల కోసం ఎన్నో బహుళార్ధ ప్రాజెక్టులు, నిర్మాణాలు, చారిత్రక కట్టడాలు నిర్మించారు. అందుకే ప్రజలు మా వంశీయులని రాజుగా కాకుండా దేవుడిగా చూస్తారు. కాకతీయ రాజుగా ఉన్నందుకు గర్విస్తున్నాను. వరంగల్ ప్రజలు ఎప్పుడూ నా వాళ్లే. వారి కోసం ఏం చేయడానికైనా నేను సిద్ధం. తెలంగాణలోని టార్చ్ ఎన్జీఓ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలను చేయనున్నా. కాకతీయ సంస్కృతిని పరిరక్షించి భావి తరాలకు అందించాల్సిన అవసరముంది. కాకతీయ గత వైభవానికి సంబంధించిన సమాచారాన్ని గ్రంథస్తం చేస్తా. బస్తర్ కేంద్రంగానే కాకతీయుల పాలన... బస్తర్ వేదికగా రాజ్య పరిపాలన ప్రారంభించింది కాకతీయ రాజులే. 22 తరాలుగా మా వంశీయులు కాకతీయ మూలాలతోనే రాజ్య పరిపాలన చేశారు. మేము కాకతీయ రాజులమేనని పలు శాసనాల్లో ఆధారాలున్నాయి. నాటి బ్రిటిష్ ప్రభుత్వం విడుదల చేసిన మెమొరాండం ఆఫ్ ది ఇండియన్ స్టేట్స్ పుస్తకంలో కూడా మేము కాకతీయ రాజులమేనని ప్రస్తావించింది. బస్తర్ వేదికగా ఉన్న పలు శాసనాల్లో కూడా మా వంశం గురించి పొందుపరిచారు. నేటికీ మా సామ్రాజ్యం బస్తర్‌లో విస్తరించి ఉంది. నేను జగదల్పూర్లో ఉన్న కోటలో ఉంటున్నా. అన్ని ఆయుధాలూ వాడగలను.. నాకు అన్ని రకాల ఆయుధాలు వాడటంలో ప్రావీ ణ్యముంది. గోల్ఫ్, ఆర్చరీ, పోలో ఆడతాను. ఫైరింగ్ అంటే ఇష్టం. నేను శాకాహారిని, మద్యపానం అలవాటులేదు. ఇప్పటికీ నా చిన్ననాటి స్నేహితులతో కలుస్తుంటా. అందులో సామాన్యులు ఉన్నారు.. ఐఏఎస్, ఐపీఎస్, రాజకీయ నాయకులూ ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు.. కాకతీయ వైభవ సప్తహం కార్యక్రమాలకు నన్ను ముఖ్యఅతిథిగా తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానించింది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు. జగదల్పూర్లోని నా ప్యాలెస్‌కి వచ్చి ప్రత్యేకంగా ఆహ్వానించిన చీఫ్ విప్ దాస్య వినయ్ భాస్కర్, తెలంగాణ భాషా, సాంస్కృతిక శాఖ సంచాలకుడు హరికృష్ణకు ప్రత్యేక ధన్యావాదాలు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
వరంగల్ నిట్‌లో ఘనంగా స్ప్రింగ్ స్ప్రీ వేడుకలు (ఫొటోలు)
-
హైదరాబాద్‌లో కల్చరల్ ఫెస్టివల్.. హాజరుకానున్న చిరంజీవి
