
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఓపెన్‌కాస్ట్ మైనింగ్‌ను వెంటనే ఆపాలని రాజలింగమూర్తి దాఖలు చేసిన పిటిషన్‌పై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీ) గురువారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఓపెన్ కాస్ట్ మైనింగ్‌లో పర్యావరణ నిబంధనలు పాటించడంలేదని కేంద్ర పర్యావరణ శాఖ ఎన్జీటీకి నివేదిక సమర్పించింది.
మరోవైపు పిటిషనర్ ఆ ప్రాంతంలోని ప్రజల సమస్యలను ట్రిబ్యునల్ ముందు గట్టిగా వినిపించారు. నివాస ప్రాంతాలకు సమీపంలో జరిగే పేలుళ్ల వల్ల వచ్చే ప్రకంపనాలకు గృహాలు దెబ్బతింటున్నాయని తెలిపారు. ఈ పేలుళ్ల వల్ల పిల్లలు, వృద్ధులు భయాందోళనకు గురవుతున్నారని మొరపెట్టుకున్నారు. అయితే ట్రిబ్యునల్ ఈ పిటిషన్‌పై ఫిబ్రవరి 8వ తేదీన తుది వాదనలు వింటామని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment