‘లర్నర్స్ ల్యాండ్’లో ఆటాపాట
ఘనంగా స్పోర్ట్స్ మీట్, కల్చరల్ ఫెస్టివల్
సాంస్కృతిక కార్యక్రమాలతో ఉర్రూతలూగించిన విద్యార్థులు
కాశిబుగ్గ, న్యూస్‌లైన్ : వరంగల్ ఎల్‌బీనగర్‌లో లర్నర్స్ ల్యాండ్ డీజీ స్కూల్‌లో స్పోర్ట్స్, కల్చరల్ ఫెస్ట్‌ను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎంజీఎం ఆర్‌ఎంఓ డాక్టర్ నాగేశ్వర్‌రావు హాజరై విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు.
సుమారు వెయ్యి మంది విద్యార్థులు రంగురంగుల దుస్తుల్లో చూడచక్కని నృత్యా లు, ప్రదర్శనలు ఇస్తూ ఆహూతులను అలరించా రు. విద్యార్థులు నిర్వహించిన క్యాట్‌వాక్, మాక్ అసెంబ్లీ, శివకల్యాణం నృత్య రూపకం, ఫోక్, వెస్ట్ర న్స్, శాస్త్రీయ నృత్యాలు ఆకట్టుకున్నాయి.
కార్యక్రమంలో తాళ్లపద్మావతి విద్యాసంస్థల చైర్మన్ తాళ్ల మల్లేశంతో పాటు పాఠశాల ప్రిన్సిపాల్ ఝాన్సీ, డెరైక్టర్లు తాళ్ల వంశీ, తాళ్ల వరుణ్, పాఠశాల ఇన్‌చార్జ్‌లు వరలక్ష్మి, ఉమ, లక్ష్మి, కరాటే కోచ్ మహబూ బ్ అలీబాబా, పీఈటీ తిరుమల్‌రావు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.