NGT
-
‘మల్లన్నసాగర్’పై ‘ఎన్జీటీ’ విచారణ
సాక్షి, హైదరాబాద్: మల్లన్నసాగర్ ప్రాజెక్టుపై ఢిల్లీలోని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీ) ప్రధాన ధర్మాసనం విచారణ చేపట్టింది. ‘ఏ అధ్యయనమూ చేయలేదు. ఎలాంటి ఇన్వెస్టిగేషన్ జరపలేదు. తొందరపాటుతో డ్రాయింగ్స్‌ను ఆమోదించి భూకంప జోన్లో మల్లన్నసాగర్ ప్రాజెక్టును నిర్మించారంటూ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా(కాగ్) నివేదిక సమర్పించింది’అంటూ ఓ ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తను ఎన్జీటీ సుమోటోగా పరిగణించింది. నీటిపారుదల శాఖ ఈఎన్సీ, జిల్లా డిప్యూటీ కలెక్టర్, కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణమార్పుల మంత్రిత్వ శాఖ(ఎంఓఈఎఫ్) కార్యద ర్శిని ప్రతివాదులుగా చేర్చుతూ నోటీసులు జారీ చేసింది. అనంతరం చెన్నైలోని ఎన్జీటీ సదరన్ జోన్ ధర్మాసనానికి కేసును బదిలీ చేసింది. గత నెల 7న విచారణ నిర్వహించిన చెన్నై ఎన్జీటీ ధర్మాసనం.. ‘మల్లన్నసాగర్’ను సందర్శించి నివేదిక సమర్పించాలని జిల్లా డిప్యూటీ కలెక్టర్, నీటిపారుదల శాఖను ఆదేశించింది. తదుపరి విచారణ ఈ నెల 11న నిర్వహించనుంది. ‘సిక్కిం’ డ్యామ్ విషయాన్ని ప్రస్తావిస్తూ.. గతేడాది సిక్కింలోని లోహ్నాక్ వాగుకు గండి పడడంతో తీస్తా నదికి ఆకస్మిక వరదలు పోటెత్తాయి. దీంతో చుంగ్తాంగ్ వద్ద తీస్తాపై నిర్మించిన 1,200 మెగావాట్ల హైడ్రో పవర్ ప్రాజెక్టు కమ్ డ్యామ్ కొట్టుకుపోగా, పలు మరణాలతోపాటు భారీనష్టం వాటిల్లింది. దీనిపై గతంలో ఎన్జీటీ–ఢిల్లీ సుమోటోగా విచారణకు స్వీకరించింది. మల్లన్నసాగర్ సైతం ఇదే తరహా అంశమని భావిస్తూ దానిపై సైతం విచారణ నిర్వహిస్తామని ఎన్జీటీ–ఢిల్లీ స్పష్టం చేసింది. భూకంపాల సంభావ్యతకు సంబంధించిన అధ్యయనాల్లేకుండా మల్లన్నసాగర్ నిర్మాణంతో ఏదైనా విపత్తు జరిగితే అమలు చేయాల్సిన అత్యవసర కార్యాచరణ ప్రణాళిక సైతం రూపొందించకపోవడం ద్వారా ప్రభుత్వం రిజర్వాయర్‌తోపాటు దిగువ ప్రాంతాల ప్రజల ప్రాణాలను ప్రమాదంలో నెట్టేసిందని కాగ్ ఆందోళన వ్యక్తం చేసిందని ఈ సందర్భంగా ఎన్జీటీ గుర్తు చేసింది. మల్లన్నసాగర్ గర్భంలో 3 జతల పగుళ్లు మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభించడానికి ముందే సైట్లో భూకంపాలు సంభవించడానికి ఉన్న అవకాశాలపై ఎన్జీఆర్ఐతో అధ్య యనం జరిపించాలని షరతు విధిస్తూ ప్రాజెక్టు ప్రాథమిక డ్రాయింగ్స్‌ను 2016 ఆగస్టులో సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ చీఫ్ ఇంజనీర్ ఆమోదించారు. ఈ అధ్యయనాలు నిర్వహించాలని నీటిపారుదలశాఖ 2016 డిసెంబర్, ఆగస్టు 2017, అక్టోబర్ 2017లో హైదరాబాద్‌లోని ఎన్జీఆర్ఐ డైరెక్టర్‌కు లేఖలు రాసింది. అధ్యయన నివేదిక వచ్చే వరకు వేచిచూడకుండానే, 2017లో నీటిపారుదలశాఖ మల్లన్నసాగర్ నిర్మాణ పనులను కాంట్రాక్టర్లకు అప్పగించింది. మరోవైపు మల్లన్నసాగర్‌ను ప్రతిపాదించిన ప్రాంత భూగర్భంలో అత్యంత లోతు వరకు నిలువునా 3 జతల పగుళ్లు, వాటిలో కదలికలూ ఉన్నట్టు ఎన్జీఆర్ఐ 2017 మార్చిలో సమర్పించిన ప్రాథమిక నివేదికలో తేల్చి చెప్పిందని కాగ్ బయటపెట్టింది. వీటి ద్వారా ఉండనున్న ప్రభావంపై సమగ్ర సర్వే, పరిశోధనలు చేయా లని సిఫారసులు చేసింది. ఈ ప్రాంతానికి ఉన్న భూకంపాల చరిత్రను ఉటంకిస్తూ సమగ్ర అధ్యయనం జరిపించాలని కోరింది. ఈ సిఫారసులను రాష్ట్ర నీటిపారుదల శాఖ విస్మరించిందని కాగ్ ఆక్షేపణలు తెలిపింది. -
అచ్యుతాపురం సెజ్ ఘటనపై ఎన్టీటీ సీరియస్
-
అచ్యుతాపురం సెజ్ ఘటనపై ఎన్జీటీ సీరియస్
సాక్షి, ఢిల్లీ: అచ్యుతాపురం సెజ్ ఘటనపై ఎన్జీటీ సీరియస్ అయ్యింది. ప్రమాదాన్ని సుమోటోగా తీసుకున్న ఎన్జీటీ.. 17 మంది కార్మికుల మృతిచెందడంపై ఆందోళన వ్యక్తం చేసింది. అనకాపల్లి కలెక్టర్, ఏపీ పొల్యూషన్ బోర్డులకు నోటీసులు జారీ చేసింది. ఏపీ పరిశ్రమల శాఖ,సీపీసీబీలతో పాటు కేంద్ర పర్యావరణ శాఖకు కూడా నోటీసులు ఇచ్చింది.అలాగే, రెండు రోజుల వ్యవధిలో ఏపీలో జరిగిన మూడు ఘోరమైన ప్రమాదాలను జాతీయ మానవ హక్కుల సంఘం(ఎన్హెచ్ఆర్సీ) తీవ్రంగా పరిగణించింది. అచ్యుతాపురం ఫార్మా సెజ్‌లోని ఎసైన్షియా అడ్వాన్స్డ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో జరిగిన ప్రమాదంలో 17 మంది మృతిచెందడంపై తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది.కాగా, చిత్తూరు సమీపంలోని మురకంబట్టు ప్రాంతంలోని అపొలో మెడికల్ కాలేజీలో ఫుడ్ పాయిజన్ అయ్యి 70 మంది విద్యార్థులు ఆసుపత్రి పాలవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన కమిషన్.. అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాపట్నంలోని ఓ అనాథాశ్రమంలో ఫుడ్ పాయిజన్ అయ్యి ముగ్గురు విద్యార్థులు మృతిచెందడం, 37మంది తీవ్ర అస్వస్థతకు గురికావడంపై అసహనం వ్యక్తం చేసింది.ఈ 3 ఘటనలపై పత్రికలు, టీవీల్లో వచ్చిన కథనాల ఆధారంగా సుమోటోగా కేసు నమోదు చేసినట్లు తెలిపింది. ఈ ఘటనల్లో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందంటూ ఆరోపించింది. 2 వారాల్లో ఈ 3 ఘటనలపై సమగ్రమైన నివేదికను ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ శుక్రవారం చీఫ్ సెక్రటరీ, డీజీపీలకు నోటీసులు జారీ చేసింది.అచ్యుతాపురం ఘటనలో ఎఫ్ఐఆర్ స్టేటస్ రిపోర్ట్, క్షతగాత్రుల ప్రస్తుత పరిస్థితి, వారికి అందుతున్న చికిత్స, నష్టపరిహారం వంటి విషయాలపై స్పష్టమైన నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. మృతుల కుటుంబాలకు ఇప్పటివరకు ఏమైనా సాయం అందిందా లేదా అనే సమాచారాన్ని అందజేయాలని ఆదేశించింది. ఈ ఘటనకు బాధ్యులైన అధికారులపై ఇప్పటి వరకు తీసుకున్న చర్యలను కూడా తమకు తెలపాలని పేర్కొంది. -
Fact Check: రామోజీ.. ఇసుకపై బురద రాతలు మానవా?
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సక్రమంగా జరుగుతున్న ఇసుక తవ్వకాలపై రామోజీరావు వక్రరాతలు మానడంలేదు. నిత్యం తన ఈనాడు పత్రికలో ఇసుకపై బురద వార్తలు రాస్తూనే ఉన్నారు. తన గలీజుతనాన్ని బయటపెట్టుకుంటూనే ఉన్నారు. ఇసుక తవ్వకాల్లో లేని అక్రమాలను ఉన్నట్లు చూపించేందుకు రామోజీరావు పడుతున్న తాపత్రయం అంతా ఇంతా కాదు. ఇసుక తవ్వకాల్లో భారీ అక్రమాలు జరిగినట్లు ఎన్జీటీ (నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్) తనకు చెప్పినట్లే కథనాలు అల్లేస్తున్నారు. వాటిని చూసి ప్రజలు నమ్మేస్తారని అపోహ పడుతున్నారు. చంద్రబాబు హయాంలో గతంలో ఎప్పుడూ లేనంత పెద్దఎత్తున అక్రమ ఇసుక తవ్వకాలు జరిగినా పట్టించుకోకుండా ఇప్పుడు ప్రజలకు సులభంగా ఇసుక అందుతున్నా కూడా ప్రభుత్వంపై దు్రష్పచారానికి ఒడిగడుతున్నారు. నిజానికి ఇసుక తవ్వకాల్లో ఎన్జీటీ నిబంధనల ప్రకారమే ప్రభుత్వం వ్యవహరిస్తోంది. రాష్ట్రంలో 110 ఇసుక రీచ్‌లకు పర్యావరణ అనుమతులు ఉన్నా.. ఎన్జీటీ ఇచ్చిన ఆదేశాలతో వాటిల్లో తవ్వకాలను నిలిపివేసింది. తర్వాత ఎన్జీటీ మార్గదర్శకాలకు అనుగుణంగా తిరిగి అన్ని అనుమతుల కోసం గనుల శాఖ దరఖాస్తు చేసింది. అందులో భాగంగా ఇప్పటివరకు 61 ఓపెన్ రీచ్‌లకు అనుమతులు లభించాయి. మిగిలిన వాటికి మరో వారం రోజుల్లో అనుమతులు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం సంబంధిత శాఖల నుంచి అనుమతులు ఉన్న డీసిల్టింగ్ పాయింట్లలో మాత్రమే ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. అయినా ‘ఉల్లంఘనలు నిజం’ అంటూ పతాక శీర్షికతో పచ్చి అబద్ధాలను ఈనాడు అచ్చేసింది. ఎన్జీటీకి 3 నెలలకోసారి నివేదిక ఇచ్చేలా చర్యలు ఇసుక విషయంలో ప్రభుత్వం అత్యంత పారదర్శక విధానాన్ని అమలు చేస్తోంది. ఎన్జీటీ నుంచి వచ్చిన సూచనలు, మార్గదర్శకాలతో దీన్ని మరింత పటిష్టం చేసేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఒక ఉన్నతస్థాయి కమిటీని కూడా ఏర్పాటు చేసేందుకు గనుల శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఈ కమిటీ ప్రతి మూడు నెలలకు ఒకసారి ఇసుక తవ్వకాలపై సమగ్ర నివేదికను ఎన్జీటీకి సమర్పించేలా ఈ ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇసుక తవ్వకాలపై ప్రభుత్వం ఇంత బాధ్యతతో వ్యవహరిస్తోంది. న్యాయస్థానాల ఆదేశాల ప్రకారం తనిఖీలు న్యాయస్థానాల ఆదేశాలతో జిల్లాల కలెక్టర్లతో కూడిన బృందాలు రాష్ట్రంలోని అన్ని ఇసుక రీచ్‌లను ఇటీవల పరిశీలించాయి. ఆయా రీచ్‌ల్లో ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయా? లేదా అనే అంశాలను రికార్డు చేశాయి. ఈ నివేదికలను న్యాయస్థానాలకు సమర్పించారు. ఎన్జీటీ ఆదేశాలకు అనుగుణంగా గనుల శాఖ తీసుకున్న చర్యల కారణంగా అనుమతి లేని రీచ్‌ల్లో తవ్వకాలు నిలిచిపోయాయి. ఇదే అంశాన్ని కలెక్టర్లు కూడా తమ నివేదికలో స్పష్టం చేశారు. ఈనాడు మాత్రం కలెక్టర్లు వచ్చి వెళ్లిన తరువాత ఇసుక తవ్వకాలు మళ్లీ జరుగుతున్నాయంటూ అడ్డగోలుగా అబద్ధాలు ప్రచురించింది. అదికూడా భారీ యంత్రాలను రీచ్‌లకు తరలించి వెంటనే తవ్వకాలు ప్రారంభించారంటూ నిస్సిగ్గుగా రాసింది. ఒకవైపు ఇసుక రీచ్‌ల్లో అధికారిక తనిఖీలు జరుగుతూ ఉంటే, మరోవైపు ఎవరైనా భారీ యంత్రాలను రీచ్‌లకు తరలిస్తారా? అసలు తవ్వకాలే జరగడం లేదని అధికారులు ప్రత్యక్షంగా తనిఖీ చేసి నివేదిక ఇస్తే, రోజుకు రెండు వేల టన్నుల ఇసుక తవ్వుతున్నారంటూ, కంప్యూటరైజ్డ్ వే బిల్లులు లేకుండానే ఆ ఇసుకను రవాణా చేస్తున్నారంటూ తప్పుడు ఆరోపణలు చేసింది. పాత ఫోటోలతో ప్రజలను నమ్మించేందుకు విశ్వప్రయత్నం చేసింది. జరగని రవాణాకు జీపీఎస్ ట్రాకింగ్ లేదంటూ, రీచ్‌ల్లో సీసీ కెమేరాలు లేవని, అడుగడుగునా ఉల్లంఘనలే జరుగుతున్నాయని గగ్గోలు పెట్టడం రామోజీ వక్రబుద్ధికి నిదర్శనం. ఆ పత్రికకు నిబద్ధత ఎక్కడిది? గతేడాది ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు వర్షాల వల్ల ఇసుక తవ్వకాలు రీచ్‌ల్లో జరగలేదు. వేసవికాలంలో ముందుజాగ్రత్తగా సిద్ధం చేసిన ఇసుక డిపోల నుంచే ప్రజలకు విక్రయాలు జరిగాయి. గతంలోనూ ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్పినప్పటికీ ఈనాడు పత్రిక దానిని అక్రమ ఇసుక తవ్వకాలు కిందనే నిర్ధారించడం ఆ పత్రికకు ఉన్న నిబద్ధతను తెలియజేస్తోంది. బాధ్యతారహితంగా ఈనాడు ప్రచురించే ఇటువంటి కథనాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. – వీజీ వెంకటరెడ్డి, డైరెక్టర్, మైనింగ్ శాఖ -
చంద్రబాబు నివాసానికి కూతవేటు దూరంలోనే అడ్డగోలుగా దోచేశారు..
సాక్షి, అమరావతి: టీడీపీ హయాంలో నిబంధనలను ఉల్లంఘించి, జీవనదులను విధ్వంసం చేసి.. పర్యావరణాన్ని చావుదెబ్బ తీస్తూ అడ్డగోలుగా యథేచ్ఛగా ఇసుక దోపిడీ సాగిందని జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) తేల్చి చెప్పింది. కృష్ణా నదీ గర్భంలో ప్రకాశం బ్యారేజ్ జల విస్తరణ ప్రాంతంలో అప్పటి సీఎం చంద్రబాబు నివాసముంటున్న అక్రమ కట్టడానికి కూత వేటు దూరంలో పొక్లెయినర్లతో భారీ ఎత్తున ఇసుకను తవ్వి.. వందలాది ట్రక్కులు, లారీలు, ట్రాక్టర్లలో ఇసుకను స్మగ్లర్లు తరలిస్తున్నా ప్రభుత్వం చూసీ చూడనట్లు వ్యవహరించిందని మండిపడింది. ఈ మేరకు 2019 ఏప్రిల్ 4న స్పష్టం చేసింది. టీడీపీ ప్రభుత్వం ఉచిత ఇసుక విధానాన్ని 2016 మార్చి 4 నుంచి అమల్లోకి తెచ్చింది. ఆ తర్వాత ఇసుక స్మగ్లర్లు విజృంభించారు. అప్పటి నుంచి ఒక్క ప్రకాశం బ్యారేజ్ జల విస్తరణ ప్రాంతంలో ఎనిమిది చోట్ల రోజూ 34 వేల టన్నుల ఇసుకను పొక్లెయిన్లతో తవ్వి 2,500 ట్రక్కుల్లో తరలించి.. ఒక్కో ట్రక్కు ఇసుకను కనీసం రూ.5 వేల చొప్పున విక్రయించి రూ.1.25 కోట్ల చొప్పున ఏడాదికి రూ.450 కోట్లను ఇసుక స్మగ్లర్ల ముఠా ఆర్జించిందని ఎన్జీటీ తేల్చింది. శ్రవణ్‌కుమార్ అనే న్యాయవాది వేరే కేసులో రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక అక్రమ తవ్వకాల ద్వారా ఏడాదికి రూ.పది వేల కోట్లను స్మగ్లర్లు సంపాదిస్తున్నారని చెప్పడాన్ని ఎన్జీటీ ఎత్తిచూపింది. అక్రమంగా ఇసుకను తవ్వడం ద్వారా పర్యావరణానికి తీవ్ర విఘాతం కలిగిందని.. అందుకు రూ.వంద కోట్ల జరిమానాగా చెల్లించాలని గత ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ రూ.100 కోట్లను ఇసుక స్మగ్లర్ల నుంచే వసూలు చేయాలంటూ 2019 ఏప్రిల్ 4న పేర్కొంది. అప్పట్లో అధికారంలో ఉన్నది టీడీపీ సర్కారే. ప్రకాశం బ్యారేజ్ జల విస్తరణ ప్రాంతంలోనే 8 చోట్ల అక్రమంగా ఇసుకను తవ్వి, తరలించి, విక్రయించి ఏడాదికి రూ.450 కోట్లను ఇసుక స్మగ్లర్లు దోచేస్తే.. రాష్ట్ర వ్యాప్తంగా గోదావరి, పెన్నా, తుంగభద్ర, వంశధార, నాగావళి, చిత్రావతి సహా జీవనదులు, వాగులు, వంకల్లో ఇసుకను అడ్డగోలుగా దోచేయడం ద్వారా ఇంకెన్ని రూ.వేల కోట్ల దోచుకొని ఉంటారో అంచనా వేసుకోవచ్చు. ప్రకాశం బ్యారేజ్ జల విస్తరణ ప్రాంతంలో కృష్ణా నది గర్భంలో అక్రమంగా పొక్లెయిన్లతో ఇసుకను తవ్వి, తరలించడం ద్వారా పర్యావరణానికి విఘాతం కలుగుతోందంటూ 2016లో ఎన్జీటీలో రైతులు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన ఎన్జీటీ.. తక్షణమే ఇసుక అక్రమ తవ్వకాలను ఆపేయాలని ఆదేశిస్తూ 2017 ఫిబ్రవరి 23న ప్రభుత్వానికి నోటీసులిచ్చింది. కానీ.. ఎన్జీటీ ఆదేశాలను తుంగలో తొక్కిన అప్పటి రాష్ట్ర ప్రభుత్వం యథేచ్ఛగా ఇసుక అక్రమ తవ్వకాలకు దన్నుగా నిలిచింది. ఇదే అంశాన్ని రైతులు మరోసారి ఎన్జీటీ దృష్టికి తీసుకెళ్లారు. దాంతో.. కృష్ణా నది గర్భంలో అక్రమ ఇసుక తవ్వకాలను నిగ్గు తేల్చాలని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి(సీపీసీబీ), రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ)లను 2018 డిసెంబర్ 21న ఎన్జీటీ ఆదేశించింది. సీపీసీబీ, పీసీబీలకు చెందిన ఏడుగురు అధికారులతో విచారణ కమిటీని నియమించింది. బాబు జమానాలో లెక్కలేనన్ని ఇసుక అక్రమాలు చంద్రబాబు జమానాలో తవ్వినకొద్దీ లెక్కలేనన్ని ఇసుక అక్రమాలు బయటపడ్డాయి. చంద్రబాబు, లోకేశ్ కనుసన్నల్లో అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక మాఫియా యథేచ్ఛగా తవ్వకాలు సాగించి, ఇసుకను తరలించింది. అప్పటి టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులైన దేవినేని ఉమామహేశ్వరరావు, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, అమర్నాథ్రెడ్డి, నక్కా ఆనందబాబు, జవహర్, చింతమనేని ప్రభాకర్, కూన రవికుమార్, పెందుర్తి వెంకటేష్, బూరుగుపల్లి శేషారావు, ముళ్లపూడి బాపిరాజు, శ్రావణ్ కుమార్, తంగిరాల సౌమ్య, కొమ్మాలపాటి శ్రీధర్, శ్రీరాం తాతయ్య, ఆలపాటి రాజా తదితరులు ఇసుక అక్రమాల్లో చెలరేగిపోయారు. ఈ ముఠా అంతా ఇసుక ద్వారా దోపిడి చేసిన మొత్తంలో నెలవారీ కమీషన్లు ఏకంగా రూ.500 కోట్లు లోకేశ్‌కు ముట్టజెప్పేవారనేది బహిరంగ రహస్యం. గోదావరి, కృష్ణా, వంశధార, నాగావళి, పెన్నా నదులతోపాటు తమ్మిలేరు తదితర నదులు, ఏరుల్లో సైతం అడ్డు అదుపులేకుండా పెద్ద ఎత్తున ఇసుక దందా సాగించారు. స్వయం సహాయక బృందాల పేరుతో టీడీపీ పెద్దల కనుసన్నల్లోనే పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఇసుక దందా నడిపారు. ఇసుక విధానంపై ఇష్టానుసారంగా తమకు అనుకూలంగా నిర్ణయాలు మార్చుకుంటూ దాదాపు 19 సార్లు జీఓలు ఇచ్చారు. వాస్తవానికి ఉచితంగా ఇసుక ఎవరికీ అందలేదు. అధిక ధర చెల్లించి కొనుక్కోవాల్సిన దుస్థితి కల్పించారు. పొరుగు రాష్ట్రాలకు సైతం పెద్ద ఎత్తున ఇసుకను లారీల్లో తరలించారు. అడ్డుకున్న వారిపై టీడీపీ నేతలు రెచ్చిపోయి దాడులు చేశారు. దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం బాధితులనే తప్పు పట్టడం అప్పట్లో సర్వత్రా చర్చనీయాంశమైంది. దోపిడీ గుట్టు రట్టు చేసిన కమిటీ ఎన్జీటీ ఏర్పాటు చేసిన విచారణ కమిటీ.. చంద్రబాబు నివాసం ఉంటున్న అక్రమ కట్టడానికి కూతవేటు దూరంలో కృష్ణా నది గర్భంలో ఇసుకను తవ్వుతున్న ప్రాంతంతోసహా ఎగువన మరో ఏడు రీచ్‌లను 2019 జనవరి 17, 18న క్షేత్ర స్థాయిలో తనిఖీ చేసింది. ఆ తనిఖీలో వెల్లడైన అంశాల ఆధారంగా 2019 జనవరి 21న ఎన్జీటీకి నివేదిక ఇచ్చింది. నివేదికలో ప్రధానాంశాలు.. ► ప్రకాశం బ్యారేజ్ జల విస్తరణ ప్రాంతంలో కృష్ణా నది గర్భంలో అనుమతి లేకుండా.. నదీ పరిరక్షణ చట్టం, పర్యావరణ నిబంధనలకు విరుద్ధంగా ఎనిమిది చోట్ల భారీ ప్రొక్లెయిన్లు, మర పడవల ద్వారా రోజుకు సుమారు 34,650 టన్నుల ఇసుకను తవ్వుతున్నారు. ఇలా తవ్విన ఇసుకను రోజూ 2,500 ట్రక్కులు, లారీలు, ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నారు. ట్రక్కు ఇసుకను కనీసం రూ.5 వేల చొప్పున విక్రయిస్తున్నారు. అంటే రోజుకు ఇసుక అక్రమ అమ్మకాలతో రూ.1.25 కోట్లు ఆర్జిస్తున్నారు. ఏడాదికి ఈ 8 రీచ్‌ల నుంచే రూ.450 కోట్ల చొప్పున కొల్లగొట్టారు. ప్రకాశం బ్యారేజ్ జల విస్తరణ ప్రాంతంలో అడ్డగోలుగా ఇసుకను తవ్వేయడం వల్ల జీవనది కృష్ణా విధ్వంసమైంది. కృష్ణా నది గర్భంలో 25 మీటర్ల లోతు వరకు ఇసుకను తవ్వడంతో భారీ గోతులు ఏర్పడ్డాయి. అందువల్ల ప్రవాహ దిశ మారే అవకాశం ఉంది. వరద గట్లు, భవానీ ద్వీపం దెబ్బతిన్నాయి. ► ఈ నివేదికను సమగ్రంగా పరిశీలించిన ఎన్జీటీ.. ఇసుక స్మగ్లర్లకు దన్నుగా నిలిచిన అప్పటి టీడీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. రూ.వంద కోట్లను జరిమానాగా విధించింది. ► ఇసుక దందా గురించి 2016 నుంచి హిందూ వంటి జాతీయ పత్రికలతోపాటు టీవీ ఛానెళ్లు వరుస కథనాలను ప్రసారం చేయడాన్ని ఎన్జీటీ తన తీర్పులో ప్రస్తావించింది. ఇసుక స్మగ్లర్లు తవ్వేసిన గుంతల్లో పడి.. ఇష్టారాజ్యంగా ట్రక్కులు నడపడం వల్ల వాటి కింది పడి 14 మంది చనిపోవడాన్ని ఎత్తిచూపింది. ఇసుక స్మగ్లర్లు అడ్డగోలుగా దోచేస్తున్నా.. దానికి అడ్డుకట్ట వేయకుండా ప్రభుత్వం ప్రేక్షక పాత్ర పోషించడంలో ఔచిత్యం ఏమిటని చంద్రబాబు సర్కార్‌ను నిలదీసింది. -
ఎన్జీటి మార్గదర్శకాలకు అనుగుణంగా చర్యలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో బయో మెడికల్ వేస్టేజీని అత్యంత కట్టుదిట్టమైన పద్దతుల్లో వేస్టేజీ ట్రీట్ మెంట్ ప్లాంట్ ల ద్వారా నిర్మూలించేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పర్యావరణ, అటవీ, ఇంధన, శాస్త్ర-సాంకేతిక, గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశించారు. సచివాలయంలోని మూడో బ్లాక్ లో గురువారం కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1,68,255 బెడ్స్ తో 13,728 వైద్య సంస్థలు పనిచేస్తున్నాయని అన్నారు. 2021 వార్షిక నివేదిక ప్రకారం ఏటా 7197 టన్నుల బయో వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయని తెలిపారు. ఈ వ్యర్థాలను సురక్షిత విధానంలో నాశనం చేసేందుకు బయో మెడికల్ వేస్ట్ ట్రీట్ మెంట్ ప్లాంట్ లకు తరలిస్తున్నారని అన్నారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 12 బయో మెడికల్ వేస్టేజీ ప్లాంట్ లు పనిచేస్తున్నాయని తెలిపారు. వైద్య సంస్థల నుంచి వచ్చే బయో మెడికల్ వేస్టేజీని 48 గంటల్లో ట్రీట్ మెంట్ ప్లాంట్ లకు తరలించాల్సి ఉంటుందని తెలిపారు. బయో వేస్టేజీపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ జారీ చేసిన మార్గదర్శకాలను అధికారులు అమలు చేయాలని కోరారు. వైద్య సంస్థల సంఖ్య పెరగడం, అదనంగా బెడ్స్ ఏర్పాటు అవుతుండటం వల్ల రాష్ట్రంలో కొత్త బయో మెడికల్ వేస్టేజీ ప్లాంట్ లను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇందుకోసం దరఖాస్తు చేసుకున్న వారికి అన్ని అర్హతలు ఉంటే కొత్త ప్లాంట్ ల ఏర్పాటుకు అనుమతులు జారీ చేయాలని ఆదేశించారు. ప్రజల ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, హానికరమైన వ్యర్థాలను సురక్షిత విధానాల్లో నాశనం చేసే విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ సమీర్ శర్మ, స్పెషల్ చీఫ్ సెక్రటరీ (పర్యావరణం) నీరబ్ కుమార్ ప్రసాద్, మెంబర్ సెక్రటరీ బి.శ్రీధర్, సీనియర్ ఎన్విరాన్ మెంటల్ ఇంజనీర్ (బయోమెడికల్) కె.ఎ.ఎస్. కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
పరిహారం చెల్లించాల్సిందే
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ హయాంలో నిర్మాణమైన పట్టిసీమ, పురుషోత్తపట్నం ప్రాజెక్టులకు సంబంధించి జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) సంయుక్త కమిటీ సిఫార్సు చేసిన నష్టపరిహారాన్ని చెల్లించాలని ఏపీ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఎన్జీటీ ఆదేశించిన రూ.120 కోట్ల పరిహారం చెల్లింపుపై తరువాత విచారిస్తామని తెలిపింది. పోలవరం, పురుషోత్తపట్నం, పట్టిసీమ ప్రాజెక్టుల పర్యావరణ ఉల్లంఘనలపై జమ్ముల చౌదరయ్య, పెంటపాటి పుల్లారావు తదితరులు దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన ఎన్జీటీ ప్రాజెక్టు వ్యయం ఆధారంగా పర్యావరణ నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది. మరోవైపు సంయుక్త కమిటీ పోలవరం ప్రాజెక్టును మినహాయించి పురుషోత్తపట్నం ప్రాజెక్టుకు రూ.2.48 కోట్లు పట్టిసీమ ప్రాజెక్టుకు రూ.1.90 కోట్లు నష్టపరిహారంగా ఏపీ కాలుష్య నియంత్రణ మండలికి చెల్లించాలని సిఫార్సు చేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వంపై రూ.4.38 కోట్లు భారం పడింది. ఎన్జీటీ ఆదేశాలు సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన వేర్వేరు పిటిషన్లను జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సుందరేశ్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారించింది. ప్రతివాదుల న్యాయవాది శ్రావణ్‌కుమార్ గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు అమలు చేయలేదని, పురుషోత్తపట్నం రైతులకు పరిహారం ఇవ్వలేదని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. రెండువారాల సమయం ఇవ్వాలని ఏపీ న్యాయవాది కోరారు. రెండువారాల్లో జరిమానా చెల్లించారా లేదా అనే అంశంపై నివేదిక అందజేయాలని, లేకుంటే చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ధర్మాసనం పేర్కొంది. తదుపరి విచారణ మూడువారాల తర్వాత చేపడతామని తెలిపింది. -
ఎన్జీటీ విధించిన జరిమానాపై స్టే
సాక్షి, న్యూఢిల్లీ: పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వానికి ఎన్జీటీ విధించిన జరిమానాపై సుప్రీంకోర్టు స్టే విధించింది. తాగునీటికి సంబంధించి 7.15 టీఎంసీల పనులకు అనుమతిస్తున్నట్లు స్పష్టం చేసింది. ధర్మాసనం ఆదేశాలకు ఏపీ ప్రభుత్వం అభ్యంతరం తెలుపుతూ తెలంగాణ ప్రభుత్వం 90 టీఎంసీల సామర్థ్యంతో ప్రాజెక్టు నిర్మిస్తోందని పర్యావరణ అనుమతుల్లేవని ఆరోపించింది. అనంతరం ధర్మాసనం తదుపరి విచారణ ఆగస్టుకు వాయిదా వేసింది. ► పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం విషయంలో ఎన్జీటీ విధించిన భారీ జరిమానాను సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను శుక్రవారం జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎంఎం సుందరేశ్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది ముఖల్ రోహత్గి వాదనలు వినిపిస్తూ .. ఎన్జీటీ ఆదేశాలతో రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలుగుతోందన్నారు. కేవలం తాగునీటి కోసమే ప్రాజెక్టు అని ఎలా చెబుతారు..? ఉత్తర్వుల్లో రెండు రకాల ప్రయోజనాలు అని ఉందిగా అని ధర్మాసనం ప్రశ్నించింది. ప్రాజెక్టు తాగు, సాగు నీటి విభాగాలకనీ, రెండింటికీ వేర్వురుగా నిధులు కేటాయింపులు ఉన్నాయని రోహత్గి తెలిపారు. 2050 నాటి అవసరాల మేరకు ప్రాజెక్టు చేపడుతున్నామన్నారు. తాగునీటి నిమిత్తం ఐదు రిజర్వాయర్లు నిర్మిస్తున్నామని దీంట్లో మొదటి రిజర్వాయరు 24వేల ఎకరాలని ఇది రాష్ట్రపతి భవనం కన్నా వెయ్యి రెట్లు పెద్దదని రోహత్గి తెలిపారు. వంద నుంచి రెండు వందల అడుగుల లోతుగా నిర్మిస్తున్న నిర్మాణాలు హఠాత్తుగా నిలిపివేయాలని ఎన్జీటీ ఆదేశించిందన్నారు. ప్రాజెక్టు పనులు సురక్షిత స్థాయికి తీసుకొచ్చి నిలిపివేయడానికే రూ.కోట్లలో ఖర్చయిందన్నారు. ఈలోగా ఆదేశాలు ఉల్లంఘించారంటూ ఎన్జీటీ భారీగా జరిమానా విధించిందని రోహత్గి తెలిపారు. తెలంగాణలో నిర్మిస్తున్న ప్రాజెక్టు వల్ల ఏపీలోని రాయలసీమ పర్యావరణంపై ప్రభావం ఎలా పడుతుందని రాష్ట్ర ప్రభుత్వం తరఫు మరో సీనియర్ న్యాయవాది వైద్యనాధన్ ప్రశ్నించారు. తెలంగాణ వారెవరూ ప్రాజెక్టును వ్యతిరేకించలేదని, ఏపీ వారే వ్యతిరేకిస్తున్నారని ఆరోపించారు. మరోవైపు, పర్యావరణ అనుమతుల్లేవంటూ ఏపీ ప్రభుత్వం అంతర్రాష్ట్ర జల వివాదాలు లేపాలని యోచిస్తోందన్నారు. విభేదించిన ఏపీ న్యాయవాది న్యాయస్థానం వాస్తవాల్లోకి వెళ్లాలని వినతి తెలంగాణ న్యాయవాదుల వాదనలతో ఏపీ ప్రభుత్వం తరఫు సీనియర్ న్యాయవాది జయదీప్ గుప్తా విభేదించారు. రెండు రాష్ట్రాల అధికారులతో సంయుక్త కమిటీకి తెలంగాణ ఒప్పుకోలేదని తెలిపారు. ప్రాజెక్టు మొత్తంగా చూస్తే తాగునీరు అనేది చాలా చిన్న విషయమని తెలిపారు. తాగునీటి ప్రాజెక్టుకు మినహాయింపు ఇస్తున్నారా అని ధర్మాసనం ప్రశ్నించింది. తాగునీటి అవసరాలకు 7.15 టీఎంసీలు సరిపోతాయని సంయుక్త కమిటీ నివేదిక చెప్పిందని, అయితే సాగు, పారిశ్రామిక అవసరాలకు సరిపోయేలా 90 టీఎంసీలతో ప్రాజెక్టు రూపొందించారని జయదీప్ గుప్తా తెలిపారు. న్యాయస్థానం వాస్తవాల్లోకి వెళ్లాలని కోరారు. 7.15 టీఎంసీల పనులే చేపడుతున్నామని తెలంగాణ చెబుతోందిగా అని ధర్మాసనం పేర్కొనగా.. రిజర్వాయర్లకు అనుమతులు లేవని, ప్రాజెక్టు నిలిపివేయాలని గుప్తా కోరారు. ఎన్జీటీ ఎంత మొత్తం జరిమానా విధించిందని ధర్మాసనం ప్రశ్నించింది. ఎన్జీటీ పాలమూరు–రంగారెడ్డి , డిండి ప్రాజెక్టులకు జరిమానాగా విధించిందని రోహత్గి తెలిపారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు మొత్తం వ్యయంరూ.35,200 కోట్లలో 1.5 శాతం రూ.528 కోట్లు ఆదేశాలు ఉల్లంఘించామంటూ మరో రూ.300 కోట్లు జరిమానా వేసిందన్నారు. అనంతరం ధర్మాసనం స్పందిస్తూ.. 7.15 టీఎంసీల తాగునీటి పనులకు మాత్రమే అనుమతిస్తున్నామని పేర్కొంది. తాగునీటి ఎద్దటితో ప్రజలు ఇబ్బందులు పడకూడదనే అనుమతి ఇస్తున్నామని స్పష్టం చేసింది. అనంతరం, ఎన్జీటీ విధించిన భారీ జరిమానాపై స్టే విధించాలని రోహత్గి కోరారు. ఎన్జీటీ విధించిన పరిహారం మొత్తంపైనా స్టే విధిస్తున్నట్లు పేర్కొన్న ధర్మాసనం తదుపరి విచారణ ఆగస్టుకు వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. ఆరువారాల్లోగా ప్రతివాదులు, ఏపీ ప్రభుత్వం, కేంద్రం కౌంటరు దాఖలు చేయాలని, తర్వాత ఆరు వారాల్లోగా తెలంగాణ రిజాయిండర్ దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశించింది. పర్యావరణ అనమతులు లేకుండా పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం చేపడుతోదంటూ ఏపీ ప్రభుత్వంతో పాటు ఏపీలోని వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన చందరమౌళీశ్వరరెడ్డి, తదితరులు ఎన్జీటీని ఆశ్రయించారు. పిటిషన్లు విచారించిన ఎన్జీటీ ప్రాజెక్టు పనులు నిలిపి వేయాలని 2021లో ఆదేశాలిచ్చింది. ఎన్జీటీ ఆదేశాలు ఉల్లంఘించి తెలంగాణ ప్రభుత్వం పనులు చేపడుతోదంటూ పిటిషనర్లు మరోసారి ఎన్జీటీని ఆశ్రయించగా ఎన్జీటీ జరిమానా విధించింది. -
తెలంగాణ ప్రభుత్వానికి ఎన్జీటీ భారీ జరిమానా
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ప్రభుత్వానికి ఎన్జీటీ భారీ జరిమానా విధించింది. పర్యావరణ అనుమతులు లేకుండా పాలమూరు-రంగారెడ్డి, డిండి ప్రాజెక్టు నిర్మాణాలు చేపట్టారని రూ.900 కోట్ల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. మూడు నెలల్లో చెల్లించాలని చెన్నై ఎన్జీటీ ధర్మాసనం ఆదేశించింది. మొత్తం ప్రాజెక్టులకు అయ్యే ఖర్చులో 1.5 శాతం జరిమానా విధించింది. జరిమానాను కేఆర్ఎంబీ వద్ద జమ చేయాలని ఎన్జీటీ పేర్కొంది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పర్యవేక్షణకు కేంద్ర ప్రభుత్వ అధికారులతో కమిటీ ఏర్పాటు చేసింది. పర్యావరణ అనుమతులు తీసుకోకుండా ప్రాజెక్టు నిర్మాణం కొనసాగిస్తూ కోర్టు ధిక్కరణకు పాల్పడుతున్నారని ఏపీ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసిన తెలిసిందే. చదవండి: కరోనా కొత్త వేరియంట్‌పై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ -
ఏపీలో స్వచ్ఛత భేష్.. ఎన్జీటీ ప్రశంసలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేస్తున్న స్వచ్ఛతా కార్యక్రమాలపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సంతృప్తి వ్యక్తం చేసింది. ఘన, ద్రవ వ్యర్థాలు, మురుగు నీటి నిర్వహణపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఎన్జీటీ మార్గదర్శకాలకు అనుగుణంగా ఉన్నట్టు పేర్కొంది. రెండు రోజులుగా రాష్ట్రంలోని స్వచ్ఛతా పనులపై విచారణ చేపట్టిన ఎన్జీటీ న్యాయమూర్తులు శుక్రవారం సాయంత్రం తీర్పునిచ్చారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా రాష్ట్రంలోని పలు పట్టణాల్లో అమలు చేస్తున్న జగనన్న స్వచ్ఛ సంకల్పం ప్రణాళిక, అమలు తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. స్వచ్ఛతా పనుల ప్రణాళికను ఇలాగే అమలు చేయాలని, ఈ పనులకు కేటాయించిన నిధులను సమర్థంగా వినియోగించుకోవాలని జస్టిస్ ఆదర్శ్ కుమార్ గోయల్ నాయకత్వంలోని ఎన్జీటీ సూచించింది. పర్యావరణానికి హానికరంగా పరిణమించిన వ్యర్థాలను సమర్థంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం 2016లో వేస్ట్ మేనేజ్మెంట్ నిబంధనలను అమల్లోకి తెచ్చింది. ఆ తర్వాత ఫిర్యాదులు అందిన రాష్ట్రాల్లో ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణ తీరుతెన్నులు తమ ముందుంచాలని ఆయా రాష్ట్రాలకు ఎన్జీటీ నోటీసులు ఇచ్చింది. అయినా పరిస్థితిలో మార్పు రాకపోవడంతో ద్రవ వ్యర్థాల నిర్వహణలో రోజుకు మిలియన్ లీటర్లకు రూ.2 కోట్ల చొప్పున, మెట్రిక్ టన్నుకు రూ.300 వంతున జరిమానా విధించింది. ఈ మేరకు రాజస్థాన్‌కు రూ.3,000 కోట్లు, మహారాష్ట్రకు రూ.12,000 కోట్లు, పశ్చిమ బెంగాల్‌కు రూ.3,000 కోట్లు, తెలంగాణకు రూ.3,800 కోట్లు, కర్ణాటకకు రూ.2,900 కోట్ల మేర జరిమానా విధించింది. రాష్ట్ర ప్రభుత్వానికి గతంలో ఎన్జీటీ నోటీసులు జారీ చేసినప్పటికీ.. ప్రస్తుత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై సంతృప్తి వ్యక్తం చేస్తూ.. నిర్ణీత వ్యవధిలోగా పనులు పూర్తి చేయాలని ఆదేశిస్తూ నోటీసులను ఉపసంహరించుకుంది. రాష్ట్రంలో సమర్థంగా స్వచ్ఛతా పనులు.. - ఆరోగ్యవంతమైన సమాజాన్ని రూపొందించడమే లక్ష్యంగా సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలోని ప్రభుత్వం పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ‘జగనన్న స్వచ్ఛ సంకల్పం– క్లీన్ ఆంధ్రప్రదేశ్’ (క్లాప్)ని అమలు చేస్తోంది. - రాష్ట్రంలోని అన్ని గ్రామాలను, నగరాలను పరిశుభ్రంగా మార్చేందుకు బిన్ ఫ్రీ, లిట్టర్ ఫ్రీ, గార్బేజ్ ఫ్రీగా మార్చేందుకు ప్రణాళికా బద్ధంగా ప్రభుత్వం పని చేస్తోంది. తడి, పొడి, ప్రమాదకరమైన వ్యర్థాలను వేరు చేసి, ఇంటి వద్దనే సేకరించేందుకు వీలుగా ప్రతి ఇంటికి మూడు చొప్పున 1.21 కోట్ల చెత్త డబ్బాలను పంపిణీ చేసింది. - పొడి చెత్తను ప్రాసెస్ చేసి, దాన్నుంచి తిరిగి ఉపయోగించదగిన వస్తువులను వినియోగంలోకి తీసుకువచ్చే ప్రక్రియలను కూడా చేపట్టింది. చెత్త తరలింపునకు వీలుగా జీపీఎస్ ట్రాకింగ్‌తో కూడిన 2,737 గార్బేజ్ ఆటో టిప్పర్లు, 287 ఈ–ఆటోలు, 880 ట్రక్కులు, 480 కంపాక్టర్లను యూఎల్బీల్లో వినియోగిస్తున్నారు. - సేకరించిన చెత్తను ప్రాసెసింగ్ ప్లాంట్లకు చేర్చే ప్రక్రియలో భాగంగా 123 మున్సిపాలిటీల్లో 138 గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ల (జీటీఎస్)ను ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 123 మున్సిపాలిటీల్లో రోజుకు 6,890 టన్నుల ఘన వ్యర్థాలను, 86 లక్షల మెట్రిక్ టన్నుల ప్రమాదకర వ్యర్థాలు, 1503 మిలియన్ లీటర్ల ద్రవ వ్యర్థాలను శుద్ధి చేస్తున్నారు. - లక్ష కంటే తక్కువ జనాభా గల పట్టణాల్లో 91 స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల(ఎస్టీపీ)ను ఏర్పాటు చేస్తున్నారు. మరో 71 ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్లు నిర్మాణంలో ఉన్నాయి. లక్ష మించి జనాభా ఉన్న పురపాలక సంఘాల్లో రూ.1,436 కోట్లతో, లక్ష లోపు జనాభా గల వాటిలో రూ.1,445 కోట్లతో ఎస్టీపీల నిర్మాణం చేపట్టింది. -
ఎన్జీటీ పెనాల్టీ నుంచి ఏపీకి మినహాయింపు
సాక్షి, విజయవాడ: ఎన్జీటీ పెనాల్టీ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు మినహాయింపు లభించింది. జగనన్న స్వచ్ఛ సంకల్పం అమలుతో మినహాయింపు దక్కింది. 5 రాష్ట్రాలకు వేల కోట్ల పెనాల్టీ వేసిన నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్.. ఏపీలో క్లీన్ ఆంధ్రప్రదేశ్ కాన్సెప్ట్ వల్ల పెనాల్టీ విధించలేదు. జగనన్న స్వచ్ఛ సంకల్పంపై ఎన్జీటీ సంతృప్తి చెందింది. తెలంగాణకు 3,800 కోట్లు, పశ్చిమ బెంగాల్‌కి 3 వేల కోట్లు, మహారాష్ట్రకు 12 వేల కోట్లు, రాజస్థాన్‌కి 3 వేల కోట్లు, కర్ణాటకకు 2, 900 కోట్లు ఎన్జీటీ పెనాల్టీ విధించింది. చదవండి: చంద్రబాబు ‘ఆఖరు మాటలు’ దేనికి సంకేతం? -
యాదాద్రి ప్లాంట్‌కు ‘పర్యావరణ’ కష్టాలు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రానికి (వైటీపీఎస్)కి కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ(ఎంవోఈఎఫ్) జారీ చేసిన పర్యావరణ అనుమతులను చెన్నైలోని దక్షిణాది జోన్ జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) సస్పెండ్ చేసింది. తొలుత విదేశీ బొగ్గు ఆధారిత ప్రాజెక్టుగా ప్రతిపాదించి, తర్వాత దేశీయ బొగ్గుకు మారడంతో.. ఇందుకు అనుగుణంగా కొత్తగా పర్యావరణ అనుమతులు పొందాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులను సవాలు చేస్తూ ముంబైకి చెందిన ‘ది కన్జర్వేషన్ యాక్షన్ ట్రస్ట్’ అనే సంస్థ వేసిన కేసులో ఎన్జీటీ సెప్టెంబర్ 30న ఈ తీర్పు ఇచ్చింది. నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెంలో 4,000 మెగావాట్ల సామర్థ్యంతో తెలంగాణ జెన్కో ఈ థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని నిర్మిస్తోంది. దాదాపు 60శాతానికి పైగా పనులు పూర్తయ్యాయి. ఇలాంటి సమయంలో అనుమతులను నిలిపేయడంతో జెన్కోకు ఎదురుదెబ్బ తగిలినట్టు అయింది. యంత్రాలు బిగించరాదు యాదాద్రి ప్లాంట్ విషయంగా మళ్లీ కొత్తగా పర్యావరణ ప్రభావంపై మదింపు (ఈఐఏ) చేయించాలని తెలంగాణ జెన్కోను ఎన్జీటీ ఆదేశించింది. కేంద్ర పర్యావరణ శాఖ నిపుణుల మదింపు కమిటీ (ఈఏసీ)తో మళ్లీ పరిశీలన జరిపించి కొత్తగా పర్యావరణ అనుమతులు పొందాలని స్పష్టం చేసింది. అప్పటివరకు ప్రాజెక్టును పూర్తి (కమిషనింగ్) చేయరాదని, యంత్రాలను బిగించకూడదని ఆంక్షలు విధించింది. మౌలిక సదుపాయాల నిర్మాణ పనులను మాత్రం కొనసాగించుకోవచ్చని తెలిపింది. ఈఐఏ నివేదికల ఆధారంగా కేంద్ర పర్యావరణ శాఖ తీసుకోనున్న తదుపరి నిర్ణయానికి లోబడి ఈ నిర్మాణ పనులు ఉండాలని స్పష్టం చేసింది. ఆ అధ్యయనం ఆధారంగానే ఎలాంటి యంత్రాలు వాడాలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని సూచించింది. ఎన్జీటీ తీర్పులో పేర్కొన్న అంశాలు, సూచనలు దిగుమతి చేసుకున్న బొగ్గు లింకేజీ కోసం ఎలాంటి ఒప్పందం లేదు. బొగ్గు దిగుమతులపై కేంద్ర ప్రభుత్వ ఆంక్షల నేపథ్యంలో 100శాతం దేశీయ బొగ్గును వినియోగించనున్నట్టు తెలంగాణ జెన్కో వాదించింది. ఈ పరిస్థితిలో గాలి నాణ్యతపై ఈఐఏ కన్సల్టెంట్‌తో మళ్లీ అధ్యయనం జరిపించాలి. ఎఫ్‌జీడీ, ఇతర కాలుష్య నియంత్రణ చర్యలను అధ్యయన నివేదికకు అనుగుణంగా పునః సమీక్షించాల్సి ఉండనుంది. కింద పేర్కొన్న అంశాల్లో తదుపరి అధ్యయనాల కోసం జెన్కోకు అదనపు టరŠమ్స్ ఆఫ్ రిఫరెన్స్ (నిబంధనలు/టీఓఆర్)ను కేంద్ర పర్యావరణ శాఖ జారీ చేయాలి. ►రేడియోధార్మికతపై అధ్యయనం కోసం బొగ్గు లింకేజీ వివరాలను జెన్కో తెలియజేయాలి. ఆ మేరకు బొగ్గుతో ఉండే ప్రభావంపై అధ్యయనం జరిపించాలి. 100శాతం దేశీయ బొగ్గుకు మారాలనుకుంటే.. దీనితో పర్యావరణంపై ఉండే ప్రభావంపై తదుపరి అధ్యయనం జరిపించాలి. దీని కోసం కేంద్ర పర్యావరణ శాఖకు జెన్కో దరఖాస్తు చేసుకోవాలి. బొగ్గు లింకేజీ విషయంలో అదనపు టీఓఆర్ అవసరమైతే పర్యావరణ శాఖ జారీ చేయాలి. పర్యావరణ ప్రభావంపై మళ్లీ బహిరంగ విచారణ నిర్వహించి ప్రజాభిప్రాయ సేకరణ జరపాలి. ►బూడిద కొలను (యాష్ పాండ్) సామర్థ్యం, డిజైన్, నిర్వహణపై అవసరమైతే అధ్యయనం కోసం పర్యావరణ శాఖ ఆదేశించాలి. ►పరిసర ప్రాంతాల్లో గాలి నాణ్యతపై పడే ప్రభావంపై సమగ్ర అధ్యయనం జరిపించి, నివారణ చర్యలు తీసుకోవాలి. ►అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ 10 కిలోమీటర్లకు పైగా దూరంలో ఉందని సైట్ పరిశీలన నివేదికలో పేర్కొన్నారు. పీసీసీఎఫ్, చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్‌తో పాటు ఈఐఏ నివేదిక సైతం కచ్చితమైన దూరాన్ని చెప్పలేకపోయింది. పరిధిలో లోపల ఉంటే నేషనల్ బోర్డు ఫర్ వైల్డ్ లైఫ్ (ఎన్బీడబ్ల్యూఎల్) నుంచి క్లియరెన్స్ అవసరం. ఈ నేపథ్యంలో పీసీసీఎఫ్, చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్‌తో సమన్వయంతో జెన్కో.. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఎంత దూరంలో ఉందో కచ్చితంగా నిర్థారణ జరపాలి. జోన్ పరిధిలో ఉంటే ఎన్బీడబ్ల్యూఎల్ నుంచి క్లియరెన్స్ పొందాలి. ►వైల్డ్ లైఫ్ క్లియరెన్స్ వచ్చాక.. ప్రాజెక్టుపై మళ్లీ మదింపు జరిపి అనుమతులకు సిఫార్సులపై నిపుణుల కమిటీ స్వతంత్ర నిర్ణయం తీసుకోవాలి. లేనిపక్షంలో పర్యావరణ శాఖకు నిర్ణయాన్ని వదిలేయాలి. మొత్తం ప్రక్రియను 9 నెలల్లో పూర్తి చేయాలి. ►గతంలో పర్యావరణంపై మెర్క్యురీ స్థాయి ప్రభావమేమీ ఉండదని విమ్టా ల్యాబ్ ఇచ్చిన నివేదికను నిపుణుల కమిటీ తోసిపుచ్చి ఐఐసీటీ హైదరాబాద్‌తో మళ్లీ అధ్యయనం జరిపించింది. ఐఐసీటీ నివేదికను కమిటీకి సమర్పించలేదు. నివేదికను కమిటీ పరిశీలిస్తేనే తదుపరిగా అధ్యయనాలు అవసరమా? అన్న అంశంపై నిర్ణయం తీసుకోవచ్చు. ►యాదాద్రి కేంద్రం కోసం 2,090 ఎకరాల అటవీ భూమిని కేటాయించారు. ఇకపై థర్మల్ విద్యుత్ కేంద్రాల వంటి కాలుష్య కారక (రెడ్ కేటగిరీ) పరిశ్రమల కోసం అటవీ భూములను కేటాయించవద్దు. -
తెలంగాణ ప్రభుత్వానికి రూ.3,825 కోట్ల జరిమానా
సాక్షి, న్యూఢిల్లీ: ఘన, ద్రవ వ్యర్థాలు శుద్ధిచేయడంలో విఫలమైందంటూ తెలంగాణ ప్రభుత్వానికి జాతీయ హరిత ట్రిబ్యునల్ ప్రధాన ధర్మాసనం రూ.3,825 కోట్ల జరిమానా విధించింది. ఆ మొత్తాన్ని ప్రత్యేక ఖాతాలో డిపాజిట్ చేయాలని ఆదేశించింది. వ్యర్థాల నిర్వహణలో గతంలో జారీ చేసిన మార్గదర్శకాలు అమలు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. 1996లో దేశంలోని పలు మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్య వ్యర్థాల నిర్వహణ సరిగాలేదంటూ పర్యావరణ సురక్షా స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌ను ఎన్జీటీకి బదిలీ చేసింది. 351 నదీ పరీవాహక ప్రాంతాలు, 124 నగరాలు, 100 కాలుష్య కారక పారిశ్రామిక ప్రాంతాల్లో కాలుష్య కారకాలు, ఇసుక అక్రమ మైనింగ్‌లపై చర్యలు తీసుకోవాలని సంస్థ కోరింది. జస్టిస్ ఆదర్శ కుమార్ గోయల్ నేతృత్వంలోని ఎన్జీటీ ప్రధాన ధర్మాసనం ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణపై విచారణ చేపట్టింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అన్ని రాష్ట్రాలకు నోటీసులు జారీ చేయడంతోపాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను వివరణ కోరింది. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వివరణకు సంతృప్తి చెందని ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ‘‘1824 ఎంఎల్డీ లిక్విడ్ వేస్ట్/సీవేజీ నిర్వహణలో అంతరాలకు గానూ రూ.3,648 కోట్లు, సాలిడ్ వేస్ట్ నిర్వహణలో వైఫల్యానికి గానూ రూ.177 కోట్లు కలిపి మొత్తం రూ.3,825 కోట్లు పరిహారంగా చెల్లించాలి. రెండు నెలల్లో ప్రత్యేక ఖాతాలో ఆ మొత్తం డిపాజిట్ చేయాలి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాల ప్రకారం పునరుద్ధరణ చర్యలకు వినియోగించాలి. రాష్ట్ర ప్రభుత్వం భాగస్వాముల నుంచి నిధుల సేకరణ చేసుకోవచ్చు. పునరుద్ధరణ ప్రణాళికలు అన్ని జిల్లాలు/నగరాలు/పట్టణాలు/ గ్రామాల్లో మరింత సమయానుకూలంగా ఒకేసారి అమలు చేయాలి. ఉల్లంఘనలు కొనసాగితే అదనపు పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. దీనికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బాధ్యత వహించాల్సి ఉంటుంది. అమలు పర్యవేక్షణ నిమిత్తం సాంకేతిక నిపుణుల బృందంతో సీనియర్ నోడల్ స్థాయి సెక్రటరీని వెంటనే నియమించాలి. ఆరునెలల తర్వాత పురోగతిని ఎన్జీటీకి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈ–మెయిల్ ద్వారా పంపాలి. సీపీసీబీ ప్రత్యేకంగా నివేదిక ఇవ్వాలి’’ అని ఎన్జీటీ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇదీ చదవండి: జేఈఈ పేపర్ లీక్ కేసు: రష్యన్ వ్యక్తి అరెస్టు -
Andhra Pradesh: ఇళ్ల పథకంలో జోక్యానికి ఎన్జీటీ ‘నో’
సాక్షి, అమరావతి: నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం విషయంలో జోక్యానికి జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) తిరస్కరించింది. ఈ పథకం కింద నంద్యాల జిల్లాలో 5,200 ఇళ్ల పట్టాల మంజూరువల్ల పర్యావరణపరంగా కుందు నది తీవ్రంగా ప్రభావితమవుతుందంటూ దాఖలైన పిటిషన్‌ను హరిత ట్రిబ్యునల్ తోసిపుచ్చింది. కుందు నది పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టిందని ఎన్జీటీ స్పష్టంచేసింది. పేదల ఇళ్ల నిర్మాణాన్ని అడ్డుకునేందుకు టీడీపీ చేసిన కుట్రలు ట్రిబ్యునల్ తీర్పుతో పటాపంచలయ్యాయి. మరోవైపు.. ఇళ్ల స్థలాల మంజూరువల్ల పర్యవరణంగా కుందు నదిపై ప్రతికూల ప్రభావాలు ఉంటాయంటూ పిటిషనర్ చేసిన ఆరోపణలకు ఎలాంటి ఆధారాల్లేవని ఎన్జీటీ తెలిపింది. 5,200 ఇళ్ల స్థలాల మంజూరుకు ఉద్దేశించిన 145.61 ఎకరాల భూమిని పేదలందరికీ ఇళ్ల పథకం కోసం ఉపయోగించవచ్చా? లేదా? అన్న విషయం జోలికి కూడా తాము వెళ్లబోవడంలేదని ఎన్జీటీ తేల్చిచెప్పింది. ఆ భూములను ఇళ్ల స్థలాలకు కేటాయించడంపై హైకోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో, ఆ భూముల విషయంలో తాము ఏ రకంగానూ జోక్యం చేసుకోవడంలేదని వివరించింది. ఇరువైపులా బఫర్‌జోన్ ఏర్పాటుచేసి కుందు నది బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలపట్ల సంతృప్తి వ్యక్తంచేసింది. నది ప్రవాహ ఎగువ, దిగువ ప్రాంతాల్లో శాస్త్రీయ ప్రాతిపదికన ప్రభుత్వం ప్రతిపాదించిన చర్యలు వరద విషయంలో పిటిషనర్ వ్యక్తంచేసిన అనుమానాలన్నింటినీ నివృత్తి చేసేలా ఉన్నాయని స్పష్టంచేసింది. అయితే, కుందు నదికి ఇరువైపులా ఏర్పాటుచేసిన బఫర్ జోన్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టడానికి వీల్లేదని తెలిపింది. ఒకవేళ హైకోర్టు ఆ 145 ఎకరాల భూమిని ఇళ్ల స్థలాల కోసం కేటాయించడాన్ని సమర్థించినప్పటికీ, పేదలందరికీ ఇళ్ల పథకం ప్రాజెక్టు అమలు విషయంలో పర్యావరణ చట్టాలను తూచా తప్పకుండా అమలుచేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే, వ్యర్థాల నిర్వహణ నిబంధనలను పాటించాలని, కుందు నదిలో గానీ, బఫర్ జోన్ ప్రాంతంలోగానీ వదలడానికి, వీల్లేదని ఆదేశించింది. ఈ మేరకు ఎన్జీటీ జ్యుడీషియల్ మెంబర్ జస్టిస్ కె. రామకృష్ణన్, ఎక్స్పర్ట్ మెంబర్ కొర్లపాటి సత్యగోపాల్ ధర్మాసనం శుక్రవారం తీర్పు వెలువరించింది. ఇళ్ల స్థలాల కేటాయింపు వల్ల ఇబ్బంది లేదు కుందు నది విస్తరణ నిమిత్తం నంద్యాల మండలం, మూలసాగరం పరిధిలో ప్రభుత్వం 2013లో 209.5 ఎకరాల భూమిని సేకరించింది. ఇందులో కొంతభాగాన్ని బఫర్ జోన్‌కు కేటాయించింది. మిగిలిన 145 ఎకరాల భూమిలో పేదలకు 5,200 ఇళ్ల పట్టాలు మంజూరుచేయాలని నిర్ణయించింది. దీన్ని సవాల్ చేస్తూ నంద్యాల సంజీవ్‌నగర్‌కు చెందిన షేక్ నూమాన్ బాషా పేరుతో ఎన్జీటీలో ఫిర్యాదు నమోదైంది. ఆ 145 ఎకరాల భూమిని ఇళ్ల స్థలాల కోసం కేటాయిస్తే వర్షాకాలంలో నంద్యాల ప్రజలు వరదను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై ఎన్జీటీ ప్రభుత్వ వివరణ కోరింది. అలాగే, క్షేత్రస్థాయిలో వాస్తవాలను పరిశీలించేందుకు ఓ కమిటీని కూడా ఏర్పాటుచేసింది. ఇళ్ల స్థలాల కేటాయింపువల్ల ఎలాంటి ప్రతికూల ప్రభావం పడదంటూ కమిటీ నివేదిక ఇచ్చింది. సర్కారు అన్ని జాగ్రత్తలూ తీసుకుంది ఇక ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. కుందు నది పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుందన్నారు. నదికి ఇరువైపులా బలోపేతం చేసేందుకు నిర్మాణ పనులను సైతం ప్రారంభించిందన్నారు. తగినంత భూమిని బఫర్ జోన్ కింద విడిచిపెట్టి మిగిలిన భూమినే ఇళ్ల స్థలాల మంజూరు కోసం వినియోగిస్తున్నామన్నారు. అదనపు ఏజీ వాదనలతో ఏకీభవించిన ఎన్జీటీ ధర్మాసనం ఇళ్ల స్థలాల కేటాయింపు వల్ల కుందు నదిపై పర్యావరణపరంగా ఎలాంటి ప్రభావం ఉంటుందన్న అంశానికే తాము పరిమితమవుతున్నట్లు తెలిపింది. -
బెంగాల్ ప్రభుత్వానికి ఎన్జీటీ షాక్.. రూ.3,500 కోట్లు జరిమానా
కోల్‌కతా: టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ (ఎన్జీటీ) గట్టి షాకిచ్చింది. రాష్ట్రంలో ఘన, ద్రవరూప చెత్త నిర్వహణలో నిబంధనలు పాటించటం లేదని రూ.3500 కోట్లు జరిమానా విధించింది. 2022-2023 రాష్ట్ర బడ్జెట్ ప్రకారం పట్టణాభివృద్ధి, మున్సిపల్ వ్యవహారాలకు సంబంధించి 12,819కోట్లు రూపాయలు ఖర్చు చేసేందుకు ప్రభుత్వానికి వెసులుబాటు ఉంది. అయితే.. పారిశుద్ధ్య నిర్వహణ కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు మమతా బెనర్జీ సర్కారు ప్రాధాన్యమివ్వలేదని ఎన్జీటీ అసహనం వ్యక్తం చేసింది. ‘ప్రజలకు కాలుష్య రహిత పర్యావరణాన్ని అందించడం స్థానిక సంస్థలు, రాష్ట్రాల బాధ్యత. నిధుల కొరత ఉందని ప్రజలకు జీవించే హక్కును తిరస్కరించకూడదు. కేంద్ర ప్రభుత్వ నిధుల విడుదల కోసం వేచి చూస్తూ రాష్ట్రాలు తమ బాధ్యతలు నిర్వర్తించటంలో ఆలస్యం చేయకూడదు. పర్యావరణానికి జరిగిన నష్టాన్ని పరిగణనలోకి తీసుకున్నాం. నిబంధనలు ఉల్లంఘించినందుకు గానూ రాష్ట్ర ప్రభుత్వం పరిహారం చెల్లించాల్సిందే. రెండు నెలల్లోపు రూ.3500కోట్లను బెంగాల్ ప్రభుత్వం జమ చేయాలి‘ అని ఎన్జీటీ ఛైర్పర్సన్ జస్టిస్ ఏకే గోయెల్ నేతృత్వంలోని ధర్మాసనం ప్రభుత్వాన్ని ఆదేశించింది. చెత్త నిర్వహణపై ఇకనైనా బెంగాల్ ప్రభుత్వం సత్వర చర్యలు చేపట్టాలని, ఉల్లంఘనలు ఇలాగే కొనసాగితే అదనపు పరిహారం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించింది. రాష్ట్రంలో రోజుకు 2,758 మిలియన్ల లీటర్ల మురుగు నీరు పోగవుతోందని, అయితే.. 44 ఎస్టీపీల ఏర్పాటుతో కేవలం 1,268 ఎంఎల్డీలు మాత్రమే శుభ్రం చేస్తున్నారని పేర్కొంది. రెండింటి మధ్య అంతరం భారీగా ఉందని అసహనం వ్యక్తం చేసింది. ఇదీ చదవండి: ‘ప్రపంచం నుంచే కమ్యూనిస్టులు కనుమరుగు.. భవిష్యత్తు బీజేపీదే’.. అమిత్ షా ఆరోపణలు -
‘రుషికొండ’పై ఎన్జీటీ విచారణ నిలిపివేత
జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ), హైకోర్టు పరస్పర విరుద్ధమైన ఆదేశాలతో అసాధారణ పరిస్థితికి దారి తీస్తుంది. అధికారులకు ఏ ఉత్తర్వును అనుసరించాలో అర్థం కాదు. అలాంటి సందర్భంలో ట్రిబ్యునల్ ఆదేశాలపై రాజ్యాంగ న్యాయస్థానమైన హైకోర్టు ఆదేశాలు ప్రబలం. – సుప్రీం కోర్టు సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అడ్డుకోవడానికి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు చేస్తున్న ప్రయత్నాలకు మరోసారి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఎంపీ రఘురామకృష్ణరాజు భుజంపై తుపాకి పెట్టి న్యాయస్థానాల ద్వారా అభివృద్ధి పనులను అడ్డుకొనే ప్రయత్నాలకు సుప్రీంకోర్టు అడ్డుకట్ట వేసింది. రాష్ట్రంలోని అతి పెద్ద నగరం విశాఖలో రుషికొండపై చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకోవాలని చూసిన చంద్రబాబు, రఘురామ ద్వయానికి గట్టి చెంపదెబ్బలా సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు రాసిన లేఖపై జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) చేపట్టిన విచారణను నిలిపివేస్తూ ఆదేశాలు ఇచ్చింది. రుషికొండపై ఏపీ ప్రభుత్వం చేపట్టిన నిర్మాణాలు కొనసాగించడానికి అనుమతించింది. ఈ నిర్మాణాలపై ఎన్జీటీ ఉత్తర్వులకు హైకోర్టు ఆదేశాలు విరుద్ధంగా ఉన్న పక్షంలో హైకోర్టు ఉత్తర్వులే వర్తిస్తాయని స్పష్టం చేసింది. రుషికొండపై నిర్మాణాలు నిలిపివేస్తూ ఎన్జీటీ ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ హిమా కోహ్లిలతో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ కొనసాగించింది. ఈ అంశాన్ని హైకోర్టు సీజ్ చేసి ఉత్తర్వులు జారీ చేసినందున ఎన్జీటీ ముందు విచారణ కొనసాగించడం సరికాదని స్పష్టం చేసింది. ఎన్జీటీ ముందు విచారణ కొనసాగించడం న్యాయానికి ప్రయోజనం కలిగించదని పేర్కొంది. తగిన ఉత్తర్వుల నిమిత్తం తిరిగి హైకోర్టునే ఆశ్రయించాలని పిటిషనర్‌కు సూచించింది. తదుపరి విచారణ హైకోర్టు కొనసాగిస్తుందని తెలిపింది. హైకోర్టులో ఈ కేసులో ఇంప్లీడ్ అవడానికి ప్రతివాదిని అనుమతించింది. రుషికొండలో నిర్మాణాలకు హైకోర్టు అనుమతి ఇచ్చినప్పటికీ ఆరోపణల నేపథ్యంలో తగిన నిర్ణయం తీసుకోవాలని సూచించింది. అవసరమైతే హైకోర్టు నిపుణుల కమిటీని నియమించొచ్చని పేర్కొంది. దేశ ఆర్థికాభివృద్ధికి అభివృద్ధి అవసరమే అయినప్పటికీ కాలుష్య రహిత వాతావరణాన్ని భవిష్యత్తు తరాలకు అందించడానికి పర్యావరణాన్ని కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యమని వ్యాఖ్యానించింది. హైకోర్టు ఈ అంశాన్ని విచారించే లోపు చదును చేసిన ప్రాంతాల్లో నిర్మాణాలు జరపవచ్చని, కొండ ప్రాంతంలో పనులు చేపట్టవద్దని తెలిపింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం తరఫు సీనియర్ న్యాయవాదులు అభిషేక్ మను సింఘ్వి, నిరంజన్లు రెడ్డిలు స్పందిస్తూ.. ఆ ప్రాంతమంతా రుషికొండగానే పరిగణిస్తారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. గతంలో రిసార్టు ఉన్న ప్రాంతంలో కట్టడాలకు సంబంధించి పనులు చేసుకోవచ్చని ధర్మాసనం పేర్కొంది. కేసు మెరిట్స్‌లోకి వెళ్లడంలేదన్న ధర్మాసనం పిటిషన్‌పై విచారణ ముగిస్తున్నట్లు తెలిపింది. వీలైనంత త్వరగా విచారణ చేపట్టాలని హైకోర్టుకు సూచించింది. -
ఎంపీ రఘురామకృష్ణరాజుకు ఎదురుదెబ్బ.. రిషికొండలో నిర్మాణాలకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్
-
ఎంపీ రఘురామ కృష్ణరాజుకు ఎదురు దెబ్బ
సాక్షి, ఢిల్లీ: ఎంపీ రఘురామ కృష్ణరాజుకు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. రుషి కొండలో నిర్మాణాలకు ఏపీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఒకే అంశంపై రెండు చోట్ల పిటిషన్లపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. బుధవారం అనుమతులు మంజూరు చేసింది. రుషి కొండపై టూరిజం భవనాల నిర్మాణాలు చేపట్టకుండా ఎన్జీటి స్టే విధించగా.. దానిని సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో బుధవారం విచారణ జరిగింది. మంగళవారం వాదనల సందర్భంగా.. ఎన్జీటీ తీరును తప్పుబట్టిన అత్యున్నత న్యాయస్థానం, ఇవాళ(బుధవారం) రుషి కొండలో నిర్మాణాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేవలం రఘురామ లేఖ ఆధారంగానే ప్రాజెక్టుపై స్టే ఇవ్వడం సరికాదన్న సుప్రీం కోర్టు.. కోర్టులను చేరుకోలేని వారు రాసే లేఖలను మాత్రమే పిటిషన్లుగా పరిగణించాలంటూ స్పష్టం చేసింది. ఇక ఇవాళ ఆదేశాల సందర్భంగా.. ముందుగా చదును చేసిన ప్రాంతంలో నిర్మాణాలు చేసుకునేందుకు ఏపీ సర్కార్‌కు అనుమతిచ్చిన సుప్రీంకోర్టు..ఇప్పటికే నిర్మాణాలున్న ప్రాంతంలో యథావిధిగా నిర్మాణాలు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. అలాగే తవ్వకాలు చేసిన ప్రదేశంలో నిర్మాణాలు చేయవద్దన్న సుప్రీం.. కేసులోని మెరిట్స్‌పై తామెలాంటి వ్యాఖ్యలు చేయదలచుకోలేదని స్పష్టం చేసింది. అంతేకాదు రుషికొండ ప్రాజెక్టు కేసు విచారణ హైకోర్టుకు బదిలీ చేసింది. ట్రిబ్యునల్ పరిధి కంటే హైకోర్టు పరిధి ఎక్కువని తేల్చిన సుప్రీంకోర్టు.. హైకోర్టు ఆదేశించినప్పటికీ ఎన్జీటీ బేఖాతరు చేయడం తగదని హితవు పలికింది. హైకోర్టు, ఎన్జీటీ పరస్పర విరుద్ధ ఆదేశాలతో యంత్రాంగంలో గందరగోళం నెలకొందని, రాజ్యాంగబద్ధ సంస్థ కాబట్టి హైకోర్టు ఉత్తర్వులే అమలు చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. అంతవరకు ఎన్జీటీలో విచారణ జరపరాదని ఆదేశించింది. ఎన్జీటీలో జరిగే విచారణను కొట్టివేస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇస్తూ.. పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఉంది కాబట్టి తదుపరి విచారణ హైకోర్టులో జరుగుతుందని, పిటిషనర్ల అభ్యంతరాలు అక్కడ చెప్పుకోవాలని సూచించింది. గతంలో రిసార్టు ఉన్న ప్రాంతంలో పాత భవనాలు తొలగించిన చోట మాత్రం నిర్మాణాలు జరపడానికి వెసులుబాటు ఇస్తున్నట్లు తెలిపింది. -
రుషికొండ టూరిజం ప్రాజెక్టు వ్యవహారంలో ఎన్టీజీ తీరును తప్పుబట్టిన సుప్రీం
-
రుషికొండ టూరిజం ప్రాజెక్టు.. ఎన్జీటీ తీరు సరికాదు: సుప్రీం
సాక్షి, ఢిల్లీ: రుషికొండ టూరిజం ప్రాజెక్టు వ్యవహారంలో ఎన్జీటీ తీరును తప్పుబట్టింది సుప్రీంకోర్టు. ఈ మేరకు దాఖలైన ఓ పిటిష్‌పై మంగళవారం వాదనల సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ఎంపీ రఘురామకృష్ణ లేఖ ఆధారంగా ప్రాజెక్టుపై స్టే ఉత్తర్వులిచ్చింది ఎన్జీటీ. అయితే ఏకపక్షంగా ఇచ్చిన ఈ స్టే ఉత్తర్వులను సుప్రీంకోర్టులో సవాల్ చేసింది ఏపీ ప్రభుత్వం. ఈ క్రమంలో.. కోర్టులను చేరుకోలేని వారు రాసే లేఖలను మాత్రమే పిటిషన్లుగా పరిగణించాలంటూ హితవు పలికింది సుప్రీం కోర్టు. ఇక ఏపీ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించారు సీనియర్ అడ్వొకేట్ సింఘ్వి. ఈ ప్రాజెక్టుతో 300 మందికి ఉపాధి దొరుకుతోందని, రూ. 180 కోట్లు పెట్టబడులు ఏపీ ప్రభుత్వం పెట్టిందని కోర్టుకు తెలిపారాయన. ఓ ఎంపీ లేఖపై ఎన్జీటీ స్టే ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. దీంతో ఎన్జీటీ తీరును తప్పుబట్టిన సుప్రీం.. విచారణ రేపటికి(బుధవారం) వాయిదా వేసింది. -
జవహర్‌నగర్ డంపింగ్‌యార్డు.. త్వరలో క్యాపింగ్ తవ్వకాలు
సాక్షి, హైదరాబాద్: జవహర్‌నగర్‌లో క్యాపింగ్ చేసిన చెత్తగుట్టకు బయో మైనింగ్ అండ్ బయో రెమిడియేషన్ చేయాలంటూ ఎన్జీటీ ఆదేశించిన నేపథ్యంలో జీహెచ్ఎంసీ అందుకు ఆర్ఎఫ్పీ టెండర్లు పిలిచింది. జవహర్‌నగర్ డంపింగ్‌యార్డు వల్ల తలెత్తుతున్న సమస్యలపై స్థానికులు ఎన్జీటీని ఆశ్రయించడం.. ఇతరత్రా అంశాల నేపథ్యంలో డంపింగ్ యార్డుకు చేసిన క్యాపింగ్‌ను తొలగించి బయోమైనింగ్ చేయాలని ఎన్జీటీ ఆదేశించిన నేపథ్యంలో జీహెచ్ఎంసీ ఈ టెండరు పిలిచింది. తాము శాస్త్రీయంగా చేసిన క్యాపింగ్‌ను వివరిస్తూ జీహెచ్ఎంసీ రివ్యూ పిటిషన్ వేసినా ఎన్టీటీ జీహెచ్ఎంసీ విజ్ఞప్తిని తిరస్కరించింది. సుప్రీంకోర్టుకు వెళ్లగా ఈ అంశంలో జోక్యం చేసుకోలేమని పేర్కొంది. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ ఈ టెండరు ఆహ్వానించింది. ► ఒకసారి క్యాపింగ్ చేసిన చెత్తగుట్ట బయో మైనింగ్ అండ్ బయో రెమిడియేషన్‌కు సంబంధించి కేంద్ర కాలుష్యనివారణ మండలి నుంచి జీహెచ్ఎంసీకి మార్గదర్శకాలు సైతం అందలేదని తెలిసింది. ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఈ ప్రక్రియను అమలు చేస్తున్న విధానాలు తెలిసిన లేదా కేంద్ర/రాష్ట్ర కాలుష్య నివారణ మండలి మార్గదర్శకాల కనుగుణంగా, శాస్త్రీయంగా క్యాపింగ్ చేసిన చెత్తగుట్టను బయోమైనింగ్ చేయగల నైపుణ్యం ఉన్న సంస్థల్ని టెండర్లకు అర్హులుగా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో క్యాపింగ్ చేసిన చెత్తగుట్టను తవ్వడం వల్ల ఎలాంటి కొత్త సమస్యలు ఉత్పన్నం కానున్నాయో అంతుచిక్కడం లేదు. టెండర్ మేరకు ఈ పనులు దక్కించుకునే సంస్థ మూడు సంవత్సరాల్లో పని పూర్తి చేయాల్సి ఉంది. బయోమైనింగ్‌తో వెలువడే వ్యర్థాలను నిల్వ ఉంచే స్థలం కలిగి ఉండాలి. వ్యర్థాలనుంచి వెలువడే కలుషిత ద్రవాలు(లీచెట్)ట్రీట్మెంట్కు ప్లాంట్‌ను ఏర్పాటు చేసుకోవాలి. చెత్తనుంచి గ్యాస్ ఉత్పత్తికోసం ఏర్పాటు చేసిన గ్యాస్ వెంట్స్ నుంచి సమస్యలు తలెత్తకుండా గ్యాస్ మేనేజ్మెంట్ ఇతరత్రా పనులు సైతం కాంట్రాక్టు సంస్థే చేయాల్సి ఉంటుంది. ► దాదాపు 120 లక్షల మెట్రిక్ టన్నులమేర క్యాపింగ్ చేసిన చెత్తగుట్టను తిరిగి తవ్వి పనులు చేయాల్సి ఉంటుంది. మునిసిపల్ ఘనవ్యర్థాల నిబంధనల మేరకు పనిచేయాల్సి ఉంది. ► చెత్తగుట్ట క్యాపింగ్ పనులకు రూ. 140 కోట్లు వెచ్చించారు. ఇందులో 35 శాతం స్వచ్ఛభారత్ మెషిన్ ద్వారా కేంద్రప్రభుత్వం అందజేయగా, మిగతా వ్యయాన్ని జీహెచ్ఎంసీ, డంపింగ్‌యార్డు ట్రీట్మెంట్ కాంట్రాక్టు పొందిన రాంకీ సంస్థలు భరించాయి. క్యాపింగ్‌కు సంబంధించిన పనులు పూర్తయ్యాక, తిరిగి ఇప్పుడు దాన్ని తవ్వి బయోరెమిడియేషన్ చేయడం ఎప్పటికి సాధ్యం కానుందో అంతుపట్టడం లేదు. ఈ లోగా కొత్త సమస్యలకు అవకాశముందని ఈ అంశంలో అవగాహన ఉన్నవారు చెబుతున్నారు. అంతేకాదు.. ఇప్పటికే ఖర్చు చేసిన రూ.140 కోట్లు బూడిదలో పోసిన పన్నీరు చందం కానున్నాయి. బయోమైనింగ్ అంటే క్యాపింగ్ చేసిన చెత్తగుట్టను తవ్వడం. బయో రెమిడియేషన్ అంటే వెలువడే చెత్తను మట్టి, కంపోస్టు, ఇతరత్రా సామాగ్రిగా వేరు చేయడం. వీటిల్లో ప్లాస్టిక్, ఇనుము, గాజు, రాళ్లు, కంకర వంటివి ఉంటాయని చెబుతున్నప్పటికీ మట్టి, ఇతరత్రావన్నీ కలిసి రెండు భాగాలుగా మాత్రమే వెలువడనున్నట్లు సమాచారం. ఈ పనులు చేసేందుకు ఎన్జీటీ నిబంధనల మేరకు దాదాపు రూ. 660 కోట్లు ఖర్చు కానున్నట్లు విశ్వసనీయ సమాచారం. (క్లిక్: మది దోచే మల్కంచెరువు.. మన హైదరాబాద్‌లో..) -
ఆ రాష్ట్రంలో 2022 జనవరి 1 నుంచి డీజిల్ వాహనాలు బ్యాన్..!
న్యూఢిల్లీ: 2022, జనవరి 1 నాటికి పదేళ్లు పైబడిన డీజిల్ వాహనాల విషయంలో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పదేళ్లు పైబడిన అన్ని డీజిల్ వాహనాలను డీరిజిస్టర్ చేస్తామని ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటి) ఆదేశాలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ డీరిజిస్టర్డ్ డీజిల్ వాహనాలకు ఎలాంటి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్(ఎన్ఓసీ) కూడా జారీ చేయము అని పేర్కొంది. పదేళ్లు పైబడిన డీజిల్ వాహనాలు దిల్లీ రోడ్లపై తిరిగేందుకు అనుమతించొద్దని ఏప్రిల్ 7, 2015న ఎన్టీటీ సంబంధిత శాఖను ఆదేశించింది. అనంతరం దశలవారీగా ఇలాంటి వాహనాలను డీరిజిస్టర్ చేయాలంటూ 2016, జులై 18న ఆదేశాలు జారీ చేసింది. 15 ఏళ్లు పైబడిన వాహనాలకు తొలుత రిజేస్ట్రేషన్ రద్దు చేయాలని స్పష్టం చేసింది. అలాగే దిల్లీ వెలుపల వీటిని నడిపేందుకు నిరభ్యంతర పత్రం కూడా ఇవ్వొద్దని తేల్చి చెప్పింది. ఎన్జీటి ఆదేశాలకు అనుగుణంగా వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ఢిల్లీలో 10 ఏళ్లు దాటిన డీజిల్ వాహనాలను మొదట డీరిజిస్టర్ చేస్తుందని రవాణా శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. పదేళ్లు పైబడిన డీజిల్ వాహనాలకు, 15 ఏళ్లు పైబడిన పెట్రోల్ వాహనాలను దేశంలో ఎక్కడ నడవకుండా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్(ఎన్ఓసీ) కూడా జారీ చేయము అని పేర్కొంది. 10 ఏళ్లు పైబడిన డీజిల్ వాహనాలను, 15 ఏళ్లు పైబడిన పెట్రోల్ వాహనాలను వినియోగించుకోవాలంటే ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చే అవకాశం ఉంటుందని ఢిల్లీ రవాణా శాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. కొన్ని వారాల క్రితం, ఢిల్లీ ప్రభుత్వం ఈవి కిట్ తో పాత డీజిల్ & పెట్రోల్ వాహనాలను రెట్రోఫిట్ చేయడానికి అనుమతిస్తున్నట్లు ప్రకటించింది. ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చుకోకపోతే పాత వాహనాలను స్క్రాప్ చేయాల్సి ఉంటుంది అని తెలిపింది. ఢిల్లీ రవాణా శాఖ, ఢిల్లీ ట్రాఫిక్ పోలీసు బృందాలు ఇప్పటికే అటువంటి పాత వాహనాలను గుర్తించి అధీకృత విక్రేతల ద్వారా స్క్రాపింగ్ కోసం పంపుతున్నాయి. (చదవండి: ఎంజీ మోటార్స్ అరుదైన ఘనత..! భారత్‌లో తొలి కంపెనీగా..!) -
సచివాలయం కూల్చివేతపై కౌంటర్ ఇంకెప్పుడు వేస్తారు?: ఎన్జీటీ
సాక్షి, హైదరాబాద్: సరైన అనుమతుల్లేకుండా సచివాలయాన్ని కూల్చేయడాన్ని సవాల్ చేస్తూ ఎంపీ రేవంత్‌రెడ్డి పిటిషన్‌పై కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ (ఎంవోఈఎఫ్) కౌంటర్ వేయకపోవడంతో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘దాదాపు 50 శాతానికిపైగా కొత్త భవనాల నిర్మాణం పూర్తయినా ఇంకా కౌంటర్ దాఖలు చేయరా?’అని నిలదీసింది. డిసెంబర్ 17లోగా కౌంటర్ వేయాలని ఆదేశించింది. నిబంధనల మేరకు అనుమతులు తీసుకోకుండానే పాత సచివాలయాన్ని కూల్చేశారని, కొత్త నిర్మాణాలకు సరైన అనుమతులు లేవని రేవంత్ వేసిన పిటిషన్‌ను ఎన్జీటీ ధర్మాసనం గురువారం మరోసారి విచారించింది. కొత్త సచివాలయం నిర్మాణం కోసమే పాత సచివాలయాన్ని అనుమతుల్లేకుండా కూల్చివేశారని పిటిషనర్ తరఫున న్యాయవాది శ్రవణ్‌కుమార్ నివేదించారు. (చదవండి: కొత్త పంట గెర్కిన్.. లక్షల్లో ఆదాయం) -
సమయం మించిపోలేదు
సాక్షి, న్యూఢిల్లీ: పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నిలిపివేయాలని కోరుతూ సమయం మించిపోయిన తర్వాత పిటిషన్ దాఖలు చేయలేదని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. పాలమూరు రంగా రెడ్డి ఎత్తిపోతల పథకం నిలిపివేయాలంటూ ఏపీకి చెందిన డి.చంద్రమౌళీశ్వరరెడ్డి తదితరులు ఎన్జీటీలో దాఖలు చే సిన పిటిషన్‌ను జస్టిస్ రామకృష్ణన్, విషయనిపుణుడు సత్యగోపాల్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారించింది. ఈ పిటిషన్లో ఇంప్లీడ్ అయిన ఏపీ ప్రభుత్వం తరఫు అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు వినిపించారు. నిరంతరం కొనసాగింపు పనులు చేపడుతున్న ప్రాజెక్టు కావడంతో సమయం మించిన తర్వాత పిటిషన్ దాఖలు చేశారనడం సరికాదని తెలిపారు. ప్రాజెక్టు ప్రారంభ సమయంలో తాగునీటి ప్రాజెక్టుగా పేర్కొని రెండో దశలో తెలంగాణ ప్రభుత్వం బహిరంగ విచారణకు నోటిఫికేషన్ ఇచ్చిందన్నారు. కృష్ణాబోర్డు నివేదికలో సాగునీటి ప్రాజెక్టు అని పేర్కొందన్నారు. కృష్ణాబోర్డు నివేదికలో ఏపీ అభ్యంతరాలు ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. బుధవారం కూడా వాదనలు కొనసాగనున్నాయి. -
డిండి ఎత్తిపోతలపై ఎన్జీటీకి
సాక్షి, అమరావతి: పర్యావరణ చట్టాలను ఉల్లంఘించి, తెలంగాణ సర్కార్ అక్రమంగా చేపట్టిన డిండి ఎత్తిపోతల పథకం పనులను నిలుపుదల చేయాలని కోరుతూ జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) చెన్నై బెంచ్‌లో రాష్ట్ర ప్రభుత్వం రిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ ప్రాజెక్టువల్ల పర్యావరణానికి విఘాతం కలుగుతుందని.. దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు, కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని ప్రజల జీవనోపాధి దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తంచేసింది. పర్యావరణ అనుమతిలేకుండా చేపట్టిన ఈ ఎత్తిపోతల పనులపై కేంద్ర అటవీ, పర్యావరణ శాఖకు, నేషనల్ బోర్డు ఫర్ వైల్డ్‌లైఫ్ చైర్మన్ దృష్టికి తీసుకెళ్లినా ఫలితం కన్పించలేదని పేర్కొంది. విభజన చట్టాన్ని ఉల్లంఘించి.. కృష్ణాబోర్డు, కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ), అపెక్స్ కౌన్సిల్ ఆమోదంలేకుండా చేపట్టిన ఈ పథకాన్ని నిలుపుదల చేయాలని కేంద్ర జల్‌శక్తి శాఖ, కృష్ణా బోర్డులను కోరినా ఫలితం లేకపోయిందని ఎన్జీటీకి వివరించింది. ఈ రిట్ పిటిషన్లో కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి, కేంద్ర అటవీ పర్యావరణ శాఖ కార్యదర్శి, నేషనల్ బోర్డు ఫర్ వైల్డ్‌లైఫ్ చైర్మన్, కృష్ణా బోర్డు ఛైర్మన్, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిలను ప్రతివాదులుగా చేర్చింది. తక్షణమే ఈ పనులను నిలుపుదల చేయించి.. ఏపీ హక్కులను పరిరక్షించడంతోపాటు ప్రజల జీవనోపాధికి విఘాతం కలగకుండా చూడాలని విజ్ఞప్తి చేసింది. ఈ రిట్ పిటిషన్‌పై సోమవారం ఎన్జీటీ విచారించనుంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎన్జీటీలో దాఖలు చేసిన రిట్ పిటిషన్లో జలవనరుల శాఖ కార్యదర్శి జె. శ్యామలరావు పేర్కొన్న ప్రధానాంశాలు ఇవీ.. ► ఈఐఏ (పర్యావరణ ప్రభావ అంచనా)–2006 నోటిఫికేషన్ ప్రకారం పది వేల ఎకరాల కంటే ఎక్కువగా కొత్త ఆయకట్టుకు నీళ్లందించే ప్రాజెక్టులకు ముందస్తుగా పర్యావరణ అనుమతి తీసుకుని పనులు చేపట్టాలి. ► ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం–2014 ప్రకారం.. కృష్ణా నదిపై కొత్తగా ఏ ప్రాజెక్టును చేపట్టాలన్నా.. కృష్ణా బోర్డు, సీడబ్ల్యూసీ, అపెక్స్ కౌన్సిల్ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. ► కానీ.. తెలంగాణ సర్కార్ అవేమీ లేకుండానే శ్రీశైలం జలాశయం నుంచి రోజుకు 0.5 టీఎంసీల చొప్పున 30 టీఎంసీలు తరలించి.. 3,60,680 ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించేలా డిండి పనులను 2015, జూన్ 11న చేపట్టింది. ► దీనిపై పలుమార్లు కేంద్ర అటవీ, పర్యావరణ శాఖకు ఫిర్యాదు చేశాం. ఈ పనులవల్ల పర్యావరణానికి విఘాతం కలుగుతుందని చెప్పాం. డిండి ఎత్తిపోతల పనులు చేసే ప్రదేశం పులుల అభయారణ్యంలో ఉండటంవల్ల.. వాటి ఉనికికి ప్రమాదం వాటిల్లుతుందని నేషనల్ బోర్డు ఫర్ వైల్డ్‌లైఫ్ చైర్మన్‌కు ఫిర్యాదు చేశాం. కానీ, ఎలాంటి స్పందన కన్పించలేదు. ► ఈ ఎత్తిపోతలవల్ల ఎస్సార్బీసీ, కేసీ కెనాల్, తెలుగుగంగ, గాలేరు–నగరి, హంద్రీ–నీవా, వెలిగొండ, నాగార్జునసాగర్, కృష్ణా డెల్టా ఆయకట్టుపై తీవ్ర ప్రభావం చూపుతుందని కృష్ణా బోర్డు, కేంద్ర జల్‌శక్తి శాఖకు అనేకసార్లు ఫిర్యాదు చేశాం. వాటిపైనా ఎలాంటి స్పందనలేదు. ► ఈ పథకం పూర్తయితే రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. భూగర్భ జలాలు అడుగంటిపోతాయి. తాగు, సాగునీటి కొరతకు.. వాతావరణ అసమతుల్యతకు దారితీస్తుంది. ప్రజలు జీవించే హక్కును దెబ్బతీస్తుంది. -
హుస్సేన్‌సాగర్‌ని డంపింగ్ సాగర్‌గా మార్చారు..
సాక్షి, హైదరాబాద్: నగరం నడిబొడ్డున ఉన్న చారిత్రక హుస్సేన్‌సాగర్‌ను స్వచ్ఛమైన జలాలతో నింపాలన్న సర్కారు సంకల్పం కాగితాలకే పరిమితమవుతోంది. తాజాగా బహుళ అంతస్తుల సెక్రటేరియేట్ భవనాల కూల్చివేత ద్వారా వచ్చిన సుమారు రెండు లక్షల టన్నుల నిర్మాణ వ్యర్థాలను సాగర్‌లో డంపింగ్ చేశారంటూ పలువురు పర్యావరణ వేత్తలు జాతీయ హరిత ట్రిబ్యునల్‌ను ఆశ్రయించడంతో సాగరమథనంపై అందరి దృష్టి మళ్లింది. కాగా స్వచ్ఛ సాగర్‌గా మార్చేందుకు గత దశాబ్దకాలంగా చేసిన వరుస ప్రయోగాలు ఆశించిన మేర సత్ఫలితాలివ్వకపోవడంతో మిషన్ గాడి తప్పిందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. దశాబ్దకాలంగా సాగర ప్రక్షాళనకు సుమారు రూ.326 కోట్లు ఖర్చుచేసినా ఫలితం శూన్యమని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తుండడం గమనార్హం. వ్యర్థాల డంపింగ్‌పై ఎన్జీటీలో పిటీషన్.. పాత సచివాలయం భవనాల కూల్చివేత ద్వారా వచ్చిన రెండు లక్షల టన్నుల ఘన వ్యర్థాలను అధికారులు వేరొక చోటుకు తరలించినట్లు చెబుతున్నా..అవన్నీ హుస్సేన్‌సాగర్‌లో కలిపేశారని, దీంతో సాగర్ 35 మీటర్ల మేర కుంచించుకుపోయిందని ఆరోపిస్తూ సేవ్ అవర్ అర్బన్ లేక్స్ సంస్థ కన్వీనర్, పర్యావరణ వేత్త లుబ్నాసర్వత్ జాతీయ హరిత ట్రిబ్యునల్‌లో పిటీషన్ దాఖలు చేశారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను న్యాయస్థానానికి సమర్పించారు. దీనిపై సెప్టెంబరు 7న సమగ్ర విచారణ జరగనున్నట్లు ఆమె తెలిపారు. డంపింగ్‌పై వాస్తవాలు బయటపెట్టాలి: లుబ్నా సర్వత్ సచివాలయ కూల్చివేత వ్యర్థాలను హుస్సేన్ సాగర్‌లో కలిపారు. ఇందుకు సంబంధించిన పూర్తి ఆధారాలను ఎన్జీటీకి సమర్పించాం. ప్రభుత్వం ఈ విషయంలో వాస్తవాలు బయటపెట్టాలి. అందమైన హుస్సేన్ సాగర్‌ను ఇలా డంపింగ్ లేక్‌గా మార్చడం ఏమాత్రం సబబు కాదు. ఆస్ట్రియాలోని డాన్యుబ్ నది తరహాలో ప్రక్షాళన అవసరం సుమారు 900 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో విస్తరించిన హుస్సేన్‌సాగర గర్భంలో దశాబ్దాలుగా సుమారు 40 లక్షల టన్నుల ఘనవ్యర్థాలు పోగుపడినట్లు అంచనా. ప్రభుత్వం గత దశాబ్దకాలంగా సుమారు 5 లక్షల టన్నుల వ్యర్థాలను మాత్రమే తొలగించినట్లు సమాచారం. మిగిలిన 35 లక్షల టన్నుల ఘన వ్యర్థాలు సాగర గర్భంలోనే మిగిలిపోయాయి. ఈ ఘన వ్యర్థాలను కూడా డాన్యుబ్ నది తరహాలో ఆస్ట్రియా సాంకేతిక పరిజ్ఞానంతో తొలగించి మందమైన హెచ్డీపీఈ పైపుల్లో నింపి సాగరం చుట్టూ కట్టలా ఏర్పాటు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆస్ట్రియా నిపుణుల సహకారం, సాంకేతికతతో మాత్రమే ఈ పనులు చేయగలుగుతారని..ప్రస్తుతం మన వద్ద అందుబాటులో ఉన్న విధానాలతో అట్టడుగున ఉన్న ఘన వ్యర్థాలను తొలగించడం సాధ్యపడదని స్పష్టంచేస్తుండడం గమనార్హం. సాగర మథనం సాగుతోందిలా.. ► ప్రక్షాళనకు తీసుకున్న చర్యలు: 2006లో రూ.270 కోట్లతో ఎస్టీపీల నిర్మాణం, ఘన వ్యర్థాల తొలగింపు ► 2014: రూ.56 కోట్లతో కూకట్పల్లి నాలా డైవర్షన్ పనులు ► 2015: జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఎనిమిది కాళ్ల ఎక్స్కావేటర్తో వ్యర్థాలు తొలగింపు. ► 2017: హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో సాగర జలాల్లో ఆక్సిజన్ శాతాన్ని పెంచేందుకు కెనడాకు చెందిన ఎజాక్స్ కంపెనీ శాటిలైట్ ఆధారిత టెక్నాలజీ వినియోగం. (ఈ ప్రయోగాన్ని ఉచితంగానే చేశారు) ► హుస్సేన్‌సాగర్ ప్రక్షాళనకు దశాబ్దకాలంలో చేసిన వ్యయం: సుమారు రూ.326 కోట్లు చదవండి: ఇదేం రూల్ సారూ.. టులెట్ బోర్డుకు రూ.2 వేల జరిమానా! -
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై చెన్నై ఎన్జీటీ ధర్మాసనం విచారణ
సాక్షి, ఢిల్లీ: పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పర్యావరణ ఉల్లంఘనలపై దాఖలైన పిటిషన్లను చెన్నై ఎన్జీటీ ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు పర్యావరణ అనుమతులు లేకుండా చేపడుతున్నారని దాఖలైన పిటిషన్లలో ఏపీ ప్రభుత్వం ఇంప్లీడ్ అయ్యింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు వల్ల తమకు నష్టం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పై తనిఖీ కమిటీ నివేదిక దాఖలు చేయకపోవడం పట్ల ఎన్జీటి అభ్యంతరం వ్యక్తం చేసింది. కమిటీ నోడల్ ఏజెన్సీగా తెలంగాణ మైన్స్ డిపార్ట్మెంట్ను ఎన్జీటీ తొలగించింది. కమిటీ నోడల్ ఏజెన్సీగా కేఆర్ఎంబీని ఎన్జీటీ నియమించింది. త్వరగా పర్యావరణ ఉల్లంఘనలపై నివేదిక ఇవ్వాలని ఎన్జీటీ ఆదేశించింది. తదుపరి విచారణ సెప్టెంబర్ 22కి వాయిదా వేసింది. ఇవీ చదవండి: చంద్రబాబుకు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సవాల్ అంతర్వేది సాగర తీరం.. విభిన్న స్వరూపం! -
తనిఖీ కమిటీలో తెలంగాణ అధికారా?
సాక్షి, న్యూఢిల్లీ: రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను తనిఖీ చేయనున్న బృందంలో తెలంగాణకు చెందిన అధికారిని ఎలా నియమిస్తారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ)లో అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు దాఖలైన అభ్యంతరాలపై జస్టిస్ రామకృష్ణన్, నిపుణుడు సత్యగోపాల్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం విచారించింది. తనిఖీ బృందంలో కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) నుంచి నియమితులైన వ్యక్తి తెలంగాణకు చెందిన వారు కావడంతో ఏపీ అభ్యంతరం చెబుతోందని, స్వయంగా తామే తనిఖీలు చేపడతామని కృష్ణా బోర్డు ధర్మాసనానికి తెలిపింది. ఆయన తెలంగాణకు చెందిన వారైనప్పటికీ యూపీఎస్సీ నుంచి సర్వీసుకు ఎంపికయ్యారని, తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగి కాదని తెలంగాణ అదనపు అడ్వొకేట్ జనరల్ రాంచంద్రరావు, పిటిషనర్ గవినోళ్ల శ్రీనివాస్ తరఫు న్యాయవాది శ్రావణ్‌కుమార్‌లు ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ధర్మాసనంలోని నిపుణుడు సత్యగోపాల్ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యక్తి అని తాము కూడా ఆరోపించగలమని రాంచంద్రరావు పేర్కొన్నారు. రెండు రాష్ట్రాల అంశాలు వచ్చినపుడు.. ఉయ్ ఆర్ లైక్ బ్రదర్స్, న్యాయపరమైన కేసులు విచారించను అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారని జస్టిస్ రామకృష్ణ వ్యాఖ్యానించారు. ఇతర సభ్యులెవరూ లేకుండానే కృష్ణా బోర్డు తనిఖీలు చేస్తానంటోంది కాబట్టి చేయనిద్దాం.. అని సూచించారు. ఉభయ రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు లేకుండా కృష్ణా బోర్డు తనిఖీలు చేస్తానంటే అభ్యంతరం లేదని ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది వెంకటరమణి తెలిపారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం డీపీఆర్ కోసం పనులు చేపడుతున్నారా? పిటిషనర్, తెలంగాణ ప్రభుత్వం ఆరోపిస్తున్నట్లుగా ప్రాజెక్టు నిర్మాణ పనులు చేపడుతున్నారా? అనే అంశాలను తనిఖీ చేసి తెలియచేయాలని కృష్ణా బోర్డును ధర్మాసనం ఆదేశించింది. నివేదిక సమర్పించేందుకు మూడు వారాలు సమయం కావాలని కృష్ణా బోర్డు కోరగా, అంత సమయం ఇవ్వబోమని, ఈ నెల 9లోగా అందించాలంటూ తదుపరి విచారణను అదే రోజుకు వాయిదా వేసింది. -
తెలంగాణకు ఎన్జీటీ చురక..ఉల్లంఘనల కేసులు మీపైనా ఉన్నాయ్
సాక్షి, న్యూఢిల్లీ: నిబంధనలు ఉల్లంఘించి తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రాజెక్టులు చేపడుతోందంటూ పలు పిటిషన్లు ఉన్నాయని జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ) వ్యాఖ్యానించింది. పర్యావరణ అనుమతులు లేకుండా రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు చేపడుతున్నారంటూ గవినోళ్ల శ్రీనివాస్ దాఖలు చేసిన పిటిషన్‌ను శుక్రవారం జస్టిస్ రామకృష్ణన్, విషయ నిపుణుడు సత్యగోపాల్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వం ఉల్లంఘనలు చేస్తోందని తెలంగాణ అదనపు అడ్వొకేట్ జనరల్ రాంచందర్‌రావు చెప్పబోతుండగా... ధర్మాసనం జోక్యం చేసుకుని మీపైనా ఉల్లంఘన కేసులు ఉన్నాయని వ్యాఖ్యానించింది. ప్రాజెక్టు పనులు కొనసాగుతున్నాయా లేదా అనేది స్వయంగా వెళ్లి తనిఖీ చేయాలని కృష్ణా బోర్డును ధర్మాసనం ఆదేశించింది. పర్యావరణ శాఖ కూడా తనిఖీ చేయాలని పిటిషనర్ తరఫు న్యాయవాది శ్రావణ్‌కుమార్ కోరగా, అసలు ఏ పనులు సాగుతున్నాయనేది కృష్ణాబోర్డు తేల్చిన తర్వాత నిర్ణయిస్తామని ధర్మాసనం పేర్కొంటూ తదుపరి విచారణ ఆగస్టు 9కి వాయిదా వేసింది. -
ఎన్జీటీ ఆదేశాలపై స్టే ఇవ్వబోం
సాక్షి, న్యూఢిల్లీ: పోలవరం ముంపునకు సంబంధించి జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇవ్వబోమని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. తమ వాదనలు వినకుండా ఎన్జీటీ ఏకపక్షంగా ఆదేశాలిచ్చిందని, వాటిని సవాల్ చేస్తూ ఒడిశా దాఖలు చేసిన పిటిషన్‌ను గురువారం జస్టిస్ అబ్దుల్ నజీర్, జస్టిస్ కృష్ణమురారిలతో కూడిన ధర్మాసనం విచారించింది. సీనియర్ న్యాయవాది అందుబాటులో లేని కారణంగా విచారణ నాలుగు వారాలు వాయిదా వేయాలని ఒడిశా తరఫు న్యాయవాది పవన్ భూషణ్ ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. తాము నోటీసులు జారీ చేద్దామని భావిస్తున్నట్లు ధర్మాసనం పేర్కొనగా.. ఎన్జీటీ ఆదేశాలపై స్టే కోరుతూ అప్లికేషన్ దాఖలు చేసిన విషయాన్ని భూషణ్ ప్రస్తావించారు. ఎన్జీటీ ఆదేశాలపై స్టే ఇవ్వబోమని ధర్మాసనం స్పష్టంచేసింది. ప్రతివాది పొంగులేటి సుధాకర్‌రెడ్డి తరఫు సీనియర్ న్యాయవాది అనితా షెనాయ్, న్యాయవాది శ్రావణ్‌కుమార్‌లు కూడా స్టే ఇవ్వరాదని ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. అనంతరం ప్రతివాదులైన పి.సుధాకర్‌రెడ్డి, తదితరులకు ధర్మాసనం నోటీసులు జారీచేసింది. ఒడిశా దాఖలు చేసిన ఒరిజనల్ సూట్‌కు ఈ పిటిషన్‌ను జతచేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. -
నాడు ద్రోహం.. నేడు మోసం
సాక్షి, అమరావతి: ఓటుకు కోట్లు కేసు నుంచి తప్పించుకునేందుకు కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను తెలంగాణకు తాకట్టు పెట్టి రైతులకు ద్రోహం చేసిన చంద్రబాబు ఇప్పుడు సాగు, తాగునీళ్లు దక్కకుండా ప్రాజెక్టులపై ఎన్జీటీలో కేసులు దాఖలు చేయించి అఖిలపక్షం డిమాండ్‌తో మరో నాటకానికి సిద్ధమయ్యారు. నాడూ నేడూ రైతులకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు కృష్ణా జలాల వివాదంపై ప్రధాని మోదీ వద్దకు అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలని డిమాండ్ చేయడాన్ని నీటిపారుదలరంగ నిపుణులు తప్పుబడుతున్నారు. ఈ వివాదం ఏర్పడటానికి మూలకారకుడు చంద్రబాబేనని గుర్తు చేస్తున్నారు. ఈ పాపం ఎవరిది బాబూ? విభజన నేపథ్యంలో కృష్ణా జలాల వినియోగంలో రెండు రాష్ట్రాల మధ్య విభేదాలు తలెత్తకుండా కృష్ణా బోర్డును ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వం బోర్డు పరిధి, వర్కింగ్ మ్యాన్యువల్‌ను ఖరారు చేయలేదు. ప్రాజెక్టుల నిర్వహణకు మధ్యంతర ఏర్పాట్లు చేసింది. ఎవరి భూ భాగంలో ఉన్నవాటిని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించుకునేలా ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలాన్ని ఆంధ్రప్రదేశ్, నాగార్జునసాగర్‌ను తెలంగాణ సర్కార్ నిర్వహించేలా 2014లో ఏర్పాటు చేసింది. దీని ప్రకారం నాగార్జునసాగర్ ప్రాజెక్టును తెలంగాణ సర్కార్ పూర్తిగా తన అధీనంలోకి తీసుకుంది. ఏపీ భూభాగంలో ఉన్న సాగర్ కుడి కాలువకు నీటిని సరఫరా చేసే రెగ్యులేటర్‌ను కూడా తెలంగాణ ప్రభుత్వం తన అధీనంలోకి తీసుకుంది. మరోవైపు శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్కేంద్రం తన భూభాగంలో ఉందంటూ దాన్ని కూడా తెలంగాణ సర్కార్ తన నియంత్రణలోకి తీసుకుంది. ఏపీ ప్రభుత్వ అధీనంలో ఉన్న పులిచింతల ప్రాజెక్టులో జలవిద్యుత్కేంద్రం తమ భూభాగంలో ఉందనే సాకుచూపి దాన్ని కూడా తెలంగాణ సర్కార్ స్వాధీనం చేసుకుంది. కొబ్బరి చిప్పల సిద్ధాంతంతో.. తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ ఉనికిని కాపాడుకునేందుకు రెండు కళ్లు, కొబ్బరిచిప్పల సిద్ధాంతంతో ఈ అక్రమంపై నాటి సీఎం చంద్రబాబు నోరుమెదపలేదు. దీంతో అప్పటి నుంచి ఇప్పటిదాకా కృష్ణా బోర్డు ఉత్తర్వులను తెలంగాణ ప్రభుత్వం బేఖాతర్ చేస్తూ యథేచ్ఛగా ఎడమ గట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ శ్రీశైలం దిగువకు నీటిని వదిలేస్తోంది. ఫలితంగా శ్రీశైలంలో నీటి మట్టం అడుగంటి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు సాగు, తాగునీరు అందించలేని దుస్థితి నెలకొంది. బలగాలను వెనక్కి రప్పించిన బాబు.. నాగార్జునసాగర్ కుడి కాలువకు కృష్ణా బోర్డు కేటాయించిన జలాలు పూర్తి స్థాయిలో విడుదల కాకున్నా 2015 ఫిబ్రవరి 12న తెలంగాణ సర్కార్ అర్థాంతరంగా ఆపేసింది. ఈ క్రమంలో ఆంధప్రదేశ్ భూ భాగంలో ఉన్న సాగర్ కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్‌ను స్వాధీనం చేసుకుని రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించేందుకు నాటి జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, అధికారులు పోలీసు బలగాలతో మరుసటి రోజు నాగార్జునసాగర్ వద్దకు చేరుకున్నారు. తెలంగాణ సర్కార్‌ను అస్థిరపరిచేందుకు ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ ఆడియో, వీడియో టేపులతో దొరికిపోయిన నాటి సీఎం చంబ్రాబుపై ఆ రాష్ట్ర ప్రభుత్వం ఓటుకు నోటు కేసు నమోదు చేసింది. ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు సాగర్ కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్‌ను స్వా«ధీనం చేసుకోవడానికి వెళ్లిన రాష్ట్ర అధికారులను చంద్రబాబు వెనక్కి రప్పించారు. దీంతో సాగర్ కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్ తెలంగాణ సర్కార్ అధీనంలోనే ఉండిపోయింది. కృష్ణా బోర్డు నీటిని కేటాయించినా తెలంగాణ సర్కార్ సాగర్ కుడి కాలువకు నీటిని సక్రమంగా విడుదల చేయకపోవడం వల్ల రైతులు అవస్థలు ఎదుర్కొంటున్నారు. అక్రమ ప్రాజెక్టులను అడ్డుకోవడంలో విఫలం.. శ్రీశైలంలో 800 అడుగుల నుంచే రోజుకు 1.5 టీఎంసీల చొప్పున 90, రోజుకు 0.5 టీఎంసీ చొప్పున 30 టీఎంసీలు తరలించేలా డిండి ఎత్తిపోతలను తెలంగాణ సర్కార్ అక్రమంగా చేపట్టింది. వీటితోపాటు కేసీ కెనాల్‌కు నీళ్లందించే సుంకేశుల బ్యారేజీ జలవిస్తరణ ప్రాంతం నుంచి 5.44 టీఎంసీలు తరలించేలా తుమ్మిళ్లను, పాలేరు రిజర్వాయలోకి 5.54 టీఎంసీల ఎత్తిపోతలకు భక్త రామదాస, మిషన్ భగీరథ ప్రాజెక్టులను అక్రమంగా తెలంగాణ చేపట్టింది. నెట్టెంపాడు, ఎస్సెల్బీసీ, కల్వకుర్తి ఎత్తిపోతల సామర్థ్యం పెంచింది. ఈ ఎనిమిది ప్రాజెక్టుల ద్వారా 178.93 టీఎంసీలను అక్రమంగా తరలించేలా 2015లోనే పనులు ప్రారంభించింది. ఈ అక్రమ ప్రాజెక్టులను నిరసిస్తూ 2016లో మే 16 నుంచి 18 వరకూ కర్నూలులో ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి జలదీక్ష చేశారు. నాటి సీఎం చంద్రబాబు దీనిపై స్పందించలేదు. చివరకు తెలంగాణ అక్రమంగా చేపట్టిన పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతలను అడ్డుకోవాలని కృష్ణా డెల్టా రైతులు సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో 2016 సెప్టెంబరు 21న నాటి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి అపెక్స్ కౌన్సిల్ తొలి సమావేశాన్ని నిర్వహించారు. కేటాయింపులకు మించి ఒక్క చుక్క నీటిని కూడా అదనంగా పాలమూరు–రంగారెడ్డి, డిండి ద్వారా వాడుకోబోమని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆ సమావేశంలో చెప్పారు. కానీ తెలంగాణ అప్పటికే కేటాయించిన నీటి కంటే ఎక్కువగా వాడుకుంటోందని, అపెక్స్ కౌన్సిల్ ఆమోదం లేకుండా చేపట్టిన ఆ ప్రాజెక్టులను నిలుపుదల చేయాలని డిమాండ్ చేయడంలో నాటి సీఎం చంద్రబాబు విఫలమయ్యారు. ఓటుకు కోట్లు కేసు నుంచి తప్పించుకోవడానికే అపెక్స్ కౌన్సిల్లో రాష్ట్ర ప్రయోజనాలను తెలంగాణ సర్కార్‌కు చంద్రబాబు తాకట్టు పెట్టారని స్పష్టమవుతోంది. ఫలితంగా పాలమూరు–రంగారెడ్డి, డిండి తదితర అక్రమ ప్రాజెక్టులను తెలంగాణ నిర్విఘ్నంగా కొనసాగిస్తోంది. తుమ్మిళ్ల, భక్తరామదాస, కల్వకుర్తి, నెట్టెంపాడు, మిషన్ భగీరథలను ఇప్పటికే పూర్తి చేసింది. సొంత జిల్లా ప్రజలకు వెన్నుపోటు.. కండలేరు జలాలను తరలించి చిత్తూరు జిల్లా తూర్పు ప్రాంతాన్ని, గాలేరు–నగరి, హంద్రీ–నీవాలను అనుసంధానం చేసి పశ్చిమ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేలా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సాగునీటి ప్రాజెక్టుల పనులను చేపట్టారు. అయితే ఈ ప్రాజెక్టులను నిలుపుదల చేయాలంటూ టీడీపీ నేత, చిత్తూరు జిల్లా పంచాయతీ సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షుడు జి.గుణశేఖర్‌నాయుడుతోపాటు మరో 13 మంది పార్టీ నేతలతో ఎన్జీటీలో చంద్రబాబు కేసు వేయించి తన నైజాన్ని చాటుకున్నారు. హక్కుల పరిరక్షణకు నిర్మాణాత్మక చర్యలు.. కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను పరిరక్షించేందుకు ముఖ్యమంత్రి జగన్ నిర్మాణాత్మక చర్యలు చేపట్టారని నీటిపారుదలరంగ నిపుణులు పేర్కొంటున్నారు. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల సాగు, తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు రాయలసీమ ఎత్తిపోతల చేపట్టారని, బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ కేటాయింపులను వినియోగించుకునేందుకే ఆర్డీఎస్ కుడి కాలువ పనులను చేపట్టారని స్పష్టం చేస్తున్నారు. ఈ ప్రాజెక్టులపై తెలంగాణ సర్కార్ అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో వివాదాన్ని పరిష్కరించేందుకు గతేడాది అక్టోబర్ 6న కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ అపెక్స్ కౌన్సిల్ రెండో సమావేశాన్ని నిర్వహించారు. కృష్ణా బోర్డు, సీడబ్ల్యూసీ, అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా తెలంగాణ చేపట్టిన 8 ప్రాజెక్టులను నిలుపుదల చేయాలని అపెక్స్ కౌన్సిల్లో సీఎం వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించేందుకే రాయలసీమ ఎత్తిపోతలను చేపట్టామని స్పష్టం చేశారు. తక్షణమే కృష్ణా బోర్డు పరిధిని నోటిఫై చేసి అన్ని ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తెచ్చి రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించాలని కోరారు. శ్రీశైలంలో యథేచ్ఛగా విద్యుదుత్పత్తితో కృష్ణా జలాలు వృథాగా కడలిలో కలిసేలా చేస్తూ తెలంగాణ సర్కార్ సాగిస్తోన్న అక్రమాన్ని అడ్డుకోవాలని ఇప్పటికే రెండు సార్లు ప్రధాని మోదీ, కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి షెకావత్‌లకు లేఖ రాశారు. -
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌పై పిటిషన్‌ను తోసిపుచ్చిన ఎన్జీటీ
సాక్షి, అమరావతి: రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌పై జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్‌లో చిత్తూరు జిల్లా ఆవులపల్లి గ్రామస్థులు వేసిన పిటిషన్‌ను ట్రిబ్యునల్ తోసిపుచ్చింది. రాయలసీమ లిఫ్ట్ అంశంపై అదే పనిగా కేసులు వేయడంపై టిబ్యునల్ అసంతృప్తి వ్యక్తం చేసింది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌పై పదేపదే కేసులా అంటూ ఆవులపల్లి గ్రామస్థులపై ఎన్జీటీ సీరియస్ అయ్యింది. తరచూ కేసులు వేసి ఇబ్బంది పెడతారా అని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి కేసులు మళ్లీ వేస్తే మూల్యం చెల్లించాల్సి వస్తుందని ట్రిబ్యునల్ హెచ్చరించింది. -
చిత్తూరు జిల్లాలో ప్రాజెక్టులకు అనుమతులు లేవంటూ టీడీపీ నేత ఎన్జీటీకి ఫిర్యాదు
-
పట్టిసీమ, పురుషోత్తపట్నంలలో పర్యావరణ ఉల్లంఘనలు
సాక్షి, న్యూఢిల్లీ: టీడీపీ హయాంలో విచ్చలవిడిగా పర్యావరణ నిబంధనల ఉల్లంఘన కారణంగా రాష్ట్ర ప్రభుత్వంపై రూ.4.39 కోట్ల పరిహార భారం పడనుంది. పట్టిసీమ, పురుషోత్తపట్నం ఎత్తిపోతల్లో పర్యావరణ ఉల్లంఘనలు జరిగినట్లు జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) నియమించిన సంయుక్త కమిటీలు వేర్వేరు నివేదికల్లో స్పష్టం చేశాయి. పట్టిసీమ, చింతలపూడి ఎత్తిపోతల పథకాలు, గోదావరి–పెన్నా అనుసంధానం ప్రాజెక్టులో పర్యావరణ ఉల్లంఘనలు జరిగాయంటూ మాజీ మంత్రి వట్టి వసంత్‌కుమార్, పురుషోత్తపట్నం ఎత్తిపోతలలో పర్యావరణ ఉల్లంఘనలు జరిగినట్లు జమ్ముల చౌదరయ్య తదితరులు దాఖలు చేసిన వేర్వేరు పిటిషన్లపై ఎన్జీటీ నియమించిన కమిటీలు నివేదికలు సమర్పించాయి. వీటికి సంబంధించి పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించటంపై రూ.4,39,27,393 ఏపీ కాలుష్య నియంత్రణ మండలికి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలని కమిటీలు స్పష్టం చేశాయి. గోదావరి–పెన్నా అనుసంధానంపై కమిటీ క్షేత్ర స్థాయిలో పర్యటించలేదని, గోదావరి–పెన్నా, చింతలపూడి ఎత్తిపోతల పథకానికి సంబంధించి రెండు నెలల్లో నివేదిక అందిస్తామని కమిటీ ఎన్జీటీకి తెలిపింది. పట్టిసీమ భారం రూ.1,90,85,838 ► పట్టిసీమ ఎత్తిపోతలకు సంబంధించి పర్యావరణ ఉల్లంఘనల (వ్యర్థాలు తొలగించేందుకు శాస్త్రీయ ప్రణాళిక లేకపోవడం, 2017, 2018లో ఎక్కువ నీటిని మళ్లించడం తదితరాలు) కారణంగా రూ.82,68,750. దుమ్ము, ధూళి కారణంగా పర్యావరణ నష్ట పరిహారం రూ.7,24,240. ► మురుగునీటి నిర్వహణ ప్రణాళిక లేకపోవడం, పర్యావరణానికి హాని కలిగించకుండా చర్యలు చేపట్టకపోవడం వల్ల రూ.7,59,200. ► వ్యర్థాల డంపింగ్ పరిహారం రూ.1,45,340. ► వాహనాల నుంచి వెలువడే ఉద్గారాలపై పరిహారం రూ.1,10,653. పై భాగంలో మట్టిని లాభదాయకంగా వినియోగించకపోవడంపై పరిహారం రూ.90,77,655. ► 1,157 చెట్ల నరికివేతపై పరిహారం చెల్లించడంతో పాటు ఇతర ప్రాంతంలో మొక్కలు నాటాలి. ఠి అనుమతి లేకుండా ఎత్తిపోతలు చేపట్టడం వల్ల ప్రజలకు అనారోగ్య సమస్యలు, జీవనంపై ప్రభావం. పురుషోత్తపట్నం పరిహారం రూ.2,48,41,555 ► ర్యాంపు నిర్మాణం, చెత్త పారవేయడం, నీటిని +14.0 ఎం వద్ద ఎత్తిపోతలు చేపట్టినందుకు పర్యావరణ పరిహారం రూ.1,02,75,000. ► దుమ్ము కారణంగా పరిహారం రూ.15,72,774. ► వ్యర్థాల నిర్వహణ ప్రణాళిక లోపానికి పరిహారం రూ.9,56,600. ► మురుగునీటి వ్యవస్థకు సంబంధించి పరిహారం రూ.1,72,185. ► ఏపీ పీసీబీ అనుమతులు లేకుండా ఇసుక వినియోగం, ఇసుక మైనింగ్‌కు పరిహారం రూ.43,83,550. ► వాహన ఉద్గారాల పరిహారం రూ.1,24,946. ► మట్టిని లాభదాయకంగా వినియోగించనందుకు పరిహారం రూ.73,56,500. ► ధవళేశ్వరం బ్యారేజీ వద్ద సర్ప్లస్ నీటిని డ్రా చేయడంపై గోదావరి ట్రిబ్యునల్ స్థాయిని నిర్ణయించింది. ఈ మేరకు +14.0 ఎం వద్దకు చేరినప్పుడే పురుషోత్తపట్నం పథకంలో నీటిని ఎత్తిపోసేలా ప్రభుత్వం ఆటోమేటిక్ వ్యవస్థ ఏర్పాటు చేయాలి. -
పర్యావరణ కోణంలోనే చూడాలి
సాక్షి, న్యూఢిల్లీ: పర్యావరణానికి సంబంధించిన కేసులను పర్యావరణ కోణంలోనే చూడాలని సుప్రీంకోర్టు పేర్కొంది. ఆలస్యంగా పిటిషన్ దాఖలు చేశారని విచారించబోమని పేర్కొనడం సరికాదని స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో భోగాపురం విమానాశ్రయానికి 2017 ఆగస్టులో అనుమతులు వచ్చాయి. వీటి విషయంలో నిబంధనలు పాటించలేదంటూ స్థానికురాలు దాట్ల శ్రీదేవి చెన్నైలోని జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ)ను ఆశ్రయించారు. 90 రోజుల్లోగా పిటిషన్ దాఖలు చేయలేదని.. ఈ ఆలస్యం కారణంగా విచారించబోమని ఎన్జీటీ ఆదేశాలు వెలువరించింది. వీటిని సవాల్ చేస్తూ ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విచారణ అనంతరం న్యాయమూర్తులు జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ రవీంద్రభట్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం తీర్పు వెలువరిస్తూ ఎన్జీటీ ఆదేశాలను పక్కనపెడుతున్నట్లు పేర్కొంది. పర్యావరణ అనుమతుల పత్రాలు అధిక సంఖ్యలో ఉన్నాయని.. వాటిని అధ్యయనం చేయడం, సాంకేతిక, ఇతర అంశాలపై నిపుణులతో సంప్రదింపులకు సమయం పట్టినందున పిటిషన్ దాఖలు చేయడంలో ఆలస్యమైందన్న పిటిషనర్ వాదనలతో ఏకీభవిస్తున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. పిటిషనర్‌తోపాటు ఇతరులు కూడా ఎన్జీటీ ముందు వాదనలు వినిపించొచ్చని పేర్కొంది. -
‘రాయలసీమ’ సర్వే పనులకు గ్రీన్‌సిగ్నల్
సాక్షి, అమరావతి/సాక్షి, న్యూఢిల్లీ: రాయలసీమ ఎత్తిపోతల పథకం సర్వే పనులకు జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ) గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) మార్గదర్శకాల కోసం సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)ను రూపొందించడానికే పనులు చేస్తున్నామని ఏపీ సీఎస్ దాఖలు చేసిన ప్రమాణపత్రంతో ఏకీభవించింది. ఎన్జీటీ ఆదేశాలను ఏపీ సర్కారు ఉల్లంఘించిందంటూ గవినోళ్ల శ్రీనివాస్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌ను తోసిపుచ్చింది. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి ఎన్జీటీ ఆదేశాలు ఉల్లంఘించి ఏపీ సర్కారు పనులు చేస్తోందంటూ శ్రీనివాస్ ఈ పిటిషన్ వేశారు. దీనిపై జస్టిస్ రామకృష్ణన్, సైబల్‌దాస్ గుప్తాలతోకూడిన ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది వెంకటరమణి వాదనలు వినిపిస్తూ.. సీడబ్ల్యూసీ మార్గదర్శకాల ప్రకారం డీపీఆర్‌ను రూపొందించడానికి సర్వే, పరిశోధనలు మాత్రమే చేస్తున్నామని ఏపీ సీఎస్ ప్రమాణపత్రాన్ని దాఖలు చేసిన విషయాన్ని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఎత్తిపోతల ప్రాజెక్టు ప్రతిపాదిత స్థలంలో మార్పులపై అధ్యయనం మాత్రమే చేస్తున్నారన్నారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే తెలంగాణ రాష్ట్రం నుంచి పిటిషన్ దాఖలు చేశారని చెప్పారు. గతేడాది ఫిర్యాదు చేసినా కేఆర్ఎంబీ(కృష్ణా బోర్డు) చర్యలు తీసుకోలేదని పిటిషనర్ తరఫు న్యాయవాది శ్రావణ్‌కుమార్ వాదించారు. ప్రాజెక్టు పనుల వివాదాలకు సంబంధించి నివేదిక ఇవ్వడానికి మరింత సమయం కావాలని కేఆర్ఎంబీ ట్రిబ్యునల్‌ను కోరింది. వాదనల అనంతరం... ఏపీ ప్రభుత్వం ఎన్జీటీ ఉత్తర్వులను ఉల్లంఘించిందంటూ దాఖలు చేసిన పిటిషన్‌ను తోసిపుచ్చుతున్నట్లు ధర్మాసనం పేర్కొంది. ప్రాజెక్టు పరిసరాల్లో చేస్తున్న పనులన్నీ సీడబ్ల్యూసీ నిబంధనల మేరకు సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్) రూపొందించడానికి చేస్తున్నవేనని ఏపీ సీఎస్ దాఖలు చేసిన ప్రమాణ పత్రాన్ని తోసిపుచ్చలేమని స్పష్టం చేసింది. నిబంధనలకు వ్యతిరేకంగా ఏపీ ప్రభుత్వం పనులు చేపడుతున్నట్లు కేఆర్ఎంబీ నిర్ణయిస్తే.. అప్పుడు కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేయవచ్చని పిటిషనర్‌కు సూచించింది. ఎన్జీటీ ఆదేశాల నేపథ్యంలో రాయలసీమ ఎత్తిపోతల సర్వే, పరిశోధన, డీపీఆర్ రూపకల్పన పనులకు మార్గం సుగమమైంది. -
నిబంధనలు పాటిస్తూ ఇసుక డ్రెడ్జింగ్
సాక్షి, అమరావతి: ఇసుక అక్రమ తవ్వకాలు జరగకుండా పటిష్ట నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసి నిబంధనల ప్రకారం నదులు, రిజర్వాయర్లలో డ్రెడ్జింగ్ చేసుకోవచ్చని జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. ఇసుక డ్రెడ్జింగ్ /తవ్వకాలకు ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) అనుమతి తప్పనిసరి నిబంధనను మినహాయిస్తూ గత సర్కారు 2016లో జారీ చేసిన మైనర్ మినరల్ కన్సెషన్ రూల్స్ సవరణ (ఇసుక పాలసీ) ఉత్తర్వులను కొందరు ఎన్జీటీలో సవాల్ చేయడం తెలిసిందే. దీనివల్ల పర్యావరణం దెబ్బ తింటుందని, ఇష్టారాజ్యంగా నదులు, రిజర్వాయర్లు, కాలువల్లో ఇసుక తోడేయడం వల్ల భూగర్భ జలమట్టం పడిపోయి కరువు ఏర్పడిందని పేర్కొన్నారు. అడ్డగోలుగా ఇసుక తవ్వకాల వల్ల పర్యావరణ సమతుల్యం దెబ్బ తింటుందన్నారు. ఈ మినహాయింపులు సుప్రీంకోర్టు ఉత్తర్వులకు విరుద్ధమని, తక్షణమే దీనిపై స్టే విధించి పర్యావరణ పరిరక్షణకు సహకరించాలని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన తిరుమలశెట్టి శ్రీనివాస్, దేవినేని రాజశేఖర్ ఎన్జీటీలో సవాల్ చేశారు. ప్రకాశం బ్యారేజిలో అడ్డగోలుగా ఇసుక తవ్వకాలు సాగిస్తూ పర్యావరణానికి తూట్లు పొడుస్తున్నారంటూ అనుమోల్ గాంధీ కూడా ఎన్జీటీని ఆశ్రయించారు. ఈ పిటిషన్ విషయంలో ఎన్జీటీ 2018లో నాటి ప్రభుత్వానికి కొన్ని అంశాలపై ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం రూ.100 కోట్లు డిపాజిట్ చేయాలని, దీన్ని ఇసుక అక్రమ తవ్వకందారుల నుంచి వసూలు చేయాలని అప్పట్లో ఆదేశించింది. నిబంధనలకు విరుద్ధంగా డ్రెడ్జింగ్ జరుగుతున్నట్లు రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి సమర్పించిన ఉమ్మడి తనిఖీ నివేదిక ఆధారంగా ఎన్జీటీ ఈ ఆదేశాలు జారీ చేసింది. గణాంకాలతో ఎన్జీటీకి ప్రభుత్వం నివేదిక.. పూడిక వల్ల రిజర్వాయర్ల నిల్వ సామర్థ్యం తగ్గిపోతోందని, కాలువలు, నదుల్లో పూడిక (ఇసుక)ను నిర్దిష్ట పరిమాణంలో తొలగించకుంటే వర్షాల సమయంలో వరదల ముప్పు ఎక్కువగా ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం గణాంకాలతో శాస్త్రీయ నివేదిక సమర్పించింది. నిబంధనలకు లోబడి ఇసుక తవ్వకాల వల్ల పర్యావరణానికి నష్టం ఉండదని వివరించింది. ఈ అంశాలను పరిగణలోకి తీసుకున్న ఎన్జీటీ కొన్ని నిబంధనలు పాటిస్తూ ఇసుక డ్రెడ్జింగ్ చేసుకునేందుకు అనుమతించింది. అనుమతించిన దానికంటే అధిక పరిమాణంలో ఇసుక తవ్వినా, నిబంధనలను ఉల్లంఘించినా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. దీంతో ప్రకాశం, ధవళేశ్వరం బ్యారేజీల్లో ఇసుక డ్రెడ్జింగ్‌కు అవరోధం తొలగిందని అధికారులు పేర్కొంటున్నారు. ఎన్జీటీ తీర్పులో కీలక అంశాలివీ.. – ఇసుక డీసిల్టింగ్/ డ్రెడ్జింగ్/ మైనింగ్ నిర్వహించే ప్రాంతాల్లో శాస్త్రీయ పర్యవేక్షణ నిమిత్తం సీసీటీవీలను ఏర్పాటు చేయాలి. దీనివల్ల అక్రమ తవ్వకాలు, రవాణాను కట్టడి చేయడం సులభమవుతుంది. – శాస్త్రీయ సర్వే నిర్వహించి నిర్ణీత పరిమాణంలో మాత్రమే ఇసుక డ్రెడ్జింగ్ నిర్వహించాలి. నిబంధనలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. (ఇప్పటికే ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణా నిరోధానికి కఠిన నిబంధనలతో ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు బాగున్నాయి. ఇవి పక్కాగా అమలు చేస్తే చాలు) – డ్రెడ్జింగ్/ డీసిల్టింగ్‌కు అనుమతుల కోసం ప్రతి జిల్లాలో శాశ్వతంగా నిపుణులతో కమిటీని ఏర్పాటు చేయాలి. -
అదనపు టీఎంసీ... ఆగినట్లే!
సాక్షి, హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టులో అదనంగా మరో టీఎంసీ నీటిని తరలించేలా చేపట్టిన పనులకు బ్రేక్ పడనుంది. కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖ నుంచి రాష్ట్రానికి అందిన ఆదేశాలు, ఇప్పటికే జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) వెలువరించిన ఉత్తర్వుల నేపథ్యంలో.. నెలరోజుల కిందటే రూ.21 వేల కోట్లతో చేపట్టిన పనులన్నీ ఎక్కడివక్కడే నిలిచిపోనున్నాయి. మూడో టీఎంసీ ఎత్తిపోత పనులను కొత్త ప్రాజెక్టుగానే పరిగణిస్తున్నందున... ఆ ప్రాజెక్టుకు కేంద్ర సంస్థల నుంచి పూర్తిస్థాయి అనుమతులు వచ్చే వరకు పనులు కొనసాగించే అవకాశాలు లేవని ఇరిగేషన్ వర్గాలు చెబుతున్నాయి. అయితే దీనిపై న్యాయస్థానాలను ఆశ్రయించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. ఆదిలోనే హంసపాదు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఇప్పటికే మేడిగడ్డ నుంచి మిడ్‌మానేరు వరకు 2 టీఎంసీలు, మిడ్‌మానేరు దిగువన ఒక టీఎంసీ నీటిని తరలించేలా పనులు పూర్తయిన విషయం తెలిసిందే. ఇక అదనంగా మరో టీఎంసీ నీటిని తరలించాలని నిర్ణయించిన ప్రభుత్వం మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి వరకు ఇప్పటికే పనులు ఆరంభించి కొనసాగిస్తోంది. ఎల్లంపల్లి దిగువన పనులకు ఈ ఏడాది మార్చిలో టెండర్లు పిలిచింది. ఎల్లంపల్లి నుంచి మిడ్‌మానేరు వరకు 1.10 టీఎంసీ నీటిని ఎత్తిపోసేలా నాలుగు ప్యాకేజీలకు రూ.9,747.30 కోట్లతో, మిడ్‌మానేరు నుంచి మల్లన్నసాగర్ వరకు మరో నాలుగు ప్యాకేజీలకు రూ.11,710.70 కోట్లతో టెండర్లు పిలిచారు. టెండర్ల ప్రక్రియ మే నెలలో ముగిసింది. ఇదే సమయంలో ఈ ప్రాజెక్టు పనులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫిర్యాదు చేయడంతో కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. డీపీఆర్‌లు సమర్పించాలని, కేంద్ర అనుమతులు లేకుండా ప్రాజెక్టు నిర్మాణం కొనసాగించరాదని తెలిపింది. ఫలితంగా రాష్ట్రం ముందడుగు వేయలేదు. ఎన్జీటీ ఉత్తర్వులు అడ్డంకే దీంతో పాటే అదనపు టీఎంసీ పనులపై కొందరు ఎన్జీటీని ఆశ్రయించారు. దీనిపై అక్టోబర్‌లో తుదితీర్పును వెలువరించిన ఎన్టీటీ, కేంద్ర జల్‌శక్తి శాఖ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని స్పష్టం చేసింది. ‘గోదావరి బోర్డుకు డీపీఆర్ ఇవ్వకుండా, అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా ప్రాజెక్టు పనులపై ముందుకెళ్లొద్దని ఆగస్టులోనే కేంద్రమంత్రి ముఖ్యమంత్రికి లేఖ రాశారు. విస్తరణ పనులకు ఎలాంటి ప్రతిపాదన తమవద్దకు రాలేదని కేంద్ర జల సంఘం స్పష్టం చేసింది. దీనికి కొత్తగా అనుమతులు అవసరమని పేర్కొంది. ఈ పరిస్థితుల్లో అక్టోబర్ 2న తెలంగాణ సీఎం కేంద్రానికి రాసిన లేఖను జల్‌శక్తి శాఖ పరిశీలించాల్సి ఉంది. అనంతరం కేంద్ర జల్‌శక్తి శాఖ తీసుకునే నిర్ణయానికి తెలంగాణ కట్టుబడి ఉండాలి’అని తన తుదితీర్పులో ఎన్జీటీ పేర్కొంది. అయితే కేంద్రం నుంచి ఎలాంటి ఆదేశాలు రాకపోవడంతో గతనెలలో ఎనిమిది ప్యాకేజీల పరిధిలో అదనపు టీఎంసీ పనులను రాష్ట్రం ఆరంభించింది. తెలంగాణ ముఖ్యమంత్రి లేఖపై ఈనెల 11న స్పందించిన కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్, అదనపు టీఎంసీ పనులను పూర్తిగా కొత్త డిజైన్‌గానే చూస్తామని, మార్పు ఏదైనా జరిగినప్పుడు కేంద్ర హైడ్రాలజీ, అంతర్రాష్ట్ర, పెట్టుబడులు, పర్యావరణ తదితర అనుమతులను పొందాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని అనుసరించి గోదావరి బోర్డు, సీడబ్ల్యూసీ నుంచి మదింపు తప్పనిసరని, అది జరిగే వరకు ప్రాజెక్టుపై ముందుకెళ్లరాదని స్పష్టం చేశారు. ఇప్పటికే వెలువడిన ఎన్జీటీ ఉత్తర్వులు, కేంద్రం తాజా ఆదేశాల నేపథ్యంలో పనులను కొనసాగించే అవకాశం ఇరిగేషన్ శాఖకు లేకుండా పోయింది. కేంద్ర నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిన పరిస్థితి. పనులను ఏమాత్రం కొనసాగించినా పిటిషనర్లు తిరిగి కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసే అవకాశాలున్న నేపథ్యంలో ఈ పనులను తాత్కాలికంగా నిలిపివేయాలన్నదే ప్రభుత్వ ఆలోచన అని ఇరిగేషన్ వర్గాలు తెలిపాయి. మిగతా ప్రాజెక్టుల డీపీఆర్‌లకు ఓకే కాళేశ్వరంతో పాటు సీతారామ ఎత్తిపోతల, జీఎల్ఐఎస్ ఫేజ్–3, తుపాకులగూడెం ప్రాజెక్టు, తెలంగాణ తాగునీరు సరఫరా ప్రాజెక్టు, లోయర్ పెన్ గంగపై బ్యారేజి, రామప్ప సరస్సు నుంచి పాకాల లేక్‌కు నీటి మళ్లింపు ప్రాజెక్టుల డీపీఆర్‌లు సమర్పించాలని, బోర్డుల మదింపు జరగనంతవరకు ముందుకు వెళ్లరాదని సైతం కేంద్రమంత్రి ఆదేశించారు. ఈ నేపథ్యంలో ప్రాజెక్టుల డీపీఆర్‌లను ఇరిగేషన్ శాఖ సిధ్దం చేస్తోంది. అయితే మిగతా చోట్ల పనులను పూర్తిగా నిలిపివేసే అంశంపై మాత్రం స్పష్టత రావాల్సి ఉంది. కాళేశ్వరం అదనపు టీఎంసీ పనులపై కోర్టులను ఆశ్రయించే అవకాశాలను సైతం రాష్ట్రం పరిశీలిస్తోంది. దీనిపై ఒకట్రెండు రోజుల్లో న్యాయనిపుణులతో ప్రభుత్వ పెద్దలు చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
తాగునీటిలో కాల్షియం తప్పనిసరి
సాక్షి, అమరావతి: దేశంలో విక్రయించే ప్యాకేజ్డ్ వాటర్‌కు సంబంధించి జనవరి ఒకటి నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రాబోతున్నాయి. ప్యాకింగ్ చేసి విక్రయించే లీటర్ మంచి నీటిలో 20 మిల్లీ గ్రాముల కాల్షియం, 10 మిల్లీ గ్రాముల మెగ్నీషియం తప్పనిసరిగా ఉండాలని భారత ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) స్పష్టం చేసింది. శుద్ధి చేసిన నీటి పేరుతో ఆ నీటిలో శరీరానికి ఉపయోగపడే ఖనిజ లవణాలను కూడా తొలిగిస్తున్నారని, అలా కాకుండా ఆరోగ్యానికి మంచి చేసే ఖనిజ లవణాలు నీటిలో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలంటూ జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఎఫ్ఎస్ఎస్ఏఐని కోరింది. ఈ నేపథ్యంలో అందుకనుగుణంగా మంచి నీటిని శుద్ధి చేయడానికి వీలుగా ప్లాంట్లలో మార్పులు చేసుకోవడానికి ఈ నెల 31 వరకు ఎఫ్ఎస్ఎస్ఏఐ సమయం ఇచ్చింది. దీంతో ఆక్వాఫినా, హిమాలయన్, బైలే, రైల్‌నీర్, ఆక్సీరిచ్, టాటా వాటర్ వంటి ప్రముఖ బ్రాండ్లన్నీ ఈ నిబంధనలకు అనుగుణంగా జనవరి1 నుంచి మంచినీటిని మార్కెట్లోకి విడుదల చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నాయి. కోకోకోలా (కిన్లే) ఇప్పటికే కొత్త నిబంధనల ప్రకారం ప్యాకేజ్డ్ నీటిని మార్కెట్లోకి విడుదల చేసింది. 55% యూనిట్లు దక్షిణాది రాష్ట్రాల్లోనే.. దేశీయ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ పరిశ్రమ శరవేగంగా వృద్ధి చెందుతోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 3,000 కోట్ల లీటర్ల నీటి విక్రయాలు జరుగుతున్నాయి. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) దగ్గర ఉన్న సమాచారం ప్రకారం..దేశవ్యాప్తంగా 6,000కు పైగా మినరల్ వాటర్ తయారీ సంస్థలుండగా వీటిలో 55 శాతం యూనిట్లు దక్షిణాది రాష్ట్రాల్లోనే ఉన్నాయి. రెండు లీటర్లు, లీటర్, అర లీటర్, పావు లీటర్తోపాటు 15, 20 లీటర్ల బాటిల్స్‌లో అమ్మకాలు జరుగుతున్నాయి. ఇందులో అత్యధికంగా 42 శాతం అమ్మకాలు లీటర్ బాటిల్స్వి కాగా, ఆ తర్వాతి స్థానంలో అరలీటర్, పావులీటర్ల బాటిల్స్ ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్యాకేజ్డ్ వాటర్ పరిశ్రమ విలువ రూ.26 లక్షల కోట్లుగా ఉంటుందని అంచనా. ప్యాకేజ్డ్ తాగునీటిలో ఉండాల్సినవి లీటర్‌కు -
బ్యారేజీల్లో భారీగా ఇసుక నిల్వలు
సాక్షి, అమరావతి: తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరంలోని కాటన్ బ్యారేజీ, విజయవాడలోని ప్రకాశం బ్యారేజీల్లో భారీగా పేరుకుపోయిన ఇసుకను వెలికితీయడం ద్వారా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. త్వరితగతిన చట్టబద్ధమైన అనుమతులు తీసుకోవడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 410 పైగా ఓపెన్ ర్యాంపుల్లో తవ్వకాలు జరపడం, రిజర్వాయర్లలో డ్రెడ్జింగ్ చేయడం ద్వారా డిమాండ్‌కు సరిపడా ఇసుకను అందుబాటులోకి తీసుకొచ్చి కొరత లేకుండా చూడాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇసుక విధానం–2019కి సవరణల ద్వారా పాలసీని మరింత పారదర్శకంగా, లోపరహితంగా మార్చిన ప్రభుత్వం డ్రెడ్జింగ్‌పై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగానే కాటన్, ప్రకాశం బ్యారేజీల్లో ఇసుక పరిణామాన్ని అంచనా వేయడం కోసం బాతిమెట్రిక్ (నీటి లోతుల్ని, నేలల్ని పరీక్షించడం) సర్వే జరిపించింది. ఒక్కొక్క బ్యారేజీలో రెండేసి కోట్ల టన్నుల చొప్పున ఇసుక నిక్షేపాలున్నట్లు సర్వేలో తేలింది. నిబంధనల ప్రకారం బ్యారేజీల్లో ఇసుక డ్రెడ్జింగ్ చేసుకోవడానికి జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) కూడా అంగీకారం తెలిపింది. అవరోధాలు తొలగిపోవడంతో డ్రెడ్జింగ్ ద్వారా ఇసుక వెలికితీతకు స్టాండర్డ్ ఆపరేషనల్ ప్రొసీజర్ (ఎస్ఓపీ) తయారు చేయాలని రాష్ట్ర గనుల శాఖ అధికారులు జల వనరుల శాఖను కోరారు. ఆ శాఖ నుంచి నివేదిక వచ్చిన తర్వాత ప్రభుత్వానికి పంపించి ఎలా చేయాలనే దానిపై ఉన్నత స్థాయిలో చర్చించి కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తామని గనుల శాఖ అధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. రెండు శాఖల సమన్వయంతో డ్రెడ్జింగ్ రెండేళ్లుగా భారీ వర్షాలు కురవడం, వరదలు రావడంతో ధవళేశ్వరం, ప్రకాశం బ్యారేజీల్లోకి భారీగా ఇసుక చేరి పేరుకుపోయింది. దీనిని జల వనరుల, గనుల శాఖలు సమన్వయంతో డ్రెడ్జింగ్ ద్వారా వెలికితీసి ప్రజల డిమాండ్‌కు సరిపడా ఇసుకను అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం భావిస్తోంది. గుర్తించిన ఓపెన్ రీచ్‌లకు చట్టబద్ధమైన పర్యావరణ, ఇతర అనుమతులు తీసుకునే ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. -
నవంబర్ 30 వరకు బాణాసంచాపై పూర్తి నిషేధం
న్యూఢిల్లీ: ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో నవంబర్ 9(సోమవారం) అర్థరాత్రి నుంచి నెలాఖరు వరకు బాణాసంచా అమ్మకం, వినియోగంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్(ఎన్జీటీ) పూర్తి నిషేధం విధించింది. దీపావళి నేపథ్యంలో గాలి నాణ్యత మరింత క్షీణించకుండా ఉండటానికి గాను ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఢిల్లీలో గాలి నాణ్యత దారుణంగా ఉంది. ఇలాంటి సమయంలో బాణాసంచా వినియోగానికి అనుమతిస్తే.. పరిస్థితి మరింత దిగజారిపోతుందనే ఉద్దేశంతో ట్రిబ్యూనల్ ఈ నిర్ణయం తీసుకుంది. ఇక ఈ ఉత్తర్వు నేషనల్ క్యాపిటర్ రీజియన్(ఎన్సీఆర్)లో భాగమైన నాలుగు రాష్ట్రాల్లోని 2 డజనుకు పైగా జిల్లాలకు వర్తిస్తుంది. అంతేకాక దేశవ్యాప్తంగా "గత ఏడాది నవంబర్‌లో సగటు పరిసర గాలి నాణ్యత" అధ్వాన్నంగా ఉన్న నగరాలు, పట్టణాలకు కూడా ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని గ్రీన్ ట్రిబ్యునల్ తెలిపింది. అలానే గాలి నాణ్యత మోడరేట్‌గా ఉన్న నగరాలు, పట్టణాల్లో తక్కువ కాలుష్య కారకాలుగా పరిగణించబడే గ్రీన్ క్రాకర్స్‌ని మాత్రమే అనుమతించింది. అది కూడా పరిమిత సమయం వరకు మాత్రమే. "సంబంధిత రాష్ట్రం పేర్కొన్న విధంగా పర్వదినాల్లో బాణాసంచా కాల్చే సమయం రెండు గంటలకు మాత్రమే పరిమితం చేయబడింది. దీపావళి, గురుపూర్‌లలో రాత్రి 8-10 గంటల మధ్యన, ఛత్‌లో ఉదయం 6-8 గంటల మధ్య.. క్రిస్మస్, న్యూ ఇయర్ రోజున రాత్రి 11.55 గంటల నుంచి తెల్లవారు జామున 12.30 గంటల వరకు మాత్రమే బాణాసంచా కాల్చేందుకు అనుమతించబడినట్లు" ఉత్తర్వుల్లో పేర్కొన్నది.(చదవండి: బాణాసంచా బ్యాన్పై కర్ణాటక యూటర్న్) ఇక గాలి నాణ్యత మెరుగ్గా ఉన్న ఇతర ప్రాంతాల్లో ట్రిబ్యూనల్ క్రాకర్స్ నిషేధాన్ని ఐచ్చికం చేసింది. "కోవిడ్ -19 తీవ్రతను దృష్టిలో పెట్టుకుని గాలి కాలుష్యానికి కారణం అయ్యే చర్యలని నియంత్రించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలి" అని ఎన్జీటీ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలని కోరింది. కరోనా వైరస్ విజృంభిస్తోన్న సమయంలో.. గాలి నాణ్యత అధ్వన్నంగా ఉన్న తరుణంలో.. కాలుష్యాన్ని మరింత పెంచే బాణాసంచా వాడకాన్ని నిషేధించాలంటూ దాఖలైన పిటిషన్‌ని విచారించిన ఎన్జీటీ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. పండుగ కాలంలో వాయు కాలుష్యం కారణంగా రోజుకు 15,000 కేసులు నమోదవుతాయని కేంద్ర, రాష్ట్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖలు చేసిన హెచ్చరికలను గుర్తు చేసింది. ప్రస్తుతం ఢిల్లీలో కరోనా థర్డ్ వేవ్ కొనసాగుతుంది. గత 24 గంటల్లో 7,745 కేసులు నమోదయ్యాయి. (అలర్ట్ : కరోనాకు కాలుష్యం తోడైతే.. ) ఏటా, ఉత్తర భారతదేశంలో గాలి నాణ్యత క్షీణిస్తుంది. శీతాకాలంలో విషపూరితంగా మారుతుంది, అక్టోబర్ నుండి రైతులు పంట వ్యర్థాలను కాల్చడంతో గాలి నాణ్యత క్షీణిస్తుంది. గత మూడు రోజులుగా, జాతీయ రాజధాని ప్రాంతంలో గాలి నాణ్యత చాలా దారుణంగా ఉంది. తీవ్రమైన వాయు కాలుష్యం ప్రజల ఆరోగ్యాలని ప్రభావితం చేస్తుంది. అక్టోబర్ నుంచి ఢిల్లీలోని వాయు కాలుష్యం 17.5 శాతం కోవిడ్ కేసుల పెరుగుదలకిదారితీసిందని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సంబంధం వెల్లడించింది. -
నాలాల దురాక్రమణపై హైకోర్టుకు వెళ్లండి..
సాక్షి, చెన్నై: హైదరాబాద్‌లో వరదలకు కారణమైన చెరువులు, నాలాల దురాక్రమణపై ఎన్జీటీ చెన్నై బెంచ్ గురువారం విచారణ చేపట్టింది. నాలాలు, చెరువుల దూరాక్రమణల విషయంలో కిర్లాస్కర్ కమిటీ ప్రతిపాదనలు అమలు చెయాలని తాము చెప్పలేమని ఎన్జీటీ స్పష్టం చేసింది. హైదరాబాద్‌లో భారీ వరదలకు కారణమైన చెరువులు, నాలాల దురాక్రమణకు సంబంధించి జర్నలిస్టు సిల్వేరి శ్రీశైలం పిటిషన్ దాఖలు చేశారు. గతంలో ఆక్రమణలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కిర్లాస్కర్ కమిటీ ఏర్పాటు చేసిందని తెలిపారు. అయితే కమిటీ ప్రతిపాదనలు అమలు కావడం లేదని ఎన్జీటీకి విన్నవించారు. ఈ విషయంలో కిర్లాస్కర్ కమిటీ ప్రతిపాదనలు అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి తాము చెప్పలేమని ఎన్జీటీ స్పష్టం చేసింది. హైకోర్టుకు వెళ్లాలని పిటిషనర్‌కు సూచించింది. దాంతో పిటిషన్‌ని ఉపసంహరించుకున్నారు. (చదవండి: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌కు ఎన్జీటీ షాక్) -
కేంద్ర నిర్ణయానికి కట్టుబడాలి
సాక్షి, న్యూఢిల్లీ: కాళేశ్వరం ప్రాజెక్టు విస్తరణ పనులపై కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉండాలని జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) తెలంగాణ ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ఎత్తిపోతల సామర్థ్యాన్ని రోజుకు రెండు టీఎంసీల నుంచి మూడు టీఎంసీలకు పెంచడానికి ఎలాంటి పర్యావరణ అనుమతులు అవసరం లేదన్న తెలంగాణ వాదనతో విభేదించింది. ప్రాజెక్టు నిర్మాణంలో పర్యావరణ ఉల్లంఘనలు జరిగాయని తెలిపింది. 2008 నుంచి 2017 వరకు ప్రాజెక్టు నిర్మాణంలో పలు మార్పులు జరిగినప్పటికీ పర్యావరణ అనుమతులు విస్మరించినట్లు గుర్తించామని స్పష్టం చేసింది. ఎత్తిపోతల సామర్థ్యం పెంపు పనులకు కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖ, కేంద్ర జలసంఘం, పర్యావరణ శాఖల అనుమతులు తప్పనిసరి అని పేర్కొంది. ప్రజా ప్రయోజనాలు, పర్యావరణ పరిరక్షణ రెండింటిని సమన్వయం చేసుకుంటూ ముందుకువెళ్లాలే కానీ పర్యావరణాన్ని నిర్లక్ష్యం చేయరాదని తెలిపింది. పర్యావరణ ఉల్లంఘనలకు బాధ్యులెవరనేది గుర్తించాలని, ఏడుగురు సభ్యులతో కూడిన నిపుణుల కమిటీని నెలలోగా ఏర్పాటు చేయాలని కేంద్ర పర్యావరణ శాఖను ఆదేశించింది. కమిటీ నివేదిక ఆరునెలల్లో అందజేయాలని పేర్కొంది. కాళేశ్వరం విస్తరణ పనులను ఆపాలంటూ తెలంగాణకు చెందిన హయతుద్దీన్, తుమ్మనపల్లి శ్రీనివాస్ తదితరులు వేర్వేరుగా వేసిన పిటిషన్లను విచారించిన జస్టిస్ ఆదర్శకుమార్ గోయెల్ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం తీర్పు వెలువరించింది. ‘‘ఇరు పక్షాల వాదనలు విన్న అనంతరం పర్యావరణ ఉల్లంఘనలు గుర్తించాం. ప్రాజెక్టు నిర్మాణం పూర్తి అయిన నేపథ్యంలో పూర్వస్థితి తీసుకురావడం సాధ్యంకాదు. కానీ, ఉపశమన చర్యలు చేపట్టాల్సిన బాధ్యత, జవాబుదారీతనం ఎంతైనా అవసరం. బహుళ ప్రయోజనంతో నిర్మిస్తున్న ప్రాజెక్టు కావడంతో పర్యావరణ అనుమతులు అవసరం లేదన్న తెలంగాణ ప్రభుత్వ వాదన సరికాదు. పర్యావరణ అనుమతులు లేకుండా ముందుకు వెళ్లరాదని ట్రిబ్యునల్, హైకోర్టు ఆదేశాలు కూడా ఉన్నాయి. విస్తరణ పనులకు ముందు నిపుణుల కమిటీ అంచనా వేయాల్సిందే. గోదావరి నదీ యాజమాన్య బోర్డుకు డీపీఆర్ ఇవ్వకుండా, అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా ప్రాజెక్టు పనులపై ముందుకెళ్లొద్దని కేంద్ర జల్‌శక్తి మంత్రి 7.8.2020న తెలంగాణ ముఖ్యమంత్రికి లేఖ రాశారు. విస్తరణ పనులకు సంబంధించి ఎలాంటి ప్రతిపాదన లేదని కేంద్ర జలసంఘం కూడా పేర్కొంది. అనుమతులు అవసరమని తెలిపింది. ఈ పరిస్థితుల్లో 2.10.2020న తెలంగాణ ముఖ్యమంత్రి రాసిన లేఖను కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖ పరిశీలించాల్సిన అవసరం ఉంది. అనంతరం జల్‌శక్తి శాఖ తీసుకునే నిర్ణయానికి తెలంగాణ కట్టుబడి ఉండాలి’’ అని తీర్పులో పేర్కొంది. -
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌కు ఎన్జీటీ షాక్
సాక్షి, న్యూఢిల్లీ: పర్యావరణ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఇ-కామర్స్ సంస్థలకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) షాక్ ఇచ్చింది. చట్టబద్ధమైన నిబంధనలను ఉల్లంఘిస్తున్న అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ నుండి జరిమానాను వసూలు చేయాలని ఎన్జీటీ కేంద్ర కాలుష్య నియంత్రణ మండలికి (సీపీసీబీ) ఆదేశాలిచ్చింది. ఈ కామర్స్ సంస్థలనుంచి సరైన రీతిలో జరిమానా వసూల్ చేయడం లేదని ట్రిబ్యునల్ వ్యాఖ్యానించింది. ఈ విషయంలో ట్రిబ్యునల్ చర్య తీసుకున్ననివేదికను అక్టోబర్14లోగా సమర్పించాలని కోరింది. ఇ-కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లను తమ ప్యాకేజింగ్‌లో అధిక ప్లాస్టిక్ వాడకాన్ని నిరోధించాలంటూ ఆదిత్య దుబే య(16) దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం ఈ ఉత్తర్వులిచ్చింది. పర్యావరణ సూత్రాలను ఉల్లంఘిస్తున్న సంస్థలపై ఆడిట్, తగిన నష్టపరిహారాన్ని వసూల్ చేయాలని ఎన్జీటీ జస్టిస్ ఏకే గోయల్ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది. ప్యాకేజీల కోసం వినియోగిస్తున్న ప్లాస్టిక్ వ్యర్థాలను మళ్లీ సేకరిస్తున్నారా లేదా అన్న అంశాన్ని పరిశీలించాలని తెలిపింది. ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్, 2016 ప్రకారం బాధ్యతను నెరవేర్చాల్సిన అవసరం ఉందని, తమ ఉత్పత్తుల ప్యాకేజింగ్ వల్ల ఉత్పన్నమయ్యే ప్లాస్టిక్ వ్యర్థాలను తిరిగి సేకరించే వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని సీపీసీబీ ఇంతకు ముందే ఎన్జీటీ తెలిపింది. ప్రొవిజన్ 9(2) ప్రకారం.. ప్యాకింగ్ చేసిన సంస్థలే మళ్లీ వ్యర్థాలను సేకేరించాలని పేర్కొంది. కాగా సరుకుల ప్యాకేజింగులో అధికంగా ప్లాస్టిక్ వాడడాన్ని ఆపేలా అమెజాన్ ఫ్లిప్‌కార్ట్‌లను ఆదేశించాలని ఆదిత్య దుబే తన లీగల్ గార్డియన్ ద్వారా ఎన్‌జిటిని అభ్యర్థించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ద్వారా పర్యావరణానికి తీరని నష్టం ఏర్పడుతోందన్నారు. ఇది చాలా తక్కువ శాతంలో రీసైకిల్ అవుతున్న కారణంగా భూమి ప్లాస్టిక్‌కు పెద్ద డంపింగ్ గ్రౌండ్‌గా మారుతోందన్నారు. తద్వారా ఏర్పడిన మైక్రోప్లాస్టిక్స్ భూమిని, నీటిని తీవ్రంగా కలుషితం చేస్తోందని దుబే వాదించారు. -
రాయలసీమ ఎత్తిపోతల పథకంపై జోక్యం చేసుకోలేం
సాక్షి, హైదరాబాద్: సుప్రీంకోర్టు, జాతీయ హరిత న్యాయస్థానం(ఎన్జీటీ)లో పెండింగ్‌లో ఉన్న రాయలసీమ ఎత్తిపోతల పథకం పిటిషన్‌పై తాము జోక్యం చేసుకోలేమని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. కాంగ్రెస్ నేత వంశీచందర్‌రెడ్డి, సామాజిక కార్యకర్త శ్రీనివాస్ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. తెలంగాణ హైకోర్టుకు విచారణ పరిధి ఉంటుందని అడిషనల్ అడ్వొకేట్ జనరల్ రామచంద్రరావు తెలిపారు. సుప్రీంకోర్టులో నదీ జలాల కేటాయింపు అంశం ఉందని ఏజీ తెలియజేశారు. అనుమతులు లేకుండా ఏపీ ప్రాజెక్టు పనులు చేపడుతోందని తెలిపారు. అయితే ఏపీ ప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు ఎలా ఆదేశించగలదని హైకోర్టు ప్రశ్నించింది. డీపీఆర్ సమర్పించి, టెండర్లకు వెళ్లేందుకు ఏపీకి ఎన్జీటీ అనుమతిచిందని పిటిషనర్ న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఎన్జీటీ ఉత్తర్వులపై అభ్యంతరం ఉంటే సుప్రీం కోర్టుకు ఎందుకు వెళ్లలేదని హైకోర్టు ప్రశ్నించింది.(తీర్పును రిజర్వ్‌లో పెట్టిన ఎన్జీటీ) ఎన్జీటీకి విచారణ పరిధి లేదని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. విచారణ పరిధిపై ముందు ఎన్జీటీ తేల్చాలని హైకోర్టు పేర్కొంది. పిటిషన్‌లోని అన్ని అంశాలు సుప్రీంకోర్టు ముందు ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ ఏజీ శ్రీరాం తెలిపారు. సుప్రీంకోర్టు విచారణ పూర్తయ్యే వరకు ఆగాలని ఏపీ ఏజీ పేర్కొన్నారు. సుప్రీంకోర్టులో విచారణ పూర్తయ్యే వరకు నిరవధిక వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు తెలిపింది. సుప్రీంకోర్టులో తేలిన తర్వాత తమ దృష్టికి తీసుకురావచ్చునని పిటిషనర్లకు తెలంగాణ హైకోర్టు సూచించింది. -
రాయలసీమ ఎత్తిపోతలకు అనుమతులు అవసరం లేదు
రాయలసీమ ఎత్తిపోతల పథకానికి 2006 పర్యావరణ ప్రభావ అంచనా నిబంధనలు వర్తించవు. ఎందుకంటే ఈ ప్రాజెక్టు కొత్త ప్రాజెక్టు కాదు. అదనపు ఆయకట్టు ఏర్పాటు కావడం లేదు. ఇది ఇరిగేషన్ ప్రాజెక్టు కాదు. విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టు అంతకన్నా కాదు. జలాశయం, విద్యుదుత్పత్తి ప్రాజెక్టును విస్తరించడం లేదా ఆధునీకరించడం చేయడం లేదు. గ్రావిటీ నుంచి పంపింగ్‌కు మారడాన్ని పర్యావరణ అనుమతుల మార్పుగా పరిగణించడం సాధ్యం కాదు. తనకు కేటాయించిన నీటినే ఆంధ్రప్రదేశ్ వాడుకుంటున్నంత వరకు పర్యావరణ అనుమతుల ప్రసక్తే తలెత్తదు –ఎన్జీటీకి సమర్పించిన అఫిడవిట్లో కేంద్ర పర్యావరణ శాఖ సాక్షి, అమరావతి: పర్యావరణ ప్రభావ అంచనా(ఈఐఏ) నోటిఫికేషన్ పరిధిలోకి ‘రాయలసీమ ఎత్తిపోతల పథకం’ రాదని, అందువల్ల దీనికి పర్యావరణ అనుమతులేవీ అవసరం లేదని కేంద్ర అటవీ, పర్యావరణశాఖ శుక్రవారం జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ)కు నివేదించింది. రాయలసీమ ఎత్తిపోతల కొత్త ప్రాజెక్టు కాదని తేల్చిచెప్పింది. నిపుణుల కమిటీ కూడా ఇదే అంశంపై ముందస్తు పర్యావరణ అనుమతులు అవసరం లేదని ఎన్జీటీకి నివేదికివ్వడం తెలిసిందే. తాజాగా ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు అఫిడవిట్ దాఖలు చేసిన కేంద్ర పర్యావరణశాఖ తన వైఖరిని స్పష్టంగా తెలియచేసింది. అన్ని విషయాలు పరిగణించాకే... ► తెలుగుగంగ ప్రాజెక్టు, శ్రీశైలం కుడికాలువలకు 1994 ఈఐఏ నోటిఫికేషన్ ప్రకారం పర్యావరణ అనుమతులిచ్చారు. ఆ అనుమతుల్లో నీటి సరఫరాను పంపింగ్ ద్వారా చేస్తారా? గ్రావిటీ ద్వారా చేస్తారా? అనే ప్రస్తావన లేదు. గాలేరు నగరి సుజల స్రవంతి ఈఐఏ పర్యావరణ అనుమతుల్లో 38 టీఎంసీల నీటి సరఫరా ప్రస్తావన ఉంది. ► తెలుగుగంగ, శ్రీశైలం కుడికాలువ, గాలేరు నగరి సుజల స్రవంతి వేర్వేరు సమయాల్లో ఏర్పాటయ్యాయి. పర్యావరణ, అటవీశాఖ నుంచి వేర్వేరుగా అనుమతులు తీసుకున్నారు. ► ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు రివర్ వ్యాలీ, హైడ్రో ప్రాజెక్ట్ నిపుణుల కమిటీ జూలై 29న సమావేశమై చర్చించింది. 2006 ఈఐఏ నోటిఫికేషన్ ప్రకారం చర్చలు జరిగాయి. ► అన్ని విషయాల్ని పరిగణనలోకి తీసుకున్నాక ప్రాథమిక ఆధారాలనుబట్టి రాయలసీమ ఎత్తిపోతల పథకానికి ముందస్తు పర్యావరణ అనుమతులు అక్కర్లేదని కమిటీ స్పష్టంగా చెప్పింది. తెలంగాణ సర్కారు అభ్యంతరం.. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి ముందస్తు పర్యావరణ అనుమతులు అవసరం లేదంటూ నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికపై తెలంగాణ సర్కారు అభ్యంతరం తెలిపింది. ఈ పథకానికి పర్యావరణ అనుమతులు లేవని, దీనివల్ల పలు ప్రాజెక్టుల ఆయకట్టుతోపాటు హైదరాబాద్‌కు తాగునీటి సమస్య ఏర్పడుతుందంటూ తెలంగాణ, నారాయణపేట జిల్లాకు చెందిన గవినోళ్ల శ్రీనివాస్ ఎన్జీటీలో పిటిషన్ వేశారు. దీన్ని హరిత ట్రిబ్యునల్ శుక్రవారం మరోసారి విచారించింది. ఆంధ్రప్రదేశ్ తరఫున సీనియర్ న్యాయవాది ఆర్.వెంకటరమణి, న్యాయవాదులు దొంతిరెడ్డి మాధురిరెడ్డి, తుషారా జేమ్స్‌లు విచారణకు హాజరవగా, తెలంగాణ తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ జె.రామచంద్రరావు, స్పెషల్ జీపీ ఎ.సంజీవ్‌కుమార్, పిటిషనర్ తరఫున కె.శ్రవణ్‌కుమార్ వాదనలు వినిపించారు. దీనిపై తదుపరి విచారణను ట్రిబ్యునల్ సెప్టెంబర్ 3కు వాయిదా వేసింది. అదేరోజు ఏపీ వాదన వింటామని తెలిపింది. -
హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్‌కు భారీ జరిమానా
సాక్షి, ముంబై: ప్రమాదకర వాయు కాలుష్య కారకాలను వెదజల్లుతున్న కంపెనీలకు జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) భారీ షాకిచ్చింది. ముంబై పరిసర ప్రాంతాల్లో తీవ్ర వాయు కాలుష్యాన్ని సృష్టిస్తున్నారంటూ హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్ సహా నాలుగు కంపెనీలకు భారీ జరిమానా విధించింది. తమ ఇళ్లకు కేవలం మీటర్ల దూరంలో ఏర్పాటు చేసిన యూనిట్, కాలుష్యంపై 2014 లో మహుల్, అంబపాడ గ్రామాల నివాసితులు దాఖలు చేసిన పిటిషన్‌కు ప్రతిస్పందనగా ఎన్జీటీ ఈ తీర్పు నిచ్చింది ముంబైలోని మహుల్, అంబపాడ, చెంబూర్ ప్రాంతాలలో వాయు కాలుష్యం తీవ్రంగా ఉందని, గ్యాస్ చాంబర్ లాంటి పరిస్థితి ఏర్పడిందని ఎన్జీటీ అభిప్రాయపడింది. ఈ ప్రాంతంలో రానున్న ఐదేళ్లలో గాలి నాణ్యతను పునరుద్ధరించేలా 286 కోట్ల రూపాయల జరిమానా చెల్లించాలని ఈ కంపెనీలను కోరింది. హెచ్‌పీసీఎల్‌కు 76.5 కోట్లు, బీపీసీఎల్‌కు 7.5 కోట్లు, ఏఇజిఐఎస్ 142 కోట్లు, ఎస్‌ఎల్‌సిఎల్‌కు 2 0.2 కోట్ల రూపాయలు చెల్లించాలని ఆదేశించింది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి(పీసీపీబీ),సంబంధిత కంపెనీల డేటా ఆధారంగా ఉద్గారాల విలువలను అంచనా వేసినట్లు గ్రీన్ ప్యానెల్ తెలిపింది. కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసేందుకు పది మంది సభ్యులతో కూడిన ఒక జాయింట్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు ఎన్జీటీ అధ్యక్షుడు జస్టిస్ఏకే గోయల్ వెల్లడించారు. -
రాయలసీమ ఎత్తిపోతల పథకం: ముగిసిన వాదనలు
సాక్షి, అమరావతి: రాయలసీమ ఎత్తిపోతల పథకం కేసుకు సంబంధించి చెన్నైలోని జాతీయ హరిత న్యాయస్థానం(ఎన్జీటీ)లో ఇరువైపుల వాదనలు ముగిశాయి. మంగళవారం జరిగిన కోర్టు విచారణలో రాయలసీమ ఎత్తిపోతల పథకంతో తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందని ఆ రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. అయితే తమకు వాటాగా రావాల్సిన నీళ్లనే తీసుకుంటున్నామని ఏపీ ప్రభుత్వం వెల్లడించింది. ఇది పాత పథకమేనని ఏపీ ప్రభుత్వం తరపు న్యాయవాది వెంకటరమణి కోర్టుకు తెలిపారు. ఇక ఈ ప్రాజెక్టుకు ప్రత్యేకంగా పర్యావరణ అనుమతులు అవసరం లేదని కేంద్ర పర్యావరణ నిపుణుల కమిటీ తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. దీంతో ఈ కేసులో తమ వైఖరేంటో వారం రోజుల్లో తెలపాలని కోర్టు కేంద్ర పర్యావరణ శాఖను ఆదేశించింది. అనంతరం తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు వెల్లడించింది. (కరువు సీమకు నీటిని సరఫరా చేస్తామంటే వివాదమెందుకు?) కాగా ఏపీ ప్రభుత్వం శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువన రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మించ తలపెట్టిన విషయం తెలిసిందే. కాగా పర్యావరణ అనుమతి లేకుండా చేపట్టిన ఈ ఎత్తిపోతల పనులను నిలుపుదల చేయాలంటూ తెలంగాణలోని పాత మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన వ్యక్తి ఎన్జీటీలో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై మే 20న విచారణ చేపట్టిన ఎన్జీటీ ఎత్తిపోతల పథకం పనులను నిలుపుదల చేయాలని స్టే ఇచ్చింది. అయితే తన వాటా జలాలను వినియోగించుకునేందుకు ఈ పథకం చేపట్టామని ఏపీ ప్రభుత్వం ఎన్జీటీలో రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. దీని వల్ల పర్యావరణంపై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదని నివేదించింది. దీనిపై జూలై13న విచారించిన ఎన్జీటీ ఎత్తిపోతల పనుల టెండర్ ప్రక్రియ చేపట్టేందుకు అనుమతిచ్చిన విషయం తెలిసిందే. (పర్యావరణ అనుమతి అక్కర్లేదు) -
పర్యావరణ అనుమతి అక్కర్లేదు
సాక్షి, అమరావతి: రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులకు పర్యావరణ అనుమతి అవసరం లేదని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ స్పష్టం చేసింది. ఈ ఎత్తిపోతల పనులు పర్యావరణంపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపవని తేల్చిచెబుతూ జాతీయ హరిత న్యాయస్థానం (ఎన్జీటీ) దక్షిణ ప్రాంత బెంచ్ (చెన్నై)కు బుధవారం నివేదిక ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వాదనతో పూర్తి స్థాయిలో ఏకీభవిస్తూ కేంద్రం నివేదిక ఇవ్వడం గమనార్హం. రాయలసీమ ఎత్తిపోతలపై ఆగస్టు 11న ఎన్జీటీ నిర్వహించే తుది విచారణలో ఈ నివేదిక కీలకం కానుంది. రాయలసీమ ఎత్తిపోతలకు ఎన్జీటీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందని న్యాయనిపుణులు స్పష్టం చేస్తున్నారు. ► కృష్ణా నదీ జలాల్లో తన వాటాగా దక్కిన జలాలను వినియోగించుకోవడం ద్వారా రాయలసీమ, నెల్లూరు జిల్లాల సాగు, తాగునీటి కష్టాలను తీర్చాలని రాష్ట్ర ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతలను చేపట్టింది. ► పర్యావరణ అనుమతి లేకుండా చేపట్టిన ఈ ఎత్తిపోతల పనులను నిలుపుదల చేయాలంటూ తెలంగాణలోని పాత మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన వ్యక్తి ఎన్జీటీలో పిటిషన్ దాఖలు చేశారు. ► ఈ పిటిషన్‌పై మే 20న విచారించిన ఎన్జీటీ.. రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను నిలుపుదల చేయాలంటూ స్టే ఇచ్చింది. ► తన వాటా జలాలను వినియోగించుకోవడానికే ఎత్తిపోతల పనులు చేపట్టామని.. వీటికి అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం ఎన్జీటీలో రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పథకం వల్ల పర్యావరణంపై ఎలాంటి ప్రతికూల ప్రభావం పడదని నివేదించింది. ► ప్రభుత్వ పిటిషన్‌పై ఈ నెల 13న విచారించిన ఎన్జీటీ.. ఎత్తిపోతల పనుల టెండర్ ప్రక్రియ చేపట్టడానికి అనుమతి ఇచ్చింది. -
‘పాలమూరు’ గడువు.. మరో రెండేళ్లు!
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన పాలమూరు–రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు పనులు మరో రెండేళ్లు అయితే కానీ పూర్తయ్యేలా లేవు. ఈ ప్రాజెక్టుల పరిధిలో చేపట్టిన 18 ప్యాకేజీల పనుల గడువు మరో రెండేళ్లు పెంచక తప్పేలా లేదు. పూర్తికాని భూసేకరణ, సహాయ, పునరావాసంలో ఇబ్బందులు, ఎన్జీటీ, కోర్టు కేసులు ప్రాజెక్టుల ముందరి కాళ్లకు బంధమేయడంతో 2022 జూన్ నాటికి ఈ పనులు పూర్తి చేస్తామంటూ ఇరిగేషన్ శాఖ ప్రభుత్వానికి నివేదించింది. దీనిపై శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ త్వరలో సమీక్షించనున్నారు. భూసేకరణే అసలు సవాల్.. శ్రీశైలం నుంచి రోజుకి 1.5 టీఎంసీల చొప్పున 60 రోజుల్లో 90 టీఎంసీల వరదనీటిని తరలించి సుమారు 12.30 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చేలా పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును చేపట్టిన సంగతి తెలిసిందే. 2015లో ఈ ప్రాజెక్టుకు 35,200 కోట్లతో పరిపాలనా అనుమతులు చేపట్టగా, 2016 జూన్‌లో ఉద్దండాపూర్ వరకు 18 ప్యాకేజీల పనులను రూ.29,312 కోట్లతో చేపట్టారు. ఈ పనులను రెండేళ్లలో పూర్తి చేయాలని ఒప్పంద సమయంలో నిర్ణయించారు. అయితే భూసేకరణ సమస్యతో తొలి రెండేళ్లలో పనులు ముందుకు కదల్లేదు. దీనికితోడు ఎన్జీటీ కేసులు సైతం అవాంతరం సృష్టించాయి. ప్రాజెక్టు పరిధిలో మొత్తంగా 27 వేల ఎకరాల భూ సేకరణ చేయాల్సి ఉండగా, ఇంతవరకు 23,500 ఎకరాలు సేకరించారు. మరో 3,500 ఎకరాలు సేకరించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో 2018 నుంచి మరో రెండేళ్లు అంటే 2020 జూన్ వరకు ప్యాకేజీల గడువు పొడిగించారు. అయినప్పటికీ ఇప్పటివరకు అన్ని ప్యాకేజీల్లో 28 శాతం పనులు, అంటే రూ.8వేల కోట్ల మేర పనులు పూర్తయ్యాయి. ముఖ్యంగా ప్రాజెక్టులోని తొలి ప్యాకేజీ అయిన నార్లాపూర్ పంపింగ్ స్టేషన్ పనులు చాలాకాలంగా పెండింగ్‌లో పడ్డాయి. దీన్ని భూగర్భంలో నిర్మించాలా లేక భూఉపరితలం మీదా అన్న అంశం తేలకపోవడంతో ఇక్కడ కేవలం 4 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి. దీంతో పాటే భూసేకరణ సమస్యలతో ప్యాకేజీ–5, 7, 8, 16, 17, 18 పనులు చాలా నెమ్మదిగా సాగుతున్నాయి. ఈ ప్యాకేజీల్లో కేవలం 15–30 శాతం పనులే పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు పూర్తి చేయాలంటే కొన్ని ప్యాకేజీలకు వచ్చే ఏడాది ఆగస్టు వరకు, మరికొన్ని ప్యాకేజీల గడువును 2022 మే చివరి వరకు పొడిగించాల్సి వస్తోంది. అప్పటికి ప్రాజెక్టు పనులు నూటికి నూరుశాతం పూర్తి చేసే అవకాశం ఉందని ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్‌కుమార్‌కు ప్రాజెక్టు ఇంజనీర్లు విన్నవించారు. ఈ నేపథ్యంలో ప్యాకేజీల గడువు పొడిగింపులపై స్టేట్ లెవల్ స్టాండింగ్ కమిటీలో నిర్ణయం చేశాక తుది ఆమోదం తీసుకోనున్నారు. ఇక ఉద్దండాపూర్ నుంచి కేపీ లక్ష్మీదేవునిపల్లి వరకు గతంలోనే రూ.4,268 కోట్లతో అంచనాలు సిద్ధం చేసినా పనులు మాత్రం మొదలు పెట్టలేదు. ఈ పనులకు కొత్త స్టాండర్డ్ షెడ్యూల్ రేట్ల ప్రకారం కొత్త అంచనాలు సిద్ధంచేసి ఇవ్వాలని ప్రభు త్వం సూచించింది. ఈ ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. కొత్త రేట్ల ప్రకారం ఈ అంచనా రూ.7వేల కోట్ల వరకు పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. వీటికి ఆమోదం రాగానే ఈ పనులకు టెండర్లు పిలవనున్నారు. -
ఫామ్‌హౌజ్ వ్యవహారంలో కేటీఆర్‌కు ఊరట
-
కేటీఆర్‌కు గ్రీన్ ట్రిబ్యునల్ నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ : జీవో 111కు విరుద్ధంగా మంత్రి కేటీఆర్ అక్రమంగా ఫామ్ హౌస్ నిర్మిస్తున్నారని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ)లో కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై ఎన్జీటీ చెన్నై ధర్మాసనం కేటీఆర్‌తో పాటు తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఈ నిర్మాణాలను పరిశీలించి ఇవి సక్రమమా కాదా తేల్చేందుకు నిజ నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసింది. కేంద్ర పర్యావరణ రిజిస్ర్టీ కార్యాలయం, కాలుష్య నియంత్రణ మండలి, జీహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్, హెచ్ఎండీఏ, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ల సారథ్యంలో ఏర్పాటయ్యే ఈ కమిటీ రెండు నెలల్లోగా నివేదిక సమర్పించాలని ఆదేశించింది. 2018లో 111 జీఓ కేసు విషయంలో ఎన్జీటీ ఆదేశాలను యథాతథంగా అమలుచేస్తున్నారా అనే అంశాన్ని ఈ కమిటీ పరిశీలించాలని గ్రీన్ ట్రిబ్యునల్ కోరింది. చదవండి : ఎల్బీనగర్ అండర్‌పాస్.. ఈజీ జర్నీ.. -
రూ.50 కోట్లు జమ చేయండి, ఎల్జీ పాలిమర్స్‌కు ఆదేశం
సాక్షి, న్యూఢిల్లీ: విశాఖపట్నం ఎల్జీ పాలిమర్స్‌లో విషవాయువు లీకైన సంఘటనను జాతీయ హరిత ట్రైబ్యునల్(ఎన్జీటీ) సుమోటోగా కేసు స్వీకరించింది. ఈ దుర్ఘటనలో 12మంది మృతి చెందగా, వందలాదిమంది అస్వస్థతకు గురయ్యారు. ఈ నేపథ్యంలో ప్రాథమిక నష్టపరిహారం కింద రూ.50 కోట్లను జిల్లా కలెక్టర్ వద్ద జమ చేయాలని ఎల్జీ పాలిమర్స్‌ను ఎన్జీటీ ఆదేశించింది. అలాగే ఈ ప్రమాదంపై కేంద్ర ప్రభుత్వం, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి, ఏపీ పీసీబీ, ఎల్జీ పాలిమర్స్ కంపెనీకి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ శుక్రవారం నోటీసులు జారీ చేసింది. (ఏం జరిగింది పెద్దాయనా?) ఎన్జీటీ చైర్పర్సన్ జస్టిస్ ఆదర్శ్ కుమార్ గోయెల్ నేతృత్వంలోని ధర్మాసనం ఘటనకు దారి తీసిన కారణాలపై విశ్రాంత న్యాయమూర్తి శేషశయనారెడ్డితో కూడిన ఐదుగురు సభ్యులతో నిజనిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ వి.రామచంద్రమూర్తి, ప్రొఫెసర్ పులిపాటి కింగ్, సీపీసీబీ సభ్య కార్యదర్శి, నీరి హెడ్, సీఎస్ఐఆర్ డైరెక్టర్ సభ్యులుగా ఉంటారు. ప్రమాద ఘటనపై విచారణ జరిపి మే 18 లోపు నివేదిక సమర్పించాలని సూచించింది. (గ్యాస్ లీకేజీ ఘటన : హైపవర్ కమిటీ ఏర్పాటు) పర్యావరణ నిబంధనలు, ప్రమాదకర రసాయనాలు నిబంధనలు లేదని స్పష్టమవుతోందని, భారీ మొత్తంలో విషవాయువులు వెలువడడానికి ఖచ్చితంగా ఆ సంస్థ బాధ్యత వహించాల్సిందేనని ఎన్టీటీ స్పష్టం చేసింది. ఫ్యాక్టరీని నియంత్రించాల్సిన అధికారులు ఎవరైనా ఉంటే వారు కూడా బాధ్యులేనని, ఈ ఘటనకు దారితీసిన కారణాలు, లోపాలు, నష్టం, తదుపరి చర్యలపై దృష్టి పెట్టామని పేర్కొంది. తదుపరి కేసు విచారణ ఈ నెల 18కి వాయిదా పడింది. (గ్యాస్ దుర్ఘటనపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష) గ్యాస్ లీక్ ఘటనల క్రమం, వైఫల్యాలకు గల కారణాలు, బాధ్యులు, ప్రజలు, జీవాల ప్రాణాలకు కలిగిన నష్టం, గాలి నీరు భూమికి జరిగిన నష్టం అంచనా బాధితులు, పర్యావరణానికి నష్టపరిహారం చెల్లింపు కు తీసుకున్న చర్యలు మళ్లీ ఈ ఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలు ఐదు అంశాలపై నివేదిక ఇవ్వాలని ఎన్జీటీ ఆదేశం -
ఆ నివేదికను ఎందుకు పట్టించుకోలేదు?
సాక్షి, న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి ముందే నిర్వాసితులకు పునరావాసం కల్పించకపోవడం, కాఫర్ డ్యామ్ నిర్మించేటప్పుడు నియమావళిని పాటించకపోవడంపై పోలవరం ప్రాజెక్ట్ అథారిటీని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ధర్మాసనం ప్రశ్నించింది. పర్యావరణ అనుమతుల్లో కూడా ఉల్లంఘనలు ఉన్నాయని ఉమ్మడి తనిఖీ ద్వారా వెలుగు చూసిందని పేర్కొంటూ... దీనిపై కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ఏం చర్యలు తీసుకుందని ప్రశ్నించింది. ప్రాజెక్టుకు చెందిన వివిధ అంశాలపై డాక్టర్ పి.పుల్లారావు, బీజేపీ నేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి దాఖలు చేసిన రెండు పిటిషన్లను జస్టిస్ ఆదర్శ్ కుమార్ గోయెల్, జస్టిస్ వాంగ్డి, జస్టిస్ రామకృష్ణన్, డాక్టర్ నాగిన్ నందాతో కూడిన ఎన్జీటీ ప్రిన్సిపల్ బెంచ్ శుక్రవారం విచారించింది. అక్రమ డంపింగ్, కాఫర్ డ్యామ్ నిర్మాణంలో ప్రణాళిక లేకపోవడం, తెలంగాణలోని భద్రాచలం, ఇతర ప్రాంతాలపై బ్యాక్ వాటర్ ప్రభావం తదితర అంశాలతో ఈ పిటిషన్లు దాఖలయ్యాయి. గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్, సీపీసీబీ, ఏపీపీసీబీ సమర్పించిన ఉమ్మడి తనిఖీ నివేదికను ఎన్జీటీ పరిగణనలోకి తీసుకుంది. ఉమ్మడి తనిఖీ కమిటీ చేసిన సిఫారసులను ప్రాజెక్ట్ నిర్వాహకులు పాటించలేదని అభిప్రాయపడింది. నవంబరు 7న తదుపరి విచారణ... ఉల్లంఘనలపై ప్రాజెక్ట్ నిర్వాహకులకు వ్యతిరేకంగా కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ఏయే చర్యలు ప్రారంభించిందని జస్టిస్ వాంగ్డి ప్రశ్నించారు. అయితే వీటిపై వివరణ ఇచ్చేందుకు కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ, ఏపీ తరఫున హాజరైన న్యాయవాదులు సమయం కోరారు. నిబంధనల ఉల్లంఘనను ఉమ్మడి తనిఖీ కమిటీ ధ్రువీకరించినందున వారి అభ్యర్థనను తిరస్కరిస్తున్నట్టు ధర్మాసనం పేర్కొంది. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ తరఫున ఉల్లంఘనలు, నిష్క్రియతను పరిగణనలోకి తీసుకుని, తదుపరి విచారణ కోసం నవంబర్ 7న అన్ని వివరాలతో హాజరుకావాలని పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌ను ఎన్జీటీ ఆదేశించింది. -
ప్రాజెక్టులు పూర్తయితే.. పూడికతీత ఎలా సాధ్యమైంది..!
ఢిల్లీ: తెలంగాణలోని గోదావరినదిలో అక్రమంగా ఇసుక తవ్వకాలు జరిగినట్లు నివేదికల్లో స్పష్టంమవుతోదని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీ) పేర్కొంది. తెలంగాణ రాష్ట్రంలో జరుగతున్న అక్రమ ఇసుక తవ్వకాలపై ఎన్జీటీ బుధవారం విచారణ చేపట్టింది. విచారణలో భాగంగా కేంద్ర, రాష్ట్రాలకు సంబంధించిన కాలుష్య నియంత్రణ మండలి నివేదికలను పరిశీలించింది. అయితే సుమారు నాలుగు కోట్ల పది లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను ఎటువంటి పర్యావరణ అనుమతులు లేకుండా.. ఎలా తవ్వుతారని తెలంగాణ ప్రభుత్వాన్ని ఎన్జీటీ ప్రశ్నించింది. దీనిపై స్పందించిన తెలంగాణ ప్రభుత్వం పలు ప్రాజెక్టుల్లో పూడికతీతలో భాగంగా ఇసుకను తీశామని తెలిపింది. కాగా అన్నారం, మేడిగడ్డ వంటి ప్రాజెక్టులు పూరైనప్పటికీ.. వాటిలో పూడికతీత ఎలా సాధ్యమైందని నిలదీసింది. ఇక తెలంగాణ రాష్ట్రంలో ఇసుక తవ్వకాలపై ఎటువంటి చట్టం ఏర్పాటు చేయలేదా అని ఎన్జీటీ మండిపడింది. దీనిపై తదుపరి విచారణను ఈ నెల 26 వరకు వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది. -
వెబ్సైట్లో ఎప్పుడు పెట్టారు
సాక్షి, న్యూఢిల్లీ: కాళేశ్వరం ప్రాజెక్టుకు మంజూరు చేసిన అనుమతులను అధికారికంగా వెబ్సైట్లో ఎప్పుడు పొందుపరిచారన్న విషయంపై స్పష్టత ఇవ్వాల్సిందిగా కేంద్ర అటవీ, పర్యావరణ శాఖను జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఆదేశించింది. ఈ ప్రాజెక్టుకు మంజూరు చేసిన అనుమతులు చెల్లవంటూ హాయాతుద్దీన్ దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ రఘువేంద్ర రాథోర్ బెంచ్ బుధవారం విచారించింది. అనుమతులు మంజూరైన అనంతరం పిటిషనర్లు 22 రోజులు ఆలస్యంగా కేసు దాఖలు చేశారు. దీంతో కేసు విచారణార్హతపై ట్రిబ్యునల్ విచారణ జరుపుతోంది. తదుపరి విచారణను ఈ నెల 15కు వాయిదా వేసింది. -
పోతూపోతూ.. 2వేల టన్నుల చెత్తను వదిలివెళ్లారు
న్యూఢిల్లీ : మే-జూన్ నెలలో దాదాపు 10లక్షల మంది పర్యాటకులు మనాలిని సందర్శించారు. ఈ నేపథ్యంలో పర్యాటకులు పోతూ పోతూ.. 2000 టన్నుల చెత్తను వదిలిపెట్టిపోయారట. ఈ చెత్తలోనూ ఎక్కువభాగం ప్లాస్టిక్ వ్యర్థాలే ఉన్నాయని పర్యావరణ ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా మనాలిలో ప్రతిరోజు 10 టన్నుల చెత్త మాత్రమే బయటికి వస్తోందని, అయితే పర్యాటకులు అధికంగా వచ్చే సమయంలో మాత్రం రోజకు 35 టన్నుల చెత్త ఉత్పత్తవుతుందని స్థానిక అధికారులు తెలిపారు. రోహతంగ్ పాస్, సోలాంగ్ నుంచి మనాలికి వెళ్లే దారిలో ఉన్న హోటళ్ల నుంచి వెలువడే వ్యర్థాలను దగ్గర్లోని బర్మానా సిమెంట్ ప్లాంట్‌కు తరలించి అక్కడే తగలబెడుతున్నారు. కానీ చెత్త సమస్యకు పరిష్కారం మాత్రం దొరకడం లేదు. 'ఈ సమస్యను పరిష్కరించడానికి అధికారులు ఒకేసారి 100 టన్నుల వ్యర్థాలను తగలబెట్టే సామర్థ్యం గల పవర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నార'ని మనాలి మున్సిపల్ ఎగ్జిక్యూటివ్ అధికారి నారాయణ సింగ్ వర్మ పేర్కొన్నారు. ఈ ప్లాంట్ వచ్చే వారంలో ప్రారంభమమ్యే అవకాశం ఉందని, దీని వల్ల సమస్య కొంతమేర తగ్గే అవకాశం ఉందని పేర్కొన్నారు. అత్యధికంగా వెలువడుతున్నచెత్త వల్ల బియాస్ నది, అలాగే పర్యావరణానికి ఎటువంటి ముప్పు కలగకుండా చూడాలని జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీ) కులు,మనాలి మున్సిపల్ విభాగాలను ఆదేశించింది. అయితే మనాలిలో స్థానిక జనాభా కంటే ఇక్కడికి వచ్చే పర్యాటకులు వేస్తున్న చెత్తే ఎక్కువగా ఉంటుంది. -
అక్రమ తవ్వకాలపై కఠినంగా వ్యవహరించండి
ఢిల్లీ: ఏపీలో చోటుచేసుకుంటున్న ఇసుక అక్రమ తవ్వకాలపై కఠినంగా వ్యహరించాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యానికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీ) ధర్మాసనం సూచించింది. కాలుష్య నియంత్రణ చర్యలతో పాటు పలు అంశాలపై అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో ఎన్జీటీ శుక్రవారం సమావేశం అయింది. ఈ సందర్భంగా ఎన్జీటీ, ఏపీ సీఎస్‌కు సమావేశంలో పలు సూచనలు చేసింది. అక్రమ తవ్వకాలకు పాల్పడినవారిపై భారీ జరిమానాలు విధించాలని, వాటిని చూసి మరెవరు అక్రమ తవ్వకాలు పాల్పడకుండా ఉండాలని చెప్పింది. విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో వాయు కాలుష్యం ఎక్కువగా ఉందని, కాలుష్య నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సూచన చేసింది. పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసుకుని నేరుగా సీఎస్ పర్యవేక్షించాలని ఎన్జీటీ ఆదేశించింది. ఆరు నెలల్లో మరోసారి సమావేశమవుదామని, ఆ తర్వాత స్టేటస్ రిపోర్ట్ అందజేయాలని సూచించింది. కాలుష్య నియంత్రణ చర్యలపై అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శుల నుంచి స్టేటస్ రిపోర్టు కూడా ఎన్జీటీ తీసుకుంది. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, ఇసుక తవ్వకాలు, మైనింగ్, జల, గాలి కాలుష్యం నియంత్రణకు తీసుకోవాల్సిన అంశాలపై ఈ సమావేశంలో చర్చ జరిగింది. -
ఏపీ సీఎస్ ఢిల్లీ పర్యటనపై సర్వత్రా ఉత్కంఠ
సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఢిల్లీ పర్యటనపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సీఎస్ సమీక్షలపై అధికార పక్షం విమర్శలు సంధిస్తున్న సమయంలో ఆయన ఢిల్లీ ఎందుకు వెళ్లారు?.ఎవరిని కలవబోతున్నారనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఎన్టీటి (జాతీయ హరిత ట్రిబ్యునల్) విచారణ కోసమే సీఎస్ ఢిల్లీ వెళ్లినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. అయినప్పటికీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఢిల్లీ పర్యటనపై అటు అధికార వర్గాలతో పాటు రాజకీయ వర్గాల్లో కూడా ఆసక్తి నెలకొంది. కృష్ణా నదిలో అక్రమ ఇసుక తవ్వకాలపై రేపు (శుక్రవారం మధ్యాహ్నం) నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో జరిగే విచారణకు సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం హాజరు కానున్నారు. దేశ వ్యాప్తంగా ఘన వ్యర్థాల నిర్వహణపై ఉత్తర్వులను అమలు చేయడంలో రాష్ట్రాలు విఫలమవడంపై ఎన్జీటీలో విచారణ జరుగుతోంది. ప్రధానంగా పురపాలక సంఘాలు, అటవీ శాఖలు విఫలమవడంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. పర్యావరణాన్ని కాపాడటం, అటవీ చట్టాల ఉల్లంఘనపై ఎన్జీటీ రాష్ట్రాల వారీగా సమీక్ష నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్జీటీలో జరిగే విచారణకు సీఎస్‌తో పాటు పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల్ వలవన్, అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి అనంతరాము ఢిల్లీ వెళ్లారు. మరోవైపు కృష్ణానదిలో అక్రమ ఇసుక తవ్వకాలపై పర్యావరణానికి జరిగిన నష్టాన్ని పునరుద్ధరించడానికి 100కోట్ల రుపాయలు నెల రోజుల్లోగా డిపాజిట్ చేయాలని జాతీయ హరిత ట్రిబ్యునల్ ఏప్రిల్ 4న ఉత్తర్వులు ఇచ్చిన విషయం విదితమే. దీనిపై గడువు దాటితే 12.5శాతం చెల్లించాల్సి ఉంటుంది. మరోవైపు కృష్ణా నదిలో ఇసుక తవ్వకాలపై ఎన్జీటీ ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాలు చేసింది. ఈ నేపథ్యంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎదుట రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎస్ బృందం వాదనలు వినిపించనుంది. మరోవైపు హస్తిన పర్యటనలో ప్రధాన కార్యదర్శి ఎవరెవరిని కలుస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఆయన ఎన్జీటీ విచారణకు పరిమితమవుతారా, కేంద్ర ఎన్నికల సంఘంతో పాటు ఇతర ఢిల్లీ పెద్దలను కలుస్తారనే చర్చ కూడా జోరుగా నడుస్తోంది. ఇప్పటికే సీఎస్ టార్గెట్‌గా టీడీపీ వర్గాలు విమర్శలు గుప్పిస్తుండటంతో రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను ఢిల్లీ పెద్దలకు వివరిస్తారని అధికారిక వర్గాలు భావిస్తున్నాయి. -
ఎన్జీటీ తీర్పు అపహాస్యం!
సాక్షి, అమరావతి: ఇసుక స్మగర్లతో ప్రభుత్వ పెద్దలకు ఉన్న అవినాభావ సంబంధం మరోసారి బట్టబయలైంది. కృష్ణా నదిలో విధ్వంసం సృష్టించి, ఇసుకను దోచుకున్న అక్రమార్కుల నుంచి నెలలోగా రూ.వంద కోట్లను వసూలుచేసి జరిమానాగా చెల్లించాలని ఎన్జీటీ (జాతీయ హరిత న్యాయస్థానం) ఈ నెల 4న తీర్పు ఇచ్చింది. మరో 11 రోజుల్లోగా ఎన్జీటీ వద్ద ఈ మొత్తాన్ని డిపాజిట్ చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అక్రమార్కుల నుంచి జరిమానా వసూలు చేయడానికి సిద్ధమైన గనుల శాఖ, కాలుష్య నియంత్రణ మండలి అధికారులపై ముఖ్యనేత కన్నెర్ర చేశారు. దాంతో వారు నోటీసుల జారీని నిలుపుదల చేశారు. కానీ, మే 7లోగా రూ.వంద కోట్లు డిపాజిట్ చేయకపోతే ఎన్జీటీ తీర్పును ధిక్కరించినట్లు అవుతుందని.. జరిమానా వసూలుకు నోటీసులు జారీచేస్తే ప్రభుత్వ పెద్దల ఆగ్రహానికి గురికావాల్సి వస్తోందని అధికార వర్గాలు సతమతమవుతున్నాయి. టీడీపీ ఎమ్మెల్యేల గుప్పెట్లో రీచ్‌లు ప్రభుత్వ పెద్దల దన్నుతో కృష్ణా నదిని గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన ముగ్గురు టీడీపీ కీలక ఎమ్మెల్యేలు చెరబట్టారు. గుంటూరు, కృష్ణా జిల్లాల పరిధిలో కృష్ణా నదిలోని 37 ఇసుక రీచ్‌లను టీడీపీ ఎమ్మెల్యేలు తమ గుప్పెట్లో పెట్టుకుని.. నదీ పరిరక్షణ చట్టం, పర్యావరణ చట్టాలను తుంగలో తొక్కి, భారీ యంత్రాలను దించి 20–30 మీటర్ల లోతు వరకూ తవ్వి భారీఎత్తున ఇసుకను అక్రమంగా రవాణా చేశారు. గుంటూరు జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే సోదరుడు, అదే జిల్లాకు చెందిన మరో టీడీపీ ఎమ్మెల్యే, కృష్ణా జిల్లాకు చెందిన మరో సీనియర్ ఎమ్మెల్యే ఇసుక అక్రమ రవాణా ద్వారా వేలాది కోట్ల రూపాయలు కొల్లగొట్టారు. ఈ వ్యవహారంలో ముఖ్యనేతకూ వాటాలున్నాయి. ఈ నేపథ్యంలో.. కృష్ణా నదిని ధ్వంసం చేస్తుండటంవల్ల తమ జీవనోపాధి దెబ్బతింటోందని రాజధాని ప్రాంత రైతు కూలీల హక్కుల సంఘం నేత అనుమోలు గాంధీ.. రామన్ మెగసెసే అవార్డు గ్రహీత, వాటర్‌మ్యాన్ రాజేంద్రసింగ్ ఎన్జీటీలో పిటిషన్ దాఖలు చేశారు. కృష్ణా నదీ గర్భంలో సీఎం చంద్రబాబు నివాసం ఉంటున్న అక్రమ కట్టడానికి కూతవేటు దూరంలో అడ్డగోలుగా ఇసుక తవ్వేస్తుండటాన్ని వారు ఎన్జీటీ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన ఎన్జీటీ.. తక్షణమే ఇసుక తవ్వకాలను నిలిపివేయాలని ఫిబ్రవరి 23, 2017న రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసు జారీచేసింది. కానీ, రాష్ట్ర ప్రభుత్వం ఇసుక తవ్వకాలను నిలిపేయడం కాదు కదా కనీసం నోటీసులకు సమాధానం కూడా చెప్పకపోవడంతో ఎన్జీటీ ఆగ్రహించింది. రట్టయిన ఇసుక దోపిడీ గుట్టు ఇసుక అక్రమ రవాణాపై పలుమార్లు నోటీసులు జారీచేసినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడంతో.. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ కోసం ఎన్టీటీ ఒక కమిషన్‌ను ఏర్పాటుచేసింది. ఎన్జీటీ న్యాయమూర్తి, కేంద్ర, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి అధికారులు ఈ కమిషన్‌లో సభ్యులు. ఈ కమిషన్ కృష్ణా నదిలో.. ప్రధానంగా సీఎం చంద్రబాబు అక్రమంగా నివాసం ఉంటున్న కట్టడానికి కూతవేటు దూరంలో ఉన్న ఇసుక రీచ్‌లను తనిఖీ చేశారు. నదీ గర్భంలోకి భారీ పొక్లెయిన్లను దించి.. 25 మీటర్ల లోతున నదిని తవ్వేసి.. రోజుకు 2,500 లారీల చొప్పున ఇసుకను తరలిస్తున్నట్లు కమిషన్ తేల్చింది. పది టైర్ల లారీకి 21 టన్నుల ఇసుక తరలించాల్సి ఉండగా.. 30 నుంచి 40 టన్నులను రవాణా చేస్తున్నట్లు నివేదికలో పేర్కొన్నారు. ప్రకాశం బ్యారేజీకి ఎగువన.. దిగువన అడ్డగోలుగా ఇసుక తవ్వేయడంవల్ల బ్యారేజీకి పెనుముప్పు తప్పదని కమిషన్ తన నివేదికలో ఆందోళన వ్యక్తంచేసింది. ఈ నివేదికను పరిశీలించిన ఎన్జీటీ.. తక్షణమే ఇసుక అక్రమ తవ్వకాలను ఆపేయాలంటూ ఈనెల 4న ఉత్తర్వులు జారీచేసింది. ఇన్నాళ్లూ ఇసుక అక్రమ తవ్వకాలు సాగించి.. పర్యావరణాన్ని విధ్వంసం చేసినందుకు ప్రతిగా స్మగ్లర్ల నుంచి రూ.100కోట్లను జరిమానాగా వసూలు చేసి నెలలోగా చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ముఖ్యనేత మోకాలడ్డు.. ఎన్జీటీ ఆదేశాల మేరకు ఇసుక స్మగ్లర్లకు నోటీసులు జారీచేసి జరిమానా వసూలుకు కాలుష్య నియంత్రణ మండలి, గనుల శాఖ అధికారులు సిద్ధమయ్యారు. రాజధాని ప్రాంత రైతు కూలీల హక్కుల పరిరక్షణ సంఘం నేతలు, విజిలెన్స్ విభాగం అధికారుల సహకారంతో స్మగ్లర్లను గుర్తించే ప్రక్రియను చేపట్టారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలే.. ఇసుక స్మగ్లర్లుగా రూపాంతరం చెందడాన్ని గుర్తించారు. నేడో రేపో నోటీసులు జారీచేస్తారనే సమాచారం అందుకున్న ఇసుక స్మగ్లర్లు ముఖ్యనేత దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లారు. రాజధానిలో రహదారులు, భవనాల నిర్మాణం కోసమే వారు ఇసుకను తీసుకెళ్లారని.. ఎక్కడా అక్రమ రవాణా చేయలేదని.. జరిమానా వసూలుకు మీరెలా నోటీసులు జారీచేస్తారంటూ అధికారులపై ముఖ్యనేత తీవ్ర స్థాయిలో విరుచుకుపడినట్లు విశ్వసనీయ సమాచారం. ఎన్జీటీ ఇచ్చిన తీర్పు గురించి వివరించినా ఆయన వెనక్కు తగ్గలేదు సరికదా మరింత రెచ్చిపోయినట్లు తెలిసింది. దీంతో నోటీసుల జారీ ప్రక్రియను ఆపేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. మరోవైపు.. మే 4లోగా ఎన్టీజీ వద్ద రూ.100 కోట్ల జరిమానాను డిపాజిట్ చేయకపోతే కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని.. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని అధికార వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. -
ఏపీ ప్రభుత్వానికి రూ.100 కోట్ల జరిమానా
సాక్షి, న్యూఢిల్లీ : ఎన్నికల వేళ చంద్రబాబు సర్కార్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. కృష్ణానది వద్ద ముఖ్యమంత్రి నివాసం సమీపంలో ఇసుక అక్రమ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వానికి జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) రూ.100కోట్లు జరిమానా విధించింది. రోజుకు 2,500 ట్రక్కుల్లో 25 మీటర్ల లోతు వరకూ అక్రమంగా ఇసుక తవ్వుతున్నారంటూ కేంద్ర, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఇచ్చిన నివేదిక ఆధారంగా ఎన్జీటీ ఈ నిర్ణయం తీసుకుంది. కాగా అక్రమంగా ఇసుక తవ్వకాలపై చర్యలు తీసుకోవాలంటూ వాటర్ మ్యాన్ రాజేంద్ర సింగ్, అనుమోలు గాంధీ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌పై విచారణ జరిపిన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్.. ఏపీ ప్రభుత్వానికి జరిమానా విధిస్తూ గురువారం ఆదేశాలు ఇచ్చింది. చదవండి....(ప్రకాశం బ్యారేజీకి ముప్పు!) కాగా నిబంధనల ప్రకారం పది టైర్ల లారీకి 21 టన్నులు లోడ్ చేయాల్సి ఉండగా, 30 నుంచి 40 టన్నులు లోడ్ చేస్తూ పక్క జిల్లాలకు, పక్క రాష్ట్రాలకు తరలించేందుకు సహకరిస్తున్నారు. రాత్రి 11 గంటలు దాటితే చాలు 60, 70 కిలోమీటర్ల స్పీడ్‌తో బాడీ లారీలు కాబిన్ లెవల్ ఇసుక లోడ్ వేసుకొని పరుగులు తీస్తున్నాయి. పోలీసులు ఎక్కడైనా గస్తీ కాస్తుంటే ముందస్తుగానే లారీ డ్రైవర్లకు సమాచారం ఇచ్చేందుకు మూడు కార్లను ఉపయోగించి, కొంతమంది తిరుగుతూ లారీ డ్రైవర్లకు సమాచారం ఇస్తున్నారు. ఎవరైనా అధికారులు కానీ, పోలీసులుకానీ ఉన్నారని తెలిస్తే రాజధాని పరిధిలోని కృష్ణాయపాలెం, యర్రబాలెం చెరువు, మందడం, మందడం బైపాస్‌రోడ్డులో లారీలను గప్‌చుప్‌గా పక్కనపెట్టి అధికారులు వెళ్లిన తర్వాత అక్కడ నుంచి వారి గమ్య స్థానాలకు బయల్దేరుతున్నారు. ప్రతిరోజూ కనకదుర్గ వారధి మీద నుంచి కృష్ణాజిల్లా గుడివాడ, పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు, చింతలపూడి, జంగారెడ్డిగూడెం తదితర ప్రాంతాలకు భారీగా ఇసుక తరలిపోతుంది. చదవండి...(ఇసుకతో కోట్లు కొల్లగొట్టిన పచ్చనేతలు) నిద్రావస్థలో అధికారులు... రాజధాని పరిధిలోని ఇసుక రీచ్‌ల్లో పట్టపగలే లోడింగ్ చేయించుకొని, అర్ధరాత్రి దాటే వరకు లారీలను ఎక్కడో ఒక చోట దాచి పెట్టి, అర్ధరాత్రి దాటిన తరువాత వాటిని రోడ్డెక్కించి జనాలను భయభ్రాంతులను చేస్తూ, అధిక వేగంతో వెళ్తున్న ఇసుక లారీలను పట్టించుకోవడం లేదు. రాజధాని పరిధిలో అధిక లోడ్‌తో తరలివెళ్లే ఇసుక లారీకి మంగళగిరి ఆర్టీఓ పరిధిలో నెలకు రూ.30వేలు తీసుకుంటున్నట్లు విశ్వసనీయ సమాచారం. -
ఫోక్స్‌వాగన్‌కు భారీ జరిమానా
జర్మన్ ఆటోమోబైల్ సంస్థ ఫోక్స్‌వ్యాగన్ సంస్థకు భారీ షాక్ తగిలింది. ఉద్గారాల నిబంధనల ఉల్లంఘన కింద జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ రూ. 500 కోట్ల జరిమానా విధించింది. ఫోక్స్‌వ్యాగన్ డీజిల్ కార్ల వల్ల దేశంలో పర్యావరణానికి తీవ్ర హాని కలుగుతుందని ఆ సంస్థపై కేసు నమోదైంది. ఈ కేసుపై విచారణ చేపట్టిన ట్రిబ్యునల్ ఈ పెనాల్టీ విధించింది. ఈ మొత్తాన్ని రెండు నెలల్లోగా నగదును జమచేయాలని ఎన్జీటీ అధ్యక్షుడు జస్టిస్ ఆదర్శ్ కుమార్ గోయల్ ఆదేశాలు జారీచేశారు. ట్రైబ్యూనల్ నష్ట నివారణ చర్యల కింద కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి(సెంట్రల్ పొల్యూషన్ బోర్డు) వద్ద రూ.100కోట్లు జమ చేయాలని ఆదేశించింది. ఫోక్స్‌వ్యాగన్ కంపెనీ డీజిల్ కార్ల ఉద్గార పరీక్షల సమయంలో మోసపూరిత పరికరాన్ని సంస్థ వాడిందన్న కేసులో ట్రిబ్యునల్ గతంలో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సంస్థ చేసిన ఈ పని వల్ల పర్యావరణానికి కలిగిన అసలు నష్టాన్ని అంచనా వేయడానికి పర్యావరణ శాఖ, భారీ పరిశ్రమల శాఖ, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్‌లతో ఓ కమిషన్‌ను ఎన్జీటీ చైర్పర్సన్ జస్టిస్ ఆదర్శ్ కుమార్ ఏర్పాటు చేశారు. నెల రోజుల్లో ఈ కమిటీ నివేదిక సమర్పించాలని ఎన్జీటీ ఆదేశించింది. ఈ కమిటి నివేదిక ఆధారంగా ఎన్జీటీ ఈ ఆదేశాలిచ్చింది. -
ఓపెన్ కాస్ట్ మైనింగ్‌లో నిబంధనలు పాటించడంలేదు: కేంద్రం
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఓపెన్‌కాస్ట్ మైనింగ్‌ను వెంటనే ఆపాలని రాజలింగమూర్తి దాఖలు చేసిన పిటిషన్‌పై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీ) గురువారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఓపెన్ కాస్ట్ మైనింగ్‌లో పర్యావరణ నిబంధనలు పాటించడంలేదని కేంద్ర పర్యావరణ శాఖ ఎన్జీటీకి నివేదిక సమర్పించింది. మరోవైపు పిటిషనర్ ఆ ప్రాంతంలోని ప్రజల సమస్యలను ట్రిబ్యునల్ ముందు గట్టిగా వినిపించారు. నివాస ప్రాంతాలకు సమీపంలో జరిగే పేలుళ్ల వల్ల వచ్చే ప్రకంపనాలకు గృహాలు దెబ్బతింటున్నాయని తెలిపారు. ఈ పేలుళ్ల వల్ల పిల్లలు, వృద్ధులు భయాందోళనకు గురవుతున్నారని మొరపెట్టుకున్నారు. అయితే ట్రిబ్యునల్ ఈ పిటిషన్‌పై ఫిబ్రవరి 8వ తేదీన తుది వాదనలు వింటామని తెలిపింది. -
ఫోక్స్‌వ్యాగన్‌కు ఎన్జీటీ షాక్
జర్మన్ కార్ల తయారీ సంస్థ ఫోక్స్‌వ్యాగన్‌కు ఊహించని షాక్ తగిలింది.. తప్పుడు డీజిల్ మీటర్లతో వినియోగదారులను మోసం చేశారంటూ దాఖలైన కేసుకు సంబంధించి న్యూఢిల్లీలోని నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్(ఎన్జీటీ) రూ.100కోట్లు చెల్లించాలని సూచించింది. ఒక్క 2006 ఏడాదిలోనే దాదాపు 3.17లక్షల వాహనాల ద్వారా వాస్తవానికంటే 40రెట్లు నైట్రస్ ఆక్సైడ్స్ (NOx) విడుదల చేసిందన్న ఫిర్యాదుపై 24 గంటలలోగా సెంట్రల్ కాలుష్య నియంత్రణ బోర్డుకు జరిమానా సొమ్మును డిపాజిట్ చేయాలని నేడు (జనవరి 17) ఆదేశించింది. లేని పక్షంలో సంస్థ భారత్ విభాగం ఎండీని అరెస్టు చేయడంతోపాటు సంస్థకు చెందిన ఆస్తులను సీజ్ చేస్తామని హెచ్చరించింది. జస్టిస్ ఆదర్శ్ కుమార్ నేతృత్వంలోని నలుగురు సభ్యులు బెంచ్ మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. ప్రపంచవ్యాప్తంగా కాలుష్య ఉద్గారాలపై , అనేక కేసులను ఎదుర్కొంటున్న ఫోక్స్ వ్యాగన్ ఇండియా భారతదేశంలో కూడా వాహనాల్లో నైట్రస్ ఆక్సైడ్‌ను అనుమతించదగిన పరిమితులను అధిగమించి వాడిందని, తద్వారా ఢిల్లీ నగరంలో అటు పర్యావరణానికి ఇటు ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించిందని తెలిపింది. కాగా ఈ కేసులో 171.34 కోట్ల రూపాయలను చెల్లించాల్సిందిగా గత ఏడాది నవంబరు 16న ఆదేశించింది. ఈ విషయాన్ని దర్యాప్తు చేయడానికి నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసింది. ఆరోపణలను సమర్ధించిన కమిటీ జరిమానా విధించాలని సిఫార్సు చేసింది. కానీ సంస్థ జరిమానా సొమ్మునుజమలేదు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన100కోట్ల రూపాయలను చెల్లించాల్సిందిగా తాజా ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు తమ వాహానాలు దేశంలో స్టేజ్4 నిర్దేశించిన ఉద్గార నిబంధనలకు అనుగుణంగానే ఉన్నాయని ఫోక్స్‌వ్యాగన్ ఇండియా పేర్కొంది. -
పోలవరం, ములలంకలో వ్యర్థాల డంపింగ్‌పై ఎన్జీటీ విచారణ
సాక్షి, న్యూఢిల్లీ : పోలవరం, ములలంకలో జరుగుతున్న వ్యర్థాల డంపింగ్‌పై జాతీయ హరిత ట్రైబ్యునల్‌లో గురువారం విచారణ జరిగింది. కేంద్ర పర్యావరణ శాఖ, కేంద్ర ,రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండళ్లు ఆయా ప్రాంతాల్లో తనిఖీలు జరపాలని ఎన్జీటీ ఆదేశించింది. తనిఖీ నివేదికలో చేసే సూచనలను అమలు చేయాలని పోలవరం ప్రాజెక్టు అథారిటీని ఎన్జీటి ఆదేశించింది. కేంద్ర పర్యావరణ శాఖ.. డంపింగ్ వివాదంపై ఎలాంటి ఆదేశాలు అవసరం లేదని విచారణపై అభ్యంతరం వ్యక్తం చేసింది. గతంలోనే ఎన్జీటి తనిఖీలు జరిపించి తగిన ఆదేశాలు ఇచ్చిందని కేంద్ర పర్యావరణ శాఖ తరపు న్యాయవాది చెప్పారు. కేంద్ర పర్యావరణ శాఖ అభ్యంతరాన్ని తోసిపుచ్చిన ఎన్జీటి ఆ ఆదేశాలు అమలు చేసి ఉంటే మళ్లీ పిటిషన్ వేసేవారు కాదని అభిప్రాయపడింది. పోలవరం గ్రామానికి సమీపంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యర్థాలను డంపింగ్ చేస్తున్నారని పెంటపాటి పుల్లారావు పిటిషన్ వేశారు. గతంలో రెండు సార్లు తనిఖీలు జరిపి నివేదిక ఇచ్చినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన పిటిషన్లో పేర్కొన్నారు. నివేదిక అమలును పరిశీలిస్తామని, ఆ తర్వాత తదుపరి విచారణ ఉంటుందని ఎన్జీటి తెలిపింది. -
ఢిల్లీ ప్రభుత్వానికి భారీ జరిమానా
సాక్షి, న్యూఢిల్లీ : జనావాసాల్లో ఉక్కు శుద్ధి పరిశ్రమల నియంత్రణలో విఫలమైన ఢిల్లీ ప్రభుత్వానికి భారీ జరిమానా పడింది. నిషేదిత ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాటు కావడంవల్ల స్థానికులకు అనారోగ్య సమస్యలతో పాటు యుమునా నది కాలుష్యానికి గురవుతోందని ఎన్జీటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. జస్టిస్ ఆదర్శ్‌కుమార్ గోయెల్ నేతృత్వంలోని బెంచ్ మంగళవారం ఢిల్లీ ప్రభుత్వానికి రూ. 50 కోట్లు పెనాల్టీ విధిస్తూ తీర్పు వెలువరించింది. జనావాసాల్లో నెలకొల్పిన స్టీల్ శుద్ధి పరిశ్రమలను వెంటనే మూసేయించాలని ఆదేశాలు జారీచేసింది. ‘ఆలిండియా లోకాధికార్ సంఘం’ అనే ఎన్జీవో వేసిన పిటిషన్‌పై విచారించిన ట్రైబ్యునల్ ఈ తీర్పునిచ్చింది. కాగా, ఢిల్లీ మాస్టర్‌ప్లాన్-2021 ప్రకారం నిషేదించబడిన ప్రదేశంలో పరిశ్రమలు ఏర్పాటయ్యాయనీ, వాటిని నియంత్రించాలని ఢిల్లీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (డీపీసీసీ)కు ఎన్జీటీ గతంలోనే ఆదేశాలు జారీ చేసింది. ఎన్జీటీ ఆదేశాలను పట్టించుకోకపోవడంతో కేజ్రీవాల్ ప్రభుత్వానికి భారీ జరిమానా తప్పలేదు. -
ప్రకాశం బ్యారేజీకి ముప్పు!
ఈ ఫొటో చూశారా.. ప్రకాశం బ్యారేజీ ఆఫ్రాన్‌కు కేవలం 50 నుంచి 60 మీటర్ల దూరంలోనే ఇసుకాసురులు ప్రొక్లెయిన్లతో కృష్ణా నదిలో ఇసుకను తవ్వేస్తున్న దృశ్యమిదీ.. బ్యారేజీలకూ.. బ్రిడ్జిలకు కనీసం 650 మీటర్ల దూరం వరకు నదిలో ఇసుకను తవ్వకూడదు. ఒకవేళ తవ్వితే బ్యారేజీకీ, బ్రిడ్జికీ ముప్పు తప్పదు. కానీ ప్రకాశం బ్యారేజీ.. రైల్వే బ్రిడ్జికి మధ్యన, కనకదుర్గ వారధి (జాతీయ రహదారిలోని రెండు వంతెనల) పక్కన కృష్ణానదిలో అడ్డగోలుగా ఇసుకను తవ్వేస్తున్నారనేందుకు ఇది ప్రత్యక్ష నిదర్శనం. కృష్ణా నదీ గర్భంలో సీఎం చంద్రబాబు నివాసం అంటున్న అక్రమ కట్టడానికి కూతవేటు దూరంలోనే ఇసుక స్మగ్లర్లు చెలరేగిపోతున్నా పట్టించుకోకపోవడం గమనార్హం. సాక్షి, అమరావతి: కృష్ణా నదిలో ఇసుక తవ్వకంపై జాతీయ హరిత న్యాయస్థానం(ఎన్జీటీ) ఇటీవల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇసుక తవ్వకానికి అడ్డుకట్ట వేయాలంటూ రాష్ట్రప్రభుత్వాన్ని ఆదేశించింది. కానీ రాష్ట్రసర్కారు ఏమాత్రం స్పందించడం లేదు. కృష్ణా నదిలో ఇసుక తవ్వకాన్ని అడ్డుకోకపోగా ‘ముఖ్య’నేత కనుసన్నల్లో ముగ్గురు మంత్రులు ఇసుక స్మగ్లర్లకు దన్నుగా నిలుస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రకాశం బ్యారేజీకి ఎగువన, దిగువన కృష్ణా నదిలో భారీ ఎత్తున ర్యాంపులు ఏర్పాటు చేసి.. ఇసుకను తవ్వేస్తూ వందలాది కోట్ల రూపాయలు వెనకేసుకుంటున్నారు. ప్రకాశం బ్యారేజీలో నీటినిల్వ గరిష్టస్థాయిలో ఉండటం.. నదిలో నీటి ప్రవాహం ఉండటంతో విజయవాడలో ప్రకాశం బ్యారేజీకి.. రైల్వే బ్రిడ్జికి మధ్యన ఉన్న ఇసుకపై స్మగ్లర్ల కళ్లు పడ్డాయి. ప్రకాశం బ్యారేజికి.. బ్రిడ్జికి మధ్య 800 నుంచి 900 మీటర్ల దూరం ఉంటుంది. ఈ మధ్యన నదిలో ఎలాంటి తవ్వకాలు జరపకూడదు. ఒకవేళ తవ్వకాలు జరిపితే అటు ప్రకాశం బ్యారేజీకి.. ఇటు బ్రిడ్జికి ముప్పు తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు నదిలో ఇసుకను ప్రొక్లెయిన్లతో తవ్వకూడదని పర్యావరణ చట్టాలు సైతం స్పష్టం చేస్తున్నాయి. కానీ ఇసుక స్మగ్లర్లు ఇదేమీ పట్టించుకోవడం లేదు. ప్రభుత్వంలో కీలక భూమిక పోషిస్తున్న నేతల దన్నుతో వారు చెలరేగిపోతున్నారు. ప్రకాశం బ్యారేజీ ఆఫ్రాన్ నుంచి ప్రొక్లెయిన్లు, ట్రాక్టర్లు, భారీ లారీలను గత మూడు రోజులుగా నదిలోకి దింపుతున్నారు. ప్రొక్లెయిన్లతో భారీ ఎత్తున ఇసుకను తవ్వి.. ఆఫ్రాన్ మీదుగా వాహనాల్లో తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. భారీ వాహనాల రాకపోకల వల్ల ఆఫ్రాన్ దెబ్బతింటుందని జలవనరులశాఖ అధికారి ఒకరు ‘సాక్షి’కి చెప్పారు. ఇదే అంశాన్ని తెలియజేస్తూ ప్రొక్లెయిన్లతో ఇసుక తవ్వకాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించగా ఉన్నతస్థాయి నుంచి ఒత్తిళ్లు వచ్చాయని.. దాంతో మిన్నకుండిపోయామని ఆ అధికారి ఆవేదన వ్యక్తం చేశారు. బ్యారేజీకి కేవలం 50 నుంచి 60 మీటర్ల దూరంలో అడ్డగోలుగా ఇసుకను తవ్వేయడం వల్ల.. భారీ వరదలు వస్తే బ్యారేజీకి ముప్పు తప్పదని నిపుణులు చెబుతున్నారు. అక్రమార్జనకోసం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే దుస్సాహసానికి పాల్పడుతుండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
మాజీ డీజీపీకి రూ.46 లక్షల భారీ జరిమానా
సాక్షి, న్యూఢిల్లీ : ఇంటి నిర్మాణం కోసం రిజర్వు ఫారెస్టులో స్థలం కొనుగోలు చేయడంతోపాటు విచక్షణారహితంగా చెట్లు నరికేయడంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ మండిపడింది. బాధ్యత గల పదవిలో ఉండి చట్ట విరుద్ధంగా వ్యవహరించాడని మాజీ డీజీపీపై కొరడా జలిపించింది. అనుమతులు లేకుండా చెట్లు నరికేశారనీ రూ.46 లక్షల భారీ జరిమానా విధించింది. వివరాలు... ఉత్తరాఖండ్‌కు డీజీపీగా పనిచేస్తున్న కాలంలో బీఎస్ సిద్ధు ముస్సోరి రిజర్వు ఫారెస్టులో భూమి కొనుగోలు చేశారు. ఇంటి నిర్మాణం కోసం అందులో ఉన్న 25 సాల్ చెట్లను నరికేయించారు. ఉన్నత పదవిలో ఉన్న వ్యక్తి రిజర్వు ఫారెస్టు ఏరియాలో భూమి కొనుగోలు చేయడంతో పాటు అనుమతులు లేకుండా చెట్లను తొలగించి పర్యావరణ చట్టాలను తుంగలో తొక్కాడంటూ ఆయనపై ఎన్జీటీ బార్ అసోషియేషన్ ఫిర్యాదు చేసింది. పిటిషన్‌ను విచారించిన ఎన్జీటీ మాజీ పోలీస్ అధికారికి చట్టం గుర్తు చేసింది. నేల కొరిగిన మొత్తం చెట్ల ఖరీదుకు 10 రెట్లు చెల్లించాలని జస్టిస్ ఆర్.ఎస్.రాథోర్ నేతృత్వంలోని బెంచ్ ఉత్తర్వులు జారీ చేసింది. 1988 జాతీయ అటవీ విధానం, 1980 జాతీయ అడవుల పరిరక్షణ చట్టం ప్రకారం రిజర్వు ఫారెస్టులో భూమి కొనుగోలు అక్రమమని తేల్చిచెప్పింది. -
విమానాల్లోంచి టాయిలెట్ వ్యర్థాలు.. ఎన్జీటీ గట్టి వార్నింగ్
సాక్షి, న్యూఢిల్లీ: టాయిలెట్ వ్యర్థాలను గాల్లో వదిలి వేయకుండా చర్యలు తీసుకోవడానికి తామిచ్చిన మార్గదర్శకాలను పక్కన పడేసిన పౌర విమానయాన సంస్థ డైరెక్టర్ జనరల్ జీతభత్యాలను నిలుపుదల చేయిస్తామని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ హెచ్చరించింది. గతంలో తామిచ్చిన ఉత్తర్వులను అమలు చేయడంలో డీజీసీఏ విఫలమయ్యారని మండిపడింది. జస్టిస్ ఆదర్శ్ కుమార్ గోయెల్ నేతృత్వలోని ఎన్జీటీ ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. విమానాల్లో పోగైన టాయిలెట్ వ్యర్థాలు గాల్లో పడేయకుండా నిరోధించేందుకు డీజీసీఏకు ఆగస్టు 31 వరకు గడువు విధించింది. లేదంటే సెప్టెంబర్ 17 జరిగే తదుపరి విచారణకు డీజీసీ డైరెక్టర్ హాజరు కావాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఇళ్లపై గాల్లోంచి టాయిలెట్ వ్యర్థాలు.. ఢిల్లీలోని ఇందిరాగాందీ అంతర్జాతీయ విమానాశ్రయం పరిసర ప్రాంతాల్లో గల నివాసాలపై విమానాల నుంచి టాయిలెట్ వ్యర్థాలు పడుతున్నాయని 2016లో సావంత్ సింగ్ దహియా అనే రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ ఎన్జీటీలో ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఎన్జీటీ అప్పట్లో డీజీసీయేకు మార్గదర్శకాలు జారీ చేసింది. గాల్లో మానవ వ్యర్థాలను పడేస్తున్న విమాన సంస్థలు పర్యావరణ సహాయ నిధిగా 50 వేల రూపాయల చొప్పున చెల్లించాలని పేర్కొంది. ఈ మేరకు ఢిల్లీ విమాననాశ్రయం గుండా వెళ్లే విమాన సంస్థలకు సర్క్యులర్ జారీ చేయాలని డీజీసీఏని ఆదేశించింది. కాగా, ఎన్జీటీ నోటీసులపై స్పందించిన పౌర విమానయాన సంస్థ.. విమానం ప్రయాణిస్తున్నప్పుడు ఎటువంటి వ్యర్థాలను పడేసే అవకాశమే ఉండదని తెలిపింది. ఫిర్యాదు దారు ఇంటిపై పక్షుల రెట్టలు పడ్డాయేమోనని పేర్కొంది. నేటి ఆధునిక కాలంలో విమానాల్లో పోగైన మానవ వ్యర్థాలను నిల్వ చేసే సదుపాయం ఉందనీ, విమానాశ్రయాల్లో మాత్రమే వాటిని పడేస్తామని సెలవిచ్చింది. మరోవైపు.. ఫిర్యాదుదారు ఇల్లు, ఆ చుట్టుపక్కల భవనాలపై పడిన వ్యర్థాల నమూనాలు సేకరించి విచారిచేందుకు ఎన్జీటీ ఒక కమిటీని నియమించింది. విమానాశ్రయం చుట్టుపక్కల ఇళ్లపై పడిన వ్యర్థాలు టాయిలెట్ వ్యర్థాలేనని సదరు కమిటీ తేల్చింది. దీంతో మరోమారు ఈ విషయంపై ఎన్జీటీ రంగంలోకి దిగింది. నోటీసులను బేఖాతరు చేసిన డీజీసీఏపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పై విధంగా స్పందించింది. -
‘సిగరెట్’ తరహాలో గంగ హెచ్చరికలు
న్యూఢిల్లీ: సిగరెట్ ప్యాకెట్లపై ఉన్న హెచ్చరిక తరహాలో గంగా నది కాలుష్యంపై పరీవాహక ప్రాంతాల్లో బోర్డులు ఏర్పాటు చేయాలని జాతీయ హరిత ట్రైబ్యునల్ నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా(ఎన్ఎంసీజీ)ను ఆదేశించింది. గంగా నది తీవ్రస్థాయిలో కలుషితం కావడంపై ఎన్జీటీ ఆవేదన వ్యక్తం చేసింది. హరిద్వార్ నుంచి ఉన్నావ్ మధ్య గంగా నది నీరు కనీసం స్నానానికి పనికిరావని వ్యాఖ్యానించింది. ‘ ప్రజలు గంగా నీటిని భక్తి భావంతో సేవిస్తున్నారు. అది ఎంత ప్రమాదకరమో వారికి తెలియదు. కేవలం సిగరెట్ ప్యాకెట్ల మీదే ‘పొగతాగడం మీ ఆరోగ్యానికి హానికరం’ అని రాస్తున్నప్పుడు ఈ నీటిని తాగడం వల్ల కలిగే అనర్థాలను ప్రజలకు ఎందుకు చెప్పకూడదు?’’ అని ఎన్జీటీ బెంచ్ ప్రశ్నించింది. గంగా నదీ తీరంలో ప్రతి 100 కి.మీ ఓ చోట నీటి స్వచ్ఛతపై బోర్డులను ఏర్పాటు చేయాలని నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగ(ఎన్ఎంసీజీ)ను ఎన్జీటీ ఆదేశించింది. అక్కడి నీటిని తాగటానికి, స్నానం చేయటానికి వాడొచ్చా? లేదా? అన్న విషయాన్ని బోర్డుల్లో స్పష్టంగా పేర్కొనాలంది. -
కావాలంటే సుప్రీంకు వెళ్లండి: ఎన్జీటీ
సాక్షి, న్యూఢిల్లీ: అమరావతి నిర్మాణానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను జాతీయ హరిత ట్రిబ్యునల్ కొట్టి వేసిన సంగతి తెలిసిందే. షరతులకు లోబడి పర్యావరణానికి విఘాతం కలగకుండా రాజధాని నిర్మాణం చేపట్టాలని తన తుది తీర్పులో పేర్కొంది. అయితే, ఆ తీర్పును పునఃపరిశీలించాలని ఈఏఎస్ శర్మ, బొలిశెట్టి సత్యనారాయణ ఎన్జీటీలో పిటిషన్ వేసిన వేశారు. రాజధాని నిర్మాణానికి సంబంధించి గతంలో ఇచ్చిన పర్యావరణ అనుమతులు సరిగాలేవనీ, అమరావతిలో నిర్మాణాలు ఆపాలని పిటిషనల్లో పేర్కొన్నారు. ట్రిబ్యునల్ ఈ పిటిషన్‌పై స్పందించింది. రాజధానిలో నిర్మాణాలు ఆపాలని లేవనెత్తుతున్న అంశాలతో పిటిషనర్ సుప్రీం కోర్టును ఆశ్రయించవచ్చని సూచించింది. కానీ, ఎన్జీటీ తీర్పును పునఃసమీక్షించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. -
కేంద్ర ప్రభుత్వానికి ఢిల్లీ హైకోర్టు షాక్
సాక్షి, న్యూఢిల్లీ : జాతీయ రాజధాని ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వానికి షాక్ తగిలింది. కేంద్రం చేపట్టిన జాతీయ భవనాల నిర్మాణం (ఎన్బీసీసీ) ప్రాజెక్టుకు అంతరాయం ఏర్పడింది. ఎన్బీసీసీ నిర్మాణం కోసం ఢిల్లీలో గత కొద్ది రోజలుగా చెట్లు నరికివేస్తున్న విషయం తెలిసిందే. దీనిపై ఢిల్లీ హైకోర్టు సోమవారం తీర్పును వెలువరించింది. జూలై నాలుగవ తేదీ వరకు ఒక్క చెట్టును కూడా నరకడానికి వీళ్లేదని హైకోర్టు ఆదేశించింది. ఎన్బీసీసీ ప్రాజెక్టు కోసం ఢిల్లీలోని 14000 చెట్లను నరికివేతకు కేంద్ర అటవీశాఖ అనుమతులు జారీ చేసిన విషయం తెలిసిందే. చెట్ల నరికివేతకు వ్యతిరేకంగా పర్యాటక ఉద్యమకారుడు, డాక్టర్ కుషాల్‌కాంత్ మిశ్రా ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కాలనీల కోసం సరోజినీ నగర్లో ఇప్పటికే 4500 చెట్లు నరికి వేశారని, మరో 14000 చెట్లు నరికివేసేందుకు కేంద్రం సిద్ధమైందని పిటిషన్లో పేర్కొన్నారు. పిటిషన్‌పై సోమవారం విచారణ చేపట్టిన జస్టిస్ ఏకే చావ్లా, నవీన్ చావ్లాలతో కూడిన ధర్మాసనం తదుపరి విచారణ (జాలై 4) వరకు ఒక్క చెట్టు కూడా తొలగించకూడదని తీర్పు వెలువరించింది. ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభించకముందే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఎన్బీసీసీ చైర్మన్ ఏకే మిట్టల్‌ను నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్( ఎన్జీటీ) గతంలోనే ఆదేశించింది. చెట్ల నరకివేతకు వ్యతిరేకంగా ఢిల్లీ ప్రజలు చేపట్టిన చిప్కో ఉద్యమానికి అధికార ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. చెట్లను ఆలింగనం చేసుకుని వాటిని కాపాడాలంటూ పర్యావరణ ప్రేమికులు ఆందోళనలు చేశారు. ఎన్బీసీసీ ప్రాజెక్టు నిర్మాణంపై కేంద్ర ప్రభుత్వం మొదటి నుంచి పలు విమర్శలను ఎదుర్కొంటోంది. -
పది రోజుల్లోగా ఎస్జీటీ ర్యాంకులు!
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్షలో అభ్యర్థులు సాధించిన ర్యాంకులు పది రోజుల్లో వెల్లడికానున్నాయి. ఈ మేరకు టీఎస్పీఎస్సీ చర్యలు ముమ్మరం చేసింది. ఇక ఇప్పటికే స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థుల ర్యాంకులను ప్రకటించిన టీఎస్పీఎస్సీ.. బుధవారం ఆయా పోస్టులకు 1ః3 నిష్పత్తిలో మెరిట్ అభ్యర్థుల జాబితాలను జిల్లా కలెక్టర్లకు పంపించింది. వాటిని, మరిన్ని వివరాలను త్వరలోనే వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నట్టు ప్రకటించింది. స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజెస్ (తెలుగు, ఉర్దూ, హిందీ, ఇంగ్లిష్, కన్నడ, తమిళ్) పోస్టులకు, అలాగే వివిధ మాధ్యమాల్లో మేథమెటిక్స్, బయాలజీ, సోషల్ స్టడీస్ పోస్టులకు సంబంధించిన జాబితాలను ప్రకటించింది. మొత్తంగా 1,941 పోస్టులకు సంబంధించి 1ః3 నిష్పత్తిలో 4,989 మంది అభ్యర్థులను (వికలాంగులకు 1ః5 నిష్పత్తిలో) ఎంపిక చేసినట్లు తెలిపింది. ఆయా పోస్టులకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ను పాత జిల్లాల కేంద్రాల్లో నిర్వహిస్తామని టీఎస్పీఎస్సీ ప్రకటించింది. సబ్జెక్టుల వారీగా వెరిఫికేషన్ తేదీలను తరువాత వెల్లడిస్తామని తెలిపింది. ‘ఫిజికల్ సైన్స్’జాబితాలో సవరణ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ పంపించిన స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ జాబితాలోని అభ్యర్థుల బయోడేటాలో తేడాలు ఉన్నట్టుగా గుర్తించామని టీఎస్పీఎస్సీ పేర్కొంది. అందువల్ల ఆ జాబితాను సవరిస్తామని, దానిని పరిగణనలోకి తీసుకోవద్దని సూచించింది. 132 పోస్టులకు సంబంధించిన రివైజ్డ్ ర్యాంకులను త్వరలోనే వెల్లడిస్తామని తెలిపింది. -
‘పురుషోత్తమపట్నం’ పై ఎన్జీటీలో పిటిషన్
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పురుషోత్తమపట్నం ఎత్తిపోతల పథకం ప్రాజెక్టును సవాల్ చేస్తూ జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ)లో పిటిషన్ దాఖలైంది. పర్యావరణ అనుమతులు లేకుండా ఎత్తిపోతల పథకం ప్రాజెక్టును నిర్మిస్తున్నారని పిటిషనర్లు పేర్కొన్నారు. పిటిషన్ స్వీకరించిన ఎన్జీటీ కేంద్ర పర్యావరణ శాఖ, పోలవరం అథారిటీ, జలవనరుల శాఖ, ఏపీ, తెలంగాణ, ఓడిశా, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. జూలై మూడో వారానికల్లా సమాధానం చెప్పాలని ఎన్జీటీ ఆదేశించింది. గోదావరి జలాలను ఏలేరులో అనుసంధానం చేసే పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాన్ని తూర్పు గోదావరి జిల్లా పురుషోత్తపట్నంలో చేపడుతున్నారు. ఈ ప్రాజెక్టును నిర్మించి పోలవరం ఎడమ ప్రధాన కాలువ ద్వారా ఏలేరు రిజర్వాయరులోకి 3,500 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోసి సాగు, విశాఖకు తాగు, పారిశ్రామిక జల అవసరాలు తీర్చాలని ఏపీ సర్కారు నిర్ణయించింది. -
సింగోటం చెరువు వద్ద మైనింగ్ ఆపండి
సాక్షి, న్యూఢిల్లీ: నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం కల్వకోలె గ్రామం సింగోటం చెరువు వద్ద ధృవ ఎంటర్ప్రైజెస్ అనే ప్రైవేటు సంస్థ నిర్వహిస్తున్న మైనర్ మినరల్స్ మైనింగ్‌ను ఆపాలని జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) మంగళవారం ఆదేశించింది. చెరువుకు సమీపంలో 24 హెక్టార్లలో మైనింగ్‌కు సంబంధించి మంజూరైన పర్యావరణ అనుమతులను సవాల్ చేస్తూ శ్రీనివాసులు అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ జావేద్ రహీద్ నేతృత్వంలోని బెంచ్ మంగళవారం విచారించింది. చెరువు జీవావరణ వ్యవస్థను దెబ్బతీయడమే కాకుండా గ్రామంలోని రెండువేలకుపైగా మత్స్యకారుల కుటుంబాల ఉపాధికి గండికొట్టేలా సదరు సంస్థ మైనింగ్‌కు పాల్పడుతోందని పిటిషనర్ పేర్కొన్నారు. దీనిపై గత ఐదు నెలలుగా సంస్థ యాజమాన్యం కౌంటర్ దాఖలు చేయకపోవడంతో పనులు నిలిపేయాలంటూ ఎన్జీటీ ఉత్తర్వులు ఇచ్చిందని పిటిషనర్ తరఫు న్యాయవాదులు తెలిపారు. -
ఏపీలో అక్రమ మైనింగ్: కేంద్రంపై ఎన్జీటీ ఆగ్రహం
సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌లో సాగుతున్న ఇసుక అక్రమ మైనింగ్ జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) శనివారం విచారణ జరిపింది. ఈ కేసులో కేంద్ర పర్యావరణ శాఖ కౌంటర్ దాఖలు చేయకపోవడంపై ట్రిబ్యునల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని రెండు నెలల కిందట నోటీసు ఇచ్చినా.. ఇప్పటివరకు స్పందించకపోవడమేమిటని ఆగ్రహం వ్యక్తం చేసింది. పర్యావరణశాఖ తీరు మారకపోతే.. అధికారులు వ్యక్తిగతంగా తమ ముందు హాజరుకావాల్సి ఉంటుందని ట్రిబ్యునల్ ఘాటుగా వ్యాఖ్యానించింది. దీంతో ఈ రోజే కౌంటర్ దాఖలు చేస్తామని కేంద్రం తరఫు న్యాయవాది అభ్యర్థించారు. ట్రిబ్యునల్ తదుపరి విచారణను ఈ నెల 24వ తేదీకి వాయిదా వేసింది. -
ఐపీఎల్‌ను నిషేధించాలని పిటిషన్!
ముంబై : క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్ నిర్వహణ పేరిట లక్షలాది లీటర్ల నీరు దుర్వినియోగం అవుతుందని, వెంటనే ఐపీఎల్‌ను అడ్డుకోవాలని జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ)లో ఓ పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌ను బుధవారం విచారణకు స్వీకరించిన ఎన్జీటీ కేంద్ర ప్రభుత్వం, బీసీసీఐలను వివరణ కోరుతూ నోటీసులు జారీ చేసింది. జస్టిస్ జవద్ రహీం నేతృత్వంలోని ఎన్జీటీ ధర్మాసనం కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖ, భారత క్రికెట్ నియంత్ర మండలి (బీసీసీఐ), ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లకు ఆతిథ్యమిస్తున్న 9 రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులిచ్చింది. రెండు వారాల్లోగా సమాధానాలు సమర్పించాలని కోరింది. తదుపరి విచారణ వచ్చే నెల 28న జరుగుతుందని తెలిపింది. ఆళ్వార్‌కు చెందిన హైదర్ అలీ అనే యువకుడు ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఐపీఎల్లో పిచ్‌లను సిద్ధం చేయడానికి లక్షలాది లీటర్ల నీరు వృథా అవుతోందని పిటిషన్లో పేర్కొన్నారు. నీటిని దుర్వినియోగం చేస్తూ ఈ టోర్నీలో భాగస్వామ్యులైన వారందరిపై చర్యలు తీసుకోవాలని కోరారు. వ్యాపార ప్రయోజనాల కోసం నిర్వహిస్తున్న ఈ టోర్నీని వెంటనే నిలిపేయాలని కోరారు. గత ఐపీఎల్లో మహారాష్ట్రాల్లో తీవ్ర నీటి కొరత ఏర్పడటంతో కొన్ని మ్యాచ్‌ల వేదికలను తరలించిన విషయం తెలిసిందే. ఇక ఏప్రిల్ 7 నుంచి ఐపీఎల్ ప్రారంభమవుతున్న విషయం తెలిసిందే. తొలి మ్యాచ్ డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ , చెన్నై సూపర్ కింగ్స్‌ల మధ్య ముంబైలో జరగనుంది. -
ఎన్జీటీ ఆదేశాలను బేఖాతర్ చేస్తున్న బాబు
సాక్షి, అమరావతి : రాజధాని విషయంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఆదేశాలను చంద్రబాబు నాయుడు ప్రభుత్వం బేఖాతార్ చేస్తోందని పర్యావరణ వేత్త మన్నారాయణ అన్నారు. శనివారం విలేకరులతో మాట్లాడుతూ.. నిర్మాణాల పేరిట చెరువులు, వాగుల జోలీకి వెళ్లద్దని ఎన్జీటీ సూచించినా ప్రభుత్వం దానికి వ్యతిరేకంగా పనిచేస్తోందని ఆయన ఆరోపించారు. రాజధాని గ్రామాల్లో రోడ్ల పేరుతో ఇప్పటికి 10 చెరువులను పూడ్చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పూడ్చివేతలపై మళ్లీ ఎన్జీటీనీ ఆశ్రయిస్తామని మన్నారయణ స్పష్టం చేశారు. భూమి ఇవ్వకున్నా.. రోడ్డు వేస్తున్నారు: రాజధాని రైతు రాజధాని నిర్మాణానికి తాను భూమి ఇవ్వకున్నా దౌర్జన్యంగా తన పొలంలో రోడ్డు వేసారని రైతు తాతబాబు తన గోడును వెల్లబోసుకున్నారు. ప్రభుత్వం బలవంతంగా తన భూమిని లాక్కోవడానికి ప్రయత్నిస్తుందని, ఎట్టి పరిస్థితుల్లో రాజధానికి భూమినివ్వనని ఆయన స్పష్టం చేశారు. అవసరమైతే ఈ విషయం రాష్ట్రపతికి ఫిర్యాదుచేస్తానన్నారు. రైతుల భూములతో ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని తాతబాబు ఆరోపించారు. -
అక్రమ ఇసుక తవ్వకాలపై ఎన్జీటీలో విచారణ
సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల్లో అక్రమ ఇసుక తవ్వకాలను సవాల్ చేస్తూ ‘రేలా’అనే స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన పిటిషన్లపై జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) గురువారం విచారించింది. రెండు ప్రభుత్వాల ఆధ్వర్యంలో జరుపుతున్న ఇసుక తవ్వకాలకు సంబంధించి పూర్తి వివరాలను తమ ముందుంచాలని గత విచారణ సందర్భంగా ధర్మాసనం ఆదేశించింది. అయితే దీనికి సంబంధించి రెండు ప్రభుత్వాలు ఇచ్చిన వివరాలు అసంపూర్తిగా ఉన్నాయని జస్టిస్ రఘువేంద్ర ధర్మాసనం పేర్కొంది. గోదావరి జిల్లాల్లో డ్రెడ్జింగ్ కార్యకలాపాలను నిషేధించాలని దాఖలైన మరో కేసును కూడా ఇదే కేసులో కలిపి విచారిస్తామని పేర్కొంది. ఇసుక తవ్వకాలు జరుపుతున్న సంస్థలు, ఇసుక వినియోగానికి సంబంధించి పూర్తి వివరాలను ఇవ్వాల్సిందిగా ఆదేశిస్తూ తదుపరి విచారణను మార్చి 14కు వాయిదా వేసింది. -
రాజధానిలో ఇసుక తవ్వకాల వివరాలివ్వండి
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి ప్రాంతంలో సాగుతున్న ఇసుక తవ్వకాలపై పూర్తి వివరాలను తమ ముందుంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ) ఆదేశించింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో విచ్చలవిడిగా కొనసాగుతున్న అక్రమ ఇసుక తవ్వకాలను సవాల్ చేస్తూ ‘రేలా’అనే స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ యూడీ సాల్వీ నేతృత్వంలోని ఎన్జీటీ ధర్మాసనం బుధవారం విచారించింది. ప్రకాశం బ్యారేజీలో పూడికతీత పేరుతో ప్రభుత్వం భారీ యంత్రాలతో అక్రమంగా ఇసుక తవ్వకాలు చేపడుతోందని పిటిషనర్ల తరఫు న్యాయవాది శ్రావణ్‌కుమార్ పేర్కొన్నారు. అక్కడ లభ్యమయ్యే ఇసుకను రాజధాని నిర్మాణానికి మాత్రమే వినియోగిస్తున్నామని ఏపీ ప్రభుత్వం తరఫు న్యాయవాది ప్రమోద్ వెల్లడించారు. రాజధాని ప్రాంతంలో కాంట్రాక్టు సంస్థలు చేపట్టే నిర్మాణాలకు గాను ఇసుక కోసం ప్రభుత్వం ఇస్తున్న నిధులపై పూర్తి వివరాలను తమకు అందజేయాలని ఎన్జీటీ ట్రిబ్యునల్ ఆదేశించింది. అనంతరం అక్కడ జరుగుతున్న ఇసుక తవ్వకాలు అక్రమమా? సక్రమమా? అనేది తేలుస్తామని స్పష్టం చేసింది. తెలంగాణ వివరాలు కూడా ఇవ్వండి : తెలంగాణ రాష్ట్రంలో పూడికతీత పేరుతో నదుల నుంచి ఇసుకను తవ్వేస్తూ, అక్కడి ప్రభుత్వం అమ్ముకుంటోందని, వీటికి సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని న్యాయవాది శ్రావణ్‌కుమార్ తెలిపారు. తెలంగాణలో తవ్వుతున్న ఇసుకను ప్రజోపయోగ ప్రాజెక్టుల నిర్మాణాలకు వినియోగిస్తున్నట్టు తెలంగాణ తరఫు న్యాయవాది ఎ.సంజీవ్‌కుమార్ చెప్పారు. దీంతో తవ్వకాలు జరుగుతున్న తీరు, ఇసుక వినియోగానికి సంబంధించి వివరాలు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఎన్జీటీ ట్రిబ్యునల్ ఆదేశించింది.