సాక్షి, హైదరాబాద్: మహోన్నతమైన భారతీయ సాంస్కృతిక ఉత్సవానికి భాగ్యనగరం మరోసారి వేదిక కానుంది. విభిన్న సంస్కృతులు, కళల సమాహారమైన నగరంలో ప్రతిష్టాత్మకమైన జాతీయ సంస్కృతీ మహోత్సవాన్ని నిర్వహించేందుకు కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ ఏర్పాట్లు చేపట్టింది. ఏప్రిల్ 1 నుంచి 3 వరకు నగరంలోని ఎన్టీఆర్ స్టేడియంలో జరగనున్న ఉత్సవాల్లో దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన సాంస్కృతిక, కళాబృందాలు ప్రదర్శనలు ఇవ్వనున్నాయి. విశిష్టమైన భారతీయ సంస్కృతిని అన్ని వర్గాల ప్రజలకు చేరువ చేసే లక్ష్యంతో ఈ వేడుకలను నిర్వహిస్తున్నట్లు పర్యాటక, సాంస్కృతిక శాఖ స్పష్టం చేసింది. మరోవైపు జానపద, గిరిజన కళలు, నృత్యం, సంగీత ప్రదర్శనలను సమున్నతంగా ఆవిష్కరించనున్నారు. సుమారు వెయ్యి మంది కళాకారులు, పాకశాస్త్ర నిపుణులు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించనున్నారు. (క్లిక్: చిమ్మచీకట్లో.. లాకర్ గదిలో.. 18 గంటలు) మొదటి రోజు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. గవర్నర్ తమిళిసై, ముఖ్యమంత్రి కేసీఆర్, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి, మహారాష్ట్ర గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారి, తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి, హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్ర సాంస్కృతిక శాఖ సహాయమంత్రులు అర్జున్ రామ్ మేఘవాల్, మీనాక్షి లేఖి, ప్రముఖ సినీనటుడు చిరంజీవి తదితరులు హాజరుకానున్నారు. (క్లిక్: పోలీసులకే పంచ్ వేసిన నెటిజన్) -
రాజమండ్రి ఆర్ట్స్ కళాశాల మైదానంలో వైభవంగా సాంస్కృతిక మహోత్సవం
-
ఓయూలో సాంస్కృతిక సందడి
ఉస్మానియా యూనివర్సిటీ: అంతర్ కళాశాలల సాంస్కృతిక పోటీలతో ఓయూ క్యాంపస్‌లో సందడి వాతావరణం నెలకొంది. శనివారం ఠాగూర్ ఆడిటోరియంలో సాంస్కృతిక పోటీలను వీసీ ప్రొ.రవీందర్ ప్రారంభించారు. కరోనా కారణంగా మూడేళ్లుగా నిలిచిపోయిన సాంస్కృతిక పోటీలను చేపట్టడంతో ఓయూ పరిధిలోని వందలాది విద్యార్థులు ఉత్సాహంగా, ఉల్లాసంగా పాల్గొన్నారు. తొలి రోజు డ్యాన్స్, మ్యూజిక్ విభాగాల్లో క్లాసికల్, ఫోక్, ట్రైబల్, దేశభక్తి నృత్యాలు, సంగీతంలో ఇండియా, వెస్ట్రన్ పాటలతో అందరగొట్టారు. ఎంపికైన విద్యార్థులను అంతర్ విశ్వవిద్యాలయాల పోటీలకు పంపిస్తారు. -
స్టెల్లాలో కల్చరల్ ఫెస్టివల్
-
బంగారా డ్యాన్స్‌కు భారత్ వేదిక..!
సాక్షి, న్యూఢిల్లీ : భారత్ వేదికగా సాంస్కృతిక ఉత్సవాలను నిర్వహించేందుకు ఆస్ట్రేలియా సిద్ధమైంది. దేశ వ్యాప్యంగా చెన్నై, ఢిల్లీ, బెంగళూరు వంటి ఇరవై నగరాల్లో ఈ ఉత్సవాలను నిర్వహించనున్నారు. ఈ మేరకు భారత్‌లో ఆస్ట్రేలియా హై కమిషనర్ హరీందర్ సిద్దు ఉత్సవాలకు సంబంధించిన వివరాలను బుధవారం మీడియా సమావేశంలో వెల్లడించారు. సుమారు ఆరు నెలల పాటు జరిగే ఈ వేడుకలు ఈ నెల 23న చెన్నైలో ఆస్ట్రేలియన్ వరల్డ్ ఆర్కెస్ట్రా ప్రదర్శనతో అంగరంగ వైభవంగా ప్రారంభం కానుంది. వచ్చే ఏడాది మర్చి 30న ముగిసే ఉత్సవాలు.. సుమారు 75 రకాల ఈవెంట్స్‌తో భారతీయులను ఆకర్షించేందుకు సిద్దమవుతోంది. హరీందర్ సిద్దు మాట్లాడుతూ.. భారత్, ఆస్ట్రేలియా సంబంధాలను బలపేతం చేసేందుకు ఈ కార్యక్రమాలు దోహదం చేస్తాయని ఆశా భావం వ్యక్తం చేశారు. ఉత్సవాలు సాగే ఆరు నెలల్లో తమ సంస్కృతిని భారతీయులకు చాటి చెప్పే విధంగా కార్యక్రమాలు చేపడతామని ఆమె తెలిపారు. ఈ పెస్ట్‌లో ఆస్ట్రేలియా ఖండంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన బంగారా డ్యాన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. న్యూఢిల్లీ, ముంబై, బెంగళూరు నగరాల్లో ఈ నృత్యాన్ని ప్రదర్శించనున్నారు. అంతే కాకుండా ప్రఖ్యాత మాస్టర్ షఫ్ గారే మెహిగాన్‌చే నోరూరుంచే ఆస్ట్రేలియన్ వంటకాలు, ఇంటర్నేషనల్ కామెడీ ఫెస్టివల్స్ వంటి కార్యక్రమాలు కూడా దీనిలో భాగంగా నిర్వహించనున్నార. దీనికి సంబంధించి ముగ్గురు ప్రతినిధులను సిద్దు ప్రకటించారు. గారే మెహిగాన్, జాన్ జుబ్రిజికి, సంగీత కళాకారుడు రాఘవ్ సచార్‌లు ఆస్ట్రేలియా ఫెస్ట్ అంబాసిడర్స్‌గా వ్యవహరించనున్నారు. -
అందంగా లేనా.. అసలేం బాలేనా...
పాటలతో బిజీగా ఉండే గాయని సునీత ఆటల కార్యక్రమానికి హాజరయ్యారు. తిరుపతిలోని వెంకటేశ్వర వెంటర్నరీ యూనివర్సిటీలో గురువారం క్రీడా సాంస్కృతిక ఉత్సవ ముగింపునకు ముఖ్య అతిథిగా పాల్గొ న్నారు. బహుమతులందజేశారు. అంతేకాదు తన గానలహరితో అందరినీ అలరించారు. అందంగా లేనా అని ఆమె పాడుతుంటే ప్రేక్షకులు చప్పట్లతో హర్షాతిరేకం ప్రకటించారు. యూనివర్సిటీక్యాంపస్: శ్రీవేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీలో నిర్వహించిన క్రీడా సాంస్కృతిక ఉత్సవం వెట్ ఓరియన్–2017 ఓవరాల్ చాంపియన్‌గా తిరుపతి వెటర్నరీ కళాశాల నిలిచింది. నాలుగు రోజుల క్రీడా సంబరాలు గురువారంతో ముగిశాయి. సాయంత్రం జరిగిన ముగింపు కార్యక్రమానికి గాయని సునీత ముఖ్య అతిథిగా హాజరై బహుమతులను ప్రదానం చేశా రు. వ్యక్తిగత చాంపియన్‌గా గన్నవరం వెటర్నరీ కళాశాల విద్యార్థి మోహన్‌రావు, బాలికల చాంపియన్‌గా కిరణ్మయి నిలిచారు. తిరుపతి వెటర్నరీ కళాశాల బాలికల జట్టు 65 పాయింట్లతో ఓవరాల్ చాంపియన్ షిప్ ట్రోఫీని అందుకుంది. అలాగే వివిధ క్రీడా, సాంస్కృతిక అంశాల్లో విజేతలకు గాయని సునీత బహుమతులు ప్రదానం చేశారు. ఆమె మాట్లాడుతూ ఏ రంగంలోనైనా కష్టపడితే ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చని తెలి పారు. ప్రణాళికాబద్ధంగా చదవాలన్నారు. తాను 3వ సంవత్సరం నుంచి సంగీత సాధన మొదలు పెట్టానని చెప్పారు. అనుకోకుండా సినీరంగంలోకి వచ్చి ప్లేబ్యాక్ సింగర్‌గా స్థిరపడ్డానన్నారు. వీసీ హరిబాబు మాట్లాడుతూ విద్యార్థులను ప్రోత్సహించేందుకే క్రీడా సాంస్కృతిక పోటీలు నిర్వహించినట్లు తెలిపారు. విద్యార్థుల మంచి స్పందన లభించిందన్నారు. చక్కటి క్రీడా ప్రతిభను కనబరిచారని పేర్కొన్నారు. కార్య క్రమంలో డీఎస్ఏ హరిజనరావు, అసోసియేట్ డీన్ ఈశ్వర్ ప్రసాద్, ఓఎస్ఏ రాంబాబునాయక్ పాల్గొన్నారు. ఎగిరిపోతే ఎంత బాగుంటుంది.. బహుమతుల ప్రదానోత్సవం అనంతరం గాయ ని సునీత తన గానామృతంలో ఓలలాడించారు. ‘అందంగా లేనా... అసలేం... బాగాలేనా...’ అం టూ ప్రారంభించి ‘ఎగిరిపోతే ఎంత బాగుంటుంది’అన్న పాటతో ముగించారు. ఆమె పాటలకు విద్యార్థులు కేరింతలు కొట్టారు. -
2కె14 హంగామా..
-
‘లర్నర్స్ ల్యాండ్’లో ఆటాపాట
ఘనంగా స్పోర్ట్స్ మీట్, కల్చరల్ ఫెస్టివల్ సాంస్కృతిక కార్యక్రమాలతో ఉర్రూతలూగించిన విద్యార్థులు కాశిబుగ్గ, న్యూస్‌లైన్ : వరంగల్ ఎల్బీనగర్లో లర్నర్స్ ల్యాండ్ డీజీ స్కూల్లో స్పోర్ట్స్, కల్చరల్ ఫెస్ట్‌ను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎంజీఎం ఆర్ఎంఓ డాక్టర్ నాగేశ్వర్రావు హాజరై విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. సుమారు వెయ్యి మంది విద్యార్థులు రంగురంగుల దుస్తుల్లో చూడచక్కని నృత్యా లు, ప్రదర్శనలు ఇస్తూ ఆహూతులను అలరించా రు. విద్యార్థులు నిర్వహించిన క్యాట్‌వాక్, మాక్ అసెంబ్లీ, శివకల్యాణం నృత్య రూపకం, ఫోక్, వెస్ట్ర న్స్, శాస్త్రీయ నృత్యాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో తాళ్లపద్మావతి విద్యాసంస్థల చైర్మన్ తాళ్ల మల్లేశంతో పాటు పాఠశాల ప్రిన్సిపాల్ ఝాన్సీ, డెరైక్టర్లు తాళ్ల వంశీ, తాళ్ల వరుణ్, పాఠశాల ఇన్‌చార్జ్‌లు వరలక్ష్మి, ఉమ, లక్ష్మి, కరాటే కోచ్ మహబూ బ్ అలీబాబా, పీఈటీ తిరుమల్‌రావు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. -
నిట్‌లో వసంతోత్సవ కళ
రేపటి నుంచి స్ప్రింగ్ స్ప్రీ నేడు లాంఛనంగా ప్రారంభం ముమ్మరంగా ఏర్పాట్లు హాజరు కానున్న ప్రముఖులు నిట్ క్యాంపస్, న్యూస్‌లైన్ : నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్)లో శుక్రవారం నుంచి స్ప్రింగ్ స్ప్రీ(వసంతోత్సవం) నిర్వహించనున్నారు. నిట్ వరంగల్ ఆధ్వర్యంలో ఏటా కల్చరల్ ఫెస్టివల్‌ను నిర్వహిస్తున్నారు. ఇందులోభాగంగా శుక్ర, శని, ఆదివారాల్లో గాయనీ, గాయకుల ఆట, పాటలు సాంస్కృతిక కార్యక్రమాలు, ఆన్లైన్ షోలు, నృత్యాలు, ప్రముఖ గాయనీగాయకుల పాటలు, పాశ్చాత్య సంగీత ప్రదర్శనలు ఆకట్టుకోనున్నాయి. ఈ మేరకు నిట్ ఆడిటోరియంలో గురువారం సాయంత్రం 4.30 గంటలకు లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈవెంట్లు ఇవే.. స్ప్రింగ్స్ప్రీలో భాగంగా మూడు రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో 40కి పైగా ఈవెంట్లు ప్రదర్శించనున్నారు. అల్లూరే, వార్ ఆఫ్ డీజే, ఐఆర్ఏ, టియర్ హిటప్, ఐడోల్, గేమ్ డోమ్, ఫుష్టల్, స్ట్రీట్ బాల్, గల్లీ క్రికెట్, ఫుడ్ ఫెస్టివల్, సోలో డ్యాన్స్, పెయిర్ డ్యాన్స్, గ్రూప్ డ్యాన్స్, క్లాసికల్, వెస్ట్రన్ ఇన్స్ట్రిమెంట్ ప్రోగ్రామ్స్, నెహలే దే పెహలా.. యాహో జబర్దస్త్, రంగోలీ, పెయింటింగ్ కాంపిటీషన్, ఫొటో మెకానిజం, టీషర్ట్ డిజైనింగ్, ఆన్లైన్ ఈవెంట్స్, మిస్టర్ అండ్ మిస్ స్ప్రీ ఆన్లైన్ షోలు, షార్ట్ ఫిల్మ్ మేకింగ్స్ తదితర ఈవెంట్లు జరగనున్నాయి. ప్రముఖుల సంగీత కార్యక్రమాలు నిట్ ఆడిటోరియంలో శుక్రవారం రాత్రి 9.30 నుంచి 10.30 గంటల వరకు సన్బార్న్ ఆధ్వర్యంలో డీజే షో నిర్వహించనున్నారు. శనివారం రాత్రి 8 నుంచి 9 గంటల వరకు టాలీవుడ్ గాయకురాలు సుచిత్ర పాటల కచేరీ, రాత్రి 9 నుంచి 10.30 వ రకు బాలివుడ్ ప్లేబ్యాక్ సింగర్ సూరజ్ జగన్ ఆధ్వర్యంలో హిందీ పాటల కార్యక్రమం ఉంటుంది. ఫిబ్రవరి 23న రాత్రి 7.30 నుంచి 8 గంటల వరకు ప్రముఖ గిటారిస్ట్ బైజు ధర్మరాజన్ ఆధ్వర్యంలో రాక్‌బ్యాండ్ కార్యక్రమం, రాత్రి 8.30 నుంచి 9.15 గంటల వరకు ప్రముఖ డ్రమ్మర్ గినోబ్యాంగ్స్, గిటారిస్టు బైజు ధర్మరాజన్ ఆధ్వర్యంలో ఫ్యూషన్ బ్యాండ్ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. అనూప్ రూబెన్స్, మిస్ ఇండియా శోభిత రాక స్ప్రింగ్ స్ప్రీ కార్యక్రమానికి మిస్ ఇండియా శోభిత దూళిపాళ, ప్రముఖ సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ హాజరుకానున్నారు. మిస్ ఇండియా కిరీటాన్ని సొంతం చేసుకున్న శోభిత దూళిపాళ తెనాలికి చెందినవారు. గత ఏడాది జరిగిన అందాల పోటీల్లో ఆమె మిస్ ఇండియా కిరీటాన్ని ఆమె కైవసం చేసుకున్నారు. కార్యక్రమానికి ఆమె గౌరవ అతిథిగా హాజరుకానున్నారు. ఇరవైకి పైగా సినిమాలకు సంగీత దర్శకత్వం వహించిన అనూప్ రూబెన్స్ యువతరాన్ని ఉర్రూతలూగిస్తున్నారు. బుడ్డా హోగా తేరా బాప్ హిందీ సినిమాతోపాటు ఇష్క్, హార్ట్ఎటాక్, ప్రేమకావాలి, అడ్డా, గుండె జారి గల్లంతయిందే సినిమాలకు ఆయన సంగీత దర్శకత్వం వహించారు. స్ప్రింగ్ స్ప్రీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు.