
పరీక్ష ఫలితాల పత్రాలను అందజేస్తున్న ఏడీఏ రామ్‌జీ
శాయంపేట(భూపాలపల్లి) : తెలంగాణ వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా మట్టి పరీక్ష ప్రయోగశాల నుంచి సంచార భూసార పరీక్ష కేంద్రం ద్వారా రైతుల వద్దకే వచ్చి మట్టి నమూనాలను సేకరించి అక్కడే పరీక్షలు నిర్వహించి అప్పటికప్పుడు రైతులకు పరీక్షా ఫలితాలకు సంబంధించిన రిపోర్టు పత్రాన్ని అందజేయనున్నట్లు భూసారా పరీక్షా కేంద్రం ఏడీఏ బీ. రామ్‌జీ తెలిపారు. మండలంలో మొదటి విడతగా పెద్దకోడెపాక, కాట్రపల్లి గ్రామాల్లో ‘మొబైల్ వ్యాన్’ ద్వారా సంచార భూసారా పరీక్షలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. దీని ద్వారా రైతులు పండించే పంటలను ముందుగానే అంచనా వేసుకునే వీలుంటుందన్నారు.
పరీక్షల ద్వారా మట్టిలో ఉన్న నత్రజని, భాస్వరం, పోటాషియం ఎంతవేయాలో వ్యవసాయ అధికారులు సిఫారసు చేయడంతోపాటు రిపోర్టులో ఉంటుందన్నారు. మట్టిలోని ఆమ్ల, క్షార గుణాలను, లవణాలైన సోడియం, మెగ్నిషియం, కాల్షియం సాంద్రతను తెలసుకునే వీలుంటుందన్నారు. తద్వారా భూమికి కావా ల్సిన ఎరువుల వాడకాన్ని, ఎలాంటి భూమిలో ఏఏ పంట లు వేసుకోవడం ద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చో తెలిసిపోతుందన్నారు. రైతులు విత్తనాలు వేస్తే ఎంత శాతం మొలకెత్తే అవకాశం ఉంటుందో వీటి ద్వారా తెలస్తుందన్నారు.
ఎంపిక చేసిన గ్రామాల్లో ప్రతి రైతు భూసార పరీక్షలను సద్వినియోగం చేసుకుని పంటల దిగుబడి సాధించుకోవాలని సూచించారు. అనంతరం మట్టి పరీక్షలు నిర్వహించిన రైతులకు అక్కడే ఫలితాల పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో భూసార పరీక్షా కేంద్రం ఏఓ హేమలత, సూర్యనారాయణ, వ్యవసాయ విస్తరణ అధికారులు ఎండీ అహ్మద్ రజా, ఆర్. శివకుమార్, కాట్రపల్లి సర్పంచ్ జర్పుల మాజీబాయి, రాజుపల్లి సర్పంచ్ లావుడ్యా కమల, ఎంపీటీసీ హనీఫా, కో ఆప్షన్ సభ్యుడు ఎస్‌కే గౌస్, సమన్వయ సమితి సభ్యులు శ్రీనివాస్, గట్టు కుమారస్వామి, రైతులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment