warangal distirict
-
అంగన్వాడీలో కుళ్లిన గుడ్లు!
వరంగల్: రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు స్వచ్ఛమైన ఆహారాన్ని అందించాలని చేపట్టిన సంకల్పాన్ని పలువురు మధ్య దళారులు చిన్నాభిన్నం చేస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారాన్ని అందించడమే లక్ష్యంగా పెట్టుకున్న అధికారుల నిర్లక్ష్యంతో పలువురు నీరు గార్చుతున్నారు. కొన్నె గ్రామంలో సోమవారం కోడిగుడ్లను పంపిణీ చేయగా అవి వండుకున్న వారు గుడ్లు కుళ్లిపోయి వాసన వస్తుందని, అవి తింటే అనారోగ్యం పాలుకావడం ఖాయమని వాపోతున్నారు. అధికారులు సంబంధిత కాంట్రాక్టర్‌పై చర్య తీసుకోవాలని లబ్ధిదారులు కోరుతున్నారు. -
భారీగా ఏసీపీ, ఇన్స్పెక్టర్ల ట్రాన్స్ఫర్.. బదిలీలకు ఈనెల 31 టార్గెట్..
వరంగల్: పోలీసుశాఖలో బదిలీలు భారీగా జరుగుతున్నాయి. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల వేడి అనధికారికంగా ప్రారంభమైంది. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో డీసీపీ స్థాయి అధికారి నుంచి సబ్ ఇన్స్పెక్టర్ అధికారి వరకు ఎన్నికల ఎఫెక్ట్‌లో భాగంగా బదిలీలు జరుగుతున్నాయి. జాతీయ ఎన్నికల కమిషన్ ఆదేశాలతో ఇటీవల రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీస్ కమిషనరేట్ల కమిషనర్లు, ఎస్పీలతో సమావేశమయ్యారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలకు రిటర్నింగ్ అధికారులను నియమించారు. దీంతో ఎన్నికల ప్రక్రియ వేగం పుంజుకుంది. దీనికి అనుగుణంగా ఎన్నికల సమయంలో కీలకపాత్ర పోషించే పోలీస్ శాఖలో భారీగా మార్పులు చేపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అధికారుల ఎంపిక విషయంలో అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు మార్గ నిర్దేశం చేసినట్లు సమాచారం. దానికి అనుగుణంగా ఎన్నికల నిబంధనలు వర్తించే పోలీస్ అధికారులను ఆయా నియోజకవర్గాలకు సాగనంపుతున్నారు. దీంతోపాటు ఎన్నికల సమయంలో సామాజిక సమీకరణాలతో పాటు ఏమేరకు ఎన్నికల విధుల్లో ఉపయోగపడుతారనే కోణంలో క్షుణంగా పరిశీలించిన తర్వాతనే పోస్టింగ్‌లకు సిఫార్సు చేస్తున్నట్లు సమాచారం. ఉన్నతాధికారుల బదిలీ.. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పని చేసే ఇద్దరు డీసీపీలు పుల్లా కరుణాకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీగా, కర్రి పుష్పారెడ్డి తెలంగాణ కమాండ్ కంట్రోల్ విభాగం ఎస్పీగా బదిలీ అయ్యారు. వీరితో పాటు పరకాల, కాజీపేట, మామునూరు, క్రైం, ఏసీపీలు బదిలీ అయ్యారు. ఇన్స్పెక్టర్లు.. పరకాల, గీసుకొండతో పాటు కాజీపేట ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు బదిలీ అయ్యారు. దీంతోపాటు చాలా కాలంగా ఖాళీగా ఉన్న హసన్‌పర్తి, కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లకు ఖమ్మం, కొత్తగూడెం నుంచి వచ్చిన ఇన్స్పెక్టర్లకు పోస్టింగ్‌లు కేటాయించారు. కోడ్ ఎఫెక్ట్‌లో భాగంగా సుబేదారిలోని రూరల్ మహిళా పోలీస్‌స్టేషన్ ఇన్స్పెక్టర్, భరోసా ఇన్స్పెక్టర్లను బదిలీ చేశారు. గత నాలుగైదు రోజుల్లో వరుసగా సబ్ ఇన్స్పెక్టర్లను వివిధ పోలీస్స్టేషన్లకు బదిలీ చేస్తూ.. వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ.రంగనా«థ్ ఉత్తర్వులు జారీ చేశారు. నేతల చుట్టూ అధికారుల ప్రదక్షిణలు! ఎన్నికల ముందు ప్రశాంతత కోసం కొంత మంది అధికారులు లూపులైన్ల కోసం ప్రయత్నాలు సాగిస్తుండగా.. మరికొంత మంది ఎన్నికల కోడ్ వర్తించని చాలామంది అధికారులు సిఫారసు లేఖల కోసం నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఈసమయంలో నాయకులు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఎన్నికల సమయంలో ఏమేరకు ఉపయోగపడతారని వారి అనుచర గణంతో లెక్కలు వేసుకుంటున్నారు. అధికారి పనితీరుతో పాటు సామాజిక అంశాన్ని ప్రధానంగా చూస్తున్నారు. ఒక్కో పోస్టింగ్ కోసం పదుల సంఖ్యలో అధికారులు క్యూ కట్టడం విశేషం. ఏసీపీ పోస్టుల కోసం కూడా అధికారులు ఒక్కో ప్రజాప్రతినిధిని పలుమార్లు కలుస్తున్నారు. ప్రస్తుతం పని చేస్తున్న కొంత మంది అధికారులు వారి పీరియడ్ పూర్తి కాకపోయినప్పటికీ పోస్టింగ్ ఉంటుందో? ఉడుతుందో.. తెలియని అయోమయ స్థితిలో ఉద్యోగం నెట్టుకొస్తున్నారు. వరంగల్ సబ్ డివిజన్లో మిల్స్‌కాలనీ, ఇంతేజార్గంజ్ వర్ధన్నపేట, ధర్మసాగర్, కమలాపూర్, నర్సంపేట, రఘునా«థపల్లి, నర్సంపేట రూరల్, నర్మెట్ట పోలీస్స్టేషన్లకు కొత్త అధికారులు రానున్నారు. ఈపోస్టింగ్ల కోసం ఇప్పటికే చాలా మంది అధికారులు ప్రజాప్రతినిధుల నుంచి లెటర్లు పోలీస్‌బాస్‌కు అందించినట్లు సమాచారం. ఇందులో కొంత మందికి ఎలక్షన్ ఎఫెక్ట్ ఉండగా.. మరికొంత మంది ప్రవర్తన సరిగ్గా లేక మార్పు ఖాయమనే ప్రచారం జరుగుతోంది. అరెస్ట్‌లకు రంగం సిద్ధం! పోలీసు అధికారుల లెక్కల ప్రకారం వివిధ కేసుల్లో ఇప్పటి వరకు అరెస్టు కాకుండా తప్పించుకుని తిరుగుతున్న సుమారు 180 మంది నిందితుల జాబితాను అధికారులు సిద్ధం చేశారు. వీరిని అరెస్ట్ చేయడానికి ఇప్పటికే ఉన్నతాధికారుల నుంచి ఎస్హెచ్ఓలకు నిర్ధిష్టమైన ఆదేశాలు అందాయి. ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే నిందితులను అరెస్ట్ చేసి జైలుకు పంపనున్నారు. దీంతో పాటు ఆయా పోలింగ్స్టేషన్ల వారీగా మాజీలతో పాటు గతంలో జరిగిన ఎన్నికల్లో ఇబ్బదులు సృష్టించిన వ్యక్తుల జాబితాలు కూడా ఆయా పోలీస్స్టేషన్లలో సిద్ధంగా ఉన్నాయి. తుపాకుల జాబితా రెడీ.. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో తుపాకుల లైసెన్స్‌లు 230 ఉన్నాయి. ప్రస్తుతం తుపాకుల లైసెన్స్ కలిగిన వ్యక్తులు వివిధ గొడవల్లో చిక్కుకున్న, కేసులు నమోదైన వారి లైసెన్స్‌లు రద్దు చేశారు. దీంతో కమిషనరేట్ పరిధిలో 180 వరకు లైసెన్స్ తుపాకులున్నాయి. ఎన్నికల ముందు వీటిని ఆయా పోలీస్ స్టేషన్లలో డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. తుపాకుల లెక్కలను సైతం పోలీసు అధికారులు సిద్ధం చేసి ఉంచారు. ఈనెల 31 వరకు ప్రక్రియ పూర్తి చేస్తాం.. కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘం సూచనల మేరకు ఈనెల 31వ తేదీ వరకు ఎన్నికల బదిలీ ప్రక్రియను పూర్తి చేస్తాం. సొంత జిల్లా, సొంత నియోజవర్గం ఉన్న అధికారులతో పాటు చివరి నాలుగేళ్లలో మూడు సంవత్సరాలు ఒకే దగ్గర పనిచేసే అధికారులను నిబంధనల ప్రకారం బదిలీ చేస్తాం. ప్రస్తుతం వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో పని చేస్తున్న అధికారులను రెవెన్యూ జిల్లాను ప్రతిపాదికన బదిలీలు చేపడుతున్నాం. ఏసీబీ, క్రిమినల్ కేసులు ఉన్న అధికారులను ఎన్నికల విధులకు దూరంగా ఉంచుతాం. – ఏవీ. రంగన్నాథ్, వరంగల్ పోలీస్ కమిషనర్ -
కేసీఆర్ మోసం చేయని వర్గం లేదు : వైఎస్ షర్మిల
-
Telangana: సర్వే రిపోర్టులతో సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో గుబులు !
ఓరుగల్లు గులాబీ నేతల్లో గుబులు మొదలైంది. సర్వే రిపోర్టులు ఎమ్మెల్యేలను ఆందోళనకు గురి చేస్తుంటే.. ప్రజాదరణ తగ్గిన నేతలు పడరాని పాట్లు పడుతున్నారు. మెజారిటీ స్థానాల్లో ప్రతికూల ఫలితాలు తప్పవని సర్వే రిపోర్టులు తేల్చడం సిట్టింగ్‌లకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోందట. ఉద్యమాల ఖిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లా టీఆర్ఎస్కు మొన్నటివరకు కంచుకోట. రెండు పార్లమెంటు, 11 అసెంబ్లీ స్థానాలతో పాటు 8 ఎమ్మెల్సీలు, ఆరు జిల్లా పరిషత్‌లను కైవసం చేసుకుని ప్రతిపక్షాలకు అందనంత దూరంలో ఉంది గులాబీ పార్టీ. అయితే తాజా రాజకీయ పరిణామాలతో సీన్ మారి పలు అసెంబ్లీ సెగ్మెంట్లలో సిట్టింగ్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత పెరగడం కలకలం రేపుతోంది. 12 అసెంబ్లీ స్థానాల్లో ఒక్క స్థానానికే పరిమితమైన కాంగ్రెస్ బలపడి ఆరేడు స్థానాల్లో టీఆర్ఎస్కు గట్టి పోటీ ఇచ్చే అవకాశముందనే సర్వే రిపోర్టు జిల్లాలో చర్చనీయాంశమైంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఆరేడు అసెంబ్లీ స్థానాల్లో టీఆర్ఎస్కు ప్రతికూల ప్రభావం తప్పవని దాదాపు అన్ని సర్వేలు తేల్చేశాయి. వరంగల్ ఉమ్మడి జిల్లాలో టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అనే పరిస్థితి నెలకొని ఉన్నట్లు సర్వేల్లో వెల్లడైందట. దానికితోడు కాంగ్రెస్ రోజురోజుకు బలపడుతోందని, కొంతమంది ముఖ్యమైన నేతలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారని, ఏక్షణమైనా సదరు నేతలు హస్తం గూటికి చేరే అవకాశాలున్నాయని పొలిటికల్ సర్కిళ్లలో చర్చ నడుస్తోంది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణికం ఠాగూర్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ఎన్నికల వ్యూహకర్త సునీల్ ముఖ్య నేతలతో టచ్‌లో ఉన్నట్టు ప్రచారం జరుగుతుండడం ఆసక్తికరంగా మారింది. పాలకుర్తిలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, వరంగల్ పశ్చిమలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, వర్ధన్నపేటలో ఎమ్మెల్యే ఆరూరి రమేష్, డోర్నకల్‌లో ఎమ్మెల్యే రెడ్యానాయక్... ఈ నలుగురు ప్రస్తుతం సేఫ్ జోన్లో ఉన్నారట. మిగతా ఎమ్మెల్యేలకు ఎదురీత తప్పదని సర్వేల్లో తేలడం సిట్టింగ్‌లకు గుబులు పుట్టిస్తోందట. మెజార్టీ ఎమ్మెల్యేలకు ప్రతికూల వాతావరణం ఉండడంతో.. అక్కడ అభ్యర్థులను మార్చే అవకాశముందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. భూపాలపల్లిలో మాజీ స్పీకర్ మధుసూదనాచారి, మహబూబాబాద్‌లో ఎంపీ కవిత, స్టేషన్ ఘన్‌పూర్‌లో మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, వరంగల్ తూర్పులో మాజీ మంత్రి బస్వరాజ్ సారయ్య, జనగామలో కేటీఆర్ సన్నిహితుడు, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిని బరిలోకి దించే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరోవైపు తాజా సర్వే రిపోర్టులతో ప్రజాదరణ తగ్గిన ఎమ్మెల్యేలు పడరాని పాట్లు పడుతున్నారు. అధిష్టానం దృష్టిని ఆకర్షించి ప్రజలకు మరింత చేరువయ్యేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల కేటీఆర్ బర్త్ డే ను పురస్కరించుకుని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే రాజయ్య మోకాళ్లపై చెల్పూర్ వెంకటేశ్వరస్వామి గుడి మెట్లు ఎక్కి మొక్కులు చెల్లించారు. వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ భారీ ఖర్చుతో లేజర్ షో పెట్టి హల్ చల్ చేశారు. కానీ ఎన్నికల నాటికి సమీకరణాలు ఎలా మారుతాయో తెలియని పరిస్థితి ఏర్పడింది. సర్వేల సంగతి ఎలా ఉన్నా.. మెజార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేల పనితీరు అంతంతమాత్రంగానే ఉందని నియోజకవర్గాల్లోనూ చర్చ జరుగుతుండడం గులాబీ శిబిరంలో గుబులు రేపుతోంది. -
బీజేపీ ఎత్తుగడలకు టీఆర్ఎస్ విరుగుడు మంత్రం!
ఉమ్మడి వరంగల్ జిల్లాలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. గత ఎన్నికల్లో టిఆర్ఎస్ హవా సాగినప్పటికీ తాజా పరిణామాల నేపధ్యంలో కారు జోరుకు బ్రేకులు పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. సగం సీట్లలో పాగా వేసేందుకు విపక్షాలు పకడ్బందీ ప్రణాళికతో ముందుకు సాగుతున్నాయి. రాబోయే కాలానికి కాబోయే లీడర్స్ మేమేనంటూ ఆపరేషన్ ఆకర్ష్ రాజకీయాలను రక్తికట్టిస్తున్నారు. ముక్కోణపు పోటీలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో చూడాలి. పోరాటాల పురిటి గడ్డ వరంగల్ జిల్లాలో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచీ గులాబీ పార్టీ ఆధిపత్యం కొనసాగుతోంది. ఉమ్మడి జిల్లాలో రెండు ఎంపీ సీట్లు, 12 అసెంబ్లీ స్థానాలు ఉండగా ఒక్క ములుగు అసెంబ్లీ సెగ్మెంట్ మినహా మిగిలినవన్నీ గులాబీ పార్టీ ఖాతాలోనే ఉన్నాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో భూపాలపల్లి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచిన గండ్ర వెంకటరమణారెడ్డి కాంగ్రెస్‌కు హ్యాండిచ్చి గులాబీ గూటికి చేరారు. తర్వాత జరిగిన జిల్లా పరిషత్ ఎన్నికల్లో ఏకపక్షంగా వరంగల్, హన్మకొండ, జనగామ, మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి పరిషత్‌లను టిఆర్ఎస్ కైవసం చేసుకుంది. అయితే రాజకీయ పరిణామాల నేపథ్యంలో పెనుమార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల ప్రశాంత్ కిషోర్ టీమ్ నిర్వహించిన సర్వేలో ఉమ్మడి జిల్లాలో ఐదారు అసెంబ్లీ స్థానాల్లో ప్రతికూల పరిస్థితులు నెలకొన్నట్లు తేలింది. దీంతో గులాబీ పార్టీలో గుబులు, విపక్షాల్లో జోష్ పెరిగింది. ఉమ్మడి జిల్లాలో పట్టు కోల్పోకుండా టీఆర్ఎస్.. బలపడేందుకు బీజేపీ, కాంగ్రెస్ ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటాపోటీ కార్యక్రమాలు చేపట్టడంతోపాటు.. ఎదుటి శిబిరంలో కాస్త ప్రజాదరణ ఉన్న నేతను.. తమవైపు లాగేందుకు చిత్ర విచిత్ర వ్యూహాలు రచిస్తున్నారు అన్ని పార్టీల నేతలు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం రాష్ట్రానికి వచ్చిన ఆ పార్టీ నాయకుల్లో కొందరు జిల్లా అంతటా పర్యటించారు. ఒకప్పుడు ఉమ్మడి జిల్లాలో ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలను గెలిచిన చరిత్ర ఉండటంతో.. మరోసారి ఆ స్థాయిలో ఆ స్థాయిలో సీట్లు సాధించాలని చూస్తున్నారు కమలనాథులు. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లో అసంతృప్తితో ఉన్న నాయకులతో రహస్య మంతనాలు జరుపుతూ.. వారికి కాషాయ తీర్థం ఇచ్చేందుకు తెగ శ్రమిస్తున్నారు. ఆయా నాయకుల హోదాల మేరకు రాష్ట్రస్థాయి నేతలు సైతం టచ్‌లోకి వెళ్తున్నారట. అయితే అనుకున్నంత వేగంగా చేరికలు లేకపోవడంతో బీజేపీ శిబిరాన్ని డైలమాలో పడేస్తోంది. బీజేపీ ఎత్తుగడలు తెలుసుకున్న టీఆర్ఎస్ నాయకులు విరుగుడు మంత్రం వేస్తున్నారు. బీజేపీ వాళ్లనే టీఆర్ఎస్లోకి లాగే ప్రయత్నాలు ప్రారంభించారు. చిన్న స్థాయి నేతలకు వల వేస్తే లాభం లేదనుకున్నారో ఏమో.. గతంలో ఆర్ఎస్ఎస్, ఏబీవీపీల్లో ఫుల్ టైమర్స్‌గా పనిచేసి.. ప్రస్తుతం బీజేపీలో యాక్టివ్‌గా ఉన్న కరుడుగట్టిన నేతలకే గురి పెట్టారు. జీవితాంతం బీజేపీలోనే ఉంటారు.. కండువా మార్చబోరని అనుకుంటున్న వారిని లాగితే.. పార్టీ శ్రేణులు డీలా పడతాయనే ఉద్దేశంతో గట్టిగానే గాలం వేస్తున్నారట. ఇలా వరంగల్ అర్బన్ ప్రాంతానికి చెందిన కొందరిని ఆకర్షించారు. వరంగల్ అర్బన్‌లో బలపడాలని చూస్తున్న బీజేపీకి తాజా వలసలు ఇబ్బందే అనే చర్చ జరుగుతోంది. ఇటీవల బీజేపీ నగర అధ్యక్షునితోపాటు, ఒక కార్పొరేటర్‌కు గులాబీ కండువా కప్పేశారు. పైగా ఇది అంతం కాదు.. ఆరంభమేనని చెప్పుకొస్తున్నారు గులాబీ నేతలు. టీఆర్ఎస్ నుంచి అసంతృప్తులు ఎవరూ కమలం శిబిరం వైపు చూడకుండా వ్యూహరచన చేశారు అధికార పార్టీ నేతలు. అయితే బీజేపీ నుంచి ఒకరిద్దరు నాయకులు పోయినంత మాత్రాన పార్టీకి వచ్చిన ఇబ్బందేమీ లేదని కమలనాథులు ప్రకటనలు ఇస్తున్నారు. ఇప్పటికే కారులో ఎక్కువమంది ఎక్కేశారని.. అందులో ఉన్నవారికి ఊపిరి సలపడం లేదని.. త్వరలోనే దిగిపోయేవాళ్లు క్యూ కట్టినా ఆశ్చర్యపోనక్కరలేదని చెబుతున్నారు. వెళ్లిన దారినే తిరిగొచ్చేస్తారని ధీమాగా ఉన్నారు బీజేపీ నేతలు. -
టీఆర్ఎస్కు మంత్రి సోదరుడు షాక్
వరంగల్ జిల్లా: తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సోదరుడు ప్రదీప్‌రావు టీఆర్ఎస్కు షాకిచ్చారు. ఆదివారం టీఆర్ఎస్ పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఎమ్మెల్యే నరేందర్ రాజీనామా చేసి గెలవాలని సవాల్ విసిరారు. ‘చీరుస్తా, పాతరేస్తా అంటే పార్టీలో ఉండాలా. తన సహకారం లేకుండా నరేందర్ ఎమ్మెల్యేగా గెలుపొందితే పదో తారీకు వరకు రాజీనామా చేయి. రాజీనామా చేసి గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటాం. బతికున్నన్ని రోజులు ఆయనకు సేవకుడిగా పని చేస్తా. 25 వేల కుటుంబాలను ఆదుకుంటే ప్రజలు ఆదరిస్తారు అనుకుంటే, 4వేల కోట్లతో అభివృద్ధి చేశాను అనుకుంటే రాజీనామా చేయ్.పదో తారీకు వరకు రాజీనామా చేయకుంటే ఎక్కడికి రమ్మన్నా వస్తా బహిరంగ చర్చకు సిద్ధం. 4 వేల కోట్లు ఎక్కడ పెట్టి అభివృద్ధి చేశావో చెప్పు. పార్టీలో ప్రాధాన్యత తగ్గించినా ఓపికగా భరించాం.ఎమ్మెల్సీ ఆశ జూపి అవమానించారు. ఏ పార్టీ ఆదరించకుంటే ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలుస్తా’ అని స్పష్టం చేశారు ఎర్రబెల్లి ప్రదీప్‌రావు. -
కాటన్ మరిచారు.. కుట్లు వేశారు!
వర్ధన్నపేట: ప్రసవానికి వచ్చిన ఓ గర్భిణికి శస్త్రచికిత్స చేసి అందులోనే కాటన్ (దూది) మరిచి కుట్లు వేసి పంపించిన సంఘటన వరంగల్ జిల్లా వర్ధన్నపేట ప్రభుత్వ ఆస్పత్రిలో చోటుచేసుకుంది. వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధి శివారు బావనికుంట తండాకు చెందిన నూనావత్ దేవేందర్ భార్య సౌజన్య జూన్ 16న పురిటి నొప్పులతో బాధపడగా.. 108లో ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే సాధారణ ప్రసవమైంది. ఆస్పత్రికి తీసుకెళ్లగా తల్లీ, బిడ్డ క్షేమంగా, ఆరోగ్యంగా ఉన్నారని, రక్తస్రావం అవుతుండటంతో చిన్న శస్త్రచికిత్స చేసి రెండు కుట్లు వేస్తే సరిపోతుందని కుట్లు వేశారు. ఆరోజు నుంచి సౌజన్య అనారోగ్యంతో బాధపడుతోంది. కడుపు నొప్పి తోపాటు మంట తదితర సమస్యలతో బాధపడుతుండగా దేవేందర్ వరంగల్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. వైద్య పరీక్షలు నిర్వహించి శస్త్రచికిత్స చేసిన చోట లోపల కాటన్ మరిచి కుట్లు వేశారని తేల్చారు. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన దేవేందర్.. సౌజన్యను శుక్రవారం ఆస్పత్రికి తీసుకువచ్చి వైద్యులను నిలదీశాడు. కుట్లు వేసినప్పుడు పొరపాటున కాటన్ మరిచి కుట్లు వేశామని, తమను క్షమించమని కోరారన్నారు. వెంటనే మళ్లీ శస్త్రచికిత్స చేసి కాటన్‌ను తొలగించి సౌజన్యకు ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు. -
ముగిసిన రాకేష్ అంత్యక్రియలు
-
వరంగల్: వామ్మో! అంతుచిక్కని వైరస్‌తో 4వేల కోళ్లు మృతి
వరంగల్ (నెక్కొండ): అంతు చిక్కని వ్యాధితో 4వేల కోళ్లు మృత్యువాతపడిన ఘటన వరంగల్ జిల్లా నెక్కొండ మండలంలోని మడిపెల్లి శివారు హరిశ్చంద్రుతండాలోని సరిత పౌల్ట్రీపామ్‌లో జరిగింది. యజమాని తేజావత్ మురళీనాయక్ తెలిపిన వివరాలు ప్రకారం.. పౌల్ట్రీనపామ్లో 25 రోజుల నుంచి 11,300 కోళ్లను పెంచుతున్నాడు. ఈ క్రమంలో మూడురోజులుగా రోజుకు 1,000కి పైగా కోళ్లు మృతి చెందుతున్నాయి. ఇప్పటి వరకు 4వేల కోళ్లు మృతి చెందాయి. మరో రెండుమూడు రోజులు గడిస్తే పామ్‌లోని మిగితా కోళ్లు కూడా మృతిచెందే అవకాశం ఉందని యజమాని వాపోయాడు. కోళ్లకు కిడ్నీ వాపు, లివర్ ఇన్ఫెక్షన్ వచ్చి మృతి చెంది ఉండవచ్చని యజమాని అనుమానం వ్యక్తం చేశాడు. కాగా ఇప్పటి వరకు రూ. 6లక్షల నష్టం వాటిల్లిందని, మిగితా కోళ్లు మృతి చెందితే మరో రూ.15 లక్షలు నష్టపోవాల్సి వస్తుందని ఆయన కన్నీరుమున్నీరయ్యారు. మృతి చెందిన కోళ్లను గోతి తోపాతిపెట్టినట్లు యజమాని పేర్కొన్నారు. పోస్టుమార్టం నిర్వహిస్తాం.. పౌల్ట్రీపామ్‌లో మృతి చెందిన కోళ్ల వ్యాధి నిర్ధారణ కోసం పోస్టుమార్టం నిర్వహిస్తాం. ప్రస్తుతం కోళ్లు రానికెట్, బర్డ్ ఫ్లూ, వీవీ ఆర్డీ వ్యాధులతో పెద్ద మొత్తంలో మృత్యువాత పడతాయి. లేదా వేసవి తాపం, సాధారణ వ్యాధులతో కోళ్లు మృతి చెంది ఉండవచ్చు. కోళ్ల మృతి విషయం జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాం. ఏడీడీఎల్ ఏడీ నాగమణి ఆధ్వర్యంలో పోస్టుమార్టం జరుగుతుంది. అలాగే పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపాం. –మమత, పశువైద్యాధికారి, నెక్కొండ -
అమ్మాయిలను తీసుకొచ్చి గుట్టుగా వ్యభిచారం.. పోలీసుల అదుపులో మహిళ, విటుడు
ఖిలా వరంగల్: వరంగల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు వ్యభిచార గృహంపై దాడి జరిపి ఇద్దరు మహిళలను రక్షించారు. నగరంలోని శివనగర్‌కు చెందిన బోనాసి స్వర్ణలత అలియాస్ కావేరి కొన్నాళ్లుగా తన ఇంట్లో రహస్యంగా వ్యభిచారం సాగిస్తోంది. పేదరికం, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వరంగల్‌కు చెందిన ఒకరు, కాకినాడకు చెందిన మరో యువతిని బలవంతంగా ఈ రొంపిలోకి దింపి వ్యభిచారం సాగిస్తున్నట్లు సమాచారం. చదవండి: లిప్ట్ ఇస్తానంటూ నమ్మించి బైక్‌పై ఎక్కించుకుని.. ముందస్తు సమాచారంతో టాస్క్‌ఫోర్స్ ఏఎస్పీ వైభవ్ రఘునాథ్ గైక్వాడ్ ఆదేశాల మేరకు శివనగర్‌లోని ఆమె ఇంటిపై సోమవారం టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆకస్మిక దాడి చేశారు. ఈ దాడిలో వ్యభిచార నిర్వాహకురాలితోపాటు ఇద్దరు మహిళల్ని, ఖిలా వరంగల్‌కు చెందిన విటుడు స్వామిని అధికారులు అదుపు లోకి తీసుకున్నారు. వారినుంచి నాలుగు సెల్ఫోన్లు, రూ.5,260 నగదు స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసుకొని విచారణ కోసం మిల్స్ కాలనీ పోలీసులకు నిందితులను అప్పగించి నట్లు టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్లు, సంతోష్, శ్రీనివాస్‌జీ తెలిపారు. -
ఎవరిదీ పాపం..? ఏడాదిలో 15 మంది.. ప్రేమ పేరుతో కోరికలు తీర్చుకుని..
సాక్షి, వరంగల్: ‘పరకాల మండలంలోని ఓ గ్రామానికి చెందిన 17 ఏళ్ల బాలిక హైదరాబాద్‌లో తల్లిదండ్రులతో కలిసి నివాసముంటోంది. అక్కడ పరిచయమైన ఓ వ్యక్తి ఆమెను మాటలతో లొంగదీసుకున్నాడు. ఆ తర్వాత శారీరక సంబంధం ఏర్పర్చుకున్నాడు. ఈ విషయం ఆరు నెలలయ్యాక బాధితురాలి తల్లిదండ్రులకు తెలిసింది. అబార్షన్ చేయిద్దామంటే వీలు లేకపోవడంతో తొమ్మిది నెలలు చూసి వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో ఇటీవల ప్రసవం చేయించారు. ఆ తర్వాత పాపను ఆస్పత్రిలోనే వదిలేసి వెళ్లారు’. ‘నెక్కొండ మండలంలోని ఓ తండాకు చెందిన 24 ఏళ్ల వివాహిత తొలి సంతానంలో బిడ్డకు జన్మనిచ్చింది. భర్త చనిపోవడంతో మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పర్చుకుంది. అతడు కూడా ఆమెను నమ్మించి గర్భం చేశాడు. ఆ తర్వాత ముఖం చాటేశాడు. దీంతో ఆమె ఓ ఆస్పత్రిలో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆ పాపను చూడనని, తన ఆర్థిక పరిస్థితి బాగోలేదని ఆమె వదిలించుకుంది’. ఇలా ఓ బాలిక, ఓ మహిళ తప్పుదారి పట్టడంతో వారికి పుట్టిన బిడ్డలు పేగుబంధానికి దూరం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. విషయం తెలిస్తే ఎవరూ పెళ్లి చేసుకోరని బాలిక, భర్త చనిపోయినా రెండో బిడ్డకు ఎలా జన్మనిచ్చిందని మరొకావిడ కన్న బిడ్డలను దూరం చేసుకున్నారు. వారికి జన్మించిన పసికూనలిద్దరూ ఇప్పుడు వరంగల్ జిల్లాలోని హనుమకొండ శిశు విహార్‌లో పెరుగుతున్నారు. ఆ పసిబిడ్డలిద్దరూ ఏ పాపం చేయకున్నా పేగుబంధానికి దూరం కావడం కన్నీళ్లు పెట్టిస్తోంది. వీరిద్దరే కాదు.. ఇలా వివాహం చేసుకోకుండా ఎనిమిది మందికి జన్మించిన పిల్లలు, వివాహేతర సంబంధం, ఆర్థిక పరిస్థితి బాగోలేకపోవడం, మూడో కాన్పులోనూ ఆడపిల్ల తదితర కారణాలతో జన్మించిన మరో ఏడుగురు.. ఇలా మొత్తం 15 మంది పసికూనలు కన్నవారి ఆప్యాయతానురాగాలు లేక శిశు విహార్ పాలయ్యారు. చదవండి: (జీహెచ్ఎంసీ కార్యాలయంలో అగ్ని ప్రమాదం.. ఫైళ్లు దగ్ధం) తప్పే శాపమాయె.. ఇటు పోలీసులు, అటు షీటీం బృందాలు ఎంత అవగాహన కలిగిస్తున్నా.. తెలిసీ తెలియని వయసులో అమ్మాయిలు దారి తప్పుతున్నారు. కుటుంబ పోషణకు తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగాలు, ఇతర పనులకు వెళ్తుండటంతో వీరిపై పర్యవేక్షణ కరువవడం.. పిల్లలు ఏమి చేస్తున్నారనే విషయం కూడా వీరికి తెలియకపోవడంతో ఇటువంటి పరిణామాలు ఉత్పన్నమవుతున్నాయి. దీంతో ఇటు మగ, అటు ఆడపిల్లలు ఎవరి దారుల్లో వారు వెళ్తున్నారు. ప్రేమ పేరుతో మైనర్లకు లొంగదీసుకుని లైంగిక దాడులకు పాల్పడుతుండటంతో చివరకు తల్లులవుతున్న ఘటనలు చూస్తున్నాం. తొలినాళ్లలో తెలిస్తే తల్లిదండ్రులు అబార్షన్ చేయించి పెళ్లిళ్లు చేసేస్తున్నారు. కాస్త ఆలస్యంగా తెలిస్తే డెలివరీ చేయించి ఆ ఆస్పత్రిలోనే పాపను వదిలేసి వెళ్తున్నారు. ఈ విషయం వైద్య సిబ్బంది ద్వారా జిల్లా బాలల సంరక్షణ విభాగాధికారులకు తెలియడంతో వారు బాలల సంరక్షణ కమిటీ ఆధ్వర్యంలో పసికూనలకు శిశు విహార్‌కు తరలిస్తున్నారు. ఇలా శిశు విహార్‌లో ఉన్న పిల్లలను చట్టప్రకారంగా ముందుకొచ్చే దంపతులకు దత్తత ఇస్తున్నారు. ‘అసలు తల్లిదండ్రులెవరో తెలియకుండానే వారి జీవితం ముందుకెళ్తోంది. ప్రేమ పేరుతో శారీరక సంబంధాల వరకు వెళ్లొద్దు. వివాహేతర సంబంధాలు పెట్టుకోవద్దు. మీరు వేసే తప్పటడుగులు పిల్లలకు శాపంగా మారొద్దు. ఇప్పటికైనా సమాజంలోని ప్రతి ఒక్కరూ దీనిని గమనించాలి’ అని ఓ ప్రభుత్వ విభాగాధికారి అంటున్నారు. -
వివాహేతర సంబంధం: ఫోన్‌కాల్ ద్వారా పరిచయం.. అర్థరాత్రి సమయంలో
సాక్షి, జగ్గయ్యపేట/వరంగల్: ప్రేయసి గొంతు కోసి, ప్రియుడు కూడా ఆత్మ హయత్యా యత్నానికి పాల్పడిన ఘటన కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మండలంలోని సుబ్బాయిగూడెం గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన ఎన్.ఏసురాజుకు కొంత కాలంనుంచి ఒంటరిగా జీవిస్తున్నాడు. ఈ క్రమంలో ఫోన్‌కాల్ ద్వారా వరంగల్‌కు చెందిన కృష్ణవేణితో పరిచయం ఏర్పడింది. అది కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. ఇద్దరూ తరుచూ కలిస్తుండేవారు. ఈ క్రమంలో ఏసురాజు కృష్ణవేణికి ఫోన్ చేసి ఆదివారం సుబ్బాయి గూడెం రప్పించాడు. చదవండి: ప్రేయసి ఫోన్ లిఫ్ట్ చేయలేదని.. ఎంత పనిచేశావ్ తరుణ్.. అర్ధరాత్రి సమయంలో వారిద్దరి మధ్య ఘర్షణ తలెత్తటంతో ఏసురాజు బ్లేడ్‌తో కృష్ణవేణి గొంతుపై గాయం చేసి, తాను చేతిపై కోసుకున్నాడు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న ఎస్ఐ హరిప్రసాద్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. 108 వాహనంలో వారిద్దరినీ పెనుంచిప్రోలులోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గాయాలు స్వల్పంగా కావటంతో ఇద్దరూ క్షేమంగానే ఉన్నారని ఎస్ఐ తెలిపారు.అయితే ప్రియుడిపై ఫిర్యాదు చేసేందుకు ప్రియురాలు ముందుకురాకపోవడంతో పోలీసులు కేసు నమోదు చేయలేదు. చదవండి: విషాదం: సుగుణ తలుపులు తీయ్.. కిటికీలో నుంచి చూడగా.. -
29న ‘తెలంగాణ విజయగర్జన’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) ద్విదశాబ్ది ఉత్సవాల నేపథ్యంలో ఈ నెల 15న వరంగల్‌లో నిర్వహించ తలపెట్టిన ‘తెలంగాణ విజయగర్జన’బహిరంగసభ వాయిదా పడింది. ఈ మేరకు ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సోమవారం ప్రకటించారు. బహిరంగసభను ఈ నెల 29న దీక్షాదివస్ సందర్భంగా వరంగల్‌లోనే నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. విజయగర్జన సభ తేదీ మార్పునకు అనుగుణంగా ఏర్పాట్లు చేసుకునేలా క్షేత్రస్థాయి పార్టీ యంత్రాంగానికి సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. బహిరంగ సభాస్థలి కోసం అన్వేషణ సాగిస్తున్న వరంగల్ జిల్లా నేతలు సోమవారం హైదరాబాద్ రూట్లోని మడికొండ, రాంపూర్ ప్రాంతాల్లో పలు ప్రదేశాలను పరిశీలించారు. అనంతరం మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, చీఫ్‌విప్ వినయ్‌భాస్కర్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్‌కుమార్, సీనియర్ నేతలు కడియం శ్రీహరి, మధుసూదనాచారి, ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు నరేందర్, ఆరూరి రమేశ్, పెద్ది సుదర్శన్‌రెడ్డి, ధర్మారెడ్డి తదితరులు వరంగల్‌లో సమావేశమయ్యారు. దీక్షా దివస్ సందర్భంగా.. రాష్ట్ర సాధన ఉద్యమంలో భాగంగా 2009 నవంబర్ 29న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేపట్టిన ఆమరణ దీక్షను గుర్తు చేసుకుంటూ ఆ పార్టీ ఏటా దీక్షాదివస్‌ను పాటిస్తోంది. పార్టీ ద్విదశాబ్ది ఉత్సవాల నేపథ్యంలో నవంబర్ 29న దీక్షాదివస్ సందర్భంగా వరంగల్‌లో ‘తెలంగాణ విజయగర్జన’నిర్వహించాలని ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలు కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. వారి విజ్ఞప్తికి స్పందించిన కేసీఆర్ ఆ సభను ఈ నెల 29కి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. సభను విజయవంతం చేసేందుకు ఇప్పటికే నియోజకవర్గాలవారీగా కమిటీలు ఏర్పాటు చేసుకుని మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు జనసమీకరణపై దృష్టి సారించారు. సభకు తరలేందుకు ఇప్పటికే చేసుకున్న ఏర్పాట్లను 29వ తేదీకి మార్చుకోవాలని కేసీఆర్ సూచించారు. సభ విజయవంతానికి కేసీఆర్ దిశానిర్దేశం విజయగర్జన సభ విజయవంతానికిగాను టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అక్టోబర్ 17న తెలంగాణ భవన్లో పార్టీ పార్లమెంటరీ, లెజిస్లేచర్ పార్టీ విభాగాల సంయుక్త సమావేశంలో దిశానిర్దేశం చేశారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా అక్టోబర్ 18 నుంచి 24 వరకు 103 అసెంబ్లీ నియోజకవర్గాల నేతలతో విజయగర్జన సభ సన్నాహక సమావేశాలు నిర్వహించారు. ప్రస్తుతం పారిస్ పర్యటనలో ఉన్న కేటీఆర్ తిరిగి వచ్చిన తర్వాత విజయగర్జన సభ సన్నాహాలపై మిగతా నియోజకవర్గ నేతలతోనూ సమీక్షలు నిర్వహిస్తారు. -
ఖమ్మం జిల్లా ప్రాచీన నామమేదో తెలుసా?
సాక్షి, ఖమ్మం: ఖమ్మం చారిత్రక నేపథ్యం కలిగిన జిల్లా. ఈ జిల్లాను 1953లో పరిపాలన సౌలభ్యం కోసం ఏర్పాటు చేశారు. అప్పటి వరకు ఈ ప్రాంతం వరంగల్ జిల్లాలో భాగంగా ఉంది. ఖమ్మం, మధిర, ఇల్లందు, బూర్గంపాడు, పాల్వంచ రెవెన్యూ డివిజన్లను విడదీసి ఖమ్మం జిల్లాగా ఏర్పాటు చేశారు. అలాగే 1959లో అప్పటి వరకు తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న భద్రాచలం, వెంకటాపురం రెవెన్యూ డివిజన్లను జిల్లాలో కలిపారు. ఈ జిల్లా భూబాగం వేర్వేరు రాజవంశాల కాలాల్లో వేర్వేరుగా ఉంది. ఖమ్మం నగరం మధ్యలో ఉన్న స్తంభాద్రి నుంచే మండపాలకు, స్తంభాలకు కావాల్సిన రాళ్లు తరలిస్తూ ఉండేవారు. అందుకే ఖమ్మంకు స్తంభాద్రి అనే ప్రాచీన నామం ఉంది. చరిత్రకారుల కథనం ప్రకారం ఖమ్మం అనే పేరు నగరంలోని నృసింహాద్రి అని పిలవబడే నారసింహాలయం నుంచి వచ్చినట్లు, కాలక్రమంలో స్తంభ శిఖరిగా.. ఆ పై స్తంభాద్రిగా మారినట్లు చరిత్రకారులు తెలుపుతున్నారు. ఉర్దూ భాషలో కంబ అంటే రాతిస్తంభం అని అందుకే ఖమ్మం అనే పేరు నగరంలోని నల రాతి శిఖరం నుంచి వచ్చినట్లు మరో వాదన ఉంది. (చదవండి: రైతు బతుకులో నిప్పులు పోసిన గ్యాస్.. బీరువాలో దాచిన రూ. 6 లక్షలు..) నైజాం నవాబు పాలనకు వ్యతిరేకంగా.. చివరి నైజాం నవాబు పాలనకు వ్యతిరేకంగా కమ్యూనిస్టుల నాయకత్వంలో జరిగిన సాయుధ రైతాంగ పోరాటానికి కాకలు దీరిన నాయకులు, యోధులను అందించిన ప్రాంతంగా ఖమ్మం చరిత్రలో నిలిచిపోయింది. 1931లో ఖమ్మంలో మొదటి స్వాతంత్య్ర ఉద్యమం జరిగింది. 1945లో ఖమ్మంలో 12వ రాష్ట్ర ఆంధ్ర మహాసభ సమావేశం నిర్వహించారు. ఖమ్మం నగరంతోపాటు జిల్లా ప్రజలు గర్వంగా చెప్పుకునే గాంధీ ఖమ్మం సందర్శన 1946లో జరిగింది. 1946 ఆగస్టు 5న మహాత్మాగాంధీ ఖమ్మం సందర్శించారు. పర్యాటక ప్రాంతాలివే.. జిల్లాతోపాటు ఖమ్మం నగరంలో అనేక పర్యాటక ప్రాంతాలున్నాయి. నగరంలో నరసింహస్వామి ఆలయం, శ్రీజలాంజనేయ స్వామి ఆలయం, లకారం చెరువు, దానవాయిగూడెం పార్కు, తీర్థాల సంగమేశ్వర స్వామిఆలయం, లకారం పార్క్, ట్యాంక్‌బండ్, నేలకొండపల్లి వంటి పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. ఖమ్మం కోట చారిత్రక నేపథ్యం.. సుల్తాన్ కులీ కుత్బుల్ ముల్క్ 1531 ఏడాదిలో అప్పటి ఖమ్మం పాలకుడైన సీతాబ్‌ఖాన్ (సీతాపతిరాజు)ను ఓడించి ఖమ్మం కోటను స్వాధీనం చేసుకున్నారు. అప్పటి నుంచి ఈ దుర్గం కుతుబ్షాహి పాలనలో ఉంది. గ్రానైట్ రాళ్లతో నిర్మించిన ఈ పటిష్టమైన కోట నాలుగు చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. కోటకు 10 ద్వారాలు ఉన్నాయి. పశ్చిమం వైపున దిగువ కోట ప్రధాన ద్వారం, తూర్పు వైపున రాతి దర్వాజా, కోట చుట్టూ 60 ఫిరంగులను మోహరించే వీలుంది. కోటలోపల జాఫరుద్దౌలా కాలంలో నిర్మించిన ఒక పాత మసీదు, మహల్ ఉన్నాయి. 60 అడుగులు పొడవు, 20 అడుగుల వెడల్పు ఉన్న జాఫర్‌టౌలి అనే బావి కూడా ఉంది. కోటపై ముట్టడి జరిగినప్పుడు తప్పించుకోవడానికి ఒక రహస్య సొరంగం కూడా ఉంది. (చదవండి: ఆ పంట సాగుచేస్తే రైతు బంధు, రైతు బీమా కట్.. కేసీఆర్ కీలక ఆదేశాలు) -
మళ్లీ తెరపైకి ‘మల్కాపూర్’!
సాక్షి, హైదరాబాద్: దేవాదుల ప్రాజెక్టులో మల్కాపూర్ వద్ద అదనపు రిజర్వాయర్ నిర్మిం చాలన్న ప్రతిపాదన మళ్లీ తెరపైకి వచ్చింది. గోదావరి జలాల సమర్థ వినియోగం, గరిష్ట నీటిలభ్యతే దీని లక్ష్యం. మూడేళ్ల కిందటే దీనికి పరిపాలనా అనుమతులు ఇచ్చినా, టెండర్ల ప్రక్రియ పూర్తి అయినా కరోనా పరిస్థి తుల కారణంగా మూలనపడింది. ఈ రిజ ర్వాయర్ పనులను మళ్లీ మొదలు పెట్టాలని తాజాగా ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజాప్రతిని ధులంతా కోరుతున్నారు. సీఎం కేసీఆర్ గ్రీన్‌సిగ్నల్ ఇస్తేనే ఈ రిజర్వాయర్ పనులు కొనసాగించే అవకాశముండటంతో త్వరలోనే ఆయన్ను కలిసేందుకు ప్రయత్నిస్తున్నారు. అరవై టీఎంసీల నీటిని వినియోగించుకుం టూ 6.21 లక్షల ఎకరాల మేర ఆయకట్టుకు నీరిచ్చేలా దేవాదుల ప్రాజెక్టును చేపట్టిన విషయం తెలిసిందే. దీనిలో మొత్తంగా 17 రిజర్వాయర్లు ఉన్నప్పటికీ వాటి సామర్థ్యం కేవలం 8 టీఎంసీలు మాత్రమే. ఈ నేపథ్యం లో అదనపు నీటినిల్వలకుగాను వరంగల్ జిల్లా ఘనపూర్ మండలం లింగంపల్లి– మల్కాపూర్ వద్ద 10.78 టీఎంసీల సామ ర్థ్యం, రూ.3,227 కోట్ల వ్యయంతో రిజర్వా యర్ నిర్మించాలని నిర్ణయించి 2018 ఏప్రిల్ లో రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా అనుమతులు ఇచ్చింది. గోదావరికి వరద ఉండే 3 నెలల కాలంలో ధర్మసాగర్ నుంచి నీటిని రిజర్వాయర్‌లోకి ఎత్తిపోసేలా దీన్ని డిజైన్ చేసింది. దీని వల్ల 4,060 ఎకరాలకు ముంపు ఉంటుందని అధికారులు తేల్చారు. నీటిని ఎత్తిపోసేందుకు ఏటా రూ.67.55 కోట్ల వరకు విద్యుత్ ఖర్చు ఉంటుందని అంచనా వేశారు. రిజర్వాయర్‌ను రెండున్నరేళ్లలో పూర్తి చేసేలా ఎన్నికలకు ముందు ఈ పనులను రెండు ప్యాకేజీలుగా విభజించి టెండర్ల ప్రక్రియ సైతం పూర్తి చేసింది. అయితే ఒప్పందాలు చేసుకొని పనులు మొద లుపెట్టాల్సిన సమయంలో కోవిడ్–19 వచ్చి పడింది. ద్రవ్యోల్బణం, కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఆర్థిక పరిస్థితి మెరుగ్గా లేకపోవడం, నిర్మాణంలోని ఇతర ప్రాజెక్టులకే భారీ నిధుల అవసరాలుం డటంతో ఈ పనులను మొదలు పెట్టలేదు. మూడేళ్లుగా అస్పష్టతే.. మూడేళ్లుగా పనులు మొదలుకాకపో వడంతో ఈ రిజర్వాయర్‌ను పూర్తిగా పక్కన పెట్టారని భావించినా, రెండ్రో జుల కిందట జరిగిన ఉమ్మడి వరంగల్ సమావేశంలో జిల్లా మంత్రులు, ఎమ్మె ల్యేలు ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 ని యోజకవర్గాల తాగు, సాగు అవసరా లను తీర్చే రిజర్వాయర్ నిర్మాణం మొద లు పెట్టాలని ఈ భేటీలో మంత్రులు సహా నేతలందరూ సీఎంవో కార్యదర్శి స్మితా సభర్వాల్‌కు విన్నవించారు. -
ప్రాణాలు తీసిన మధ్యవర్తిత్వం
పరకాల: ఉద్యోగాల కోసం చేసిన మధ్య వర్తిత్వం భార్యాభర్తలను బలి తీసుకుంది. ఓవైపు బాధితుల ఒత్తిడి.. మరోవైపు డబ్బు తీసుకున్న వారి బెదిరింపులకు తట్టుకోలేక మానసికంగా కుంగిపోయారు. 4 రోజుల కింద కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సెల్ఫీవీడియో తీసుకున్నారు. ఈ ఘటన వరంగల్ రూరల్ జిల్లా పరకాల పట్టణంలో శుక్రవారం జరిగింది. వరంగల్ రూరల్ జిల్లా దుగ్గొండి మండలం పొనకల్‌కు చెందిన తాళ్లపల్లి కేశవస్వామి(53) పెస్టిసైడ్స్ కంపెనీలో పనిచేసేవాడు. సినీపరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా అవకాశాలు రావడంతో ఎనిమిదేళ్ల నుంచి హైదరాబాద్‌లో నివసి స్తున్నాడు. వీరికి కుమారుడు నిఖిల్, కుమార్తె చందనప్రియ. నిఖిల్ మానసిక వికలాంగుడు. ఈ క్రమంలో ఉమ్మడి వరంగల్‌కు చెందిన విద్యుత్ శాఖ రిటైర్డ్ ఉద్యోగి పుల్లాబాయ్తో పాటు వాల్ నాయక్, గాడిపల్లి వెంకటేశ్‌లు కేశవస్వామికి పరిచయమయ్యారు. సబ్‌స్టేషన్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామని, నిరు ద్యోగులు ఉంటే తెలపాలని కేశవస్వామికి చెప్పడంతో పరిచయం ఉన్న వ్యక్తుల నుంచి సుమారు రూ.80 లక్షలు వసూలు చేసి వారి చేతుల్లో పెట్టాడు. డబ్బు ఇచ్చి ఏళ్లు గడుస్తున్నా ఉద్యోగాలు రాకపోవడంతో తమ డబ్బు ఇవ్వాలని బాధితులు ఒత్తిడి చేయడం మొదలు పెట్టారు. దీంతో కేశవస్వామి పలు మార్లు పుల్లాబాయ్, వాల్‌నాయక్, వెంక టేశ్‌ను డబ్బులివ్వాలంటూ కోరినా తిరిగి బెదిరిం పులకు పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో బాధితులను నచ్చజెప్పలేక.. బెదిరింపులను తట్టుకోలేక కేశవస్వామి కుమిలిపోతున్నాడు. మకాం మార్చినా ఆగని వేధింపులు బాధితుల ఒత్తిడి తట్టుకోలేక కుటుంబంతో సహా హన్మకొండకు మకాం మార్చాడు. అయినా సమస్య పరిష్కారం కాలేదు. దీంతో చనిపోదామనుకుని హన్మకొండలో అద్దెకు ఉంటున్న గదిలో భార్య, పిల్లలతో కలసి సెల్ఫీ వీడియో తీసుకున్నారు. దాన్ని వరం గల్ పోలీస్ కమిషనర్‌కు, మిత్రులకు పం పాడు. గురువారం స్థానిక బంగారం దుకా ణంలో కొంత బంగారాన్ని తాకట్టుపెట్టి వచ్చిన డబ్బుతో పురుగుల మందు కొని చర్చిలో ప్రార్థనలు చేశారు. భార్యాపిల్లలను అక్కడే ఉంచి కేశవస్వామి బయటకు వెళ్లాడు. అయితే సంధ్యారాణి (50) రాత్రి 10 గంటల సమయంలో బ్యాగులో ఉన్న పురుగుల మందు తాగడంతో స్థానికులు పరకాల సివిల్ ఆస్పత్రికి తరలించి కేశవస్వామికి సమాచారం ఇచ్చారు. అతడు ఆస్పత్రి చేరుకునేలోపే ఆమె మృతి చెందడంతో కేశవస్వామి కూడా అక్కడే మిగిలిన మందు తాగాడు. అపస్మారక స్థితికి చేరుకున్న అతన్ని 108 వాహనం ద్వారా వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు. కాగా, మరో సూసైడ్ నోట్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేశవస్వామి , సంధ్యారాణి(ఫైల్) పాకాలలో చనిపోదామనుకున్నారా? 4 రోజుల కింద వీరంతా పాకాలకు వెళ్లినట్లు సమాచారం. బిర్యానీలో పురుగుల మందు కలుపుకొని తాగుదామనుకున్నా.. ఆ నిర్ణయాన్ని విరమించుకున్నట్లు తెలిసింది. కాగా, సంధ్యారాణి పురుగుల మందు తాగిన సమయంలో పిల్లలు అక్కడే ఉన్నారు. వారు మానసికంగా సరిగా లేకపోవడం, ఏది తాగాలో తెలియక ఉండిపోవడంతో ప్రాణాలతో బయటపడినట్లు స్థానికులు తెలిపారు. -
మెదడులో రక్తం గడ్డకట్టి.. ప్రాణాపాయ స్థితిలోకి..
గీసుకొండ : గ్రేటర్ వరంగల్ 16వ డివిజన్ ధర్మారానికి చెందిన హమాలీ కార్మికుడు దొండ అనిల్‌యాదవ్‌కు వారం రోజుల క్రితం కరోనా లక్షణాలు కనిపించడంతో వరంగల్ లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేరగా పరీక్షలు చేయగా పాజిటివ్ వచ్చిందని తేలింది. గతంలో తలకు దెబ్బ తగలటంతో వైరస్ కారణంగా ఆ సమస్య తిరగదోడి మెదడులో రక్తం గడ్డకట్టిందని వైద్యులు చెప్పినట్లు బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. ఇప్పటికే చికిత్స నిమిత్తం అప్పులు చేసి రూ.8 లక్షల వరకు ఖర్చు చేశాం.. మెదడుకు ఆపరేషన్ చేయడానికి రూ. 3 లక్షల అవుతుందని వైద్యులు చెబుతున్నారు.. దాతలు సాయం చేసి తన భర్త ప్రాణాలు కాపాడాలని అనిల్‌యాదవ్ భార్య మహేశ్వరి వేడుకుంటున్నారు. వీరికి ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. సాయం చేయదలుచుకున్న దాతలు 93900 16564 నంబర్లో సంప్రదించాలని మహేశ్వరి అభ్యర్థించారు. చదవండి: ఎంజీఎం: ఒకరు కన్నుమూస్తేనే మరొకరికి బెడ్ -
వివాహేతర సంబంధం; ఇద్దరు ఆత్మహత్య..
సాక్షి, వరంగల్: వరంగల్ అర్బన్ జిల్లాలోని దేవునూర్ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. గామ్రంలోని పెద్దజాలుగుంట వద్ద ఇద్దరు వ్యక్తులు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. వివరాలు.. జిల్లాలోని ధర్మసాగర్ మండలం దేవునూర్ గ్రామంలోనీ పెద్దజాలుగుంట వద్ద ఇద్దరు వ్యక్తులు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేస్తున్నారు. మృతి చెందిన వారు బాకాటి సుమన్(35), ముల్కనూరు చెందిన సుంచు మాధవి(35)గా పోలీసులు గుర్తించారు. అయితే వీరి ఆత్మహత్యకు వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సుమన్, మాధవికి వరసకు అల్లుడు అవుతాడని తెలుస్తోంది. -
డబ్బు కోసం మేనత్త హత్య
సాక్షి, వరంగల్: మత్తు పదార్థాలు, జల్సాలకు అలవాటు పడి వాటికి అవసరమైన డబ్బు కోసం ఆశ్రయం కల్పించిన మేనత్తను హత్య చేసిన నిందితుడితో పాటు ఆయనకు సహకరించిన మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. దీంతో హన్మకొండ టైలర్ స్ట్రీట్‌లో ఇటీవల జరిగిన వివాహిత హత్య కేసులో మిస్టరీ వీడినట్లయింది. ఈ మేరకు హన్మకొండలోని పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో నిందితుల వివరాలను సీపీ ప్రమోద్‌కుమార్ వెల్లడించారు. భర్త మరణంతో కూరగాయల వ్యాపారం హన్మకొండ టైలర్ స్ట్రీట్‌కు చెందిన దోర్నం శారద(38) భర్త మరణించడంతో కుమారుడు అఖిల్, కుమార్తెతో ఉంటూ కూరగాయల వ్యాపారం చేస్తోంది. కుమార్తె హైదరబాద్‌లో ఇంజనీరింగ్ చదువుతుండగా, అఖిల్ తల్లి దగ్గర ఉంటూ ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. ఈ క్రమంలో వరంగల్ ఎస్‌ఆర్‌ఎఆర్ తోటకు చెందిన అడెపు ఆకాశ్‌బాబు గంజాయి సేవిస్తూ మత్తు› పదార్థాలకు బానిస కావడంతో తల్లిదండ్రులు ఇంట్లో నుంచి గెంటి వేశారు. ఈ క్రమంలో మృతురాలు శారద తన అన్న కుమారుడైన ఆకాశ్‌బాబుకు తన ఇంట్లో సుమారు 15 రోజుల పాటు ఆశ్రయం కల్పించింది. ఈ సందర్భంగా ఆమె కూరగాయల వ్యాపారం ద్వారా వచ్చే డబ్బుతో పాటు కూతురు పెండ్లి కోసం పొదుపు చేస్తున్న డబ్బు, బంగారాన్ని బీరువాలో పెట్టడాన్ని గమనించాడు. ఇదే సమయంలో చెడు వ్యసనాలకు డబ్బు దొరకపోవడంతో ఈ నెల 3న తెల్లవారుజామున ఉదయం 3 గంటలకు శారద ఇంట్లోకి చొరబడ్డాడు. శారదపై బండ రాయి వేసి హత్య చేసిన ఆయన పక్కనే నిద్రిస్తున్న ఆమె కుమారుడు అఖిల్‌పై కూడా హత్యాయత్నం చేశాడు. ఆ తర్వాత బీరువాలోని డబ్బులో కొంత, బంగారం తీసుకుని దీనిని ప్రమాదంగా చితత్రీకరించేందుకు కొన్ని డబ్బులు ఉంచి వారిపై బీరువా పడవేసి పరారయ్యాడు. అయితే, కేసులో ఎలాంటి క్లూ లభించకపోవడంతో సెంట్రల్ జోన్ ఇన్చార్జ్ డీసీపీ కె.పుష్ప, హన్మకొండ ఏసీపీ జితేందర్‌రెడ్డి ఆధ్వర్యాన మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. నిందితుడికి ఇద్దరి సహకారం హత్య అనంతరం ప్రధాన నిందితుడు ఆకాశ్‌బాబుకు ఓ బాల నేరస్తుడితో పాటు యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లికి చెందిన మేకల మచ్చేందర్ సహకరించారు. ఈ మేరకు చోరీ చేసిన సొత్తులో నుంచి బాల నేరస్తుడికి రూ.51 వేలు, మచ్చేందర్‌కు రూ1.5 లక్షలు ఇవ్వగా వారు ఆశ్రయం కల్పించారు. కేసు విచారణలో భాగంగా అధునాతక సాంకేతిక పరిజ్ఞానంతో పాటు సీసీ కెమెరాల పుటేజీ ఆధారంగా నిందితులను బుధవారం కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఆకాశ్‌బాబు నుంచి రూ.69,900తో పాటు బంగారు ఆభరణాలతో పాటు మిగతా వారి నుంచి కూడా కలిపి రూ.2.7 లక్షలు, మూడు సెల్ఫోన్లు స్వాదీనం చేసుకున్నారు. కాగా, మిల్స్‌కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో సీసీ కెమెరాలు పగులగొట్టిన ఘటనలో ఆకాశ్‌పై గతంలో కేసు నమోదైంది. ఈ మేరకు కేసును చేధించడంలో ప్రతిభ కనపరిచిన సెంట్రల్ జోన్ ఇన్చార్జ్ డీసీపీ పుష్ప, హన్మకొండ ఏసీపీ జితేందర్‌రెడ్డి, సుబేదారి, సీసీఎస్ ఇన్స్పెక్టర్లు అజయ్‌కుమార్, శ్రీనివాస్‌రావు, హన్మకొండ, సుబేదారి సబ్ ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్‌యాదవ్, వేణుగోపాల్‌తో పాటు సిబ్బంది సీపీ ప్రమోద్‌కుమార్ అభినందించారు. -
కన్న తల్లిపై ఉపాధ్యాయుడి దాడి..
సాక్షి, పరకాల: చిన్న కుమారుడికి దక్కాల్సిన భూమి వాటాపై ప్రశ్నినందుకు కన్న తల్లినే చితకబాదారు ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడితోపాటు కుటుంబ సభ్యులు. ఈ సంఘటన వరంగల్ రూరల్ జిల్లా పరకాల మండలం సీతారాంపూర్‌లో సోమవారం చోటుచేసుకుంది. దాడిపై పరకాల ఏసీపీ శ్రీనివాస్‌కు ఫిర్యాదు చేసినట్లు బాధితురాలు నల్లెల సుశీల తెలిపింది. ఆమె కథనం ప్రకారం.. సీతారాంపూర్ గ్రామానికి చెందిన నల్లెల సూరయ్యకు ముగ్గురు సంతానం. వారికి 7.28 ఎకరాల భూమి ఉండగా కూతురుకు ఎకరం రాసిచ్చారు. సుశీల పేరుపై ఎకరం ఉంది. మిగిలిన భూమిని ఇద్దరు కుమారులు సమానంగా పంచుకోవాల్సి ఉండగా పెద్ద కుమారుడు నల్లెల రవీందర్ ఎక్కువ తీసుకున్నాడు. దీంతో చిన్న కుమారుడైన శ్రీధర్ తన వాటాకు రావాల్సిన మిగతా భూమి కోసం అన్నతో పోరాడుతున్నాడు. ఈ విషయంలో చిన్న కుమారుడికి సుశీల అండగా నిలిచింది. దీంతో తల్లిపై కోపం పెంచుకున్న రవీందర్ పత్తి చేను వద్ద పనిచేస్తున్న తల్లిపై భార్యతో కలిసి దాడి చేశాడు. ఈ దాడిలో వృద్ధురాలి చేతికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న చిన్న కుమారుడు శ్రీధర్ చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించాడు. కాగా, దాడికి సంబంధించిన వీడియోతో ఏసీపీ శ్రీనివాస్‌కు ఫిర్యాదు చేసినట్లు బాధితురాలితోపాటు శ్రీధర్ తెలిపారు. కొందరు స్థానిక పోలీసు అధికారుల అండతో దాడులకు పాల్పడుతున్నాడని జూలై 28న సీఎం కేసీఆర్‌కు, వరంగల్ పోలీస్ కమిషనర్‌కు కూడా ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. -
కార్యదర్శి, సర్పంచ్ భర్త బాహాబాహీ..
సాక్షి, రఘునాథపల్లి: అభివృద్ధి పనుల్లో జాప్యంపై సర్పంచ్ భర్త, పంచాయతీ కార్యదర్శి పరస్పరం దాడి చేసుకున్నారు. నిధులు డ్రా చేసి పనులు చేయకపోవడంపై నిలదీసినందుకు తనపై దాడి చేశాడని కార్యదర్శి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, తనపై అసత్య ప్రచారం చేస్తూ తననే దుర్భాషలాడి దాడి చేశాడని సర్పంచ్ భర్త కూడా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కాగా, ఈ ఘటన జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం భాంజీపేట గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. భాంజీపేట గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రీరంగరెడ్డి, సర్పంచ్ గొరిగె భాగ్య భర్త రవి మధ్య నిధుల విడుదల, తడి పొడి చెత్త వేరు చేసేందుకు సెగ్రిగేషన్ షెడ్డు నిర్మాణంలో జాప్యంపై వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో మాటామాట పెరిగి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. సెగ్రిగేషన్ షెడ్డు నిర్మాణం కోసం రూ.1.14 లక్షల నిధులను పంచాయతీ ఖాతా నుంచి డ్రా చేశారని, ఇప్పటికి షెడ్డు నిర్మించకపోవడంతో అధికారులు తనను ప్రశ్నిస్తున్నారని పంచాయతీ కార్యదర్శి పేర్కొన్నాడు. అధికారులకు సమాధానం చెప్పలేక సర్పంచ్ భర్త రవిని అడిగానని, దీంతో తననే ప్రశ్నిస్తావా అని చొక్కా చింపి దాడి చేశాడని కార్యదర్శి అంటున్నాడు. కాగా, ఇవే విషయాలను ప్రస్తావిస్తూ కార్యదర్శి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఇదిలా ఉంటే పంచాయతీ నిధులు దుర్వినియోగం చేస్తున్నానని, సీసీ రోడ్డు నాణ్యత లేదని గ్రామంలో తనపై దుష్పచారం చేస్తూ కార్యదర్శి అవమానిస్తున్నాడని సర్పంచ్ భర్త రవి చెబుతున్నాడు. సెగ్రిగేషన్ షెడ్ నిర్మాణానికి అడ్వాన్స్‌గా పంచాయతీ నిధులు తీసుకున్న మాట వాస్తవమేనన్నారు. ఈ విషయమై తాను నెమ్మదిగా సమాధానం చెబుతున్నా వినకుండా తననే దుర్మషలాడుతూ చేయిచేసుకోవడంతో రక్తస్రావం జరగడంతో తాను పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు రవి పేర్కొన్నాడు. అయితే, సర్పంచ్ భర్త రవి, పంచాయతీ కార్యదర్శి శ్రీరంగరెడ్డి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా ఇరువురిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కందుల అశోక్‌కుమార్ తెలిపారు. -
ప్రైమరీ కాంటాక్ట్‌లో తొలి కరోనా కేసు
సాక్షి, హన్మకొండ: కరోనా వైరస్ బారిన పడిన వారిలో ఒక్కొక్కరూ కోలుకుంటున్నారనే సమాచారంతో కాస్త ఊపిరి పీల్చుకుంటున్న జిల్లాకు పిడుగులాంటి వర్త వచ్చి పడింది. మొదట పాజిటివ్ కేసులుగా నమోదైన వారికి అత్యంత సమీపంగా మెలిగిన వారిలో ఒకరికి పాజిటివ్ రిపోర్టు వచ్చింది. దీంతో జిల్లా యంత్రాంగం ఉలిక్కిపడింది. జిల్లాలో మొదట మర్కజ్ నుంచి వచ్చిన వారిలో 23 మందిని పరీక్షించగా పాజిటివ్ అని తేడంతో హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి పంపించారు. అనంతరం వారి బంధువులు, దగ్గరి వారు సుమారు 241 మందిని గుర్తించి నగరంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ క్వారంటైన్ కేంద్రాలకు తరలించారు. సుమారు వారం రోజుల పాటు పరీక్షలు నిర్వహించిన అధికారులు దశలవారీగా వచ్చిన రిపోర్టుల్లో 240 మందిని నెగెటివ్‌గా ప్రకటించారు. పెండింగ్‌లో ఉన్న ఒక్క కేసు ఆదివారం పాజిటివ్‌గా రావడంతో యంత్రాంగం తదుపరి చర్యలకు అప్రమత్తమైంది. ప్రభుత్వ క్వారంటైన్లో నలుగురు ప్రస్తుతం జిల్లాలో అధికారిక సమాచారం ప్రకా రం నలుగురు మాత్రమే ప్రభుత్వ క్వారంటైన్లో ఉన్నారు. అలాగే 797 మంది హోం క్వారంటైన్లో వైద్య సిబ్బంది అబ్జర్వేషన్లో ఉన్నారు. మర్కజ్‌కు వెళ్లిన వారికి సంబంధించి ప్రైమరీ కాంటాక్టŠస్ కలిగిన 240 మందికి నెగెటివ్ రిపోర్టు వచ్చింది. ఇప్పటి వరకు జిల్లాలో 22 పాజిటివ్ కేసులు ఉండగా.. కొత్త కేసుతో 23కు చేరింది. కాగా విదేశాల నుంచి వచ్చిన 814 మంది హోంక్వాంటైన్ పూర్తయిందని అధికారులు వెల్లడించారు. ఇప్పటికే ఆంక్షలు ప్రస్తుతం పాజిటివ్ కేసు నమోదై ఉన్నందున కంటోన్మెంట్ ఏరియాగా ఉన్న సుబేదారి ప్రాంతంలో ప్రస్తుతం కొత్త కేసు నమోదు కావడంతో ఆ ప్రాంతంలో సదరు వ్యక్తి ఎవరెవరిని కలిశారన్నదానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. అతడితో సన్నిహితంగా మెలిగిన వారినికూడా గుర్తించి ప్రభుత్వ క్వారంటైన్‌కు తరలించి పరీక్షలు చేయించే అవకాశం ఉంది. 15 నో మూమెంట్ జోన్లు మర్కజ్‌కు వెళ్లి వచ్చిన వారిలో 23 మందిని గుర్తించి హైదరాబాద్ తరలించిన అధికారులు తరువాత వారి బంధువులను ప్రభుత్వ క్వారంటైన్లో ఉంచడంతో పాటు వారి నివాస ప్రాంతాలు మొత్తం నో మూమెంట్ జోన్లు, కంటోన్మెంట్ జోన్లుగా ప్రకటించారు. ఆ ప్రాంతాల నుంచి ఎవ్వరూ బయటకు రావద్దని, ఇతర ప్రాంతాల వారు ఆ ప్రాంతాల్లోకి వెళ్లవద్దని ఆదేశాలు జారీ చేశారు. ఒక్కో పాజిటివ్ కేసు నివాస ప్రాంతం నుంచి మూడు కిలోమీటర్ల పరిధిలో ఇంటింటి సర్వే చేశారు. ప్రతీ ఒక్కరి ఆరోగ్యవివరాలు నమోదు చేసుకుని నిత్యం రెండు సార్లు పర్యవేక్షిస్తున్నారు. ఎవరూ బయటకు రాకుండా నిత్యావసరాలు, పాలు వంటివి ఇళ్లకే తెచ్చిస్తున్నారు. -
పెండింగ్ అంటే గిట్టదు!
