bhupalpally
-
భూపాలపల్లి జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ ఆందోళన
-
తెలంగాణలో బీజేపీ జెండా ఎగరేస్తాం..
-
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో బీఆర్ఎస్ నేతలపై కేసు
-
రాహుల్ గాంధీ బైక్ ర్యాలీ
-
కేసీఆర్ జబర్దస్త్‌గా ఉన్నాడు.. రేపు మాపో పులి బయటికి వస్తుంది: మంత్రి కేటీఆర్
సాక్షి, భూపాలపల్లి: తెలంగాణ మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్ సోమవారం భూపాలపల్లి జిల్లాలో పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. జిల్లా కేంద్రంలో నిర్మించిన సమీకృత కలెక్టరేట్ కార్యాలయాన్ని కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం ఎస్పీ కార్యాలయాన్ని ప్రారంభించారు. తర్వాత డబుల్ బెడ్రూం ఇండ్లతోపాటు గృహలక్ష్మి, దళితబంధు లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు. ఎన్నికల షెడ్యూల్ వెలువడిన అనంతరం తొలి బీఆర్ఎస్ బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. భూపాలపల్లిలోని సుభాష్ కాలనీ ప్రాంతంలో గల మినీ స్టేడియంలో నిర్వహించిన సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ జబర్దస్త్‌గా ఉన్నాడని పేర్కొన్నారు. ఇంట్లో కూర్చోని కూడా ప్రజల కోసం అన్ని చేస్తున్నాడని తెలిపారు. త్వరలో బయటికి వచ్చి అన్ని ప్రకటనలు చేస్తారని చెప్పారు. సీఎం కేసీఆర్ తొమ్మిదిన్నర ఏళ్ళలో చేసిన పనులు మీ కళ్ళ ముందున్నాయని ప్రజలను ఉద్ధేశించి వ్యాఖ్యానించారు. ఒక్క ఛాన్స్ ఇవ్వండని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారని, వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారో చెప్పాలంటూ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధికారం వస్తే మళ్లీ కష్టాలు వస్తాయని.. రైతుబంధుకు రామ్ రామ్.. దళిత బందుకు జై భీమ్ అంటారని ఎద్దేవా చేశారు. చదవండి: రేపు తెలంగాణకు కేంద్రమంత్రి అమిత్ షా.. పర్యటన షెడ్యూల్ ఇదే గతంలో కాంగ్రెస్ హయాంలో ఉన్న దరిద్రం మళ్లీ తెలంగాణకు వస్తోందని కేటీఆర్ మండిపడ్డారు. ఈ ఎన్నికలు ఎమ్మెల్యేను మాత్రమే ఎన్నుకునేటివి కాదని.. కేసీఆర్‌ను సీఎంగా ఎన్నుకునే ఎన్నికలని పేర్కొన్నారు. కాంగ్రెస్‌లో సీఎం అభ్యర్థి ఉన్నాడా?, కేసీఆర్‌తో పోటుపడేవారు ఈ రాష్ట్రంలో రాజకీయ పార్టీల్లో ఎవరైనా ఉన్నారా? అని ప్రశ్నించారు. చావు నోట్లో తలపెట్టి తెలంగాణ తెచ్చిన నాయకుడని కేసీఆర్‌ను కొనియాడారు. కాంగెస్ వాళ్ళకు దిక్కు లేక డబ్బు సంచులతో నోట్ల కట్టలతో అడ్డంగా దొరికిన సన్నాసిని పట్టుకొని పీసీసీ పదవి ఇచ్చారు. ఆ మొగోడు చెబితే మనం ఓట్లేయాలట. సోనియమ్మని బలి దేవత అన్నాడు. 1200 మందిని బలి తీసుకున్నవారు దేవత కాదు బలిదేవత అన్నాడు. రాహుల్ గాంధీ ముద్దపప్పు అన్నాడు. ఇప్పుడు ముద్దపప్పు కాదు.. సుద్ద పప్పు అంటున్నాడు. ఆయన మాటలు నమ్ముదామా?. నోట్ల కట్టలతో అడ్డంగా దొరికిపోయిన థర్డ్ రేట్ దొంగ. క్రిమినల్ అలాంటి వారి చేతిలో రాష్ట్రాన్ని పెడదామా? మొన్న ఓటుకు నోటు ఈరోజు సీటుకో రేటు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కాదు రేటెంత రెడ్డిగా మారారు. అలాంటి వాళ్ళ చేతిలో రాష్ట్రాన్ని పెడితే ఆదానికో, అంబానికి అమ్మేస్తాడు. కాంగ్రెస్ హామీలను చూసి మా కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. పులిని చూసి నక్కలు వాతలు పెట్టుకుంటే పులి అవుతుందా?. రేపు మా పో పులి బయటికి వస్తుంది. కేసీఆర్ బయటికి వచ్చి ఏం చేయాలో స్వయంగా ఆయనే చెబుతాడు. ప్రజలకు ఏ విధంగా న్యాయం చేయాలో తెలుసు. కేసీఆర్ క్రెడిబిలిటీ ఉన్న హిస్టరీ. ప్రజల మీద విశ్వాసం ఉన్న నాయకుడు. కాంగ్రెస్ చెప్పే మాటలు నమ్మద్దు. ఆగం కాకండి. ఆలోచించి కారు గుర్తుకే ఓటు వేయండి. మోసాన్ని మోసాన్ని జయించాలి. కాంగ్రెస్ వాళ్ళకు కర్నాటక నుంచి బీజేపీ వాళ్ళకు గుజరాత్ నుంచి డబ్బులు వస్తున్నాయి. డబ్బులు ఇస్తే తీసుకొండి. ప్రమాణం చేయిస్తే తుపాల్ తుపాల్ అని నీకే వేస్తామని చెప్పండి. కళ్ళ ముందు అభివృద్ధి ఉంది. గుండె నిండా సంక్షేమం ఉంది. ఆరు దశాబ్దాలుగా మోసం చేసి చావగొట్టినోడు మళ్ళీ వచ్చి ఏదో చెబుతే నమ్మి మోసపోకండి’ అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు. -
మొరంచ వాగు వరద తగ్గినా బురదతో అల్లాడుతున్న గ్రామాలు
-
Moranchapally Village Floods: డీజిల్ తో కొంత సేవ్ చేస్తున్నాం
-
రేవంత్ సభపై కోడిగుడ్లతో దాడి
భూపాలపల్లి/భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లిలోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద రేవంత్‌రెడ్డి ప్రసంగిస్తున్న సమయంలో బీఆర్ఎస్ కార్యకర్తలు చెప్పులు, కోడిగుడ్లు, టమాటాలతో దాడిచేయడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. దాడిపై ఆగ్రహించిన కాంగ్రెస్ శ్రేణులు బీఆర్ఎస్ కార్యకర్తలున్న ఓ థియేటర్‌పై రాళ్ల వర్షం కురిపించాయి. పావుగంటపాటు రాళ్ల దాడి కొనసాగింది. దాడిలో కాటారం ఎస్సై శ్రీనివాస్ తలకు గాయమైంది. వెంటనే ఆయన్ను ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. రేవంత్‌కు స్వాగతం పలుకుతూ అంబేడ్కర్ చౌరస్తాలో స్థానిక కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ కటౌట్‌కు ఎదురుగా కటౌట్ ఏర్పాటు చేయడంపై మంగళవారం ఉదయం తలెత్తిన వివాదం చివరకు పోలీసుల లాఠీచార్జీకి దారితీసింది. ఈ ఘటనను దృష్టిలో పెట్టుకొనే బీఆర్ఎస్ కార్యకర్తలు దాడిచేశారని కాంగ్రెస్ కార్యకర్తలు ఆరోపించారు. దమ్ముంటే రా బిడ్డా: గండ్రపై రేవంత్ ఫైర్ ‘కొత్త రాష్ట్రంలో కోతుల గుంపు చేరి దోచుకుంటోంది. కాంగ్రెస్ కార్యకర్తలు గెలిపించిన ఇక్కడి ఎమ్మెల్యే దొరగడీలో గడ్డి తినేందుకు పార్టీ ఫిరాయించాడు. మీ అభిమానాన్ని తాకట్టుపెట్టి పార్టీ ఫిరాయించిన సన్నాసులకు గుణపాఠం చెప్పేందుకే యాత్ర కార్యక్రమం తీసుకున్నా’అని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఆయన ప్రసంగిస్తున్న సమయంలోనే బీఆర్ఎస్ కార్యకర్తలు దాడికి పాల్పడటంతో రేవంత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘వారికి ఇదే నా హెచ్చరిక. వందమందిని తీసుకొచ్చి మా సభ మీద దాడి చేయిస్తావా? దమ్ముంటే నువ్వు రా బిడ్డా.. ఎవరినో పంపించి వేషాలు వేస్తున్నావా?. నేను అనుకుంటే నీ థియేటర్ కాదు.. నీ ఇల్లు కూడా ఉండదు. అంబేడ్కర్ చౌరస్తాకు రా.. నిన్ను పరిగెత్తించకపోతే ఇక్కడే గుండు కొట్టించుకొని పోతా’అంటూ రేవంత్ మండిపడ్డారు. ‘23న మా సభతో పాటు బీఆర్ఎస్ సభ కూడా ఉంది. రెండు పార్టీలు ఒకే రోజు సభ పెట్టకూడదనే విజ్ఞతతో ఆ రోజు సభ వాయిదా వేసుకున్నామని రేవంత్ అన్నారు. చదవండి: నవీన్ హత్య కేసు.. సంచలన విషయాలు బయటపెట్టిన హసన్ -
భూపాలపల్లిలో రచ్చకెక్కిన ఫ్లెక్సీల వివాదం
-
కవిత సమక్షంలోనే కస్సుబుస్సు.. ‘రాబోయే కాలానికి కాబోయే ఎమ్మెల్యేను తానే..’
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని భూపాలపల్లిలో అధికార పార్టీ నాయకులు బజారున పడ్డారు. ఇంతకాలం నివురుగప్పిన నిప్పులా ఉన్న విబేధాలు మంత్రి సత్యవతి రాథోడ్, సీఎం కేసిఆర్ తనయ ఎమ్మెల్సీ కవిత సమక్షంలోనే బహిర్గతమయ్యాయి. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘ భవనం ప్రారంబోత్సవానికి హాజరైన మంత్రి సత్యవతి, ఎమ్మెల్సీ కవిత సమక్షంలో స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, ఎమ్మెల్సీ మాజీ స్పీకర్ మధుసూదనాచారి బలప్రదర్శనకు దిగారు. రాబోయే కాలానికి కాబోయే ఎమ్మెల్యేను తానేనని చాటిచెప్పేందుకు ఇదదరూ తీవ్రంగా ప్రయత్నించారు. అనుచరగణాన్ని రెచ్చగొట్టి వారిమధ్య ఉన్న వైరాన్ని బహిర్గతం చేసుకున్నారు. పార్టీ శ్రేణులను ఆయోమయానికి గురిచేశారు. ఎవరి గోల వారిదే బిఆర్ఎస్కు అనుబంధంగా ఉన్న తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘ భవన శిలాఫలకం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మధ్య ఆధిపత్య పోరుకు ఆజ్యం పోసింది. శిలాఫలకంపై ఎమ్మెల్సీ మదుసూధనాచారి, జడ్పీ చైర్ పర్సన్ శ్రీహర్షిణి పేరు లేకపోవడంతో వారిద్దరి అనుచరులు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే తీరును నిరసిస్తూ నినాదాలు చేశారు. ఎమ్మెల్యే ప్రోటోకాల్ పాటించకుండా ఎమ్మెల్సీ చారికి, జడ్పీ చైర్మన్ శ్రీహర్షిణికి తగిన ప్రాధాన్యత ఇవ్వకుండా అవమానపరుస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తామేమి తక్కువ కాదన్నట్లు గండ్ర అనుచరులు సైతం నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. దీంత ఇరువర్గాల నినాదాలు, గోలతో కార్మికసంఘ భవనం వర్గపోరుకు వేదికలా మారిపోయింది. వేదికపై ఉన్న మంత్రి సత్యవతి రాథోడ్, కేసిఆర్ తనయ కవిత అవాక్కయ్యారు. ఘర్షణ పడుతున్నవారిని వారించే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. నివురు గప్పిన నిప్పు వాస్తవానికి భూపాలపల్లిలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదనాచారి రాజకీయ ప్రత్యర్థులు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన గండ్ర అధికార పార్టీ అభ్యర్థి మధుసూదనాచారిపై ఘన విజయం సాధించారు. ఆ తర్వాత కాంగ్రెస్‌కు చేయిచ్చి కేసిఆర్ సమక్షంలో కారెక్కారు గండ్ర వెంకటరమణారెడ్డి. రాజకీయ ప్రత్యర్థులిద్దరూ ప్రస్తుతం ఒకే పార్టీలో ఉన్నప్పటికీ అంతర్గత విబేధాలు మాత్రం అలానే ఉన్నాయి. గులాబీ దళపతి ఎవ్వరిని తక్కువ చేయకుండా ఓడిపోయిన మధుసూదనాచారికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి తగిన ప్రాధాన్యత కల్పించారు. ఇంతకాలం నివురుగప్పిన నిప్పులా ఉన్న విబేధాలు ఎమ్మెల్సీ కవిత, మంత్రి సత్యవతి రాథోడ్ సమక్షంలో బయటపడడం పార్టీలో కలకలం సృష్టించింది. వీరి గొడవ పార్టీ శ్రేణులను అయోమయానికి గురిచేసింది. కారులో అసంతృప్తి ఎమ్మెల్యే గండ్ర మీద జడ్పీ చైర్ పర్సన్ శ్రీహర్షిణి సైతం అసంతృప్తితో రగిలిపోతున్నారు. తనను భూపాలపల్లికి చెందిన పార్టీ నేతలు, అధికారులు పట్టించుకోవడంలేదని ఆమె బాహాటంగానే విమర్శలు చేశారు. భూపాలపల్లికి జడ్పీ చైర్ పర్సన్ శ్రీహర్షిణి అయితే వరంగల్ జడ్పీ చైర్ పర్సన్ గండ్ర జ్యోతికి భూపాలపల్లి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్ష పదవి ఇచ్చి స్థానికులకు ప్రాధాన్యత లేకుండా చేశారనే ప్రచారం జరుగుతోంది. పెద్దపల్లి జడ్పీ చైర్మన్, మంథని నియోజకవర్గ ఇంఛార్జీ పుట్ట మధు అనుచరురాలుగా ముద్రపడ్డ శ్రీహర్షిణికి భూపాలపల్లిలో తగిన ప్రాధాన్యత లభించడం లేదనే చర్చ సాగుతోంది. భూపాలపల్లి బీఆర్ఎస్లో విబేధాలకు రాబోయే ఎన్నికలే కారణంగా జనం భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో గండ్ర బిఆర్ఎస్ నుంచి మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్దమవుతుండగా ఎమ్మెల్సీ చారి సైతం ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నారు. అందులో భాగంగానే ఒకరిపై మరొకరిపై చేయి సాధించేందుకు పోరు సాగిస్తున్నారట. ఇప్పటికే సిట్టింగ్‌లకే టిక్కెట్ ఇస్తామని గులాబీ దళపతి ప్రకటించడంతో ఎమ్మెల్యే పై ఉన్న వ్యతిరేకతను తనకు అనుకూలంగా మలుచుకుని టిక్కెట్ పొందే పనిలో చారి ఉన్నట్లు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. గండ్ర వెంకటరమణారెడ్డి సైతం ఎట్టి పరిస్థితుల్లోనూ తన కుటుంబం నుంచి భూపాలపల్లి చేజారిపోకుండా అన్నిరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవేళ తనకు టిక్కెట్ ఇవ్వకపోతే...తన భార్య గండ్ర జ్యోతిని బరిలో నిలిపేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఎన్నికల నాటికి పరిస్థితులు ఎలా మారతాయో చూడాలి -పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
బెల్ట్‌షాపులు లేకుండా చేస్తాం
భూపాలపల్లి అర్బన్: రాష్ట్రంలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధికారంలోకి వస్తే గ్రామాల్లో బెల్టు షాపులు లేకుండా చేస్తామని, కల్లు గీత కార్మికులకు భరోసా కల్పిస్తామని ఆ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలిపారు. భూపాలపల్లి నియోజకవర్గంలో కొనసాగుతున్న ప్రజాప్రస్థానం పాదయాత్ర మంగళవారం చిట్యాల మండలం నుంచి భూపాలపల్లి మండలంలోని కొంపెల్లి వరకు జరిగింది. యాత్రలో భాగంగా కొత్తపల్లి(ఎస్ఎం) శివారులోని సోలిపేట తాటివనంలో కల్లుగీత కార్మికులతో షర్మిల మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గౌడన్నల సంక్షేమంపై కేసీఆర్ చెబుతున్నవి పచ్చి అబద్ధాలన్నారు. గౌడన్నల సమస్యలు వింటే గుండె తరుక్కుపోతోందని ఆవేదన వ్యక్తంచేశారు. చెట్టుమీద నుంచి పడి చనిపోయిన కార్మికుల కుటుంబాలకు బీమా ఇవ్వడం లేదని మండిపడ్డారు. రూ.5లక్షలు ఇస్తున్నామని చెబుతున్న సర్కార్ మాటలు పచ్చి అబద్ధమని ఆగ్రహం వ్యక్తం చేశారు. చెట్టుపైనుంచి పడి కాళ్లు, చేతులు పోయినా పరిహారం ఇవ్వలేని సర్కార్ ఎందుకని ప్రశ్నించారు. ఊరూరా బెల్ట్‌షాపులు తెరిచి రాష్ట్రాన్ని తాగుబోతుల అడ్డాగా మార్చి కుటుంబాలను ఆగం చేస్తున్నారని ఆరోపించారు. -
గని ప్రమాదంలో కళ్లు కోల్పోయిన కార్మికులను పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత
భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి ఏరియాలోని కేటీకే 8వ గని ప్రమాదంలో గాయపడ్డ కార్మికుల్లో ఇద్దరు ఒక కంటి చూపు కోల్పోయారు. గురువారం జరిగిన ప్రమాదంలో కార్మికులు చింతల రామకృష్ణ, బండి రాజశేఖర్, శ్రీనివాస్‌లు తీవ్రగాయాలపాలవ్వడంతో హైదరాబాద్‌కు తరలించి వైద్యసేవలు అందిస్తున్న విషయం తెలిసిందే. వారిలో రామకృష్ణ, రాజశేఖర్‌లకు ఒక్కో కన్ను పూర్తిగా దెబ్బతిన్నట్లు ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి వైద్యులు తెలిపినట్లు సింగరేణి అధికారులు చెప్పారు. కాగా ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ముగ్గురు కార్మికులను తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి శుక్రవారం పరామర్శించారు. కార్మికులకు మెరుగైన వైద్యం అందించి, కంటిచూపు వచ్చేలా చూడాలని వైద్యులను కోరారు. -
TS: భద్రాచలం వద్ద తగ్గిన నీటిమట్టం.. మిగతా చోట్ల వరద ఉధృతి
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాచలం వద్ద గోదావరి నది నీటిమట్టం 48 అడుగులకు చేరింది. ఎగువ నుంచి గోదావరిలోకి వస్తున్న 12 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. ఇప్పుడిప్పుడే ముంపునకు గురైన కాలనీలలో సాధారణ పరిస్థితిలు కనిపిస్తున్నాయి. దీంతో శానిటేషన్ ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు. వరదలతో సర్వం కోల్పోయిన భద్రాచలం స్థానికులు.. భరించలేని దుర్వాసనతో ఇళ్లలో ఉండలేకపోతున్నారు. ఒక పక్క సిబ్బంది.. మరోవైపు ప్రజలూ మాస్కులు ధరించి రంగంలోకి దిగారు. ఇంకోపక్క గోదావరి వరద లతో విద్యుత్ శాఖకు భారీ నష్టం వాటిల్లింది. భద్రాచలం, పినపాక నియోజక వర్గాల్లోని ఏడు మండలాల్లో 630కి పైగా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు దెబ్బ తిన్నాయి. వారం రోజుల పాటు వరద నీటిలోనే ఉండిపోయింది పర్ణశాల సబ్‌స్టేషన్. సమారు 16 కోట్ల మేర నష్టం వాటిల్లినట్టు అధికారుల అంచనా వేస్తున్నారు. అలాగే 143 గ్రామాల్లో 5,620 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. సహాయక చర్యలు.. భద్రాచలం వరదలు తగ్గుముఖం పట్టాక వేగంగా వ్యర్థాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఇతర జిల్లాలో నుంచి వచ్చి విధుల్లో చేరిన 4,100 మంది పారిశుద్ధ్య సిబ్బంది పనులు చేస్తున్నారు. శిల్పినగర్, విస్తా కాంప్లెక్స్‌తోపాటు ఆలయ ఉత్తర ద్వారం వైపునకు వస్తున్న భద్రాచలం కరకట్ట వద్ద ఉన్న స్లూయిస్ల ద్వారా నీరు లీకవుతోంది. దీంతో.. ఇరిగేషన్ శాఖ ఏర్పాటు చేసిన ఐదు మోటార్లకు అదనంగా మరో 15 మోటర్లు తెప్పించించింది సింగరేణి. మొత్తం 20 మోటార్ల ద్వారా వరదనీటిని తోడి తిరిగి గోదావరిలోకి ఎత్తిపోసే ప్రక్రియ నడుస్తోంది. ఉన్నతాధికారిపై వేటు భద్రాచలం డిప్యూటీ డీఎం అండ్ హెచ్ ఓ డా. కె. రాజ్ కుమార్ పై సస్పెన్షన్ వేటు పడింది. గోదావరి వరదల సమయంలో హెడ్ క్వార్టర్లో లేకుండా, ఉన్నతాధికారుల అనుమతి లేకుండా పోవడం సర్కార్ దృష్టికి వెళ్లింది. దీంతో రాజ్ కుమార్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: పాల్వంచ కిన్నెరసాని జలాశయానికి వరదనీరు పొటెత్తింది. డ్యాం పూర్తి సామర్థ్యం 407 అడుగులు కాగా.. ప్రస్తుతం 402.40 అడుగులు చేరింది. ఇన్ ఫ్లో 4వేల క్యూసెక్కులు కాగా 4 గేట్లు ఎత్తి 18వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కిన్నెరసాని పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరికలు జారీ చేశారు. నిజామాబాద్ జిల్లా: శ్రీరాంసాగర్ కు వరద ఉధృతి కొనసాగుతోంది. ఇన్ ఫ్లోస్ 59 వేల క్యూసెక్కులుగా ఉంది. పద్దెనిమిది గేట్లెత్తి 50 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు అధికారులు. మొత్తం 90 టీఎంసీలకుగాను ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 77 టీఎంసీలు.. 1091 అడుగులకుగాను.. నీటిమట్టం 1088 అడుగులుగా ఉంది. భూపాలపల్లి జిల్లా: కాళేశ్వరం వద్ద 12.600 మీటర్ల ఎత్తులో క్రమంగా పెరుగుతూ ప్రవహిస్తోంది గోదావరి. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ లక్ష్మీ బ్యారేజ్ మొత్తం 85 గేట్లు ఎత్తి 10,71,720 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇన్ ప్లో, ఔట్ ఫ్లో 10,71,720 క్యూసెక్కులుగా ఉంది. లక్ష్మీ బ్యారేజ్ పూర్తిస్థాయి నీటినిలువ సామర్థ్యం 16.17 టీఎంసిలు. అన్నారం సరస్వతీ బ్యారేజ్ సరస్వతీ బ్యారేజ్ మొత్తం 66 గేట్లు ఎత్తి 1,46,,353 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. ఇన్ ప్లో, ఔట్ ఫ్లో 1,46,353 క్యూసెక్కులు గా ఉంది. సరస్వతీ బ్యారేజ్ పూర్తి నీటి సామర్ధ్యం 10.87 టీఎంసిలు.. ప్రస్తుత నీటి సామర్ధ్యం 0.33 టిఎంసిలుగా ఉంది. నల్లగొండ జిల్లా: నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కు కొనసాగుతున్న వరద. ఇన్ ఫ్లో : 29,365 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో: 4,138 క్యూసెక్కులు. పూర్తిస్థాయి నీటి సామర్థ్యం: 312.0450 టిఎంసీ లు, ప్రస్తుత నీటి నిలువ: 173.6640 టిఎంసి లు. పూర్తిస్థాయి నీటిమట్టం: 590 అడుగులు, ప్రస్తుత నీటిమట్టం: 532.80 అడుగులు, -
కేటీపీపీ అగ్నిప్రమాద ఘటనలో ఒకరి మృతి
