చేతిని కోసుకున్న మౌనికకు కట్టుకడుతున్న ట్రాఫిక్ పోలీసు
కాశిబుగ్గ : ప్రియుడు మోసం చేశాడని ఓ యువతి ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన శనివారం వరంగల్ నగరంలోని హెడ్‌పోస్టాఫీసు వద్ద చోటుచేసుకుంది. ఇంతేజార్‌గంజ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని లేబర్ కాలనీకి చెందిన మౌనిక కీర్తినగర్‌కు చెందిన ఆటో డ్రైవర్ సమీర్‌ను మూడేళ్లుగా ప్రేమిస్తోంది. అనుకోకుండా ఇద్దరి మధ్య మనస్పర్థలు చోటుచేసుకోవడంతో మౌనిక ఆవేశంలో హెడ్‌పోస్టాఫీసు వద్దకు చేరుకోని ట్రాఫిక్ పోలీసులు చూస్తుండగానే చేతిపై బ్లేడ్‌తో గాయం చేసుకుంది.
రక్తం పోతుండగా కేకలు వేస్తున్న బాధితురాలిని అక్కడే ఉన్న ట్రాఫిక్ పోలీసు చేరదీసి కర్చిప్‌తో కట్టుకట్టి ఇంతేజార్‌గంజ్ పోలీసులకు సమాచారం ఇవ్వగా ఎస్సై అక్కడికి చేరుకుని ఆమెను స్టేషన్‌కు తీసుకెళ్లారు. సంఘటనకు దారితీసిన పరిస్థితులపై ఆరాతీస్తున్నామని, త్వరలోనే సమస్యను పరిష్కారమయ్యేలా కృషి చేస్తామని సీఐ రవికుమార్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment