kashiburgga
-
ప్రియుడు మోసం చేశాడని ఆత్మహత్యాయత్నం
కాశిబుగ్గ : ప్రియుడు మోసం చేశాడని ఓ యువతి ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన శనివారం వరంగల్ నగరంలోని హెడ్‌పోస్టాఫీసు వద్ద చోటుచేసుకుంది. ఇంతేజార్గంజ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని లేబర్ కాలనీకి చెందిన మౌనిక కీర్తినగర్‌కు చెందిన ఆటో డ్రైవర్ సమీర్‌ను మూడేళ్లుగా ప్రేమిస్తోంది. అనుకోకుండా ఇద్దరి మధ్య మనస్పర్థలు చోటుచేసుకోవడంతో మౌనిక ఆవేశంలో హెడ్‌పోస్టాఫీసు వద్దకు చేరుకోని ట్రాఫిక్ పోలీసులు చూస్తుండగానే చేతిపై బ్లేడ్‌తో గాయం చేసుకుంది. రక్తం పోతుండగా కేకలు వేస్తున్న బాధితురాలిని అక్కడే ఉన్న ట్రాఫిక్ పోలీసు చేరదీసి కర్చిప్‌తో కట్టుకట్టి ఇంతేజార్గంజ్ పోలీసులకు సమాచారం ఇవ్వగా ఎస్సై అక్కడికి చేరుకుని ఆమెను స్టేషన్‌కు తీసుకెళ్లారు. సంఘటనకు దారితీసిన పరిస్థితులపై ఆరాతీస్తున్నామని, త్వరలోనే సమస్యను పరిష్కారమయ్యేలా కృషి చేస్తామని సీఐ రవికుమార్ తెలిపారు. -
‘లర్నర్స్ ల్యాండ్’లో ఆటాపాట
ఘనంగా స్పోర్ట్స్ మీట్, కల్చరల్ ఫెస్టివల్ సాంస్కృతిక కార్యక్రమాలతో ఉర్రూతలూగించిన విద్యార్థులు కాశిబుగ్గ, న్యూస్‌లైన్ : వరంగల్ ఎల్బీనగర్లో లర్నర్స్ ల్యాండ్ డీజీ స్కూల్లో స్పోర్ట్స్, కల్చరల్ ఫెస్ట్‌ను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎంజీఎం ఆర్ఎంఓ డాక్టర్ నాగేశ్వర్రావు హాజరై విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. సుమారు వెయ్యి మంది విద్యార్థులు రంగురంగుల దుస్తుల్లో చూడచక్కని నృత్యా లు, ప్రదర్శనలు ఇస్తూ ఆహూతులను అలరించా రు. విద్యార్థులు నిర్వహించిన క్యాట్‌వాక్, మాక్ అసెంబ్లీ, శివకల్యాణం నృత్య రూపకం, ఫోక్, వెస్ట్ర న్స్, శాస్త్రీయ నృత్యాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో తాళ్లపద్మావతి విద్యాసంస్థల చైర్మన్ తాళ్ల మల్లేశంతో పాటు పాఠశాల ప్రిన్సిపాల్ ఝాన్సీ, డెరైక్టర్లు తాళ్ల వంశీ, తాళ్ల వరుణ్, పాఠశాల ఇన్‌చార్జ్‌లు వరలక్ష్మి, ఉమ, లక్ష్మి, కరాటే కోచ్ మహబూ బ్ అలీబాబా, పీఈటీ తిరుమల్‌రావు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.