భూపాలపల్లి జిల్లా/హైదరాబాద్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలోని కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రం మొదటి దశ 500మెగావాట్ల ప్లాంట్‌లో సోమవారం జరిగిన ప్రమాదంలో ఒకరు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఆర్టిజన్ కార్మికుడు కేతిరి వీరస్వామి హైదరాబాద్ యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతూ బుధవారం మరణించారు. మృతుడు వీరస్వామి స్వస్థలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచ. వీరస్వామికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రమాదంలో గాయపడిన వీరస్వామి మృతిచెందడంతో కేటీపీసీలో విషాదం అలుముకుంది. రెండు రోజుల క్రితం జరిగిన ప్రమాదంలో ఏడుగురికి గాయాలు అయ్యాయి. యశోద ఆస్పత్రిలో ప్రస్తుతం జూనియర్ ప్లాంట్ అసిస్టెంట్ వెంకటేశ్వర్లు, కాంట్రాక్ట్ కార్మికుడు సీతారాములు చికిత్స పొందుతున్నారు. హనుమకొండ అజార ఆస్పత్రిలో మరో నలుగురు కార్మికులు చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదంపై విచారణ కొనసాగుతోందని అధికారులు పేర్కొన్నారు. సీఈ సిద్దయ్య నిర్లక్ష్యంపై చర్యలు తీసుకునే పనిలో జెన్కో అధికారులు ఉన్నారు. చదవండి: తంజావూరు రథయాత్రలో అపశ్రుతి.. కరెంట్ షాక్‌తో పది మందికిపైగా భక్తుల దుర్మరణం -
ఒక్కరోజులోనే 3.09 లక్షల కార్డులు
భూపాలపల్లి: ఇది సరికొత్త రేషన్ రికార్డు.. సోమవారం ఒక్కరోజే రాష్ట్ర ప్రభుత్వం 3,09,083 రేషన్‌కార్డులను లబ్ధిదారులకు అందజేసింది. పేదల ఖాళీ కడుపులను నింపే క్రమంలో రికార్డు సృష్టించింది. ఇంత పెద్దసంఖ్యలో రేషన్‌కార్డులు పంపిణీ చేయడం దేశంలోనే ఇది తొలిసారి అని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. కొత్త రేషన్‌కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో మంత్రి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 90.50 లక్షల రేషన్‌కార్డుల ద్వారా 2.88 కోట్లమంది లబ్ధిదారులకు రూ.2,766 కోట్ల విలువైన ఆహారధాన్యాలు అందిస్తున్నట్లు తెలిపారు. కరోనా సంక్షోభంలోనూ సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని కొనియాడారు. 2014కు ముందు అర్హులు సైతం రేషన్‌కార్డు కోసం పైరవీకారులను ఆశ్రయించేవారని, తాను 2009లో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు అడుక్కున్నా అప్పటి ప్రభుత్వం ఒక్క కార్డు కూడా ఇవ్వలేదని గుర్తుచేశారు. ఇప్పుడు పైరవీలకు తావివ్వకుండా, పారదర్శకంగా అర్హులందరికీ రేషన్‌కార్డులు మంజూరు చేస్తున్నామని చెప్పారు. మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ పేదల కడుపు నింపాలనే సదుద్దేశంతో కొత్త రేషన్‌కార్డులను మంజూరు చేయడం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, పౌర సరఫరాల శాఖ కమిషనర్ అనిల్‌కుమార్ పాల్గొన్నారు. -
యాపిల్ ఇన్‌స్టాగ్రామ్‌లో తెలుగోడి ఫొటో
భూపాలపల్లి: జిల్లాలోని మంజూర్నగర్కి చెందిన ఔత్సాహిక వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్, డాక్టర్ అరుణ్‌కుమార్ తీసిన ఓ ఫొటోను యాపిల్ సంస్థ తమ ఇన్‌స్ట్రాగామ్ ఖాతాలో పంచుకుంది. మంజూర్‌నగర్ ఎంసీ క్వార్టర్స్‌లో ఉండే నలిమెల అరుణ్‌కుమార్‌కు కళాశాలలో ఉన్నప్పటి నుంచే వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రఫీపై ఆసక్తి ఉండేది. దీంతో అడవుల్లో పర్యటిస్తూ వివిధ రకాల వన్యప్రాణుల ఫొటోలు తీసేవాడు. కొద్దిరోజుల క్రితం భూపాలపల్లిలోని ప్రొఫెసర్ జయశంకర్ ఎకో పార్క్‌లో మాంటీస్ అనే పురుగును తన ఐఫోన్ కెమెరాతో క్లిక్‌మనిపించాడు. ఈ ఫొటో యాపిల్ సంస్థ దృష్టికి వెళ్లడం, అది ఐఫోన్‌తో తీసింది కావడంతో ఆ సంస్థ తమ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. అంతేకాక లొకేషన్ భూపాలపల్లి అని ట్యాగ్ చేసింది. చదవండి: MLA Seethakka: ఎడ్లబండే ఎమ్మెల్యే కాన్వాయ్ కేటీఆర్‌ని సోనూ సూద్ ఏమి కోరారో తెలుసా? -
భూపాలపల్లి ఎమ్మెల్యేపై హెచ్చార్సిలో ఫిర్యాదు
నాంపల్లి: భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి వల్ల తమ ప్రాణాలకు హాని ఉందని, తమకు రక్షణ కల్పించాలని రేగొండ మండలం రూపిరెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ బండారి కవిత, భర్త దేవేందర్‌తో కలిసి సోమవారం రాష్ట్ర మానవ హక్కుల కమషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... గ్రామాభివృద్ధి విషయమై ఎమ్మెల్యేతో పలుమార్లు మాట్లాడే ప్రయత్నం చేయగా ఆయన పట్టించుకోకుండా తమను టార్గెట్ చేసినట్లు తెలిపారు. ఈ నెల 2న ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మండల అభివృద్ధి గురించి పలువురు సర్పంచ్‌లు, ఇతర నాయకులు కలవడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా తన భర్త దేవేందర్ గ్రామ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కోరినట్లు వెల్లడించారు. దీనికి ప్రతిగా ఎమ్మెల్యే నువ్వు బీసీ సంఘంలో పని చేసినంత కాలం మీ గ్రామానికి నిధులు ఇవ్వనని హెచ్చరించినట్లు తెలిపారు. అనంతరం అతని అనుచరులతో బెదిరిస్తున్నారని, ఎమ్మెల్యేతో తమకు ప్రాణహాని ఉందని కవిత వాపోయారు. ఈ విషయంలో విచారణ నిర్వహించి తమకు రక్షణ కల్పించాలని ఆమె హక్కుల కమిషన్‌ను కోరారు. -
త్వరలోనే సీఎం కేసీఆర్ శుభవార్త
సాక్షి, జయశంకర్ భూపాలపల్లి : ఎన్నికలప్పుడే ప్రతిపక్షాలకు ప్రజా సమస్యలు గుర్తుకొస్తాయి. ప్రభుత్వం చేసిన మంచి పనులను మాత్రం విస్మరిస్తారని గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిస్తామని అన్నారు. మంగళవారం రోజున జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం రైతులకు 24 గంటల విద్యుత్‌ను అందిస్తుందన్నారు. ('దుబ్బాకలో బీజేపీ విజయం ఖాయం') ప్రస్తుతం యువత నిరుద్యోగంతో కొంత నిరుత్సాహంగా ఉన్నారు. వారికి సీఎం కేసీఆర్ త్వరలోనే శుభవార్త చెబుతారు. నిరుద్యోగ భృతి ఇద్దామనుకునే సమయానికి మాయదారి కరోనా వచ్చిందన్నారు. ఒకప్పుడు వ్యవసాయం దండగ అన్నవారే ఇప్పుడు పండుగ అంటున్నారన్నారు. యువత సైతం వ్యవసాయం చేయడానికి ముందుకొస్తున్నారని చెప్పారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలో కూడా అన్ని పంటలను కొనడంలేదన్నారు. మన రాష్ట్రంలో ప్రతి గింజను ప్రభుత్వం కొంటుందని వివరించారు. ఇకనైనా బీజేపీ నాయకులు అసత్య ప్రచారాలను మానుకోవాలని ఎర్రబెల్లి పేర్కొన్నారు. లక్ష ఉద్యోగాలిచ్చాం : పల్లా రాజేశ్వర్ రెడ్డి రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా టీఆర్ఎస్దే గెలుపని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. ఇప్పటి వరకు లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశాం. ఐటీ రంగంలో దాదాపు రెండు లక్షల ఉద్యోగాలు కల్పించామని ఆయన చెప్పారు. తెలంగాణ ఏర్పడ్డాక గ్రామాల రూపు రేఖలు మారిపోయాయన్నారు. ప్రతి పక్షాల అసత్య ప్రచారాన్ని ప్రజలు నమోద్దన్నారు. ప్రతి పట్టభద్రుడు తప్పని సరిగా ఓటు హక్కును నమోదు చేసుకోవాలని సూచించారు. (కేసీఆర్ కోసం ప్రాణం ఇచ్చేందుకు సిద్ధం) -
మావోయిస్టులను గట్టి దెబ్బ కొడతాం: డీజీపీ
సాక్షి, ఏటూరు నాగారం: మావోయిస్టులు అభివృద్ది నిరోధకులని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఏటూరు నాగారం సబ్ డివిజన్లోని వెంకటాపురం పోలీస్ స్టేషన్లో ములుగు, భూపాలపల్లికి చెందిన పోలీసు అధికారులతో శనివారం ఆయన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో అడిషనల్ డీజీ కొత్తకోట శ్రీనివాసరెడ్డి ఐపీఎస్, ఐజీ నాగిరెడ్డి ఐపీఎస్, ఐజీ ప్రభాకర్ రావు ఐపీఎస్, ఐజీ నవీన్ చంద్ ఐపీఎస్, ములుగు ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ ఐపీఎస్, ఓఎస్డీకే సురేష్ కుమార్, శోభన్ కుమార్, ఏఎస్పీ శరత్ చంద్ర పవర్ ఐపీఎస్, సాయి చైతన్య ఐపీఎస్, గౌస్ ఆలం ఐపీఎస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. మావోయిస్టులు మళ్లీ తెలంగాణలో ప్రవేశించి హింసాత్మక చర్యలకు పూనుకోవడానికి ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఈ తరుణంలో తెలంగాణ పోలీస్ శాఖ ఎట్టి పరిస్థితుల్లోనూ మావోయిస్టు ఆగడాలను తెలంగాణ గడ్డ మీద జరగనివ్వబోదని రాష్ట్ర ప్రజలకు ఆయన హామీ ఇచ్చారు. మావోయిస్టు పార్టీ అగ్రనేతలు అయినటువంటి హరి భూషణ్, దామోదర్ విలాసవంతమైన జీవితాలను గడుపుతూ అమాయక గిరిజనులను బలిపశువులుగా చేస్తున్నారన్నారన్నారు. మావోయిస్టులకు ఎవరూ కూడా సహకరించకుండా ఉండాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణలోని డాక్టర్లలను, ఇంజనీర్లను, వ్యాపారవేత్తలను బెదిరించి డబ్బులు వసూలు చేసుకునేందుకు పథక రచనతో మావోయస్టులు తిరిగి మళ్లీ తెలంగాణలో అడుగు పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని పేర్కొన్నారు. వారు చేసే ప్రయత్నాలను తెలంగాణ పోలీస్ శాఖ సమర్థంగా తిప్పి కొడుతుందని పేర్కొన్నారు. దాదాపు పది సంవత్సరాల క్రితం తెలంగాణ ప్రజల కోపాగ్నికి గురై ఇక్కడి నుంచి ప్రాణభయంతో పారిపోయిన మావోయిస్టులు తిరిగి మళ్ళీ తెలంగాణ ప్రజల కోపానికి గురి కాకూడదని హెచ్చరించారు. తెలంగాణలో ప్రతి గ్రామం రహదారులతో అనుసంధానింపబడి విద్య, వైద్యం వంటి సదుపాయాలను పొందుతూ తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉన్న ఈ సమయంలో మావోయిస్టులు తిరిగి తెలంగాణలో అశాంతి నెలకొల్పడానికి ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఇన్ఫార్మర్ల నెపంతో హత్యలకు పాల్పడే మావోయిస్టులకు రానున్న రోజుల్లో తెలంగాణ పోలీస్ శాఖ గట్టి దెబ్బ కొడుతుందని హెచ్చరించారు. నక్సలిజం లేకపోవడంతో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే శరవేగంగా అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో దూసుకుపోతుందని తెలియజేశారు. -
జాతీయ హోదాకు కృషి
సాక్షి, భూపాలపల్లి : మేడారం మహాజాతరకు జాతీయ హోదా కల్పించాలనే అంశం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్తానని కేంద్ర గిరిజనశాఖ మంత్రి అర్జున్‌ముండా తెలిపారు. ములుగు జిల్లాలోని మేడారం శ్రీ సమ్మక్క–సారలమ్మలను శనివారం ఆయన దర్శించుకున్నారు. తులాభారంతో నిలువెత్తు (75 కిలోలు) బంగారాన్ని అమ్మవార్లకు సమర్పించారు. ఈ సందర్భంగా మేడారానికి జాతీయ హోదా కల్పించడంతో పాటు అభివృద్ధికి నిధులు, గురుకులాలు కేటాయించాలని రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, పువ్వాడ అజయ్‌కుమార్, ఇంద్రకరణ్‌రెడ్డి తదితరులు కేంద్ర మంత్రికి విన్నవించారు. దీంతో స్పందించిన ఆయన.. జాతర విశిష్టతను తెలియజేసి జాతీయ హోదా కల్పించే అంశాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. గిరిజనులు ఎంతో కాలంగా కోరుకుంటున్న జాతీయ హోదా దక్కుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. మేడారంలో వనదేవతలను దర్శించుకోవడం ఆనందంగా ఉందని, వచ్చే జాతరకు తప్పకుండా వస్తానని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. గిరిజనులకు ఆస్తులు లేకపోయినా సంతోషంగా బెల్లాన్ని బంగారంగా అమ్మవార్లకు సమర్పించే అంశం గిరిజన పురాతన సంప్రదాయాలకు నిదర్శనమన్నారు. ఆసియాలో అతిపెద్ద గిరిజన జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం కృషి మరువలేనిదని కితాబిచ్చారు. ఆయన వెంట మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, సత్యవతి, ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యే సీతక్క ఉన్నారు. కాగా, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆర్టీసీ సేవలందించిందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ అన్నారు. జాతర సమయంలో 36 వేల ట్రిప్పుల ద్వారా 12 లక్షల మందిని గమ్యస్థానాలకు తరలించినట్లు వెల్లడించారు. జాతర ముగియడంతో తిరుగు పయనమవుతున్న భక్తులు -
శరవేగంగా అభివృద్ధి చెందుతున్న భూపాలపల్లి
సాక్షి, భూపాలపల్లి: భూపాలపల్లి పట్టణం పూర్తిగా వలసలపై ఆధారపడి మున్సిపాలిటీగా మారింది. పట్టణానికి బతుకుదెరువు కోసం వచ్చి చాలా మంది ఇక్కడే స్థిరపడ్డారు. దీనికి తోడు సింగరేణి కూడా పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందడంతో ఈ దశాబ్దం మొదటి నుంచి పట్టణానికి వచ్చి స్థిరపడిన వారి సంఖ్య పెరిగింది. భూపాలపల్లిని ఆనుకుని 30 నుంచి 50 కిలోమీటర్లు దూరంలో ఏ పట్టణం లేకపోవడం కూడా భూపాలపల్లి పట్టణంగా మారే అనివార్యత ఏర్పడింది. పూర్తిగా అటవీ మండలాలకు దగ్గరగా ఉండడం, హన్మకొండ, పరకాల 40 నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉండడంతో భూపాలపల్లికి పట్టణంగా రూపాంతరం చెందింది. వలసల విషయానికి వస్తే చుట్టుపక్కల మండలాలైన కాటారం, గణపురం, చిట్యాల, రేగొండ నుంచి వ్యాపార నిమిత్తం బతుకుదెరువు కోసం వచ్చి ఇక్కడే స్థిరపడిపోయారు. వీటితో పాటు భూపాలపల్లిలో మూడు జిల్లాలకు చెందిన బిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. పూర్వపు కరీంనగర్, వరంగల్, మంచిర్యాల జిల్లాలకు సంబంధించిన చాలా మంది ఇక్కడే నివాసం ఏర్పర్చుకున్నారు. జిల్లా కేంద్రంగా ఏర్పడిన తర్వాత ఇక్కడ స్థిరాస్తి వ్యాపారం పుంజుకుంది. గ్రామం నుంచి.. ఒక గ్రామం పట్టణంగా ఎదగాలంటే దాదాపు మూడు నాలుగు దశాబ్ధాలు పడుతుంది. కానీ భూపాలపల్లి పట్టణం అనతి కాలంలోనే మున్సిపాలిటీగా అవతరించింది. తొలుత చిట్యాల తాలూకాలోని కమలాపూర్ గ్రామపంచాయతీ పరిధిలో శివారు పల్లెగా ఉండేది. 1981లో భూపాలపల్లి 500కు పైగా జనాభాతో గ్రామపంచాయతీగా ఏర్పాటైంది. 2012 జనవరి 25న అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం భూపాలపల్లి పట్టణాన్ని నగర పంచాయతీగా ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2016లో జిల్లాగా ఏర్పడిన భూపాలపల్లి, 2017 ఆగస్టులో కాశీంపల్లి, జంగేడు, వేశాలపల్లి, పుల్లురామయ్యపల్లి శివారు గ్రామాల విలీనంతో గ్రేడ్ – 3 మున్సిపాలిటీగా మారింది. గతంలో భూపాలపల్లి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(బుడా) ప్రతిపాదించినా ఇంకా కార్యరూపం దాల్చలేదు. ఇది అమలులోకి వస్తే పట్టణ విస్తీర్ణం పెరగడంతో పాటు మరింత అభివృద్ధి చెందనుంది. పారిశ్రామికంగా అభివృద్ధి రాష్ట్రంలోనే పారిశ్రామిక ప్రాంతంగా భూపాలపల్లి గుర్తింపు పొందింది. సింగరేణి గనులు ఓవైపు, కేటీపీపీ వెలుగులు మరోవైపు ఇలా భూపాలపల్లి పట్టణం నానాటికీ విస్తరిస్తోంది. 1987లో అప్పటి ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ భూపాలపల్లిలో తొలి బొగ్గుగనిని ప్రారంభించడంతో అప్పటి నుంచి పట్టణం పారిశ్రామికంగా శరవేగంగా అభివృద్ధి చెందింది. ఇదే క్రమంలో మంచిర్యాల జిల్లాలోని కొన్ని బొగ్గు గనులు మూతపడటం.. భూపాలపల్లిలో నూతన గనులు ప్రారంభించడంతో కార్మికుల కుటుంబాలు ఇక్కడికి రావడంతో జనాభా పెరిగింది. మరో వందేళ్లకు సరిపోయే బొగ్గు నిల్వలు ఉండటంతో పారిశ్రామికంగా మరింత అభివృద్ధి చెందే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయనే చెప్పాలి. సింగరేణి గనులకు తోడుగా కేటీపీపీ మొదటి దశ 2006లో, రెండోదశ 2009లో ప్రారంభం కావడంతో పట్టణ అభివృద్ధి పెరిగింది. రెండో సారి మున్సిపల్ ఎన్నికలకు సిద్ధం జనవరిలో జరుగబోయే మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. గతంలో 2012లో పట్టణం నగరపంచాయతీగా ఏర్పడిన తర్వాత మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. ప్రస్తుతం జనవరిలో రెండోసారి మున్సిపల్ ఎన్నికలు జరుగబోతున్నాయి. గతంలో 20 వార్డులుగా ఉన్న మున్సిపాలిటీ ప్రస్తుతం 30 వార్డులకు చేరుకుంది. ఓటర్ల సంఖ్య 50,651 మంది ఉన్నారు. పట్టణ జనాభా 2011 లెక్కల ప్రకారం పురుషులు 21,810, మహిళలు 20,577 కలిపి మొత్తంగా 42,387 మంది ఉన్నారు. అయితే, ప్రస్తుతం జనాభా 82 వేల వరకు ఉండొచ్చని అంచనా.ప్రస్తుతం భూపాలపల్లి మునిసిపాలిటీ ఓటర్లు 50,651 కాగా.. ఇందులో పురుషులు 26,399 మంది, మహిళలు 24,251 మంది ఉన్నారు. అలాగే, ఇతరులు ఒకరు ఓటరుగా నమోదయ్యారు. ఐదేళ్ల పాలన మరువలేనిది.. భూపాలపల్లి మునిసిపాలిటీ చైర్‌పర్సన్‌గా నేను ఎన్నికవుతానని ఏ రోజు అనుకోలేదు. పదవీ బాధ్యతలు చేపట్టిన మొదట్లో కొంత ఆందోళన, భయానికి గురయ్యాను. కానీ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటుంటే చాలా సంతోషంగా ఉండేది. వంద పడకల ఆస్పత్రి పనులు, జయశంకర్ పార్కు ప్రారంభం చేస్తున్నప్పుడు చాలా ఆనందం కలిగింది. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో మునుపెన్నడూ లేని విధంగా పట్టణంలో సీసీ రోడ్లు, సైడ్ కాలువలు, వీధి దీపాలు ఏర్పాటు చేయించాను. మౌలిక సౌకర్యాలకు పెద్దపీట వేసి అధిక నిధులు కేటాయించాం. కౌన్సిలర్ల సహకారంతో భూపాలపల్లిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశాను. – బండారి సంపూర్ణ రవి, మున్సిపాలిటీ మాజీ చైర్పర్సన్ మున్సిపాలిటీ మాజీ చైర్పర్సన్ ఎన్నికల విజయవంతానికి కృషి భూపాలపల్లి మునిసిపాలిటీలో రెండోసారి జరుగుతున్న ఎన్నికలను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. వార్డుల విభజన నుంచి మొదలు ఎన్నికల నిర్వహణ వరకు ఎలాంటి తప్పిదాలకు చోటు చేసుకోకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఎన్నికలకు అన్ని రాజకీయ పార్టీలు, ప్రజలు సహకరించాలి. – ఎస్ సమ్మయ్య, మున్సిపల్ కమిషనర్ -
అరక పట్టిన సబ్ రిజిస్ట్రార్
ములుగు: జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల సబ్ రిజిస్ట్రార్ తస్లీమా సోమవారం కూలీగా మారారు. రైతు దినోత్సవం సందర్భంగా వ్యక్తిగత సెలవు తీసుకున్న ఆమె తన స్వగ్రామమైన ములుగు మండలం రామచంద్రాపురానికి వచ్చారు. గ్రామానికి చెందిన రైతు దొంతి రాంరెడ్డి జగనమ్మ పొలంలో వరి నాటు పనుల్లో పాల్గొన్నారు. మధ్యాహ్నం మిగతా కూలీలు తెచ్చుకున్న అన్నం, పచ్చడి మెతుకులు తిన్నారు. రోజంతా పనిచేసి సాయంత్రానికి కూలి డబ్బులు తీసుకుని స్థానిక నిరుపేద కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా సబ్ రిజిస్ట్రార్ మాట్లాడుతూ.. తాను రైతు కుటుంబం నుంచి వచ్చానని, వారి కష్టం తెలుసని అన్నారు. -
భూపాలపల్లి భేష్..
సాక్షి, భూపాలపల్లి: ఏజెన్సీ ప్రాంతాలు అధికంగా ఉన్న జిల్లాలుగా పేరున్న భూపాలపల్లి, ములుగు తలసరి ఆదాయంలో మెరుగైన స్థానంలో ఉన్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో ప్రత్యేక స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. పూర్తిగా పట్టణ జనాభాతో కూడిన వరంగల్ అర్బన్ జిల్లా కూడా భూపాలపల్లి, ములుగు జిల్లాల కంటే వెనుకబడే ఉంది. అయితే రాష్ట్రంలో అతి తక్కువ పట్టణ జనాభా కలిగిన జిల్లాల జాబితాలో మాత్రం ములుగు, భూపాలపల్లి జిల్లాలు చివరి స్థానాల్లో ఉండడం గమనార్హం. ఈ ఆసక్తికరమైన విషయాలను రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన సామాజిక ఆర్థిక సర్వే 2019 బహిర్గతం చేసింది. ఇదే విధంగా గత సంవత్సరాలతో పోలిస్తే జిల్లాలో ఆహార భద్రతా కార్డుల సంఖ్య, ఎల్పీజీ కనెక్షన్లు పెరిగాయి. 2016–17లో ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో 1.80 లక్షల హెక్టార్ల సాగుభూమి ఉంటే 1.50 లక్షల హెక్టార్లలో పంటలు సాగయ్యాయి. 2017–18లో మాత్రం 1.78 లక్షల హెక్టార్లలో సాగు విస్తీర్ణంలో ఉంటే 1.40 లక్షల హెక్టార్లలో పంటలు సాగయ్యాయి. మొత్తం సాగుభూమితో పాటు నికర సాగు విస్తీర్ణం స్వల్పంగా తగ్గినట్లు సామాజిక ఆర్థిక సర్వే వెల్లడించింది. 12వ స్థానంలో జిల్లా తలసరి ఆదాయం విషయంలో ములుగుతో కలిసిన భూపాలపల్లి జిల్లా రాష్ట్రంలోనే 12 వస్థానంలో ఉంది. 2018–19 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర తలసరి ఆదాయం రూ. 1,80697 నుంచి రూ. 2,05,696కు పెరిగింది. దీనికి అనుగుణంగానే జిల్లాలో ప్రజల తలసరి ఆదాయం పెరిగింది. ప్రస్తుత ధరల వద్ద రెండో సారి సవరించిన అంచనాల ప్రకారం 2016–17లో ములుగు, భూపాలపల్లి జిల్లాల తలసరి ఆదాయం రూ.1,10,140 గా ఉంటే 2017–18లో రూ.1,24,612 పెరిగింది. దాదాపు 13 శాతం పెరుగుదల నమోదైంది. తలసరి ఆదాయం విషయంలో జనగామ, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, మహబూబాబాద్ జిల్లాలు ఉమ్మడి భూపాలపల్లి జిల్లా కంటే వెనుకబడే ఉన్నాయి. రెండు జిల్లాల్లో సింగరేణి, జెన్కో, వ్యవసాయ రంగాలే ప్రజలకు ఆదాయ మార్గాలు ఉన్నాయి. సారవంతమైన గోదావరి పరీవాహక ప్రాంత భూములు ఉండడంతో మిగతా జిల్లాలతో పోలిస్తే పంట ఉత్పాదకత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. దీంతో జిల్లాల్లో ఈ రంగాల్లో పనిచే స్తున్న కార్మికులు, రైతుల ఆదాయం ఇతర జిల్లాలతో పోలిస్తే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అట్టడుగు స్థానాలు రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ జనాభా పెరుగుతోంది. రాష్ట్రంలో 38.9 శాతం దాటింది. అయితే భూపాలపల్లి, ములుగు జిల్లాలు మాత్రం పట్టణ జనాభాలో అట్టడుగు స్థానాల్లో ఉన్నాయి. రాష్ట్రంలో అతి తక్కువ పట్టణ జనాభా ఉన్న జిల్లాల్లో ములుగు జిల్లా 33వ స్థానంలో ఉండగా నారాయణపేట జిల్లా 32, భూపాలపల్లి జిల్లా 31 స్థానాల్లో ఉన్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం భూపాలపల్లి జిల్లాలో మొత్తం జనాభా 4,16,763 ఉంటే పట్టణాల్లో నివసించే వారి సంఖ్య 42,387. ములుగు జిల్లాలో 2,94,671 జనాభా ఉంటే పట్టణ జనాభా 11,493. ములుగు, భూపాలపల్లి జిల్లాలు పూర్తిగా గ్రామీణ ప్రాంతాలు ఉండడం రెండు జిల్లాల్లో కలిపి ఒక్కటే మునిసిపాలిటీ ఉండడం పట్టణ జనాభా తక్కువగా ఉండటానికి కారణంగా కనిపిస్తోంది. పెరిగిన కనెక్షన్లు.. రెండు జిల్లాల్లో ఎల్పీజీ కనెక్షన్లు, ఆహారభద్రత కార్డుల సంఖ్య పెరిగినట్లు సామాజిక ఆర్థిక సర్వే 2019 వెల్లడించింది. 2017 డిసెంబర్ నాటికి భూపాలపల్లి జిల్లాలో 20,7544 ఆహారభద్రత కార్డులు ఉంటే 2019 ఇప్పటి వరకు రెండు జిల్లాలో కలిపి 21,2553 ఆహారభద్రత కార్డులు పెరిగాయి. కొత్తగా 5,009 కుటుంబాలకు ఆహారభద్రతకార్డులు అందాయి. జిల్లాల వారీగా చూస్తే ములుగు జిల్లాలో 90,345, భూపాలపల్లి జిల్లాలో 1,22,210 ఆహారభద్రత కార్డులు ఉన్నాయి. జిల్లాలో ఎల్పీజీ కనెక్షన్లు కూడా పెరిగాయి. 2017–18లో ములుగు,భూపాలపల్లి జిల్లాల్లో మొత్తం 1,32,600 గ్యాస్ కనెక్షన్లు ఉంటే 2018–19 నాటికి 1,74,241 కనెక్షన్లకు పెరిగాయి. ఎక్కువ లింగనిష్పత్తి భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో లింగనిష్పత్తి రాష్ట్ర సగటు 988 కంటే ఎక్కువగా ఉండడం సంతోషకర విషయం. భూపాలపల్లి జిల్లాల్లో ప్రతి వెయ్యి మంది పురుషులకు 1004 మంది స్త్రీలు ఉన్నారు. అలాగే ములుగులో 1015 మంది స్త్రీలు ఉన్నారు. అయితే 0–6 చిన్నారుల్లో లింగనిష్పత్తి ఆందోళన కలిగిస్తోంది. భూపాలపల్లి జిల్లాలో బాలబాలికల లింగనిష్పత్తి చూస్తే ప్రతి వెయ్యి మంది బాలురకు 913 బాలికలు ఉన్నారు. ఈవిషయంలో ములుగు జిల్లా మెరుగ్గా ఉంది. వెయ్యి మంది బాలురకు 971 మంది బాలికలు ఉన్నారు. -
తెలంగాణ పల్లెలకు నిధులు
సాక్షి, భూపాలపల్లి: రాష్ట్ర ప్రభుత్వం పల్లెల అభివృద్ధికి నిధులు ఇవ్వడంతో పాటు అధికారులు బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని చెబుతోంది. ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని పంచాయతీకలు 14 ఆర్థిక సంఘం, రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు విడుదల చేసింది. నెలనెలా పంచాయతీలకు నిధులు ఇస్తామని బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా సీఎం ప్రకటించారు. అయితే నిధులతో పాటు అధికారులు విధులను కూడా సక్రమంగా నిర్వర్తించాలని ప్రభుత్వం హెచ్చరిస్తోంది. దీనికోసం రోజువారీ గ్రామాభివృద్ధి కార్యక్రమాలను ఆన్లైన్లో రిపోర్టింగ్ చేయడం, రోజూ వారీగా పంచాయతీల్లో చేసిన పనులకు సంబంధించిన ఫొటోలను కంప్యూటర్లో అప్లోడ్ చేయనున్నారు. వీటితో పాటు రానున్న రోజుల్లో ప్రతీ గ్రామ పంచాయతీపై ఫ్లయింగ్ స్క్వాడ్ పర్యవేక్షణ ఉండబోతోంది. నెలనెలా నిధులు జిల్లాలోని 241 గ్రామ పంచాయతీలకు మహర్దశ పట్టనుంది. ఇన్నాళ్లు సమస్యల వలయంలో ఉన్న జీపీలకు బడ్జెట్లో ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. రాష్ట్రంలోని అన్ని పంచాయతీలకు కలిపి నెలకు రూ. 339 కోట్లు కేటాయిస్తామని ప్రతిపాదించారు. దీంతో జిల్లాలోని 241 పంచాయతీలకు నిధుల కొరత తీరనుంది. ఇప్పటికే సెప్టెంబర్ నెలకు సంబంధించి 14వ ఆర్థిక సంఘం నుంచి రూ. 3,59,16,700 తో పాటు రాష్ట్ర ఆర్థిక సంఘం నుంచి 2,40,62,400 నిధులను మొత్తంగా రూ. 5,99,79,100లను ఇటీవల ప్రభుత్వం జిల్లాకు కేటాయించింది. ఇకపై ఇలాగే పంచాయతీలకు ప్రతీనెల నిధులు రానున్నాయి. దీంతోఅన్ని పంచాయతీల్లో 30 రోజుల ప్రణాళికలో అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతమయ్యే అవకాశం ఉంది. ఇన్నాళ్లు నిధుల లేకుండా సతమతమవుతున్న పంచాయతీలకు ఈనిధులు ఎంతగానో ఉపయోగపడనున్నాయి. ఇప్పటికే 14 ఆర్థికసంఘం నిధులు వచ్చి ఉన్నా సర్పంచ్, ఉపసర్పంచ్ జాయంట్ చెక్ పవర్‌పై అభ్యంతరాలు, డిజిటల్ సైన్ విధానంతో కాలయాపన జరిగింది. ఇకపై నెలనెలా నిధులు రానుండడంతో పంచాయతీల అభివృద్ధికి నిధుల లోటుండదు. ఆన్లైన్లో రిపోర్టింగ్ 30 రోజుల యాక్షన్ ప్లాన్‌లో అధికారుల అలసత్వానికి ఎలాంటి తావివ్వకుండా ఏరోజుకారోజు పనుల వివరాలను ఆన్లైన్లో రిపోర్టింగ్ చేసే వ్యవస్థను తీసుకువచ్చారు. దీంతో ప్రతీ గ్రామ పంచాయతీలో అభివృద్ధి, పారిశుద్ధ్య పనుల పురోగతిపై స్పష్టమైన వివరాలు వచ్చే వీలుంటుంది. ఈనెల 6 నుంచి ఇప్పటి వరకు ప్రతీ గ్రామంలో జరిగిన కార్యక్రమాలకు సంబంధించిన ఫొటోలు, నివేదికలు సంబంధిత పంచాయతీ కార్యదర్శులు, గ్రామపంచాయతీల స్పెషల్ అధికారులు, కంప్యూటర్ ఆపరేటర్లు ప్రతీరోజు కంప్యూటర్లో తప్పనిసరిగా పొందుపరచాల్సి ఉంటుంది. గ్రామాల్లో యాక్షన్ ప్లాన్‌కు సంబంధించి ఉన్నతాధికారులు ఏరోజైనా వీడియోకాల్ చేసే అవకాశం ఉంది. ఆరోజు కనుక పంచాయతీ అధికారులు ఆ గ్రామపంచాయతీ పరిధిలో లేనట్లయితే, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే ఉన్నతాధికారులు చర్యలు తీసుకోనున్నారు. వీటితో పాటు ఫ్లయింగ్ స్క్వాడ్ల నియామకం కూడా పూర్తయింది. తనిఖీల్లో పంచాయతీల్లో ఎక్కడి సమస్యలు అక్కడే ఉంటే చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధమైంది. ముమ్మరంగా యాక్షన్ ప్లాన్ జిల్లాలో 30 రోజుల యాక్షన్ ప్లాన్ ముమ్మరంగా కొనసాగుతోంది. ప్రతీ గ్రామ పంచాయతీల్లోని పల్లెలను అభివృద్ధి బాట పట్టించే విధంగా అధికారులు, ప్రజల భాగస్వామ్యంతో పారిశుద్ధ్య పనులు కొనసాగుతున్నాయి. ప్రతీ మండలానికి జిల్లాస్థాయి అధికారిని నియమించారు. దీంతో ప్రతీ గ్రామంలో పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న విద్యుత్ లైన్ల మరమ్మతులు, వదులుగా ఉన్న విద్యుత్ లైన్లను సరిచేస్తున్నారు. ముఖ్యంగా గ్రామాల్లోని మురుగునీటి వ్యవస్థను బాగు చేస్తున్నారు. -
మన్యంలో ముందే క్లోజ్
సాక్షి,ములుగు: మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో 11వ తేదీన జరగనున్న లోక్‌సభ ఎన్నికలను సాయంత్రం 4గంటల వరకు మాత్రమే నిర్వహించడానికి ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది. గత అసంబ్లీ ఎన్నికల్లో సైతం ఇదే విధానాన్ని అమలు చేశారు. ఇప్పటికే జిల్లా యంత్రాంగం 64 సమస్యాత్మక, 112 నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలను గుర్తించారు. దీంతో పాటు జిల్లా సువిశాలంగా ఉండడం, మారుమూల ప్రాంతాలు మండల కేంద్రాలకు సుదూరంగా ఉండడం, అటవీ ప్రాంతాల్లో ఎక్కువ గ్రామాలు ఉండడంతో ఎక్కడా ఎలాం టి ఇబ్బంది కలగకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరపడానికి యంత్రాంగం సిద్ధమవుతోంది. గోదావరి తీర ప్రాంతాల్లో.. భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో గోదా వరి తీర ప్రాంతాల్లో ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. ఈ సమయంలోనే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుకోవాల్సి ఉంటుంది. భూపాలపల్లి, ములుగు నియోజకవర్గా ల్లో పూర్తిగా, మంథని, భద్రాచలం నియోజకవర్గాల నుంచి పునర్విభజనలో జిల్లాలో కలిసిన కాటారం, మహదేవపూర్, పలిమెల, మహాముత్తారం, మల్హర్, వాజేడు, వెంకటాపురం(కె) మండలాల్లో నిబంధన అమలు కానుంది. భద్రత, రక్షణ అంశాలను ప్రధానంగా పరిగణలోకి తీసుకుని అధికారులు, పోలీసు బలగాలను అవసరం ఉన్నంత మేర అందుబాటులో ఉండేలా రాష్ట్ర ఉన్నత అధికారులకు నివేదికను అందించింది. వాటితో అప్రమత్తం .. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన అనంతరం భూపాలపల్లి, ములుగు జిల్లాలోని వెంకటాపురం(కె), ఏటూరునాగారం, వెంకటాపురం(ఎం) మండలాల్లో మావోయిస్టుల బ్యానర్లు, పోస్టర్లు కలకలం సృష్టించాయి. లోకసభ భూటకపు ఎన్నికలను బహిష్కరించాలని, కేంద్ర పార్టీలు కాంగ్రెస్, బీజేపీలను ఓడించాలని కరపత్రాల్లో మావోయిస్టులు పేర్కొన్నారు. దీంతో రెవెన్యూ, పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ఆయా మండలాలతో పాటు ఏజెన్సీ ప్రాంతాలపై దృష్టి కేంద్రీకరించింది. ప్రస్తుతం రహదారులు, బ్రిడ్జిలు అందుబాటులోకి రావడంతో ఏ సమయంలోనూ నిర్లక్ష్యం వహించకుండా చీకటిపడే లోపే పోలింగ్ సామగ్రి, ఈవీఎంలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులు భావిస్తున్నారు. భద్రత కట్టుదిట్టం ములుగు జిల్లాలో 302 , భూపాలపల్లిలో 317 పోలింగ్ బూత్‌లలో భద్రతను కట్టుదిట్టం చేయనున్నారు. 8 కంపెనీల కేంద్ర పారామిలటరీ బలగాలలతో పాటు సుమారు 2వేల మంది స్థానిక పోలీసులతో భద్రత కల్పించనున్నారు. ఇప్పటికే నాలుగు కంపెనీల భద్రత బలగాలు జిల్లాకు చేరాయి. ఒక్కో కంపెనీలో 120 మంది సీఆర్పీఎఫ్ అధికారులు ఉంటారు. సమస్యాత్మక, అతి సమస్యాత్మక, నక్సల్ ప్రభావిత ప్రాంతాలను గుర్తించి పోలీసులు ఉన్నత అధికారులు గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజలకు తగిన అవగాహన కల్పిస్తున్నారు. ప్రతి రోజు ఉదయం సాయంత్రం గ్రామాలకు చేరుకొని కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు. ఇబ్బందులు కలగకుండా భద్రత ఏర్పాటు.. ఓటు వేయడానికి పోలింగ్ కేంద్రాలకు వచ్చే ప్రతి ఓటరు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భద్రత కట్టుదిట్టం చేస్తున్నాం. జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చూస్తాం. ఇప్పటికే శాఖ తరఫునన తగిన చర్యలు తీసుకుంటున్నాం. ప్రతి రోజు ఆయా మండలాల పోలీసులు గ్రామాలకు వెళ్లి కార్డెన్ సెర్చ్‌తో పాటు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. గత శాసనసభ ఎన్నికల్లో పాటించిన భద్రతా విధానాన్ని అమలు చేస్తాం. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకొని ప్రశాంతంగా ఇంటికి చేరుకునేలా చూస్తాం. – సురేశ్‌కుమార్, ఓఎస్డీ, ములుగు