Minister Errabelli Brother Errabelli Pradeep Rao Resigns TRS Party, Details Inside - Sakshi
Sakshi News home page

Errabelli Pradeep Rao: ఏ పార్టీ ఆదరించకపోతే ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలుస్తా.. 

Published Sun, Aug 7 2022 3:02 PM | Last Updated on Sun, Aug 7 2022 4:29 PM

Errabelli Pradeep Rao Resigns TRS Party - Sakshi

వరంగల్‌ జిల్లా: తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సోదరుడు ప్రదీప్‌రావు టీఆర్‌ఎస్‌కు షాకిచ్చారు. ఆదివారం టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్‌కు స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు. ఎమ్మెల్యే నరేందర్‌ రాజీనామా చేసి గెలవాలని సవాల్‌ విసిరారు.

‘చీరుస్తా, పాతరేస్తా అంటే పార్టీలో ఉండాలా. తన సహకారం లేకుండా నరేందర్  ఎమ్మెల్యేగా గెలుపొందితే పదో తారీకు వరకు రాజీనామా చేయి. రాజీనామా చేసి గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటాం. బతికున్నన్ని రోజులు ఆయనకు సేవకుడిగా పని చేస్తా. 25 వేల కుటుంబాలను ఆదుకుంటే ప్రజలు ఆదరిస్తారు అనుకుంటే, 4వేల కోట్లతో అభివృద్ధి చేశాను అనుకుంటే రాజీనామా చేయ్.పదో తారీకు వరకు రాజీనామా చేయకుంటే ఎక్కడికి రమ్మన్నా వస్తా బహిరంగ చర్చకు సిద్ధం. 4 వేల కోట్లు ఎక్కడ పెట్టి అభివృద్ధి చేశావో చెప్పు.  పార్టీలో ప్రాధాన్యత తగ్గించినా ఓపికగా భరించాం.ఎమ్మెల్సీ ఆశ జూపి అవమానించారు. ఏ పార్టీ ఆదరించకుంటే ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలుస్తా’ అని స్పష్టం చేశారు ఎర్రబెల్లి ప్రదీప్‌రావు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement