Open cast mining
-
Warangal: రామప్ప దేవాలయానికి పొంచి ఉన్న ముప్పు
తెలంగాణకే తలమానికమైన అపురూపమైన వరంగల్ రామప్ప దేవాలయం మళ్లీ ప్రమాదంలో పడే సూచనలు కనిపిస్తున్నాయి. అది ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందినందుకు ప్రతి తెలుగువాడూ, భారతీయుడూ ఎంతో సంతోషించారు. ఆ సంతోషాన్ని సింగరేణి కాలరీస్ ఓపెన్ కాస్టింగ్ పనులు ఆవిరి చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం కింద పనిచేసే ఆర్కియ లాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) పరిరక్షణ, నిర్వహణలో ఈ కట్టడం ఉంది. అది యాత్రికుల ద్వారా వచ్చే ఆదాయాన్ని పొందటంలో చూపిస్తున్న శ్రద్ధ కట్టడ పరిరక్షణలో చూపడం లేదు. 2010లో కోస్టల్ కంపెనీ దేవాదుల సొరంగం తవ్వకాలు చేపట్టిన తరుణంలో అది పేల్చిన బాంబుల కారణంగా రామప్ప గుడి విలవిల లాడి గోడలు బీటలు వారిన విషయం సర్వదా విశదమే. ఈ విధ్వంసాన్ని అతి విషాదకరంగా పలు పత్రికలు ప్రపంచానికి వెల్లడి చేసినా ఏఎస్ఐ అంతగా ప్రతిస్పందించ లేదనే విమర్శ ఉంది. దీంతో కళాకారులు, రచయితలు, సామాజిక ఉద్యమకారులు, ప్రజాసంఘాల వారు ‘రామప్ప పరిరక్షణ కమిటీ’గా ఏర్పడి ఆందోళనలు నిర్వహించారు. ఆ తర్వాత మళ్ళీ రామప్ప గుడి చుట్టూ ఇరవై కి.మీ.ల దూరంలోని వెంకటాపురం, నల్లగుంట, పెద్దాపురం తదితర గ్రామాల పరిధిలో ఓపెన్ కాస్టు తవ్వకాలు జరుపడానికి సంవత్సరానికి మూడు పంటలు పండే పంట పొలాలను సర్వేచేసి స్వాధీనం చేసుకునే దిశలో సింగరేణి ఉండగా ‘రామప్ప పరిరక్షణ కమిటీ రంగంలోకి దిగింది. ఈ విషయాన్ని స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తెచ్చి సింగరేణి కంపెనీ అధికారులతో మాట్లాడి అప్పటికప్పుడు సద్దుమణగ చేశారు. ఇదే సమయంలో ఏఎస్ఐతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ప్రతిపాదన పత్రాలు యునెస్కోకు వెళ్లడం, రెండు సార్లు తిరస్కరణకు గురికావడం... చివరికి ప్రపంచ వారసత్వ సంపదగా రామప్పకు గుర్తింపు పొందడం తెలిసిందే. కాగా సంవత్సరం క్రితం ‘మళ్ళీ ఓపెన్ కాస్టు తవ్వకాలు ప్రారంభం’ అనే వార్త వచ్చింది. రామప్ప పరిరక్షణ కమిటీ , ఇతర ప్రజా సంఘాలూ తిరిగి ఆందోళన వ్యక్తం చేయడంతో సింగరేణి కంపెనీ యాజమాన్యం రామప్ప గుడి పరిసరాల్లో ఓపెన్ కాస్టులు తవ్వబోమని మీడియా ద్వారా హామీ ఇచ్చింది. అయితే మళ్ళీ రామప్పగుడికి ఓపెన్ ముప్పు రానున్నదనీ, పరిసర గ్రామాల్లో సింగరేణి అధికారులు ఓపెన్ కాస్టుకు సంబం ధించిన సర్వేలు చేస్తున్నారనే విషయం వెలుగు చూసింది. అందుకే ఈ ప్రయత్నాలను పత్రికా ముఖంగా కమిటీ ఖండిస్తున్నది. (క్లిక్ చేయండి: వేయి రేఖల వినూత్న సౌందర్యం) – నల్లెల్ల రాజయ్య తదితర ‘రామప్ప పరిరక్షణ కమిటీ’ సభ్యులు -
మణుగూరు ఓసీ–2లో ఘోర ప్రమాదం
మణుగూరు టౌన్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ఏరియాలోని పీకే ఓసీ–2లో బుధవారం మధ్యాహ్నం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మణుగూరు ప్రకాశవని ఖని ఓపెన్ కాస్ట్ (పీకేఓసీ)–2 క్వారీలో ఇద్దరు కార్మికులను తీసుకొని వెళ్తున్న బొలెరో వాహనం.. 100 టన్నుల డంపర్‌ను దాటుతుండగా అది ఢీకొట్టింది. అదే వేగంతో ఆగకుండా బొలెరో వాహనంపైకి ఎక్కి ముందుకు వెళ్లడంతో వాహనం నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదంలో బొలేరోలో ఉన్న మణుగూరు ఓసీ–2 ఎలక్ట్రీషియన్ అజ్మీరా బాషా (49), హెల్పర్ పరసా సాగర్ (34), బొలెరో ఓనర్–కమ్–డ్రైవర్ వెల్పుల వెంకన్న (45) అక్కడికక్కడే మృతి చెందారు. అజ్మీరా బాషాకు భార్య, ఇద్దరు పిల్లలు ఉండగా పీవీ కాలనీ ఎంసీ క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్నారు. ఇక సాగర్ ఇటీవల డిపెండెంట్‌గా ఉద్యోగంలో చేరగా ఆయనకు పెళ్లి కాలేదు. వెంకన్నకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మణుగూరు ఏరియాలోని పీకేఓసీ–2లో తొలిసారి ఈ తరహా ప్రమాదం జరగడంతో కార్మికులు, అధికారులు ఆందోళనకు గురయ్యారు. ప్రమాదం జరిగిన వెంటనే ఏరియా జీఎం జక్కం రమేష్, ఎస్‌ఓటూ జీఎం డి.లలిత్‌కుమార్ ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతదేహాల వద్ద సంతాపం తెలిపారు. సంస్థపరంగా వారి కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. చిన్నదారులు.. భారీ యంత్రాలు ఓపెన్ కాస్టు గనుల్లో భారీ యంత్రాలను వినియోగిస్తుండగా రహదారులు మాత్రం తక్కువ వెడల్పుతో ఉంటున్నాయి. దీంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని కార్మిక సంఘాల నేతలు కార్మికులు, చెబుతున్నారు. క్వారీల్లో భారీ డంపర్లు నడవడానికి సరైన సౌకర్యాలు ఏర్పాటు చేయట్లేదంటున్నారు. ఇప్పటికైనా యాజమాన్యం క్వారీల్లో వాహనాలు రాకపోకలు సాగించేందుకు వీలుగా విశాలమైన రహదారులు నిర్మించాలని, డంపర్లు వెళ్లే ప్రాంతాల్లో ఇతర వాహనాలు రాకుండా ప్రత్యేక దారులు ఏర్పాటు చేయాలని కోరారు. -
ఓసీపీ–2 వెనుకంజ
సాక్షి, రామగిరి(పెద్దపల్లి జిల్లా) : రామగుండం–3 ఏరియా పరిధిలోని ఓసీపీ–2 గని బొగ్గు ఉత్పత్తిలో వెనుకబడుతోంది. ఈ యేడాది ఆర్థిక సంవత్సరం ప్రారంభం నాటి నుంచి ఇప్పటి వరకు రెండు నెలల్లో మాత్రమే ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించింది. మే నెలలో 2.70లక్షల టన్నుల లక్ష్యానికి 2.74 లక్షల టన్నులు సాధించి 102 శాతం, జూన్‌లో 2.05 లక్షల టన్నుల లక్ష్యానికి 2.53 లక్షల టన్నులు సాధించి 123 శాతం ఉత్పత్తి నమోదు చేసింది. గత ఆర్థిక సంవత్సరం జనవరిలో 2.0 లక్షల టన్నుల ఉత్పత్తి లక్ష్యానికి 2.28లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసి 114శాతం ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించింది. ఈయేడాది జూలై నుంచి సెప్టెంబర్ వరకు వరుసగా మూడు నెలల్లో ఓసీపీ2 యాజమాన్యం నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించలేదు. ఈ క్రమంలో ఈ యేడాది నిర్దేశిత ఉత్పత్తి లక్ష్యాన్ని సాధిస్తుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వరుసగా కురుస్తున్న వర్షాల వల్ల ఉత్పత్తికి ఆటంకం కలుగుతుందని అధికారులు చెబుతున్నారు. కానీ ఇదే ఏరియా పరిధిలోని ఓసీపీ–1లో అధికారులు యాజమాన్యం నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యాన్ని సాధిస్తున్నారు. వర్షాల వల్ల ఉత్పత్తికి ఆటంకం మూడు నెలలుగా వరుసగా కురుస్తున్న వర్షాల వల్ల ఓసీపీ–2లో బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అంతరాయం కలుగుతోంది. గత సంవత్సరం సెప్టెంబర్‌లో 260 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా ఈయేడాది సెప్టెంబర్‌లో 405 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. దీని వల్ల నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించలేకపోయాం. ఓసీపీ–1 పురాతన ప్రాజెక్ట్. వర్షపునీళ్లు లోతులోకి వెళ్లి పోవడంతో పాటు రోడ్లు చాలా కండీషన్‌గా ఉండడం వల్ల బొగ్గు ఉత్పత్తి సాధ్యమవుతోంది. ఈ నెల నుంచి ఓసీపీ–2లో యాజమాన్యం నిర్దేశించిన లక్ష్యాన్ని మించి ఉత్పత్తి సాధిస్తాం. – కె.సూర్యనారాయణ, జీఎం, ఆర్జీ–3 ఉత్పత్తి వివరాలు ఇలా.. నెల లక్ష్యం (లక్షల టన్నుల్లో) సాధించినది(లక్షల టన్నుల్లో) శాతం జనవరి 2.00 2.28 114 ఫిబ్రవరి 2.25 1.68 75 మార్చి 2.25 2.15 96 ఏప్రిల్ 2.70 2.34 87 మే 2.70 2.74 102 జూన్ 2.05 2.53 123 జూలై 2.05 1.77 86 ఆగస్టు 2.05 0.86 42 సెప్టెంబర్ 2.05 1.46 71 -
సీఎం దాకా వద్దు.. మేం చేసి పెడతాం
ఇల్లెందుఅర్బన్’(భద్రాద్రి కొత్తగూడెం): ఇల్లెందు ఏరియా జేకే–5 ఓసీలో తాము భూములు కోల్పోయామని, తమకు పరిహారం ఇప్పించి న్యాయం చేయా లని కోరుతూ గురువారం నిర్వాసితుడు సుందర్‌లాల్‌పాసి తన కుటుంబ సమేతంగా ఎండ్ల బండిపై యాత్ర ప్రారంభించారు. సీఎం కేసీఆర్‌ను కలిసి తన సమస్యను విన్నవించుకునేందుకు హైదరాబాద్ బయలుదేరాడు. యాత్ర కారేపల్లి మండలం ఆల్యా తండాకు చేరుకునే సరికి.. సమాచారం తెలుసుకున్న ఇల్లెందు సీఐ వేణుచందర్ వారిని ఆపి.., సమస్య తెలుసుకుని కారేపల్లి తహసీల్దార్ స్వామి వద్దకు తీసుకువెళ్లారు. తహసీల్దార్ ఇల్లెందు ఏరియా సింగరేణి ఎస్టేట్ ఆఫీసర్ సునీతను కారేపల్లికి పిలిపించి వారి సమక్షంలోనే చర్చించారు. నిర్వాసితుడి వద్ద గల భూపత్రాలను పరిశీలించారు. తమకు న్యాయం జరిగేలా అధికారులు చర్యలు తీసుకుంటారని తహసీల్దార్ హామీవ్వడంతో నిర్వాసితుడు తమ యాత్రను విరమిం చుకున్నారు. ఈ సందర్భంగా నిర్వాసితుడు సుందర్‌లాల్‌పాసి మాట్లాడుతూ ఓసీ ఏర్పాటులో భాగంగా యాజమాన్యం తమకు సంబంధించిన భూములను స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. పరిహారం కోసం అధికారుల చుట్టూ ఏళ్ల తరబడి తిరిగినా ఎవరూ పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. యాజమాన్యం తీరు వల్ల నేడు తమ కుటుంబం రోడ్డున పడాల్సి వచ్చిందన్నారు. భూములకు సంబంధించిన పత్రాలన్ని ఉన్నా అధికారులు పరిహారం ఇవ్వకుండా పెడచెవిన పెడుతున్నారని ఆరోపించారు. సుమారు 10 ఎకరాల భూమిని లాక్కున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. -
ఓపెన్ కాస్ట్ మైనింగ్‌లో నిబంధనలు పాటించడంలేదు: కేంద్రం
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఓపెన్‌కాస్ట్ మైనింగ్‌ను వెంటనే ఆపాలని రాజలింగమూర్తి దాఖలు చేసిన పిటిషన్‌పై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీ) గురువారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఓపెన్ కాస్ట్ మైనింగ్‌లో పర్యావరణ నిబంధనలు పాటించడంలేదని కేంద్ర పర్యావరణ శాఖ ఎన్జీటీకి నివేదిక సమర్పించింది. మరోవైపు పిటిషనర్ ఆ ప్రాంతంలోని ప్రజల సమస్యలను ట్రిబ్యునల్ ముందు గట్టిగా వినిపించారు. నివాస ప్రాంతాలకు సమీపంలో జరిగే పేలుళ్ల వల్ల వచ్చే ప్రకంపనాలకు గృహాలు దెబ్బతింటున్నాయని తెలిపారు. ఈ పేలుళ్ల వల్ల పిల్లలు, వృద్ధులు భయాందోళనకు గురవుతున్నారని మొరపెట్టుకున్నారు. అయితే ట్రిబ్యునల్ ఈ పిటిషన్‌పై ఫిబ్రవరి 8వ తేదీన తుది వాదనలు వింటామని తెలిపింది. -
ఎర్రగుంట..గుండెల్లో మంట
-
ఇల్లందు బంద్ ప్రశాంతం
ఇల్లందు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణ బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. పట్టణంలోని 21వ ఇంక్లయిన్ ఓపెన్‌కాస్ట్ గనిని వెంటనే మూసి వేయాలని, ఇల్లందు బచావో పేరుతో అఖిలపక్షం ఇచ్చిన పిలుపుతో శుక్రవారం బంద్ జరుగుతోంది. వాణిజ్య, వర్తక, విద్యాసంస్థలు మూసివేశారు. ఏఐటీయూసీ నాయకత్వంలో ఏర్పడిన అఖిల పక్షంలో అధికార టీఆర్ఎస్ తప్ప అన్ని పక్షాల నేతలు ఉన్నారు. -
'ఓపెన్‌కాస్ట్ గనులకు వ్యతిరేకంగా భారీ ఉద్యమం'
ఇల్లెందు (ఖమ్మం) : సింగరేణి ఓపెన్ కాస్ట్ గనులకు వ్యతిరేకంగా త్వరలో పెద్ద ఎత్తున ఉద్యమించనున్నట్టు తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరామ్ చెప్పారు. శుక్రవారం ఖమ్మం జిల్లా ఇల్లెందులో ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో జరిగిన ఆదివాసీ హక్కులు చట్టాలపై అవగాహన సదస్సుకు కోదండరామ్ హాజరై మాట్లాడారు. ఓపెన్ కాస్ట్‌ల వల్ల వ్యవసాయం, దాని అనుబంధ రంగాలు నిర్వీర్యం అయ్యే ప్రమాదం ఉందన్నారు. పాలకులు, సింగరేణి యాజమాన్యం దీనిపై దృష్టి సారించి ఓపెన్‌కాస్ట్‌లకు ప్రత్యామ్నాయాలు చూడాలని కోరారు. ఏజెన్సీ ప్రాంతాల్లో వనరులు, సంపద అంతా ఆదివాసీలకే దక్కుతుందన్నారు. ఈ దిశగా వారు చైతన్యవంతులు కావాలని, అందరూ కలసి హక్కుల కోసం సంఘటితంగా పోరాడాలని సూచించారు. -
గనుల్లోకి వర్షపు నీరు... నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి
కరీంనగర్: భారీ వర్షాలతో రామగుండంలోని ఓపెన్‌కాస్ట్ గనుల్లోకి భారీగా వర్షపు నీరు వచ్చి చేరింది. దాంతో 4 ఓపెన్‌కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. అలాగే జిల్లాలోని మహదేవ్పూర్, మహముత్తారం మండలాలను వర్షలు, వరదల ముంచెత్తాయి. దీంతో ఆయా మండలాల్లోని పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. రహదారులు పూర్తిగా నీటిలో మునిగిపోవడంతో దాదాపు 20 గ్రామాలు మధ్య రాకపోకలు స్తంభించాయి. దీంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
ఆదిలాబాద్ ను వణికిస్తున్న వర్షాలు
ఆదిలాబాద్: అల్పపీడనం ప్రభావంతో కురుస్తున్న వర్షాలు ఆదిలాబాద్ జిల్లాను వణికిస్తున్నాయి. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో జిల్లాలోని వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. ఓపెన్ కాస్ట్ బొగ్గు పనుల్లో వర్షపునీరు చేరడంతో పనులకు అంతరాయం కలిగింది. డోర్లీ-1, డోర్లీ-2, హైంగూడ ఓపెన్ కాస్ట్ లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఆసిఫాబాద్ మండలంలోని గుండివాగు పొండి ప్రవహిస్తోంది. దీంతో ఈ మార్గంలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.