వరంగల్ అర్బన్ : పెండింగ్ అంటే తనకు ఏ మాత్రం గిట్టదని.. నిబంధనల మేరకు పైళ్లను ఎప్పటికప్పుడు పరిష్కరించాల్సిందేనని గ్రేటర్ వరంగల్ కమిషనర్ పమేలా సత్పతి స్పష్టం చేశారు. వరంగల్ మహా నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కమిషనర్ చాంబర్లో శనివారం ఆమె టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు, ఉద్యోగులతో సమావేశమయ్యా రు. టౌన్ ప్లానింగ్‌కు సంబంధించిన భవన నిర్మాణాలు, ఫైళ్లు, అపార్టుమెంట్లు, ల్యాండ్ యూసేజ్, మార్టిగేజ్, అడ్వర్టజ్మెంట్ ఫీజుల తదితర అంశాలపై ఇన్చార్జ్ సీపీ నర్సింహ రా ములు, ఏసీపీలు గణపతి, ప్రకాశ్‌రెడ్డితో ఆరా తీశారు. పైళ్ల పరిష్కారానికి ఆన్లైన్ ఉపయోగిస్తున్నందున జాప్యం ఉండకూడదన్నారు. ప్రకటన బోర్డుల ఏర్పాటులో కఠినంగా వ్యవహరించాలని, అనధికార భవనాల వివరాలను డివిజ న్ల వారీగా అందచేయాలన్నారు. ఏసీపీ సాంబయ్య, టీపీఎస్ బషీర్, టీపీబీఓలు పాల్గొన్నారు. తనిఖీలతో హల్చల్! కమిషనర్ పమేల సత్పతి తనిఖీలతో అధికారులు, సిబ్బందిని పరుగులు పెట్టించారు. ఎవరికీ సమాచారం ఇవ్వకుండా శనివారం ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం నగరంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించారు. పారిశుధ్ధ్యం పనులెలా సాగుతున్నాయి.. ఇంటింటా తడి, పొడి చెత్త సేకరణ తీరుపై ఆరా తీశారు. గ్రేటర్ పరిధిలోని 40, 43 డివిజన్లలో పర్యటన సందర్భంగా ఇళ్ల ఎదుట, రోడ్ల మీద చెత్త ఉండడంతో స్థానికులను మందలించారు. అలాగే, డ్రెయినేజీలు, ఖాళీ స్థలాల్లో చెత్త పేరుకపోవడంపై శానిటరీ ఇన్స్పెక్టర్లు అనిల్ కుమార్, నరేందర్‌ను కమిషనర్ మందలించారు. ఆర్అండ్బీ భవనంలో మద్యం ఖాళీ బాటిళ్లు, చెత్త చెదారం ఉండడాన్ని గుర్తించిన ఆమె అసహనం వ్యక్తం చేశారు. స్థానిక కార్పొరేటర్ మిర్యాలాకర్ దేవేందర్ కమిషనర్ తనిఖీ చోటకు చేరుకొని పలుసమస్యలను వివరించారు. దీంతో శిథిలావస్థకు చేరిన చోట నూతన డ్రెయిన్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఏఈ సారంగంను కమిషనర్‌ను ఆదేశించారు. ఇక వరంగల్ బల్దియా ప్రధాన కార్యాలయం ఆవరణలోని షీ–టాయిలెట్‌ను కమిషనర్ పరిశీలించి నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే, ఫాతిమా నగర్లో పబ్లిక్ టాయిలెట్‌ను పరిశీలించారు. వడ్డేపల్లి బండ్ తనిఖీ సందర్భంగా పిచ్చిమొక్కలు పెరగడాన్ని గుర్తించిన కమిషనర్ సీహెచ్ఓ సునీతను ప్రశ్నించారు. తాను సెలవులో ఉన్నానని చెప్పగా.. మరొకరికి బాధ్యతలు అప్పగించాలే తప్ప పనులు పెండింగ్‌లో ఉంచొద్దన్నారు. డీఈలు సంతోష్‌కుమార్, రవికిరణ్ పాల్గొన్నారు. -
‘మహాబలి‘ సినిమాలో స్థానికులకు అవకాశాలు : డైరెక్టర్ రోహిత్
దామెర: స్థానిక కళాకారులను ప్రోత్సహించి సినిమాలో అవకాశం కల్పిస్తున్నట్లు మహాబలి సినిమా డైరెక్టర్ రోహిత్ గురువారం తెలిపారు. మహాబలి చిత్రం యునిట్ మండలంలోని పులుకుర్తి గ్రామంలో గత నాలుగు రోజులుగా సందడి చేస్తుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డైరెక్టర్ మాట్లాడారు. ఎస్ఆర్ ఫిలిం మేకర్స్ బ్యానర్‌పై సన్నీ నిర్మాతగా, ప్రధాన తారాగణం రాధాకృష్ణ, మిత్రలు నటిస్తున్నట్లు పేర్కొన్నారు. జనవరి 9 ప్రముఖ డైరెక్టర్ చేతుల మీదుగా పోస్టర్ ఆవిష్కరణ, 10న ప్రముఖ హీరో చేతుల మీదుగా టీజర్‌ను విడుదల చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో అసోసియేట్ డైరెక్టర్ నిరంజన్, సురేందర్, వర్మ, బాలు, సర్పంచ్ గోవిందు అశోక్, రైతు సమన్వయ సమితి మండల డైరెక్టర్ ముదిగొండ క్రిష్ణమూర్తి, సినిమా యునిట్ సభ్యులు పాల్గొన్నారు. -
ఓరుగల్లులో మెట్రో పరుగులు!
సాక్షి, వరంగల్: అన్నీ అనుకూలిస్తే చారిత్రక ఓరుగల్లులోనూ హైదరాబాద్ మాదిరిగా మెట్రో రైలు పరుగులు తీయనుంది. ట్రై సిటీని అనుసంధానిస్తూ నిర్మించనున్న మెట్రో నియో రైలు ప్రతిపాదనలపై అధికార యంత్రాంగం దృష్టి కేంద్రీకరించింది. రాష్ట్ర పట్టణాభివృద్ధి, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ ఇటీవల వరంగల్ మెట్రో రైలు ప్రాజెక్టుపై మహా మెట్రో ఉన్నతధికారులతో సమావేశమై చర్చించారు. మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు హైదరాబాద్‌కు చెందిన మహా మెట్రో, హెచ్ఎండీఎ అధికారుల బృందం బుధవారం వరంగల్ నగరాన్ని సందర్శించింది. మెట్రో రైలు ప్రతిపాదన మార్గాలు, డీపీఆర్ తయారీ తదితర అంశాలపై ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో సమీక్షించారు. మెరుగైన రవాణా కోసం వరంగల్ నగరం రోజురోజుకు విస్తరిస్తోంది. అయితే, ప్రజారవాణా వ్యవస్థలో భాగంగా ఆర్టీసీ సిటీ బస్సులు తగినన్ని లేవనే చెప్పాలి. దీంతో ప్రజలు ఎక్కువగా ఆటోలు, సొంత వాహనాలనే వినియోగిస్తున్నారు. తెలంగాణలో హైదరాబాద్ తర్వాత అతి పెద్ద నగరమైన వరంగల్లోనూ మెట్రో రైలు ప్రాజెక్టు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించగా మంత్రి కేటీఆర్ ఆదేశాలతో అధికారులు రంగంలోకి దిగారు. ఈ మేరకు హెచ్ఎండీఏ ట్రాన్స్పోర్ట్ హెడ్ విజయలక్ష్మి, హెచ్ఎండీఏ డిప్యూటీ డైరెక్టర్ ఎస్కే సిన్హా, ‘కుడా’ ప్లానింగ్ అధికారి అజిత్ రెడ్డితో కలిసి బుధవారం క్షేత్ర స్థాయిలో అధ్యయనం చేశారు. కాజీపేట రైల్వేస్టేషన్ నుంచి పెట్రోల్ పంపు, హన్మకొండ చౌరస్తా, మలుగు రోడ్డు, ఎంజీఎం సెంటర్, పోచమ్మ మైదాన్, కాశిబుగ్గ, వెంకట్రామ జంక్షన్ మీదుగా వరంగల్ రైల్వేస్టేషన్ వరకు, అక్కడి నుంచి వరంగల్ స్టేషన్ రోడ్డు మీదుగా చౌరస్తా జేపీఎన్ రోడ్డు మీదుగా పోచమ్మ మైదాన్ వరకు ప్రధాన రహదారిని మెట్రో ప్రాజెక్టుకు సంబంధించి పరిశీలించి వివరాలు ఆరా తీశారు. మూడు కేటగిరీలపై చర్చ ట్రైసిటీలో మెట్రో ప్రాజెక్టు నిర్మాణ ప్రతిపాదనలపై పర్యవేక్షించాక అధికారుల బృందం... జిల్లా కలెక్టరేట్లో సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, గ్రేటర్ వరంగల్ మేయర్ గుండా ప్రకాశ్‌రావు, ‘కుడా’ చైర్మన్ మర్రి యాదవరెడ్డితో పాటు బల్దియా ‘కుడా’ అధికారులు పాల్గొన్నారు. మహా మెట్రో, హెచ్ఎండీఏ అధికారులు మెట్రో ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరాలను వెల్లడించారు. కేంద్ర పట్టణ గృహ నిర్మాణ మంత్రిత్వ శాఖ, మహారాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఇటీవల నాసిక్‌లో మెట్రో ప్రాజెక్టు పనులు ప్రారంభించిందని తెలిపారు. ఈ మేరకు న్యూ మెట్రో నియో ప్రాజెక్టు కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 50:50శాతం నిధులు సమకూర్చుకోవాల్సి ఉంటుందని చెప్పారు. అలాగే పబ్లిక్, ప్రైవేట్, పార్ట్నర్ షిప్(పీపీపీ) పద్ధతి, గ్లోబల్ ఫైనాన్సియల్ సంస్థలు నుంచి 60శాతం నిధులను రుణంగా తీసుకోవచ్చని వివరించారు. మిగతా 40శాతం నిధుల్లో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు చెరి సగం వెచ్చించాల్సి ఉంటుంవదని వివరించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ వరంగల్ నగర జనాభా, రహదారుల రద్దీని దృష్టిలో పెట్టుకుని మెట్రో ప్రాజెక్టుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. మెట్రో నియో రైలు మార్గాలు ఇవే... కాజీపేట రైల్వేస్టేషన్ ప్రారంభమై ఫాతిమానగర్, సుబేదారి, నక్కలగుట్ట, అంబేద్కర్ జంక్షన్, పెట్రోల్ పంపు, హన్మకొండ చౌరస్తా, మలుగు రోడ్డు, ఎంజీఎం, పోచమ్మమైదాన్, కాశిబుగ్గ, వెంకట్రామ జంక్షన్ నుంచి వరంగల్ రైల్వే స్టేషన్ వరకు. వరంగల్ రైల్వే స్టేషన్ నుంచి స్టేషన్ రోడ్డు, వరంగల్ చౌరస్తా, జీపీఎన్ రోడ్డు, మండి బజార్, పోచమ్మమైదాన్ వరకు అనుసంధానంగా ప్రాజెక్టు నిర్మిస్తారు. -
50 ఎకరాలు అమ్ముకున్న మంత్రి ఎర్రబెల్లి
కొడకండ్ల : రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తమ కుటుంబానికి సంబంధించిన 50 ఎకరాల భూమిని విక్రయించారు. ఈ మేరకు భూమి కొనుగోలు చేసిన వారికి రిజిస్ట్రేషన్ చేసేందుకు జనగామ జిల్లా కొడకండ్లలోని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయానికి సోమవారం వచ్చారు. పాలకుర్తి మండలం చెన్నూరులోని తన పేరిట ఉన్న భూమిని విక్రయించిన మంత్రి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి రాగా.. సబ్‌రిజిస్ట్రార్ విజయజ్యోతి, ఉద్యోగులు ఆయనను సన్మానించారు. -
నేటి నుంచి మావోయిస్టు పార్టీ వారోత్సవాలు
సాక్షి, కాళేశ్వరం: సీపీఐ (పీపుల్స్‌వార్) విప్లవోద్యమంలో ధ్రువతారలుగా వెలిగిన నాయకులు నల్లా ఆదిరెడ్డి అలియాస్ శ్యాం, ఎర్రంరెడ్డి సంతోష్‌రెడ్డి అలియాస్ మహేష్, శీలం నరేష్ అలియాస్ మురళి ఎన్కౌంటర్లో మరణించి నేటికీ (సోమవారం) 20 ఏళ్లు పూర్తవుతుంది. వీరు భూ స్వామ్య, సామ్రాజ్యవాద నిరంకుశ పాలనకు వ్యతిరేఖంగా పోరాటం చేస్తూ పీపుల్స్‌వాల్ అగ్ర నాయకులుగా ఎదిగారు. 1999 డిసెంబర్ 2న ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రస్తుతం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం కొయ్మూర్ వద్ద జరిగిన ఎన్కౌంటర్లో అసువులు బాసారు. ఈ ముగ్గురు నేలకొరిగిన కొమ్మూర్ ఎన్కౌంటర్ పోలీసులకు పెద్ద విజయం కాగా, పీపుల్స్‌వార్ పార్టీకి చరిత్రలో ఎప్పటికీ మానని నెత్తుటి గాయంగా మిగిలింది. అప్పటి నుంచి పోలీసులు అగ్ర నేతలపై దృష్టి పెట్టి ఏరివేతనే ప్రారంభించారు. అప్పటి నుంచి ఒడిదుడుకులు ఎదుర్కొన్న పీపుల్స్‌వార్ పార్టీ 2004లో మావోయిస్టు పార్టీగా రూపాంతరం చెందింది. అప్పటి నుంచి పూర్తిగా బలహీన ప డుతూ వస్తుంది. రాష్ట్రంలో ఉనికి కోసం తాపత్రయ పడుతూ ఇటీవల కాటారం సబ్ డివిజన్లో పట్టు కోసం ప్రయత్నాలు చేస్తున్న ట్లు సమాచారం. జిల్లాలో మావోయిస్టుల పేరుతో కరపత్రాలతో వేస్తూ ఉనికి చాటుతున్నారు. అమరుల యాదిలోనే.. అగ్రనాయకుల జ్ఞాపకార్థ ఎన్‌కౌంటర్‌అయిన మరుసటి ఏడాది 2000 డిసెంబర్ 2న పీఎల్జీ ఏ (పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ)ను ఏర్పాటు చేశారు. వీరిని స్మరించుకునేందుకు ప్రతియేట డిసెంబర్ 2 నుంచి 8 వరకు మావోయిస్టులు వా రోత్సవాలను నిర్వహిస్తున్నారు. మావోయిస్టు వారోత్సవాలను భగ్నం చేసేందుకు పోలీసులు ప్రత్యేక బలగాలతో గోదావరి తీర ప్రాంతాల్లో నిఘానే పెట్టారు. తెలంగాణ, మహారాష్ట్ర, చత్తీస్ఘడ్ రాష్ట్రాల సరిహద్దులోని గోదావరి, ప్రాణహిత నదులను మావోయిస్టులు దాట కుండా పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. గ్రేహౌండ్స్, సీఆర్పీఎఫ్, జిల్లా గార్డులు కూంబింగ్‌తో పాటు తనిఖీలు చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు భద్రత..మహదేవపూర్ మండలంలో ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులోని లక్ష్మీ, సరస్వతీ బ్యారేజీలతో పాటు లక్ష్మీపంపుహౌస్‌లకు ఇంటిలిజెన్స్ నిఘా విభాగం హెచ్చరికలతో భద్రతను ఏర్పాటు చేసింది. కాళేశ్వరం అంతర్రాష్ట్ర వంతెన వద్ద తనిఖీలు చేస్తున్న పోలీసులు నేటి నుంచి జరిగే మావోయిస్టు వారోత్సవాల నేపథ్యంలో జిల్లా పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. తెలంగాణ, మహారాష్ట్ర, చత్తీస్ఘడ్ రాష్ట్రాల సరిహద్దులోని గోదావరి, ప్రాణహిత నదులను మావోయిస్టులు దాటకుండా పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. మావోలను కట్టడి చేయడానికి గ్రేహౌండ్స్, సీఆర్పీఎఫ్, జిల్లా గార్డులు కూంబింగ్‌తో పాటు తనిఖీలు చేస్తున్నారు. -
కొడుకును తాళ్లతో కట్టేసి..కిరోసిన్ పోసి..
-
కన్న పేగునే కాల్చేశారు
దామెర: మద్యానికి బానిసై ఇంట్లో గొడవలకు కారణమవుతున్న ఓ కొడుకును తల్లిదండ్రులే కడతేర్చారు. ఇంటి ముందు వరండాలో తాళ్లతో కట్టేసి ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పంటించారు. ఈ హృదయ విదారక ఘటన వరంగల్ రూరల్ జిల్లా దామెర మండలం ముస్త్యాలపల్లిలో మంగళవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కడారి ప్రభాకర్, విమల దంపతుల పెద్ద కుమారుడు మహేష్ చంద్ర (42). మహేష్ భార్య రాధికను డబ్బుల కోసం వేధిస్తుండటం, భార్యాభర్తల మధ్య విభేదాలు రావడంతో ఆమె ఇటీవల పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి మహేష్ మద్యానికి బానిసయ్యాడు. దీంతో నిత్యం ఇంట్లో తల్లిదండ్రులతో గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మంగళ వారం రాత్రి మహేష్ మద్యం సేవించి వచ్చి తల్లిదండ్రులతో గొడవకు దిగాడు. కోపోద్రిక్తులైన తల్లిదండ్రులు మహేష్‌ను ఇంటి ముందు వరండాలో తాళ్లతో కట్టేసి ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పంటించారు. స్థానికులు మంటలను ఆర్పి అతడిని కాపాడే ప్రయత్నం చేసినా అప్పటికే సజీవ దహనమయ్యాడు. పరకాల ఏసీపీ శ్రీనివాస్, శాయంపేట సీఐ ఎస్.వెంకటేశ్వర్రావు, ఎస్ఐ యు.భాస్కర్‌రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. నిందితులుగా భావిస్తున్న కడారి ప్రభాకర్, విమలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
మటన్ కత్తితో పిల్లల గొంతు కోసి హత్య
సాక్షి, నర్మెట: కన్నపేగే బిడ్డలపై పాశవికం చూపింది. అతి దారుణంగా మటన్ కోసే కత్తితో గొంతులు కోసి నిద్రించిన మంచంపైనే హత్య చేసింది. ఆపై అదే కత్తితో తానూ గొంతు కోసుకుని ఆత్మహత్నాయత్నానికి పాల్పడింది. ఘటన జనగామ జిల్లా నర్మెట మండలం మల్కపేట శివారు శివబీక్యా తండాలో సోమవారం జరిగింది. అనారోగ్యంతో తల్లిగారింటికి మల్కపేట శివారు శివబీక్యా తండాకు చెందిన గోపాల్‌తో రమకు ఆరేళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి కుమార్తె భానుశ్రీ (4), కుమారుడు వరుణ్ (2.5 ఏళ్లు) ఉన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న రమ తల్లి గారిల్లయిన మల్కపేటకు వెళ్లింది. రమ అనారోగ్యం వల్ల పిల్లలు తండ్రితోనే ఉంటున్నారు. ఇన్నాళ్లూ తల్లిగారింటి వద్దే ఉన్న రమ సోమవారం అత్తవారింటికి వచ్చింది. అత్తామామలు పనికి.. భర్త ఊరికి రమ వచ్చాక అత్తామామలు పొలం పనులకు పోగా, భర్త గోపాల్ పని మీద వేరే ఊరికి వెళ్లాడు. మధ్యాహ్నం రమ పిల్లలకు భోజనం చేయించి నిద్రపుచ్చింది. మటన్ కోసే కత్తితో నిద్రలో ఉన్న పిల్లలిద్దరీ గొంతు కోసి అతి కిరాతకంగా హత్య చేసింది. అనంతరం అదే కత్తితో తానూ గాయపరచుకుని మంచంపైనే పడిపోయింది. సాయంత్రం పొలం నుంచి వచ్చిన అత్తామామలు ఈ దృశ్యాలను చూసి నివ్వెరపోయారు. అప్పటికే పిల్లలిద్దరికీ తీవ్ర రక్తస్రావమై మృతి చెందారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రమను వరంగల్ ఎంజీఎంకు తీసుకెళ్లారు. రమ గత 6 నెలలుగా అనారోగ్యంతో బాధపడుతోందని, దీనికితోడు ఆర్థిక ఇబ్బందులు కూడా ఉండటంతో పిల్లలను చంపి తనూ ఆత్మహత్య చేసుకోవాలని భావించిందని జనగామ సీఐ మల్లేష్ యాదవ్ తెలిపారు. -
బస్సు బస్సుకూ పోలీస్
జనగామ: బస్సు బస్సుకూ పోలీస్ సెక్యూరిటీతో అధికారులు ఆర్టీసీ బస్సులను నడిపారు. రెవెన్యూ, పోలీసు, మోటారు రవాణాశాఖలు సమ్మెతో ప్రయాణికులకు అంతరాయం కలగకుండా బస్సులను నడిపించారు. ఆర్టీసీ సమ్మె మొదటిరోజు ప్రశాంతంగా జరిగింది. సమ్మెతో జిల్లా కేంద్రంలో శనివారం పోలీసులు హై అలర్టు ప్రకటించారు.జిల్లాలో ఆర్టీసీ సమ్మె మొదటి రోజు ప్రశాంతంగా జరిగింది. తెల్లవారు జామున నాలుగు గంటలకే కార్మికులు డిపో వద్దకు చేరుకోగా అప్పటికే పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు చేపట్టారు. ఆర్టీసీ కార్మికులు శాంతియుతంగా నిరసన తెలుపగా 144 సెక్షన్ అమలులో ఉండడంతో వారిని ప్రెస్టన్ మైదానానికి పంపించారు. తాత్కాలిక పద్ధతిలో కండక్టర్లు, డ్రైవర్ల కోసం వచ్చిన యువతీ, యువకులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసి కొంతమేర విజయం సాధించారు. డిపో పరిధిలో ఆర్టీసీకి సంబంధించిన వాటితో పాటు అద్దె బస్సులు అన్నీ కలిపి 125 ఉన్నాయి. ఇందులో 55 ఆర్టీసీ, 12 అద్దె బస్సులు సూర్యాపేట, సిద్దిపేట, పాలకుర్తి, హుస్నాబాద్, ఉప్పల్, హన్మకొండ, జగద్గిరిగుట్ట వైపు నడవగా మారుమూల గ్రామాలకు ఒక్క బస్సు సర్వీసు కూడా వెళ్లలేదు. తాత్కాలిక పద్ధతిలో 64 మంది కండక్టర్లు, డ్రైవర్లను విధుల్లోకి తీసుకున్నారు. అవాంఛనీయ ఘటనలు జరుగుతాయనే ఉద్దేశంతో ముందు జాగ్రత్త చర్యగా పల్లెలకు నిలిపి వేసిన బస్సులతో వందలాది మంది ప్రయాణికులు గంటల తరబడి ప్రైవేట్ వాహనాల కోసం ఎదురు చూశారు. ఆర్టీసీ సమ్మెతో బట్టల, కిరాణ ఇతర దుకాణ వ్యాపారాలపై తీవ్ర ప్రభావం పడింది. రెవెన్యూకు కంట్రోల్ బాధ్యతలు ఆర్టీసీ బస్టాండులో రెవెన్యూ అధికారులు, సిబ్బందికి కంట్రోలర్ బాధ్యతలను అప్పగించారు. తహసీల్దార్ రవీందర్ ఆధ్వర్యంలో వీఆర్వోలు పెండెల శ్రీనివాస్, సంధ్య, క్రాంతి, ఉప్పలయ్య, రాజయ్య, మమత, శ్రీనివాస్ బస్సు సమయ వేళలను చెబుతూ సేవలు అందించారు. బస్టాండ్‌లోనే కలెక్టర్ డీసీపీ శ్రీనివాసరెడ్డి, డీటీఓ రమేష్‌రాథోడ్, డిపో మేనేజర్ భూక్యా ధరమ్ సింగ్, ఏసీపీ వినోద్‌కుమార్‌తో కలిసి కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి ఉదయం ఆరు గంటల నుంచే జనగామ ఆర్టీసీ బస్టాండ్‌లో పరిస్థితిని సమీక్షించారు. కలెక్టర్ బస్టాండ్‌లోనే మకాం వేసి బస్సు సర్వీసుల రవాణాను దగ్గరుండి పర్యవేక్షించారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఇక్కడే ఉన్న కలెక్టర్, డీసీపీ మధ్యాహ్న సమయంలో కలెక్టరేట్‌కు వెళ్లి మళ్లీ వచ్చారు. అమ్మా ఎక్కడికి వెళ్లాలి.. అంటూ అడుగుతూ బస్సు ఎక్కించారు. జనగామ, బచ్చన్నపేట, సిద్దిపేట జిల్లా చేర్యాల లిమిట్స్‌తో పాటు స్టేషన్‌ఘన్‌పూర్, పాలకుర్తి నియోజక వర్గాల శివారు వరకు పోలీసులు బస్సులను సెక్యూరిటీతో నడిపించారు. పళ్లెటూళ్ల సంగతేంటి... ఆర్టీసీ సమ్మెతో గ్రామాలకు బస్సు సర్వీసులు ఎక్కడిక్కడే నిలిచి పోయాయి. హైదరాబాద్, పట్టణాలు, ఆయా నియోజక వర్గ కేంద్రాలతో పాటు పక్క జిల్లాలకు బస్సు సర్వీసులను నడిపించగా పల్లెటూళ్ల సంగతి మరిచిపోయారు. మోత్కూరు, సాల్వాపూర్, నర్మెట, తరిగొప్పుల, కొడకండ్ల, నీర్మాల, పెద్దమడూరు, చిన్నమడూరు, కుందారం, గానుగుపహాడ్, కొడవటూరు, కేశిరెడ్డిపల్లి తదితర గ్రామాలు, శివారు పల్లెకు చెందిన వారు స్వగ్రామానికి చేరుకునేందుకు నానాతంటాలు పడ్డారు. ఒక్కో ప్రైవేట్ వాహనంలో పది నుంచి ఇరవై మంది వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. కార్మికులకు రాజకీయ పార్టీల మద్దతు సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు కాంగ్రెస్, సీపీఎం, టీడీపీ, బీజేపీతో పాటు పలు పార్టీల నాయకులు సంఘీభావం ప్రకటించారు. మాజీ ఎమ్మెల్యే సీహెచ్.రాజారెడ్డి, నాయకులు మోకు కనాకరెడ్డి, నాగారపు వెంకట్, పిట్టల సత్యం, కొంతం శ్రీనివాస్, మహంకాళి హరిశ్చంద్రగుప్త, ఉడుగుల రమేష్, వారనాసి పవన్‌శర్మ, ఎలికట్టె మహేందర్‌గౌడ్, బెడిదె మైసయ్య, సురుగు సతీష్‌గౌడ్, జేరిపోతుల కుమార్, కాంగ్రెస్ జిల్లా వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు లింగాజీ, చెంచారపు శ్రీనివాస్‌రెడ్డి, ధర్మపురి శ్రీనివాస్, శివరాజ్, మోర్తాల ప్రభాకర్, ఆకుల వేణుగోపాల్‌రావు, రంగరాజు ప్రవీణ్ కుమార్ కార్మికులకు సంఘీభావం ప్రకటించారు. వేతనాలు రాలేదు.. ఆర్టీసీ కార్మికులకు సంస్థ ప్రతీ నెల ఐదో తేదీన వేతనాలు అందిస్తుంది. శనివారం వేతనాలు బ్యాంకులో డిపాజిట్ కాకపోవడంతో కార్మికులు ఆందోళనకు గురవుతున్నారు. పండుగ సమయంలో వేతనాలను కట్టిపడేయంతో పస్తుంటుండాల్సిన పరిస్థితి నెలకొందని కార్మికులు గిరిమల్లరాజు, బాలరాజు, ఎల్ఎల్పతి, ఎ.శ్రీనివాస్, సతీష్, శ్రీకాంత్ తదితరులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. -
రక్తమోడిన రహదారులు
దేవరుప్పుల/పరకాల/ఏటూరునాగారం: ఉమ్మడి వరంగల్ జిల్లాలో శుక్రవారం రహదారులు రక్తమోడాయి. రెండు వేర్వేరు చోట్ల జరిగిన ఘోర రోడ్డు ప్రమాదాల్లో ఎనిమిది మంది దుర్మరణం చెందగా.. మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలు ఉమ్మడి వరంగల్ జిల్లా దేవరుప్పల మండలంలో..ఆత్మకూరు మండలం కటాక్షపూర్ సమీపంలో జరిగాయి. శుభకార్యానికి వెళ్తుండగా.. జనగామ వీవర్స్‌కాలనీకి చెందిన బోగ సోమనర్సయ్య(40), ఆయన మేనల్లుడు చింతకింది మణిదీప్ (18) మరో నలుగురు బంధువులతో కలిసి శుభకార్యానికి వెళుతూ దేవరుప్పుల మండలం బంజర స్టేజీ సమీపాన రోడ్డు దాటుతున్న వృద్ధుడిని తప్పించబోయి ఎదురుగా వెళ్తున్న కారును ఢీకొట్టారు. మణిదీప్ మృతి చెందగా.. సోమ నర్సయ్యతోపాటు ఎదుటి కారులో ప్రయాణిస్తున్న కొమ్ము కృష్ణ (32), వర్రె మహేష్ (24) గాయపడ్డారు. అక్కడ చికిత్స పొందుతూ సోమనర్సయ్య, కృష్ణ దుర్మరణం చెందగా హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ మహేశ్ సాయంత్రం మృతి చెందాడు. అదుపుతప్పి అంబులెన్స్‌ను ఢీకొట్టి.. వరంగల్ అర్బన్ జిల్లా వేలేరు మండలం ఎర్రబెల్లి గ్రామానికి చెందిన చెందిన బోనోతు సోనాల్‌నాయక్ (35) పండుగ కోసం భార్యా పిల్లలతో కలసి హన్మకొండలోని తండ్రి ఇంటికి ఓ ప్రైవేటు వాహనంలో బయలుదేరాడు. మార్గమధ్యలో వారు ప్రయాణిస్తున్న వాహనం కుడివైపు టైర్ పంచర్ కావడంతో ఎదురుగా వస్తున్న మరో కారును ఢీకొంది. ఈ ఘటనలో సోనాల్‌నాయక్, ఆయన భార్య రజిత (30), 4 నెలల బాబుతోపాటు మంగ పేట మండలం కమలాపూర్ గ్రామానికి చెందిన దాసుపల్లి అశ్విన్ (23) అక్కడికక్కడే మృతి చెందారు. సోనాల్ నాయక్, రజితకు ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. కుమార్తె ఝాన్సీని దస రా సెలవులు కావడంతో 3 రోజుల క్రితమే సోనాల్‌నాయక్ తన తల్లిదండ్రుల వద్దకు తీసుకెళ్లి అప్పగించాడు. -
సభా కమిటీల్లో మనోళ్లు!
సాక్షి , వరంగల్: సభా కమిటీల్లో వరంగల్ ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులకు అవకాశం దక్కింది. మంత్రివర్గ విస్తరణ సమయంలో సభా కమిటీల్లోను ఓరుగల్లుకు పెద్దపీట వేయనున్నట్లు గులాబీ దళపతి, సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ మేరకు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల చివరి రోజున ఉమ్మడి సభా కమిటీలను మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు. ఈ కమిటీల్లో ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు అవకాశం కల్పించారు. ఆయా కమిటీల వివరాలిలా ఉన్నాయి. జోనల్ రైల్వే యూజర్స్ కన్సల్టేటివ్ కమిటీ సర్వీస్ మెంబర్ : నన్నపనేని నరేందర్ (వరంగల్ తూర్పు) అసెంబ్లీ కమిటీలు రూల్స్ కమిటీ సభ్యుడిగా గండ్ర వెంకటరమణరెడ్డి(భూపాలపల్లి) ప్రివిలేజ్ కమిటీ సభ్యుడిగా డాక్టర్ టి.రాజయ్య (స్టేషన్‌ఘన్‌పూర్) కమిటీ అన్ గవర్నమెంట్ అక్యూరెన్స్ సభ్యుడిగా చల్లా ధర్మారెడ్డి (పరకాల) ఫైనాన్షియల్ కమిటీలు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యుడిలుగా పెద్ది సుదర్శన్‌రెడ్డి(నర్సంపేట), పల్లా రాజేశ్వర్‌రెడ్డి (పట్టభద్రుల ఎమ్మెల్సీ) కమిటీ ఆన్ ఎస్టిమేట్స్ సభ్యుడిగా ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి(జనగామ) కమిటీ ఆన్ పబ్లిక్ అండర్ టేకింగ్ సభ్యుడిగా బానోతు శంకర్‌నాయక్(మహబూబాబాద్) లెజిస్లేటివ్ కౌన్సిల్ కమిటీలు రూల్స్ కమిటీ సభ్యుడిగా పల్లా రాజేశ్వర్‌రెడ్డి (పట్టభద్రుల ఎమ్మెల్సీ) పిటీషన్స్ కమిటీ సభ్యుడిగా పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి(స్థానిక సంస్థల ఎమ్మెల్సీ) వెల్ఫేర్ అండ్ అదర్ జాయింట్ కమిటీలు అమెనిటీస్ కమిటీ సభ్యులుగా దాస్యం వినయ్‌భాస్కర్(వరంగల్ పశ్చిమ), పల్లా రాజేశ్వర్‌రెడ్డి (పట్టభద్రుల ఎమ్మెల్సీ) వెల్ఫేర్ ఆఫ్ షెడ్యూల్ క్యాస్ట్ కమిటీ సభ్యులుగా ధనసరి అనసూయ(ములుగు) వెల్ఫేర్ ఆఫ్ షెడ్యూల్ ట్రైబ్స్ సభ్యుడిగా బానోతు శంకర్‌నాయక్(మహబూబాబాద్) వెల్ఫేర్ ఆఫ్ బ్యాక్ వర్డ్ క్లాసెస్ సభ్యుడిగా నన్నపనేని నరేందర్(వరంగల్ తూర్పు), పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి (స్థానిక సంస్థల ఎమ్మెల్సీ) లైబ్రరీ కమిటీ సభ్యులుగా చల్లా ధర్మారెడ్డి (పరకాల), ధనపరి అనసూయ(ములుగు) -
మెరిసి మాయమైన సాయిపల్లవి
సాక్షి, పరకాల: సమయం ఉదయం 8 గంటలు.. ఓ అందమైన అమ్మాయి పరకాల బస్టాండ్‌కు కారులో చేరుకొని ప్రయాణికురాలిలా ప్లాట్‌ఫాంపై వేచి చూస్తోంది. ఆమెను ఎక్కడో చూసినట్లు ప్రయాణికులు గుర్తు చేసుకునే లోపే.. ఫిదా సినిమా హిరోయిన్ సాయిపల్లవి అక్కడి నుంచి వెళ్లిపోయింది. విరాట పర్వం సినిమా షూటింగ్లో భాగంగా వరంగల్ రూరల్ జిల్లా పరకాల బస్టాండ్‌లో సాయిపల్లవి ఆర్టీసీ బస్సు కోసం ఎదరుచూసే దృశ్యాలను బుధవారం చిత్రీకరించారు. ఆమెను స్థానికులు గుర్తిస్తే ఇబ్బందులు తలెత్తుతాయనే ఆలోచనతో బస్టాండ్ ఎదురుగా ఉన్న లాడ్జ్ నుంచి చిత్రీకరించారు. ఓ మీడియా ప్రతినిధి ఈ దృశ్యాలను ఫొటో తీయగా అక్కడే ఉన్న సినిమా షూటింగ్ సభ్యులు అతడి సెల్‌ఫోన్‌లోని దృశ్యాలను బలవంతంగా తొలగించారు. మరికొందరు ప్రయాణికులు తమ సెల్ఫోన్లో సాయిపల్లవిని బంధించే ప్రయత్నం చేసేలోపే.. ఆమె షూటింగ్ పూర్తి చేసుకుని సొంత వాహనంలో కాళేశ్వరం వెళ్లిపోయారు. ఓ ప్రయాణికుడు తీసిన సాయిపల్లవి ఆరు సెకన్ల విడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. గణపేశ్వరాలయంలో.. గణపురం : జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండల కేంద్రంలోని గణపేశ్వరాలయంలో బుధవారం విరాట పర్వం సినిమాకు సంబంధించి హిరో దగ్గుపాటి రాణా, హీరోయిన్ సాయిపల్లవిపై పలు సన్నివేశాలు, పాట చిత్రీకరించారు. ఈ సినిమా షూటింగ్ మరో రెండు రోజుల పాటు ఇక్కడే జరుగుతుందని చిత్ర యూనిట్ తెలిపింది. -
ఇక పంచాయతీల్లో పారదర్శకం
సాక్షి, వరంగల్/భీమదేవరపల్లి: తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం–2018లో భాగంగా ఏర్పాటు కానున్న స్థాయీ సంఘాల(స్టాండింగ్ కమిటీ)తో గ్రామ పంచా యతీ పాలన పారదర్శకంగా సాగే అవకాశాలున్నాయి. స్థానిక సంస్థలకు గ్రామ పరిపాలన పగ్గాలు అప్పగించాలన్న ధ్యేయంతో 73, 74వ రాజ్యాంగ సవరణలతో పంచాయతీల స్థాయిలో అభివృద్ధి కోసం కమిటీలను ఏర్పాటు చేయాలని పొందుపర్చారు. కానీ ఈ విషయాన్ని గతంలో పట్టించుకోలేదు. గ్రామ స్థాయిలో అభివృద్ధి జరగాలంటే సర్పం చ్ స్థాయిలోనే పెనుమార్పులతోనే సాధ్యమని భావించిన ముఖ్యమంత్రి కేసీఆర్ నూతన పంచాయతీరాజ్ చట్టానికి రూపకల్పన చేశారు. జల భాగస్వామ్యం కోసం... గ్రామపంచాయతీ వ్యవస్థను బలోపేతం చేయడంలో భాగంగా ప్రజలను అభివృద్ధి పనుల్లో భాగస్వామ్యం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ రూపొం దించింది. అందులో భాగంగానే ప్రతీ గ్రామపంచాయతీకి నాలుగు స్టాండింగ్ కమిటీలతో పాటుగా ఒక్కో గ్రామ పంచాయతీకి ముగ్గురు చొప్పున కో ఆప్షన్ సభ్యులను ఎన్నుకోనున్నారు. ఈ ప్రక్రియను 29వ తేదీలోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ మండల పరిషత్ అభివృద్ధి అధికారులకు శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. కాగా, జిల్లాలోని మొత్తం ఏడు మండలాల్లో ఉన్న 130 గ్రామాల్లో ఈ కమిటీలు ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో గ్రామానికి అన్ని కమిటీలు కలిపి 63 మంది సభ్యులుగా ఉండనున్నారు. దీంతో జిల్లాలోని అన్ని గ్రామాల్లో 8,190 మందికి కమిటీలో అవకాశం దక్కుతుంది. అభివృద్ధి వేగిరం గ్రామపంచాయతీ పరిధిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వివిధ పథకాల్లో మంజూరైన పనులు త్వరతగతిన పూర్తి అయ్యేందుకు ఈ కమిటీలు పరోక్షంగా దోహదం చేస్తాయి. ఇప్పటి వరకు పంచాయతీల నిధులతో చేపట్టిన పనులను పర్యవేక్షించేందుకే సర్పంచ్ల పూర్తి సమయం సరిపోయేది. ఈ కమిటీల ఏర్పాటుతో చేపట్టిన పనుల నాణ్యతపై కూడా దృష్టి సారించే అవకాశాలున్నాయి. ఈ కమిటీల్లో విషయ నిఫుణులు, అనుభవం గల వారికి ప్రాతినిధ్యం కల్పించనుండడంతో గ్రామాల అభివృద్ధి పరుగులు తీస్తుందని భా విస్తున్నారు. ఎన్నిక విధానం ప్రతీ కమిటీలో 15 మంది సభ్యులకు తక్కువ కాకుండా.. ఈఓ పీఆర్డీల సమక్షాన కమిటీలను ఏర్పాటుచేయాలి. ఇందులో ఒకరిని కన్వీనర్‌గా ఎన్నుకోవాలి. కమిటీ సభ్యులంతా గ్రామ నివాసితులై, ఆ గ్రామ ఓటరై ఉండాలి. వార్డు సభ్యులకు ఈ కమిటీల్లో స్థానం ఉండదు. ఇక కమిటీల వారీగా అవగాహన కలిగిన అనుభజ్ఞులైన, నిష్ణాతులైన వ్యక్తులను కమిటీల్లోకి తీసుకోవాలి. గ్రామపంచాయతీ తీర్మానం మేరకు కమిటీ ఎంపిక పూర్తిచేయాలి. ముగ్గురు కోఆప్షన్ సభ్యుల ఎన్నిక జిల్లా పరిషత్, మండల పరిషత్ మాదిరిగా గ్రామపంచాయతీల్లోనూ ముగ్గురు కోఆప్షన్ సభ్యులను ఎన్నుకోనున్నారు. జెడ్పీల్లో ఇద్దరు, మండలాల్లో ఒకరిని మాత్రమే కో–ఆప్షన్ సభ్యుడిని ఎన్నుకోగా గ్రామపంచాయతీల్లో మాత్రం ముగ్గురిని ఎన్నుకునేలా నూతన చట్టంలో పేర్కొన్నారు. ఈ కోప్షన్ సభ్యుల్లో ఒకరు సీనియర్ సిటిజన్, ఒకరు విశ్రాంత ఉద్యోగి(గ్రామాభివృద్ధికి ఆర్థిక సాయం చేసిన దాత, పారిశ్రామిక వేత్త, ఎన్ఆర్ఐ), మరొకరు గ్రామ సమాఖ్య అధ్యక్షురాలై ఉండాలి. ఈ సంఘాలు ఒకటి కంటే ఎక్కువగా ఉంటే ఎక్కువ మంది సభ్యులు ఉన్న సంఘం అధ్యక్షురాలికి అవకాశం కల్పిస్తారు. వీరు పంచాయతీల అభివృద్ధి కోసం గ్రామ పాలకవర్గం, స్టాండింగ్ కమిటీలతో కలిసి పనిచేస్తారు. అధికారుల కసరత్తు జీపీల్లో స్థాయి సంఘాల ఏర్పాటును ఈనెల 29లోగా పూర్తిచేసి 31లోగా జిల్లా పంచాయతీ అధికారికి అందచేయాలని కలెక్టర్ ఆదేశించిన నేపథ్యంలో అధికా రులు కసరత్తు ప్రారంభించారు. సర్పంచ్, ప.కార్యదర్శి ఆధ్వర్యంలో కమిటీలు వేయాలని, వీటి ఏర్పాటును ఎంపీడీఓలు పర్యవేక్షించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. ఈ మేరకు గ్రామపంచాయతీ కార్యాలయాల్లో ఎన్నికకు సంబంధించి నోటీస్ బోర్డు ద్వారా తెలియజేయాలి. స్థాయీ సంఘాలు ఇవే... కమిటీ – 1 : పారిశుధ్యం, డంపింగ్ యార్డు, శ్మశాన వాటిక నిర్వహణ కమిటీ – 2 : వీధి దీపాల ఏర్పాటు, నిర్వహణ కమిటీ – 3 : మొక్కల పెంపకం, పచ్చదనం పెంపు కమిటీ – 4 : పనులు, సంతల పర్యవేక్షణ -
దొంగతనం కేసులో ఇద్దరి అరెస్టు
సాక్షి, కురవి: బంగారు ఆభరణాలతో పాటు అపహరించిన రెండు సెల్ఫోన్లే ఆ దొంగలను పట్టించాయి. ఇద్దరు దొంగల అరెస్టుకు సంబంధించి మహబూబా బాద్ డీఎస్పీ నరేష్కుమార్ మంగళవారం వెల్లడించిన వివరాలిలా ఉన్నా యి. మే 12న ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం పండితాపురానికి చెందిన దండగల కనకమ్మ కురవిలోని శ్రీ వీరభద్రస్వామి ఆలయానికి వచ్చి ఆలయ సత్రంలో బస చేసింది. ఉక్కపోత కారణంగా గది తలుపులు తీసి పడుకోగా.. కనకమ్మతో పాటు ఆమె బంధువుల మెడలో ఉన్న బంగారు ఆభరణాలను, రెండు సెల్ఫోన్లను తీసి దాచిపెట్టారు. అర్థరాత్రి ఖమ్మం జిల్లా కేం ద్రంలోని సీతారాంపురం న్యూ కాలనీకి చెందిన నల్లగొండ రాము గది త లుపులు తీసి ఉండడాన్ని గమనించి బంగారు ఆభరణాలతో పాటు రెండు సెల్ఫోన్లను అపహరించాడు. తెల్లారాక గమనించిన బాధితులు కురవి పోలీ సులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కురవి ఎస్సై నాగభూషణం కేసు నమో దు చేసి రూరల్ సీఐ వెంకటరత్నం నేతృత్వంలో దర్యాప్తు ప్రారంభించారు. చోరీకి గురైన సెల్ఫోన్ల కాల్ రికార్డును పరిశీలించగా ఖమ్మం జిల్లా కేంద్రంలోని సీతారాంపురం న్యూ కాలనీకి చెందిన సాధం లక్ష్మినారాయణ చిరునామా లభ్యమైంది. ఆయనను విచారించగా నల్లగొండ రాము తనకు విక్రయించినట్లు తెలపడంతో అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ సందర్భంగా రాము నుంచి రూ.2.40లక్షల విలువైన బంగారు ఆభరణాలు, రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ వివరించారు. కాగా, నల్ల గొండ రాము చిన్నతనంలోనే ఒక కేసులో జైలుకు వెళ్లినట్లు తెలిపారు. సెల్‌ఫోన్ కాల్‌డేటా సహకారంతో నిందితులను పట్టుకున్న రూరల్ సీఐ వెంకటరత్నం, కురవి ఎస్సై నాగభూషణం సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. -
వినియోగదారుల ముంగిట్లోకి... సీజీఆర్ఎఫ్
సాక్షి, హన్మకొండ: విద్యుత్ వినియోగదారుల సమస్యలు పరిష్కరించేందుకు తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ప్రతీ డిస్కంలో విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక(సీజీఆర్ఎఫ్)ను ఏర్పాటు చేసింది. టీఎస్ ఎన్పీడీసీఎల్ పరిధిలో వరంగల్ (హన్మకొండ), నిర్మల్ కేంద్రంగా రెండు ఏర్పాటయ్యాయి. విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక(కన్జ్యూమర్ గ్రీవెన్స్‌స్ రిడ్రసల్ ఫోరం – సీజీఆర్ఎఫ్)కు విస్త్రృత ప్రచారం తీసుకురావడంలో సీజీఆర్ఎఫ్–1 చైర్మన్‌గా కందుల కృష్ణయ్య విశేష కృషి చేశారు. విద్యుత్ వినియోగదారులు తమ సమస్యలు పరిష్కరించుకునేందుకు ఒక వేదిక ఉందని తెలియని పరిస్థితుల్లో దీనిని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు. సీజీఆర్ఎఫ్ చైర్మన్‌గా కార్యాలయంలోనే ఉంటూ కేసులను పరిష్కరించే అవకాశమున్నా వినియోగదారుల ముంగిట్లోకి లోకల్ కోర్టుల పేరుతో సీజీఆర్‌ఎఫ్‌ను తీసుకెళ్లారు. ఈ మేరకు మూడేళ్లుగా చైర్మన్‌గా పనిచేస్తున్న కృష్ణయ్య పదవీకాలం శనివారంతో ముగియనున్న సందర్భంగా ప్రత్యేక కథనం. మూడు పూర్వ జిల్లాలు సీజీఆర్ఎఫ్–1 (వరంగల్) పరిధిలో పూర్వ వరంగల్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాలు ఉన్నాయి. ఈ జిల్లాల్లోని ప్రతీ సెక్షన్ కార్యాలయంలో సీజీఆర్ఎఫ్ లోకల్ కోర్టులు నిర్వహించి అక్కడికక్కడే సమస్యలు పరిష్కరించేందుకు చైర్మన్ కృష్ణయ్య కృషి చేశారు. మూడేళ్ల పదవీ కాలంలో మొత్తం 1,014 కేసులు సీజీఆర్ఎఫ్ దృష్టికి రాగా వాటిని పరిష్కరించడం విశేషంగా చెబుతారు. 96 శాతం వినియోగదారులకే అనుకూలం మొత్తం పరిష్కరించిన కేసుల్లో 808 కేసులను స్థానికంగా అప్పటికప్పుడు సెక్షన్ పరిధిలో నిర్వహించిన లోకల్ కోర్టుల్లో పరిష్కరించడం విశేషం. ఇక లోకల్ కోర్టులో పరిష్కారం కాని 146 కేసులను సీజీఆర్ఆఫ్ కోర్టులో పరిష్కరించారు. మూడేళ్లలో సగటున 96 శాతం కేసులు వినియోగదారులకు అనుకూలంగా తీర్పు వచ్చాయి. రూ.2,67,500 వినియోగదారులకు పరిహారం, జరిమానా రూపేణ.. సంస్థ నుంచి అందేలా చేశారు. 2016–2017లో 304 కేసులు నమోదు కాగా 260 లోకల్ కోర్టుల్లో, 44 కేసులు సీజీఆర్ఎఫ్ కార్యాలయంలోని కోర్టులో పరిష్కరించారు. ఇందులో 93 శాతం కేసులు వినియోగదారులకు అనుకూలంగా తీర్పులు వెలువడ్డాయి. 2017–2018లో 382 కేసులు రాగా 326 కేసులు స్థానికంగా, 56 కేసులు సీజీఆర్ఎఫ్ కార్యాలయం కోర్టులో పరిష్కరించగా 98 శాతం కేసులు వినియోగదారుల పక్షాన తీర్పు వెలవడ్డాయి. ఇక 2018–2019లో 282 కేసులను స్థానికంగా, సీజీఆర్ఎఫ్ కార్యాలయం కోర్టులో 46 కేసులు పరిష్కరించారు. ఇందులో 97 శాతం కేసులు వినియోగదారుల పక్షాన తీర్పు వెలువడ్డాయి. ఫిర్యాదులు ఇలా... విద్యుత్ సరఫరాలో ఎలాంటి సేవా లోపం ఉన్నా వినియోగదారులు ఫోరంలో ఫిర్యాదు చేసి పరిష్కరించుకోవచ్చు. వినియోగదారుడి సర్వీసు నెంబర్, పూర్తి చిరునామతో పోస్టు ద్వారా కానీ నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదుకు ఎలాంటి రుసుం కానీ న్యాయవాది కానీ అవసరం లేదు. విద్యుత్ సరఫరాలో తరచుగా వచ్చు అంతరాయాలు, విద్యుత్ హెచ్చుతగ్గులు, మీటర్ సమస్యలు, అధిక బిల్లులు, కొత్త సర్వీసులు ఇవ్వడంలో జాప్యం, నిరాకరణ, అదనపు లోడ్ ఇచ్చుటలో జాప్యం, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ సమస్యలు, ఓవర్‌లోడ్, కాలిపోవడం తరలించడంలో వినియోగదారులను ఇబ్బందులకు గురి చేయడం, కేటగిరీ మార్పు వంటి ఇతర విద్యుత్ సంబంధ సమస్యలు సీజీఆర్ఎఫ్ ద్వారా వినియోగదారులు పరిష్కరించుకునే వెసులుబాటు ఉంది. విద్యుత్ సరఫరాలో ఎలాంటి సేవా లోపం ఉన్నా వినియోగదారులు ఫోరంలో ఫిర్యాదు చేసి పరిష్కరించుకోవచ్చు. వినియోగదారుడి సర్వీసు నెంబర్, పూర్తి చిరునామతో పోస్టు ద్వారా కానీ నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదుకు ఎలాంటి రుసుం కానీ న్యాయవాది కానీ అవసరం లేదు. విద్యుత్ సరఫరాలో తరచుగా వచ్చు అంతరాయాలు, విద్యుత్ హెచ్చుతగ్గులు, మీటర్ సమస్యలు, అధిక బిల్లులు, కొత్త సర్వీసులు ఇవ్వడంలో జాప్యం, నిరాకరణ, అదనపు లోడ్ ఇచ్చుటలో జాప్యం, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ సమస్యలు, ఓవర్‌లోడ్, కాలిపోవడం తరలించడంలో వినియోగదారులను ఇబ్బందులకు గురి చేయడం, కేటగిరీ మార్పు వంటి ఇతర విద్యుత్ సంబంధ సమస్యలు సీజీఆర్ఎఫ్ ద్వారా వినియోగదారులు పరిష్కరించుకునే వెసులుబాటు ఉంది. సీజీఆర్ఎఫ్ సేవలను సద్వినియోగం చేసుకోవాలి విద్యుత్ వినియోగదారులు విద్యుత్ సంబంధ సమస్యలు పరిష్కరించుకోవడానికి ఇది చక్కటి వేదిక. న్యాయవాదుల అవసరం లేకుండా వినియోగదారులే నేరుగా ఫిర్యాదు చేయడం ద్వారా సమస్యలు పరిష్కరించుకోవచ్చు. సీజీఆర్ఎఫ్పై వినియోగదారుల్లో అవగాహన కల్పించేందుకు సెక్షన్ల వారీగా లోకల్ కోర్టులు నిర్వహించాం. వినియోగదారుల ముంగిట్లోకి సీజీఆర్‌ఎఫ్‌ను తీసుకువెళ్లామనే సంతృప్తి కలిగింది. – కందుల కృష్ణయ్య, సీజీఆర్ఎఫ్–1 చైర్మన్ -
హతవిధి.. సొంత మంత్రి పోర్ట్‌పోలియో తెల్వదా?
సాక్షి, వరంగల్ : ఓ ఎమ్మెల్యే అవగాహన రాహిత్యాన్ని చూసి నెటిజన్లు నవ్వుకుంటుంటే..... సాక్షాత్తు ఆ జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రి ఎమ్మెల్యే లెటర్లో తన పోర్ట్ పోలియో చూసి నివ్వెరపోయారు. ఈ ఘటన వరంగల్ జిల్లాలో చోటుచేసుకోగా.. ఆ ఎమ్మెల్యే లెటర్ హెడ్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. 3 రోజుల క్రితం వరంగల్ జిల్లా హనుమకొండలో 9నెలల పసిపాపపై ప్రవీణ్ అనే కామాంధుడు అత్యాచారం చేసి ఆపై హత్య చేసిన విషయం తెలిసిందే. అయితే రాష్ట్ర వ్యాప్తంగా నిందితుడు పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆందోళనలు జరుగుతున్నా.. ప్రతి విషయానికి స్పందించే స్థానిక ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ మాత్రం ఈ ఘటనపై నోరుమెదపలేదు. దీంతో ఆయనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు అయితే ఏకంగా వినయ్ భాస్కర్‌ను ముఖాముఖిగా చిన్నారి హత్యపై నిలదీశారు. దీంతో ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ ఈ ఘటన పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర హోంమంత్రి మహమ్మద్ అలీకి లేఖ రాశారు. ఈ హృదయవిచారక ఘటన తనను ఎంతగానో కలచివేసిందని, వ్యవసాయ శాఖ మంత్రి దయాకర్ రావు తో కలిసి బాధిత కుటుంబాన్ని కలిశానని లేఖలో పేర్కొన్నారు. అయితే ఇక్కడే ఎమ్మెల్యే పప్పులో కాలేశారు. పంచాయితీ రాజ్ రూరల్ డెవలప్మెంట్ మంత్రిగా పనిచేస్తున్న ఎర్రబెల్లి దయాకర్ రావును పొరపాటుగా వ్యవసాయశాఖ మంత్రిగా పేర్కొన్నారు. ఈ తప్పును గ్రహించిన నెటిజన్లు ఎమ్మెల్యేను సోషల్ మీడియా వేదికగా ఓ ఆట ఆడుకుంటున్నారు. ‘హతవిధి.. సొంత జిల్లా మంత్రి పోర్ట్ పోలియో కూడా తెల్వదా?’ అంటూ కామెంట్ చేస్తున్నారు. స్పందించిన ప్రభుత్వం.. చిన్నారి హత్యపై ఎట్టకేలకు ప్రభుత్వం స్పందించింది. చిన్నారి శ్రీహిత తల్లిదండ్రులతో హోంమంత్రి మహమ్మద్ అలీ ఫోన్లో మాట్లాడి పరామర్శించారు. తొందరగా న్యాయం జరిగి నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూస్తామని హామీ ఇచ్చారు. త్వరలోనే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కలుస్తారని తెలిపారు. ఇటువంటి సంఘటన ఏ తల్లిదండ్రులకు జరగకూడదని, ఇలా చేయాలన్న ఆలోచన ఎవరికి రానంతగా నిందితుడిని కఠినంగా శిక్షించాలని చిన్నారి తల్లిదండ్రులు హోం మంత్రిని కోరారు. -
పుత్రశోకాన్ని మిగిల్చిన ఈత సరదా..
సాక్షి, డోర్నకల్(వరంగల్ ): తల్లిదండ్రులకు తెలియకుండా ఈత నేర్చుకోవాలన్న సరదా ప్రాణాలను తీయడమే కాకుండా పుత్రశోకాన్ని మిగిల్చింది. వివరాల్లోకి వెళ్తే.. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం ఫకీరాతండాకు చెందిన బానోత్ రామా, విజయ దంపతులకు ఇద్దరు కుమారులు. వీరిలో పెద్దకుమారుడైన బానోత్ ప్రవీణ్(13) ఖమ్మం ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి పూర్తి చేశాడు. రెండు రోజులలో సెలవులు పూర్తి కానుండటంతో తిరిగి ఖమ్మం వెళ్లేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ క్రమంలో మంగళవారం ప్రవీణ్ తండ్రి రామా ఖమ్మం వెళ్లాడు. దీంతో తమ్ముడు, మిత్రులతో కలిసి తండా సమీపంలోని చెరువు పక్కనే ఉన్న వ్యవసాయ బావికి ఈతకు వెళ్లాడు. ప్రవీణ్‌కు ఈత రాకున్నా ఖాళీ కూల్‌డ్రింక్, వాటర్ బాటిళ్లకు మూతలు బిగించి వాటికి తాడు కట్టి నడుం చుట్టూ కట్టుకున్నాడు. ఖాళీ బాటిళ్లను నడుంకు కట్టుకోవడంతో నీటిలోకి దిగినా గాలిలో తేలుతుండటంతో వాటి సహాయంతో ఈత కొట్టసాగాడు. నీటి మధ్యలోకి వెళ్లిన తరువాత నడుంకు ఉన్న తాడు తెగిపోవడంతో కేకలు వేస్తూ నీట మునిగాడు. ప్రవీణ్ నీట మునిగిన విషయాన్ని గమనించిన మిత్రులు తండా పెద్దలకు సమాచారం అందించారు. తండావాసులు వచ్చి బావిలోకి దిగి వెతికినా ప్రవీణ్ ఆచూకీ దొరకలేదు. 108 వాహనంతో పాటు డోర్నకల్ సీఐ జె.శ్యాంసుందర్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. తండావాసులు పలు వ్యవసాయ పనిముట్ల సహకారంతో రెండు గంటల పాటు శ్రమించి బావి అడుగున ఉన్న ప్రవీణ్ మృతదేహాన్ని బయటకు తీశారు. ప్రవీణ్ మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. నీటి తొట్టెలో పడి చిన్నారి మృతి గూడూరు: తల్లి ఇంట్లో పనిలో నిమగ్నమైన ఉండగా ఇంటి ముందు ఉన్న ఓ చిన్నారి నీటి తొట్టిలో పడి మృతి చెందిన సంఘటన మండలంలోని దుబ్బగూడెంలో మంగళవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం..దుబ్బగూడెంకు చెందిన మూడు రమేష్ దంపతుల రెండో కూతురు అభినయ (1) ఇంటి ముందు ఆడుకుంటుంది. ఈ క్రమంలో తల్లి ఇంట్లో పనిలో నిమగ్నమై ఉంది. కొద్ది సేపటి తరువాత బయటికి వచ్చిన కూతురు కనిపించకపోవడంతో వెతికింది. ఆ తరువాత ఇంటి పక్కనే ఉన్న నీటి తొట్టిలో పడి ఉండడాన్ని చూసి బోరున విలపించి బయటికి తీసింది. అప్పటికే చిన్నారి మృతి చెందింది. ఈ సంఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
అవి ఓకే.. మరి ఇవి?
సాక్షి, వరంగల్: జిల్లా ప్రజా పరిషత్‌ల తుదిరూపుపై స్పష్టమైన మార్గదర్శకాలు అందకపోవడంతో అధికార యంత్రాంగం మల్లగుల్లాలు పడుతోంది. ఈనెల 7, 8వ తేదీల్లో ఎంపీపీ, జిల్లా పరిషత్ చైర్మన్ల ఎన్నికతో ప్రాదేశిక ఎన్నికల ప్రక్రియ ముగిసింది. ఉమ్మడి వరంగల్‌లోని ఆరు జిల్లా పరిషత్‌లు, మండల పరిషత్‌ల అధ్యక్షుల ఎన్నిక పూర్తి కాగా కొత్త పాలకవర్గాలు కొలువుదీరడమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో కొత్త జిల్లాల్లో జిల్లా పరిషత్ కా ర్యాలయాల ఏర్పాటు, సిబ్బంది, ఉద్యోగుల కేటాయింపు, మౌలిక వసతులపై మార్గదర్శకాలు అందకపోవడంతో అధికారులు సందిగ్దావస్థలో ఉన్నారు. గత ఐదునెలలుగా ఎంపీటీసీ స్థానాల పునర్విభజన, రిజర్వేషన్ల ఖరారు, ఓటర్ల జాబితా తయారీ, పోలింగ్, లెక్కింపు, పాలకవర్గాల ఎన్నిక ప్రక్రియలో జెడ్పీ అధికారులు తలమునకలై ఉన్నారు. ఇక కొత్త పాలకవర్గాలు వచ్చే నెల 5వ తేదీ కొలువు దీరేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాల్సి ఉంది. అయితే, జిల్లా పరిషత్‌ల కొత్త భవనాలు, సిబ్బంది కేటాయింపు, మౌలిక సదుపాయాల కల్పన కోసం ముందుకు సాగాలంటే ప్రభుత్వం నుంచి సూచనలు, సలహాలతో కూడిన మార్గదర్శకాలు అందకపోవడంతో గందరగోళం నెలకొంది. ఉద్యోగుల విభజన, కేటాయింపే సమస్య ఉమ్మడి వరంగల్ జిల్లాలో 2014 ఎన్నికల సమయంలో ఒకే జిల్లా పరిషత్, 50 మండల పరిషత్‌లు ఉండగా... జిల్లా పునర్విభజన తర్వాత ప్రస్తుతం ఆరు జిల్లా ప్రజాపరిషత్‌లు, 71 మండల పరిషత్, జెడ్పీటీసీ స్థానాలు ఏర్పడ్డాయి. వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జయశంకర్ భూపాలపల్లి, జనగామ, మహబూబాబాద్, ములుగు జిల్లా పరిషత్‌లు, ఆ జెడ్పీల పరిధిలో 70 జెడ్పీటీసీ, 780 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఆరు జిల్లా పరిషత్‌లకు చైర్మన్లు, వైస్ చైర్మన్లు, కోఆప్షన్ సభ్యుల ఎన్నిక కూడా పూర్తయింది. ఇక 67 మండల పరిషత్‌లకు ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, కోఆప్షన్ సభ్యులు కూడా ఎన్నికయ్యారు. ఈ ప్రక్రియ మొత్తం సజావుగానే సాగినా జిల్లా పరిషత్ విభజనపై ఇప్పటికీ మార్గదర్శకాలు అందలేదు. కొత్త పాలకవర్గాలు కొలువు దీరేందుకు అవసరమైన కొత్త భవనాలు, సిబ్బంది కేటాయింపు, మౌలిక సదుపాయాల కల్పనపై కసరత్తుతో పాటు ఉద్యోగులకు పదోన్నతులు ఇస్తారా.. లేదా వర్క్ టు సర్వ్ కింద ఉన్న సిబ్బందినే ఆయా జిల్లాలకు కేటాయిస్తారా అన్నది తేలాల్సి ఉంది. కాగా జిల్లా పరిషత్‌ల ఏర్పాటుపై పంచాయతీరాజ్ కమిషనర్ నుంచి ఇంకా పూర్తిస్థాయి మార్గదర్శకాలు అందలేదని అధికారులు చెబుతున్నారు. ఆరు జిల్లాలకు నోడల్ జెడ్పీగా ఉన్న వరంగల్ జిల్లా పరిషత్ పరిధిలోని ఉద్యోగుల వివరాలు కేడర్ల వారీగా.. ఇప్పటి వరకు ఉన్న మౌలిక సదుపాయాలు, సామగ్రి వివరాలను రెండు నెలల క్రితమే ఉద్యోగులు కమిషనర్‌కు నివేదించారు. ప్రస్తుతం 74 మంది.. వరంగల్ జెడ్పీలో ప్రస్తుతం జెడ్పీ సీఈఓ, డిప్యూటీ సీఈఓతో పాటు 8 మంది సూపరింటెండెంట్లు, ఆరుగురు సీనియర్ అసిస్టెంట్లు, 29 జూనియర్ అసిస్టెంట్లు, ఆరుగురు టైపిస్టులు సహా రికార్డు అసిస్టెంట్లు, అటెండర్లు, డ్రైవర్లు మొత్తం 74 మంది ఉన్నారు. కొత్తగా ఏర్పడే ఒక్కో జిల్లా పరిషత్‌కు కనీసం 19 మంది సిబ్బంది అవసరం. సీఈఓ, డిప్యూటీ సీఈఓ, ఇద్దరు సూపరింటెండెంట్లు, ముగ్గురు సీని యర్ అసిస్టెంట్లు, ఐదుగురు జూనియర్ అసిస్టెంట్లు, ఒక టైపిస్టు, ఆరుగురు ఆఫీస్ సబార్డినేట్లు ఇలా మొత్తం ఒక్కో జెడ్పీలో ఎంత తక్కువ అనుకున్నా కనీసం 19 మంది అవసరం అవుతుందని అంచనా. ఈ లెక్కన ఆరు జిల్లాలకు కలిపి 114 మంది అవసరమవుతా రు. అదే విధంగా ఫర్నీచర్, కంప్యూటర్లు, ఫ్యాన్లు, జిరాక్సు యంత్రాలు తదితర సామగ్రి కూడా కావాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో పంచాయతీరాజ్ శాఖ ద్వారా పదోన్నతులు కల్పించి కొత్త జిల్లాలకు సిబ్బందిని బదిలీ చేస్తారా లేదా సర్వ్ టు రూల్ కింద ఆయా జిల్లాల కలెక్టర్లే సిబ్బందిని కేటాయిస్తారా అన్న అంశాలు జిల్లా పరిషత్ ఉద్యోగుల్లో ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఎంపీడీఓలు ఏరీ? ఉమ్మడి జిల్లాలో జిల్లాల పునర్విభజనతో పాటే కొత్త మండలాలు ఏర్పడగా వాటిలో ఎంపీడీఓ కార్యాలయాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, జనగాం జిల్లాల్లో ఖిలా వరంగల్, కాజీపేట, ఐనవోలు, వేలేరు, దామెర, టేకుమట్ల, కన్నాయిగూడెం, పలిమెల, గంగారం, చిన్నగూడూరు, దంతాలపల్లి, పెద్ద వంగర, తరిగొప్పుల, చిల్పూరు తదితర మండలాలు ఏర్పడగా ప్రాదేశిక ఎన్నికలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ మండలాల్లో కొత్త ఎంపీడీఓ కార్యాలయాల ఏర్పాటుతోపాటు ఉద్యోగులను విభజించి కేటాయించాల్సి ఉంది. ఒక్కో మండల పరిషత్‌కు కనీసం 9 మంది ఉద్యోగులను నియమిస్తే పాలన సాఫీగా కొనసాగుతుందని అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపారు. ఓ ఎంపీడీఓ, సూపరింటెండెంట్, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, టైపిస్టు, నలుగురు ఆఫీస్ సబార్డినేట్లు అవసరమని పేర్కొన్నారు. కాగా, కొత్త కార్యాలయాలు, సిబ్బంది కేటాయింపుల మార్గదర్శకాలు సైతం జెడ్పీకి ఇంకా రాలేదని అధికారిక సమాచారం. ఇదిలా ఉంటే ఇటీవల జిల్లా పరిషత్ చైర్మన్లు, వైస్ ఛైర్పర్సన్లతో పాలకవర్గాలు ఏర్పడగా.. వచ్చే జులై 5న కొత్త పాలకవర్గాలు కొలువుదీరాల్సి ఉంది. ఈలోగా కొత్త జిల్లా పరిషత్ కార్యాలయాలతో పాలన ప్రారంభిస్తారా లేదా.. అద్దె భవనాల్లోనా, ఖాళీగా ఉన్న ప్రభుత్వ భవనాలను జెడ్పీకి కేటాయిస్తారా? అన్న దానిపై స్పష్టత లేదు. ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు వస్తే తప్ప ఏమీ చేయలేని పరిస్థితి నెలకొందని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. ఉమ్మడి జిల్లాలో ఇలా... జిల్లా పరిషత్‌లు 06 మండల పరిషత్‌లు (4 మండలాల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తికాలేదు) 71 ప్రస్తుతం వరంగల్ జెడ్పీలో ఉద్యోగులు 74 ఒక్కో కొత్త జెడ్పీకి కావాల్సిన ఉద్యోగులు 19 ఒక్కో ఎంపీడీఓ కార్యాలయానికి కావాల్సిన ఉద్యోగులు 9 -
నాటికీ.. నేటికీ మారిన ప్రచార తీరు
సాక్షి, వరంగల్ రూరల్: కాలం మారుతున్నా కొద్దీ ఎన్నికల ప్రచార శైలి మారుతూ వస్తోంది. ఒకప్పుడు చేతిరాతలు.. గోడ రాతలకే పరిమితమైన ప్రచారం.. ఇప్పుడు సోషల్ మీడియా రాజ్యం నడుస్తోంది. ఆన్లైన్లోనే ప్రచారం చేపడుతున్నారు. అంతా ఆన్లైన్లో రాస్తున్నారు...స్వయంగా మాట్లాడుతున్నారు. కాలం మారుతున్న కొద్ది కొత్త కొత్త టెక్నాలజీలు అందుబాటులో వస్తున్నాయి. వాటిని వినియోగించుకుంటూ ప్రచారం నిర్వహిస్తున్నారు. గతంలో తక్కువ ఖర్చుతో ప్రచారం నిర్వహించగా ఇప్పుడు ఖరీదైపోయింది. 1952–62 మధ్య కాలంలో.. 1952లోదేశంలో మొదటి సార్వత్రిక ఎన్నికలు నిర్వహించారు. 1952–62 మధ్య కాలంలో ప్రచారం సాదాసీదాగా ఉండేది. ఆ తరం వారు నాటి ప్రచార తీరు గురించి ఇప్పటికీ కథలు కథలుగా చెబుతుంటారు. ఇప్పుడు వింటే విస్తుపోవడం మన వంతు అవుతోంది. నాడు అభ్యర్థులు చేతి రాతతో ప్రచార పత్రాలు రూపొందించుకొనే వారు. అప్పట్లో చాలా మందికి గొలుసు కట్టు రాతలో ప్రావీణ్యం కలిగి ఉండేది. కార్బన్ పేపర్ వినియోగించి రాసేవారు. నిరక్ష్యరాసులు ఎక్కువ, కొద్దిపాటి చదువు వచ్చిన వారు గొలుసు కట్టు రాత చదవటం కష్టంగా ఉండేది. దీంతో వీటిని ఓటర్లకు చదివి వినిపించడానికి ప్రత్యేకంగా కొందరిని నియమించుకునే వారు. 1967–78లో.. ప్రింటింగ్ ప్రెస్‌లు అందుబాటులోకి వచ్చాయి. కాగితాలపై రాసుకునే ప్రచార పత్రాలు కనుమరుగయ్యాయి. అభ్యర్థులు కరపత్రాల ముద్రణ వైపునకు దృష్టి సారించారు. వీటిని నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేసేశారు. మరో పక్క ఎన్నికల గుర్తు, పార్టీ పేరు, అభ్యర్థి పేరు, ఫొటోతో ముద్రించిన వాల్‌పోస్టర్లను ఇళ్ల తలుపులపై అంటించేవారు. ఎన్నికల గుర్తులను తలుపు పక్కన గోడపై గుద్దేవారు. అభ్యర్థులు అన్ని ఊళ్లు తిరిగేవారు. గ్రామానికి వెళితే ఓటర్లను కలిసేవారు కాదు. గ్రామ పెద్దలు నలుగురైదుగురిని కలిసి ఎన్నికల వ్యూహరచన చేసేవారు. వారు క్షేత్రస్థాయిలో దానిని అమలు పరిచేవారు. ముఖ్య నాయకులు ఎవరైనా వచ్చి వెళ్లినా ఆ విషయం ఓటర్లకు పెద్దగా తెలిసేది కాదు. 1983–94లో రాజకీయ చైతన్యానికి నాంది పడింది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం, ప్రముఖ సినీనటుడు నందమూరి తారకరామారావు జనం మధ్యలోకి రావడం ప్రజలకు రాజకీయం అంటే ఏమిటో తెలిసొచ్చింది. ఊరూరా బ్యానర్లు, మైకులతో ప్రచారానికి శ్రీకారం చుట్టారు. అభ్యర్థులతో అనుచరగణం రోడ్‌షోలు నిర్వహించేవారు. వారిని చూడటానికి రోడ్డుకు ఇరువైపులా ప్రజలు బారులుదీరి నిలబడేవారు. వాల్‌పోస్టర్లు, కరపత్రాల ముద్రణ ఉన్నా మైకుల హోరు ఎక్కువగా ఉండేది. ఎన్నికల నియమావళి గురించి పట్టించుకునే వారు అప్పట్లో చాలా తక్కువ మంది. 1999నుంచి డిజిటల్ రాజ్యం డిజిటల్ ఫ్లెక్సీల రాజ్యం మొదలైంది. పార్టీలు పోటాపోటీగా వీటిని ఏర్పాటు చేసేవారు. మారిన పరిస్థితుల నేపథ్యంలో ఫోన్ లేని జేబుల్ని వెతకడం కష్టంగా ఉండేది. ఇంటింటా ఫోన్లు ఉండడంతో గంపగుత్త సందేశాలు పంపడం సులభంగా మారింది. తమకు ఓటేయాలని గెలిస్తే అది చేస్తాం.. ఇది చేస్తామంటూ రూపొందించిన సందేశాలను పంపేవారు. పోటీలోని అభ్యర్థి నేరుగా ఓటర్లతో మాట్లాడే ప్రయత్నాలకు ఫోన్ మాధ్యమంగా నిలిచింది. ఫోన్ లేపగానే ‘నేను మీ నియోజవర్గ అభ్యర్థిని...నన్ను గెలిపించాలి’ అని ముందుగానే రికార్డు చేసిన మాటలు వినిపించేవి. గత ఎన్నికల ప్రచారంలో త్రీడీ సాంకేతిక పరిజ్ఞానం ఉరకలేసింది. జనం, కార్యకర్తలు గుమిగూడిన చోట ఉంచి తెరపై అగ్రనేత మాట్లాడే దృశ్యాలను నేరుగా చూపించారు. కాలం మారింది.. నగరం, పట్టణం, పల్లె ఏ ప్రాంతానికి చెందిన వారైనా ఇప్పుడు సామాజిక మాధ్యమాన్నే విస్తృతంగా వినియోగించుకుంటున్నారు. వాట్సాప్, యూట్యూబ్, ఫేస్బుక్, ట్విట్టర్, టెలిగ్రాం తదితర సైట్లను ప్రచారాస్త్రంగా మార్చుకున్నారు. ప్రచారంలోని ప్రతి పదనిస క్షణాల్లో ప్రపంచానికి తెలిసిపోతోంది. మద్దతుదారులు తమ ఫొటోలు, వీడియో పోస్టులతో హల్చల్ చేస్తుండటం విశేషం. అభ్యర్థులు ప్రచారంలో బిజీబిజీగా ఉండటంతో వారి అనుచరులు 70 శాతం మంది సామాజిక మాధ్యమాలపై ఆధార పడుతున్నారు. ఈ విషయంలో ప్రధాన పార్టీలు ముందంజలో ఉంటున్నాయి. ఖరీదైన ఎన్నికలు తొలినాళ్లలో ఖర్చు నామమాత్రంగా ఉండేది. ప్రచార ఆర్భాటం తక్కువ ఉండటంతో ఖర్చు స్వల్పంగా ఉండేది. ఓటర్లు డబ్బులు అడిగే వారు కాదు. తర్వాతి ఎన్నికల నుంచి ఖర్చు పెరగడం ఆనవాయితీగా మారింది. 2004 ఎన్నికల నుంచి పరిస్థితి పూర్తిగా మారింది. ఖర్చు విపరీతంగా లక్షలకు పెరిగింది. ఎన్నికల సంఘం నిర్ధేశించిన పరిమితిని దాటి ఖర్చులు ఉంటున్నాయి. ప్రస్తుతం ఎన్నికల సంఘం నిర్దేశించిన పరిమితికి మించి ఖర్చు ఎన్ని రేట్లు జరుగుతుందనేది ఎవరూ కూడా అంచనా వేయలేకపోతున్నారు. రూ.కోట్లలోనే జరుగుతుంది. ప్రచారం మొదలు ఓటు వేసే దాక ప్రతి చిన్న విషయానికి అభ్యర్థి చేతి చమురు వదులుతోంది. -
పోడుభూములకు పట్టాలిచ్చిన ఘనత వైఎస్సార్‌దే..
మహబూబాబాద్: పోడు భూములకు పట్టాలు ఇచ్చి ఆదుకున్న ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డిదేనని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి పోరిక బలరాంనాయక్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ హయాం లోనే పేదలకు న్యాయం జరిగిందన్నారు. తెలంగాణ ఇచ్చిన దేవత సోనియాగాంధీ అని లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటు వేసి రు ణం తీర్చుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. కేంద్ర మంత్రిగా చేసిన సమయంలో రైళ్ల హాల్టింగ్‌లు, విద్య పరంగా మోడల్ స్కూ ల్స్, కురవి మండల ఏకలవ్య పాఠశాల మం జూరీ మానుకోట మునిసిపాలిటీగా చేయడంతో పాటు రోడ్ల పరంగా కోట్లాది రూపాయలతో ఎంతో అభవృద్ధి చేశామన్నారు. తన గెలుపు కోసం పార్టీ జిల్లా అధ్యక్షుడు భరత్‌చందర్‌రెడ్డి, ములుగు ఎమ్మెల్యే సీతక్క పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి మాజీ ఎమ్మెల్యే దొంతి మాదవరెడ్డి, డోర్నకల్ ఇన్చార్జి రాంచంద్రునాయక్, భద్రాచలం ఎమ్మెల్యే పోడెం వీరయ్య ఎంతో కృషి చేస్తున్నారన్నారు. నాయకులు అయ్యప్పరెడ్డి, కత్తి స్వామి, బానోత్ ప్రసాద్, నూనావత్ రమేష్, హెచ్.వెంకటేశ్వర్లు, పెండ్యా శ్రీను, తదితరులు పాల్గొన్నారు. -
విలువల పెంపుకోసమే ఎన్నికల్లో పోటీ
దుగ్గొండి/నల్లబెల్లి: రాజకీయాల్లో విలువలు పెం చడానికి జనసమితి పార్టీ మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా అరుణ్‌కుమార్‌ను పోటీలో ని లిపిందని టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కో దండరాం అన్నారు. మండలంలోని గిర్నిబావి, దుగ్గొండి గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఎవరూ మాట్లాడకూడదు.. ఎవరూ ఉండకూడదు..ప్రతిపక్షం పలకవద్దు.. అనే రీతిలో నేటి రాజకీయాలు నడుస్తున్నాయన్నారు. ఆదివాసీల ముద్దుబిడ్డ, ఉన్నత విద్యావంతుడు, విద్యార్థుల సమస్యలపై పోరాటం చేసిన అరుణ్‌కుమార్ ట్రంకు పెట్టె గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. రాష్ట్ర కార్యదర్శి అంబటి శ్రీనివాస్, జిల్లా కోఆర్డినేటర్ షేక్ జావిద్, మండల నాయకులు నామోజు మురళి, వరికెల బాబురావు పాల్గొన్నారు. చట్టాలను అమలు చేయాలి ప్రజా సమస్యలు పరిష్కరించడంలో అధికారులు చట్టాలను పారదర్శకంగా అమలు చేయాలని తెలంగాణ జనసమితి రాష్ట్ర కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. నల్లబెల్లి మండల కేంద్రం లో సోమవారం ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడారు. -
కాంగ్రెస్‌కు లీడర్ లేడు.. బీజేపీకి కేడర్ లేదు
తొర్రూరు(పాలకుర్తి) : తెలంగాణ రాష్ట్రంలోని జాతీయ పార్టీలైన కాంగ్రెస్‌కు లీడర్ లేడు.. బీజేపీకి కేడర్ లేదని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా డివిజన్ కేంద్రంలోని గాంధీ సెంటర్లో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం చేపట్టిన రోడ్‌షో కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులతో ప్రజలు టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపి గత శాసనసభ ఎన్నికల్లో పార్టీకి భారీ మెజార్టీ ఇచ్చారని చెప్పారు. దీంతో రాష్ట్రంలోని జాతీయ పార్టీలన్నీ డీలా పడిపోయాయన్నారు. అందుకే జాతీయ పార్టీలకు చెందిన పెద్ద పెద్ద నాయకులు, కార్యకర్తలంతా టీఆర్ఎస్ పార్టీలోకి భారీ సంఖ్యలో వరుస కడుతున్నారని చెప్పారు. ఇప్పటికే సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను దేశంలోని అనేక రాష్ట్రాల ప్రజలు ఆదరిస్తున్నారని, ఇలాంటి నాయకుడు తమకు కూడా ఉంటే బాగుంటుంద ని ఎదురు చూస్తున్నట్లు పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత దేశంలో జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలకు కలిపి 250 సీట్లు వచ్చే పరిస్థితి లేదని అన్నారు. తెలంగాణలో 17 ఎంపీ సీట్లను గెలిపిస్తే ఇతర రాష్ట్రాల్లో ఉన్న ప్రాంతీయ పార్టీల ఎంపీలతో కలిపి మొత్తం 160 సీట్లను జమచేసి దేశ రాజకీయాల్లో కేసీఆర్ చక్రం తిప్పుతారని తెలిపారు. అవసరమైతే ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉంటుందని వివరించారు. అనంతరం మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి మాట్లాడుతూ నిత్యం ప్రజల మధ్య ఉండే ఎర్రబెల్లి దయాకర్‌రావుకు 54వేల మెజార్టీ ఇచ్చి గెలిపిం చడం వల్లే రాష్ట్ర మంత్రివర్గంలో చోటు దక్కిందన్నారు. అదే స్ఫూర్తితో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఇంటింటికీ తిరిగి టీఆర్ఎస్ అభర్థికి ఓట్లు వేయాలని పార్టీలకు అతీతంగా అన్నివర్గాల ప్రజలను అడగాలని కోరారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్‌రావు, మండల నాయకులు గుడిపూడి మధుసూదన్‌రావు, పసుమర్తి సీతారాములు, ఈదురు ఐలయ్య, ఎంపీపీ సోమయ్య, రామచంద్రయ్యశర్మ, సోమేశ్వర్రావు, హరిప్రసాద్, వెంకటనారాయణగౌడ్ పాల్గొన్నారు. -
ములుగు నుంచి ముగ్గురు ఎంపీలు
ములుగు: ములుగు నియోజకవర్గం నుంచి ముగ్గురు అభ్యర్థులు నాలుగుసార్లు లోక్‌సభ కు ప్రాతినిధ్యం వహించారు. వరంగల్ పార్లమెంట్ సెగ్మెంట్లో ములుగు నియోజకవర్గం ఉన్నప్పుడు రెండుసార్లు అజ్మీరా చందూలాల్, మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలో పోరిక బలరాంనాయక్, అజ్మీరా సీతారాంనాయక్ ఒక్కో సారి ఎంపీలుగా గెలుపొందారు. ముగ్గురూ తొలి ప్రయత్నంలోనే.. ములుగు నియోజకవర్గం నుంచి తొలిసారి లోక్‌సభకు పోటీసిన అజ్మీరా చందూలాల్, పోరిక బలరాంనాయక్, అజ్మీరా సీతారాంనాయక్‌లు గెలుపొందడం విశేషం. అజ్మీరా చందూలాల్.. ములుగు మండలం జగ్గన్నపేట గ్రామ పంచాయతీ పరిధిలోని సారంగపల్లికి చెందిన అజ్మీరా చందూలాల్ తొలిసారిగా 1996లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి సురేందర్‌రెడ్డిపై గెలుపొందారు. తదనంతరం రెండోసారి టీడీపీ తరుఫున 1998లో కాంగ్రెస్ అభ్యర్థి కల్పనాదేవిపై పోటీ చేసి విజయం సాధించారు. అనంతరం 1999లో ములుగు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. అయితే చందూలాల్ రెండు పర్యాయాల్లో కేవలం మూడు సంవత్సరాలు మాత్రమే ఎంపీగా కొనసాగడం గమనార్హం. అజ్మీరా సీతారాంనాయక్ వెంకటాపురం(ఎం) మండలం మల్లయ్యపల్లికి చెందిన ప్రొఫెసర్ అజ్మీరా సీతారాంనాయక్ తెలంగాణ స్వరాష్ట్రం ఏర్పడ్డాక తొలిసారిగా 2014వ సంవత్సరంలో మహబూబాబాద్ పార్లమెంట్‌కి పోటీ చేశారు. తొలి ప్రయత్నంలోనే కాంగ్రెస్ అభ్యర్థి పోరిక బలరాంపై భారీ మెజార్టీతో విజయం సాధించారు. పోరిక బలరాం నాయక్ 2009లో పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ములుగు నియోజకవర్గం మహబూబాబాద్(ఎస్టీ) పార్లమెంట్ స్థానానికి కేటాయించబడింది. ఈ ఎన్నికల్లో ములుగు మండలం మదనపల్లికి చెందిన పోరిక బలరాంనాయక్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి సీపీఐ అభ్యర్థి కుంజా శ్రీనివాస్‌పై గెలుపొందారు. కేంద్రంలో యూపీఓ ప్రభుత్వం అధికారంలోకి రావడంలో ఎస్టీ కోటాలో కేంద్ర సహాయ మంత్రిగా పనిచేశారు. 2014లో టీఆర్ఎస్ అభ్యర్థి అజ్మీరా సీతారాంనాయక్ చేతిలో ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం మూడోసారి కాంగ్రెస్ పార్టీ తరుఫున 2019 పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. -
పార్లమెంటులో ఓరుగల్లు దిగ్గజాలు..
ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి లోక్‌సభ సభ్యులుగా దిగ్గజాలు ప్రాతినిధ్యం వహించారు. కేంద్ర మంత్రి నుంచి దేశ ప్రధాని వరకు ఉన్నత పదవులు అధిష్టించి, వాటికి వన్నె తెచ్చారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వరంగల్, మహబూబాబాద్, హన్మకొండ, భద్రాచలం లోక్‌సభ నియోజకవర్గాలుండేవి. వరంగల్ లోక్‌సభ స్థానం 1952 సంవత్సరంలో ఏర్పాటైంది. తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలకు వారిధిగా ఉండే భద్రాచలం నియోజకవర్గం 2009లో రద్దయింది. ఓరుగల్లుకు చెందిన పీవీ నర్సింహారావు భారత ప్రధానిగా సేవలందించి మన్ననలు పొందారు. గిరిజన ఎంపీగా ఎన్నికైన పోరిక బలరాంనాయక్ కేంద్ర మంత్రిగా పనిచేశారు. మైనార్టీ వర్గానికి చెందిన కమాలోద్దీన్ అహ్మద్ మూడుసార్లు హన్మకొండ, ఒకసారి వరంగల్ నుంచి ఎన్నికై కేంద్ర మంత్రిగా సేవలందించారు. పీవీ.. మన ఠీవి.. హన్మకొండ నుంచి 1977, 1980లో రెండుసార్లు ఎంపీగా గెలుపొందిన పీవీ.నర్సింహారావు ఆ తర్వాత భారత దేశానికి ప్రధానమంత్రిగా ప్రాతినిధ్యం వహించారు. ఆయన నంద్యాల నుంచి రెండుసార్లు, రామ్‌టెక్, బరంపురల నుంచి కూడా గెలుపొందారు. మూడు రాష్ట్రాలలో ఎంపీగా ఉన్న తెలుగు నేతగా రికార్డుకు ఎక్కారు. అయన రాష్ట్ర మంత్రిగా, ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా, ప్రధానమంత్రిగా పనిచేసి రాష్ట్రానికి గొప్ప పేరు తెచ్చారు. 1980–1989 మధ్యకాలంలో కేంద్ర హోం, విదేశీ వ్యవహారాల మంత్రిగా పని చేశారు. 1957లో మంథని నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి అడుగు పెట్టారు. 1962లో తొలిసారిగా రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇలా 1971 వరకు మంత్రిగా కొనసాగారు. 1971 సెప్టెంబర్ 30న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పీవీ.నరసింహరావు బాధ్యతలు చేపట్టారు. 1973వ సంవత్సరం వరకు ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి సేవలందించారు. కడియం ఎంపీగా... మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సైతం వరంగల్ ఎంపీగా పని చేశారు. వరంగల్ ఎంపీ ఎస్సీకి రిజర్వ్ కావడంతో 2014లో కడియం శ్రీహరి టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఎంపీగా ఎన్నికైన ఆరు నెలల తరువాత రాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. తర్వాత ఆయన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో ఎన్టీఆర్, చంద్రబాబు మంత్రివర్గాల్లో మంత్రిగా పని చేశారు. కేంద్ర మంత్రిగా కమాలోద్దిన్ అహ్మద్ వరంగల్‌కు చెందిన హన్మకొండ లోక్‌సభ స్థానం నుంచి మూడుసార్లు, వరంగల్ నుంచి ఒకసారి ఎంపీగా గెలుపొంది కమాలోద్దిన్ అహ్మద్ చరిత్ర సృష్టించారు. 1980లో వరంగల్ ఎంపీగా, 1989, 1991, 1996 సంవత్సరాల్లో హన్మకొండ లోక్‌సభ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. కేంద్ర వాణిజ్య శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఒక్కసారి ఎమ్మెల్యేగా సైతం గెలుపొందారు. పీసీసీ అధ్యక్షుడిగా సైతం బాధ్యతలు నిర్వర్తించారు. నాలుగుసార్లు గెలుపొందిన సురేందర్‌రెడ్డి రామసహాయం సురేందర్‌రెడ్డి నాలుగుసార్లు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా గెలుపొందారు. 1967, 1989, 1991లలో వరంగల్ ఎంపీగా, 1965లో ఉప ఎన్నికల్లో మహబూబాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. 1996లో వరంగల్ లోక్‌సభ సభ్యునిగా పోటీ చేసి ఓటమి చెందారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు ఎంతగానో కృషి చేశారు. మంత్రిగా కమలకుమారి భద్రాచలం నుంచి లోక్‌సభ సభ్యురాలుగా కాంగ్రెస్ పార్టీ నుంచి రెండుసార్లు కమలకుమారి గెలుపొందారు. 1989లో సోడే రామయ్యపై, 1991లోనూ ఆయనపైనే విజయం సాధించారు. ఒక్కసారి కేంద్ర మంత్రిగా సైతం పని చేశారు. కేంద్ర మంత్రిగా బలరాం నాయక్ ములుగు మండలం మదనపల్లికి చెందిన పోరిక బలరాం నాయక్ మహబూబాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి 2009లో ఎంపీగా గెలుపొందారు. ప్రధాని మన్మోహన్సింగ్ మంత్రివర్గంలో కేంద్ర న్యాయశాఖ మంత్రిగా పనిచేశారు. 2014 లోకసభ ఎన్నికల్లో ఎంపీగా, 2018లో అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చెందారు. ప్రస్తుత మంత్రి... ఒకప్పటి ఎంపీనే... తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్ శాఖల మంత్రిగా పనిచేస్తున్న ఎర్రబెల్లి దయాకర్‌రావు గతంలో వరంగల్ ఎంపీగా పనిచేశారు. 2008లో ఉప ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి సమీప ప్రత్యర్థి రామేశ్వర్‌రెడ్డిపై గెలుపొందారు. ఎమ్మెల్యేగా ఆరుసార్లు గెలుపొంది, చంద్రబాబు కెబినేట్‌లో ప్రభుత్వ విప్‌గా పని చేశారు. -
వరంగల్‌లో.. వీడని సస్పెన్స్..!
ఉమ్మడి వరంగల్ జిల్లాలో లోక్‌సభ ఎన్నికల రాజకీయం వేడెక్కెంది. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ ప్రకటనతో ఆయా పార్టీలు ప్రచారానికి తెరలేపాయి. కాగా ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల ఎంపిక విషయంలో ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. దీంతో ఆశావహ నేతలతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు టికెట్ల ఖరారు కోసం తీవ్ర ఉత్కంఠతతో ఎదురుచూస్తున్నారు. సాక్షి, వరంగల్: లోక్‌సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యూహరచనలో నిమగ్నం కాగా.. మరోవైపు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ప్రకటనపై మల్లగుల్లాలు పడుతోంది. పది స్థానాలపై ఓ నిర్ణయానికి వచ్చిన కేసీఆర్ వరంగల్, మహబూబాబాద్ అభ్యర్థుల విషయంలో సస్పెన్స్ పెట్టారు. కాంగ్రెస్ పార్టీలో సైతం అభ్యర్థులు పోటాపోటీగా ప్రయత్నాలు చేస్తుండటంతో ఆ పంచాయితీ మంగళవారం ఢిల్లీకి చేరింది. బుధవారం ఓ మారు భేటీ అయినా... శుక్రవారం తేలే అవకాశం ఉందని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులతో సమావేశం ఏర్పాటు చేసిన కేసీఆర్ నుంచి మహబూబాబాద్ ఎంపీ ఆజ్మీరా సీతారాం నాయక్‌కు పిలుపు లేదు. దీంతో ఆయనకు మళ్లీ టికెట్ డౌటే అన్న చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో అటు టీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ పార్టీల నుంచి రోజుకో పేరు తెరమీదకు వస్తోంది. వరంగల్, మహబూబాబాద్‌ల నుంచి అభ్యర్థులను బరిలో కి దింపనున్నట్లు పేర్కొన్న బీజేపీ సైతం 16వ తేదీ తర్వాత ప్రకటించనున్నట్లు వెల్లడించింది. ఢిల్లీ, హైదరాబాద్‌లలో సమావేశాలు కాంగ్రెస్, టీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటనపై ఢిల్లీ, హైదరాబాద్‌లలో సమావేశాలు జరిగినా.. అభ్యర్థులు ఎవరనేది ఇంకా తేలలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఉమ్మడి వరంగల్ జిల్లా మంత్రి, ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులతో వరంగల్, మహబూబాబాద్ లోక్‌సభ అభ్యర్థుల ఎంపికపై చర్చించారు. ఇప్పటికే ఈ రెండు స్థానాలకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును ఇన్చార్జిగా ప్రకటించిన విషయం తెలిసిందే. అందరినీ కలుపుకుని పని చేయాలని సూచించిన కేసీఆర్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు. మరోవైపు ఇప్పటికే ఎన్నికల ప్రచారానికి తెరలేపిన ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 7న వరంగల్ ఓ సిటీ మైదానంలో వరంగల్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని సన్నాహక సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కూడా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. అయితే అభ్యర్థుల ఎంపికపై మాత్రం ఇంకా సస్పెన్స్ వీడటం లేదు. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ సైతం అభ్యర్థుల ఎంపికపై సీరియస్‌గానే కసరత్తు చేస్తోంది. డీసీసీ, టీపీసీసీ నివేదికలను ఢిల్లీకి పంపగా.. ఢిల్లీలో సైతం స్క్రీనింగ్ కమిటీ బుధవారం పరిశీలించినా తుది నిర్ణయానికి రాలేకపోయారు. శుక్రవారం మరోమారు జరిగే మీటింగ్ అనంతరం అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. అభ్యర్థుల ప్రకటన 15 తర్వాతే.. అభ్యర్థుల ఎంపికపై అన్ని పార్టీల్లో కసరత్తు సాగుతున్నా... ఇటీవలి పరిణామాల నేపథ్యంలో అధికారికంగా 15వ తేదీ తర్వాతే ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన మరుసటి æరోజు నుంచే అన్ని పార్టీల్లో అభ్యర్థుల ప్రకటనపై ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొన్నా.. మరో రెండు, మూడు రోజులు వేచి చూడక తప్పేటట్లు లేదు. టిక్కెట్లపై టీఆర్ఎస్ నేతలు అధినేతపై భారం వేసుకోగా.. కాంగ్రెస్ పార్టీలో మాత్రం టికెట్ల లొల్లి రచ్చకెక్కింది. మహబూబాబాద్ ప్రస్తుత ఎంపీ ఆజ్మీరా సీతారాంనాయక్‌కు ఈసారి టికెట్ రాదనే పార్టీ వర్గాలు చెప్తుండగా... వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ అభ్యర్థిత్వంపై «అధినేత కొంత సానుకూలంగా ఉన్నట్లు తెలిసింది. అక్కడ సీతారాంనాయక్‌ను మార్చితే మాజీ ఎమ్మెల్యే, రెడ్యానాయక్ కూతురు మాలోతు కవితకు టికెట్ ఖాయం అంటున్నారు. కాంగ్రెస్ విషయానికి వస్తే వరంగల్ నుంచి 40 మందికి పైగా దరఖాస్తు చేసుకున్నా... మంద కృష్ణ, అద్దంకి దయాకర్, సిరిసిల్ల రాజయ్య, ఇందిరలతో పాటు ఏడెనిమిది మంది పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. మహబూబాబాద్ నుంచి సైతం ములుగు ఎమ్మెల్యే సీతక్క, బలరాంనాయక్, బెల్లయ్య నాయక్ తదితరుల పేర్లపై కసరత్తు జరుగుతోంది. ఇదిలా వుంటే బీజేపీలో మాత్రం ఇప్పటికీ ఎన్నికల జోష్ కనిపించడం లేదు. లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్, టీఆర్ఎస్ సమాయత్తమవుతుంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో మాత్రం ఉత్సాహం కనిపించడం లేదు. టికెట్ల కోసం దరఖాస్తులకే పరిమితమైన నేతలు ప్రచారం మాటెత్తడం లేదు. వరంగల్ నుంచి పరకాల మాజీ ఎమ్మెల్యే ఒంటేరు జయపాల్, చింతా సాంబమూర్తి, సినీనటుడు బాబూమోహన్ పేర్లు వినిపిస్తుండగా, మహబూబాబాద్ నుంచి హుస్సేన్ నాయక్, యాప సీతయ్య, సినీ నటి రేష్మా రాథోడ్ తదితరులు దరఖాస్తు చేసుకున్న వారిలో ఉన్నారు. -
చందాలిచ్చి గెలిపించారు!
సాక్షి, హన్మకొండ : గతంలో పార్టీ సిద్దాంతాలు, వ్యక్తుల గుణగణాలు చూసి నాయకులుగా ఎన్నుకునే వారు. డబ్బులు ఆశించే వారు కాదు. ప్రస్తుతం ఓటర్లు విలువైన ఓటును అమ్ముకోవడం బాధాకరం. నాయకులు కూడా కోట్లు కుమ్మరించి ఓట్లు కొంటున్నారు. గెలుపు కోసం ఎంతకైనా దిగజారుతున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు మాజీ పార్లమెంట్ సభ్యుడు చందుపట్ల జంగా రెడ్డి. రాజకీయాలు ఇంతగా భ్రష్టుపట్టని కాలంలో పలుమార్లు పోటీ చేసి గెలుపోటములను చవిచూసిన ఆయన సాక్షితో పంచుకున్న జ్ఞాపకాలు ఆయన మాటల్లోనే.. చందాలు పోగు చేసి తొలిసారి పోటీ.. ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పని చేశాను. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు నచ్చి, ప్రజలకు సేవ చేసేందుకు‡1965లో రాజకీయాల్లోకి వచ్చి 1967లో మొదటి సారి జనసంఘ్ పార్టీ తరçఫున పరకాల నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచా. ఆ ఎన్నికల్లో నాకు రూ.5,300 ఖర్చయ్యాయి. అది కూడా స్నేహితులు, ప్రజలు చందాలిచ్చారు. అప్పట్లో కూడా ఎన్నికల ఖర్చు కొద్ది కొద్దిగా పెరిగింది కానీ... ఇంతలా పెరగడం లేదు. రెండోసారి పోటీ చేసి ఓడిపోయినప్పుడు రూ.9 వేలు ఖర్చు అయింది. మూడోసారి పోటీ చేసినప్పుడు రూ.19 వేలు ఖర్చయింది. ఇలా నేను పోటీ చేసిన రోజుల్లో ఖర్చు అంతా నామమాత్రంగానే ఉండేది. కర్త–కర్మ–క్రియ... కార్యకర్తలే.. అప్పట్లో కార్యకర్తలు నిష్టతో, త్యాగంతో, కార్యదీక్షతో,సేవాభావంతో, పార్టీ కోసం పని చేసే వాళ్లు. పోలింగ్ రోజు నాడు కూడా కార్యకర్తలకు ఖర్చులకు డబ్బులు ఇచ్చే వారం కాదు. ఆ రోజుల్లో నాలుగు చక్రాల వాహనాలు తక్కువ. ఎక్కువగా సైకిల్, ఎడ్ల బండ్లపైనే ప్రచారం సాగేది. నేను పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే నాటికి నాలుగు చక్రాల వాహనాలు అందుబాటులోకి వచ్చాయి. అప్పుడు జీపులు, అంబాసిడర్ కారులో తిరిగి ఓటర్లను కలిసేవాళ్లం. మొదట్లో పార్టీ జిల్లాకు ఒక జీపు ఇచ్చేది. ఆ క్రమంలో వారంలో ఒకటి, రెండు రోజులు అభ్యర్ధికి వచ్చేది. జీపు రాగానే నియోజకవర్గానికి దూరంగా ఉన్న గ్రామాలకు వెళ్లే వాళ్లం. బుర్రకధలు.. గ్రామపెద్దలు నేడు ప్రచార సాధనాలు, సామాజిక మాధ్యమాలు విరివిగా అందుబాటులోకి వచ్చాయి. అయితే అప్పుడంతా నోటి మాట ద్వారానే ప్రచారం సాగేది. సాంస్కృతిక ప్రదర్శనలు, ముఖ్యంగా బుర్ర కథల ద్వారా ఓటర్లను ఆకట్టుకునేవాళ్లం. నాలుగైదు గ్రామాలు కలిపి ఎన్నికల సభలు నిర్వహించేవాళ్లం. చుట్టు పక్కల గ్రామాల్లోని గ్రామ పెద్దలను, ప్రముఖులను కలిసి భవిష్యత్తు అభివృధ్ధి ప«థకాలు, ఆలోచనల గురించి చెబితే వారు గ్రామంలోని ఓటర్లకు అర్ధమయ్యేలా చెప్పి ఓట్లు వేయించేవారు. ప్రస్తుతం ఎన్నికల్లో డబ్బులు కీలకం. టికెట్లు ఇచ్చే ముందే అభ్యర్థి డబ్బులు ఖర్చు పెడతారా లేదా అని పార్టీలు, నాయకులు చూస్తున్నారు. వ్యాపారవేత్తలు, కాంట్రాక్టర్లు రాజకీయాల్లోకి వస్తూ విచ్చల విడిగా ఖర్చు పెట్టి.. గెలిచాక ప్రజా ధనాన్ని కొల్లగొడుతున్నారు. ఇది మాబోటి వారికి ఆందోళన కలిగిస్తోంది. -
అన్నింటా.. ‘ఆమె’..!
ప్రస్తుత ఆధునిక సమాజంలో మహిళలు పురుషులకు దీటుగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. ఏ కళలోనైనా తమదైన ప్రత్యేకతను చాటుతూ సమాజంలో చెరగని ముద్రను వేస్తున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జనగాం జిల్లా కేంద్రంలో పలు రంగాల్లో రాణిస్తున్న వనితల జీవన విధానానికి సజీవ సాక్ష్యాలు ఈ చిత్రాలు.. మగ్గం నేస్తున్న కుందారం లక్ష్మీదేవి పెట్రోల్ బంక్‌లో పని చేస్తున్న మహిళలు పెంబర్తిలో నగిషీలను తయారు చేస్తున్న మహిళ రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో పూజారిణిగా సందెల బుచ్చమ్మ -
ప్రాణభిక్ష పెట్టండి..
సంగెం: రెక్కాడితేనే డొక్కాని నిరుపేద కుటుంబం. నిత్యం కూలీనాలీ చేసుకుంటేనే ఐదు వేళ్లు నోట్లోకి వెళ్లే దీనస్థితి. అలాంటి కుటుంబంలోని తల్లికి రెండు కిడ్నీలు పాడైపోయాయనే పిడుగులాంటి నిజం వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. రోజు రోజుకు ఆరోగ్యం క్షీణిస్తుండడంతో దిక్కుతోచని దయనీయస్థితిలో ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్న అభాగ్యురాలి దీనగాధ. వరంగల్ రూరల్ జిల్లా సంగెం మండలం కాపులకనపర్తికి చెందిన సదిరం లలిత(45), మల్లయ్య దంపతులకు ఒక కుమారుడు రాజు, కూతరు కోమల ఉన్నారు. గుంట జాగలేని నిరుపేద కుటుంబం కావడంతో రెక్కల కష్టాన్ని నమ్ముకిని కూతురు కోమల, కుమారుడు రాజులకు వివాహం జరిపించారు. ఇక తమ కష్టాలు గట్టెక్కుతాయని అనుకుంటున్న సమయంలో లలిత ఆనారోగ్యం భారినపడింది. ఆసుపత్రుల చుట్టూ తిరిగి మందులు వాడుతున్న క్రమంలో లలితకు రెండు కిడ్నీలు పాడైపోయాయని డాక్టర్లు పిడుగులాంటి నిజం చెప్పారు. లలిత ఆరోగ్యం కుదుట పడాలంటే కిడ్నీ మార్పిడి తప్పనిసరి అని వైద్యులు తేల్చి చెప్పడంతో ఆ కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. లలిత ప్రస్తుతం ఆరోగ్యశ్రీ పథకంలో వరంగల్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో డయాలసిస్ చికిత్స పొందుతున్నది. లలితకు కిడ్నీ ఇచ్చేందుకు భర్త మల్లయ్య, కుమారుడు రాజు సిద్ధంగా ఉన్నప్పటికీ వీరి కిడ్నీ లలి తకు సరిపోతుందో లేదోనని, పరీక్షలు నిర్వహిం చుకోవడానికి కూడా చేతిలో చిల్లిగవ్వలేదని ఆవేదన చెందుతున్నారు. తమ కిడ్నీ సరిపోకుంటే జీవ న్ధాన్ కింద అవయవదానం చేసిన వారి కిడ్నీ అయినా అమర్చి లలితకు ప్రాణభిక్ష పెట్టా లని భర్త ,కుమారుడు వేడుకుంటున్నారు. కిడ్నీ మార్పిడికి దాతలు సహకరించాలని కోరుతున్నారు. అకౌంట్ నంబర్ 73065213615 సదిరం లలిత ఏపీజీవీబీ గవిచర్ల బ్రాంచ్, ఐఎఫ్‌సీ కోడ్ ఏపీజీవీ0005158 -
అందని అత్యవసర సేవలు
ఎంజీఎం : ప్రజా ప్రతినిధుల పట్టింపులేని తనం.. రాష్ట్ర స్థాయి అధికారుల నిర్ణయం పేద రోగుల పాలిట శాపంగా మారాయి. పరికరాల మరమ్మతుకు సేబర్–సిందూరి ఏజెన్సీతో చేసుకున్న ఒప్పందం ఇటూ ఎంజీఎం పరిపాలనాధికారులకు.. అటూ ఆస్పత్రికి వచ్చే బాధితులకు నరకయాతన చూపిస్తున్నాయి. ఇలా ఆస్పత్రి అత్యవసర విభాగంలో సేవలు నిలిచిపోవడం.. ఆస్పత్రి చుట్టు ఉన్న ప్రైవేట్ ల్యాబ్, నర్సింగ్‌హోమ్‌ల దళారులకు వరంగా మారింది. సూపర్‌స్పెషాలిటీ సేవల లేమీతో కొంత మంది దళారులు అత్యవసర కేంద్రం వద్ద నిత్యం అడ్డా వేస్తూ... క్యాజువాలిటీ వద్ద విధులు నిర్వర్తించే సిబ్బందితో చేతులు కలిపి యథేచ్చగా రోగులను ప్రైవేట్ ఆస్పత్రులకు తరలిస్తున్నారు. దీనికి తోడు రక్త పరీక్షల పరికరాలు మరమ్మతులకు నోచుకోకపోవడం సైతం వారికి మరో ఆదాయ వనరుగా మారాయి. దీంతో ఆస్పత్రికి వచ్చే పేద రోగుల జేబులకు చిల్లు పడుతోంది. ఆస్పత్రిలోని సమస్యల పరిష్కారానికి ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించి 20 రోజులు గడస్తున్న చిన్న పాటి సమస్యలు సైతం పరిష్కారం కాకపోవడంతో రోగులకు తిప్పలు తప్పడం లేదు. ఉత్తర తెలంగాణ జిల్లాలకు పెద్ద దిక్కు.. అత్యవసర సేవలకు అపద్బాంధువుగా గుర్తుకు వచ్చే ధర్మాస్పత్రిలో రోజు, రోజుకూ వైద్యసేవలు పరిస్థితి అధ్వానంగా తయారు కావడంతో రోగులు నరకయాతన పడాల్సి వస్తోంది. ఎంజీఎం ఆస్పత్రిలోని అత్యసవర విభాగానికి (క్యాజువాలిటీ) వివిధ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ రోడ్డు ప్రమాద క్షతగాత్రులు, క్రిమి సంహారక మందు తాగి ప్రాణాలతో కొట్టుమిట్టాడే బాధితులు ఎక్కువ సంఖ్యలో వస్తుంటారు. వీరికి మెరుగైనా వైద్య చికిత్సలు అందించేందుకు, పూర్తి స్థాయిలో వారి యొక్క పరిస్థితులను గమనిస్తూ చికిత్సలు అందిచేందుకు క్యాజువాలిటీలోని ఎమర్జెన్సీ ల్యాబ్ ద్వారా పరీక్షలు చేస్తుంటారు. అయితే గత కొన్ని నెలలుగా ఎమర్జెన్నీ ల్యాబ్‌లో లక్షల రూపాయాలు విలువ చేసే పరికరాలు సాంకేతిక లోపం వల్ల పనిచేయడం లేదు. అయితే వీటిని వెంటనే మరమ్మతులు చేయించే పరిస్థితి లేకపోవడంతో అత్యసవరంగా చికిత్సలు అందించేందుకు అవసరమయ్యే రక్తపరీక్షలు కోసం రోగుల బంధుమిత్రులు ప్రైవేట్ కేంద్రాలకు పరుగులు తీసి ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుంది. 8 నెలలుగా నిలిచిపోయిన సీబీపీ పరీక్షలు ఎంజీఎం ఆస్పత్రిలోని ఎమర్జెన్సీ ల్యాబ్‌లో గత 8 నెలలుగా సీబీపీ పరికరంలో సాంకేతిక లోపం ఏర్పడి మరమ్మతుకు నోచుకోకపోయిన పట్టించుకునే వారే కరువయ్యారు. ఆస్పత్రికి తీవ్ర కడుపునొప్పి, అపెండక్స్ వ్యాధితో బాధపడే రోగులతో పాటు రక్తహీనత కలిగిన రోగులకు సీబీపీ(కంప్లీట్ బ్లడ్ పిక్చర్) పరీక్షలు తప్పని సరి. ఇలాంటి రోగులకు సీబీపీ పరికరం ద్వారా ప్లేట్లెట్ కౌంట్, హెచ్బి, డిఫినేషియల్ కౌంట్ వంటి రక్త నివేదికల ఆధారంగా వారికి వైద్య చికిత్సలు అందిస్తుంటారు. అంతేకాకుండా ఓపీ విభాగంలోని రోగులకు రక్త పరీక్షలు నిర్వహించే పాథాలాజీ విభాగంలో సుమారు 45 లక్షలతో నూతనంగా కొనుగోలు చేసిన పరికరం సైతం పనిచేయకపోవడంతో అది కాస్తా నిరుపయోగంగా మారింది. అతి కష్టం మీద అక్కడి సిబ్బంది రోజు మ్యానువల్ పద్ధతిలో 40 మంది ఓపీ రోగులకు ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఎంజీఎం ఆస్పత్రిలో సుమారు ప్రతి రోజు 100 నుంచి 150 మందికీ సీబీపీ పరీక్షలు నిర్వహిస్తుంటారు. ప్రస్తుతం ఈ పరికరాలు పనిచేయకపోవడంతో సుమారు వంద మందికి పైగా రోగులు ప్రైవేట్ డయాగ్నస్టిక్ కేంద్రాన్ని ఆశ్రయిస్తూ ఒక్కొక్కరు రూ. 300 లు ఖర్చు చేయక తప్పడం లేదు. మరమ్మతులకు నోచుకోని సీబీపీ పరికరం సెమీ ఆటో ఎనలైజర్ పరికరం 4 నెలలుగా మూలకే ఎంజీఎం ఎమర్జెన్సీ ల్యాబ్‌లోని సెమీ ఆటో ఎనలైజర్ పరికరంలో ఏర్పడిన సాంకేతిక లోపంతో ఆ పరికరం నిరుపయోగంగా మారింది. దీంతో కిడ్నీ వ్యాధితో బాధపడే రోగులకు నిర్వహించే సీరమ్ క్రియాటిన్ పరీక్షలు నాలుగు నెలలుగా చేయడం లేదు. ఈ రక్త పరీక్షల కోసం రోగులు ప్రైవేట్ కేంద్రాలకు వెళ్ళక తప్పడం లేదు. డయాలసిస్ చేసుకునే రోగులకు సిరమ్ క్రియాటిన్ పరీక్షలు తప్పనిసరి. ఈ వ్యాధితో బాధపడే రోగులు కొంత మంది వారానికి రెండు, మూడు సార్లు సైతం సీరమ్ క్రియాటీన్ పరీక్షలు నిర్వహించుకోవాల్సి ఉంది. నిరుపయోగంగా సెమీ ఆటో ఎనలైజర్ మూడు నెలలుగా ఏబీజీ పరికరం .. ఎంజీఎం అత్యవసర విభాగంలో ఏబీజీ పరికరం ద్వారా అందించే రక్త పరీక్షల నివేదికలు కీలకం. ఆస్పత్రిలోని అత్యవసర విభాగానికి ప్రతి రోజు క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడిన వారిని చికిత్స నిమిత్తం తరలిస్తుంటారు. వీరికి ఏబీజీ పరీక్షలు అవసరం. ఈ పరికరం ద్వారా రక్తంలో బ్లడ్, గ్లూకోజు, హెచ్‌బీ లెవల్స్ తెలిపే నివేదిక ఉంటుంది. ఈ నివేదిక ఆధారంగా వారికి వైద్యచికిత్సలు అందిస్తుంటారు. ఈ పరికరం గత మూడు నెలల క్రితం సాంకేతిక లోపం ఏర్పడి పనిచేయకపోయినా దృష్టి సారించిన దాఖాలా ల్లేవు. ప్రైవేట్ సెంటర్లలో ఏబీజీ పరీక్షల కోసం సుమారు 1100 రూపాయాలు చెల్లించాల్సి వస్తోంది. అయితే ఈ పరికరాన్ని నిర్ణీత ఉష్ణోగ్రతలో ఉంచి రక్త పరీక్షలు చేయాల్సి ఉంటుంది. అయితే ఎమర్జెన్సీ ల్యాబ్ రెండు ఏసీలు ఉండగా..ప్రస్తుతం ఓకే ఒక్క ఏసీ మాత్రమే పనిచేస్తుంది. ఏబీజీ పరికరంలో సాంకేతిక లోపం -
అన్నదాతకు ఆసరా..
కాజీపేట: పంటల సాగు కోసం అన్నదాతలకు బ్యాంకుల ద్వారా ఇచ్చే రుణ పరిమితి పెరగనుం ది. భూమి ఐదెకరాల పైన ఉన్న రైతులకు ఉపయోగకరంగా ఉండేలా రిజర్వు బ్యాంకు నిర్ణ యం తీసుకుంది. ఎలాంటి సెక్యూరిటీ పత్రాలు లేకుండా ప్రతి రైతుకు రూ.1.60 లక్షలు పంట రుణాలు అందించాలన్న నిర్ణయంతో రైతన్నకు కాస్త ఊరట లభించనుంది. ప్రస్తుతం రైతులకు క్రాప్‌లోను కింద రూ.లక్ష వరకు బ్యాంకులు అందిస్తున్నాయి. ఎకరాకు రూ.30వేల చొప్పున ఈ రుణాలు అందుతున్నాయి. అయితే జిల్లాలో ఐదున్నర ఎకరాలు పైబడి ఉన్న రైతులకే పెరిగిన రుణ పరిమితి వర్తించనుంది. ఒకటి, రెండు ఎకరాల భూమి ఉన్న రైతులకు ఇది అంతగా ప్రయోజనం చేకూర్చదు. గతంలో మాదిరిగానే రూ.లక్ష లోపు రుణమే దక్కనుంది. రబీ సీజన్ ప్రారంభమై ముగింపు దశకు చేరుకుంటున్న నేపథ్యం లో ఈ నిబంధనలు రానున్న ఖరీఫ్, రబీ సీజన్లలో రైతులకు వర్తించనున్నాయి. 4.76 లక్షల మంది రైతులు.. ఉమ్మడి జిల్లాలో మొత్తం 4.76 లక్షల మంది రైతులుండగా.. ఐదెకరాలలోపు ఉన్న రైతులు 2.82లక్షలు, ఐదున్నర నుంచి ఆరెకరాల వరకున్న రైతులు 72 వేల పైచిలుకు ఉన్నారు. ఇక పది నుంచి 25 ఎకరాలు ఉన్న రైతులు 89 వేల మంది దాకా ఉన్నారు. 25 ఎకరాలకు పైగా ఉన్న రైతులు 33 వేలకు పైగా ఉన్నారు. వీరందరికీ భూమితో సంబంధం లేకుండా ఆర్బీఐ నిర్ణయించిన ప్రకారమే రూ.1.60 లక్షలు రుణం దక్కనుంది. అంటే ఎకరానికి రూ.30 వేల చొప్పున బ్యాంకు రుణం పరిమితికి లోబడి ఇస్తున్నందున ఐదున్నర ఎకరాలు పైబడిన రైతులందరికీ రుణాలు దక్కనున్నాయి. గతంలో సైతం రాష్ట్ర ప్రభుత్వం పాస్‌పుస్తకాలతో సంబంధం లేకుండానే బ్యాంకర్లు రుణాలు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. గతంలో పాత పాస్పుస్తకాలన్ని బ్యాంకర్ల వద్దనే ఉన్నాయి. ఇక తెలంగాణ ప్రభుత్వం రూ.లక్ష రుణమాఫీ చేస్తే పెద్ద ఎత్తున రైతులకు మేలు జరుగనుంది. కానీ ఇంతవరకు దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. మార్గదర్శకాల కోసం ఎదురుచూపు.. పెరిగిన రుణ పరిమితికి సంబంధించి ఇంకా మార్గదర్శకాలు విడుదల కాలేదు. ప్రస్తుతం ఉన్న రుణాలను మాఫీ చేస్తేనే బ్యాంకర్లు కొత్తగా రుణాలు ఇచ్చేందుకు ముందుకు వస్తారు. గతంలో భూములను మార్టిగేజ్ చేసుకోవడం, పాస్‌పుస్తకాలను పెట్టుకోవడం ద్వారా రుణాలను మంజూరు చేసేవారు. ప్రస్తుతం ధరణి వెబ్సైట్లో రైతులకు భూమి ఎంత ఉందనేది నిర్ధారణ చేసుకున్న అనంతరం పాస్‌పుస్తకాలను చూసి రుణాలను ఇవ్వాల్సి ఉంటుంది. రైతుల నుంచి తనఖా పత్రాలను తీసుకోవడం కానీ, మార్జిగేజ్ చేసేకోవడం కానీ ఇకపై ఉండదు. పాస్‌పుస్తకాలను ధ్రువీకరించుకోవడం కోసమే తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే ఆన్లైన్ ద్వారా ధరణి వెబ్సైట్లో రైతుల సమాచారాన్ని, భూముల వివరాలను, సర్వే నంబర్లను చూసి సదరు భూములు రుణాలు పొందే రైతులవేనా అని సరిచూసుకుని ఇవ్వాల్సి ఉంటుంది. రుణాల పంపిణీ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే రైతులకు ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో ఆర్బీఐ కూడా రైతులకు ప్రయోజనం చేకూరేలా ఆదేశాలను ఇచ్చింది. మార్గదర్శకాలు వచ్చిన తర్వాత బ్యాంకర్లు రుణాల విషయమై చర్యలు తీసుకునే వెసులుబాటు కలుగుతుంది. బ్యాంకర్లు ముందుకొచ్చేనా..? రైతులు ప్రైవేట్ వ్యాపారుల వద్ద అప్పులు తెచ్చుకొని పంటలు సాగు చేస్తున్న విషయం తెలిసిందే. గతంలో మూడెకరాలు ఉన్న రైతులకు రూ.60 నుంచి రూ.90వేల వరకు రుణాలు ఇచ్చేవారు. ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం కూడా మూడెకరాల వరకు ఉన్న రైతులకు ఉపయోగపడలేదు. ఐదున్నర ఎకరాలు పైబడిన రైతులకు మాత్రమే రూ.1.60లక్షలు రానున్నాయి. బ్యాంకర్లు ఇస్తున్న రుణాలకు, పెరిగిపోయిన వ్యవసాయ పెట్టుబడులకు తీవ్ర వ్యత్యాసం ఉంటోంది. పంటలు సాగు చేయడానికి కూలీల ఖర్చు, ట్రాక్టర్లు దున్నకానికి, విత్తనాలు, ఎరువులు మొదలుకొని పంటలు కోసి, దిగుబడులను అమ్ముకునే వరకు రైతులకు నష్టం వస్తుందా లేదా లాభం వస్తుందా తేలని పరిస్థితులున్నాయి. లీడ్ బ్యాంకు అధికారులు ఎప్పటికప్పుడు మండలాలు, డివిజన్ల వారీగా సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేస్తే తప్ప బ్యాంకు మేనేజర్లు రుణాలపై ఓ స్పష్టతకు రారు. రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీపై స్పష్టత ఇవ్వకపోవడంతో పెరిగిన రుణాల విషయంలో బ్యాంకర్లు ఏ మేరకు రైతులకు సహకరిస్తారో వేచిచూడాల్సిందే. ఉమ్మడి జిల్లాలో రైతులు 4.76 లక్షలు ఐదెకరాలలోపు ఉన్నవారు 2.82 లక్షలు 5.5 నుంచి ఆరు ఎకరాలు 72 వేలపైన.. పది నుంచి 25 ఎకరాలు.. 89 వేల మంది 25 ఎకరాలకు పైగా కలిగిన వారు 89 వేల మంది -
తోడేస్తున్నారు..
సాక్షి, భీమదేవరపల్లి(హుస్నాబాద్): జిల్లాకు సాగు నీటి గండం వచ్చింది. అవసరానికి మించి నీటిని తోడేస్తుండడంతోనే ఈ దుర్భర పరిస్థితి ఏర్పడింది. ఏప్రిల్, మే నెలల్లో రావాల్సిన సాగు నీటి కొరత ఫిబ్రవరి చివరి నుంచే మొదలైంది. ఇప్పటికే వ్యవసాయ, బోరుబావుల్లో గణనీయంగా నీటి మట్టం తగ్గిపోయింది. ఏడు మండలాల్లో బోరుబావుల తవ్వకాలతోపాటు అత్యధికంగా నీటిని వినియోగిస్తున్నట్లు భూగర్భజల శాఖ అధికారులు చెబుతున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే రాబోవు రోజుల్లో పరిస్థితి మరింత జఠిలంగా అవుతుందని హెచ్చరిస్తున్నారు. జిల్లాలో మొత్తం 11 మండలాలు ఉండగా.. వీటి పరిధిలో 28,000 వ్యవసాయ బోరుబావులు, 32,000 వ్యవసాయ బావులున్నాయి. సాధారణ సాగు విస్తీర్ణం 24,768 హెక్టార్లు ఉండగా యాసంగిలో 23,728 హెక్టర్లలో వివిధ పంటలు సాగు చేస్తున్నారు. ఇందులో వరి 12,605 హెక్టార్లు, మొక్కజొన్న 9986 హెక్టార్లు, వేరుశనగ 553 హెక్టార్లరు. రైతులు ప్రధానంగా యాసంగిలో వరి, మొక్కజొన్న తదితర పంటలను సాగు చేస్తున్నారు. నిరంతర ఉచిత విద్యుత్ అందుబాటులోకి వచ్చిన నాటి నుంచి సాగు నీటి వినియోగం పెరిగినట్లు తెలుస్తోంది. దీనికి తోడు వర్షం నీటిని నిల్వ ఉంచకపోవడంతో కొరత ఏర్పడుతోంది. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది నెల రోజుల మందుగానే సాగు నీటి సమస్య మొదలైంది. యాసంగిలో వేసిన పంటను కాపాడుకోవడానికి కొత్తగా బోర్లు వేయించడంతోపాటు వ్యవసాయ బావులు తవ్విస్తున్నారు. పలు గ్రామాల్లో 600 ఫీట్ల వరకు బోరు వేసినా నీటి జాడ కనిపించడంలేదు. దీనిని బట్టి పరిస్థితి నీటి వినియోగం ఎమేరకు ఉందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా భీమదేవరపల్లి మండలంలో ఈ పరిస్థితులు నెలకొన్నాయి. అత్యధికంగా నీటి వినియోగం చేసే గ్రామాలు జిల్లాలో అత్యధికంగా సాగు నీటిని వినియోగి స్తున్న గ్రామాలను అధికారులు గుర్తించారు. అందులో భీమదేవరపల్లి మండలంలోని గట్లనర్సింగపూర్, భీమదేవరపల్లి, కొప్పుర్, కొత్తకొండ, మల్లారం, మాణిక్యాపూర్, ముల్కనూర్, ముస్తఫా పూర్, ముత్తారం, ధర్మసాగర్ మండలంలో జానకిపురం, మల్లక్కపల్లి, నారాయణగిరి, ఎల్కతుర్తి మండలంలో బావుపేట, దండెపల్లి, జీల్గుల, పెంచికల్‌పేట, తిమ్మాపూర్, వల్భాపూర్, హసన్‌పర్తి మండలంలో దేవన్నపేట, జయగిరి, లక్నవ రం, పెంబర్తి, ఐనవోలు మండలంలో గర్మిల్లపల్లి, ఐనవోలు, పంతని, పున్నేల, సింగారం, కమలా పూర్ మండలంలో భీంపల్లి, దేశరాజుపల్లి, గూనిపర్తి, ఖాజిపేట మండలంలో మడికొండ, తరాలపల్లి, ఖిలా వరంగల్ మండలంలో గాదేపల్లి, స్తంభంపల్లి, వసంతాపూర్, వేలేరు మండలం లో మల్లికుదుర్ల, వేలేరు ఉన్నాయి. ఫిబ్రవరిలోనే తగ్గిన నీటి మట్టం జిల్లాలో గతేడాది ఫిబ్రవరిలో భూగర్భజల నీటి మట్టం 8.33 మీటర్లు ఉండగా ఈ ఏడాది 9.52 మీటర్లకు చేరింది. గతేడాదితో పోల్చుకుంటే 1.19 మీటర్ల లోతుకు పడిపోయింది. ఇప్పటికే భానుడు తన ప్రతపాన్ని చూపిస్తుండగా ఇక మార్చి, ఏప్రిల్, మే నెలల్లో ఎండలు మరింత ఉగ్రరూపం దాల్చనున్నాయి. దీంతో సాగు నీరు విషయం పక్కనబెటితే తాగు నీటికి సైతం తీవ్ర ఇబ్బందులు తప్పెలా లేవు. పైలెట్ ప్రాజెక్టుగా భీమదేవరపల్లి భూగర్జ జలాలను పెంపొందిచడంలో భాగంగా భీమదేవరపల్లి మండలాన్ని పైలెట్ ప్రాజెక్ట్‌గా ఎంపిక చేశారు. ఇందులో కొప్పుర్, గట్లనర్సింగపూర్, కొత్తకొండ, ముల్కనూర్, ముస్తఫాపూర్ గ్రామాలను ఎంపిక చేశారు. ఆయా గ్రామాల్లో చెక్ డ్యాంలు, చెరువుల్లో కృత్రిమ ఇంకుడు బోరుబావులను నిర్మించనున్నారు. 150 ఫీట్ల వరకు బోరుబావులను తవ్వనున్నారు. దీంతో భూగర్భ జలాలు పెరిగి ఖరీఫ్‌లో సాగు నీరు అధికం కావడానికి ఈ కృత్రిమ ఇంకుడు బోరుబావులు ఉపయోగపడునున్నాయి. ఒక్కో కృత్రిమ ఇంకుడు బోరుబావి నిర్మాణానికి ప్రభుత్వం రూ.లక్ష నుంచి రూ.1.50లక్షల వరకు వెచ్చించనున్నారు. ఆయా గ్రామాల్లో రైతులతో సభలు నిర్వహించి ఎక్కడ కృత్రిమ ఇంకుడు బోరుబావుల తవ్వకం చేపట్టాలనే అంశంపై తీర్మానాలు చేయనున్నారు. ఈ మేరకు ఇటీవల కొత్తకొండలో సమావేశం నిర్వహించారు. నూతన బోర్లు, బావులకు చెక్.. భూగర్జ జలాలు తగ్గిపోతుండడంతో జిల్లాలోని ఏడు మండలాల పరిధిలో 37 గ్రామాలను బ్లాక్ లిస్టులో పెట్టినట్లు అధికారులు చెబుతున్నారు. ఆ యా గ్రామాల్లో నూతనంగా బోరులు వేయొద్దని, బావుల తవ్వకం చేపట్టవద్దని హెచ్చరిస్తున్నారు. ఒక వేళ వేసినట్లైతే కేసులు నమోదు చేయడంతోపాటు జరిమానాలు సైతం విధించనున్నారు. -
రూ.5వేలు లంచం తీసుకుంటూ..
సాక్షి, పరకాల : కల్యాణలక్ష్మి లబ్ధిదారుడి నుంచి రూ. ఐదు వేలు లంచం తీసుకుంటూ రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఏసీబీకి చిక్కిన ఘటన శనివారం చోటుచేసుకుంది. ఏసీపీ డీఎస్పీ భద్రయ్య తెలిపిన వివరాల ప్రకారం పరకాల మండలం రాయపర్తి గ్రామానికి చెందిన పర్నెం శ్రీనివాస్‌రెడ్డి తన కూతురు పెళ్లి చేసి కల్యాణలక్ష్మి పథకానికి దరఖాస్తు చేçసుకున్నాడు. పథకానికి అర్హులు కావడానికి పలు ధృవీకరణ పత్రాలు అందజేశాడు. అయినప్పటికీ ఆరునెలలుగా నడికుడ ఆర్ఐ సంపత్‌కుమార్ పెండింగ్‌లో పెడుతూ ఇబ్బందులు పెడుతున్నాడు. లంచం ఇస్తేనే పనిచేస్తానని స్పష్టం చేయడంతో శ్రీనివాస్‌రెడ్డి ఏసీబీని ఆశ్రయించాడు. వారి సూచనల మేరకు కార్యాలయంలో సంపత్‌కుమార్‌కు రూ.ఐదు వేల లంచం అందజేశాడు. కొద్ది క్షణాలకే ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. రూ. ఐదు వేలు స్వాధీనం చేసుకొని ఏసీబీ కోర్టుకు తరలించారు. నడికుడ తహశీల్దార్ కార్యాలయం ప్రారంభం అయిన సమయంలోనే వీఆర్వో నుంచి ఆర్ఐగా ఉద్యోగోన్నతి పొందిన ఆయన ఏసీబీ చిక్కడం కలకలం రేపింది. -
అసంతృప్తులపై ‘తారక’మంత్రం!
సాక్షిప్రతినిధి, వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కొందరు టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు మంత్రివర్గ విస్తరణ షాక్ నుంచి ఇంకా తేరుకోవడం లేదు. ఏళ్ల తరబడిగా తెలంగాణ ఉద్యమం, టీఆర్ఎస్ పార్టీలో గులాబీ దళనేత కేసీఆర్ వెంట నడిచిన పలువురి ఆశలు అడియాసలు అయ్యాయి. రెండోసారి తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలో వచ్చిన నేపథ్యంలో చివరి నిమిషంలో అవకాశం చేజారడాన్ని ఆశావహులు ఇంకా జీర్ణించుకోవడం లేదు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కనీసం రెండు మంత్రి పదవులన్నా దక్కుతాయని భావించగా... ఎర్రబెల్లి దయాకర్‌రావు ఒక్కరితోనే సరిపెట్టడంతో అమాత్య పదవి రేసులో ఉన్న నేతలకు చుక్కెదురు అయ్యింది. టీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వం, సీఎం కేసీఆర్‌పై విధేయత ఉన్నా... చివరి నిముషంలో చేజారిన బృహత్తర అవకాశాన్ని మరచిపోలేక పోతున్నారు. ఇదే సమయంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్లమెంట్ నియోజకవర్గాల సన్నాహక సమావేశాల షెడ్యూల్ ఖరారు కాగా, ఆ సమావేశాలను సక్సెస్ చేయాల్సిన బాధ్యత ఉమ్మడి జిల్లా ప్రజాప్రతిని«ధులు భుజాన వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత కేబినెట్‌ను పోల్చుకున్న ఆశావహులు తెలంగాణ రాష్ట్ర తొలి కేబినెట్లో జిల్లాకు స్పీకర్, రెండు మంత్రి పదవులు దక్కాయి. వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య, రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్, స్పీకర్‌గా సిరికొండ మధుసూదనాచారికి అవకాశం దక్కింది. తర్వాత డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా రాజయ్య పదవి కోల్పోవడంతో ఆయన స్థానంలో కడియం శ్రీహరికి ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రిగా అవకాశం కల్పించారు. డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించగా రెండోసారి సీఎంగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టిన సమయంలో మహమూద్ అలీతో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. అయితే ›ఫిబ్రవరి 19న జరిగిన విస్తరణలో మాజీ మంత్రితో పాటు మరొకరికైనా మంత్రి పదవులు వస్తాయని ఆశించారు. ఇందులో భాగంగానే కడియం శ్రీహరి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్, ధరంసోత్ రెడ్యానాయక్ తదితరులు ఎవరికీ వారుగా మంత్రి వర్గంలో చోటు లభిస్తుందని ఆశించారు. అయితే ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ఒక్క ఎర్రబెల్లి దయాకర్‌రావుకే మంత్రి పదవి దక్కడంతో మిగతా నేతల ఆశలపై నీళ్లు జల్లినట్లయ్యింది. చివరి నిమిషం వరకు వస్తుందనుకున్నప్పటికీ రాకపోవడంతో పలువురు అసంతృప్తికి గురి కాగా... యువనేత, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రంగంలోకి దిగడంతో అసంతృప్తి నేతలు కలిసి నడుస్తున్నారు. ఇలా అసంతృప్తులపై ‘తారక’మంత్రం పని చేస్తోంది. మంత్రి ‘ఎర్రబెల్లి’ ఇంట్లో నేతల భేటీ కేటీఆర్ పర్యటనను విజయవంతం చేసేందుకు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు హన్మకొండలోని రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు నివాసంలో శనివారం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మంత్రి ఎర్రబెల్లితో పాటు మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, రాజ్యసభ సభ్యులు బండా ప్రకాష్, ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్యేలు దాస్యం వినయ్‌భాస్కర్, నన్నపనేని నరేందర్, టి.రాజయ్య, చల్లా ధర్మారెడ్డి, అరూరి రమేష్, పెద్ది సుదర్శన్‌రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ గద్దల పద్మ, కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, టీవీవీ చైర్మన్ వాసుదేవరెడ్డి, పార్టీ నాయకులు మార్నేని రవిందర్‌రావు, బీరెల్లి భరత్‌కుమార్, ధర్మరాజు తదితరులు పాల్గొన్నారు. కేటీఆర్ పర్యటనను విజయవంతం చేద్దాం.. ఈ సందర్భంగా మంత్రి దయాకర్‌రావు మాట్లాడుతూ ఈ నెల 7న వరంగల్ పర్యటనకు వస్తున్న కల్వకుంట్ల తారకరామారావు పర్యటనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పార్లమెంట్ ఎన్నికలపై పార్లమెంట్ నియోజకవర్గాల వారిగా ముఖ్యకార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తున్న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈనెల 7న ఉదయం వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి ముఖ్యకార్యకర్తలతో సన్నాహక సమావేశంలో పాల్గొనేందుకు నగరానికి వస్తున్నారని తెలిపారు. ఆయనకు ఘనస్వాగతం పలకడానికి, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మూడువేల మంది ముఖ్యకార్యకర్తలు హాజరయ్యే విధంగా చూడాలన్నారు. నగరాన్ని సుందరంగా తీర్చిదిద్ది, స్వాగతం తోరణాలు ఏర్పాటు చేయాలని, అందుకు అవసరమైన కమిటీలను వేసి ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలని సూచించారు. -
మంత్రి వర్గంలో ‘ఎర్రబెల్లి’కి చోటు
రాష్ట్ర కేబినెట్లో జిల్లా నుంచి ఒక్కరికే అవకాశం రావడంతో మంత్రి వర్గంలో చోటుదక్కుతుందని భావించిన ఆశావహులకు నిరాశే ఎదురైంది. ఉమ్మడి వరంగల్‌లో 12 నియోజకవర్గాలు ఉండగా పది స్థానాలను టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలుచుకున్నారు. గత ప్రభుత్వంలో స్పీకర్‌తోపాటు రెండు మంత్రి పదవులు జిల్లాను వరించాయి. ఈ సారి ఒక్క పదవి మాత్రమే దక్కడంతో మిగతా వారికి కార్పొరేషన్ల చైర్మన్, ప్రభుత్వ విప్, పార్లమెంటరీ కార్యదర్శి పదవుల్లో అవకాశం కల్పించనున్నట్లు తెలుస్తోంది. సాక్షి, వరంగల్ రూరల్ : రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. అమాత్య పదవులు ఎవరిని వరించబోతున్నాయన్న ఊహగానాలకు ఎట్టకేలకు తెరపడింది. మంత్రివర్గంలో ఎవరెవరికి చోటు కల్పించాలనే విషయమై పూర్తి స్థాయి కసరత్తు అనంతరం జాబితాను సిద్ధం చేశారు. అందులో ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి పాలకుర్తి శాసన సభ్యుడు ఎర్రబెల్లి దయాకర్‌రావుకు చోటు లభించినట్లు సీఎం కార్యాలయం నుంచి ఆయనకు ఫోన్ కాల్ వచ్చింది. నేడు ప్రమాణ స్వీకారం ఈనెల 19న మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని నిర్ణయించిన సీఎం కేసీఆర్ ఈ విషయమై గవర్నర్ నరసింహన్‌కు తెలియజేశారు. ఉదయం 11:30 గంటలకు రాజ్ భవన్లో మంత్రుల చేత ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. మంత్రి వర్గ విస్తరణ చేపట్టనుండడంతో ఇప్పటి వరకు ఉత్కంఠగా ఎదురుచూసిన ఆశావహులు పదవి దక్కించుకోవడానికి, అందులోనూ అనుకున్న శాఖ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. గత కేబినెట్లో స్పీకర్, రెండు మంత్రి పదవులు.. తెలంగాణ రాష్ట్ర తొలి కేబినెట్లో జిల్లాకు స్పీకర్, రెండు మంత్రి పదవులు దక్కాయి. వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య, రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్, స్పీకర్‌గా సిరికొండ మధుసూదనాచారికి అవకా శం దక్కింది. తర్వాత డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా రాజయ్య పదవి కోల్పోవడంతో ఆయన స్థానంలో కడియం శ్రీహరికి ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రిగా అవకాశం కల్పించారు. డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించగా రెండో సారి సీఎంగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టిన సమయంలో మహమూద్ అలీతో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మం త్రి వర్గ విస్తరణ చేయలేదు. ప్రస్తుతం ముహూర్తం ఖరారు కావడంతో ఉత్కంఠకు తెరపడింది. మంత్రిగా ‘ఎర్రబెల్లి’కి అవకాశం పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావుకు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు రావాల ని ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఫోన్ ద్వారా సమాచారం అందింది. తొలి సారిగా మం త్రి వర్గంలో దయాకర్‌రావుకు చోటు దక్కింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 నియోజకవర్గాలకు 10 స్థానాలను టీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంది. అందులో వరంగల్ తూర్పు ఎమ్మెల్యేగా నన్నపునేని నరేందర్, పశ్చిమ ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్, వర్ధన్నపేట అరూరి రమేష్, పాలకుర్తి ఎర్రబెల్లి దయాకర్‌రావు, మహబూబాబాద్ శంకర్‌నాయక్, డోర్నకల్ రెడ్యానాయక్, నర్సంపేట పెద్ది సుదర్శన్‌రెడ్డి, పరకాల చల్లా ధర్మారెడ్డి, స్టేషన్‌ఘన్‌పూర్ డాక్టర్ రాజయ్య, జనగామ యాదగిరిరెడ్డి ఎన్నికయ్యారు. అయితే మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరితోపాటు ఎమ్మెల్యేలు దయాకర్‌రావు, ధరంసోత్ రెడ్యానాయక్, వినయ్‌భాస్కర్, అరూరి రమేష్‌లకు మంత్రి వర్గంలో చోటు లభిస్తుందని ప్రచారం జరిగింది. తాజాగా ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ఒక్క ఎర్రబెల్లి దయాకర్‌రావుకే మంత్రి పదవి దక్కడం చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యేగా డబుల్ హ్యాట్రిక్.. వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరికి చెందిన ఎర్రబెల్లి దయాకర్‌రావు 1982లో ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీలో చేరారు. 1994లో జరిగిన సాధారణ ఎన్నికల్లో వర్ధన్నపేట నియోజకవర్గం నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తరువాత 1999లో రెండోసారి, 2004లో మూడో సారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1999లో నాటి చంద్రబాబు ప్రభుత్వంలో ప్రభుత్వ విప్‌గా పని చేశారు. ఆ తరువాత 2009లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజన తరువాత పాలకుర్తి నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. 2009 ఎన్నికల్లో పాలకుర్తి నుంచి నాలుగోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2014 ఎన్నికలతోపాటు 2018లో జరిగిన ఎన్నికల్లో వరుసగా వరుసగా ఆరో సారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2014 ఎన్నికల తరువాత టీడీఎల్పీ నేతగా వ్యహరించారు. 2016లో టీడీపీని వీడి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2018 డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో 53,062 ఓట్ల భారీ మెజార్టీ విజయం సాధించారు. హైదరాబాద్‌లోనే దయాకర్‌రావు మంత్రివర్గ విస్తరణ మంగళవారం జరుగుతున్న నేపథ్యంలో పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు హైదరాబాద్‌లోనే ఉన్నారు. కశ్మీర్లో ఇటీవల ఉగ్రవాదులు జరిపిన దాడిలో వీరమరణం పొందిన సీఆర్పీఎఫ్ జవాన్లుకు తన సాయంగా రూ.2.50లక్షల చెక్‌ను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు సోమవారం అందించారు. ఇదే సందర్భంలో కేటీఆర్ ఎర్రబెల్లికి ముందస్తు అభినందలు తెలిపినట్లు సమాచారం. ఇది జరిగిన కొన్ని నిమిషాల తేడాతోనే ప్రగతి భవన్ నుంచి ఫోన్ రావడంతో ఆయన రాజధానిలోనే ఉన్నారు. మండలి చైర్మన్‌గా కడియం? గత ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన కడియం శ్రీహరికి శాసన మండలి చైర్మన్‌గా అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత మండలి చైర్మన్ స్వామిగౌడ్ ఎమ్మెల్సీ పదవీ కాలం త్వరలో ముగియనుండడంతో ఆ స్థానం కడియంకు దక్కుతుందని ప్రచారం జరుగుతోంది. డోర్నకల్ ఎమ్మెల్యే ధరంసోత్ రెడ్యానాయక్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్‌లకు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్ పదవులు, ప్రభుత్వ విప్, పార్లమెంటరీ కార్యదర్శి పదవులు దక్కే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఎర్రబెల్లి దయాకర్‌రావు బయోడేటా.. పూర్తి పేరు: ఎర్రబెల్లి దయాకర్‌రావు తండ్రి : ఎర్రబెల్లి జగన్నా«థరావు తల్లి : ఎర్రబెల్లి ఆదిలక్ష్మి భార్య : ఉషాదయాకర్‌రావు కుమారులు: ఎర్రబెల్లి ప్రేమ్ చందర్రావు స్వగ్రామం: గ్రామం, మండలం, పర్వతగిరి, జిల్లా వరంగల్ రూరల్ పుట్టిన తేది: 04–07–1956 విద్యార్హతలు: ఇంటర్మీడియట్ రాజకీయరంగ ప్రవేశం : 1982, తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రథమ కన్వీనర్‌గా నియామకం, 1994లో వర్ధన్నపేట ఎమ్మెల్యేగా ఎన్నిక,1997లో టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నిక, 1999లో ప్రభుత్వ విప్‌గా ఎన్నిక,2008లో ఎంపీగా గెలుపు. 2009, 2014, 2018లో పాలకుర్తి ఎమ్మెల్యేగా ఎన్నిక. -
భూతగాదాలో తమ్ముడి హత్య
లింగాలఘణపురం : మండలంలోని మాణిక్యాపురంలో అన్నదమ్ముల భూమి తగాదాలో తమ్ముడు బడికె సత్తయ్య (65) హత్యకు గురైన సంఘటన శుక్రవారం రాత్రి జరిగింది. ఈ కేసులో ఆరుగురిపై కేసు నమోదు చేశారు. ఎస్సై వేణుగోపాల్ తెలిపిన వివరాల ప్రకారం.. మాణిక్యాపురంలో బడికె బుచ్చి ఎల్లయ్య, బడికె సత్తయ్య అన్నదమ్ముల మధ్య కొన్నేళ్లుగా భూమి పంచాయతీ సాగుతుంది. శుక్రవారం బుచ్చిఎల్లయ్య ట్రాక్టర్ తీసుకొని వివాదాస్పదంగా ఉన్న భూమిలో దున్నేందుకు వెళ్లాడు. విషయం తెలుసుకున్న సత్తయ్య అక్కడకు వెళ్లి ట్రాక్టర్‌ను అడ్డుకున్నాడు. ఈ సమయంలో అన్నదమ్ములు బుచ్చిఎల్లయ్య, సత్తయ్యల మధ్య వివాదం జరిగి ఘర్షణకు దిగారు. దీంతో సత్తయ్య కిందపడి స్త్పహ కోల్పోయాడు. గమనించిన స్థానికులు సత్తయ్యను జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు బడికె మల్లేశ్, బడికె చంద్రయ్య, బడికె బుచ్చిఎల్లయ్య, పరశురాములు, చౌదరిపల్లి కరుణాకర్, రాగం నర్సింహులుపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వేణుగోపాల్ తెలిపారు. కాగా, మాణిక్యాపురంలో సత్తయ్య అంత్యక్రియల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్సై బందోబస్తు నిర్వహించారు. -
ప్రియుడు మోసం చేశాడని ఆత్మహత్యాయత్నం
కాశిబుగ్గ : ప్రియుడు మోసం చేశాడని ఓ యువతి ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన శనివారం వరంగల్ నగరంలోని హెడ్‌పోస్టాఫీసు వద్ద చోటుచేసుకుంది. ఇంతేజార్గంజ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని లేబర్ కాలనీకి చెందిన మౌనిక కీర్తినగర్‌కు చెందిన ఆటో డ్రైవర్ సమీర్‌ను మూడేళ్లుగా ప్రేమిస్తోంది. అనుకోకుండా ఇద్దరి మధ్య మనస్పర్థలు చోటుచేసుకోవడంతో మౌనిక ఆవేశంలో హెడ్‌పోస్టాఫీసు వద్దకు చేరుకోని ట్రాఫిక్ పోలీసులు చూస్తుండగానే చేతిపై బ్లేడ్‌తో గాయం చేసుకుంది. రక్తం పోతుండగా కేకలు వేస్తున్న బాధితురాలిని అక్కడే ఉన్న ట్రాఫిక్ పోలీసు చేరదీసి కర్చిప్‌తో కట్టుకట్టి ఇంతేజార్గంజ్ పోలీసులకు సమాచారం ఇవ్వగా ఎస్సై అక్కడికి చేరుకుని ఆమెను స్టేషన్‌కు తీసుకెళ్లారు. సంఘటనకు దారితీసిన పరిస్థితులపై ఆరాతీస్తున్నామని, త్వరలోనే సమస్యను పరిష్కారమయ్యేలా కృషి చేస్తామని సీఐ రవికుమార్ తెలిపారు. -
యువకుడి ఆత్మహత్య
హన్మకొండ చౌరస్తా : తన పెళ్లిని తల్లి నిరాకరించందని మనస్తాపం చెందిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన గురువారం నయీంనగర్‌లో చోటుచేసుకుంది. హన్మకొండ హెడ్‌కానిస్టేబుల్ కృష్ణనాయక్ కథనం ప్రకారం.. హన్మకొండలోని పోచమ్మకుంటకు చెందిని పబ్బిషెట్టి యాదగిరి(36) పదేళ్లుగా నయింనగర్‌లో మీ సేవ కేంద్రాన్ని నిర్వహిస్తున్నాడు. ఇటీవల యాదగిరి హుజురాబాద్‌కు చెందిన యువతితో పెళ్లి నిశ్చయమైంది. కాగా యువకుడి తల్లి ఉపేంద్ర ఈ వివాహాన్ని నిరాకరించింది. తన పెళ్లికి తల్లి అడ్డుకుంటోందని మనస్తాపం చెందిన యాదగిరి.. బుధవారం రాత్రి సిబ్బంది వెళ్లిపోయాక, మీసేవ కేంద్రంలోని సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం ఉదయం సిబ్బంది తాళం తీసి ఉన్న షటర్‌ను తెరిచి చూడగా యాదగిరి ఆత్మహత్య చేసుకుని కనపించాడు. హన్మకొండ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎంకు తరలించారు. మృతుడు సోదరుడు విజయ్‌కుమార్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
కుటుంబ కలహాలతో యువకుడి ఆత్మహత్య
రఘునాథపల్లి : కుటుంబ కలహాలతో మనోవేదనకు గురైన ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం మేకలగట్టు శివారు ఎర్రగడ్డతండాలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం... ఎర్రగడ్డతండాకు చెందిన ఇస్లావత జాన్,బుజ్జి దంపతుల రెండో కుమారుడు ఇస్లావత్ మహేందర్ (22) హైదరాబాద్‌లోని ఓ కంపెనీలో పని చేస్తుండేవాడు. వారం క్రితం వరి పంట కోత పనులున్నాచి, ఇంటికి రావాలని తండ్రి పోన్ చేయడంతో మహేందర్ తండాకు చేరుకొని వరి కోత పనులు చేస్తున్నాడు. శుక్రవారం ఉదయం మహేందర్ తల్లిదండ్రుల వద్ద తన పెళ్లి ప్రస్తావన తీసుకురాగా అన్న పెళ్లి కాకుండా నీ పెళ్లి కుదరదంటూ నిరాకరించారు. ఈ నేపథ్యంలో ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో మనస్తాపం చెందిన మహేందర్ వ్యవసాయ బావి వద్దకు వెళ్లి పురుగుల మందు తాగాడు. మధ్యాహ్నం వరకు కుమారుడు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు వ్యవసాయ బావి వద్దకు వెళ్లి చూడగా పురుగుల మందు తాగి అపస్మాకర స్థితిలో ఉన్న కుమారుడిని చూసి పెద్ద ఎత్తున రోదించారు. స్థానికులు చేరుకొని వెంటనే జనగామ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య జనగామ మార్చుకీలో మహేందర్ మృతదేహాన్ని సందర్శించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఎస్సై రంజిత్‌రావు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఆర్మీ రిక్రూట్మెంట్
వరంగల్ స్పోర్ట్స్ : ఈ నెల 21 నుంచి 31వ తేదీ వరకు నిర్వహించే ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీకి జిల్లా యంత్రాంగం సహకరించాలని రిక్రూట్మెంట్ బోర్డు సికింద్రాబాద్ అధికారి పవన్‌పూరి కోరారు. గురువారం పలువరు జిల్లా అధికారులతో కలిసి హన్మకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియాన్ని ఆయన పరిశీలించారు. అభ్యర్థులకు కావాల్సిన వసతులను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో హన్మకొండ ఏ సీపీ రాజేంద్రప్రసాద్, డీఆర్డీఏ డీడీ రాము, డీపీఆర్ఓ డీడీ జగన్, కార్పొరేషన్ ట్రాన్కో ఈఈ లక్ష్మారెడ్డి, మెడికల్ ఆఫీసర్ రాజిరెడ్డి, ఆర్డీఓ వెంకారెడ్డి ఆర్డబ్ల్యూఎస్, రెవెన్యూ ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు. -
బైక్‌ను ఢీకొన్న డీసీఎం
చిల్పూరు : మండలంలోని మల్కాపూర్, పీచర రోడ్డులోని మా దవశెట్టి లక్ష్మయ్య వ్యవసాయ బావి సమీపంలో బుధవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెండారు. స్థానిక ఎస్సై గురుస్వామి తెలిపిన వివరాల ప్రకారం... వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ, మల్లారం గ్రామ సమీపంలోని వీర్లగడ్డతండాకు చెందిన గుగులోతు రమేష్(35), గుగులోతు హర్య(45)లు చిల్పూరు మండలం రాజవరం గ్రామంలో ఓ వివాహానికి హాజరై తిరిగి ద్విచక్ర వాహనంపై స్వగ్రామానికి బయలు దేరారు. మల్కాపూర్ గ్రామం దాటి కొద్ది దూరం వెళ్లిన తర్వాత ఎదురుగా వేగంగా వస్తున్న డీసీఎం ఢీకొట్టడంతో రమేష్ తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. వెనుకాల కూర్చున్న హర్య దూరం ఎగిరి పడి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే స్థానికులు 108కి సమాచారం అందించి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. ట్రాక్టర్ డ్రైవర్‌గా పని చేస్తున్న రమేష్‌కు భార్య రమ ఇద్ధరు ఆడపిల్లలు ఉండగా, వ్యవసాయం చేసుకునే హర్యకు భార్య అంబలి కుమారుడు, కుమార్తె ఉన్నారు. సంఘటన విషయం తెలియగానే జనగామ డీసీపీ మల్లారెడ్డి, స్టేషన్‌ఘన్‌పూర్ ఏ సీపీ వెంకటేశ్వరబాబు, సీఐ రావుల నరేందర్‌లు ఘటన స్థలానికి చేరుకుని జరిగిన తీరును పరిశీలించారు. బాధిత కుటుంబాలకు పరామర్శ. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన సంఘటన తెలి యగానే మృతుల బందువులు పెద్ద ఎత్తున గ్రామానికి చేరుకుని విలపించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎడవెళ్లి క్రిష్ణారెడ్డి, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు పోలేపల్లి రంజిత్‌రెడ్డి, యూత్ అధ్యక్షుడు బబ్బుల వంశీ, పెరుమాండ్ల వేణు, వైఎస్సార్సీపీ మండల అడ్హాక్ కమిటీ కన్వీనర్ జంగం రవి, చిల్పూరు గుట్ట దేవస్థానం డైరెక్టర్ వెన్నం మాదవరెడ్డిలు పరామర్శించారు. -
రైతుల వద్దకే మట్టి నమూనా పరీక్షలు
శాయంపేట(భూపాలపల్లి) : తెలంగాణ వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా మట్టి పరీక్ష ప్రయోగశాల నుంచి సంచార భూసార పరీక్ష కేంద్రం ద్వారా రైతుల వద్దకే వచ్చి మట్టి నమూనాలను సేకరించి అక్కడే పరీక్షలు నిర్వహించి అప్పటికప్పుడు రైతులకు పరీక్షా ఫలితాలకు సంబంధించిన రిపోర్టు పత్రాన్ని అందజేయనున్నట్లు భూసారా పరీక్షా కేంద్రం ఏడీఏ బీ. రామ్‌జీ తెలిపారు. మండలంలో మొదటి విడతగా పెద్దకోడెపాక, కాట్రపల్లి గ్రామాల్లో ‘మొబైల్ వ్యాన్’ ద్వారా సంచార భూసారా పరీక్షలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. దీని ద్వారా రైతులు పండించే పంటలను ముందుగానే అంచనా వేసుకునే వీలుంటుందన్నారు. పరీక్షల ద్వారా మట్టిలో ఉన్న నత్రజని, భాస్వరం, పోటాషియం ఎంతవేయాలో వ్యవసాయ అధికారులు సిఫారసు చేయడంతోపాటు రిపోర్టులో ఉంటుందన్నారు. మట్టిలోని ఆమ్ల, క్షార గుణాలను, లవణాలైన సోడియం, మెగ్నిషియం, కాల్షియం సాంద్రతను తెలసుకునే వీలుంటుందన్నారు. తద్వారా భూమికి కావా ల్సిన ఎరువుల వాడకాన్ని, ఎలాంటి భూమిలో ఏఏ పంట లు వేసుకోవడం ద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చో తెలిసిపోతుందన్నారు. రైతులు విత్తనాలు వేస్తే ఎంత శాతం మొలకెత్తే అవకాశం ఉంటుందో వీటి ద్వారా తెలస్తుందన్నారు. ఎంపిక చేసిన గ్రామాల్లో ప్రతి రైతు భూసార పరీక్షలను సద్వినియోగం చేసుకుని పంటల దిగుబడి సాధించుకోవాలని సూచించారు. అనంతరం మట్టి పరీక్షలు నిర్వహించిన రైతులకు అక్కడే ఫలితాల పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో భూసార పరీక్షా కేంద్రం ఏఓ హేమలత, సూర్యనారాయణ, వ్యవసాయ విస్తరణ అధికారులు ఎండీ అహ్మద్ రజా, ఆర్. శివకుమార్, కాట్రపల్లి సర్పంచ్ జర్పుల మాజీబాయి, రాజుపల్లి సర్పంచ్ లావుడ్యా కమల, ఎంపీటీసీ హనీఫా, కో ఆప్షన్ సభ్యుడు ఎస్కే గౌస్, సమన్వయ సమితి సభ్యులు శ్రీనివాస్, గట్టు కుమారస్వామి, రైతులు తదితరులు పాల్గొన్నారు. -
‘మిషన్ భగీరథ’ పనులను పూర్తి చేయాలి
జనగామ అర్బన్ : జిల్లాలో మిషన్ భగీరథ పనులను సకాలంలో పూర్తి చేయాలని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో బుధవారం సాయంత్రం అధికారులతో ఆయన సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు 90శాతం పనులు పూర్తయ్యాయని, మిగిలిన పది శాతం పనులను మే పదో తేదీ వరకు పూర్తి చేయాలన్నారు. ఇందుకు అవసరమైన చర్యలను కలెక్టర్‌తో పాటు మిషన్ భగీరథ చీఫ్ ఇంజనీర్ విజయ్‌పాల్‌రెడ్డి, ఎస్ఈ ఏసురత్నాల నుంచి తీసుకోవాలన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పనుల్లో అలసత్వం ప్రదర్శించే అధికారులను ఉపేక్షించేది లేదన్నారు. జిల్లా కేంద్రంతో పాటు అన్నీ గ్రామాల్లో అర్హులైన వారి ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ఇచ్చే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఓ వైపు పనులు చేస్తూనే మరోవైపు మిషన్ భగీరథ ద్వారా వచ్చే నీరు సురక్షితమైందనే విషయంపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి మాట్లాడుతూ జఫర్‌గఢ్ మండలంలో కూడా మిషన్ భగీరథ పనులను సాధ్యమైనంత తర్వగా పూర్తి చేసేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. సమావేశంలో ప్రభుత్వ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు, ఎంపీ బూరనర్సయ్య గౌడ్, రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాష్, జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్, పాలకుర్తి ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, తాటికొండ రాజయ్య, ఎర్రబెల్లి దయాకర్‌రావు, అధికారులు పాల్గొన్నారు. -
పోలీసులను ఆశ్రయించిన ప్రేమజంట
ఎల్కతుర్తి : రక్షణ కల్పించాలని ప్రేమ జంట పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు ప్రేమజంట మంగళవారం ఎల్కతుర్తిలో విలేకరులతో మాట్లాడింది. కమలాపూర్ మండల కేంద్రానికి చెందిన మౌటం నాగలక్ష్మి, కొండి ధనుంజయ ఆరు సం వత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. ఈనెల 20న హైదరాబాద్‌లోని ఆర్య సమాజ్‌లో వివాహం చేసుకున్నారు. దీంతో నాగలక్ష్మి తల్లిదండ్రులు కమలాపూర్ పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు పెట్టారు. 21వ తేదీన ధనుంజయ ఇంటిపై నాగలక్ష్మి బంధువులు దాడి చేశారు. తమపై దాడి చేసే అవకాశాలు ఉన్నాయని, తమకు రక్షణ కల్పించాలని ధనుంజయ, నాగలక్ష్మి ఈ సందర్భంగా సీఐ రవికుమార్‌ను కోరారు. -
ఆపరేషన్ థియేటర్లో ఏం జరిగిందంటే..
వరంగల్ క్రైం: రోహిణిలో జరిగిన ప్రమాదంపై సోమవారం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినా అసలు కారణం పై అ«ధికారులు దృష్టి సారించా రు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకా రం.. థియేటర్లో న్యూరో ఆపరేషన్ జరుగుతోంది. ఆ సమయంలో థియేటర్‌కు వచ్చే ఆక్సిజన్ పైపు నుంచి లీకేజీ అవుతోంది. గమనించని సిబ్బంది వైద్య పరికరాల స్విచ్ ఆన్‌చేశారు. ప్లగ్ లూజ్‌గా ఉండడంతో స్విచ్‌బోర్డులో మంటలు లేచాయి. అప్పటికే ఆక్సిజన్ లీకవుతుం డడంతో ప్లగ్‌లో వచ్చిన మంటలకు గ్యాస్ తోడు కావడంతో పెద్ద ఎత్తున చెలరేగడంతో విద్యుత్ సరఫరా నిలిచి పోయింది. ఆపరేషన్ చేస్తున్న డాక్టర్ రోగిని ఎత్తుకుని బయటకు పరుగు తీశాడు. పక్కనే ఆర్థో విభాగంలో ఆపరేషన్ చేస్తున్న మరో డాక్టర్ కరెంట్ పోవడంతో బయటకు వచ్చాడు. తిరిగి ఆపరేషన్ థియేటర్లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పొగతో లోపలికి వెళ్లలేదు. దీంతో థియేటర్లోనే పేషెంట్ ఉన్నా డు. ఆపరేషన్ థియేటర్‌కు సరఫరా అయ్యే ఆక్సిజన్ సిలిండర్‌తోనే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. -
నాలుగు జిల్లాలు !
కొత్తగా తొర్రూరు రెవెన్యూ డివిజన్ ఆ డివిజన్‌లోకి కొడకండ్ల మరో మూడు మండలాల ప్రతిపాదనలుl పరిశీలనలో టేకుమట్ల, పెద్ద వంగర, కొమురవెల్లి కాజీపేట వద్ద కొత్తగా మరో బ్రిడ్జి నిర్మాణం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన సీఎంతో జిల్లా ప్రజాప్రతినిధుల భేటీ సాక్షిప్రతినిధి, వరంగల్ : ఎక్కువ మండలాలు ఉన్నందునే వరంగల్ జిల్లాను నాలుగు జిల్లాలుగా పునర్విభజిస్తున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు తెలిపారు. భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాలు ఏర్పాటు చేయగా, మిగిలిన వరంగల్ జిల్లాలో మండలాల సంఖ్య ఎక్కువగా ఉందని... ఈ కారణంగానే నాలుగో జిల్లా ఏర్పాటును ప్రతిపాదించామని చెప్పారు. శుక్రవారం ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో సీఎం కేసీఆర్‌తో జిల్లా నేతలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జిల్లాల పునర్విభజన, అభివృద్ధి అంశాలపై చర్చ జరిగింది. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, కరీంనగర్ ఎంపీ బి.వినోద్‌కుమార్, పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఈ భేటీలో పాల్గొన్నారు. ప్రజాభిప్రాయం ప్రకారమే జిల్లాల పునర్విభజన జరుగుతుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. కొత్త రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటు ఇదే తరహాలో జరిగేలా చొరవ తీసుకోవాలని జిల్లా ప్రజాప్రతినిధులను ఆదేశించారు. ‘వరంగల్ జిల్లాలో కొత్తగా భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాలను ఏర్పాటు చేసిన తర్వాత కొన్ని మండలాలు యాదాద్రి, సిద్ధిపేట జిల్లాల్లో కలుస్తున్నాయి. మిగిలిన మండలాలు ఎక్కువగా ఉండడంతో వరంగల్ జిల్లాను రెండుగా చేయాలని ప్రతిపాదించాము. రెండు జిల్లాలు ఎలా ఉండాలనేదానిపై ప్రజాభిప్రాయం తీసుకుంటున్నాం. ప్రజాభిప్రాయానికి అనుగుణంగానే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది’ అని వివరించారు. ప్రతిపాదిత మహబూబాబాద్ జిల్లాలోని తొర్రూరును రెవెన్యూ డివిజన్ కేంద్రంగా మార్చాలని సీఎం కేసీఆర్ అధికారులకు సూచించారు. తొర్రూరు రెవెన్యూ డివిజన్లో కొడకండ్ల మండలాన్ని చేర్చాలని పేర్కొన్నారు. కొత్తగా టేకుమట్ల(చిట్యాల), పెద్దవంగర(కొడకండ్ల), కొమురవెల్లి(చేర్యాల) మండలాలను ఏర్పాటు చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. నగర అభివృద్ధికి ప్రాధాన్యం హైదరాబాద్ తర్వాత రాష్ట్రంలో పెద్ద నగరమైన గ్రేటర్ వరంగల్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. వరంగల్‌లో ఇప్పటికే ఆరోగ్య విశ్వవిద్యాలయం ఏర్పాటైందని... గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయబోతున్నామని పేర్కొన్నారు. జాతీయ స్థాయి టెక్స్టైల్ పార్కును త్వరలోనే నిర్మించబోతున్నట్లు తెలిపారు. వరంగల్ నగరం అభివృద్ధికి రాష్ట్ర బడ్జెట్లో రూ.300 కోట్లు కేటాయించామని... స్మార్ట్ సిటీ, హృదయ్లోనూ ఎంపికైనందున వరంగల్‌ను ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేసుకోవాలన్నారు. వరంగల్–హైదరాబాద్ ప్రధాన రహదారిపై ఉన్న కాజీపేట బ్రిడ్జికి సమాంతరంగా మరో బ్రిడ్జిని నిర్మించి నాలుగు లేన్ల రహదారిగా అభివృద్ధి చేయనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు వెంటనే రూపొందించాలని జాతీయ రహదారుల విభాగం ఈఎన్సీ గణపతిని ఆదేశించారు. -
రెండు కుటుంబాలకు వైఎస్ షర్మిల పరామర్శ
-
రెండు కుటుంబాలకు వైఎస్ షర్మిల పరామర్శ
హైదరాబాద్: వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల వరంగల్ జిల్లాలో చేపట్టిన రెండోదశ పరామర్శ యాత్ర ఐదో రోజు కొనసాగుతోంది. యాత్రలో భాగంగా శుక్రవారం నాలుగు కుటుంబాలను షర్మిల పరామర్శించనున్నారు. పరకాల నియోజక వర్గం నుంచి యాత్ర ప్రారంభించిన షర్మిల మొదటగా మండలంలోని మల్కక్కపేటలోని రాసమల్ల తిరుపతి కుటుంబాన్ని పరామర్శించారు. తర్వాత ఇదే మండలంలోని నాగారంలో కాంబత్తుల శ్రీహరి ఇంటికి వెళ్లి వారి కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పారు. అక్కడి నుంచి లక్ష్మీపురంలోని చెల్పూరి ఉప్పలయ్య ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులకు భరోసా ఇస్తారు. చివరగా మొగళ్లపల్లి మండలం ఇసిపేటలోని యార రాజయ్య కుటుంబాన్ని పరామర్శిస్తారు. శుక్రవారం 25 కిలోమీటర్లు పరామర్శయాత్ర కొనసాగుతుంది. కాగా, జిల్లాలో చేపట్టిన రెండో దశ యాత్ర నేటితో ముగియనుంది. -
షర్మిల రాకతో పులకిస్తున్న కుటుంబాలు
-
మంచి రోజులు మళ్లీ వస్తాయి
ఓరుగల్లు పరామర్శ యాత్రలో షర్మిల భరోసా * నాలుగో రోజు ఏడు కుటుంబాలకు ఓదార్పు * షర్మిల రాకతో పులకిస్తున్న కుటుంబాలు * నేడు ముగియనున్న రెండో దశ యాత్ర సాక్షి ప్రతినిధి, వరంగల్: ‘‘అంతా మంచే జరుగుతుంది. ఇక నుంచి మీరు మా కుటుంబమే. ఏ ఇబ్బంది వచ్చినా మేమున్నాం. మంచి రోజులు మళ్లీ వస్తాయి’’ - అంటూ పరామర్శ యాత్రలో తనను ఆప్యాయంగా అక్కున చేర్చుకుంటున్న వారికి షర్మిల భరోసా ఇచ్చారు. వరంగల్ జిల్లాలో ఆమె రెండో దశ పరామర్శ యాత్ర గురువారం నాలుగో రోజు నర్సంపేట, పరకాల, భూపాలపల్లి అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో కొనసాగింది. మహా నేత వైఎస్ రాజశేఖరరెడ్డి అకాల మృతిని తట్టుకోలేక మరణించిన ఏడుగురి కుటుంబాలను షర్మిల పరామర్శించారు. నర్సంపేటలోని సెయింట్ మేరీ స్కూల్ ఆవరణ నుంచి మొదలై దుగ్గొండి, శాయంపేట, రేగొండ, పరకాల మండలాల్లో 98 కిలోమీటర్ల దూరం యాత్ర జరిగింది. వైఎస్ తనయ, జగన్మోహన్రెడ్డి సోదరి తమ గ్రామాలకు వస్తోందని తెలియగానే ఆమెను చూసేందుకు ప్రజలు బారులుతీరారు. దారిపొడవునా ఘనస్వాగతం పలికారు. ఆత్మీయంగా ఆదరించారు. తమ ఇంటి మనిషే తిరిగొచ్చినట్టుగా ఆనందపడ్డారు. వైఎస్ మృతితో తమ కుటుంబాలు పెద్ద దిక్కును కోల్పోయినట్టే అయిందంటూ ఆవేదన వెలిబుచ్చారు. ‘‘మీ నాయన మాకు చేసిన మేలు మాటల్లో చెప్పలేమమ్మా. పింఛన్లు, ఆరోగ్యశ్రీ, 108, ఫీజు రీయింబర్స్మెంట్, ఉచిత కరెంటు, రైతు రుణమాఫీ వంటి పథకాలతో మాకందరికీ ఆత్మీయుడయ్యాడాయన. ఆయన పోయాక అంతా మారిపోయింది’’ అని పరకాల మండలం కామారెడ్డిపల్లెలోని కొయ్యడ రాజమౌళి కుటుంబసభ్యులు అన్నారు. ‘వైఎస్ ఉంటే మాకు భరోసా ఉండేది. ఇంత దూరం మాకోసం వచ్చిన నిన్ను మరవమమ్మా’ అని ఆత్మకూరు మండలం పెద్దాపురంలో వేల్పుల వీరమ్మ కుటుంబసభ్యులు అన్నారు. డిమాండ్ల సాధన కోసం నిరసన దీక్షలు చేస్తున్న ఆశ వర్కర్లు ఆత్మకూరు, రేగొండ మండల కేంద్రాల్లో షర్మిల దగ్గరికి వచ్చి కలిశారు. తమ డిమాండ్లను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున అసెంబ్లీలో ప్రస్తావించేలా చూడాలని కోరారు. వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని షర్మిల హామీ ఇచ్చారు. జిల్లాలో షర్మిల రెండో దశ పరామర్శ యాత్ర శుక్రవారంతో ముగియనుంది. అన్నం పెట్టిన మహానేత నర్సంపేట నియోజకవర్గం దుగ్గొండి మండలం బంధంపల్లిలో ఎల్లాపురం కొమురమ్మ ఇంటికి షర్మిల వెళ్లారు. కొమురమ్మ మనుమరాలు అంకిళ్ల జ్యోతిని పరామర్శించారు. పరకాల నియోజకవర్గం ఆత్మకూరు మండలం పెద్దాపురంలోని వేల్పుల వీరాస్వామి కుటుంబసభ్యులను పరామర్శించారు. అనంతరం భూపాలపల్లి నియోజకవర్గం శాయంపేట మండలం పత్తిపాకలో బోయిని నర్సయ్య కుటుంబసభ్యులను ఓదార్చారు. ‘అమ్మా నీ ఆరోగ్యం జాగ్రత్త’ అని నర్సయ్య భార్య పోచమ్మతో అన్నారు. షర్మిల తమ ఇంటికి రావడం పట్ల వారు సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం రేగొండ మండలం కోనారావుపేటలోని తిప్పారపు మల్లమ్మ, సుల్తాన్‌పూర్‌లో గజవెల్లి వెంకట్రాజం కుటుంబాలను ఓదార్చారు. ‘ధైర్యంగా ఉండండి. మీకు అండగా ఉంటా’నంటూ వెంకట్రాజం భార్య రాధక్కకు భరోసా ఇచ్చారు. అనంతరం కనిపర్తిలోని పల్లెబోయిన ఓదెలు కుటుంబాన్ని పరామర్శించారు. ‘ఆరోగ్యం ఎలా ఉంది? నాతో వస్తావా’ అని ఓదెలు భార్య సారమ్మను అడిగారు. రాజన్న బిడ్డ తన ఇంటికొచ్చిందంటే నమ్మలేకపోతున్నానంటూ సారమ్మ ఆనందపడ్డారు. తర్వాత పరకాల మండలం కామారెడ్డిపల్లెలో రాజమౌళి కుటుంబాన్ని షర్మిల పరామర్శించారు. వైఎస్సార్ సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి నేతృత్వంలో జరుగుతున్నపరామర్శ యాత్రలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గట్టు శ్రీకాంత్‌రెడ్డి, ఎడ్మ కిష్టారెడ్డి, ముఖ్య అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి, యువజన విభాగం అధ్యక్షుడు బీష్వ రవీందర్, వరంగల్ జిల్లా అధ్యక్షుడు జెన్నారెడ్డి మహేందర్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు మునిగాల విలియం, నాడెం శాంతికుమార్, భీమయ్యగౌడ్, ఎస్.భాస్కర్‌రెడ్డి, బి.శ్రీనివాస్‌రావు, ఎ.కుమార్, ఎం.శంకర్, టి.నాగారావు, ఎ.సంతోష్‌రెడ్డి, ఎస్.భిక్షపతి పాల్గొన్నారు. -
నాలుగోరోజు షర్మిల పరామర్శ యాత్ర
-
కొమురమ్మ కుటుంబానికి వైఎస్ షర్మిల పరామర్శ
హైదరాబాద్: వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల వరంగల్ జిల్లాలో చేపట్టిన రెండోదశ పరామర్శ యాత్ర నాల్గో రోజు కొనసాగుతోంది. యాత్రలో భాగంగా షర్మిల గురువారం ఏడు కుటుంబాలను పరామర్శించనున్నారు. మొదటగా నర్సంపేట నియోజకవర్గం దుగ్గొండి మండలం బంధంపల్లిలో ఎల్లాపురం కొమురమ్మ కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. వారి కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అక్కడి నుంచి పరకాల నియోజకర్గం ఆత్మకూరు మండలం పెద్దాపురంలో వేల్పుల వీరాస్వామి ఇంటికి వెళ్లి కుటుంబసభ్యులను పరామర్శిస్తారు. అనంతరం భూపాలపల్లి నియోజకవర్గం శాయంపేట మండలం పత్తిపాకలో బోయిన నర్సయ్య కుటుంబానికి భరోసా కల్పిస్తారు. అనంతరం రేగొండ మండలం కోనారావుపేటలోని తిప్పారపు మల్లమ్మ కుటుంబాన్ని పరామర్శిస్తారు. తర్వాత ఇదే మండలంలోని సుల్తాన్‌పూర్‌లో గజవెల్లి వెంకట్రాజం కుటుంబాన్ని ఓదార్చుతారు. అక్కడి నుంచి కనిపర్తికి చేరుకుని పల్లెబోయిన ఓదెలు కుటుంబాన్ని పరామర్శిస్తారు. నాలుగో రోజు చివరగా పరకాల మండలం కామారెడ్డిపల్లెలోని కొయ్యడ రాజమౌళి కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. గురువారం పరామర్శ యాత్ర దూరం 107 కిలో మీటర్లు సాగనుంది. -
ఆరు కుటుంబాలకు షర్మిల పరామర్శ
-
మూడోరోజు షర్మిల పరామర్శ యాత్ర
-
ఆరు కుటుంబాలకు షర్మిల పరామర్శ
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల వరంగల్ జిల్లాలో చేపట్టిన రెండోదశ మూడోరోజు పరామర్శయాత్ర ముగిసింది. రెండోదశ పరామర్శ యాత్రలో భాగంగా బుధవారం వైఎస్ షర్మిల వరంగల్ జిల్లాలో నర్సంపేట, ములుగు నియోజకవర్గాల్లోని ఆరు కుటుంబాలను పరామర్శించారు. షర్మిల వెంట పార్టీ నాయకులు పొంగులేటి సుధాకర్ రెడ్డి, గట్టు శ్రీకాంత్ రెడ్డి, రవీందర్, మహేందర్ రెడ్డి తదితరులున్నారు. -
ఐలయ్య కుటుంబానికి వైఎస్ షర్మిల పరామర్శ
హైదరాబాద్: వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల వరంగల్ జిల్లా లో చేపట్టిన పరామర్శ యాత్ర మూడో రోజు కొనసాగుతోంది. యాత్రలో భాగంగా బుధవారం ఐదు కుటుంబాలను షర్మిల పరామర్శించనున్నారు. మొదటగా నెక్కొంట మండలం మండలం వెంకటాపురంలోని కూరం ఐలయ్య కుటుంబాన్ని షర్మిల పరామర్శించారు. అనంతరం దీక్షకుంట చేరుకుని అక్కడ బేతం చంద్రయ్య కుటుంబానికి భరోసా ఇచ్చారు. అనంతరం కొమ్ముల మల్లమ్మ కుటుంబాన్ని పరామర్శిస్తారు. అక్కడి నుంచి చెన్నారావు పేట మండలం జీజీఆర్ పల్లికి చేరుకుని బూస నర్సయ్య కుటుంబానికి భరోసా కల్పిస్తారు. మూడో రోజు యాత్రలో చివరగా ములుగు నియోజకవర్గంలోని కొత్తగూడ మండలం ఓటాయితండలోని బానోత్ మంగళి కుటుంబాన్ని షర్మిల పరామర్శిస్తారు. -
ముగిసిన రెండో రోజు షర్మిల పరామర్శయాత్ర
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల వరంగల్ జిల్లాలో చేపట్టిన రెండోదశ రెండో రోజు పరామర్శయాత్ర ముగిసింది. యాత్రలో భాగంగా మంగళవారం మహబూబాబాద్ నియోజక వర్గంలోని నెల్లికుదురు, మహబూబాబాద్, గూడురు మండలాల్లో ఏడు కుటుంబాలను షర్మిల పరామర్శించారు. ఈ రోజు 93 కిలో మీటర్ల మేర పర్యటించారు. షర్మిల వెంట పార్టీ నాయకులు పొంగులేటి సుధాకర్ రెడ్డి, కొండా రాఘవరెడ్డి, గట్టు శ్రీకాంత్ రెడ్డి, రవీందర్, మహేందర్ రెడ్డి తదితరులున్నారు. తొర్రూరు నుంచి ప్రారంభమైన యాత్రలో మొదటగా నెల్లికుదురు మండలం ఎర్రబెల్లి గూడెం లోని కమ్మజర్ల సాయమ్మ కుటుంబాన్ని షర్మిల పరామర్శించారు. వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు. తార్సింగ్బాయి తాండాలో గుగులోత్ బచ్చి కుటుంబాన్ని, చిన్నముప్పారంలో కె.వెంకట్రాం నర్సయ్య కుటుంబాన్ని, మహబూబాబాద్‌లో కర్రెయ్య కుటుంబాన్ని, గాంధీపురంలో షేక్ బికారి కుటుంబాన్ని, బ్రాహ్మణపల్లి లక్ష్మీపురంలోని ఆలకుంట్ల లక్ష్మయ్య కుటుంబాన్ని, చివరగా గూడూరు మండలం ఊట్లలోని సబావట్ మంగమ్మ కుటుంబాన్ని షర్మిల పరామర్శించారు. తలసేమియా వ్యాధితో బాధపడుతున్న బబ్బి మనవడు, మనవరాలికి వైద్యం చేయిస్తానని భరోసా ఇచ్చారు. అనారోగ్యంతో బాధపడుతున్న పిల్లల తల్లిదండ్రులకు ఉపాధి చూపుతానని షర్మిల హామీ ఇచ్చారు. -
కర్రెయ్య కుటుంబానికి షర్మిల పరామర్శ
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల వరంగల్ జిల్లాలో చేపట్టిన రెండోదశ పరామర్శయాత్ర రెండో రోజు కొనసాగుతోంది. యాత్రలో భాగంగా మంగళవారం మహబూబాబాద్ నియోజక వర్గంలోని ఏడు కుటుంబాలను షర్మిల పరామర్శిస్తారు. తొర్రూరు నుంచి ప్రారంభమైన యాత్రలో మొదటగా నెల్లికుదురు మండలం ఎర్రబెల్లి గూడెం లోని కమ్మజర్ల సాయమ్మ కుటుంబాన్ని షర్మిల పరామర్శించారు. వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు. మహబూబాబాద్‌లో కర్రెయ్య కుటుంబాన్ని, తార్సింగ్బాయి తాండాలో గుగులోత్ బచ్చి కుటుంబాన్ని షర్మిల ఓదార్చారు. తలసేమియా వ్యాధితో బాధపడుతున్న బబ్బి మనవడు, మనవరాలికి వైద్యం చేయిస్తానని భరోసా ఇచ్చారు. అనారోగ్యంతో బాధపడుతున్న పిల్లల తల్లిదండ్రులకు ఉపాధి చూపుతానని షర్మిల హామీ ఇచ్చారు. -
సాయమ్మ కుటుంబానికి వైఎస్ షర్మిల పరామర్శ
-
సాయమ్మ కుటుంబానికి వైఎస్ షర్మిల పరామర్శ
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల వరంగల్ జిల్లాలో చేపట్టిన రెండోదశ పరామర్శయాత్ర రెండో రోజు కొనసాగుతోంది. యాత్రలో భాగంగా మంగళవారం మహబూబాబాద్ నియోజక వర్గంలోని ఏడు కుటుంబాలను షర్మిల పరామర్శిస్తారు. తొర్రూరు నుంచి ప్రారంభమైన యాత్రలో మొదటగా నెల్లికుదురు మండలం ఎర్రబెల్లి గూడెం లోని కమ్మజర్ల సాయమ్మ కుటుంబాన్ని షర్మిల పరామర్శించారు. వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం తార్సింగ్ బాయితండాలోని గుగులోత్ బబ్బి కుటుంబాన్ని కలుసుకుంటారు. అక్కడ నుంచి చిన్నముప్పారంలో కె.వెంకట్రాం నర్సయ్య కుటుంబాన్ని పరామర్శిస్తారు. అనంతరం మహబూబాబాద్ చేరుకుని పట్టణంలోని కరయ్య కుటుంబాన్ని ఓదార్చుతారు. అనంతరం అదే మండలంలోని గాంధీపురం గ్రామానికి చెందిన షేక్ బికారి కుటుంబానికి భరోసా ఇచ్చి, బ్రాహ్మణపల్లి లక్ష్మీపురంలోని ఆలకుంట్ల లక్ష్మయ్య కుటుంబాన్ని ఓదార్చుతారు. చివరగా గూడూరు మండలం ఊట్లలోని సబావట్ మంగమ్మ కుటుంబాన్ని పరామర్శిస్తారు. మంగళవారం పరామర్శ యాత్రలో భాగంగా షర్మిల 119.5 కిలోమీటర్లు ప్రయాణించనున్నారు. -
బొల్లు ఎల్లమ్మ కుటుంబానికి వైఎస్ షర్మిల పరామర్శ
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల వరంగల్ జిల్లాలో చేపట్టిన పరామర్శ యాత్ర ఐదో రోజు కొనసాగుతోంది. యాత్రలో భాగంగా శుక్రవారం నాలుగు కుటుంబాలను షర్మిల పరామర్శించనున్నారు. ముందుగా పరకాల నియోజక వర్గం సంగెం మండలం రామచంద్రాపురంలోని బొల్లు ఎల్లమ్మ కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం వర్థన్న పేట నియోజక వర్గం పర్వతగిరి మండలం ఏనుగల్లులో పెండ్యాల చంద్రకళ కుటుండ సభ్యులను పరామర్శిస్తారు. తర్వాత పర్వతగిరిలోని పుల్లూరు కొమురమ్మ ఇంటికి వెళ్ళి భరోసా ఇస్తారు. చివరగా పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు మండలం సోమారంలో మేడిద శాంతమ్మ కుటుంబ సభ్యులను కలుస్తారు. శుక్రవారం పరామర్శ యాత్ర 67 కిలోమీటర్లు సాగనుంది. వరంగల్ జిల్లాలో మొదటి విడతగా వైఎస్ షర్మిల చేపట్టిన పరామర్శ యాత్ర నేటితో ముగియనుంది. -
రాజ్యలక్ష్మి కుటుంబానికి వైఎస్ షర్మిల పరామర్శ
-
సుదర్శన్ కుటుంబానికి వైఎస్ షర్మిల పరామర్శ
-
చిరంజీవి కుటుంబానికి వైఎస్ షర్మిల పరామర్శ
-
తీగల చిరంజీవి కుటుంబానికి వైఎస్ షర్మిల పరామర్శ
హైదరాబాద్: దివంగత మహానేత వైఎస్సార్ తనయ, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల వరంగల్ జిల్లాలో చేపట్టిన పరామర్శ యాత్ర నాలుగో రోజు కొనసాగుతోంది. పరామర్శ యాత్రలో భాగంగా షర్మిల గురువారం ఏడు కుటుంబాలను పరామర్శించనున్నారు. ముందుగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గం పెద్దమ్మగడ్డ లోని తీగల చిరంజీవి కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. అక్కడి నుంచి వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని పోచమ్మమైదాన్‌లో జన్ను సక్కుబాయి ఇంటికి వెళ్తారు. తర్వాత దేశాయిపేటలోని బత్తాపురం కొమురయ్య, కాశిబుగ్గలోని నాగవెల్లి వీరస్వామి, ఉర్సులోని రామ సుదర్శన్ కుటుంబాలను పరామర్శిస్తారు. అనంతరం పరకాల నియోజకవర్గం గీసుగొండ మండలంలోని మరిపురంలోని బిట్ల రాజ్యలక్ష్మీ ఇంటికి వెళ్తారు. నాలుగో రోజు చివరగా ఇదే మండలం ఊకల్ హవేలిలోని ఓదెల స్వామి కుటుంబాన్ని పరామర్శిస్తారు. గురువారం పరామర్శ యాత్ర 68 కిలో మీటర్లు సాగనుంది. -
కాకర్ల రాజయ్య కుటుంబానికి షర్మిల పరామర్శ
వరంగల్ : వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం సింగారంలో దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ షర్మిలకు మహిళలు బోనాలతో స్వాగతం పలికారు. మహానేత మరణం తట్టుకోలేక మరణించిన కాకర్ల రాజయ్య కుటుంబాన్ని షర్మిల పరామర్శించారు. అండగా ఉంటామని రాజయ్య కుటుంబ సభ్యులకు ఈ సందర్భంగా ఆమె భరోసా ఇచ్చారు. ఆ తర్వాత మామూనూరులోని ఎర్ర భాస్కర్ ఇంటికి వెళ్లి అతడి కుటుంబసభ్యులను షర్మిల పరామర్శించనున్నారు. షర్మిల వరంగల్ జిల్లాలో చేపట్టిన పరామర్శ యాత్ర బుధవారం మూడో రోజుకు చేరుకుంది. పరామర్శ యాత్రలో భాగంగా బుధవారం ఆమె ఏడు కుటుంబాలను పరామర్శించనున్నారు. -
మర్రి లక్ష్మి కుటుంబానికి వైఎస్ షర్మిల పరామర్శ
-
మర్రి లక్ష్మి కుటుంబానికి వైఎస్ షర్మిల పరామర్శ
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల వరంగల్ జిల్లాలో చేపట్టిన పరామర్శ యాత్ర మూడో రోజు కొనసాగుతోంది. స్టేషన్ ఘన్పూర్ నియోజక వర్గం నుంచి పరామర్శ యాత్ర ప్రారంభమైంది. యాత్రలో భాగంగా షర్మిల బుధవారం ఏడు కుటుంబాలను పరామర్శించనున్నారు. ముందుగా నియోజకవర్గంలోని ధర్మసాగర్ మండలం పీచరలోని ఎడపెల్లి వెంకటయ్య కుటుంబాన్నిషర్మిల పరామర్శించారు. అనంతరం ఇదే మండలం మల్లికుదురులోని మర్రి లక్ష్మీ ఇంటికి వెళ్లి వారికి భరోసా ఇచ్చారు. అనంతరం వర్ధన్నపేట నియోజకవర్గంలోని మడికొండలో మద్దెల గట్టయ్య, దోమ లింగయ్య, బస్కుల సుధాకర్ కుటుంబాలను షర్మిల పరామర్శిస్తారు. తర్వాత వర్ధన్నపేట మండలం సింగారంలోని కాకర్ల రాజయ్య కుటుంబాన్ని పరామర్శిస్తారు. చివరగా మామూనూరులోని ఎర్ర భాస్కర్ ఇంటికి వెళ్లి పరామర్శిస్తారు. మూడో రోజు ఏడు కుటుంబాలను పరామర్శించే క్రమంలో 82.5 కిలో మీటర్ల దూరం మేరకు యాత్ర సాగనుంది. -
లచ్చవ్వ కుటుంబానికి వైఎస్ షర్మిల పరామర్శ
-
శోభారాణి కుటుంబానికి వైఎస్ షర్మిల పరామర్శ
-
యాదగిరి కుటుంబానికి వైఎస్ షర్మిల పరామర్శ
చేర్యాల: వరంగల్ జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి వైఎస్ షర్మిల చేపట్టిన పరామర్శ యాత్ర సోమవారం చేర్యాల మండల కేంద్రం నుంచి ప్రారంభమైంది. ముందుగా ఆమె చేర్యాల పెద్దమ్మగడ్డ ప్రాంతంలోని బస్వగల్ల యాదగిరి కుటుంబాన్ని పరామర్శించారు. వైఎస్ఆర్ మరణాన్ని తట్టుకోలేక తనువు చాలించిన యాదగిరి తల్లిదండ్రులు బాలనర్సయ్య, లక్ష్మిలను ఓదార్చారు. యాదగిరి తమ్ముడు కృష్ణ, చెల్లెలు లలితలతో మాట్లాడారు. వారి కుటుంబ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అనంతరం ఆమె మద్దూర్ మండలంలోకి ప్రవేశించారు. ఆమె వెంట ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర నేతలు కొండా రాఘవరెడ్డితోపాటు మహేందర్‌రెడ్డి, లింగారెడ్డి, చంద్రాచారి తదితరులు ఉన్నారు. అంతకుముందు ఉదయం మెదక్ జిల్లా ప్రజ్ఞాపూర్ లో షర్మలకు పార్టీ నేతలు , కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. అక్కడ వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం వరంగల్ బయల్దేరి వెళ్లారు. -
యాదగిరి కుటుంబానికి వైఎస్ షర్మిల పరామర్శ
-
విద్యుత్ వైర్లు తెగి..నిలిచిపోయిన రైళ్లు
వరంగల్ : వరంగల్ జిల్లా సమీపంలోని ఎల్గూర్ రంగంపేట వద్ద బుధవారం ఉదయం రైల్వే విద్యుత్ వైర్లు తెగిపోయాయి. దీంతో ఈ మార్గంలో నడిచే రైళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఎల్గూర్ రంగంపేట వద్ద విద్యుత్ వైర్లు తెగిన విషయం తెలిసిన వెంటనే సమీప రైల్వే స్టేషన్లలో రైళ్లను నిలిపివేశారు. విజయవాడ సికింద్రాబాద్, పలాస, బల్లార్ష వైపు వెళ్లే రైళ్లను ఆపేశారు. 2 గంటల నుంచి రైళ్లు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కె. సముద్రంలో తమిళనాడు, గుండ్రామడుగులో శాతవాహన , నెక్కొండలో సింహపురి ఎక్స్‌ప్రెస్, మహబూబాబాద్ లో కోణార్క్ ఎక్స్ ప్రెస్ లను నిలిచిపోయాయి. రైల్వే సిబ్బంది విద్యుత్ వైర్లను పునరుద్ధరించే పనిలో ఉన్నారు. -
బ్రేకుల్లేని బస్సులా కేసీఆర్ పాలన
బీజేపీ శాసన సభాపక్ష నేత డాక్టర్ కె.లక్ష్మణ్ అంకుశం వంటి ప్రతిపక్షం ఏర్పాటు చేయాలి ఎమ్మెల్సీ అభ్యర్థి రామ్మోహన్‌రావును గెలిపించాలి జనగామ : రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలన బ్రేకుల్లేని ఆర్టీసీ బస్సులా ఉందని బీజేపీ శాసన సభా పక్ష నేత డాక్టర్ కె.లక్ష్మణ్ ఎద్దేవ చేశారు. ఖమ్మం, వరంగల్, నల్లగొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఆదివారం స్థానిక విజయ ఫంక్షన్ హాల్లో పట్టభద్రుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ ఇచ్చిన హామీలను మరిచి నచ్చితే నజరాన.. లేకుంటే జరిమాన అన్న ట్లు ఇష్టారాజ్యంగా పాలన సాగిస్తున్న సీ ఎం కేసీఆర్‌కు కళ్లెం వేయాల్సిందేనని అన్నారు. లేకుంటే ఆయన ఒంటెద్దు పోకడకు అడ్డులేకుండా పోతుందని అన్నారు. దీనికి అంకుశం వంటి బలమైన ప్రతిపక్ష ఏర్పాటుకు పట్టభద్రులు పూనుకోవాలని పేర్కొన్నారు. సమస్యల పరిష్కారమే ఏజెండాగా పోరాటం సాగిస్తున్న బీజేపీ బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి ఎర్రబెల్లి రామ్మోహన్‌రావును గెలిపించాలని కోరా రు.శనివారం ప్రారంభమైన అసెంబ్లీ స మావేశాల్లో గవర్నర్ ప్రసంగంలో హామీల అమలు ఊసే లేదన్నారు. ఉద్యమంలో పాల్గొనని తెలంగాణ ద్రోహులను మంత్రివర్గంలోకి తీసుకుని పాలన సాగిస్తున్న కేసీఆర్ బంగారు తెలంగాణ ఎలా సాధిస్తారని లక్ష్మణ్ ప్రశ్నించారు. సచివాలయ తరలింపు, హుస్సేన్ సాగర్ ప్రక్షాళన అం టున్న సీఎం తాను ఇచ్చిన హామీలను మా త్రం మరిచాడన్నారు. సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఎన్నికల జిల్లా ఇన్చార్జి దుగ్యాల ప్రదీప్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ అభ్యర్థి రామ్మోహన్రావు, మాజీ ఎమ్మెల్యే మందాడి సత్యనారాయణ, రాష్ర్ట నాయకులు నరహరి వేణుగోపాల్‌రెడ్డి, నెల్లుట్ల నర్సింహారావు, పరమేశ్వర్, జిల్లా ప్రధాన కార్యదర్శి కేవీఎల్ఎన్ రెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జి తేలి అశోక్, జిల్లా కార్యదర్శి ఉడుగుల రమేష్, మునిసిపల్ వైస్ చైర్మన్ నాగారపు వెంకట్, కౌన్సిలర్ దేవరాయ ఎల్లయ్య, దళిత మోర్చా జిల్లా అధ్యక్షుడు సౌడ రమేష్, పట్టణ అధ్యక్షుడు పిట్టల సత్యం పాల్గొన్నారు. పార్టీ ఫిరారుుంపులు ప్రోత్సహిస్తున్న సీఎం పార్టీ ఫిరారుుంపులను ప్రోత్సహిస్తూ సీఎం కేసీఆర్ రాష్ట్రానికి తలవంపులు తెస్తున్నారని బీజేపీ శాసనసభ పక్షనేత లక్ష్మణ్ అన్నారు. హన్మకొండకు వచ్చిన ఆయన బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎర్రబెల్లి రామ్మోహన్‌రావుతో కలిసి మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు నివాసంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ నిరుద్యోగులు నష్టపోయూరన్న సీఎం.. తొమ్మిది నెలలు గడుస్తున్నా ఉద్యోగాలు ఎందుకు భర్తీ చేయడం లేదని ప్రశ్నించారు. అభ్యర్థి ఎర్రబెల్లి రామ్మోహన్రావు మాట్లాడుతూ డబ్బు ఆశ చూపి గెలిచే ప్రయత్నం చేస్తున్న కేసీఆర్‌కు ఎదురుదెబ్బ తప్పదని జోస్యం చెప్పారు. సమావేశంలో ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్‌కుమార్, చాడ శ్రీనివాసరెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి, మాజీ మేయర్ టి.రాజేశ్వర్‌రావు, శేషగిరిరావు, శ్యాంసుందర్ పాల్గొన్నారు. మజ్లిస్ చేతిలో రిమోట్ సీఎం కేసీఆర్ మజ్లిస్ పార్టీ చేతిలో రిమోట్‌గా మారాడని బీజేపీ శాసనసభ పక్ష నేత డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. హన్మకొండలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో ఆదివారం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం ఇష్టం వచ్చినట్లు వాగ్దానాలు చేస్తున్నాడే తప్పా ఏ ఒక్క హామీ అమలు చేయడం లేదన్నారు. రాష్ట్రంలో కారు అధికారంలో ఉన్నప్పటికీ స్టీరింగ్ మా చేతుల్లో ఉందని మజ్లిస్ పార్టీ అంటున్న విషయాలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సమావేశంలో టీడీపీ శాసనసభ పక్షనేత ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్సీ అభ్యర్థి రామ్మోహన్రావు, మాజీ మేయర్ రాజేశ్వర్‌రావు, అధికార ప్రతినిధి వేం నరేందర్‌రెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షుడు బస్వారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
గా‘నైట్’
జిల్లా సరిహద్దులు దాటుతున్న స్టోన్ నిబంధనలకు విరుద్ధంగా విదేశాలకు.. అధిక లోడ్‌తో వెళ్తున్న లారీలు గుంతలు పడుతున్న రహదారులు పభుత్వ ఆదాయూనికి రూ.కోట్లలో గండి పట్టించుకోని అధికార యంత్రాంగం కాజీపేట : జిల్లాలో దాదాపు 200 వరకు గ్రానైట్ క్వారీలు ఉన్నాయి. వీటిలో అనుమతి ఉన్నవి 110 నుంచి 120 వరకు ఉండగా.. అనుమతి లేనివి 50 నుంచి 60 వరకు ఉంటారుు. వివిధ కారణాలతో నడవనివి దాదాపు 20 నుంచి 40 వరకు ఉన్నారుు. ప్రధానంగా శాయంపేట, కొండపర్తి, మడికొండ, ధర్మసాగర్, మహబూబాబాద్, ఏటూరునాగారం, కేసముద్రం తదితర ప్రాంతాల్లో అధికంగా ఉన్నారుు. ఈ ప్రాంతాల క్వారీల నుంచి రోజు రాత్రి వందల సంఖ్యలో గ్రానైట్ లోడ్ లారీలు కాజీపేట రైల్వే జంక్షన్ సమీపంలోని అయోధ్యపురం రైల్వేట్రాక్‌కు చేరుకుంటున్నారుు. తెల్లవారే సరికి అవి రైళ్లలో కాకినాడ, విశాఖపట్నం, కృష్ణపట్నం ఓడరేవులకు చేరుకుంటున్నారుు. అక్కడి నుంచి చైనా తదితర దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. అక్కడ ఈ ముడి గ్రానైట్ అందమైన ఆకృతిలో తయూరై మళ్లీ దిగుమతి అవుతోంది. ఉదాహరణకు జిల్లాలో రూ.100కు ఎగుమతి చేసిన గ్రానైట్ రాయి విదేశాల్లో ఆకృతి మార్చుకుని రాగానే మనం రూ.1000కి కొనుగోలు చేస్తున్నాం. సీమాంధ్ర, బెంగళూరు, చెన్నైకి చెందిన పలువురు వ్యాపారులు జిల్లాలో ని క్వారీల యజమానులతో చేతులు కలిపి నిబంధనలకు విరుద్ధంగా.. ప్ర భుత్వానికి పన్ను చెల్లించకుండా రాత్రి వేళల్లో జిల్లా సరిహద్దుల నుంచి విదేశాలకు గ్రానైట్‌ను తరలిస్తున్నారు. రూ.కోట్లలో దందా జరుగుతుం డగా.. పన్నుల రూపంలో ప్రభుత్వానికి రావాల్సిన రూ.లక్షల ఆదాయూనికి గండి పడుతోంది. నిబంధనలు గాలికి.. క్వారీల నుంచి తరలించే గ్రానైట్ లారీకి ఒక్కోదానికి మూడు నెలలకోసారి రూ.8,500 చొప్పున ప్రభుత్వానికి రోడ్‌ట్యాక్స్ చెల్లించాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. 10 టైర్ల ట్రక్కులో 25 టన్నుల గ్రానైట్, 12 టైర్ల ట్రక్కులో 31, 14 టైర్ల ట్రక్కులో 35, 18 టైర్ల ట్రక్కులో 41, 22 టైర్ల ట్రక్కులో 49 టన్నుల గ్రానైట్ మాత్రమే తీసుకెళ్లాలి. కాగా ఆయా ట్రక్కు ల యజమానులు నిబంధనలకు విరుద్ధంగా లోడింగ్ చేస్తున్నారు. సామర్థ్యానికి మించి లోడులో 22 టన్నుల నుంచి 32 టన్నుల వరకు అదనంగా వేసి రవాణా చేస్తున్నారు. టన్నుకు రూ.1,060 చొప్పున మైనింగ్ శాఖకు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. 25 టన్నులకు రూ.26,500 పన్నుల రూపకంగా చెల్లించాల్సి ఉండగా, ఒక ట్రక్కులో సుమారు 45 టన్నుల మేర వేసి రూ.21,200 పన్ను ఎగ్గోడుతున్నారు. దీంతోపాటు రవాణా భారం కూడా తగ్గుతుంది. రెండు సార్లు తీసుకెళ్లాల్సిన గ్రానైట్ రాళ్లను ఒకేసారి తీసుకెళ్లడంతో ఒక్క లోడుకు రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు ఆదా అవుతోంది. నెలకు రూ.లక్షల్లో వసూళ్లు ప్రభుత్వ నిబంధనల ప్రకారం గ్రానైట్ రాళ్లు తరలిస్తున్న ట్రక్కులను అధికారులు పట్టుకుని సీజ్ చేసి టన్నుకు రూ.1000 చొప్పున జరిమానా విధిం చాలి. కానీ, అధికారులు కాసులకు కక్కుర్తి పడి టన్నుకు రూ.200 నుంచి రూ.300 చొప్పున వసూలు చేస్తున్నారు. ఇక క్వారీల యజమానులు, వ్యాపారులు ముందస్తుగానే అధికారులతో ఒప్పందం కుదుర్చుకుని.. రూ.లక్షలు ముచ్చజెప్పి ఇబ్బంది లేకుండా సరిహద్దులు దాటిస్తున్నారు. దీంతో చెక్ పోస్టుల వద్ద అధికారులు ఆపడం లేదు. ఇక.. క్వారీల యజ మానులు గోరంత అనుమతులు తీసుకుని కొండంత తవ్వేస్తున్నారు. చీక టి పడుతుందంటే చాలు.. జిలెటిన్‌స్టిక్స్ పేలుళ్లతో సమీప గ్రామాల ప్రజ లు ఉలిక్కిపడుతున్నారు. ఇళ్ల పునాదులు కదలడంతోపాటు క్వారీ పరిసరాల్లోని పంటలు నాశనమవుతున్నారుు. దీనికి తోడు అధిక లోడ్‌తో వెళ్లడంతో రహదారులపై ఉన్న కల్వర్టులు, పైప్లైన్లు, రోడ్లు దెబ్బతింటున్నాయి. ప్రజలు అవస్థలు పడుతున్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు.. ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా గ్రానైట్ రాయిని తరలించడం నేరం. జిల్లాలో మైనింగ్ సిబ్బంది ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నారు. అదనపు లోడుతో వెళ్తున్న వాహనాలపై జరిమానా వేస్తున్నాం. క్వారీల వివరాలు కావాలంటే సమాచారహక్కు చట్టం కింద ఇవ్వడానికి ఎటువంటి అభ్యంతరం లేదు. - బాలరాజుగౌడ్, అసిస్టెంట్ డెరైక్టర్, మైన్స్ అండ్ జియాలజీ -
వర్థన్నపేట ఎస్సై సస్పెన్షన్
వరంగల్ : వరంగల్ జిల్లాలో వర్తన్నపేట ఎస్ఐ పై వేటు పడింది. వివరాలు.. గత శనివారం వర్థన్నపేట పోలీస్‌స్టేషన్‌లో ఐదో తరగతి చదువుతున్న ఓ బలుడిని వేధించిన క్రిష్ణకుమార్ను వెంటనే సస్పెండ్ చేయాలని తెలంగాణ డీజీపీ వరంగల్ రేంజ్ డీఐజీని ఆదేశించారు. అంతేకాకుండా, ఎస్సై తీరుపై విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు. కాగా, స్తానికి గిరిజన బాలుర సంక్షేమ వసతి గృహంలో చదువుతున్న వీరన్న అనే బాలుడు ని పిబ్రవరి 28 న దొంగతనం నెపంతో పోలీసులు స్టేషన్ కు తీసుకువెళ్లారు. సమాచారం అందుకున్న హాస్టల్ వార్డన్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి బాలుడిని హాస్టల్ కు తీసుకెళతామన్నా విడిచిపెట్టలేదు. రాత్రంతా బాలుడిని స్టేషన్ లోని నేరస్తులతో కలిపి మొద్దును కాళ్లకు బిగించి తాళాలు వేశారు. ఈ ఉదంతంపై బాలల హక్కుల సంఘం హోం మంత్రికి ఫిర్యాదు చేయగా, ఎస్ఐ ని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. -
యువతి ఆత్మహత్యా యత్నం
వరంగల్(మంగపేట): వరంగల్ జిల్లాలో ఓ యువతి ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. వివరాలు.. జిల్లా లోని మంగపేట మండలంలోని తిమ్మంపేట గ్రామానికి చెందిన పోగు రాధిక(18) అనే యువతి బుధవారం మధ్యాహ్నాం కిరోసిన్ పోసుకుని నిప్పు అంటించుకుంది. తీవ్ర గాయాలైన రాధికను వరంగల్ ఎంజీఎంకు తరలించారు. కుటుంబ కలహాలతోనే ఆమె ఈ యత్నానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పెళ్లింట అలుముకున్నవిషాదం
వరంగల్: పెళ్లి బాజాలు మోగాల్సిన ఆ ఇంట విషాదం అలుముకుంది. మరో రెండు రోజుల్లో పెళ్ళి పీటలు ఎక్కాల్సిన యువకుడు పురుగుల మందు తాగి బలన్మరణానికి పాల్పడ్డాడు. వరంగల్ జిల్లాలోని నెల్లికుదురు మండలం చిన్నముప్పారంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాలు... గ్రామానికి చెందిన పిట్టల వీరన్న అనే వ్యక్తికి పెళ్లి నిశ్చయమైంది.మరో రెండు రోజుల్లో పెళ్లి పెట్టుకున్నారు. ఇంతలో దొంగతనం నెపంతో పోలీసులు అతనిని అరెస్టు చేశారు. దీంతో తీవ్ర ఆవేదన చెందిన వీరన్న బుధవారం పురుగుల మందు తాగి ఆత్యహత్య చేసుకున్నాడు. అంతేకాక గ్రామంలో కొంతమంది యువకులు దొంగతనాలు చేస్తూ చెడ్డపేరు తీసుకొస్తున్నారంటూ సూసైట్ నోట్ రాసి ఉంచాడు. రెండు రోజుల్లో పెళ్లి జరగాల్సిన కొడుకు చనిపోవడంతో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. -
19 ఇసుక ట్రాక్టర్లు పట్టివేత
వరంగల్: ఇసుక మాఫియా ఆగడాలను అడ్డుకునేందుకు అధికారులు పటిష్టమైన చర్యలు చేపడుతున్నారు. వరంగల్ జిల్లా వర్దన్నపేట మండలంలో ఇసుక క్వారీలపై బుధవారం విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. మండలంలోని ఆకేరు వాగు నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న 19 ట్రాక్టర్లను మామునూర్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇసుకను వరంగల్ పట్టణానికి తరలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. వాటిని పోలీసులు సీజ్ చేసి స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (మామునూర్) -
బిల్ట్ ఫ్యాక్టరీ ఎదుట కార్మికుల ఆందోళన
వరంగల్ : వరంగల్ జిల్లాలోని మంగపేట మండలం, కమలాపురం వద్ద పేపర్ గుజ్జు తయారు చేసే బిల్ట్ ఫ్యాక్టరీ ఎదుట కార్మికులు సోమవారం ఆందోళన చేపట్టారు. తొమ్మిది నెలల క్రితం ఫ్యాక్టరీలో ఉత్పత్తిని నిలిపివేశారు. ఫ్యాక్టరీలో పనిచేస్తున్న పీఎఫ్, నాన్ పీఎఫ్ కార్మికులను తొలగించారు. ఈ నేపధ్యంలో వారు ఆందోళన బాట పట్టారు. ఫ్యాక్టరీని తెరిచి, తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. (మంగపేట) -
వైద్యసేవల కోసం గ్రామస్తుల ఆందోళన
వరంగల్ : వరంగల్ జిల్లాలోని మంగపేట ఆరోగ్య కేంద్రంలో సోమవారం ఉదయం గ్రామస్తులు ఆందోళనకు దిగారు. సిబ్బంది సమయపాలన పాటించకుండా ఇష్టారీతిన వస్తుండటంతో ఆగ్రహించిన గ్రామస్తులు ఆరోగ్య కేంద్రం ఎదుట ధర్నా చేపట్టారు. ఆరోగ్య కేంద్రానికి వైద్యులు, సిబ్బంది సరిగా రావడం లేదని వారు ఆరోపించారు. సకాలంలో వైద్య సేవలు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు వారు వాపోయారు. వైద్యులు వేళకు వచ్చి సేవలు అందించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇప్పటికైనా అధికారులు పరిస్థితిని చక్కదిద్ది, చర్యలు తీసుకోవాలని స్తానికులు డిమాండ్ చేశారు. (మంగపేట) -
వైభవంగా ప్రారంభమైన సమ్మక్క-సారలమ్మ మినీ జాతర