ఏటూరునాగారం: నలుగురు నకిలీ మవోయిస్టులను పోలీసులు అరెస్టు చేశారు. జయశంకర్ భూపాలపల్లి జల్లా ఏటూరునాగారం మండలం బూటారం వద్ద శనివారం వాహన తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు నలుగురు నకిలీ మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 29 వేల నగదును స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించారు. ఈ మేరకు ఏఎస్పీ విలేకరుల సమావేశంలో వివరాలు తెలిపారు.